
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
(ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!)
ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు.
దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు.
కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్‌రాజ్‌కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!)