Noise
-
Cake Mixing: కేక్స్ మిక్స్..టేస్ట్ అదుర్స్..
డిసెంబర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు క్రిస్మస్ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్‌లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్ డైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్ ఎండ్ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్ మిక్సింగ్పైనే ఈ కథనం.. నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్.. ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్ ఫ్రీ ఈవెంట్స్‌లో భాగంగా కేక్ మిక్సింగ్ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్ మిక్సింగ్‌లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ వివంత వంటి ఫైవ్ స్టార్ హోటల్స్‌తో పాటు ఇతర వేదికల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.సెలిబ్రిటీల సందడి.. నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్ వ్యక్తులను ఈ కేక్ మిక్సింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల డ్రై ఫ్రూట్స్.. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా, కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్ మిక్సింగ్‌లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్ కేక్ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్ కేక్ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ ఫేవరెట్. కేక్ మిక్సింగ్‌లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్‌తో డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఎంజాయ్ చేస్తారు.గ్రేప్ స్టాంపింగ్.. కేక్ మిక్సింగ్‌తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్ స్టాంపింగ్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్ స్టాంపింగ్‌లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్ తయారు చేస్తారు. ఈ వైన్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నూతనోత్సాహం కోసం.. కేక్ మిక్సింగ్ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్ మిక్సింగ్ లో కలిపే డ్రై ఫ్రూట్స్ నట్స్ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. – ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య జరిగిన ఓ కేక్ మిక్సింగ్ వేడుకలో భాగంగా). -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు
ఆలయంలోని గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(యూపీపీసీబీ) నుంచి నోటీసు వచ్చింది. ఆలయంలోని గంటలు మోగించడం వలన శబ్ధ కాలుష్యం ఏర్పడుతున్నదంటూ యూపీపీసీబీ సదరు సొసైటీకి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గౌర్ సౌందర్య సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీనిని స్పందించిన యూపీపీసీబీ సొసైటీకి నోటీసులు పంపింది.సొసైటీలో నివసిస్తున్న ముదిత్ బన్సల్ జూలై 30న ఈ-మెయిల్ ద్వారా యూపీపీసీబీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న యూపీపీసీబీ అధికారులు ఆలయ గంట కారణంగా కలుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించారు. సొసైటీకి జారీ చేసిన నోటీసులో యూపీపీసీబీ.. శబ్ద కాలుష్య నివారణ నిబంధనలను పాటించాలని, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని సొసైటీని సూచించింది. ఈ నోటీసుపై సమాధానం కూడా కోరింది. కాగా కొందరు ఈ నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని యూపీపీసీబీని కోరుతున్నారు. -
Savitha Rao: నిశ్శబ్దానికి రక్షకులు కావాలి
ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.నో హారన్ ప్లీజ్రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.నిశ్శబ్దం మన హక్కు‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.అనారోగ్య మెట్రోలు‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది. -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
బ్రాండ్ వాల్యూ: నాయిస్ మేకర్‌గా కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ
సాక్షి,ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ దూసుకు పోతోంది. స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నోయిస్ కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, విరాట్ కోహ్లీని కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుది. నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ వ్యవహరించ నున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారకర్తగా ఉంటారు. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లిని నోయిస్ మేకర్‌గా స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని నోయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి వ్యాఖ్యానించారు. స్మార్ట్‌వాచ్ డొమైన్లో నాయిస్ ప్రపంచవ్యాప్త అభిమానుల అభిమానంగా మారడానికి టీమిండియా దిగ్గజం విరాట్‌తో జోడీ పనిచేస్తుందన్నారు. పవర్-ప్యాక్డ్ పనితీరును అందించాల్సిన అవసరం తోపాటు, విరాట్‌తో ఇండియా తోపాటు విదేశాలలో ఉన్న యువ ప్రేక్షకులతో తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. It’s official! I am a loud and proud Noisemaker. Stoked to be a part of India’s No. 1* Smartwatch Brand. Keep up with the Noise, kyunki #ShorRukegaNahi! #NoisemakerVirat@gonoise #ad *IDC Worldwide Quarterly Wearable Device Tracker, 3Q22 pic.twitter.com/Ab9jdySU9H — Virat Kohli (@imVkohli) December 2, 2022 ఈ ఒప్పందంపై కోహ్లీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. తానిపుడు అధికారికంగా నోయిస్ మేకర్‌గా మారాననీ, భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో తానూ ఒక భాగమేనని పేర్కొన్నారు. -
విమానాల శబ్దానికి ఇక చెల్లుచీటి!
వాషింగ్టన్: విమానాల నుంచి వచ్చే శబ్దంతో చెవులు చిల్లులు పడుతుంటాయి. ఎయిర్‌పోర్టుల వద్ద నివసించే వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. కానీ ఆ రణగొణ ధ్వని ఇకపై వినిపించదు. ఎందుకంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇందుకోసం నూతన సాంకేతికతను అభివృద్ధి పరిచింది. ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్లైట్ రీసెర్చ్ సెంటర్లో శబ్దం తక్కువగా వచ్చే సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించారు. దీంతో నిశ్శబ్దంగా నడిచే విమానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వస్తున్న శబ్దంలో 70 శాతానికి పైగా తగ్గేందుకు చాలా సాంకేతికతలను వినియోగించాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విమానాశ్రయాల వద్ద నివసించే వారి ఆరోగ్యంపై ప్రభావం పడకుండా విమానాల ల్యాండింగ్ సమయంలో వచ్చే శబ్దాలను తగ్గించడమే నాసా లక్ష్యం అని లాంగ్లీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త మెహదీ ఖొర్రామీ వివరించారు. -
మంచి–చెడు
ఒక రోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియంలోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హాలు నిండా అద్దాలు ఉండటం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్లు బయటపెట్టి అరిచింది. చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేశాయి. మళ్లీ గట్టిగా అరిచింది. అద్దాలలో కూడా అలాగే కనిపించింది. గది ఖాళీగా ఉండటం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్లేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్లు వచ్చి చూసేసరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటినిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు దీని మీద దాడి చేశారు అని కాపలావాళ్లు ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ కుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది. వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది. ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే. అది మనకు మంచి కాని, చెడు కాని చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే ఈ ప్రపంచం అనుకోవాలి. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు. – ఎస్.ఎం. బాషా -
అయ్యాగారికి దండం పెట్టు
ఉదయమే సన్నాయి వాయిద్యాల చప్పుళ్లు.. ఓ వ్యక్తి నోట్లో పీకలు పెట్టుకుని ఊదుతుండగా.. మరో వ్యక్తి డోలు వాయిస్తుంటారు. మరో ఇద్దరు ప్రాణాలను పణంగా పెట్టి ప్రదర్శన ఇస్తుంటారు. గంగిరెద్దు నోట్లో తలపెట్టి.. దాని కాళ్లు తమ దేహంపై ఆనించి.. ఇలా రకరకాలు విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొకరు పొట్టేలతో ఢీకొట్టే ఆటను ఆడుతారు. చూసేవారందరికీ ఇదంతా సంక్రాంతి సందడి. కానీ ఇది గంగిరెద్దుల వాళ్ల జీవితాల్లోని చీకటి జడి. అమ్మగారికి దణ్ణం పెట్టు.. అయ్యగారికి దణ్ణం పెట్టు అంటూ వారు చేసే ప్రదర్శనంతా గుప్పెడు బియ్యానికి.. ఓ ఐదు, పది రూపాయలకి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..బతుకుదెరువు కోసం కాళ్లకు పనిచెప్తున్న ఈ సంచార జీవులు ఈ సంక్రాంతిలోనే ఎక్కువగా కనిపిస్తారు. తర్వాత కూలీ పనులకు వెళ్తారు. గంగిరెద్దులతో సంక్రాంతికి కాంతిని తెచ్చే వారి జీవన చిత్రం. -
సిటీలో స్టార్స్ సందడి
కూకట్పల్లి: బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం కూకట్‌పల్లిలో సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హీరామార్ట్ షాపింగ్ మాల్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీతో కలిసి వారు ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ స్టార్లు కరిష్మా కపూర్, సునీల్‌శెట్టి, టాలీవుడ్ డైరెక్టర్ వి.వి. వినాయక్, అజహరుద్దీన్ పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకురాలు షేక్ మాట్లాడుతూ తమ షోరూంలో జ్యూయలరీ, పెరల్స్, హోమ్ నీడ్స్, ఎలక్టానిక్స్, కిచెన్ వేర్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలుపై ప్రత్యేక రాయతీ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. -
గోకులోత్సావం
-
ఆ శబ్దంతో ప్రమాదమే!
లండన్ః మీరు.. భారీ ట్రాఫిక్ ఉండే రోడ్లకు, రైలు మార్గాలకు దగ్గరలో నివసిస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు పరిశోధకులు. వాహనాలనుంచీ వచ్చే విపరీతమైన శబ్దంవల్ల గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రహదార్లు, రైల్వే ట్రాక్ లు దగ్గరలో నివసించేవారికి ఈ ప్రమాదం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. 65 డెసిబుల్స్ కు పైన ఎప్పుడూ స్థిరంగా ఉండే విమానాల శబ్దంకంటే రైళ్ళు, రోడ్లపై వాహనాలవల్ల వచ్చే ధ్వని.. తీవ్ర సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. ఇటీవల నగరాలు కాలుష్యానికి సాకారాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వాహనాలవల్ల వచ్చే పొగతో అనేక రోగాలు ఉద్భవిస్తుండటంతో ప్రభుత్వాలు నివారణా దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే ట్రాఫిక్ లో వాహనాల వల్ల వచ్చే పొగతోనే కాదు.. శబ్బంతో కూడ ప్రమాదమేనంటున్నారు లండన్ పరిశోధకులు. ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యంతో గుండెజబ్బులు, ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. నిరంతరం ట్రాఫిక్ లో ఉండేవారికి, రైల్వే ట్రాక్ లు, రహదార్లకు దగ్గరలో ఉండేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు. జర్మనీ డ్రెస్ డెన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రియాస్ సైడ్లేర్, ఇతర పరిశోధక బృదం.. ఓ బీమా సంస్థ అందించిన మూల్యాంకనాల్లోని 40 ఏళ్ళ వయసు దాటిన సుమారు 10 లక్షల మందిపై పరిశోధనలు జరిపి, ఈ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. అంతేకాక రైన్ మెయిన్ ప్రాంతంలో రైలు ట్రాక్ లకు, రోడ్లకు సమీపంలో నివస్తున్న వ్యక్తుల వివరాలను.. ట్రాఫిక్ శబ్దాలతో సరిపోల్చి విశ్లేషించారు. 2014/15 మధ్య మరణించినరోగుల్లోనూ అత్యధిక శాతం శబ్దకాలుష్యం కారణంగా గుండెపోటు ప్రమాదంతో చనిపోయినట్లు తేల్చారు. పైగా ఎయిర్ క్రాఫ్ట్ సృష్టించే శబ్ద కాలుష్యం కంటే రోడ్లు, రైలు మార్గాలు తెచ్చే శబ్ద కాలుష్యమే ప్రమాదమని పరిశోధకులు చెప్తున్నారు. తాము జరిపిన అధ్యయనాల వివరాలను పరిశోధకులు డాయిశ్చస్ ఆర్జిటాబ్లాట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తాజా ఫలితాలవల్ల ట్రాఫిక్ శబ్దాలు, గుండెపోటుకు మధ్య అత్యంత దగ్గరి సంబంధం ఉన్నట్లు తేలిందని, ఇకపై ట్రాఫిక్ శబ్దాలను నియంత్రించడం, వాటికి దూరంగా ఉండటంవల్ల గుండెపోటును నివారించవచ్చని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ట్రాఫిక్ శబ్దాలు, ఆరోగ్య పరిణామాలపై యూరప్ వ్యాప్త నోరా (నాయిస్ రిలేటెడ్ యన్నాయన్స్, కాగ్నిషన్, హెల్త్) అధ్యయనాల్లో భాగంగా వారు పరిశోధనలు జరిపినట్లు వివరించారు. -
కొన్ని చప్పుళ్లు వింటే కొందరు పళ్లు నూరుతారు!
మెడిక్షనరీ చప్పరించే శబ్దం వింటే చాలు కొందరికి ఒళ్లు మండిపోతుంది. వారు పళ్లు పరపరా నూరుతుంటారు. కేవలం చప్పరింపులే కాకుండా పెదవులు నాక్కోవడం, గొంతు సవరించుకోవడం, టూత్‌బ్రష్ చప్పుడు చేస్తూ ఉపయోగించడం, విజిల్ వేయడం వంటి కాసేపు పదేపదే కొనసాగే ఈ శబ్దాలు వచ్చినప్పుడల్లా వారిలో కోపం నషాళానికి అంటుతుంటుంది. కొందరికి టైపింగ్ శబ్దాలతోనూ, హమ్ చేస్తున్న చప్పుళ్లతోనూ ఈ కోపం తారస్థాయికి చేరుతుంటుంది. ఇక చెప్పులతో చప్పుడు చేస్తున్నట్లు నడిస్తే... ఆ శబ్దం విన్న కొందరికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంటుంది. దీన్నే సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అని వ్యవహరిస్తుంటారు. వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఇలాంటి ఫీలింగ్ కలగడం దాదాపు సహజమే అయినా శబ్దాల పట్ల తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’కు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఢమాల్...
సాక్షి,బెంగళూరు : ఈ ఏడాది దీపావళి నగరవాసులకు కొంత సంతోషాన్ని, మరి కొంత విచారాన్ని మిగిల్చింది. గత ఏడాదితో పోలిస్తే టపాసులు కాల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా చూపు పోగుట్టుకున్న వారి సంఖ్య చాలా తగ్గింది. అయితే అదే సందర్భంలో శబ్ద కాలుష్యం మాత్రం పెరిగినట్లు కర్ణాటక రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (కేఎస్‌పీసీబీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీపావళి సమయంలో టపాసుల వల్ల ప్రమాదాలకు గురై చాలా సందర్భాల్లో చిన్నారులు గాయపడుతుండటం తెల్సిందే. బెంగళూరు ఇందుకు మినహాయింపు కాదు. అందులోనూ తమిళనాడు సరిహద్దు దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువ పరిమాణంలో టపాసులు తీసుకువచ్చి నగరవాసులు కాల్చేవారు. దీంతో రాష్ట్రంలో మిగిలినపాంతాలతో పోలిస్తే బెంగళూరులో ‘దీపావళి’ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నగరంలోని మింటో ఆస్పత్రిలో ఏకంగా ఒక ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే గత మూడేళ్ల నుంచి ‘ప్రమాద రహిత దీపావళి’ గురించి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై అనేక ఎన్జీఓలు సమాచారాన్ని అందజేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా దీపావళికి రెండు రోజుల ముందు నుంచే విద్యార్థుల్లో సేఫ్ దీపావళి ఆవశ్యకతను తెలియజెప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందని చెప్పవచ్చు. గత ఏడాది దీపావళి సమయంలో టపాసుల పేలుడు వల్ల గాయపడి 60 మంది మింటో ఆస్పత్రిలో చికిత్స పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 31కు తగ్గిపోయింది. ఈ విషయమై ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న నళిని మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందువల్లే ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఈ విషయంపై మరింత అవగాహన పెంచాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. పెరిగిన శబ్ధకాలుష్యం... రాత్రి పదిగంటల తర్వాత టపాసులు కాల్చరాదని సుప్రీం కోర్టు 2005లోనే ఆదేశిచింది. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఆ ఆదేశాలను పాటిస్తున్న దాఖలాలు లేవు. అర్ధరాత్రి వరకూ టపాసుల మోతతో నగరం దద్దరిల్లుతూనే ఉంది. టపాసుల్లో శబ్ధాన్ని సృష్టించే రసాయనాలు ఏడాదికేడాది పెంచుతూ పోవడం వల్ల శబ్ధతీవ్రత కూడా అదే రీతిలో పెరుగుతోంది. 2004 నుంచి కేఎస్‌పీసీబీ నగరంలోని ప్రముఖ ప్రాంతాలై వైట్‌ఫీల్డ్, పీణ్యా పరిశ్రామిక వాడలతో సహా పది చోట్ల శబ్ధ, వాయు కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అందులో భాగంగానే దీపావళి రోజున కేఎస్‌పీసీబీలో నమోదైన గణాంకాలను అనుసరించి మొత్తం పది చోట్లా కూడా రాత్రి సమయంలో శబ్ధకాలుష్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఐదు చోట్ల సాధారణ రోజుల్లో పగటి సమయం కంటే శబ్ధకాలుష్యం తక్కువగా ఉండటం కూడా గమనించవచ్చు. ఈ విషయమై కేఎస్‌పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ... పండుగ సెలవు కావడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు తక్కువగా తిరగడం, పీణ్యా వంటి ప్రాంతాల్లో పరిశ్రమల్లో యంత్రాలు పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల శబ్ధకాలుష్యం తగ్గింది. అయితే రాత్రి సమయంలో మాత్రం అన్ని ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పెరగడానికి టాపాసుల పేలుళ్లే కారణం. ఈ శబ్ధకాలుష్యం పరిమాణం గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా పెరిగింది. దీపావళి రోజున నగరం మొత్తం మీద చిన్నపాటి జల్లులు పడ్డాయి. అందువల్ల వాయుకాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.’ అని పేర్కొన్నారు. -
చెవిలో గుయ్‌ఁ మని ఒకటే హోరు..?
నా వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా చెవిలో విపరీతమైన శబ్దం వస్తోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటోంది. వైద్యులను సంప్రదిస్తే నరాల బలహీనత ఉంది అని కొన్ని మందులు ఇచ్చారు. కానీ అంతగా ఫలితం లేదు. ఈ సమస్యతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. నాకు హైబి.పి కూడా ఉంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియచేయగలరు. - ఎస్. వినోద్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్యను‘టినైటస్’ అంటారు. ఇలా చెవిలో శబ్దాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు ఒటోస్ల్కెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. వీటితోపాటుగా వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్తసరఫరా సరిగా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. మీకు అధిక రక్తపోటు ఉందంటున్నారు కాబట్టి వాస్కులర్ సిస్టమ్‌లో లోపాల వలన కూడా మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. మీరు వెంటనే నిపుణులైన ఇ.ఎన్.టి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆడియాలజిస్టునూ, న్యూరాలజిస్టునూ సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా మీకు టినైటస్ ప్రశ్నావళి, లిపిడ్ ప్రొఫైల్, ఎం.ఆర్ఐ (బ్రెయిన్, ఐఎసి) మొదలైన పరీక్షలు (అన్నీ కాని లేదా వీటిలో కొన్ని) అవసరం కావచ్చు. స్వయంగా పరీక్షించిన డాక్టరు సూచన మేరకు చేయించుకున్న పరీక్షల నివేదిక ఆధారంగా మీ సమస్య పట్ల కచ్చితంగా ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ తర్వాత మీకు చికిత్స పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మందులతో నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. చాలామందికి టినైటస్ రీ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు