deepavali
-
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
కొనుగోలు దారులకు శుభవార్త!
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ‘అన్లిమిటెడ్సెలబ్రేషన్స్’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలు, మొబైల్స్, వాషింగ్ మెషిన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, వైర్లెస్ ఇయర్బర్డ్లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలపై భారీ రాయితీ పొందవచ్చు. క్రిడెట్, డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ.15వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, సులభ ఫైనాన్స్ సదుపాయాలు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లు, రిలయన్స్డిజిటల్.ఇన్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లు పొందవచ్చు. -
అబ్బుర పరిచేలా, టన్నుల్లో బంగారం అమ్మకాలు
ఐదురోజుల దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ధన్‌తేరాస్ రోజు భారత్‌లో బంగారం, వెండిపై జరిగే లావాదేవీలు సుమారు రూ.30వేల కోట్లు జరుగుతుందని అంచనా. అదే సమయంలో ఆటోమొబైల్స్, కిచెన్‌లో వినియోగించే వస్తువులు, చీపుర్ల వ్యాపారం సైతం భారీగా జరిగే అవకాశం ఉందని సమాచారం. ధన్‌తేరాస్‌తో (నవంబర్ 10తో) దేశంలో దీపావళి ఉత్సవాలు ప్రారంభమై..రూపచతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, అన్నాచెల్లెళ్ల (భయ్యా దూజ్) ముగుస్తాయి. ఈ ఐదు రోజుల సమయంలో పైన పేర్కొన్న పరిశ్రమల్లో వ్యాపారం జోరుగా సాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. రూ.50వేల కోట్లు దాటింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. నవంబర్ 10న దేశం అంతటా జరిగిన వ్యాపారం రూ.50 వేల కోట్లు దాటినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఢిల్లీలో బిజినెస్ రూ. 5,000 కోట్లు జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భారతియా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ధన్‌తేరాస్ రోజు గణేష్,లక్ష్మి, కుబేరుల విగ్రహాలతో పాటు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పాత్రలు, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చీపుర్లు వంటి వస్తువులు ఈ రోజున కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మంచిదని భావిస్తారని అన్నారు. అంతేకాకుండా, మట్టి దీపాలు, ఇల్లు, ఆఫీసుల అలంకరణ కోసం వినియోగించే వస్తువులు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, దీపావళి పూజ సామగ్రి కొనుగోలు కూడా ధన్‌తేరాస్ రోజున కొనుగోలు చేస్తారని చెప్పారు బంగారం, వెండి విక్రయ లావాదేవీలు దేశవ్యాప్తంగా బంగారం, వెండి తదితర వస్తువులకు సంబంధించి రూ.30,000 కోట్ల టర్నోవర్ దాటిందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. ఈ వ్యాపారంలో సుమారు రూ. 27,000 కోట్ల విలువైన బంగారు వస్తువులు, రూ. 3,000 కోట్ల వెండి లావాదేవీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్ముడు పోయిందంటే ధన్‌తేరాస్‌లో ఇప్పటి వరకు సుమారుగా 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడుపోయాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) క్రింద నమోదైన 1,85,000 రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాలు విక్రయించే వ్యాపారులు ఉన్నట్లు తేలింది. బీఐఎస్ ప్రమాణాలు ఇంకా అమలు చేయని ప్రాంతాల్లో అదనంగా 2,25,000 చిన్న ఆభరణాల షాపులు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఐదురోజుల దీపావళికి భారత్ ఏటా విదేశాల నుంచి దాదాపు 800 టన్నుల బంగారం, 4,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటోంది. -
ఎకో ఫ్రెండ్లీ దీపావళికి పిలుపునిచ్చిన విశాఖ కార్పోరేషన్
-
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
ఏపీలో దీపావళి సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: . ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సెలవు తేదీని ప్రభుత్వం మార్చింది. ఈ నెల 13వ తేదీ(సోమవారం) దీపావళి సెలవు ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12న (ఆదివారం) దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలువుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 13వ తేదీన ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
పండుగ సీజన్ అదిరింది.. రిటైల్ వ్యాపారులకు లక్ష కోట్లకు పైగా విక్రయాలు!
దీపావళి వస్తే వ్యాపారాలకు పండగే. ఎందుకంటే గృహాలంకరణ, దుస్తులు, టపాకాయలంటూ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తుంటారు. అందుకే వ్యాపారులు ఈ సమయాన్ని ముఖ్యంగా భావిస్తారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా తెరపైకి వచ్చేస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా ఉన్న వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు మొదలైన వారికి విక్రయాలకు పండగ సీజన్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ ఏడాది పండగ సందర్భంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, దేశంలో ఇప్పటికే 1.25 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) తెలిపింది. అయితే దీపావళి సేల్‌లో మొత్తం వ్యాపారం 1.50 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. శతాబ్దాలుగా భారతదేశంలోని వ్యాపారులు దీపావళి సందర్భంగా వారి వ్యాపార సంస్థలలో దీపావళి పూజను సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా వ్యాపారాలు డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పోర్టల్ కూడా తోడవడంతో ఇప్పుడు అన్ని వ్యాపారాలు జీఎస్టీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు దీపావళి పూజలో.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను పూజిస్తారు. మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ నగదు టెల్లర్లు, డిజిటల్ చెల్లింపులను మొదలైనవాటిని కూడా దీపావళి పూజలో చేర్చారు. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త!
భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. పండగ సమయాల్లో షాపులు కళకళలాడుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంపెనీలు బ్యాంకులు, వ్యాపారులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రత్యేకంగా దివాళి సందర్భంగా కొందరు వారి స్నేహితులకు, బంధువులకు బహుమతులను కూడా ఇస్తుంటారు. అయితే ఈ గిఫ్టింగ్ సీజన్లో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా దీపావళి బహుమతుల పేరుతో మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ మెసేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిస్తోంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీపావళి బహామతుల పేరుతో అనధికారికంగా మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో మెసేజ్ లింక్స్‌ను పంపిస్తున్నారని తెలపింది. ఆ లింక్స్ క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఒక వేళ వాటిని క్లిక్ చేస్తే చైనాకు చెందిన వెబ్సైట్లకు లింక్ అయ్యే అవకాశం ఉందని, అవి .xyz, .top డొమైన్లతో ఈ వెబ్‌సైట్స్ ఉన్నట్లు CERT-In గుర్తించింది. ఈ రకంగా మోసం అయితే బహుమతులను పొందేందుకు అమాయకంగా ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. వినియోగదారు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అతనికి బహుమతి గెలుచుకున్నట్లు అభినందనలు సందేశం వస్తుంది. ఆపై వారి వ్యక్తిగత వివరాలను నింపాల్సి ఉంటుంది. అలా నింపిన తర్వాత, బహుమతిని క్లెయిమ్ కోసం ఆ లింక్ ఉన్న మెసేజ్‌లను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని అప్పుడే గిఫ్ట్ పొందగలరని చూపిస్తుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక యూజర్ల వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ దాడి గురయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ స్కామ్‌ను ఎలా నివారించాలి ఈ తరహా స్కామ్‌లను నివారించేందుకు, బహామతులు, రుణాల పేరుతో అనధికారికంగా వచ్చే లింక్‌ల పట్ల జాగ్రత్తగా వహించాలి. మెసేజ్ మన మొబైల్ లోకి రాగానే ఆ లింక్ మూలాన్ని తనిఖీ చేయడం మంచిది. డొమైన్ పేరు కూడా సరిచూసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం మెసేజ్ పై సందేహం ఉన్నా మీరు దానిపై క్లిక్ చేయడం మానుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డేటాను బహిర్గతం చేయకూడదు. -
ఆ ఊరి పేరు దీపావళి.. ఎక్కడో తెలుసా!
పండగ వస్తోందంటే ఊరూవాడా సందడే సందడి. అందులోనూ దీపావళి అంటే చెప్పనక్కర్లేదు. సాధారణంగా వేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. సంస్కృతితో పాటు చరిత్రను కూడా గుర్తుకు తెచ్చే వేడుక దీపావళి. ఇదే పేరుతో జిల్లాలో రెండు ఊళ్లు ఉన్నాయి. దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిందే. అంతే కాదు.. దేశమంతా పండగ జరుపుకునే వేళ ఒక ఊరు మాత్రం దీపాలు వెలిగించకుండా అమావాస్య చీకటిలోనే గడిపేస్తుంది. ఆ చీకటి వెనుకా ఓ కథ దాగి ఉంది. గార, టెక్కలి: దీపావళి.. అందరికీ ఇది పండగ పేరు. జిల్లాలో రెండు ఊళ్లకు మాత్రం సొంత పేరు. శ్రీకాకుళం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. అలాగే టెక్కలి మండలంలోని అయోధ్యపురం పంచాయతీలోనూ దీపావళి అనే గ్రామం ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగ రాజు గార మండలంలో ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. స్థానికుల కథనం మేరకు.. రాజు ప్రతి రోజూ గుర్రంపై శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు ఉన్న మట్టి రోడ్డు గుండా వెళ్తుండేవారు. మార్గమధ్యంలో శ్రీకూర్మం సమీపంలో లక్ష్మీనారాయణ గుడి వద్ద ఆగి స్వామి దర్శ నం అనంతరం కళింగపట్నం వెళ్లి మళ్లీ వచ్చే సమయంలో కూడా దర్శనం చేసుకునేవారు. ఒక రోజు గుర్రంపై వెళ్లి వస్తుండగా గుడి వద్దకు వచ్చేసరికి సొమ్మసిల్లి పడిపోయారు. లక్ష్మీనారాయణ గుడి వద్దనున్న వైష్ణవులు, గోవుల కాపరులు రాజుకి సపర్యలు చేసి గుడివద్దనున్న బావిలో నీరు ఇచ్చి మెలకువ వచ్చేవరకు సపర్యలు చేశారు. రాజు మేలుకుని తనకు సాయం చేసిన వారికి ఊరి పేరు అడగ్గా.. తమ ఊరికి పేరు లేదని వారు చెబుతా రు. ఈ సంఘటన దీపావళి నాడు జరగడంతో రాజు ఆ ఊరికి దీపావళి అనే పేరు పెట్టినట్లు చెబుతుంటారు. రికార్డుల్లో కూడా దీపావళిగా నమోదు చేస్తామని చెప్పి అప్పటివరకు ఉన్న పన్నులన్నీ రద్దు చేస్తున్నానని ప్రకటించి ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి ఈ గ్రామం దీపావళి పేరుగానే కొనసాగడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా అదే పేరు ఉంది. టెక్కలి మండలంలో.. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో కూడా ‘దీపావళి’ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగి స్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు చోటు చేసుకుంది. దీపావళి పేరు ఎంతో సంతోషం హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు మా గ్రామానికి ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గ్రామంలో జని్మంచడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దీపావళిని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటాం. – శ్రీ రంగం మధుసూదనరావు, విశ్వహిందూపరిషత్ కార్యదర్శి, దీపావళి -
కాల్చకుండానే పేలుతున్న క్రాకర్స్.. ఈ దీపావళి చాలా కాస్ట్లీ గురూ!
ఎట్టికేలకు కరోనా వ్యాప్తి తగ్గింది. దీంతో ఆంక్షలు కూడా పక్కకు వెళ్లిపోయాయి. ఈ ఏడాది దీపావళి పండగను ఇంటిల్లపాదీ సంతోషంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు బాణసంచా ధరలు గుండె గుబేల్మనిపించేలా ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. సీజన్ కావడంతో హోల్‌సేల్ దుకాణాల వద్ద వారం రోజుల నుంచే సందడి నెలకొంది. మరోవైపు తాత్కాలిక దుకాణాలకు అధికారికంగా అనుమతులు ఉన్న వాళ్లు, లేనివాళ్లు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరోనా నేపథ్యంలో దీపావళి బాణసంచా వ్యాపారం జరగని విషయం తెలిసిందే. ఈ ఏడాది కాస్త సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు చూస్తున్నారు. దీంతో బాణాసంచాలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రవాణా భారం వల్లే ఎక్కువ ధరలు.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా అంతంత మాత్రమే జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు వ్యాపారులు ఇటు ప్రజలు గతేడాది పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బాణసంచా దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. గతంలో రూ.వెయ్యి పెడితే చిన్నా చితకా సామాగ్రి కలిపి 20 నుంచి 30 వరకు వచ్చేవి. ఇప్పుడు ధరలను చూస్తే వాటిలో సగం కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులోని శివకాశీ తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా తీసుకురావడానికి రవాణా చార్జీలు భారీగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. డీజిల్ ధర అనూహ్యంగా పెరిగిన ప్రభావం దీపావళి బాణసంచా విక్రయాలపై కూడా కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా ధరలు పెంచేసి కొనుగోలుదారుల నడ్డి విరగ్గొడుతున్నారు. చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! -
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
దీపావళి బాణసంచా మోతపై షరతులు.. కేవలం ఆ 2 గంటలే!
సాక్షి, చెన్నై: దీపావళి రోజున కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు. ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే, భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, గ్రీన్ టపాసులనే పేల్చాలని సూచించారు. -
అదిరే ఆఫర్స్: మొబైల్స్‌పై 40 శాతం, యాక్సెసరీస్‌పై 60 శాతం.. ఇవి కదా డిస్కౌంట్లంటే!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది సంవత్సరాలుగా 50 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారుల అభిమానం, ఆదరణ, విశ్వాసం గెలుచుకున్న తమ సంస్థ దసరా, దీపావళి సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నట్లు మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్.. బీ న్యూ ప్రకటించింది. మొబైల్స్ పైనే కాకుండా గృహోపకరణాలపై కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 40 శాతం (రూ. 20,000 వరకూ), యాక్సెసరీస్‌పై 60 శాతం, టీవీలపై రూ. 15,000 వరకూ తగ్గింపును అమలు చేస్తున్నట్లు సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. ఎస్బీఐ కార్డ్ ద్వారా జరిగే ప్రతి కొనుగోలుపై 7.5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ తో సహా పలు ఆఫర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బీన్యూ’ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్ పాల్గొన్నారు. -
ప్రియురాలి లెహంగాను కాలితో తన్నిన రణ్‌బీర్ కపూర్..
Ranbir Kapoor- Alia Bhatt: బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో రణ్‌బీర్- ఆలియాలు ఇద్దరు బ్లూ కలర్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన ఈ ప్రేమజంట సరదాగా కొన్ని ఫోటోలు కూడా దిగారు. అయితే, ఆలియా వేసుకున్న లెహంగా కింద నేలను ఊడ్చేస్తోంది. ఈ క్రమంలో ఆమె మెట్లుదిగి కిందకు వెళ్తుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నేలపైన బంతిపూలను అందంగా ఆకర్షణీయంగా పరిచారు. ఆ అందాన్ని పట్టించుకోని ఆలియా.. పూలను దాటుకుంటూ ముందుకు వెళ్లింది. అయితే, ఆమె వేసుకున్న నీలిరంగు డ్రెస్ అక్కడున్న పూలపై ఆనుకుంటూ వెళ్లింది. దీంతో వెంటనే రణ్‌బీర్ తన పాదంతో ఆలియా లెహంగా దిగువ భాగాన్ని పక్కకు జరిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్‌బీర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో రణ్‌బీర్ కాస్త చిరాకుగా ఉండటం కనిపిస్తోందని, ఆలియావైపు ఆప్యాయంగా చూడట్లేదని కామెంట్లు చేస్తున్నారు. -
డిజిటల్ చెల్లింపులతో చిన్న దుకాణాలకు ఊతం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల విధానం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో చిన్న దుకాణాదారుల భారీగా ఊరట లభిస్తోంది. వారి దగ్గర అరువుగా (బీఎన్‌పీఎల్– ఇప్పుడు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం విధానం) తీసుకున్న వాటికి వినియోగదారులు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారు. దీపావళి తర్వాత దేశీయంగా అసంఘటిత రంగంలోని చిన్న స్థాయి దుకాణాదారులకు బీఎన్‌పీఎల్ విధానంలో చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. సగటుతో పోలిస్తే 12 శాతం అధికంగా నమోదయ్యాయి. అలాగే పండుగ సీజన్ సందర్భంగా రెండు వారాల్లో దుకాణాదారుల వ్యాపారం 15 శాతం వృద్ధి చెందింది. డిజిటల్ బుక్ కీపింగ్ యాప్ ఓకేక్రెడిట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సత్వర చెల్లింపులు వినియోగదారులు రుణంపై షాపింగ్ చేయడం పెరిగిన్నప్పటికీ వారు సత్వరం చెల్లింపులు జరిపే ధోరణి కూడా పెరిగిందని నివేదిక పేర్కొంది. కిరాణా షాపులు, ఆభరణాలు, తినుబండారాల దుకాణాదారులు మొదలైన వారు గతంలో తమ బాకీలను వసూలు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపింది. కానీ ఈసారి పండుగ సీజన్లో 30 లక్షల మంది పైగా కస్టమర్లు తమ బాకీలను సకాలంలో కట్టేశారని పేర్కొంది. మరోవైపు, రిటైల్ చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఖాతాల నిర్వహణకు డిజిటల్ సొల్యూషన్స్ వినియోగించడం 70 శాతం పెరిగిందని ఓకేక్రెడిట్ తెలిపింది. దాదాపు 1.1 లక్షల కోట్ల దేశీ రిటైల్ మార్కెట్లో దాదాపు 95 శాతం వాటా 6 కోట్ల పైచిలుకు స్థానిక వ్యాపారాలదే ఉంటోందని వివరించింది. -
పూజ సామాగ్రిని నీటిలో కలపడానికి వెళ్లారు.. అంతలోనే..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): చెరువులో కాలుజారిపడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా మారిహాళ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సాంబ్రా నివాసులు నేత్రకొళవి (8), ప్రియాకొళవి (6) మృతి చెందారు. దీపావళి సందర్భంగా పూజకు ఉపయోగించిన పూజా సామాగ్రిని నీటిలో వదలడానికి అక్క సుధ (10)తో కలిసి చెరువు వద్దకు వెళ్లిన ప్రియ, నేత్ర ఇద్దరూ అరటి చెట్టును చెరువు నీటిలో వదిలే క్రమంలో కాలుజారి నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు బాలికల మృతదేహాలను వెలికితీసారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి.. -
నా చావుకు ఎవరూ కారణం కాదు..!
సాక్షి, చందంపేట(నల్లగొండ): ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని గువ్వలగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావత్ భూర్య, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాల్గో కుమారుడు సపావత్ నరేశ్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ పూర్తిచేశాడు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన నరేశ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గాని శనివారం తెల్లవారుజామున నరేశ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో నరేశ్‌కు ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్ నోట్ లభించిందని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
Andhra Pradesh: ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడ ఉందంటే..?
గార: పండగల పేర్లతో ఊర్లు ఉండడం చాలా అరుదు. జిల్లాలో మాత్రం దీపావళి పేరుతో ఓ ఊరుంది. శ్రీకాకుళం నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ ఊరు ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిపై చుట్టుపక్క గ్రామాల్లో ఓ కథ చెబుతుంటారు. ఆ కథ ప్రకారం.. శ్రీకాకుళాన్ని పాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి అప్పుడప్పుడు గుర్రంపై ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు. (చదవండి: మెరిసే తీరం సూర్యలంక బీచ్) ఒక రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగానే నామకరణం చేశారు. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ ఊరి పేరు దీపావళిగానే నమోదై ఉంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. చదవండి: Diwali: ఈ టపాసులు తినెయ్యొచ్చు పండగ పేరు.. మా ఊరు మా ఊరికి హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గ్రామంలో జన్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దీపావళిని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటాం. – శ్రీ రంగం మధుసూదనరావు, విశ్వహిందూపరిషత్ కార్యదర్శి, దీపావళి -
ఏమరపాటు వద్దు.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!! ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్‌పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు! చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ — Sushil Rao (@sushilrTOI) November 3, 2021 -
ఈ పండగ సమయంలో వారిని గుండెలకు హత్తుకోవాలి!
ఒక తల్లి కొడుకును వెంటబెట్టుకుని చేతిలో దీపావళి కానుకతో కారులో బయలుదేరుతుంది. ‘ఎక్కడికమ్మా?’ అని కొడుకు అడిగితే ‘నువ్వే చూస్తావుగా’ అంటుంది. ‘మన ఆత్మీయ కుటుంబాన్ని కలవబోతున్నాం’ అంటుంది. కోవిడ్ సమయంలో ఆ కొడుక్కు సీరియస్ అయితే ముక్కూ మొహం తెలియని పెద్దమనిషి బెడ్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ పెద్దమనిషి కుటుంబానికి కానుక ఇవ్వడానికే ఆ తల్లి బయలుదేరుతుంది. ‘అమేజాన్’ చేసిన ఈ యాడ్ భారీ ఆదరణ పొందుతోంది. కోవిడ్ కాలంలో ప్రాణాలు నిలబెట్టిన ఆపద్బాంధవులకు ఈ దీపావళి సమయాన థ్యాంక్స్ చెప్పాల్సిన సంస్కారాన్ని గుర్తు చేస్తోంది. ఈ సంవత్సరమంతా మనం నిజమైన మనుషుల్ని చూశాం. ఆపద్బాంధవులను చూశాం. సమయానికి మనిషిలా వచ్చిన దేవుళ్లను చూశాం. వాళ్లు లేకపోతే ఇవాళ మనకు ఈ దీపావళి లేదు. నిజం. వారంతా మన ప్రాణదాతలు. కోవిడ్ సమయంలో ఏదో మేరకు సాయపడిన కొత్త బంధువులు. వారూ ఇప్పుడు మనకు ఆత్మీయమైన కుటుంబమే. ఆ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పాల్సిన సమయం ఇదని ‘అమేజాన్’ తన యాడ్ ద్వారా చెప్పింది. ఆలోచించి చూడండి... ఎందరు అలాంటి వాళ్లుంటారో. అన్నం పెట్టినవారు కోవిడ్ సమయంలో చాలామంది హోమ్ క్వారంటైన్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. వారిలో చాలామందికి భోజనం వండుకునే వీలు లేకపోయింది. అలాంటి సమయంలో ప్రతి ఊళ్లో ఎందరో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితులు ఉన్నాం అని ఇంటి నుంచి కాల్ చేస్తే భోజనం తెచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్లారు. మరికొన్ని చోట్ల రిస్క్ ఉన్నా ఇరుగిల్లు పొరుగిల్లు వారే ఆకలి తీర్చారు. నిజంగా వారే లేకపోతే ఆ 14 రోజులు ఎలా గడిచేవి? ఈ దీపావళి రోజు వారిని పలకరించాలి కదా. ఒక మిఠాయి డబ్బా ఇచ్చి నమస్కారం తెలుపుకోవాలి కదా. వారు ఇచ్చిన ఆక్సిజన్ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కోసం బాధితులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. మన దగ్గర డబ్బు ఉన్నా సమయానికి ఆక్సిజన్ ఆచూకీ తెలిసేది కాదు. అలాంటి సమయంలో ఫేస్బుక్ పోస్ట్ పెడితేనో, ట్విటర్లో అప్పీల్ చేస్తేనో ఏ మాత్రం పరిచయం లేని ఎందరో ఫలానా చోట ఆక్సిజన్ ఉంది... మా దగ్గర ఎక్స్ట్రా ఉంది అని ఆచూకి తెలియ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఎందరో దాతలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దానం చేసి గొప్ప సహాయం చేశారు. వాళ్లెవరో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. వారి సహాయానికి ఈ దీపావళికి కనీసం మెసేజ్ పెట్టడం అవసరం. వైద్యుడే నారాయణుడు వచ్చింది ప్రాణాంతక వ్యాధి. వైద్యం చేయక తప్పదు. చేస్తే అది సంక్రమించే అవకాశం ఎక్కువ. కాని వేలాది మంది వైద్యులు కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణం పోశారు. రేయింబవళ్లు శ్రమించారు. నర్సులు, అటెండర్లు... వీరంతా హాస్పిటల్లో ఉన్న సమయంలో బాగా గుర్తే. డిశ్చార్జ్ అయ్యే సమయంలో వారికి పెట్టిన నమస్కారం చాలదు. ఈ పండగ సమయంలో వారికి కృతజ్ఞతలు ప్రకటించాలి. చిరు కానుకతోనైనా సత్కరించాలి. ఆఖరు మజిలి కోవిడ్ కాలంలో ఆప్తుల్ని కోల్పోయారు కొందరు. కాని ఆ ఆప్తులకు అంతిమ సంస్కారాలు జరిపే శక్తి, ధైర్యం, వీలు వారికి లేవు. భారతదేశంలో అంతిమ సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి పనికి ఎందరో యువతీ యువకులు రంగంలో దిగి సేవ చేశారు. తమకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మానవులుగా అవతరించారు. ఆత్మీయులను కోల్పోయిన విషాదం ఇంకా వదిలి ఉండకపోవచ్చు. ఈ దీపావళి వారిని మరింత గుర్తు చేయవచ్చు. కాని వారి సగౌరవ వీడ్కోలుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పండగ సమయంలో గుండెలకు హత్తుకోవాలి. ఎందరో అన్సంగ్ హీరోలను ఇచ్చిన కాలం ఇది. ఆ నాయికా నాయకులు లేకపోతే ఈ కాలాన్ని గెలిచేవాళ్లం కాదు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేయాలి. Some people are #specialfamily and this year don't forget to #deliverthelove to them yourself. Here's a heartwarming story from us! Tell us about your #SpecialFamily in the comments section. pic.twitter.com/ZfOExx64p3 — Amazon India (@amazonIN) October 28, 2021 -
Deepavali 2021: ఈమె నా సత్యభామేనా.. ఇంత బేలగా..
తెలతెలవారుతోంది. సత్యభామ నెమ్మదిగా మేల్కొంటోంది. నిద్ర మంచం మీద నుంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి ప్రణామం చేసి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి, నెమ్మదిగా లేచి వచ్చింది. ఆ రోజు సత్యభామ మనసును బాధ, ఆనందం రెండూ కష్టపెడుతూనే సంతోషపెడుతున్నాయి. మానసిక సంఘర్షణతో నిండిన ఎదతో సత్యభామకు ఏ పని చేయటానికీ తోచట్లేదు. తలారా స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుని మందిరానికి బయలుదేరింది సత్యభామ. ఎన్నడూ లేనిది ఆ రోజు తెలుపునలుపుల సమ్మిళితమైన పట్టు బట్టలు ధరించింది. తల నిండా మల్లెలు తురుముకుంది. ముత్యాల హారం ధరించింది. సత్యభామ ముగ్ధలా ముద్దుగా మురిపెంగా కనిపస్తూనే అంతలోనే ఆమెలో ఏదో తెలియని దిగులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గమనము విడిచిపెట్టకుండా వేగంగా శ్రీకృష్ణ మందిరం చేరింది సత్యభామ. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు గుమ్మం దగ్గరే స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాడు.సత్యలోని రెండు భావాలను వెంటనే గమనించాడు నల్లనివాడు. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నడిపించుకుంటూ తీసుకువెళ్లి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంతవరకు ఎంతో కొంత గంభీరంగా ఉన్న సత్య కళ్లలో నీళ్లు ఊటలా ఊరి ఒక్కసారిగా ఒళ్లంతా తడిపేశాయి. ఈమె నా సత్యభామేనా, ఇంత బేలగా విలపిస్తోంది. ఎంతటి ధైర్యవంతురాలు, యుద్ధం చేసిన అరివీరభయంకర నారి.. అనుకుంటూ తన చేలాంచలముతో ఆమె కన్నీరు మృదువుగా తుడిచాడు. ఆశ్వాసన లభించటంతో ఆమెలోని దుఃఖం వరదలా పొంగుకొచ్చింది. ఆమెను పూర్తిగా దుఃఖపడనిచ్చాడు. కొంత సేపటికి ఆమె మనసు కొద్దిగా కుదుటపడింది. కొంత సేపటికి తన మనసును తానే కుదుటపరచుకుని... శ్రీకృష్ణా.. నన్ను ఇలా చూస్తే నీకు కొత్తగా అనిపిస్తోంది కదూ... నిజమే.. నేను ధైర్యవంతురాలినే కాని, భీరురాలిని కానని నీకు తెలుసు. అటువంటి నేను కంటనీరు పెట్టుకోవటం నీకు ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదులే...అంటూ - తన దుఃఖానికి కారణం నెమ్మదిగా వివరించటం ప్రారంభించింది. శ్రీకృష్ణా... ఈ రోజు ప్రత్యేకత నీకు తెలుసు కదూ.. అంటూ తన ఖేదానికి కారణం చెప్పడానికి సన్నద్ధురాలైంది. ఎందుకు తెలీదు. నువ్వు నాకు విజయం తెచ్చిపెట్టిన రోజు ఈ రోజే కదా... అన్నాడు నవ్వురాజిల్లెడు మోముతో. అవును.. అది ఒక విషయం. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా మనసు సంబరపడుతుంది. అదొక్కటే కాదు కదా... మరో విషయం కూడా ఉంది కదా.. అంది మనసులోని దుఃఖాన్ని మాటల ద్వారా పలుకుతూ... ఎందుకు గుర్తు లేదు.. నరకాసుర సంహారం జరిగింది ఈ రోజే కదా.. అన్నాడు గంభీరంగా. అదే.. అదే.. ఆ సంఘటనే నా మనసుని కలవరపెడుతుంది.. అంది కంట నీరు బయటకు రానీయకుండా తడిసిన గుండెతో. అలా అంటావెందుకు. స్వయంగా నువ్వే కదా నరకాసురుని సంహరించడానికి సహకరించావు... అన్నాడు ఏమీ తెలియనట్లుగా ఆ లీలామానుష విగ్రహుడు. సత్యభామ అదేమీ గమనించనట్లుగా... నిజమే... ఎంతైనా వాడు నా పుత్రుడు కదా. ఒక తల్లిగా నాకు ఆ బాధ ఉంటుంది కదా. లోకరక్షణ కోసం నేను నరకుడిని సంహరించినా, కన్నప్రేమ ఒక పక్కన బాధిస్తూనే ఉంటుంది కదా.. అంది గద్గద స్వరంతో సత్యభామ. సత్యా... ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకుందామా. నరకుడిని అసురుడు అన్నాం. అంటే వాడిలో రాక్షస గుణాలు ఉన్నాయనే కదా అర్థం. మనం రాక్షస గుణాలను సంహరించాం. అందుకే నరకుడి పేరు మీదనే కదా నరక చతుర్దశి అని ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇతర పండుగలన్నింటికీ ఇలా అసురుల నామాలు లేవు కదా. మనం మనలోని రాక్షస లక్షణాలను పోగొట్టుకుని, మనలో ఉన్న జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించుతూనే ఉండాలి కదా... అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు జగద్గురువు. అసలు నువ్వు ఇలా మాట్లాడటమే నాకు వింతగా ఉంది. ఈ సృష్టికి మూలమైన లలన ఇంత బేలగా మాట్లాడొచ్చా... అంటుంటే సత్యభామ.. వెంటనే తనలోని బేలతనాన్ని పక్కకు పెట్టి, గంభీరంగా..నిజమే కృష్ణా.. వాస్తవానికి ఈ రోజు నీతో ఈ విషయమే మాట్లాడాలనుకున్నాను. కాని ఎందుకో నా మనసు తడి కావటంతో, ముందుగా నాలోని బాధను నీతో పంచుకున్నాను. నువ్వన్నది నిజమే. ఈ సృష్టికి కారణమైన స్త్రీకి ఇప్పుడు ఎందుకు సముచిత స్థానం లేదో అర్థం కావట్లేదు. మానవులందరూ పూజించే దేవుళ్లందరూ తమ భార్యల పేరుతోనే ప్రసిద్ధులు కదా. పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు.. ఇలా.. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు.. అంటూ సందేహం వెలిబుచ్చింది సత్యభామ. ఏమో ఎక్కడ జరిగిందో తెలియట్లేదు. త్రేతాయుగంలో మా పినతల్లి కైకమ్మ మా తండ్రిగారయిన దశరథ మహారాజుకి యుద్ధంలో సహకరించింది కదా. ద్వాపర యుగం వరకు ఎన్నడూ స్త్రీపురుష వివక్ష లేదు. మరి కలియుగంలో ఎందుకు వచ్చిందో... అంటూ ఏమీ తెలియనివాడిలా ఉపదేశం చేశాడు పరాత్పరుడు. సత్యభామ చిరునవ్వుతో... వీటికితోడు.. ఎవరికైనా కోపం వస్తే చాలు... సత్యభామలా అలిగింది అంటూ పోలుస్తారే కాని, సత్యభామలా ధైర్యంగా ఉన్నవారిని నాతో ఎందుకు పోల్చరో తెలియట్లేదు. ఆడవారు ఆదిశక్తి స్వరూపం కదా... ఆ శక్తి ఎందుకు సన్నగిల్లిపోతోందో... ఆ ఆత్మాభిమానం ఎక్కడకు పారిపోతోందో అర్థం కావట్లేదు కృష్ణా... అంటూ తన కొంగును నడుముకి బిగిస్తూ పలికింది సత్య. అవును సత్యా... ఈ సృష్టి నిత్యం కొనసాగటం కోసం ఆడమగ అనే ప్రాణులను సృష్టిస్తే... మానవులు మాత్రం ఆడవారు తక్కువ, మగవారు ఎక్కువ అనే స్థితికి చేరుతున్నారు. ఇది మంచిది కాదు... అంటూ హితోక్తులు పలుకుతున్నాడు. దీపావళి పండుగలోని పరమార్థం అదే కదా... మన ఇంటిలోని రాక్షస గుణాలను పారద్రోలి, దైవలక్షణాలు అనే దీపాన్ని వెలిగించమని మనం ఈ పండుగ ద్వారా చెబుతున్నాం. దీపపు కాంతులతో పాటు, మానసిక ఉల్లాసం కోసం బాణాసంచా కాల్చుకోమంటున్నాం. కాని వీటిలోని పరమార్థం పక్కకు వెళ్లిపోతోంది. శారీరక ఆరోగ్యం దిగజారిపోయేలా చెవులు చిల్లులు పడే మందుగుండు సామగ్రి కాలుస్తున్నారు. సామాన్యంగా నిరాడంబరంగా చేసుకోవలసిన పండుగను అప్పులు చేసి ఆర్భాటంగా చేసుకుంటున్నారు... అంటూ సత్యభామ పలుకుతుంటే.. శ్రీకృష్ణుడు సన్నగా నవ్వుతూ...నిజమే సత్యా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలేమో.. అన్నాడు. ►వైజయంతి పురాణపండ (సృజన రచన) -
పేలుతున్నాయ్.. టపాసుల ధరలు
సాక్షి, అమరావతి: దీపావళి వెలుగులపై టపాసుల ధరలు నీళ్లు చల్లాయి. కాకరపువ్వొత్తులు కూడా కొనలేని స్థితికి తెస్తున్నాయి. వీటివల్ల ప్రజలకు పండగ ఆనందం దూరమవడమే కాదు.. వ్యాపారాలనూ దెబ్బతీస్తున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా దీపావళి వెలవెలబోయింది. ఈ ఏడాదైనా వెలుగులు కురిపిస్తుందనుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాదితో పోలిస్తే అన్ని టపాసుల ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కాకరపువ్వొత్తుల పెట్టె కూడా ఈ ఏడాది రూ.50 పెట్టందే రాదని వ్యాపారులు చెబుతున్నారు. టపాసుల్లో భారీ డిమాండ్ ఉండే 1000 వాలా సీమటపాకాయల ధర ఈ ఏడాది రూ.600 పైనే పలుకుతోందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి శ్రీనివాసరావు చెప్పారు.ధరలు ఇలా ఉంటే ప్రజలు కొనడం తగ్గించేస్తారని, వ్యాపారం పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పండుగకు మరో అయిదు రోజులే ఉన్నప్పటికీ, రిటైలర్లు కూడా కొనుగోలుకు అంతగా ముందుకు రావడంలేదని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు బాగుంటాయన్న ఉద్దేశంతో భారీగా టపాసులు కొన్నామని, ధరలు పెరగడంతో రిటైల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని విజయవాడకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి ఎన్.మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమిదీ.. కోవిడ్‌తో పాటు బాణసంచా అత్యధికంగా తయారయ్యే తమిళనాడులోని శివకాశిలో ఈ ఏడాది వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. దీంతో ఉత్పత్తి తగ్గింది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ తడిసిమోపెడయ్యాయి. ఈ కారణాల వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు రిటైల్ షాపుల ఏర్పాటుకు నిబంధనలు కఠినతరం చేయడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. వీటివల్ల ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన డిమాండ్ పర్యావరణ అనుకూలమైన గ్రీన్ క్రాకర్స్‌కు డిమాండ్ పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. తక్కువ శబ్దంతో రంగు రంగుల్లో ఉండే చిచ్చుబుడ్లు, షాట్స్ ఎక్కువగా అడుగుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన వ్యాపారి కేవీఎన్ మూర్తి చెప్పారు. టపాసులు కాల్చిన తర్వాత వచ్చే వ్యర్థాల నుంచి మొక్కలు వచ్చే టపాసులు, డ్రోన్ ఫైర్ వర్క్స్ వంటివి ఈ ఏడాది ఎక్కువగా అందుబాటులోకి వచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. వీటి ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి. గ్రీన్ క్రాకర్స్ ధరలు రూ.200 నుంచి మొదలవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా అమ్మకాలు ఆన్లైన్ ద్వారా కూడా టపాసుల అమ్మకాలు జరుగుతున్నాయి. స్టాండర్డ్ కంపెనీతో పాటు పలు సంస్థలు హైదరాబాద్ క్రాకర్స్, క్రాకర్స్వాలా, క్రాకర్స్మేళా పేరుతో ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. నచ్చిన వస్తువులను విడివిడిగా తీసుకోవడంతో పాటు పలు రకాల టపాసులను కలిపి ప్యాక్లుగా కూడా విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో గిఫ్ట్ బాక్స్ ధరలు రూ.1,250 నుంచి రూ.3,950 వరకు ఉన్నాయి. -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ట్విటర్లో ట్వీట్ చేశారు. చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా. #Deepavali — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2020 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. కరోనా లాంటి విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త తీసుకోవాలి’ అని గవర్నర్ ఆకాంక్షించారు. -
అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరోసారి డిస్కౌంట్ అఫర్లను తీసుకువచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకాలను 'గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్' పేరుతో ప్రారంభించింది. ఈ సేల్ ద్వారా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్ఫోన్లు, టీవీలపై తగ్గింపు ధరలు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సీటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో సహా పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. రుపే కార్డు వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌కు అర్హులు. ప్రైమ్ డే సేల్ (అక్టోబరు 29)మంచి శుభారంభాన్నిచ్చిందని అమెజాన్ ప్రకటించింది. నేటినుంచి (అక్టోబరు 30) - నవంబర్ 4 తో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగుస్తుంది. మరోవైపు ఈవారంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకాలను చేపట్టాలని చూస్తోంది. అన్ని రకాల ఉత్పత్తులపై నేరుగా డిస్కౌంట్ మాత్రమే కాకుండా పలు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు నేరుగానే రూ.1,500 వరకు తగ్గింపు పొందొచ్చు. రుపేకార్డు 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా లభ్యం. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా పొందొచ్చు. దీపావళి ప్రత్యేక అమ్మకం సందర్భంగా ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 11 రూ. 49,999 కే విక్రయిస్తోంది. దీని ఎంఆర్పి రూ .64,900. అలాగే ఐఫోన్ 11 కొనుగోలుపై 16,400 రూపాయల ఎక్జ్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్ 2020 ఆఫర్లు స్మార్ట్ఫోన్లు - 40శాతం వరకు తగ్గింపు ల్యాప్‌టాప్‌లు - రూ .2,000 వరకు తగ్గింపు టీవీలపై- 40 శాతం వరకు తగ్గింపు కెమెరాలు - కనిష్టంగా 35 శాతం ఆఫర్ ఉపకరణాలు - కనిష్టంగా 45శాతం తగ్గింపు ఫ్యాషన్ - 70శాతం ఆఫ్ కిరాణా సామాగ్రిపై రూ .1 డీల్స్ -
దీపావళికే వెలుగులద్దిన పాటలు..
దీపావళి.. తెలుగు వారి గుమ్మం ముంగిట ఆనంద తోరణాలుగా ప్రమిదలు వెలుగులు కురిపిస్తుంటాయి. ఇంటి ముందు పేల్చే చిచ్చుబుడ్లు వారి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా నిలుస్తాయి. రాకెట్లు వారు అందుకోవాల్సిన గమ్యాలను గుర్తు చేస్తాయి. భూచక్రం మన మనసు చేసే పరిపరి ఆలోచనలకు ప్రతిబింబంగా మారుతాయి. ఇలా ఎన్నో పరమార్థాలు దాచుకున్న పండగే దీపావళి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. ఇక దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి మాటలు సరిపోవనుకున్నారో ఏమో కానీ సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో వచ్చిన పాటల వైభవం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ.. విచిత్రబంధం సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి.. చీకటి వెలుగుల రంగేళీ’. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దీపావళి పాట ఇది. తరాలు మారుతున్నా ఆదరణ తగ్గని పాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీపావళిని ఇముడ్చుకున్న మరిన్ని పాటలు.. దీపావళి - వచ్చింది నేడు దీపావళి.. పరమానంద మంగళ శోభావళి షావుకారు - దీపావళి.. దీపావళి... ఇంటింట ఆనంద దీపావళి అంటూ సంతోషంలో పాడుకోగా.. దీపావళి, మా ఇంట శోకాంధ తిమిరావళి అంటూ ఇదే సినిమాలో బాధలోనూ పాడుకున్నారు. భలే రాముడు - ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా రుణానుబంధం - దీపాల పండుగ.. ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ.. ఆ తరం నుంచి ముందుకు వస్తే.. మామగారు - వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి.. ఏనాడూ వెళ్లిపోని దీపావళి.. ఇయ్యాలె అచ్చమైన దీపావళి పెళ్లికానుక - ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ.. ఆనందం పొంగేనోయి దీపావళి.. అని సంతోషంలో పాడుకోగా, ఆడేపాడే పసివాడ.. అమ్మా లేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి అంటూ బాధలోనూ మార్చి పాడుకున్నారు. విజయదశమి - దీపావళి.. రెబల్ - చెప్పలేని ఆనందం.. దివాళీ దడ - దీవాళీ.. దీపాళీ.. ఇవే కాకుండా దీపావళి పండగపై ప్రత్యేక ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అదీగాక 'దివ్వి దివ్వి దీపావళి.. దిబ్బు దిబ్బు దీపావళి..' అంటూ పాడుకునే జానపద పాటలు మరెన్నో.. సినిమాల్లో దీపావళి.. ‘దీపావళి’ టైటిల్తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది 1960లోఎన్టీఆర్,సావిత్రిలు కృష్ణుడు సత్యభామలుగా నటించిన చిత్రం ‘దీపావళి’. ఇది పండగ ప్రాశస్త్యాన్ని చెప్పే పురాణ కథ .మరొకటి 2008లో వేణు హీరోగా వచ్చిన దీపావళి. దీపావళి సీన్లతో గట్టెక్కిన సినిమాలు ఉన్నాయి. కథను మలుపు తిప్పడానికి దీవాళిని వాడుకున్న చిత్రాలూ ఉన్నాయి. జనతా గ్యారేజ్‌లోనూ దీపావళిని పర్యావరణహితంగా ఎలా జరుపుకోవాలో హీరో సందేశాన్నిస్తాడు. పసి పిల్లోడు నుంచి పడుచు పిల్ల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి పండగకు ప్రాణం పోసే పాటలు, చిత్రాలు మరెన్నో రావాలని ఆశిద్దాం. -
సక్సెస్ బాంబ్ ఎవరిది?
ఈ ఏడాది దీపావళికి జోరుగా పేలడానికి మూడు బాంబు ( తమిళ సినిమా)లు రెడీ అవుతున్నాయి. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా విజయ్, ఖైదీగా కార్తీ, రాజకీయ నాయకుడిగా విజయ్ సేతుపతి.. ఈ ముగ్గురు హీరోలు దీపావళి బరిలో నిలిచారు. వీరి చిత్రాలతో పాలు పండక్కి ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాల వివరాల్లోకి వెళితే... గత రెండేళ్లుగా దీపావళికి తన సినిమా విడుదలయ్యేలా చూసుకున్నారు విజయ్. 2017లో ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’), 2018లో ‘సర్కార్ చిత్రాలతో దీపావళికి తెరపై సందడి చేశారు. ఈ దీపావళిని కూడా ఆయన మిస్ కావడంలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘బిగిల్’ సినిమాను దీపావళి విడుదలకు రెడీ చేశారు. విజయ్‌తో ఇదివరకు ‘తేరి, మెర్సెల్’ వంటి హిట్ సినిమాలను తీసిన అట్లీ ఈ ‘బిగిల్’ సినిమాకు దర్శకుడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాకు విజయ్ సుమారు 150 రోజులు కాల్షీట్స్ ఇవ్వగా ఆల్రెడీ ఈ సంఖ్య 200 దగ్గరకు చేరుకుంది. దీన్నిబట్టి రాజీ అనేది లేకుండా కాకుండా ఎంత శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక ఇటీవలి కాలంలో కోలీవుడ్‌లో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు వీలు చిక్కినప్పుడల్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం కూడా ఎత్తి ఆడియన్స్ మనసు దోచుకునే పాత్రలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘సంగ తమిళన్’. ‘స్కెచ్’ ఫేమ్ విజయ్ చందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రాజకీయ నాయకుడి పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా దీపావళికే విడదుల కానుంది. ‘బిగిల్’లో విజయ్ రెండు పాత్రలు చేశారనే ప్రచారం జరుగుతున్నట్లుగానే ‘సంగ తమిళన్’లో విజయ్ సేతుపతి కూడా డ్యూయల్ రోల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక దీపావళికి వస్తున్న మరో హీరో కార్తీ. ‘ఖైదీ’ చిత్రంతో ఆయన పండక్కి తెరపై కనిపించబోతున్నారు. ‘మానగరం’ సినిమాతో ఆడియన్స్‌ను మెప్పించిన లోకేష్ కనగరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇలా మూడు సినిమాలు ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. మరి.. మూడు బాంబుల్లో మూడూ దిగ్విజయంగా పేలి, వసూళ్ల సౌండ్ బలంగా వినిపిస్తే ఇండస్ట్రీకి మంచిదే. మరి ఎవరిది సక్సెస్ బాంబ్ అవుతుందో వేచి చూడాలి. -
దీపావళిని సంతోషంగా జరుపుకోండిలా!
సాక్షి, హైదరాబాద్: దేశమంతా దీపావళి పండుగ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కింది సూచనలు పాటించడం ద్వారా ఈ పండుగను మరింత సురక్షితంగా జరుపుకోవచ్చు. కలుషిత గాలి: పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున కాల్చే బాణసంచా వలన పెద్ద మొత్తంలో పొగ వెలువడి గాలి కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ కలుషిత గాలి శ్వాసకోస వ్యాధులు ఉన్న వారికి మరింత ప్రమాదకరం. ఆస్తమా, సీఓపీడీ వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దూరం నుంచే బాణసంచా కాల్చాలి: బాణసంచా పేల్చేటపుడు వెలువడే రసాయనాల పొగ పలు ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. కనుక వాటికి దూరంగా ఉండే కాల్చాలి. పేలుడు సమయంలో వాటికి దగ్గరగా ఎవరూ లేకుండా చూసుకోవాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు బాణసంచా కాల్చాలి. సిటీకి దూరంగా ఉండాలి.: శ్వాసకోశ సంబంధ వ్యాధులు తీవ్ర స్థాయిలో ఉన్నవారు.. వీలైతే సిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండుగకు వారం ముందు నుంచే బాణసంచా కాల్చడం ప్రారంభమవుతుంది. కాబట్టి గాలిలో కలుషిత స్థాయి అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎత్తైన ప్రదేశాలలోని గాలి తక్కువగా కలుషితం అవుతుంది గనుక సాధ్యమైనంత మేరకు అటువంటి ప్రదేశాలు చేరడం ఉత్తమం. టెక్నాలజీ ఉపయోగించండి: గాలి కాలుష్యాన్ని తెలిపే మొబైల్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా నిర్ణీత ప్రాంతంలోని కాలుష్య స్థాయిని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఎంతసేపు అక్కడ గడపవచ్చు, ఎంత మేరకు సురక్షితం వంటి విషయాలను అంచనా వేయవచ్చు. డాక్టర్‌ను కలవడం: శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు పండుగ రోజుల్లో పట్టణాల్లో గడపాల్సి వస్తే ముందుగా డాక్టర్‌ను కలవడం ఉత్తమం. ప్రస్తుత ఆరోగ్య స్థితి, పండుగ రోజున వెలువడే కాలుష్య స్థాయిని తట్టుకోగలదా లేదా అని డాక్టర్ ఇచ్చే సలహా ప్రకారం నడుచుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ముఖాన్ని కప్పే మాస్క్‌లు ధరించాలి. డాక్టర్ సూచించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలి. ఈ సలహాలను పాటించడం ద్వారా పండుగ సందర్భంలో ఎదురయ్యే పలు సమస్యలను సులువుగా అధిగమించి దీపావళిని సంతోషకరమైన అనుభూతిగా మలుచుకోవచ్చు. -
నో క్లాష్!
దీపావళికి థియేటర్స్‌లోకి ‘ఎన్జీకే’ రావడం లేదా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎన్జీకే’ (నందగోపాలకుమారన్). తెలుగు వెర్షన్‌కి ‘నందగోపాలకృష్ణ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు టీమ్. ఇందులో సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ దర్శకుడు సెల్వరాఘవన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, ‘ఎన్జీకే’ దీపావళికి రిలీజ్ కావడం లేదని అంటున్నారు చెన్నై సినీ జనాలు. కానీ ఈ విషయంపై సెల్వరాఘవన్ స్పందించారు. ‘‘నేను బాగానే ఉన్నాను. మరో రెండు రోజుల్లో ‘ఎన్జీకే’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. నా బాగు కోరిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. కానీ ‘ఎన్జీకే’ రిలీజ్ గురించి మాత్రం స్పందించలేదు. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో కానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కార్’ని దీపావళికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ‘ఎన్జీకే’ వాయిదా పడితే.. సూర్య, విజయ్‌ల సినిమాలకు క్లాష్ తప్పినట్లే. -
పడమ్ పందెం
తమిళంలో రేసు మొదలైంది. ఇది పరుగు పందెం కాదు పడమ్ పందెం. ‘పడమ్’ అంటే తమిళంలో సినిమా అని అర్థం. ఈపాటికే మీకు అర్థం అయ్యుంటుంది. ఇది రిలీజ్ రేస్ అని. ఈ దీపావళికి తమిళంలో 3 పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో విజయ్ ‘సర్కార్’, అజిత్ ‘విశ్వాసం’, సూర్య ‘ఎన్జీకే’ ఆల్రెడీ రేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా విక్రమ్ కూడా జాయిన్ అయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ ‘ధృవనక్షత్రం’. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్లో ఉంది. ఈ చిత్రాన్ని కూడా దీపావళి రేసులో దింపాలని దర్శకుడు భావిస్తున్నారట. మరి ఈ నలుగురు హీరోల్లో దీపావళి రేస్‌లో లాస్ట్ వరకు ఎవరు నిలుస్తారో? ఫైనల్‌గా ఎవరు గెలుస్తారో వెయిట్ అండ్ సీ. -
ఒకే సీజన్లో ముగ్గురు టాప్ హీరోలు
2018 దీపావళికి కోలీవుడ్ తెరపై భారీ పోరు జరగనుంది. తమిళనాట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు టాప్ హీరోలు ఒకే సీజన్ లో తమ సినిమాలతో బరిలో దిగుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఆ సినిమాలపై చర్చ మొదలైంది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్న హీరో విజయ్. గతంలో మురగదాస్ కాంబినేషన్లో తుపాకీ, కత్తి సినిమాలతో దీపావళి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఘన విజయాలు సాధించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో స్టార్ హీరో సూర్య కూడా దీపావళి సీజన్ నే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే సెల్వరాఘవన్ దర్వకత్వంలో సినిమాను స్టార్ట్ చేసిన సూర్య తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమాను దీపావళి సీజన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మరో కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కూడా అదే సీజన్ ను టార్గెట్ చేస్తున్నాడు. మరోసారి శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాలో నటిస్తున్న అజిత్ ఈ సినిమాతో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోలు అనుకున్నట్టుగా ఒకేసారి బరిలో దిగుతారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
రాష్ట్ర ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా దీవించాలని భగవంతుణ్ని ప్రార్థించారు. -
దీపావళి ఫ్లాష్ సేల్: రూ.1 కే స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షావోమి అద్భుతమైన దీపావళి ఆఫర్ ప్రకటించింది. దీపావళిసందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లాష్ సేల్‌లో రూ. 1కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. లిమిటెడ్ సంఖ్యలో డివైస్‌లు అందుబాటులోఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రకారం ఈ సేల్ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని షావోమి తన పార్ట్నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్లైన్ స్టోర్‌లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు షావోమి చెందిన ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా అందించనుంది. సేల్ జరగనున్నఈ మూడు రోజుల్లో రెండు స్లాట్లలో ఈ సేల్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూ.1 సేల్ కొనసాగుతుంది. ఇందులో రెడ్మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనుంది. అలాగే ఈ సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలకు షావోమి అధికారిక వెబ్‌సైట్‌ను, ఎంఐ యాప్‌ను పరిశీలించాల్సిందే. -
దీపావళి దందాలో ఫైరాఫీసర్ అవుట్!
రాజంపేట ఫైర్ ఆఫీసర్ సస్పెన్షన్ పోలీసులపై కూడా పిర్యాదులవెల్లువ రాజంపేటః దీపావళి సందర్భంగా పలు టపాసులు దుకాణాల వద్ద టపాసులు కలెక్షన్ ఓ అధికారిపై వేటు పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే...రాజంపేట అగ్నిమాపకశాఖ అధికారి బాలపిచ్చయ్యను సస్పెండ్ చేశారు. దీపావళి సందర్భంగా భారీగా టపాసులు వసూళ్ళు చేశారంటూ ఆరోపణలు వెలువెత్తిన క్రమంలో ఈ సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం. రాజంపేట, నందలూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో బహిరంగంగానే టపాసులు దందా చేయడంపై సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. దీంతో జిల్లా అగ్నిమాపకశాఖ నుంచి మంగళవారం సాయంత్రం బాలపిచ్చయ్యను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి విజయకుమార్ సాక్షికి ధృవీకరించారు. బాలపిచ్చయ్యపై సిబ్బంది నుంచి కూడా పిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లినట్లు తెలిసింది. కాగా గతంలో పత్తికొండ, రైల్వేకోడూరులో పనిచేసిన హయాంలో పలు ఆరోపణలు బాలపిచ్చయ్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బాలపిచ్చయ్య బాటలో సివిల్‌పోలీసులు! బాలపిచ్చయ్య బాటలో మరికొంతమంది సివిల్‌పోలీసులు దీపావళి దందా నిర్వహించారు. రాజంపేట సబ్‌డివిజన్ పరిధిలో కొందరు కింది స్ధాయి నుంచి సర్కిల్ స్ధాయి వరకు అధికారులు దీపావళి దందా నిర్వహించినట్లుగా ఉన్నతాధికారులకు పిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. తనిఖీల పేరుతో బాణసంచాల దుకాణాల వద్దకు వెళ్లి మరీ బెదరించి తమ తమ స్ధాయిలో పటాసులను తమ వాహనాల్లో ఎక్కించుకొని పంచుకున్నట్లుగా ఆరోపణలు వెలువడ్డాయి.పోలీసు సబ్‌డివిజన్ కేంద్రమైన రాజంపేట పట్టణంలో వ్యాపారులకు టపాసులు మాముళ్ల తాకిడిని తట్టుకోలేకపోయారు. ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా శనివారం రోజున పోలీసులు, పైర్ పోలీసులు తమ దైనశైలిలో వ్యాపారుల నుంచి బాణసంచాలను రాబట్టారు. ఇదంతా ఓపెన్ స్రీకెట్టే. సాధారణ కానిస్టేబల్ నుంచి పై స్ధాయి వరకు పోలీసులు టపాసుల విక్రయాలపైన్నే దృష్టి సారించారు. ముందుగానే వ్యాపారులు లేకుంటే పోలీసులు, ఫైర్ సిబ్బంది తాకిడి అధికమైంది. దీంతో పోలీసులు, ఫైర్ పోలీసులు వ్యవహారంపై విలవిలలాడారు. దుకాణం వద్ద వచ్చే పోలీసులు, పైర్ సిబ్బందికి చెప్పలేక..మింగలేక బాణసంచాలను ఇవ్వడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాస్ధితి. ప్యామిలీప్యాకెట్ల పంచుకున్నారు.. పోలీసు డిపార్టుమెంటుకు స్టేషన్ స్టేషన్‌కు బాణసంచాల దుకాణాల నుంచి తీసుకొచ్చిన ఫ్యామిలీప్యాకెట్లను పంచుకున్నారు. ఏ కానిస్టేబుల్ చేతిలో చూసిన ప్యామిలీప్యాకెట్ కనిపించడం బహిరంగమే.. ఇక ఫైర్ విభాగానికి చెందిన ఓ అధికారి స్వయంగా బైకు మీదు తిరుగుతూ దుకాణాల వద్ద టపాసులు ప్యాకెట్లను కలెక్ట్ చేయడం బహిరంగగానే కనిపించింది. అంతకముందుగా లైసెన్స్‌లు, నిబంధనలు పేరుతో దుకాణాదారులు నుంచి మాముళ్లు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. రాజంపేట సబ్‌డివిజన్ పరిధిలో ఏయే ప్రాంతాల్లో టపాసులు దుకాణాలు ఉన్నాయని, వాటన్నింటి వద్దకు ఫైర్ పోలీసులు,పోలీసులు వెళ్లి సవాలక్ష బెదిరింపులు చేసి మరీ అందినకాడికి టపాసులు వసూలు చేసుకున్నారు. -
ఆరిన దీపం
అగ్నిప్రమాదంలో అన్నదమ్ములకు తీవ్ర గాయాలు అన్నయ్య మృతి.. చికిత్స పొందుతున్న తమ్ముడు ఫ్యాన్సీ షాపు గోడౌ¯ŒSలో సంఘటన దీపావళి రోజున కూనవరంలో విషాదం ఎటుచూసినా దీపావళి సందడి. చిన్నాపెద్దా రాత్రి బాణసంచా కాల్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పండగ ఆనందాన్ని అమ్మమ్మ, తాతయ్యతో పంచుకోవాలని అమ్మతో కలిసి ఆ చిన్నారి అన్నదమ్ములు ఊరొచ్చారు. ఆటల్లో మునిగి ఉన్న ఆ చిన్నారులను మంటలు కబళించాయి. అభంశుభం ఎరుగని ఆ పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అన్నయ్య సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. – ఉప్పలగుప్తం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన వాలా సత్యనారాయణమూర్తి(సత్తిబాబు) చిరు వ్యాపారి. గ్రామంలోనే ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడికి భార్య దుర్గ, కుమారులు తారక రామప్రసాద్ (సాయి)(7), వీరవెంకట దామోదర నాయుడు (వీరేంద్ర)(5) ఉన్నారు. ప్రైవేట్ కాన్వెంట్లో సాయి రెండో తరగతి చదువుతుండగా, వీరేంద్రను కొంతకాలం క్రితం ఒకటో తరగతిలో చేర్పించారు. తండ్రి సత్తిబాబు ఇటీవల అయ్యప్ప మాలధారణ చేశారు. దీపావళి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తల్లి దుర్గతో కలిసి సాయి, వీరేంద్ర అమ్మమ్మ ఊరైన ఉప్పలగుప్తం మండలం కూనవరం వెళ్లారు. కూనవరంలో తాతయ్య సుందరనీడి సుబ్బారావు ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నారు. ఇంటి ముందు భాగంలో షాపు నిర్వహిస్తూ, ఇంటిలోనే ఓ గదిలో గోడౌ¯ŒS ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎలక్ట్రికల్ వస్తువులు, పెయింట్లు, ఇతర జనరల్ సామగ్రి ఉన్నాయి. షార్ట్సరŠూక్యట్తో.. ఇలాఉండగా ఆదివారం ఉదయం 10.30 సమయంలో సరకు నిల్వ ఉన్న గదిలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. గదిలో నిల్వ ఉన్న సామగ్రికి మంటలు వ్యాపించాయి. అదే గదిలో ఆడుకుంటున్న సాయి, వీరేంద్ర మంటల్లో చిక్కుకుని, తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపుచేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులను అమలాపురంలోని ఓ ప్రెవేట్ ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ సీఎం సందర్శన సంఘటన స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కాకినాడకు తరలించాలని చినరాజప్ప ఆదేశించారు. పిల్లలను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున సాయి మరణించాడు. అతడి త మ్ముడు వీరేంద్రను జీజీహెచ్ నుంచి కాకినాడలోని ప్రెవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.భీమరాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వి.సత్యవతి, ఎంఆర్ఐ వినాయక వర్మ సందర్శించారు. ‘మా ఇంటి దీపం ఆరింది’ ‘దీపావళి పండగ నాడు మా ఇంటి దీపం ఆరిపోయింది’ అంటూ సాయి తల్లి దుర్గ రోదించిన తీరు చూపరులను కం టతడి పెట్టించింది. కాలిన గాయాలతో చికిత్స పొందు తూ, మరణించిన సాయిని చూసి ఆమె తల్లడిల్లిపోయింది. ‘నా కుమారుడిని బతికించాలంటూ ప్రాథేయపడిన ఆమె ను సముదాయించడం బంధువులకు కష్టమైంది. సమాచారం అందుకున్న వెంటనే అయ్యప్ప మాలలో ఉన్న సత్తిబాబు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారులు సాయి, వీరేంద్ర ఇలా ప్రమా దం బారిన పడడాన్ని సత్తిబాబు, దుర్గ జీర్ణించుకోలేక పోతున్నారు. -
వారితో సమంత స్పెషల్ దీపావళి!
-
వారితో సమంత స్పెషల్ దీపావళి!
నలుగురితో కలిసి పంచుకుంటూనే ఏ పండుగైనా అందంగా ఉంటుంది. ఆనందాన్ని పంచుతోంది. అందుకే చిన్నారుల మోములపై ఆనందపు వెలుగులు పూయిస్తూ.. వారితో కలిసి ఈ దివ్వెల పండుగను జరుపుకొంది సమంత. దీపావళి పండుగ సందర్భంగా తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రత్యూష’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చిన్నారులతో ఆనందంగా గడిపింది సామ్. వారితో కలిసి సరదాగా కాకరవొత్తులు వెలిగిస్తూ.. ఆ నవ్వుల వెలుగుల దివాలీ ఫొటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. నిరుపేద మహిళలు, చిన్నారులకు వైద్యసహాయం అందించేందుకు సమంత ‘ప్రత్యూష ఆర్గనైజేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. నిరుపేద చిన్నారులకు సాయం అందిస్తున్న ఈ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మరో టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొన్నది. ఇక అభిమానులను మురిపించడానికి ఒక అందమైన పార్టీ ఫొటోను కూడా సమంత ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి
హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. టపాసులు కాల్చుతున్న సమయంలో పలువురికి గాయాలయ్యాయి. కళ్లకు గాయాలైన పలువురు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దిపావళి సందర్భంగా అయిన కంటి గాయాలతో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వరంగల్‌కు చెందిన రాజేష్, సందీప్(మెదక్), శివ(హైదరాబాద్), సాయిగౌడ్ తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. ఇంకా గాయపడిన మరికొంతమంది నగరంలోని వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. -
పేలుతున్న మామూళ్ల మతాబు!
– వాణిజ్య పన్నుల శాఖ అధికారుల 'దీపావళి' దందా – పండుగ మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు.. షాపును బట్టి రేట్లు – ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో బెదిరింపులు కర్నూలు(రాజ్‌విహార్): దీపావళి పండగకు మామూళ్ల మతాబులు పేలుతున్నాయి. పండగ సందర్భంగా బాణా సంచా సామగ్రి అమ్మే దుకాణాల నుంచి కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులను.. తనిఖీల పేరుతో బెదిరిస్తున్నారు. ఆర్డీఓ లైసెన్స్‌లు ఇచ్చినా.. సాధారణంగా ప్రతి ఏటా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన స్థలంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు సంబంధిన రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) అనుమతులు ఇస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖ, పోలీసుల, అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో బాణాసంచా అంగళ్లు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే వ్యాపార లావాదేవీలను బట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు అధికారులు సందట్లో సడేమియాలా మామూళ్ల దందాకు తెరలేపారు. దీపావళి టపాసులు అమ్మే వ్యాపారుల నుంచి రూ.2వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. సామూహికంగా ఏర్పాటు చేసే షాపులతోపాటు చిన్నాచితకా కిరాణం షాపుల వద్ద బాణాసంచా సామాగ్రి తెచ్చుకునే వారి నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టారు. రూ.7.50లక్షల వరకు మినహాయింపు ఉన్నా.. చిరు వ్యాపారులు.. వాణిజ పన్నుల శాఖ లైసెన్స్‌లు కలిగి ఉండరు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. రూ.7.50లక్షలకు పైబడి లావాదేవీలకు ఉన్న అంగళ్ల నుంచి 14.5శాతం పన్నులు వసూలు చేస్తారు. కాని ఆ కింది స్థాయి అధికారులు ఈ నిబంధన పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేశారు. కొందరు ఏసీటీఓలకు తోడు ఉద్యోగులు జతకట్టి బాణసంచా దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కింది నుంచి పైవరకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఒక్కోక్క దుకాణం నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాదూకూడదంటే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలులోని పాతబస్టాండ్, నెహ్రూ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మామూళ్లు ఇవ్వనందుకు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ దందా లక్షల రూపాయాలకు చేరినట్లు తెలుస్తోంది. అధికారులు, వ్యాపారులకు మధ్య కొందరు అకౌంటెంట్లు, ఆడిటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి : పి. నాగేంద్ర ప్రసాద్, సీటీఓ, కర్నూలు–1సర్కిల్. పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్‌లు కలిగి ఉండాలి. రూ.7.50లక్షల లోపు వ్యాపారం ఉంటే ట్యాక్స్ పరిధిలోకి రారు. మామూళ్లు అడుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం. -
కాల్చాల్సింది క్రాకర్స్ కాదు మీలో ఉన్న అహాన్ని..!
-
నిర్లక్ష్యం వహిస్తే.. బూమ్మ్!!
* రేపల్లె మండలంలోని పేటేరు, ఇసుకపల్లిలో అక్రమ బాణసంచా స్థావరాలు? * గతేడాదిలో పేటేరులో భారీ పేలుడు * వ్యక్తి మృతి, 1992లో మరో ఘటన * మరోఘటన సంభవించే అవకాశం? రేపల్లె: దీపావళి పండుగ వస్తుందంటే తీర ప్రాంతలో ఏ ప్రాంతంలో ఎలాంటి ఘటన జరుగుతుందోనని ప్రజానీకం భయాందోళనకు గురవుతుంది.. సరిగ్గా ఏడాది క్రితం పేటేరులో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు ఈ శనివారానికి ఏడాది పూర్తయ్యింది. గత సంవత్సరం పేటేరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో అనధికారికంగా మందుగుండు సామగ్రిని గచ్చుకింద గొయ్యితీసి దాచిపెట్టాడు. దీపావళి సందర్భంగా వేరోచోటికి తరలించేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విస్ఫోటనం జరిగి ఓ వ్యక్తి ఇంటి పైకప్పుకు బలంగా కొట్టుకొని కిందపడ్డాడు. ప్రమాదంలో ఆ వ్యక్తి తునాతునకలై దుర్మరణం చెందాడు. ఆ దెబ్బకు ఇంటి వాసాలు, పెంకులూ ధ్వంసమయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్ ప్రారంభమైంది. అక్రమంగా మందుగుండు సామగ్రి తయారీపై స్థానికంగా భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. 1992లో ఓల్డ్‌టౌన్‌లో భారీ పేలుడు.. 1992లో పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌లో బాణాసంచా తయారు చేస్తున్న ఓ స్థానవరంలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల తర్వాత ఓ మహిళ ఇంట్లో కొన్నిరకాల మందుగుండు సామగ్రిని నూరుతుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. పేటేరు తాటాకు టపాసులకు ప్రసిద్ధి.. దీపావళి పండుగ వినగానే తీరప్రాంతంలోని ప్రజలకు గుర్తుకు వచ్చేది తాటాకు టపాసులు, తారాజువ్వలు. జిల్లాలోనే తాటాకు టపాకాయలు, తారాజువ్వల తయారీకి మండలంలోని పేటేరు, ఇసుకపల్లి ప్రసిద్ధి చెందినవని ప్రజలకు తెలిసిన విషయమే. పండుగ సందర్భాలలో ఈ ప్రాంతాల్లో లైసెన్స్‌లు లేకుండానే ఏటా టపాసుల తయారీ జరుగుతుంది. గతంలో ప్రమదాలు సంభవించిన ఘటనలూ ఎన్నో ఉన్నా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడమే తప్ప పెద్దగా ప్రభావం చూపేంతా చర్యలు ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. మండలంలో దీపావళి మందుగుండు సామగ్రి అక్రమ తయారీని, విక్రయాలను నివారించితేనే మరో ప్రమాదం సంభవించుకుండా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. -
దీపావళి నుంచి పేమెంట్ బ్యాంక్ సేవలు
కోలకత్తా: పేటీఎం బ్యాంక్ ఇక పేమెంట్ బ్యాంకు గా అవతరించేందుకు అవసరమైన చర్యలు మరింత వేగవంతమయ్యాయి. తమ పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్టు బ్యాంక్ ఉపాధ్యక్షురాలు రుచితా తనేజా అగర్వాల్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో మాట్లాడుతూ ఆమె ఆ విషయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్ బీఐ నుంచి తుది లైసెన్సుల అనంతరం కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన పేమెంట్ బ్యాంకు ద్వారా సరికొత్త వ్యాపార విధానాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పారు. ధనార్జన తమ లక్ష్యంకాదని, ఇప్పటివరకు ఆర్థిక సేవలు అందుబాటులోలేని పేదలకు ఈ సేవలు చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రజలనుంచి వసూలు చేసే ఫీజు విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించనున్నామని ఆమె తెలిపారు. ఈ బ్యాంకు సాయంతో చిన్నపట్టణాలకూ పేటీఎంను విస్తరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోన్లు, ఇతర ఆర్థిక సేవల కల్పనలో బ్యాంకులు , ఎన్ బీఎఫ్ సీతో చర్చల్నిముమ్మరం చేసినట్టు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు యుటిలిటీ బిల్లులు, కిరాణా, రైలు టిక్కెట్లు, పాఠశాల ఫీజు తదితర రోజువారీ చెల్లింపులు సులభంగా వేగంగా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. పేమెంట్ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఉత్పత్తులు అందించేందుకు పలు బ్యాంకులు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫిజికల్ టచ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ప్రస్తుతం పేటీఎంను 20 నగరాల్లోని 13.5 కోట్ల మందితో నెలకు సుమారు 75-90 మిలియన్ల లావాదేవీలకు సమీపిస్తున్నట్టు తెలిపారు. 8 లక్షల మంది చిన్న వ్యాపారులు, సర్వీసు ప్రొవైడర్ల భాగస్వామ్యంతో ఈ సంవత్సరాంతానికి 1 మిలియన్ లక్ష్యాన్ని చేరుకునే ప్రణాళికతో ఉన్నట్టు అగర్వాల్ చెప్పారు -
గీతావళి
-
'మీ ఆస్తులు కాలిపోవద్దని కోరుకుంటున్నా'
ప్రతి సందర్భాన్ని తన ట్వీట్లతో మరింత ఆసక్తికరంగా మార్చేసే రామ్‌గోపాల్ వర్మ దీపావళి పండుగ సందర్భంగా కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. తన మార్క్ స్టేట్మెంట్లతో ఫాలోవర్స్‌ని ఎంటర్టైన్ చేశాడు. గతంలో వర్మ ట్వీట్స్‌ను సీరియస్ గా తీసుకున్న జనాలు ఇప్పుడు మాత్రం చూసి నవ్వేసి ఊరుకుంటున్నారు. దీపావళి సందర్భంగా 'కాలిన తరువాత ఆ పరిణామాలను ఎదుర్కొనే ధైర్యమున్న ప్రతీ ఒక్కరికి అన్ సేఫ్ హ్యాపీ దీవాళి. ఈ రోజు రాత్రి ఎలాంటి అనుకోని సంఘటనల వల్ల మీ ఆస్తులు, ఆనందం కాలిపోవద్దని నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నా. మనలో ఎవరికీ నరకాసుడు మనకు చేసిన అన్యాయం ఏంటో తెలీదు. అయినా అతని చావును ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం పండుగ చేసుకోవటానికి ఓ రీజన్ కావాలి కదా' అంటూ ట్విట్టర్ వేదికగా దీపావళి టపాసులు పేల్చాడు. అంతేకాదు దీపావళి పండుగకు ఒక్క రోజు ముందు తన కొత్త సినిమా కిల్లింగ్ వీరప్పన్లోని కాల్పుల సన్నివేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ తన మార్క్ దీపావళి ఎలా ఉంటుందో అభిమానులకు పరిచయం చేశాడు. Whoever has the courage to face the consequences of burns please go ahead and have a Unsafe Happy Diwali! — Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2015 I pray to God that any unfortunate fire accidents tonight won't burn ur wealth and prosperity..Happy Diwali! — Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2015 None of us know what Narakasur did for us to celebrate his death but when did us morons need a logical reason to celebrate?..Happy Diwali! — Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2015 -
టపాసులు: 65 మంది చిన్నారులకు గాయాలు
హైదరాబాద్: దీపావళి పండగ నేపథ్యంలో నగరంలో టపాసులు కాలుస్తూ పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మందికి కంటికి గాయాలయ్యాయి. దీంతో 22 మంది చిన్నారులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి, 33 మంది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి, మరో 10 మంది ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
జవాన్.. మీ సేవలు మరువలేనివి!
-
శ్రీనగర్ చేరుకున్న నరేంద్ర మోడీ
-
తిరుమలకు దీపావళి శోభ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం విద్యుద్దీపకాంతుల్లో మిరుమిట్లుగొలుపుతోంది. దీపావళి పర్వదినం పురస్కరించుకుని ఆలయానికి బుధవారం సాయంత్రం విద్యుత్ అలంకరణ చేపట్టారు. మహద్వారం నుంచి వెండివాకిలి గోపురం వరకు భక్తుల మనసులు దోచే రంగురంగుల విద్యుద్దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంతం శోభాయమానంగా మారింది. భక్తులు ఆనంద పరవశులయ్యారు. అలాగే, దీపావళి సందర్భంగా భక్తులు ఆలయం వద్ద, అఖిలాండం వద్ద నేతిదీపాలతో పూజలు చేశారు. శ్రీవారి సేవలో జయేంద్ర సరస్వతి కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం మహద్వారం నుంచి ఆలయానికి చేరుకుని ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. కంచి పీఠాధిపతికి ఆలయ పేష్కార్ సెల్వం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భక్తులు జయేంద్ర సరస్వతికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
-
దీపావళి ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు కళకళ!
-
దీపావళికి కోలీవుడ్ మార్కెట్ 300కోట్లటా!
-
వేధింపులకు నవ వధువు బలి
నకిరేకల్, న్యూస్‌లైన్ కాళ్లపారాణి ఆరకముందే వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. ఈ ఘటన నకిరేకల్ మండలం చందుపట్లలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కనగల్ మండలం యెడవెల్లి గ్రామానికి చెందిన సరస్వతి అలియస్ నాగ(20)కి చందుపట్లకు చెందిన పర్షబోయిన సురేష్‌తో గత నెల 23 తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.70వేల నగదుతో పా టు ఇతర బంగారు ఆభరణాలు ముట్టచెప్పారు. అయి తే మరో రెండు లక్షలు అదనంగా తీసుకురావాలని భర్త సురేష్, ఇతర కుటుంబ సభ్యులు సరస్వతిని వేధించా రు. దీపావళి పండగకు కూడా పుట్టింటికి పంపించలేదు. రెండు లక్షల కట్నం తీసుకు వస్తేనే ఇంట్లో ఉండాలం టూ బుధవారం సురేష్ భార్య సరస్వతిని చందుపట్లలో ఆటో ఎక్కించి పుట్టింటికి పంపించాడు. దీంతో అప్పటికే పురుగులమందు తాగిన సరస్వతి ఆటోలో కొద్ది దూరం వెళ్లగానే అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఆటోలోని ప్రయాణికులు, డ్రైవర్ విషయాన్ని ఆమె భర్త సురేష్‌కు చెప్పారు. సరస్వతిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రా త్రి మృతిచెందింది. భర్త, కుటుంబీకుల వేధింపుల కారణంగానే తన సోదరి మృతిచెందిందని సరస్వతి సోదరుడు వెంకన్నపోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. -
నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!
ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావ్ ముంబైలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన దీపావళి పార్టీ... ఇరా ఖాన్ రాకతో మరింత దేదీప్యమానం అయింది! ఆకుపచ్చని చీరలో, చేతికి గాజులు వేసుకుని సంప్రదాయపు చిరునవ్వుతో తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇరాఖాన్ను, అప్పటికే పార్టీలో కాంతులను విరజిమ్ముతున్న ‘ఎ’లిస్ట్ తారలంతా తలలు తిప్పి చూడడం ఆమె తల్లి రీమా దత్ హృదయాన్ని ఉప్పొంగించే సంగతే కానీ, ఆ పార్టీలో ఆమె ఎక్కడా దర్శనమివ్వలేదు. రీమా, ఆమిర్ మొదటి భార్య. 1986 ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరిగింది. పదిహేనేళ్ల తర్వాత 2002 డిసెంబరులో విడిపోయారు. అప్పట్నుంచీ ఇరా, ఆమె సోదరుడు తల్లితోనే ఉంటున్నారు. ప్రతి దీపావళికీ ఇరా తన తండ్రి ఇచ్చే పార్టీకి బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖలతో పాటు ఒక అతిథిగా హాజరువుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె తన పదహారవ యేట ఒక పరిపూర్ణమైన స్త్రీగా ప్రత్యక్షం అవడం అందరినీ ముగ్ధులను చేసింది. -
రైతు సద(తు)స్సు
సాక్షి, నెల్లూరు: ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు తడిసిన దీపావళి టపాసులా తుస్సుమంది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రైతులకు సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. తొలు త సదస్సుకు ఆహ్వానం అందు కున్న రైతులను కాదని జిల్లాకు ఒక్కరికి మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు ప్రారంభానికి ఒక్కరోజు ముందు సంబంధిత అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. మిగిలిన రైతులు హైదరాబాద్ వచ్చినా స్టాల్స్‌కు పరిమితం కావాల్సిందేనని తేల్చారు. పై పెచ్చు సదస్సుకు హాజరయ్యే ఒక్కో రైతు రూ.5000 చొప్పున రుసుం చెల్లించాలని నిబంధనలు పెట్టడం విశేషం. ఏడాదిగా సదస్సుపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఈ ప్రపంచ రైతుసదస్సుపై రైతులు ఆశలు పెంచుకున్నారు. సదస్సు ఉపయోగకరంగా ఉంటుం దని భావించి తప్పక హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. తీరా ఇప్పుడు అక్కర్లేదంటూ అధికారులు ప్రకటించడంతో రైతులు నివ్వెర పోయారు. రైతులకు అవగాహన కల్పించనప్పుడు ప్రపంచ స్థాయి సదస్సు అని ప్రచారం చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థల కోసమే సదస్సు అని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రైతు సదస్సుకు జిల్లా నుంచి 80 మంది రైతులను తీసుకెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. సదస్సులో పాల్గొనే రైతులకు ఐడీ కార్డులు సైతం సిద్ధం చేశారు. ఆరో తేదీన జిల్లా రైతులకు సదస్సు ఉంటుందని ప్రకటించడంతో ఐదో తేదీ రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉంది. తీరా బయల్దేరే ముందు కేవలం ఒకే ఒక్క రైతుకు మాత్రమే సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని ,మిగిలిన రైతులందరూ కేవలం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలకు పరిమితం కావాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. రైతులను అనుమతించనప్పుడు ఆర్భాటంగా ప్రపంచ స్థాయి రైతుసదస్సు జరపడం ఎందుకని జిల్లా రైతుసంఘాల సమాఖ్య నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. -
విషాదం నింపిన బాణసంచా.. చిన్నారులకు గాయాలు
హైదరాబాద్ : దీపావళి సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే 18 మంది చిన్నారులు గాయాలతో వచ్చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. చిచ్చుబుడ్డి పేలకపోవడంతో దగ్గరకి చూసేందుకు చిన్నారి ప్రయత్నించాడు. అనుకోకుండా చిచ్చుబుడ్డి ఒక్కసారిగా పేలడంతో కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క సరోజినీ కంటి ఆసుపత్రికే ఇంత మంది పిల్లలు చికిత్స కోసం రావడంతో ........రాష్ట్రవ్యాప్తంగా గాయపడ్డ చిన్నారుల సంఖ్య వందల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
20 శాతం పెరిగిన కార్డు చెల్లింపులు...
ముంబై: దీపావళి ముందు వారం జరిగిన కొనుగోళ్లలో డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులు 20% పెరి గాయి. సాధారణ వారాంతంతో పోలిస్తే దీపావళి ముందు వారాంతంలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో 20% వృద్ధి నమోదైందని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలందిస్తున్న వరల్డ్‌లైన్ ఇండియా తన నివేదికలో తెలిపింది. దీపావళి వారాంతానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. సౌందర్య సాధనాలు, కళ్లజోళ్లు, పుస్తక విక్రయశాలలు, సెలూన్లలో కార్డు ద్వారా చెల్లింపుల్లో 20 శాతం వృద్ధి కనపడింది. ఇక గృహోపకరణాలు, ఫర్నీషింగ్స్ విభాగాల్లో 30%, దుస్తులు, ఫ్యాషన్ రిటైల్‌లు 22% వృద్ధి కనబర్చాయి. అక్టోబర్ 25-27 మధ్య కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాలు 15-25 శాతం వృద్ధి నమోదు కాగా, ఢిల్లీ ప్రాంతంలో ఇది 24 శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాలు ముంబై, బెంగళూరు కైవసం చేసుకున్నాయి. లావాదేవీల సంఖ ్య 25 లక్షలుంది. -
‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు
ముంబై: స్టాక్ మార్కెట్లో దీపావళి వెలుగులు జిగేల్మన్నాయి. రెండు రోజుల ముందే గత రికార్డును వెనక్కినెట్టి రంకేసిన బుల్.. దీపావళి సందర్భంగా ఆదివారం జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో మరింత దూకుడు ప్రదర్శించింది. ‘సంవత్ 2070’ హిందూ కొత్త సంవత్సరంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ఆరంభించి.. ఆల్‌టైమ్ రికార్డును తాకింది. శుక్రవారం 21,294 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసి(2008 జనవరి ఆల్‌టైమ్ హై 21,207)న బీఎస్ఈ సెన్సెక్స్.. ఆదివారం జరిగిన 75 నిమిషాల(సాయంత్రం 6.15 నుంచి 7.30 వరకూ) ట్రేడింగ్‌లో మరో కొత్త గరిష్టానికి ఎగసింది. ఇంట్రాడేలో 21,322 పాయింట్లను చేరింది. చివరకు గత ముగింపు 21,197 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్లు లాభపడి 21,239 వద్ద స్ధిరపడింది. ముగింపు పరంగా ఇదో కొత్త రికార్డు కావడం గమనార్హం. బీఎస్ఈలోని 13 రంగాల సూచీల్లో 12 సూచీలు 0.1-0.78 శాతం మధ్య లాభాలతో ముగియడం మరో విశేషం. మొత్తం మీద దేశీ స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ లాభాల్లోనే నిలిచాయి. ఆల్‌టైమ్ హైకి అతి చేరువలోకి నిఫ్టీ.... సెన్సెక్స్ కొత్త మైలురాళ్ల దిశగా దూసుకెళ్తుంటే.. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంకా గత రికార్డును ఛేదించేందుకు వెనకాముందూ ఆడుతోంది. ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్‌లో ఒకానొకదశలో నిఫ్టీ 6,343 పాయింట్లను తాకి.. గత రికార్డు(2008 జనవరిలో 6,357)కు అతి చేరువలోకి వచ్చింది. అయితే, చివరకు 10 పాయింట్లు లాభపడి 6,317 వద్ద క్లోజైంది. అయితే, ఇది ఆల్‌టైమ్ హై ముగింపు(గతంలో 2010, నవంబర్ 5న 6,312 పాయింట్లు ఇప్పటిదాకా ఆల్‌టైమ్ హై క్లోజ్) కావడం గమనార్హం. సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 22 లాభపడ్డాయి. ఇక టాటా మోటార్స్ అత్యధికంగా 1.74% పుంజుకోగా, జిందాల్ స్టీల్(1.13%), సన్ ఫార్మా(0.95) మారుతీ(0.86%) ఈ జాబితాలో ఉన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు దీపావళి-బలిప్రతిపదను పురస్కరించుకొని స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్లకు నేడు (సోమవారం) సెలవు ప్రకటించారు. -
పంట పోయిందని..ప్రాణం తీసుకున్నాడు!
తాండూరు రూరల్/బంట్వారం, న్యూస్‌లైన్: అయ్యో.. ఎంత దా‘రుణం’..? దీపావళి శోభ సంతరించుకోవాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. ఇటీవ లి తుపానుకు కోలుకోని విధంగా పంటనష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కలత చెందిన ఆ అన్నదాత పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది తనకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాల నిమిత్తం బుచ్చిరెడ్డి దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఇటీవలి తుపానుకు పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నది. మొక్కజొన్న పాడైపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతు తీవ్ర కలత చెందాడు. తరచూ కుటుంబీకులు, స్థానికులతో వాపోతూ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కూతుళ్లు స్థానికులకు చెప్పారు. వెంటనే 108 వాహనంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి కొద్దిసేపటికే బుచ్చిరెడ్డి ప్రాణం పోయింది. ‘అప్పులే నా మొగుడి ప్రాణాలు తీసుకున్నాయి.. తుపాను రాకుంటే పంట బాగా పండేది.. అప్పులు తీరేవి.., నా భర్త పురుగుమందు తాగకుంటుండే..’ అని మృతుడి భార్య రుక్మిణి రోదించిన తీరు హృదయ విదారకం. బుచ్చిరెడ్డికి కూతుళ్లు కీర్తన(8), దీప (7) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రైతు మృతితో కుటుంబం వీధిన పడిందని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బుచ్చిరెడ్డి మృతితో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. -
దీపావళి శుభాకాంక్షలు
-
దీపావళి సందడే సందడి
వెలుగులు జిమ్మే దీపావళి రానే వచ్చింది. శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. పండుగ సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు తరలివచ్చారు. ధరల మోత మోగినా బాణసంచా వ్యాపారం జోరుగా సాగింది. ప్రజలకు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై: దీపావళిని రాష్ర్ట వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. చెన్నై నగరంలోని టి.నగర్, పురసైవాక్కం, ప్యారిస్, రాయపేట పరిసరాల్లోని అన్ని వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో శుక్రవారం కిటకిటలాడాయి. అన్ని ప్రాంతాలూ సందడి సందడిగా కనిపించాయి. పండుగకు ముందు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చా రు. కొత్త దుస్తులు, పండుగ సామగ్రి కొనుగోళ్లలో మునిగిపోయూరు. మరోవైపు బాణసంచా విక్రయూలు జోరందుకున్నా రుు. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నా జనం వెనకాడలేదు. అలాగే స్వీట్ల దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసారుు. సొంతూళ్లకు పయనం నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో శుక్రవారం కాస్త ట్రాఫిక్ తగ్గింది. అయితే కోయంబేడు బస్టాండ్ పరిసరాల్లో మాత్రం బస్సులతో రోడ్లు కిక్కిరిశాయి. చివరిరోజు సీట్లు దొరికినా, దొరక్కునా స్వగ్రామాలకు జనం పరుగులు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన బస్సుల్లో, ప్రత్యేక రైళ్లలో లక్షలాది మంది తరలి వెళ్లారు. నిఘా కట్టుదిట్టం దీపావళి పర్వదినాన సంఘ విద్రోహశక్తులు రెచ్చిపోవచ్చన్న కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. వాహనాల తనిఖీ చేపట్టింది. అలాగే నగరాల్లోని ప్రధాన కూడళ్లలో 24 గంటలూ షిఫ్ట్‌ల పద్ధతిలో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. చెన్నైలో 15 వేల మంది సిబ్బందిని భద్రతకు దించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో వీరు విధుల్లో ఉంటారు. అవగాహన ప్రమాదరహితంగా బాణసంచా కాల్చే విషయమై అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాల్లో రాకెట్లు, గాల్లో పేలే ఇతర రంగురంగుల బాణసంచా వినియోగించరాదని సూచించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉన్నారుు. అలాగే అనుమతి లేని బాణసంచా దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. పర్యావరణ శాఖ వర్గాలు సైతం రోడ్డెక్కాయి. ఎక్కడెక్కడ కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందో పరిశీలించేందుకు పరికరాలను ఏర్పాటు చేశారుు. తొమ్మిది మంది మృతి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తంజావూరు జిల్లాలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. తంజావూరు జిల్లా కుంబకోణం సమీపంలోని ఓ బాణసంచా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. నేతల శుభాకాంక్షలు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, బీజేపీ జాతీయనేత వెంకయ్య నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకేవాసన్ తదితరులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి రాష్ర్ట ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపాలని రోశయ్య ఆకాంక్షించారు. అందరిలోనూ ఈ పర్వదినాన ప్రేమానురాగాలు వికసించాలని, వెలుగుల దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. దీపావళిని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, నవ్యకాంతులు ప్రతి కుటుంబంలో నిండాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. -
స్పీడ్ పెంచిన విశాల్
చిత్రాల విషయంలో విశాల్ వేగం పెంచారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన చిత్రం పాండియనాడు. లక్ష్మీమీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా శనివారం తెరపైకి వచ్చింది. అలాగే విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యూరు. రజనీకాంత్ నటించిన నాన్ శిగప్పు మనిద్ టైటిల్‌ను విశాల్ తన తాజా చిత్రానికి పెట్టారు. ఈ చిత్రాన్ని యూటీవీ సంస్థతో కలిసి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ చిత్రంలోనూ లక్ష్మీమీనన్‌నే హీరోరుున్. తిరు దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీతో చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్ ఏకధాటిగా నిర్వహించి సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. దర్శకుడు తిరు చెప్పిన కథ విశాల్‌ను బాగా ఆకట్టుకోవడంతో వెంటనే నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు యూటీవీ సంస్థ నిర్వాహకులు ధనుంజయన్ పేర్కొన్నారు. నిర్మాతగా తన రెండో చిత్రమే యూటీవీ సంస్థతో కలిసి చేయడం ఆనందంగా ఉందని విశాల్ పేర్కొన్నారు. ఇది తన కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. తమన్ సంగీతం, రిచర్డ్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. -
80% వరకూ తగ్గిన వొడాఫోన్ డేటా చార్జీలు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా డేటా రేట్లను 80 శాతం వరకూ తగ్గించింది. తమ వినియోగదారులకు ఇది దీపావళి బొనాంజా అని కంపెనీ గురువారం తెలిపింది. ఈ తగ్గింపు రేట్లు దేశవ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచే అమల్లోకి వస్తాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సర్కిళ్లలో 10 కేబీ డేటా చార్జీలను 10 పైసల నుంచి 2 పైసలకు తగ్గించామని పేర్కొంది. ఇప్పుడు ఈ తగ్గింపు రేట్లనే దేశమంతటా అమలు చేస్తామని వివరించింది. ప్రి-పెయిడ్, పోస్ట్-పెయిడ్ వినియోగదారులకు 2జీ నెట్‌వర్క్‌పై పే యాజ్ యు గో ప్రాతిపదికన ఈ తగ్గింపు డేటా చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. వినియోగదారు లు రోమింగ్‌లో ఉన్నప్పటికీ ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని వివరించింది. పే యాజ్ యు గో ఆఫర్లు 2జీ, 3జీ నెట్‌వర్క్‌లకు సంబంధించి దేశంలోనే అత్యంత చౌక ధరలని కంపెనీ పేర్కొంది. సెజ్‌లలో తయారీ ప్లాంట్ల నిబంధనలు సడలింపు న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్) నుంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా వీటిలో తయారీ ప్లాంట్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. భారీ తయారీ యూనిట్లు ఇకపై మూడేళ్ల దాకా పనులను బైటి యూనిట్లకు సబ్-కాంట్రాక్టు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ఇప్పటిదాకా ఈ వ్యవధి ఏడాది కాలం పాటు మాత్రమే ఉంది. నాలుగేళ్లలో కనీసం రెండేళ్ల పాటు సగటున రూ. 1,000 కోట్ల ఎగుమతులు చేసిన తయారీ యూనిట్లకు మాత్రమే తాజా వెసులుబాటు వర్తించనుంది. అలాగే, సదరు యూనిట్లపై ఎటువంటి ఉల్లంఘన ఆరోపణలు, జరిమానాలు ఉండకూడదు. ఇక సబ్‌కాంట్రాక్టు పొందబోయే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ) యూనిట్.. కచ్చితంగా సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండాలి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వల్ల సెజ్‌లు ఆకర్షణ కోల్పోతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంత రించుకుంది. -
పోరుకు సిద్ధమవుతున్న ఎన్సీపీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల తొలి జాబితానూ దీపావళి తరువాత విడుదల చేస్తామని జాతీయవాది కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. పండుగకు ముందే మేనిఫెస్టోను విడుదల చేయాలని అనుకున్నా.. మరింత సమయం అవసరమైనందున వచ్చే నెలలో ప్రకటించాలని భావిస్తున్నామని ఢిల్లీ ఎన్సీపీ అధ్యక్షుడు కన్వర్ ప్రతాప్ సింగ్ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘మొత్తం 70 స్థానాల్లో మేం అభ్యర్థులను నిలబెడతాం. ఒక్కో స్థానంలో పోటీకి దాదాపు ఐదు దరఖాస్తులు వచ్చాయి. సచ్ఛరిత్ర కలిగి ఉండడంతోపాటు అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడైన వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిపతి శరద్ పవార్, ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఆదేశించారు. పోయినసారి కేవలం 15 స్థానాల్లోనే పోటీ చేసినా ఈసారి జాతీయ పార్టీ మాదిరిగానే అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాం’ అని సింగ్ వివరించారు. తమ పార్టీ ఎన్నికల ప్రచారానికి వ్యాపార, మేధోవర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోందని ప్రకటించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విపిన్‌కుమార్ గోయల్, అమర్‌సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌మంచ్ ఢిల్లీశాఖ ప్రధాన కార్యదర్శి భగవతి ప్రసాద్నిషాద్ వంటి ప్రముఖులు ఎన్సీపీలో చేరారని తెలిపారు. ఢిల్లీ ఎన్సీపీ ఉపాధ్యక్షుడిగా గోయల్‌ను నియమించామని వెల్లడించారు. ‘ఎన్సీపీ జెండాపై గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిజానికి అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది’ అని తెలిపారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లే ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలను తీసుకువస్తున్నప్పటికీ రవాణాభారం కిలోకు రూ.25కు మించ దు కాబట్టి కిలో ధర రూ.70 వరకు ఉండాలన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీవ్యాప్తంగా రూ.100 కు కిలో ఉల్లిపాయలు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఉల్లి ధరలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ ముందుగానే హెచ్చరించినా షీలా దీక్షిత్ ప్రభుత్వం పట్టించుకోలేదని కన్వర్ప్రతాప్ సింగ్ విమర్శించారు. -
ఈ దీపావళి ప్రత్యేకం
తనకు ఈ దీపావళి ప్రత్యేకం అంటున్నారు యువ నటుడు కార్తీ. ఆయన హీరోగా నటించిన ఆల్ ఇన్ ఆల్ అళగురాజా దీపావళికి తెరపైకి రానుంది. కార్తీ ఇప్పటికి ఎనిమిది చిత్రాలు చేసినా దీపావళి పర్వదినాన విడుదలవుతున్న తొలి చిత్రం ఆల్ ఇన్ ఆల్ అళగురాజానే. కాజల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం విశేషాల గురించి చిత్ర కార్తీ ఏమన్నారంటే.. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా గురించి చెప్పండి? ఇది నా కెరియర్లో మరచిపోలేని జాయ్‌ఫుల్ చిత్రంగా మిగిలిపోతుంది. నేను దర్శకుడు రాజేష్ కూలంకషంగా చర్చించుకుని గ్రామీణకథకు వెళదామని నిర్ణయించుకుని చేసిన చిత్రమిది. చిత్ర కథ ఎక్కువభాగం అంతా సముద్ర ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఆల్ ఇన్ ఆల్ అనే కేబుల్ టీవీ నడిపే అళగురాజానే హీరో. హీరోకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. తన కేబుల్‌ను సన్‌టీవీకి పోటీగా భావిస్తుంటాడంటే అతని విశ్వాసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాకు తల్లిదండ్రులుగా ప్రభు, శరణ్యా పొన్వన్నన్ నటించారు. స్నేహితుడిగా సంతానం నటించారు. హీరోయిన్ కాజల్ పాత్ర ఎలా ఉంటుంది? చిత్ర దేవిప్రియ చిత్రంలో కాజల్ అగర్వాల్ పేరు ఇది. ఆమె పాత్ర చాలా చలాకీగా వైవిధ్యభరితంగా ఉంటుంది. నటనకూ ఆస్కారం ఉన్న పాత్ర. ఇంతకముందు మేమిద్దరం కలసి ఓ చిత్రంలో నటించాం. అప్పుడు మేమిద్దరం నటనకు కొత్త. నాకది మూడవ చిత్రం. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా ఎనిమిదవ చిత్రం. కాజల్ 30 చిత్రాలకుపైగా నటించింది. ఆ అనుభవం ఆమె నటనలో స్పష్టంగా తెలుస్తోంది. సన్నివేశాల్లో ముందు ఇద్దరం చర్చించుకుని నటించాం. ప్రభుతో నటించడం ఎలాంటి అనుభూతి ఇచ్చింది? ప్రభు గురించి ఏమి చెప్పినా తక్కు వే. ఈ చిత్రంలో నేను ఆయనలా నటించడానికి ఎంత కష్టపడ్డానో. మరొక నటుడితో నటించడం ఎంత కష్టమో నాకిప్పుడు అర్థమైంది. నేను చిన్నతనంలోనే ప్రభు నటన చూశాను. ఈ చిత్రంలో ఆయనతో కలసి నటించడం మరచిపోలేని అనుభవం. చిత్రంలో పాటల చిత్రీకరణకు పచ్చని గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారట? నిజమే. ఈ చిత్రానికి పాటల కోసం ఫారిన్ వెళ్లకూడదని ముందే నిర్ణయించుకున్నాం. మన ఊళ్లలో లేని అందాలా! పొల్లాచ్చి, కుంభకోణం, అం బాసముద్రం ప్రాంతాలను అందంగా తెరపై ఆవిష్కరించాం. సంగీత దర్శకుడు తమన్ చాలా చక్కని బాణీలందించారు. రాజేష్ దర్శకత్వం గురించి వివరించండి? చిత్రాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దడంలో రాజేష్ దిట్ట. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా మొత్తం ఎనిమిది పాత్రల చుట్టూ తిరుగుతుంది. కోటా శ్రీనివాసరావు తనదైన బాణీలో హాస్యాన్ని పండించారు. ఇన్నేళ్లుగా ఎనిమిది చిత్రాలే చేశారేంటి? హీరోగా నేను ఎనిమిది చిత్రాలే చేశాను. ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం కోసం నాకు మూడేళ్లు పట్టింది. ఇలా కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యం జరుగుతుంది. నా చిత్రాల సంఖ్య తగ్గడానికి ఇదీ ఒక కారణం. మొత్తం మీద ఈ దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దీపావళికి తొలిసారిగా నా చిత్రం విడుదలవుతోంది. -
‘కోటా’ కట్!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కిరణ్ సర్కారు అదనపు రేషన్ కోటాకు మంగళం పాడింది. ఏటా పండుగలకు ఇచ్చే ప్రత్యేక సరుకులు ఈ ఏడాది కేటాయించ లేదు. రెగ్యూలర్ కోటాతోనే సరిపెట్టింది. ప్రతీ దసరా, దీపావళికి నెలవారి కోటాతోపాటు చక్కెర, పామాయిల్ సరుకులు అదనంగా పంపిణీ చేసేవారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సరుకులతో ఉపశమనం పొందుతామని భావించిన వినియోగదారులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక కోటా రాలేదని, సాధారణ కోటా పంపిణీ చేయనున్నట్లు సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పండుగలకు ప్రత్యేక కోటా విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్టోబర్ కోటా.. జిల్లాలో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ రేషన్‌కార్డులు 6,74,916 ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డుదారులు 5,68,328 మంది ఉన్నారు. ప్రతినెలా కోటా కింద 1.04 లక్షల క్వింటాళ్ల బియ్యం విడుదల అవుతాయి. అక్టోబర్‌లో పండుగలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాధారణ కోటాను కేటాయిచింది. అమ్మహస్తం పథకం కింద చక్కెర కార్డుకు అరకిలో చొప్పున 3,378.97 క్వింటాళ్లు, 6,75,787 పామాయిల్ ప్యాకెట్లు, గోధుమలు కిలో చొప్పున 6,752.69 క్వింటాళ్లు, గోధుమ పిండి కిలో చొప్పున 6,748.33 క్వింటాళ్లు, కారంపొడి 250 గ్రాముల చొప్పున 6,74,772 ప్యాకెట్లు, పసుపు 100 గ్రాముల చొప్పున 6,75,192 ప్యాకెట్లు, చింతపండు 500 గ్రాముల చొప్పున 6,74,211 ప్యాకెట్లు, ఉప్పు 6,74,211 ప్యాకెట్లు, కందిపప్పు కిలోచొప్పున 6,751.95 క్వింటాళ్లు అక్టోబర్ కోటా కింద విడుదల య్యాయి. ఈ ప్యాకెట్లను తీసుకోవడానికి వినియోగదారులు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా దసరా, దీపావళి పండుగలకు అదనపు రేషన్ సరుకుల కోటా కేటాయించాలని వినియోగదారులు పేర్కొంటున్నారు. మార్కెట్లో ధరలు భగ్గు.. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. రేషన్ అదనంగా సరుకులు ఇచ్చే వారు ఈసారి ఇవ్వడం లేదు. పండుగకు అరకిలో చక్కెర ఏమి సరిపోతోంది. నూనే 2 నుంచి 3 కిలోల వరకు అవసరముంటుంది. మిగతా సమయాల్లో ఎక్కువగా ఇవ్వకున్నా, పండుగలప్పుడు అదనంగా ఇస్తే బాగుంటుంది. - పార్వతీబాయి, కొత్త కరత్వాడ, బోథ్ తినడానికే సరిపోవు.. మా కుటుంబంలో నలుగురమున్నం. ఇద్దరికే రేషన్ వస్తుంది. నెలనెల కంట్రోల్ నుంచి తెచ్చుకున్న సరుకులు తినడానికే సరిపోవు. ఇంకా పండుగులకు ఏమి మిగులుతయి. పండుగలకు కనీసం 4 నుంచి 5 కిలోల వరకు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికైనా రేషన్ ద్వారా పండుగలకు సరిపడా సరుకులు ఇవ్వాలి. - సుమన్‌బాయి, ఇందిరానగర్ కాలనీ, బేల -
పండగకు అదనపు సరుకులు లేనట్టే
భువనగిరి, న్యూస్‌లైన్ దసరా, దీపావళి పండగల సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసరాల వస్తువుల అదనపు కోటా ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఆకాశాన్నంటుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు పండగల వేళ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటల తయారీకి అవసరమైన చక్కెర, మంచినూనె కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో సామాన్యజనం అవస్థలు పడుతున్నారు. అయితే సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అమ్మహస్తం సరుకులు అందడమే లేదు.ప్రతి వినియోగదారుడికి 9 రకాల సరకులను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం జిల్లాలోని లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ సరుకులను సరఫరా చేయలేకపోయింది. కనీసం పండగల వేళ కూడా వారికి అవసరమైన పప్పు,పంచదార, పామోలిన్‌ను అదనంగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇంతవరకు ప్రతి నెలా ఇచ్చే సరుకులనే సరఫరా చేయలేకపోయింది. గతంలో మాదిరిగా అదనపు పంచదారను సరఫరా చేయడానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్కో కార్డుపై ఇస్తున్న అరకిలోకు అదనంగా మరో అర కిలో చక్కెర ఇచ్చేవారు. తెలంగాణ ప్రాంతంలో పెద్దఎత్తున జరుపుకునే దసరా పండగకు, ఆ తర్వాత వచ్చే దీపావళికి అదనపు సరుకులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అయితే గతంలో ప్రభుత్వం దీపావళి పండగకు ఒక్కో రేషన్ కార్డుపై అర కిలో చక్కెరను అదనంగా ఇచ్చే వారు. ఈ సారి మాత్రం అదనం మాట ను అధికారులు మర్చిపోయారు. ఒక వేళ ఇవ్వాలనుకుంటే ఈ పాటికే డీలర్లకు సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేసి అదనపు కోటాకు డీడీలు తీయమని చెప్పేవారు. కాని అలాంటి ఆదేశాలు రాలేదని డీలర్లు చెబుతున్నారు.ఏదేమైనా ప్రధాన పండగలకు అదనపు సరుకుల జాడే లేకుండా పోయింది.