Bell
-
గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు
ఆలయంలోని గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(యూపీపీసీబీ) నుంచి నోటీసు వచ్చింది. ఆలయంలోని గంటలు మోగించడం వలన శబ్ధ కాలుష్యం ఏర్పడుతున్నదంటూ యూపీపీసీబీ సదరు సొసైటీకి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గౌర్ సౌందర్య సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీనిని స్పందించిన యూపీపీసీబీ సొసైటీకి నోటీసులు పంపింది.సొసైటీలో నివసిస్తున్న ముదిత్ బన్సల్ జూలై 30న ఈ-మెయిల్ ద్వారా యూపీపీసీబీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న యూపీపీసీబీ అధికారులు ఆలయ గంట కారణంగా కలుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించారు. సొసైటీకి జారీ చేసిన నోటీసులో యూపీపీసీబీ.. శబ్ద కాలుష్య నివారణ నిబంధనలను పాటించాలని, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని సొసైటీని సూచించింది. ఈ నోటీసుపై సమాధానం కూడా కోరింది. కాగా కొందరు ఈ నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని యూపీపీసీబీని కోరుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
10 నిమిషాల వీడియో కాల్.. 400 మంది ఉద్యోగాలు ఊడాయ్
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్లో 400 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్ధిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్‌లో భాగంగా చోటామోటా కంపెనీల నుంచి దిగ్గజ టెక్నాలజీ సంస్థలకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, ఇటీవల జరిగిన బెల్ వర్చువల్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ వందల మందికి లేఫ్స్ నోటీస్ చదివి వినిపించారు. ఈ లేఆఫ్స్‌పై ఆ సంస్థ సీఈఓ స్పందించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలో మార్పులు చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో 4,800 మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తొలగింపుల అంశం జాబ్ మార్కెట్లో చర్చాంశనీయంగా మారింది. -
Ayodhya: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7,000 కిలోల ‘రామ్ హల్వా’ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది. ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంతో వస్తున్న 'బెల్'
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు. దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్రాజ్కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
అయ్యోధ రామ మందిర గంటను చూశారా.. స్పెషల్ ఏంటో తెలుసా?
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఆలయ నిర్మాణం ఎంతో సంతృప్తికరంగా సాగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర తెలిపింది. ఇక, అయోధ్యలో వచ్చే ఏడాది జనవరిలో భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రామ మందిరం కోసం గంటను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మందిరంలోకి అష్టధాతువుతో తయారు చేసిన 2,100 కిలోల గంటను తయారు చేశారు. 6' X 5' పొడువు, వెడెల్పుతో ఉన్న గంటను మందిరంలో ప్రతిష్టించేందుకు ట్యూటికోరిన్ నుంచి అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. కాగా, ఈ గంట స్పెషాలిటీ ఎంటంటే.. ఒక్కసారిగా బెల్‌ను వాయిస్తే గంట శబ్ధం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందట. ఇక, గంటను జేసీబీ సాయంతో అయోధ్యకు తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The 2100 kgs and 6’ X 5’ Bell made of "Ashtadhatu" for Ram Mandir enroute Ayodhya from tuticorin. This Bell can be heard upto 15 kms. pic.twitter.com/6A0rtj3lPj — Megh Updates 🚨™ (@MeghUpdates) February 16, 2023 -
Deepti Sharma: దీప్తి గంట కొట్టింది
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభించే అదృష్టం మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు దక్కింది. లార్డ్స్‌లో జరిగే ప్రతి టెస్టు జరిగే రోజు ఆట ఆరంభానికి సూచికగా గంట మోగించడం ఆనవాయితీ. ఆదివారం భారత ఆల్‌రౌండర్ దీప్తి గంట కొట్టి నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. 23 ఏళ్ల దీప్తి అక్కడ ‘ది హండ్రెడ్’ టోర్నీ లో లార్డ్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న ‘లండన్ స్పిరిట్’ జట్టు తరఫున ఆడుతోంది. ‘క్రికెట్ మక్కా’లో గంట మోగించే గౌరవం లభించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. (చదవండి: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్?) -
బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం
వాషింగ్టన్: ఇటీవల కాలంలో కొన్ని సార్లు స్మశానానికి చేరుకున్న తర్వాతో, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడో సడెన్‌గా మృతదేహాలు లేచి కూర్చుంటున్న ఘటనలు చూశాం. బతికున్న వ్యక్తులను కూడా చనిపోయారని వైద్యులు చెప్పడం వల్లే ఇలా జరుగుతోంది. అయితే ఇలాంటి సంఘటనను ఓ వ్యక్తి వందల ఏళ్ల క్రితమే ఊహించాడు. ఒకవేళ తనను బతికుండానే సమాధి చేస్తే.. ఆ తర్వాత తనకు స్పృహ వస్తే.. ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. ఒకవేళ ఇదే జరిగితే తాను చావలేదని ప్రపంచానికి తెలపడం కోసం ఓ ఆలోచన చేశాడు. దానిలో భాగంగా మరణించడానికి ముందే సమాధి కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా కిటికీ, గంట కూడా పెట్టించుకున్నాడు. చదవడానికి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన డాక్టర్ తిమోతీ క్లార్క్ స్మిత్ అనే వ్యక్తి.. ముందు చూపుతో తన సమాధి తానే కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఒక కిటికీ, గంటను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వేళ బతికుండగానే తనని ఖననం చేస్తే.. అవి పనికొస్తాయని, ప్రాణాలతో ఉంటే ఆ గంటను కొట్టి బయట ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయవచ్చనేది అతడి ఆలోచన. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 18వ శతాబ్దంలో చోటు చేసుకుంది. మరణించడానికి ముందే సమాధిని ఏర్పాటు చేసుకున్న డాక్టర్ తిమోతీ 1893లోనే చనిపోయాడు. ఆ సమాధిలోనే తిమోతీని ఖననం చేశారు. వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆ సమాధి ఇప్పటికి ఇంకా చెక్కుచెదరలేదు. పైగా, ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ విషయం ఓ టిక్‌టాక్ యూజర్ వల్ల మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ విషయాన్ని బాబీకర్టిస్లీ(@bobbiecurtislee) అనే టిక్‌టాక్ యూజర్ ఈ వింత సమాధి గురించి వివరించింది. ‘‘తిమోతీ మరణానికి ముందు తన సమాధికి సంబంధించిన మోడల్ తయారు చేయించుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా పేటెంట్ కూడా తీసుకున్నాడు. మరణించకుండానే తనని ఖననం చేస్తే అప్పుడు సమాధికి ఏర్పాటు చేసిన బెల్, కిటికీలు ఉపయోగపడతాయనేది అతడి ఉద్దేశం’’ అని పేర్కొంది. ఆ తర్వాత తిమోతీని ఆ సమాధిలోనే పెట్టి ఖననం చేశారని ఆమె తెలిపింది. కానీ అతడు ఊహించినట్లు గంట కొట్టి.. సాయం కోరే అవకాశం తిమోతీకి లభించలేదని పేర్కొంది. అయితే, సమాధి లోపల చీకటిగా ఉండటం వల్ల ప్రస్తుతం అతడి శవాన్ని చూడటం కష్టమేనని తెలిపింది. వెర్మాంట్‌లోని న్యూ హెవెన్‌లోని ఎవర్గ్రీన్ స్మశానవాటికలో ఈ సమాధి ఉందని వెల్లడించింది. అయితే అప్పట్లో చాలా మంది ఈ సాంప్రదాయాన్ని పాటించేవారట. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్లు సైతం ఇలా తమకు తోచిన విధంగా సమాధిలో ఏర్పాట్లు చేసుకొనేవారట. ఈజిప్టులోని మమ్మీలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!! -
వామ్మో.. 3,700 కిలోల మహా గంట
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పురాతన ఆలయానికి భారీ గంటను భక్తులు అందించారు. ఏకంగా మూడున్నర క్వింటాళ్ల బరువున్న గంటను ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని మందసార్ జిల్లాలోని పశుపతినాథ్ ఆలయానికి ఆ గంటను బహూకరించారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల విరాళాలు.. సహకారంతో ఈ మహాగంటను ఆలయానికి చేర్చారు. పశుపతినాథ్ ఆలయంలో శివుడు అష్టముఖి లింగాకారంలో ఉంటాడు. అందుకే ప్రసిద్ధి పొందింది. వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి గంటను అందించారు. ఈ మహా గంట ఏకంగా 3,700 కిలోల బరువుతో ఉంది. శ్రీకృష్ణ కామధేను సంస్థ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ మహాగంటను తయారుచేశారు. ఈ గంటను రామేశ్వరం నుంచి ఊరేగింపుగా మధ్యప్రదేశ్‌లోని మాందసర్ వరకు తీసుకెళ్లారు. 2015లో మొదలైన ఈ గంట గతేడాది పూర్తయ్యింది. అనంతరం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఊరేగించి చివరకు పశుపతి నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు. -
రామ మందిరానికి 2.1 టన్నుల గంట
జలేసర్: అయోధ్య రామమందిరంలో ఏర్పాటుకానున్న 2,100 కిలోల బరువుండే గంట తయారీ దాదాపు పూర్తికావచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఈటా జిల్లా జలేసర్ పట్టణానికి చెందిన కళాకారులు ఈ బృహత్తర గంటను తయారు చేశారు. ముస్లిం కళాకారుడు డిజైన్ చేసే ఈ గంటను జలేసర్ మున్సిపల్ కార్పొరేషన్ రామ మందిరానికి కానుకగా అందజేయనుంది. గంట శబ్దం సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందని తయారీదారు దావు దయాళ్ అంటున్నారు. ‘రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అయోధ్య వివాదంలో కక్షిదారుగా ఉన్న నిర్మోహి అఖాడా మమ్మల్ని సంప్రదించింది. 2,100 కిలోల బరువుండే గంటలను తయారు చేయాలని కోరింది. దీనిని దైవ కార్యంగా భావిస్తూ.. దేశంలోని అతిపెద్ద గంటల్లో ఇది ఒకటైన ఈ గంటను మేమే ఎందుకు ఆలయానికి కానుకగా ఇవ్వకూడదని భావించాం’అని జలేసర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వికాస్ మిట్టల్ తెలిపారు. దీనికి రూ.21 లక్షలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అతిపెద్ద గంటల్లో ఒకటి జలేసర్‌కు చెందిన దావు దయాళ్ కుటుంబం నాలుగు తరాలుగా గంటల తయారీ వృత్తిలో కొనసాగుతోంది. 2,100 కిలోల బరువున్న గంటను తయారు చేయడం ఇదే మొదటిసారి. గంటల డిజైనింగ్, పాలిషింగ్, గ్రైండింగ్‌లో ఇక్కడి ముస్లిం పనివారు మంచి నిపుణులు. 2.1 టన్నుల ఈ గంటకు ఇక్బాల్ మిస్త్రీ డిజైన్ చేశారు’అని చెప్పారు. హిందూ, ముస్లిం మతాలకు చెందిన 25 మంది పనివారు రోజుకు 8 గంటల చొప్పున నెలపాటు పనిచేశారు. కంచుతోపాటు బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం, తగరము, ఇనుము, పాదరసం వంటి అష్టధాతువులను ఇందులో వినియోగించాం. ఈ మిశ్రమాన్ని మూసలో నింపడంలో 5 సెకన్లు తేడా వచ్చినా మొత్తం ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది’అని డిజైనర్ ఇక్బాల్ మిస్త్రీ తెలిపారు. -
కొట్టకుండానే మోగుతున్న గంట..
భోపాల్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంలో జూన్ 8 నుంచి దేవాలయాలు ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రార్థనాలయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్లో గల ప్రముఖ ప్రజాపతి ఆలయంలో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. గుడిలో గంటను ముట్టుకోవడం ద్వారా భక్తులకు వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావించారు. దీంతో గంట కొట్టకుండానే మోగేలా ఏర్పాట్లు చేశారు. వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా.. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి చూపించారు. భక్తులు గంట దగ్గరకు వెళ్లగానే సెన్సార్ల సహాయంతో మోగేలా బెల్‌ను రూపొందించారు. దీనికి స్థానిక ముస్లిం వ్యక్తి తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బెల్‌ను ఆవిష్కరించారు. (సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు) దీనిపై ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ‘గుడిలోకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తున్నాం. దానిలో భాగంగానే గంటను ఒకరుతాకిన తరువాత మరోకరు తాకడం మూలంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందే గుర్తించాం. దానికి కూడా స్థానిక వ్యక్తి సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెన్సార్లను ఏర్పాటు చేశాం. భక్తులు గంట దగ్గర వచ్చి నిల్చుంటే చాలు దానంతట అదే మోగుతుంది.’ అని వివరించారు. ఇక ఆలయ అధికారులు వినూత్న ఆలోచనలకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్ కేసులు) -
గంట కొడితే నీళ్లు తాగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మీ పిల్లలు తగినన్ని నీళ్లు తాగుతున్నారా? చాలామంది తల్లిదండ్రులకిది అనుభమవే. నీళ్లు తాగమంటూ పిల్లలకు పదేపదే చెప్పటం, అయినా వారు వినకపోవటం కొత్తేమీ కాదు. స్కూలుకు వాటర్ బాటిల్ తీసుకెళ్లినవారు మూత కూడా తీయకుండా ఇంటికి తిరిగి తెచ్చేయటం తెలియని విషయమూ కాదు. ఈ సంగతి గ్రహించే కేరళ స్కూళ్లు ఓ చిట్కా కనిపెట్టాయి. ఆ చిట్కా పేరే... ‘గంట’కు గుక్కెడు నీళ్లు. విద్యార్థులకు ‘వాటర్ బెల్’ విరామమన్న మాట. స్కూల్ సమయంలో ప్రత్యేకంగా గంట కొట్టి విద్యార్థులతో నీటిని తాగించటమే ఈ చిట్కా. రోజులో మూడుసార్లు విద్యార్థులు నీళ్లు తాగేందుకే ప్రత్యేకంగా ‘వాటర్ బెల్’ మోగిస్తున్నారు. కేరళలో ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం కర్ణాటకకూ పాకింది. గంట కొట్టి మరీ నీటిని తాగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలనేది తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండు కూడా!!. -
భెల్‌కు భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం, భెల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లు సాధించింది. అంతకు ముందటి ఆర్డర్లతో పోల్చితే ఇది 74 శాతం అధికమని భెల్ సీఎమ్‌డీ అతుల్ సోబ్తి తెలిపారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి తమ ఆర్డర్ల బుక్ విలువ రూ.1,18,000 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్) సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 152 శాతం పెరిగిందని సోబ్తి తెలిపారు. ఇక నికర లాభం రూ.496 కోట్ల నుంచి 63 శాతం వృద్ధితో రూ.807 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 91 శాతం డివిడెండ్ ప్రకటించామని, గత నాలుగేళ్లలో ఇదే అత్యధికమన్నారు. -
ఆ గౌరవం కపిల్దేవ్కే!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తరహాలో భారత్‌లోని ఈడెన్ గార్డెన్లో అమర్చిన గంటను ముందుగా కొట్టబోయే గౌరవం మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ దక్కనుంది. ఈ మేరకు కపిల్ దేవ్ కు ఆహ్వానం పంపినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నగరంలోని ఈడెన్‌లో జరుగనున్న రెండో టెస్టును గంటను కొట్టిన తరువాత ఆరంభించనున్నట్లు క్యాబ్ జాయింట్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. 'ఇలా కపిల్ దేవ్ తో గంటను కొట్టించాలనేది క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ ఆలోచన. ఈ విషయాన్ని తెలుపుతూ కపిల్ కు ఆహ్వానం కూడా పంపాం. అందుకు ఆయన అంగీకరించారు' అని అవిషేక్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్‌ను ఆరంభిస్తారు. ఇందుకు పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తి కనబరచడంతో గత కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడనుంది. న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో్ టెస్టు ఈ నెల 30వ తేదీన ఆరంభం కానుంది. -
మీకు నో ఎంట్రీ
వైఎస్సార్ సీపీ స్థానిక ప్రజాప్రతినిధులపై వివక్ష బెల్ శంకుస్థాపనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధం పామర్రు : నెమ్మలూరులో సోమవారం బెల్ కంపెనీకి శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. సభ వద్దకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభ ముగిసే వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు... బెల్ కంపెనీకి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతోపాటు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వెళ్లారు. సభ వద్దకు ఎమ్మెల్యే కారును మాత్రమే అనుమతించారు. మిగిలిన ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాము ప్రజా ప్రతినిధులమని, గుర్తింపు కార్డులను కూడా చూపించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ‘వైఎస్సార్ సీపీ నాయకులను లోపలికి పంపవద్దని మాకు పై అధికారులు జారీ చేశారు..’ అని చెప్పారు. ఎవరు చెప్పారని ఎంపీపీ ప్రశ్నించగా... ‘మీకు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని ఓ ఎస్ఐ దుర్భాషలాడారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లారీలో ఎక్కించి పామర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో చాలాసేపు వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు స్టేషన్లోనే ఉంచారు. నెమ్మలూరులో సభ పూర్తయిన తర్వాత స్టేషన్ నుంచి పంపారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాక్షస రాజ్యమా.. అని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధిని అయిన తనను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. టీడీపీ నాయకుల కక్షసాధింపు చర్యలకు ఈ ఘటన నిదర్శనమన్నారు. పోలీసులు నిర్భంధించిన వారిలో కొండిపర్రు ఎంపీటీసీ సభ్యుడు బీవీ రాఘవులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోర్ల రామచంద్రరావు, పార్టీ నాయకులు సోలే నాగరాజు, పూర్ణచంద్రరావు, గోగం రామారావు, బొప్పూడి సురేష్‌బాబు తదితరులు ఉన్నారు. -
ఇక ఈడెన్‌లో 'గంట' మోగనుంది!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్‌ను ఆరంభిస్తారు. ఇందుకు పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మనసు పడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ.. త్వరలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో లార్డ్స్ తరహా బెల్ ను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టాడు. వచ్చే సెప్టెంబర్‌లో ఈడెన్ గార్డెన్ గంటను ఏర్పాటు చేయబోతున్నట్లు శనివారం స్పష్టం చేశాడు. 'అవును.. లార్డ్స్ తరహా గంటను ఈడెన్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. మ్యాచ్ జరిగే ప్రతీ రోజూ ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు గంటతో మ్యాచ్ ను ఆరంభిస్తారు. ఇప్పటికే గంటను కొనుగోలు చేశాం. సెప్టెంబర్‌లో అమర్చడానికి యత్నిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గంగూలీ గంట కొట్టి మ్యాచ్‌ను ప్రారంభించాడు. -
గంటల గుడి
గంటలు... గంటలు... ఎటు చూస్తే అటు గంటలు... ఆలయాల్లో భక్తులు మోగించడానికి, హారతులిచ్చేటప్పుడు పూజారులు మోగించడానికి అవసరానికి తగిన గంటలు ఉండటం ఎక్కడైనా మామూలే. ఆ ఆలయంలో మాత్రం అడుగుపెట్టగానే గంటలే కనిపిస్తాయి. పరిసరాలను పరికిస్తే, నలువైపులా గంటల గుత్తులే దర్శనమిస్తాయి. పిడికిట్లో ఇమిడిపోయే పరిమాణంలోనివి కొన్ని... నలుగురి నెత్తికి నీడనిచ్చేంత భారీసైజులోనివి ఇంకొన్ని... యాభై గ్రాముల నుంచి యాభై కిలోల బరువు గల రకరకాల గంటలు చూపరులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి. ఇక్కడ కనిపించే ఒక్కొక్క గంటదీ ఒక్కొక్క కథ. ప్రతి గంటా ఒక తీరిన కోరికకు ప్రతిరూపం. ఎందుకంటే, కోరిన కోర్కెలు ఈడేరిన తర్వాత భక్తులు వేలాడదీసిన గంటలే ఇవన్నీ. దీని గురించి ఇక్కడి స్థానికులెవరినైనా ప్రశ్నిస్తే ‘మీరూ ఒక కోరిక కోరుకుని వెళ్లండి. మీ కోరిక నెరవేరిన వెంటనే ఎంత బరువైన గంటను కడతామని మొక్కుకుంటారో, అది తీసుకొచ్చి ఇక్కడి మర్రిచెట్టుకు వేలాడగట్టండి’ అని చెబుతారు. పరమేశ్వరుడు కొలువుదీరిన ఈ గంటల గుడి అసోం రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్కడ ఉంటాడీ గంటల దేవుడు? అసోం రాజధాని గువాహటికి 480 కిలోమీటర్ల దూరంలో, దిబ్రూగఢ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తీన్సుకియా పట్టణం. ఇక్కడి తిలింగ ఆలయమే గంటల గుడిగా పేరుపొందింది. ఆలయమంటే గోపురం, గోడలు వగైరాలేవీ ఉండవు. పురాతనమైన మర్రిచెట్టు కింద లింగాకారంలో స్వయంభువుగా వెలసిన శిలనే ఇక్కడ పూజిస్తారు. భక్తులు తలదాచుకోవడానికి వీలుగా చెట్టును ఆనుకునే ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ వెలసిన పరమశివుడు గంటల దేవుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. చుట్టూ తేయాకు తోటలు, నారింజ, నిమ్మ వంటి పండ్లతోటలతో నలువైపులా ఆకుపచ్చని పరిసరాల మధ్య వెలసిన తీన్‌సుకియాలో జనసమ్మర్దం పెద్దగా ఉండదు. గంటల దేవుడి సన్నిధానం వద్ద కూడా ఎలాంటి కోలాహలం కనిపించదు. మైకులు, లౌడ్‌స్పీకర్ల రొదలేని ఇక్కడి వాతావరణం గొప్ప ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి వాణిజ్య సముదాయాలూ, దుకాణాలు ఉండవు. అంతేకాదు, భక్తులను నిలువుదోపిడీ చేసే ఎలాంటి ప్రక్రియా ఇక్కడ కనిపించదు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తూనే ఉంటారు. కోరికలు ఈడేరిన వారు ఇక్కడి మర్రిచెట్టుకు గంటను వేలాడదీసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ఇదీ చరిత్ర పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటారు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొంగుబంగారమైన స్థలమహిమ మర్రిచెట్టు కింద లింగాకారంలో వెలసిన శిల నేల మీద కాకుండా చెట్టు వేళ్ల మీదే ఉన్నట్లు తేయాకు కార్మికులు గుర్తించారు. ఇదేదో మహిమ గలది కావచ్చని భావించారు. తమకు ఏ చిన్న కష్టం వచ్చినా, చెట్టు దగ్గరకు వచ్చి, ఆ రాతితో చెప్పుకొనేవారు. అలా చెప్పుకున్న తర్వాత కష్టాలన్నీ దూదిపింజల్లా తేలిపోవడాన్ని గమనించారు. లింగాకృతిలో ఉండటంతో దీనిని శివలింగంగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఏడాది పాటు గమనించాక, ఈ రాయికి, ఈ ప్రదేశానికి ఏదో మహిమ ఉందని నిర్ధారణకు వచ్చారు. విషయం ఆనోటా ఈనోటా పాకడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు జనాల రాక మొదలైంది. తన కష్టాలు తీరడంతో ఒక భక్తుడు ఈ చెట్టుకు ఇత్తడి గంటను వేలాడదీశాడు. అతడిని చూసి మరికొందరు కూడా తమ కోరికలు తీరగానే ఇలాగే గంటలు వేలాడదీయడం మొదలుపెట్టారు. ఇంకొందరు శివలింగం వద్ద త్రిశూలాలు నాటారు. మరికొందరు పావురాలను తెచ్చి వదలడం మొదలుపెట్టారు. జనాల రాక పెరుగుతూ ఉండటంతో స్థానికులే విరాళాలు పోగుచేసి, ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. సద్దు చేయని గంటలు ‘తిలింగా’ అంటే అస్సామీ భాషలో ‘గంట’ అని అర్థం. అందుకే స్థానికులు ఈ ఆలయాన్ని ‘తిలింగా మందిర్’ అంటారు. లక్షలాదిగా గంటలు వేలాడుతూ కనిపిస్తున్నా, ఇక్కడ ఎలాంటి రణగొణలూ వినిపించవు. ఇక్కడ గాలి తాకిడికి చెట్ల ఆకులు గలగలలాడే చప్పుడు తప్ప మరెలాంటి శబ్దమూ చెవిని సోకదు. విశాలంగా పరచుకున్న మర్రిచెట్లు కొమ్మలకు వేలాడే ఇత్తడి గంటలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటున్నట్లుగా కాకుండా, ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నట్లు కనిపించడం విశేషం. వెలుగులోకి... పదిహేడో శతాబ్దిలో ఈ ప్రాంతం ముత్తక్ రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన అహోం వంశ రాజు స్వర్గదేవ్ సర్వానంద సింఘ కాలంలోనే ఈ మర్రిచెట్టు కింద శివలింగానికి పూజాదికాలు జరిగేవి. స్వర్గదేవ్ సర్వానంద సింఘ, ఆయన మంత్రి గోపీనాథ్ బడబారువాలు ఈ మర్రిచెట్టుకు చేరువలోనే ముక్కోణాకారంలో ఒక చెరువును తవ్వించారు. స్థానికంగా దీనిని ‘తీన్కుణియా పుఖురి’ (ముక్కోణపు చెరువు) అంటా రు. అహోం రాజవంశం అంతరించాక ఇక్కడి మర్రిచెట్టును, శివలింగాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కొన్ని శతాబ్దాల పాటు ఇది మరుగున పడింది. యాభయ్యేళ్ల కిందట ఇక్కడ పనిచేసే తేయాకు కార్మికులు గుర్తించడంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇలా చేరుకోవచ్చు... ♦ సమీప విమానాశ్రయం దిబ్రూగఢ్‌లో ఉంది. దిబ్రూగఢ్ నుంచి తీన్సుకియాకు రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబైల నుంచి దిబ్రూగఢ్ వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి. ♦ జిల్లా కేంద్రమైన తీన్‌సుకియాలో రైల్వే స్టేషన్ ఉంది. బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్, రాజ్ధాని ట్రెయిన్లలో ఇక్కడకు చేరుకోవచ్చు. ♦ తీన్సుకియాకు అసోంలోని అన్ని వైపుల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ♦ అరుదైన వృక్ష జంతుజాతులు సమృద్ధిగా కలిగి ఉన్న తీన్సుకియా జిల్లాకు జీవవైవిధ్య కేంద్రంగా దిబ్రు సైఖోవా నేషనల్ పార్క్ మరో ప్రత్యేక ఆకర్షణ. గంగాప్రాంత డాల్ఫిన్, తెల్లరెక్కల బాతు, స్లో లోరిస్ ఏనుగులు.. వంటి ఎన్నో అంతరించిపోతున్న జంతువులకు ఈ ప్రాంతం నిలయం. మారుత నందన్ కానన్ పార్క్ తిన్సుకియాలోని ప్రసిద్ధ వినోద ఉద్యానవనం. -
గుడిలో సమ్మె గంట
-
గుడిలో సమ్మె గంట
రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగుల నిరసనలు ఆలయాల్లో నిలిచిన ఆర్జిత సేవలు నల్లబ్యాడ్జీలతో విధులకు సిబ్బంది నేటి నుంచి ర్యాలీలు.. ఆందోళన సమ్మె ప్రభావం నామమాత్రమే అంటున్న వ్యతిరేక వర్గం సాక్షి, హైదరాబాద్: తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం వంటి కొన్ని ప్రధాన దేవాలయాల్లో మినహా మిగతా ఆలయాలన్నింటిలో గురువారం ఉదయం నుంచి ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రాతఃకాల సేవలు నిర్వహించి అనంతరం సమ్మె పాటించారు. అలాగే ఆమనగల్లు మైసిగండి సహా పలు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిలిచిపోయాయి. అర్చక సంఘం రెండుగా చీలిన నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘం నేతలు సమ్మె వద్దని వారించినా మిగతా అర్చకులు, ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో ఇది భాగమంటూ జేఏసీ ఇచ్చిన పిలుపునకు ఎక్కువ మంది స్పందించినట్టు తెలుస్తోంది. అయితే నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రధాన దేవాలయాల్లో మాత్రం సమ్మె ఛాయలు పెద్దగా కనిపించలేదు. యాదగిరిగుట్టలో నిత్య కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. కానీ కొన్ని దేవాలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారని, రెండుమూడు రోజుల్లో వారు కూడా సమ్మెలో పాల్గొంటారని జేఏసీ ప్రతినిధి గంగు భానుమూర్తి ప్రకటించారు. మరోవైపు కొన్ని దేవాలయాల్లో మాత్రమే సమ్మె జరిగిందని దానిని వ్యతిరేకిస్తున్న అర్చక సంఘం నేత గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. నల్లబ్యాడ్జీలతో.. గురువారం అర్చకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆలయాలకు వచ్చారు. సాధారణ సేవల అనంతరం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆలయాల ఆవరణలో నినాదాలు చేశారు. శుక్రవారం నుంచి ర్యాలీలు ప్రారంభించబోతున్నారు. అయితే అర్చకుల పట్ల సానుకూలంగా ఉండే సీఎం కేసీఆర్‌ను కొందరు తప్పుడు మాటలతో పక్కదారి పట్టిస్తున్నారని, డిమాండ్ల విషయంలో ఆయన సానుకూలంగానే ఉంటారని అర్చకులు పేర్కొనడం విశేషం. ఇక సమ్మె వల్ల సాధారణ భక్తు లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొక్కులు చెల్లించే వీలు లేకపోవటంతో కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అర్చకులంటే సీఎంకు ప్రేమ: అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమ్మెకు రాజకీయ, ఉద్యోగ సంఘాల నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సమ్మె చేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సంఘీభావం ప్రకటిం చారు. అర్చకులంటే సీఎంకు చాలా ప్రేమ ఉందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ అన్నారు. అర్చకుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. -
బెల్ సెంచరీ: ఇంగ్లండ్ 399
ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 110.4 ఓవర్లలో 399 పరుగులకు ఆలౌటయింది. ఇయాన్ బెల్ (143) సెంచరీ చేశాడు. రూట్ (83), స్టోక్స్ (79) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో రోచ్ 4, టేలర్ మూడు వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు మంగళవారం కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ 32, శ్యామ్యూల్స్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.