‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్‌ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు.
పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్‌ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది.
రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment