ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.
మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను
నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.
నో హారన్ ప్లీజ్
రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.
నిశ్శబ్దం మన హక్కు
‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.
అనారోగ్య మెట్రోలు
‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.
చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి
‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.
ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment