గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు | Temple Bell Making Noise, Noida Society Gets Notice | Sakshi
Sakshi News home page

గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు

Published Thu, Aug 22 2024 9:05 AM | Last Updated on Thu, Aug 22 2024 9:35 AM

Temple Bell Making Noise, Noida Society Gets Notice

ఆలయంలోని గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి  ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(యూపీపీసీబీ) నుంచి నోటీసు వచ్చింది. ఆలయంలోని గంటలు మోగించడం వలన శబ్ధ కాలుష్యం ఏర్పడుతున్నదంటూ యూపీపీసీబీ సదరు సొసైటీకి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గౌర్ సౌందర్య సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీనిని స్పందించిన యూపీపీసీబీ సొసైటీకి నోటీసులు పంపింది.

సొసైటీలో నివసిస్తున్న ముదిత్ బన్సల్ జూలై 30న ఈ-మెయిల్ ద్వారా యూపీపీసీబీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న యూపీపీసీబీ అధికారులు ఆలయ గంట కారణంగా కలుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించారు. సొసైటీకి జారీ చేసిన నోటీసులో యూపీపీసీబీ.. శబ్ద కాలుష్య నివారణ నిబంధనలను పాటించాలని, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని సొసైటీని సూచించింది. ఈ నోటీసుపై సమాధానం కూడా కోరింది. కాగా కొందరు ఈ నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని యూపీపీసీబీని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement