![Festival Offer: Big Discounts On Mobiles Electronic Products On Dasara Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/5/Big-Discounts.jpg.webp?itok=b21Fx3w4)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది సంవత్సరాలుగా 50 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారుల అభిమానం, ఆదరణ, విశ్వాసం గెలుచుకున్న తమ సంస్థ దసరా, దీపావళి సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నట్లు మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్.. బీ న్యూ ప్రకటించింది.
మొబైల్స్ పైనే కాకుండా గృహోపకరణాలపై కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 40 శాతం (రూ. 20,000 వరకూ), యాక్సెసరీస్‌పై 60 శాతం, టీవీలపై రూ. 15,000 వరకూ తగ్గింపును అమలు చేస్తున్నట్లు సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. ఎస్‌బీఐ కార్డ్ ద్వారా జరిగే ప్రతి కొనుగోలుపై 7.5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ తో సహా పలు ఆఫర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బీన్యూ’ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment