తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం వంటి కొన్ని ప్రధాన దేవాలయాల్లో మినహా మిగతా ఆలయాలన్నింటిలో గురువారం ఉదయం నుంచి ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రాతఃకాల సేవలు నిర్వహించి అనంతరం సమ్మె పాటించారు.