social activist
-
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
Savitha Rao: నిశ్శబ్దానికి రక్షకులు కావాలి
ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.నో హారన్ ప్లీజ్రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.నిశ్శబ్దం మన హక్కు‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.అనారోగ్య మెట్రోలు‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది. -
దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్ అంధూరే, శరద్ కలాస్కర్లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్ 2013 ఆగస్ట్ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్ ఆస్పత్రిలో చనిపోయారు. -
సర్వోదయ నేత మురారీ లాల్ కన్నుమూత
గోపేశ్వర్: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్య మాల నేత మురారీ లాల్(91) కన్నుమూశారు. శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మురారీ లాల్ తుదిశ్వాస విడిచారు. చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మురారీ లాల్ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. -
‘లిక్కర్’కు దూరంగా ఉండాలని హెచ్చరించా: అన్నా హజారే
ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఆయన చర్యలే కారణమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. మద్యం పాలసీకి సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించానని అన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మద్యం మనిషి ఆరోగ్యానికి హానికరమని చిన్న పిల్లలకు కూడా తెలుసు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పాను. లిక్కర్ పాలసీని రూపొందించడం మన ఉద్యోగం కాదని వివరించా. అయినా వినలేదు. పాలసీని రూపొందించి అమలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేయకపోతే అరెస్టై ఉండేవారే కాదు. మరింత ఎక్కువ డబ్బు సంపాదించడానికే మద్యం పాలసీని కేజ్రీవాల్ తయారు చేసి ఉంటారు. మద్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన కేజ్రీవాల్ అదే మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అరెస్టు కావడం బాధ కలిగిస్తోంది’’ అని అన్నా హజారే పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దశాబ్దం క్రితం జరిగిన ఉద్యమంలో అన్నా హజరే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
‘నేను మలాలా కాదు.. భారతదేశంలో సురక్షితంగా ఉన్నా’
లండన్: ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రచారాన్ని కశ్మీర్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమంలో యానా మీర్ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్లో తనకు భద్రత, స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్ భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్‌కిట్ సభ్యులు నా దేశంలోని కశ్మీర్‌ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు. I am not a Malala I am free and safe in my homeland #Kashmir, which is part of India I will never need to runaway from my homeland and seek refuge in your country: Yana Mir @MirYanaSY in UK Parliament. #SankalpDiwas pic.twitter.com/3C5k2uAzBZ — Sajid Yousuf Shah (@TheSkandar) February 22, 2024 ‘భారతీయులను మతం ప్రాతిపాదికన చూడటం ఆపేయండి. ఆ ప్రాతిపాదికతో మా దేశాన్ని ముక్కలు చేయటాన్ని మేము అనుమతించం. ఈ ఏడాది ‘సంకల్ప్ దివాస్’ యూకే, పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేకులు.. ప్రపంచ మీడియా, ప్రపంచ మానవ హక్కుల వేదికలపై భారత్‌పై దుష్ప్రచారాన్ని ఆపేయాలని ఆశిస్తున్నా. ఉగ్రవాదం మూలంగా వేలాది కశ్మీరీ తల్లులు తమ పిల్లలను పొగొట్టుకున్నారు. నా కశ్మీరీ సమాజం ఇక నుంచి ప్రశాంతగా జీవించాలనుకుంటుంది. కృతజ్ఞతలు.. జైహింద్.. ’ అని యానా మీర్ తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వార్తలను ప్రచురించవద్దని ఆమె అంతర్జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి ‘డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ప్రతికూల మీడియా కథనాలను ప్రతిఘటిస్తూ డి రాడికలైజేషన్, యువత అభివృద్ధిలో భారత సైన్యం తీసుకుంటున్న చొరవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
బోయిమ్, అవ్వాద్‌లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బరెన్‌బోయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటినాలో జని్మంచిన సంగీత కళాకారుడు బరెన్‌బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు. వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయు«దీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది. -
ప్రశ్నలతో తరచూ వివాదాల్లోకి! చేతన్ అహింస బ్యాక్‌గ్రౌండ్!
ముక్కుసూటిగా మాట్లాడే వైఖరి.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ధైర్యం.. నటుడు చేతన్ కుమార్ సొంతం. కానీ దీనివల్ల ఎన్నో సార్లు విమర్శలు, వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. అయినా వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. భారత క్రికెట్ జట్టులో రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో చేతన్ కుమార్ అలియాస్ చేతన్ అహింస ఎవరనేది ఓసారి చూద్దాం.. అమెరికా నుంచి వచ్చి.. చేతన్ కుమార్ 1983 ఫిబ్రవరి 24న అమెరికాలో జన్మించాడు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వీరు కర్ణాటక నుంచి వలస వెళ్లినవారే! 2005లో యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చేతన్ అక్కడ చదువుకునే సమయంలో కుల, మత, లింగ బేధాల గురించి అధ్యయనం చేశాడు. ఫుల్బ్రైట్ స్కాలర్ అందుకున్న ఇతడు ఈ ప్రాజెక్ట్‌పై మరింత అధ్యయనం చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక సమాజంలో జరుగుతున్న సమస్యలు తనను నిద్ర పోనీయకుండా చేశాయి. ఆ రెండే ఇష్టం చేతన్‌కు రెండే రెండు ఇష్టం.. ఒకటి నటన, రెండు సామాజిక సేవ. 2005లోనే చికాగో వదిలేసి పూర్తిగా ఇండియాకు షిఫ్ట్ అయిన ఇతడు తన కలలను సాకారం చేసుకున్నాడు. ముందుగా మైసూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న ముల్లూరు అనే గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. తర్వాత విస్తారా అనే థియేటర్ గ్రూపులో చేరి నటుడిగా మారాడు. ఇక తన ప్రాజెక్టు కోసం కర్ణాటక అంతా తిరుగుతున్న సమయంలో డైరెక్టర్ కేఎమ్ చైతన్యను కలిశాడు. అతడు చేతన్‌ను హీరోగా పెట్టి ఆ దినగాలు అనే కన్నడ సినిమా చేశాడు. ఇది అగ్ని శ్రీధర్ అనే అండర్ వరల్డ్ డాన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 2007లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. అలా అహింస తోడైంది తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఇతడికి హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఎనిమిది సినిమాలు చేశాక చేతన్ కుమార్ తన పేరు పక్కన అహింస అనే పదాన్ని జోడించాడు. సామాజిక కార్యకర్తగా తన ఆశయాన్ని, లక్ష్యాన్ని తన పేరులో ఇనుమడింపజేసేందుకు చేతన్ కుమార్ అహింసగా మారాడు. లింగాయత్, ఎల్జీబీటీక్యూఐ, దళితులు, ఆదివాసీలు, రైతులు.. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటినుంచో ముందుండి పోరాడుతున్నాడు. తను నమ్మే సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. గర్భిణీల వెంట్రుకలు తినాలట.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు దేనిపైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ చేతన్ మాత్రం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్తాడు. 2017లో అజ్జలు పద్ధతి అనే సాంప్రదాయాన్ని బహష్కరించేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ సాంప్రదాయం ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన గర్భిణీల వెంట్రుకలు, గోళ్లను తక్కువ వర్గానికి చెందినవారు తినాలి. దీన్ని రూపుమాపాలంటూ చేతన్ చేసిన పోరాటం ప్రభుత్వాన్నే కదిలించింది. ఆ సాంప్రదాయన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఎన్నో పోరాటాలు చేశాడు. ఓసారి ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. పలుమార్లు అసందర్భ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలు కూడా అయ్యాడు. పెళ్లిలో అదే స్పెషల్ చేతన్ 2020 ఫిబ్రవరి 2న మేఘ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా అనాథాశ్రమంలో జరిగింది. పెళ్లి పత్రికలు కూడా విభిన్నంగా రూపొందించారు. వాటిని మట్టిలో పాతిపెట్టితే మొలకలు వచ్చేలా వెడ్డింగ్ కార్డ్‌లో విత్తనాన్ని పొందుపరిచారు. ట్రాన్స్‌జెండర్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం విశేషం. చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
Khushi Pandey: ఖుషీతో దిల్ ఖుష్
చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాతయ్య మరణంతో... అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు. దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్స్టాల్ లైట్స్ ఆన్ బైస్కిల్’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు. పాఠాలతో పైసలు సంపాదించి... ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు అండగా... బాలికలకు శానిటరీ ప్యాడ్ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్ సదుపాయం లేని వారికి సోలర్ ల్యాంప్స్ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
నర్గేస్ మొహమ్మదికి నోబెల్ శాంతి అవార్డు.. ఆమె ఏ దేశమంటే?
స్టాక్‌హోమ్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది. వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళ నర్గేస్ మొహమ్మది గెలుచుకున్నారు. కాగా, నర్గేస్ మొహమ్మది.. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇక, ఇరాన్ మహిళల కోసం నర్గేస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు. 2023 #NobelPeacePrize laureate Narges Mohammadi’s brave struggle has come with tremendous personal costs. The Iranian regime has arrested her 13 times, convicted her five times, and sentenced her to a total of 31 years in prison and 154 lashes. Mohammadi is still in prison. pic.twitter.com/ooDEZAVX01 — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇది కూడా చదవండి: జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
అద్భుత మహిళలు, గొప్ప సామాజిక వేత్తలు
-
సుప్రీంకోర్టులో సెతల్వాద్‌కు ఊరట
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్‌పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్‌పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. -
గోద్రా అల్లర్ల కేసు: తీస్తా షెతల్వాద్‌కు ఊరట
అహ్మదాబాద్: గుజరాత్లో 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాద్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశిస్తూ శనివారం గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. తొలుత తీస్తా షెతల్వాద్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారంటూ నమోదైన కేసుపై శనివారం జస్టిస్ నిర్జర్ దేశాయ్ విచారణ జరిపారు. ఈ కేసులో తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని విన్నవిస్తూ షెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 30 రోజుల పాటు స్టే ఇవ్వాలన్న షెతల్వాద్ తరఫు లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు. దీంతో ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట ద్విసభ్య వెకేషన్ ధర్మాసనం విచారణ జరిపింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెతల్వాద్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ బీఆర్ గావై, జసిŠట్స్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ హైకోర్టు ఉత్తర్వుపై వారం రోజులపాటు స్టే విధించింది. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్‌ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్‌క్రాస్, బ్లడ్‌బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్‌క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్‌కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్‌లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్‌లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్‌క్రాస్‌లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్‌లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్‌కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్‌లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్‌కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సామాజిక కార్యకర్త దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌కు చెందిన ఆశా స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్ గౌరీ మిశ్రా(54) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మిశ్రాను గుణుçపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. తనిఖీ చేసిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేసన్ ఐఐసీ నీలాంబర్ జాని వివరాలను ఆదివారం వెల్లడించారు. రోజూ రాత్రి భోజనం అనంతరం గౌరీ మిశ్రా, కొంతమంది మిత్రులు కలిసి సమీపంలోని వంశధార నది వంతెన వద్దకు బైక్‌పై వెళ్లి, కొద్దిసేపు గడిపి తిరిగి వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో అంతా వంతెనకు చేరుకోగా.. మరికొంత సమయం ఉండి వస్తానని మిశ్రా చెప్పడంతో మిగతా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లారు. కొద్ది సేపటికి కొంతమంది దుండగులు బైకుపై వచ్చి, తుపాకీతో అతి సమీపం నుంచి అతనిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దర్యాప్తు ముమ్మరం.. గౌరీ మిశ్రా గత కొన్నాళ్లుగా ఆశా అనే స్వచ్ఛంద సేవాసంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు పాత్రికేయుడిగా పనిచేసిన ఆయన.. డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో పాత్రికేయ వృత్తి వీడారు. ఆశా తరఫున పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ స్థానికంగతా ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఈ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుణుపూర్ పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. హత్యకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా? గిట్టని వారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారా అని అనుమానిస్తున్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టంచేశారు. -
అనర్హత వేటుపడినప్పుడు రండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి.. రెండేళ్ల శిక్ష గనుక పడితే వాళ్ల సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంతో ఈ సెక్షన్ గురించి దేశవ్యాప్త చర్చ కూడా నడిచింది. అయితే.. పీపుల్స్ రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ.. సామాజిక ఉద్యమకారుడు ఆభ మురళిధరన్ సుప్రీంలో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలోనే ఆయన ఈ పిటిషన్ వేయడం గమనార్హం. 1951 చట్టంలోని సెక్షన్ 8లోని సబ్ క్లాజ్ (1) ప్రకారం.. ఎంపీల అనర్హత కోసం నేరాల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా నేరాలను వర్గీకరించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక సెక్షన్‌లోని సబ్ క్లాసులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయనే విషయాన్ని గమనించాలని ఆయన బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే గురువారం ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్థీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది. కానీ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్‌తో మీకు సంబంధం లేదు కదా. ఇది మీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది?. మీకు శిక్ష పడినప్పుడు.. మీపై అనర్హత వేటు పడినప్పుడు అప్పుడు మా దగ్గరకు రండి. ఇప్పుడు మాత్రం పిటిషన్‌ను వెనక్కి తీసుకోండి.. లేదంటే మేమే డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసుల్లో బాధిత వ్యక్తి పిటిషన్లను మాత్రమే మేం వింటాం అని బెంచ్ సున్నితంగా పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో మురళీధరన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇదీ చదవండి: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరులతో అక్కడ అగ్గి -
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
తేల్తుంబ్డే విడుదల
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే (73) ఎట్టకేలకు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. ఆయనకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో ముంబైలోని తలోజ కేంద్ర కారాగారం నుంచి తుంబ్డే విడుదలయ్యారు. ఆయన రెండున్నళ్లుగా జైలులోనే గడిపారు. ఈ కేసులో 16 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. -
లక్షలాది జీవితాలను మార్చిన విప్లవమూర్తి
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా సామాజిక సేవకు తమ జీవితాలను అందించిన అనేకమందిలో ఇలా భట్ లేదా అందరికీ చిరపరిచితమైన ఇలా బెన్ ఒకరు. ఆకాశమే హద్దుగా దేశ భవిష్యత్తు గురించి కలలు కన్న ఇలాబెన్ అహ్మదాబాద్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామి నని గర్వంగా భావించారు. ‘‘జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో కార్మికులకు దగ్గర కావడమే. ఎందుకంటే.. ఈ దేశానికి పునాదు లైన వీరు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవు తున్నారు’’ అనేవారు ఆమె. ఆ కాలపు విద్యార్థి నేత రమేశ్ భట్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇలా బెన్ అతడినే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామి గానూ మారిపోయారు. విద్యాభ్యాసం తరు వాత ఇలా బెన్ మజూర్ మహాజన్ (టెక్స్టైల్ లేబర్ అసోసి యేషన్–టీఎల్‌ఏ)లో చేరిపోగా... రమేశ్ భట్ అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్‌లో చేరారు. మిల్లు వర్కర్ల ట్రేడ్ యూనియన్ అయిన టీఎల్ఏను స్థాపిం చింది అనసూయ సారాభాయ్ అయినప్పటికీ దీని రాజ్యాంగాన్ని రచించింది మాత్రం స్వయంగా మహాత్మా గాంధీ కావడం గమనార్హం. ట్రేడ్ యూనియన్ ప్రాముఖ్యం, నిర్వహణ వంటి అనేక అంశాలను టీఎల్‌ఏ లోనే నేర్చుకున్న ఇలా బెన్ ఇక్కడే మొదటిసారి అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులను కూడా కలిశారు. వారంతా కాయగూరలు అమ్మే, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే, దుస్తులు కుట్టే కష్టజీవులైనప్ప టికీ పేదలుగానే ఉండటం ఆమెలోని ఆలోచనలను తట్టిలేపింది. వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఇలా బెన్ 1972లో ‘సేవా’ సంస్థను ప్రారంభించారు. చిన్నగా మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశం.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్త అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమాలకు ఆధారభూతమైంది. ఒక్కో మహిళా కార్మికురాలు... యూనియన్ కోసం తమ చిన్న చిన్న సంచి ముడులు విప్పి పావలా చొప్పున చెల్లించడం ఇలా బెన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే కేవలం వీరి హక్కుల కోసం పోరాడటమే సరిపోదని ఇలా బెన్ వేగంగా గుర్తించారు. యజమానుల మనసు మార్చే.. మున్సిపాలిటీ, పోలీస్ వంటి వ్యవస్థలు మహిళా కార్మికులను దోచుకోకుండా రక్షించేందుకు తగిన చట్టాలూ అవసరమని భావించారు. ఇజ్రాయెల్ పర్యటనలో సహకార సంఘాలు, ట్రేడ్ యూనియన్ల పనితీరుపై అవగాహన పెంచుకున్న ఇలా బెన్ వాటిని భారత్‌లోనూ స్థాపించే ప్రయత్నం మొదలుపెట్టారు. మహిళా కార్మికులకు తాము పొదుపు చేసుకున్న డబ్బును దాచుకునేందుకు బ్యాంకుల్లాంటి వ్యవస్థలేవీ లేకపోవడం గుర్తించిన ఆమె... వారితో ఓ సహకార బ్యాంకును ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఇదో విప్లవాత్మకమైన చర్యే. ఆలోచనలు, కార్యాచరణ రెండూ అలాగే ఉండేవి. సమాజంలోని అట్టడుగు పేదల జీవితాలు మార్చే ఈ పనులకు ఆమె పెట్టుకున్న పేరు ‘అభివృద్ధికి పోరాటం’. ఇలా బెన్ మార్గాన్ని ఒక్క గుజరాత్‌లోనే కాదు... భారత్‌తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ అనుకరించారు. ఇలా బెన్ ఆలోచనలు ఎంత విప్లవాత్మకంగా ఉండేవంటే.. కొన్ని పనులు చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావనీ, అసలు సమస్య ఆలోచనా ధోరణులు మార్చడంలోనే ఉందనీ ఆమె గుర్తించారు. చట్టాలు, విధానాలు, దృక్పథాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే అసంఘటిత రంగ మహిళా కార్మికుల హక్కుల సాధన సాధ్యమని నమ్మి ఆచరించారు. ఇలా బెన్ కృషికి గుర్తింపు చాలా వేగంగానే రావడం మొదలైంది. 1977లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. ఆ తరువాతి కాలంలో పద్మశ్రీ, పద్మభూషణ్‌లు కూడా! రాజ్యసభ సభ్యు రాలిగా నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలు డాక్టరేట్లతో సత్కరించాయి. నెల్సన్ మండేలా స్థాపించిన అంతర్జాతీయ బృందం ‘ద ఎల్డర్స్’లోనూ ఆమెకు సభ్యత్వం లభించింది. ఇలా బెన్ రాజ్యసభ సభ్యురాలిగా వీధి వ్యాపారులు, ఇళ్లలోంచి పనిచేసేవారి కోసం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆమె కృషి ఫలితంగానే వీధి వ్యాపారుల బిల్లు చట్టమైంది. పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా బెన్ కోరింది ఒక్కటే... అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయమని! 1988లో వీరిపై చేసిన అధ్య యనం ‘శ్రమశక్తి’ పేరుతో విడుదలైంది. శ్రామికులను సంఘటిత పరచడం ఎంత ముఖ్యమైందో ఇలా బెన్‌కు బాగా తెలుసు. అందుకేనేమో... అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన కార్మిక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆమె స్ఫూర్తితో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్, హోమ్ బేస్డ్ వర్కర్స్‌తోపాటు ఇళ్లల్లో పని చేసేవారు, చెత్త ఏరుకునేవారికీ సంఘాలు ఏర్పడ్డాయి. ఇంట ర్నేషనల్ లేబర్ యూనియన్లోనూ ఇలా బెన్ ఇళ్లల్లోంచి పనిచేసుకునే వారి కోసం ఓ సదస్సు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలతో ఆమె ‘వీగో’ పేరుతో ఒక అంత ర్జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇలా బెన్ సాధించిన అతి గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది పేద మహిళా కార్మికుల జీవితాలను మార్చడమే కాదు.. విద్యావంతులు, ప్రొఫెషనల్స్ కూడా ఉద్యమంలో పాల్గొనేలా చేయడం! గత ఏడాది ‘సేవా’ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి. అయితే ఇలా బెన్ మాత్రం అప్పటికి కూడా రానున్న యాభై ఏళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురాగలమో చూడాలన్న ఆశాభావంతోనే ఉండేవారు. రేనానా ఝాబ్వాలా, వ్యాసకర్త ప్రఖ్యాత సామాజిక కార్యకర్త (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
బాబా ఆమ్టే సామాజిక ఉద్యమకారుడు
సామాజిక న్యాయంతో స్థిరంగా కొనసాగే సమాజాన్ని స్వప్నించిన ఈ దార్శనికుడికి ప్రకృతి పైన, సమానత్వం పైన ఎనలేని విశ్వాసం. ప్రతి మనిషీ.. అతడు వికలాంగుడైనా, కుష్టురోగి అయినా వారికి ఒక శక్తినిచ్చే వనరుగా కనిపిస్తారు బాబా ఆమ్టే. ‘‘ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఉదాత్తతను వర్షించే వారే యువత’’ అన్నది బాబా నిర్వచనం. ఆ లక్షణమే ఆయనను వికసిస్తున్న నవతరంతో సాధ్యమైనంత అనుబంధాన్ని పెంచుకోగలిగేలా చేసింది. సోమనాథ్ క్యాంప్‌లో చంద్రాపూర్ వద్ద కుష్టు రోగుల కోసం ఆయన ఏర్పాటు చేసిన ఆనందవన్ ఆశ్రమం యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆయన నెలకొల్పిన హేమల్ కాసా అనే ఆదివాసీల కేంద్రం చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలుగా రూపాంతరం చెందుతాయనడానికి చక్కని నిదర్శనం. మురళీధర్ దేవదాస్ ఆమ్టే వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన మహాత్మాగాంధీ, వినోబా భావేల సిద్ధాంతాలతో పాటు మానవతావాదాన్ని స్థిరంగా విశ్వసించారు. అంతకుమించి ఆయన ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టగల విశిష్ట సామర్థ్యం గల వ్యక్తి. కేవలం మాటలకు పరిమితం కాని ఆచరణ పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసానికి ప్రతిరూపమే ఆయన ఉద్యమం. పంజాబ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు; ముంబైలో, భాగల్పూర్లో అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. బాధితుల తరఫున పోరాటం సాగించారు. భారత్ జోడో అంటూ ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది హృదయాలను కదిలించింది. మానవ జాతిని ముక్కలు చేసే దురాలోచనలను ఎదుర్కొనేందుకు ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిజాయితీగా పిలుపునివ్వడమే అందుకు కారణం. ఆయన వైయక్తిక విషయాల పట్ల కూడా శ్రద్ధ చూపేవారు. తన భార్యను ప్రేమించడమే కాదు, గౌరవించారు. ఆయన కుమారులు వికాస్, ప్రకాష్, కూతుళ్లు, మనవలు అందరూ ఆయన ధార్మిక కృషిలో భాగస్థులైన వారే. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 మహిళాశక్తి) -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
Harsh Mander: హర్ష్ మాండర్, ఈడీ సోదాలు ఎందుకంటే..
మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్ మాండర్(66) ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ తనీఖీలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదంతా కేంద్రం కుట్రగా ఆరోపిస్తూ.. సుమారు 600 మంది ఉద్యమకారులు, మేధావులు.. ఈ దాడుల్ని ఖండిస్తూ సంతకాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు సయ్యద్ హమీద్, ఆర్థికవేత్త జీన్ డ్రెజె, మేధా పాట్కర్ తదితరులు సంతకాలు చేసిన వాళ్లలో ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ హర్ష్ మాండర్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ గురువారం హడావిడిగా తనిఖీలు నిర్వహించింది. మాండర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(CES) మీద ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేపటినట్లు సమాచారం. బెర్లిన్ రాబర్ట్ బోస్చ్ అకాడమీలో జరిగే ఓ కార్యక్రమం కోసం మాండర్ గురువారం జర్మనీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈడీలు సోదాలు నిర్వహించడం విశేషం. మాండర్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ ఏజెన్సీ సోదాలు నిర్వహించగా, దర్యాప్తునకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఈడీ అధికారులు ఇష్టపడలేదు. దక్షిణ ఢిల్లీలోని అడ్చిని, మెహ్రౌలీ, వసంత్ కుంజ్ ప్రాంతాల్లోని మాండర్ ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు సీఈఎస్ ప్రకటించుకుంది. ఉదయం ఉద్యోగుల్ని బయటే ఆపేసి ఈడీ తనిఖీలు కొనసాగించింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది అక్టోబర్‌లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్.. సీఈఎస్ నిర్వహించే రెండు బాలల గృహాలను సందర్శించింది. సక్రమంగా నడిపించకపోవడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది. ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు సీఈఎస్ మీద జువైనల్ జస్టిస్ యాక్ట్ మీద ఓ కేసు, లావాదేవీల అవకతవకలకు సంబంధించి మరో కేసు నమోదు చేశారు. హాట్ న్యూస్: సోనూసూద్‌పై ఐటీ దాడులు -
పొలం వివాదంలో ‘సమాజ సేవకుడు’ దారుణహత్య
రంగంపేట: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి శ్రీనివాస్(37) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి వెంకట్రావు కుమారులకు, సాధనాల ధర్మరాజుకు గ్రామంలోని పొలం సరిహద్దు వద్ద తాటి కట్టవ కారణంగా ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలం సరిహద్దు గురించి ఏలూరి వెంకట్రావు కుమారుడు ఏలూరి శ్రీనివాస్‌కి సాధనాల ధర్మరాజుకి గొడవ జరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఏలూరి శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి వీరభద్రుని గుడి వైపు నడుచుకుంటూ వస్తుండగా సాధనాల ధర్మరాజు, అతని కుమారుడు సాధనాల వీరభద్రరావు అతనిపై దాడి చేశారు. కర్రతో దాడి చేసిన అనంతరం చాకుతో పొడిచాడు. దీంతో శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు 108కి ఫోన్ చేయగా వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ పరీక్షించి చనిపోయినట్టుగా నిర్ధారించారు. మృతుడు చిన్నాన్న ఏలూరి గోపాలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఇన్చార్జి ఎస్సై ఎ.ఫణికుమార్ కేసు నమోదు చేయగా, పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్ ఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నో సమాజ సేవలు దారుణ హత్యకు గురైన ఏలూరి శ్రీనివాస్ మంచి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లోని ప్రయివేటు సిరామిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అమ్మ ఫౌండేషన్ స్థాపించి సుభద్రంపేటలోని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవీ విగ్రహం ఏర్పాటు చేసి ఏటా వసంత పంచమినాడు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు యూనిఫాంలను కూడా అందించేవాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నాలుగు రోజుల కిందట జరిగిన బోనాల ఉత్సవాల్లో శ్రీనివాస్‌ను సత్కరించారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులను చూడటానికి శుక్రవారం రాత్రే గ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌లోనే ఉండిపోయినా ప్రాణాలతో మిగిలేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. శ్రీనివాస్ భార్య విజయలక్ష్మీ, కుమారుడు అక్షయ్ హైదరాబాద్‌లోనే ఉన్నారని ఈ విషయం వారిద్దరికీ ఎలా చెప్పాలని కన్నీరుమున్నీరవుతున్నారు. -
‘అందుకే వారు సీడీలను బయటపెట్టరాదని కోర్టుకు వెళ్లారు’
సాక్షి, మైసూరు: 'రాష్ట్రంలో ఆరుగురు మంత్రుల సీడీలు ఉన్నది నిజం. అందుకే వారు సీడీలను బయటపెట్టరాదని కోర్టుకు వెళ్లారు' అని సామాజిక కార్యకర్త రాజశేఖర ములాలి అన్నారు. శనివారం నాడు ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఆరుమంది మంత్రులతో పాటు మొత్తం 68 మంది తమ వీడియోలను ప్రసారం కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్నట్లు చెప్పారు. కాగా కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీలల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం వీడియో విడుదల చేయగా.. ఇది ఢిల్లీ నుంచే అప్లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ సీడీ కేసులో ఉన్న అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపైకనా సిట్ కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. దీంతో ఇదివరకే ఐదారు మందిని విచారించి సమాచారం సేకరించింది. చదవండి: ఆ యువతి తెలుసు.. ఏ పాపం తెలీదు రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్ -
ఆర్టీఐ కార్యకర్త అంజలికి అంతర్జాతీయ గుర్తింపు
వాషింగ్టన్: భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికా లోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అంజలి భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తిం పు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్ చెప్పారు. అంతర్జాతీయంగా వచ్చే ఇలాంటి గుర్తింపులు తాను చేస్తున్న ఉద్యమానికి స్ఫూర్తినిస్తాయని అమెరికా అవార్డుకి ఎంపికైన అంజలి భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేశారు. -
30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం
‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది. తండ్రి సాయంతో .. ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా. నిషిత తండ్రి గులాబ్ సింగ్ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. పెళ్లికి దాచిన డబ్బు చదువులకు.. అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. -
అగ్నివేశ్‌కు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్ అని సీపీఐ లీడర్ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్‌దాస్ సైతం అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్ మహమూద్ ప్రాచా ప్రశంసించారు. -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్(80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ తెలిపింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని పేర్కొంది. తెలుగువారే.. అగ్నివేశ్ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అగ్నివేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిక్కోలు నివాళి శ్రీకాకుళం, సోంపేట: శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన అగ్నివేశ్ తన ప్రస్థానాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఆయన కన్నుమూతతో సిక్కోలు నివాళి అర్పించింది. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అగ్నివేశ్ సోంపేట, బీల ప్రాంత పరిసర గ్రామాల ప్రజలతో మాట్లాడారు. -
అర్థనగ్నంగా పెయింటింగ్స్.. అరెస్ట్ ఆలస్యం
తిరువనంతపురం : అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయడంలో ఆలస్యం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ రెహనాను అరెస్టు చేయడంలో అధికారి విఫలమయ్యారని తిరువల్లాకు చెందిన న్యాయవాది ఏవీ అరుణ్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రెహనా ఫాతిమా మంచం మీద అర్థనగ్నంగా చిన్నపిల్లలతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవడమే కాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. (అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం) పిటిషనర్ మాట్లాడుతూ.. జూన్ 25న రెహానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న దర్యాప్తు అధికారిని మార్చాలని దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టును షిటిషనర్ కోరారు. తన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన 10 నిమిషాల్లోనే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ ఫాతిమా ఓ వీడియోను అప్లోడ్ చేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఆమె తన వీడియోలో మొత్తం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నట్లు కనిపింస్తోందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. (ఇల్లు ఖాళీ చెయ్) -
సదాఫ్ జాఫర్‌కు బెయిల్
లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళన సందర్భంగా లక్నోలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ ప్రత్యక్ష పాత్ర ఉందని నిరూపించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు విఫలమయ్యారు. దీంతో లక్నో సెషన్స్ కోర్టు శనివారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సదాఫ్ జాఫర్‌తో పాటు మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారపూరి, మరో పదిమందికి బెయిల్ మంజూరు చేస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎస్ఎస్ పాండే ఉత్తర్వులిచ్చారు. రూ. 50 వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని నిందితులను ఆదేశించారు. గత డిసెంబర్ 19న లక్నోలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో వీరందరిని పోలీసులు అరెస్టు చేసి ఐఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. రేపు (ఆదివారం) కోర్టుకు సెలవు కావడంతో సోమవారం వీరందరూ బెయిల్‌పై విడుదల కానున్నారు. సదాఫ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో కోర్టుకు ఆమె తరపు న్యాయవాది హర్జ్యోత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. (నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు: సదాఫ్ జాఫర్) కాగా, జాఫర్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది హర్జ్యోత్ సింగ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను గురువారం విచారించిన అలహాబాద్ హైకోర్టు.. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో ఎస్పీ హోదాలో ఉన్న అధికారితో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కూడా పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
ధన్యజీవి అన్నదాత
-
విరిసీ విరియని మొగ్గలకు ఆలంబన
ఆడపిల్ల పుట్టగానే అందరిలాగే ఆలోచించలేదు ఆ కుటుంబం. ఆమెనూ మగ పిల్లాడితో సమానంగా పెంచి పెద్ద చేసింది. ఉగ్గుపాలతో పాటు సమాజంలోని సమస్యలను కూడా చెబుతూ వచ్చింది. ఆ కుటుంబం నేర్పిన విలువలే ఆమెలో సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనకు పురిగొల్పాయి. తాను చదివిన చదువులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్న తెలివికి చక్కగా వ్యాపారం నడుపుకోవచ్చు. లేదంటే హాయిగా ఇంట్లో కూర్చుని దర్జాగా జీవితం గడపొచ్చు. కానీ అవేమీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. సమాజానికి ఎలాగైనా సేవ చేయాలన్న ఆమె ఆశయమే ‘ఆలంబన’గా రూపుదిద్దుకుంది. తపనే ముందుకు నడిపింది... మానసిక ఎదుగుదల సరిగా లేని ఆటిజం, శారీరక ఎదుగుదల సక్రమంగా లేని దివ్యాంగ బాలలను దివ్యమైన బాలలుగా తీర్చిదిద్దేందుకు 1994లో హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు శ్యామసుందరి. సాధారణ పిల్లలకు పాఠాలు చెబితే సరిపోతుంది. కానీ ఇలాంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. అంతకుమించి ఓపిక ఉండాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సైకాలజీ ఇలా ఎన్నోరకాల అవసరమైన చికిత్సలు అందించి వారిని మామూలు మనుషులను చేసి, వారిని బాగా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తారామె. వారికి అంకితం... తొలుత డాన్‌బాస్కో స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పిల్లలతోపాటు ఆటిజం పిల్లలు, దివ్యాంగ పిల్లలను కూడా చేర్పించుకున్నారు. అయితే సాధారణ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ స్కూల్‌ను పూర్తిగా ఆటిజం, వినికిడిలోపం, దృష్టి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పే బడిగా మార్చేశారామె. వీరు మానసికంగా పరిణితి చెందేందుకు అవసరమైన థెరపీలను అందించేందుకు 15 మంది టీచర్లతో పాటు ఓ సైకాలజిస్ట్, ఫిజియో«థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టులు వస్తుంటారు. ఆమెతోపాటు టీచర్లు, ఆయాలు కూడా ఎంతో ఓపికగా పిల్లలతో మసులు కుంటారు. అన్నం తినడం.. దుస్తులు ధరించడం.. బయటి వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. వంటివాటిపై పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇంటి వద్దనే ఆలంబనగా... మురికి వాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు వారికోసం ప్రతి శనివారం నేరుగా వారి ఇంటికే సిబ్బందితో కలసివెళ్లి పాఠాలు బోధించడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తుంటారు. సీతాఫల్మండి, అడ్డగుట్ట, రాంనగర్, మారేడుపల్లి, బౌద్ధనగర్, బీదర్బస్తీ, పార్సీగుట్ట, అశోక్‌నగర్, చిలకలగూడ, నామాలగుండు, హమాల్ బస్తీ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తుంటారు. ‘సఫల’వంతంగా... ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కష్ట, నష్టాలు, ఇబ్బందులను సమాజానికి తెలియ జేసేందుకు శ్యామ.. మానసిక దివ్యాంగురాలైన షాలిని అనే ఓ అమ్మాయితో ‘సఫల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. దీనికోసం కనీసం మాటలు కూడా రాని స్థితి నుంచి ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌లో తానే మాట్లాడుకునేలా అన్నీ నేర్పించి, నటించేలా చేశారు అమె. ఆటిజంతో బాధపడే వారు లైంగిక వేధింపులకు గురైనపుడు, దాడి జరిగినపుడు ప్రవర్తించిన తీరును ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారు. వరించిన పురస్కారాలు... ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2007లో డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తో సహా ఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారు. వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపు తగ్గించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవితంలో పొందే గొప్ప అవార్డు అంటారామె. – స్వర్ణ ములుగూరి, సాక్షి, హైదరాబాద్ -
కొత్తతరం సిద్ధమైంది
మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం, సాధికారత కోసం విప్లవించిన తొలి తరం మహిళా సామాజిక ఉద్యమకారిణి వసంత కన్నాభిరాన్! ‘చట్టం ఉందంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే’ అంటున్న ఈ ఉద్యమశీలి.. స్వయంశక్తితో పోరాడే ఒక కొత్తతరం సిద్ధమైందనీ.. మున్ముందరి అన్ని మహిళా ఉద్యమాలకు ఈ తరం స్ఫూర్తినివ్వగలదని ఆకాంక్షిస్తున్నారు. వసంత కన్నాభిరాన్ పుట్టింది వెస్ట్ మారేడ్‌పల్లి, ఇప్పుడు ఉంటున్నది ఈస్ట్ మారేడ్‌పల్లి. పూర్తిగా హైదరాబాద్‌తోనే మమేకమైన జీవితం ఆమెది. పాఠశాల విద్య సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్లో. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చదివిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చి రెడ్డి కాలేజ్ (రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్)లో లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించిన తొలితరం మహిళ ఆమె. ఉద్యోగం, ఇల్లు, పిల్లల బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగా మారడానికి దారి తీసిన పరిస్థితులను, మహిళలకూ హక్కులుంటాయని గుర్తించని పితృస్వామ్య సమాజం నుంచి.. మహిళలు తమ హక్కులను సాధించుకుంటున్న నేటి సమాజం వరకు వచ్చిన మార్పులు, ఇప్పటి ‘మీ టూ’ స్వరాలు.. వీటి గురించి వసంత తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మా తాత, చిన్న తాతలు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర వహించారు. మా నానమ్మ పూర్తి సంప్రదాయవాది, ఆమె నిర్ణయించిన సిస్టమ్ ఇంట్లో కొనసాగేది. కానీ ఇంట్లో ఎప్పుడూ సిద్ధాంతపరమైన చర్చలు, మేధోమథనం జరుగుతుండేది. చిన్న తాతలు ఒకరు ఆంగ్లో ఇండియన్ని, ఇంకొకరు మహారాష్ట్ర అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మా ఇంటి చుట్టూ బెంగాలీ, పార్సీ, మరాఠీ వాళ్లు నివసించేవాళ్లు. సమాజాన్ని చూసే దృష్టి కోణం విస్తృతం కావడానికి అవన్నీ కారణమే. అయితే పెళ్లి తర్వాత నేను లెక్చరర్‌గా, కన్నాభిరాన్ న్యాయవాదిగా జీవితాన్ని మొదలుపెట్టాం. అప్పట్లో ఉద్యమాల్లో పాల్గొనాలనే ఆలోచన లేదు. మాకు తెలిసిందల్లా భుక్తి కోసం ఉద్యోగం చేయడమే. మా జీవితం ఈ మలుపు తిరుగుతుందని ఊహించనే లేదు. ఎమర్జెన్సీ మార్చింది ఎమర్జెన్సీకి ముందు రోజుల్లో... అంటే 1969–70లలో పరిస్థితి రాజకీయంగా ఉద్రిక్తంగా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ కార్యకర్తలు వాళ్ల కేసులను వాదించడం గురించి తరచూ కన్నాభిరాన్ని కలిసేవాళ్లు. నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వర్రావులాంటి వాళ్లంతా ఇంటికి వస్తుండేవారు. ఎమర్జెన్సీ వచ్చాక కన్నాభిరాన్ అకస్మాత్తుగా సెంటర్ పాయింట్ అయ్యారు. జ్వాలాముఖి వంటి వాళ్లు అరెస్టయ్యారు. వరవరరావు, గద్దర్, ప్రదీప్, మధుసూదన్ మొదలైన వాళ్లంతా అప్పుడే నాకు పరిచయమయ్యారు. రమా మెల్కోటే, వీణాశతృఘ్న, లలిత మొదలైన వాళ్ల మీద కుట్రకు పాల్పడ్డారనే తప్పుడు కేసులు నమోదయ్యాయి. అప్పుడు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందనిపించింది. టీచింగ్ కొనసాగిస్తూనే మెల్లగా ఉద్యమబాటలో అడుగులు వేశాను. స్టూడెంట్స్ పలకరింపు నవ్వులు నిజానికి నేను టీచింగ్‌లోకి వెళ్లాలనే సంకల్పంతో లెక్చరర్‌గా చేరలేదు. అన్ని ఉద్యోగాల్లాగానే అది కూడా అన్నట్లే చేరాను. పాఠాలు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత టీచింగ్ మీద ప్రేమ పెరిగింది. రెడ్డి కాలేజ్‌లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పిల్లల కోసం 40 శాతం సీట్లు ఉండేవి. వాళ్లు ఎక్కువగా తెలుగు మీడియంలో చేరేవాళ్లు. సబ్జెక్టుని ఇంగ్లిష్ మీడియం క్లాసులో వివరించినంత డెప్త్‌గా తెలుగు మీడియంలో చెప్పడం కుదిరేది కాదు. వాళ్లను ప్రధాన స్రవంతి(భాష పరంగా వెనుకబాటు తనం నుంచి)లో కలిపే వరకు వాళ్ల గ్రహింపుశక్తికి మాత్రమే చెప్పాల్సి వచ్చేది. అయితే సంతోషం ఏమిటంటే... ఆ పిల్లలు మాక్కూడా ఇంగ్లిష్ మీడియం వాళ్లకు చెప్పినంత క్షుణ్ణంగా చెప్పమని అడిగారు. వాళ్లకు విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పడం కోసం నేను పెద్ద ఎక్సర్సైజ్ చేశాననే చెప్పాలి. దాంతో నాలో ట్రాన్స్లేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఒక విషయాన్ని తెలుగులో అనర్గళంగా మాట్లాడటమూ వచ్చేసింది. టీచింగ్‌ని 1985లో వదిలేసినప్పటికీ పర్యటనల్లో ఎక్కడైనా నన్ను చూడగానే నా స్టూడెంట్స్ నవ్వుతూ దగ్గరకు వచ్చేవారు. ఆ నవ్వులోనే వీళ్లు నా దగ్గర చదువుకున్నట్లున్నారని తెలిసిపోయేది. ఇలాంటి అనుభవాలన్నీ పాఠాలు చెప్పిన రోజులను గర్వంగా గుర్తు చేసుకునేట్లు చేస్తుంటాయి. యూఎన్ గుర్తించాకనే... ఐక్యరాజ్యసమితి 1975ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించింది. అప్పటి వరకు మనదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడా మహిళల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిసిందప్పుడే. మన దగ్గర కూడా మార్చి ఎనిమిదవ తేదీన మహిళల గురించి మాట్లాడుకోవడం మొదలైంది. వక్తగా చాలా సమావేశాల్లో ప్రసంగించాను. కానీ నేను చూసి, విని తెలుసుకున్న అంశాలనే మాట్లాడుతున్నాను తప్ప సమాజాన్ని అధ్యయనం చేసిన రచనలు చదవలేదప్పటికి. రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మీటింగ్‌లో ప్రసంగించడానికి ఆహ్వానం వచ్చినప్పుడు నాకు అంత లోతుగా తెలియదని చెప్పాను. ‘నేర్చుకోవడం ఎంత సేపు’ అంటూ ఎమ్వీ రామ్మూర్తి గారు ఐదారు పుస్తకాలు తెచ్చిచ్చారు. అలా పూర్తిస్థాయి సామాజిక ఉద్యమంలోకి వచ్చాను. ఫెమినిస్టు సాహిత్యం చదవడం నన్ను నేను వికసింప చేసుకోవడానికి దోహదం చేసింది. ఒక్కో సంఘటన ఒక్కో పాఠం రమ, వీణ, లలిత, సూజి, రత్నమాల అందరం కలిసి స్త్రీ శక్తి సంఘటన్ ప్రారంభించాం. అప్పటి నుంచి సమాజంలో బాధితులవుతున్న మహిళలకు అండగా నిలిచే ప్రయత్నంలో ఎన్ని నేర్చుకున్నామో చెప్పలేం. మధుర పదహారేళ్లమ్మాయి. పోలీస్ స్టేషన్ టాయిలెట్లో నలుగురు పోలీసులు రేప్ చేశారామెని. తప్పిపోయి దొరికిన ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి ఇంటికి పంపించారు పోలీసులు. ఆ సంఘటన మాకు ఎంత షాక్ అంటే... మనదేశంలో మహిళకు ఎంత న్యాయం జరుగుతుందో అర్థమైంది. ‘ఇలా కూడా జరుగుతుందా అనే సందేహం, ఎందుకు జరగదు; ఇప్పుడు జరిగింది అదేగా’ అని మాలో మేమే అనుకునేవాళ్లం. రమీజాబీ రేప్ కేస్‌తో నగరం అట్టుడిగిపోయింది. మతాలు, వర్గాలకతీతంగా స్పందించారంతా. ముక్తిధర్ కమిషన్ విచారణలో ఎంత విచిత్రాలంటే... ఒక్కొక్క సాక్షి వచ్చి (వాళ్లంతా పోలీసులు అన్ని కేసుల్లోనూ ప్రవేశపెట్టే ఆస్థాన సాక్షులే) రమీజాబీని బురఖా తియ్యమనేవాడు, ముఖం చూసి ‘అవును నేను ఈమెకు డబ్బిచ్చి హోటల్ గదిలో గడిపాను’ అని చెప్పి వెళ్లిపోయేవాడు. అంటే... మన సమాజంలో ఒక మహిళ తన గురించి తాను ఏం చెప్పిందనేది ముఖ్యం కాదు, పదిమంది మగాళ్లు ‘ఆమెతో గడిపాం’ అంటే.. అదే నిజం అంటారు. మేల్ సొసైటీ ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి అదొక ఉదాహరణ. మహిళల కోసం పోరాడాలంటే మహిళా యాక్టివిస్టులందరం న్యాయశాస్త్రం చదవాల్సిన అవసరం ఉందనే మరో విషయం తెలుసుకున్నాం. చట్టం ఉందంటే... చేతిలో ఆయుధం ఉన్నట్లే! పబ్లిక్ డొమైన్, ప్రైవేట్ డొమైన్ అనే తేడా ఉండటం లేదు. ఇంట్లో మామ, బావ, మరుదులు వేధిస్తున్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకునే వాళ్లెందరో. ఇల్లు దాటి బయటకు వెళ్తే స్కూల్ టీచరు, పోలీసులు, ఉద్యోగంలో పై అధికారి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో తలదాచుకున్న అమ్మాయిల మీద వార్డెన్ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా తమ పనుల కోసం ఇతర అధికారుల దగ్గరకు పంపించడం... ఇలా ప్రతి చోటా లైంగిక వేధింపులే ఎదురవుతున్నాయి. స్త్రీ గొప్పతనాన్ని స్తుతించడం ప్రసంగాలకే పరిమితం. ఆచరణలో ఉన్నదంతా స్త్రీని దేహంగా చూసే కరడుగట్టిన భావజాలమే. రాజస్తాన్‌లో బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రయత్నించిన భన్వారీదేవి మీద అగ్రకులస్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ కేసు విచారణలో ఎంతటి అర్ధరహితమైన వాదన విన్నామంటే ‘అప్పర్ క్యాస్ట్ మెన్ వోన్ట్ రేప్ ఎ లోవర్ క్లాస్ వుమన్’ అన్నారు. మహిళను నీ స్థానం ఇదేనని నియంత్రించడానికి ఎప్పుడూ ఆమె మీద లైంగిక దాడినే ఆయుధంగా మార్చుకుంటోంది మగ సమాజం. ఆ పోరాటంతో వచ్చిన విశాఖ జడ్జిమెంట్.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను అరికట్టడానికి కొంతవరకు ఆసరా అవుతోంది. చట్టం వచ్చిన తర్వాత వేధింపులు ఆగిపోయాయా అనే కౌంటర్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది, విశాఖ అయినా, నిర్భయ చట్టం అయినా సరే... వాటికి ముందు లైంగిక దాడులు జరిగాయి, తరవాత కూడా జరుగుతున్నాయి. కానీ చట్టం ఉంటే చేతిలో ఆయుధం ఉన్నట్లే. వేధింపులకు పాల్పడే వాళ్లకి అది హెచ్చరికలా ఉంటుంది, వేధింపులకు గురయ్యే వర్గానికి ధైర్యాన్నిస్తుంది. మహిళల కోసం మహిళలే... వివక్షకు, వేధింపులకు లోనవుతున్న మహిళల కోసం ఎవరో ఒకరు పోరాడాల్సి వచ్చేది. ఇప్పుడు మహిళలు తెలివిమంతులయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయం మీద ‘మీటూ’ అంటూ గళమెత్తగలుగుతున్నారు. కాలం మారిందనడానికి ఇదొక ప్రతీక. కంప్లయింట్ చేస్తే ఉద్యోగం పోతుందేమోననే భయం ఒకప్పుడు నోరు తెరవనిచ్చేది కాదు. ఆ ఉద్యోగాన్ని వదలడానికి సిద్ధమై కంప్లయింట్ చేసినా సరే... ఓల్డ్ బాయ్స్ క్లబ్ మగవాళ్లు ఇలాంటి విషయాలను త్వరగా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆమెకి ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఉద్యోగం ఇవ్వాలంటే బేరం పెడతారు. అలాంటి అవరోధాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమైంది కొత్త తరం. మహిళలు ఇంతకాలం ఓర్చుకున్నారు, సర్దుకుపోయారు, వేధింపులకు భయపడి ఇంట్లో కూర్చున్నారు. పడింది చాలు. ఇక గొంతు పెంచాలి, గొంతు విప్పిన అమ్మాయికి బాసటగా నిలవాలి. ఇప్పుడు మగవాళ్లు... ‘తప్పుడు ఆరోపణలు చేస్తే మా కెరీర్ ఏమైపోవాలి’ అని గొంతు చించుకుంటున్నారు. ‘నా మీద చెయ్యి వేశాడు’ ఒక మహిళ బాధ్యతరహితంగా ఆరోపించదు, ఆరోపించినా అది నూటికి ఒకటికంటే మించదు. ఆ ఒక్కరిని చూపించి 99 అసలైన ఆరోపణలను కొట్టి పారేయాలని చూసే ధోరణిని మార్చుకోవాలని చెబుతున్నాను. తరతరాల అణచివేతను తమకు తాముగా ఛేదించుకోగలిగిన శక్తిని పుంజుకున్నారు మహిళలు. ఇది స్వయంశక్తి ఉద్యమం. ఉద్దేశం నెరవేరే వరకు ఉద్యమించే స్త్రీ శక్తి’’. ఎంత వారలైనా... బుద్ధి మారదా ఢిల్లీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో జెండర్ పాలసీ మీద మాట్లాడినప్పుడు ఓ కొత్త కోణం తెలిసింది. అక్కడి మహిళలతో మాట్లాడినప్పుడు సహోద్యోగులైన మగవాళ్లు తమను అదోలా చూడడం, అసభ్యకరమైన జోకులు వేయడం, తాకడానికి ప్రయత్నించడం వంటి ఇబ్బందులను చెప్పుకొచ్చారు. మగవాళ్లూ ఒక కంప్లైంట్ చేశారు! ఆడవాళ్లు సీట్లో పని చేసుకుంటూ మధ్యలో చేతులు పైకెత్తి జుట్టు సరిచేసుకుని క్లిప్ పెట్టుకుంటుంటారు. అప్పుడు వాళ్ల దేహాకృతి ఎక్స్పోజ్ అవుతుంటుంది, మాకది ఇబ్బంది కలిగిస్తోంది... అన్నారు. వెంటనే ఆ సంస్థ.. ఆడవాళ్లు వాష్‌రూమ్‌లోనే జుట్టు సరి చేసుకోవాలనే నిబంధన పెట్టారు. అయితే మగవాళ్లకు ఎటువంటి నియమావళినీ పెట్టలేదు. ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లలో కూడా తమ ఆలోచనలను అదుపులో పెట్టుకోలేరా అనిపిస్తుంది. – వసంత కన్నాభిరాన్ సామాజిక ఉద్యమకారిణి – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నాగాలాండ్ గాంధీ కన్నుమూత
గువాహటి: నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) ఆదివారం మృతి చెందారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారు. వృద్ధా ప్య సంబంధ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గువాహటిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చనిపోయారు. 1932లో మహారాష్ట్రలో జన్మించిన ఠక్కర్.. తన 23 ఏళ్ల వయసులో నాగాలాండ్‌కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. చుచుయిమ్లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమం’ను స్థాపించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగాలాండ్ గాంధీ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది. -
జెరెమి బెంథాం.. ప్రజెంట్ సార్..
ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.. ఇలాంటి ముఖ్యమైన మీటింగ్‌లకు ఎవరు అటెండ్ అయినా.. కాకున్నా ‘ఈయన’ తప్పనిసరిగా హాజరవుతాడు. ఫొటోలో ఉన్నవాళ్లలో కాస్త తేడాగా కనిపిస్తున్నాడే.. ఆ ఆయనే.. టోపీ పెట్టుకుని.. సరిగ్గా గుర్తుపట్టేశారే.. మనోడు కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్ లెండి.. అందుకే అప్పటి కాలం దుస్తులు.. అయితే.. మీటింగ్‌కు ఠంచనుగా వస్తాడన్న మాటే గానీ.. ఒక్క ముక్క మాట్లాడడు.. ఎవరేమన్నా బదులివ్వడు.. ముఖ్యమైన నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లోనూ పాల్గొనడు.. ఎందుకంటారా? ఎందుకంటే.. మనోడు బతికిలేడు కాబట్టి.. చచ్చి ఇప్పటికే 186 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి.. జెరెమి బెంథాం.. 18వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్త, సామాజిక సంస్కరణల ఉద్యమకారుడు.. అప్పట్లో ఈయనకు చాలా పేరుండేది. భావప్రకటన హక్కు, వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళలకు సమాన హక్కులు, బానిసత్వం రద్దు ఇలా చాలా వాటిపై తన గళాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా.. వాటి కోసం పోరాడేవాడు. అంతేనా.. వన్యప్రాణులకు హక్కులుంటాయని వాదించిన తొలితరం ఉద్యమకారుల్లో జెరెమి ఒకడు. మేధావిగా కీర్తి గడించాడు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 1832లో మరణించాడు. అయితే.. చనిపోయే ముందు అతడో చిత్రమైన వీలునామా రాశాడు.. ఏమిటా వీలునామా? జెరెమి నాస్తికుడు.. పునర్జన్మలు వంటివి నమ్మడు. దీంతో ఖననం చేయొద్దని చెప్పేశాడు. తన మృతదేహం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించి.. చనిపోయిన తర్వాత దాన్ని పరిశోధనల నిమిత్తం వాడుకోవచ్చని చెప్పాడు. అయితే.. తన శరీరాన్ని కోశాక.. అందులోని అస్థిపంజరాన్ని తీసి.. దానికి తానెప్పుడూ ధరించే దుస్తులు వేసి.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టాలని కోరా డు. తన తలను మాత్రం ప్రత్యేక రసాయనాలతో సంరక్షించి.. దానికి తగిలించాలని చెప్పాడు. అయితే.. ఆ సందర్భంగా జరిగిన కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సరిగా సంరక్షించడం వీలు కాలేదు. దీంతో మైనంతో అతడి తలను తయారుచేసి పెట్టారు. అదెలా ఉన్నా.. ఎండుగడ్డితో నింపిన ఆ బొమ్మలో ఉన్న అస్థిపంజరం మాత్రం అప్పటి జెరెమి బెంథాందే కావడం గమనార్హం. స్టోర్ రూమ్‌లో ఉన్న తల ఇంతటితో మనోడి వీలునామా ఆగిందా లేదే.. ఇంకా ఉంది.. అదేంటంటే.. తన మిత్రులు, శిష్యులు నిర్వహించే ముఖ్యమైన పార్టీలు, సమావేశాలకు తనను కూడా తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దీంతో కాలేజీలో జరిగే ప్రతి సమావేశానికి ‘అతడు’ హాజరవుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. కాలేజీ వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్ 100, 150వ వార్షికోత్సవాలప్పుడు జరిగిన ముఖ్యమైన కౌన్సిల్ సమావేశాలకు మాత్రమే అతడు ‘వచ్చాడు’. చివరి సారిగా 2013లో వర్సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రిటైర్మెంట్ సందర్భంగా జరిగిన భేటీకి హాజరయ్యాడు’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. మిగతా టైములో జెరెమి కాలేజ్‌లో ఉన్న ఓ చెక్క బీరువాలో ఉంటాడు. ముఖ్యమైన భేటీ ఉంటే.. కాలేజీ సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్తారు. ఆ మధ్య వరకూ అతడి ఒరిజినల్ తల అతడి కాళ్ల వద్దే ఉండేది. అయితే.. కాలేజీలోని పెంకి కుర్రాళ్లు.. దాన్ని దొంగిలించి.. తిరిగి ఇవ్వడానికి డబ్బులివ్వాలంటూ వర్సిటీ వాళ్లనే బెదిరించేసరికి.. జెరెమి తలను జాగ్రత్తగా స్టోర్ రూంలో దాచిపెట్టారట. ప్రస్తుతం మనోడు.. కాలేజీలోని ఆ చెక్క బీరువాలోనే చెక్క భజన చేస్తున్నాడు.. మరో మీటింగ్‌కు వెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
ప్రజాధనంతో సొంత ప్రచారమా?
సాక్షి, అమరావతి: అడ్వర్టయిజ్మెంట్ల (ప్రకటనలు)కు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ప్రచారం చేసుకుంటున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే విమర్శించారు. పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రజాధనాన్ని పబ్లిసిటీ (ప్రచారం) కోసం ఖర్చు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని వెల్లడించారు. ఎన్నికల ఏడాది కావడంతో మరింత ప్రజాధనం దుర్వినియోగం చేసేలా టీడీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీకి చెందిన సామాజికవేత్త బి.రామకృష్ణంరాజుతో కలిసి సందీప్‌పాండే సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు (యాడ్స్), ప్రచార హోర్డింగ్‌ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మార్గదర్శకాలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి తన విగ్రహాలు తయారు చేయించుకుని ప్రధాన కూడళ్లలో పెట్టుకోవడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని గుర్తు చేశారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాయవతికి మించి సొంత పార్టీ ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రధానమంత్రి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారే తప్ప మోదీ పేరు పెట్టడం లేదని, ఏపీలో మాత్రం ఎన్టీఆర్, చంద్రన్న పేర్లతో పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ప్రకటనలు, హోర్డింగ్‌లు, పబ్లిసిటీని ప్రజాధనంతో చేసుకుంటూ పార్టీకి ఇమేజ్ వచ్చేలా వ్యవహరిస్తున్న తీరు మారాల్సి ఉందన్నారు. చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఏడాదిలోనైనా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ఇమేజ్ పెంచుకునే తరహా ప్రకటనలు, పబ్లిసిటీ మానుకోవాలని హితవు పలికారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు ఇచ్చిందని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. 13/2003, 302/2012(సివిల్)ల రిట్ పిటిషన్లపై 2015 మే 13, ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ♦ ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ ఫొటోలు వాడుకోవడం వరకు ఫర్వాలేదు. ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు వాడకుంటే వారికి బదులు ఆయా ప్రభుత్వ శాఖల మంత్రుల ఫొటోలు వాడుకోవచ్చు. ♦ ప్రజా ప్రయోజనం లేని ప్రకటనలకు ప్రజాధనాన్ని వెచ్చించకూడదు. ♦ఒక వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ, ప్రభుత్వానికిగానీ ప్రచారం కల్పించే విధంగా ఉండరాదు. ♦ ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వాలు అత్యంత జాగరుకతతో వ్యవహరించాలి. ♦ పౌరులకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజెప్పే విధంగా, ప్రభుత్వ వి«ధానాలు, సేవలు, ప్రభుత్వ చొరవతో తీసుకునే కార్యక్రమాలు, ప్రజారోగ్యం, పరిసరాలు, భద్రత మొదలైన విషయాలపై ప్రకటనలు ఉండాలి. ♦ రాజకీయ పార్టీల చిహ్నాలు, గుర్తులు, జెండాలు ప్రభుత్వ ప్రకటనల్లో ప్రదర్శించకూడదు. ♦ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకమైనా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతాయి కాబట్టి పథకాలకు అధికార పార్టీ నాయకుల, వ్యక్తుల పేర్లను పెట్టి కొనసాగించడం సబబుకాదు. ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీలోని అధికార పార్టీ నేతల ప్రచారానికి ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు ఎన్నికల్లో వారి గెలుపుకోసం ఉపయోగించుకునే విధంగా ఉంటున్నాయని సందీప్‌పాండే వివరించారు. రాష్ట్రంలో 30 పథకాలకు ఇమేజ్ పెంచుకునే పేర్లే.. ఏపీలో ఏకంగా 30 పథకాలకు సొంత పార్టీ ఇమేజ్, వ్యక్తుల ఇమేజ్ పెంచుకునేలా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. అన్న, చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లతో పథకాలు, ప్రకటనలు ఇవ్వడం సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. ఎన్టీఆర్ పేరుతో పెన్షన్ పథకం, సుజల స్రవంతి, జలసిరి, విద్యోన్నతి, వైద్యసేవ, వైద్య పరీక్ష, ఆశయం, విదేశీ విద్యాదారణ, ఎన్టీఆర్ గృహనిర్మాణం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. అన్న అమృతహస్తం, అన్న సంజీవిని, అన్న క్యాంటిన్, అన్న దీవెన, అన్న అభయహస్తం పేరుతో ఎన్టీఆర్ పేరు గుర్తొచ్చేలా చేసి పార్టీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రన్న పేరుతో చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న విదేశీ విద్యాదీవెన, విద్యోన్నతి, స్వయం ఉపాధి, సంచార చికిత్స, ఉన్నత విద్యదీపం, తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రైతునేస్తం, భూసార పరీక్షలు, చేయూత, కాపు భవన్లు, డ్రైవర్ల ప్రమాద బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పేర్లతో సొంత ఇమేజ్ పెంచుకుని పార్టీకి మేలు జరిగేలా ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని వారు తప్పుబట్టారు. ఇప్పటికైనా ఈ పథకాలకు ముందున్న ఎన్టీఆర్, అన్న, చంద్రన్న పేర్లు మార్పుచేసి ‘ముఖ్యమంత్రి’ పేరు పెట్టుకోవడం మంచిదని, అలా అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ఏళ్లు అయినా ఈ పథకాలు అదే పేరుతో కొనసాగుతాయని సందీప్‌పాండే, రామకృష్ణంరాజు సూచించారు. -
ప్రాణత్యాగానికైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆయన్ను తీవ్రవాది అన్నారు.. అయినా పోరాటం ఆపలేదు. దేశద్రోహి అన్నారు.. కానీ న్యాయస్థానం నమ్మలేదు. అనుమానించారు.. అవమానించారు.. అడ్డగించారు.. అయినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ఆయన.. సమానత కోసం అహర్నిశలు పోరాడే యోధుడు.. పారదర్శకత కోసం పాటుపడే ధీరుడు.. బెదిరింపులకు భయపడని శూరుడు.. అలాంటి వ్యక్తి ఇపుడు భావితరాల విద్య కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమంటున్నారు. ఆయనే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే..! దేశంలోని చిన్నారులకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యా హక్కు (ఆర్టీఈ) అమలు కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ తన పోరాటం కొనసాగుతుందని సందీప్‌పాండే స్పష్టంచేశారు. అందుకోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పాండే ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి: ఐఐటీలో చదువుకున్నవారంతా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నారు. మీరు మాత్రం అమెరికా వెళ్లి ఇక్కడికొచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు ఎందుకు? పాండే: చిన్నప్పటి నుంచి నేను గాంధేయవాదిని. ఆయన బాటలోనే నడవాలన్నది నా ఆశయం. దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు నేను సాగిస్తున్న ఈ పోరాటం గాంధీ స్ఫూర్తితో మొదలుపెట్టిందే. ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఆలోచన ఎపుడు వచ్చింది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉన్నపుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ సమయంలో గాంధీగారి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. నా మిత్రులు దీపక్‌గుప్తా, శ్రీవాస్తవతో చర్చించి.. ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సంస్థను అక్కడే రిజిస్టర్ చేయించాం. నా మిత్రుల్లో శ్రీవాస్తవ హైదరాబాదీనే! మీరు ఉద్యమబాట పట్టేటపుడు లక్ష్యం చాలా దూరమని, కష్టమని అనిపించలేదా? గాంధీజీ స్ఫూర్తితోనే పోరాటం మొదలుపెట్టాను. కష్టమైనా నష్టమైనా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. సమాచార హక్కు పోరాటం నేపథ్యం ఏంటి? దేశంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు అవగాహన పెంచేందుకే 2008లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఉద్యమాన్ని నిర్వహించాం. మొదట్లో అందరూ అది సాధ్యం కాదన్నారు. కొందరు హేళన చేశారు. మరికొందరు ఇది జరిగే పనేనా అని పెదవి విరిచారు. అయినప్పటికీ అలుపెరుగని పోరాటంతో ముందుకే వెళ్లాం. 2002లో రామన్ మెగసెసె అవార్డు వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు? సంతోషమే, కానీ నేను కేవలం అవార్డు మాత్రమే తీసుకున్నాను. దాంతోపాటు వచ్చిన నగదును వెనక్కి ఇచ్చేశాను. అవార్డు మన కృషికి ఫలితమే అయినప్పటికీ, వాటితోనే సంతృప్తిపడితే అక్కడే ఆగిపోతాం. మీరు అమెరికాను ఉగ్రవాద దేశం అని ఎందుకు అనాల్సి వచ్చింది? నేను మనీలా (ఫిలిప్పీన్స్)లో రామన్ మెగసెసె అవార్డు తీసుకున్నపుడు ఇరాక్‌పై అమెరికా దాడికి దిగింది. ఈ చర్యను మానవతావాదిగా వ్యతిరేకించాను. అందులో భాగంగానే మనీలాలోని అమెరికా ఎంబసీ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నా. ‘అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్’అని నేను పలికిన పదాలు మరుసటిరోజు మీడియాలో కలకలం రేపాయి. ఈ భూమి మీద మొదట మానవ హక్కులకు రక్షణ ఉండాలి. మానవ హక్కులకు రక్షణ కల్పించలేని దేశాన్ని ఏమనాలో అప్పుడు నాకు తెలియలేదు. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ అధికారులు అంత తేలిగ్గా వదిలారా? లేదు.. (నవ్వుతూ) నాపై ప్రతి విమర్శలకు దిగారు. రామన్ మెగసెసె అవార్డుతోపాటు వచ్చిన 50వేల డాలర్లను వెనక్కి ఇవ్వాలని సవాల్ విసిరారు. వెంటనే ఆ చెక్కును అక్కడే ఇచ్చేసి కేవలం అవార్డుతో మాత్రమే ఇండియా వచ్చా. వాళ్లు అంతటితో వదిలారా? లేదు, అమెరికా వెళ్లినపుడు నేను ఉగ్రవాదినని, జాతిద్రోహి అంటూ అమెరికా ప్రభుత్వానికి నాపై కొందరు అతివాదులు ఫిర్యాదు చేశారు. దాంతో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం ఇమిగ్రేషన్‌లో రెండు గంటల పాటు నన్ను ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో ఉండగా నా ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత వదిలేశారు. మీరెప్పుడూ ఖాదీ దుస్తులే ధరిస్తారు.. పైగా ఇస్త్రీ కూడా చేసుకోరు.. నాకు అలాగే ఇష్టం. ఖాదీ బట్టలు వేసుకోవడం వల్ల చేనేతపై ఆధారపడే వారికి ఎంతో కొంత ఉపాధి లభిస్తుందన్న తృప్తి నాకు దక్కుతుంది. మీరు పాలు తాగరని విన్నాం.. నిజమేనా? వాస్తవానికి ఏ పశువు పాలు అయినా... వాటి బిడ్డల కోసమే కదా! అందుకే, వాటి బిడ్డల కడుపులోకి పోవాల్సిన పాలు నా కడుపులో పోసుకోలేను. జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ నేను తీసుకోను. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి కోసం ఢిల్లీ నుంచి ముల్తాన్ వరకు శాంతియాత్ర చేశారు కదా! భయం వేయలేదా? నా యాత్ర 2005 మార్చి 23న ఢిల్లీలో మొదలైంది. వాఘా సరిహద్దు వరకు పాదయాత్రగానే సాగింది. కానీ పాకిస్తాన్లో పాదయాత్రకు ఆ దేశం అనుమతించలేదు. అందుకే మా యాత్రను వాహనంలోకి మార్చాం. ఆ యాత్రకు పాకిస్తానీలు చూపించిన స్పందనను ఎప్పటికీ మరిచిపోలేను. వారు వీధుల్లోకి వచ్చి స్వాగతం పలికారు. చాలామంది భారత్‌తో పాకిస్తాన్ స్నేహం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మిమ్మల్ని మావోయిస్టు అన్నపుడు ఎలా అనిపించింది? కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినంత మాత్రాన మావోయిస్టులంటే ఎలా? వాస్తవానికి మన దేశంలో ఇప్పటికీ పేద ప్రజల పక్షాన పోరాడుతోంది కమ్యూనిస్టులే కదా! మీపై జాతి వ్యతిరేకి అన్న ముద్ర కూడా పడింది కదా! ఆ సమయంలో నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లో నా విద్యార్థులకు నిర్భయ ఘటనపై బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రదర్శిద్దామనుకున్నా. అంతలోనే నన్ను జాతి వ్యతిరేకి అని అరెస్టు చేసి కేసులు పెట్టారు. బీహెచ్‌యూలో ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్ను బలవంతంగా తొలగించారు. కానీ నా మీద మోపిన అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది! సాఫ్ట్ డ్రింక్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి కారణమేంటి? సాఫ్ట్ డ్రింక్‌ల పేరిట మన దేశంలో జలవనరుల దోపిడీ జరుగుతోంది. కోలా–పెప్సీ కంపెనీల తయారీ ప్లాంట్లు ఉన్నచోట భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారింది. ఎవరికీ ప్రయోజనం లేని డ్రింకుల కోసం దేశానికి అన్నంపెట్టే రైతుకు అన్యాయం చేయడం తగదు కదా! అందుకే, దానిపైనా ఉద్యమించా! విద్యా హక్కు చట్టం కోసం పోరాటం ఎంతవరకు వచ్చింది? మనదేశంలో 16 ఏళ్లలోపు ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది 8వ తరగతి వరకే చదువుతున్నారు. వీరిలో 25 శాతం బాల కార్మికులుగా ఉన్నారు. దేశాన్ని నిర్మించే రేపటి పౌరులకు విద్యను అందించడంలో నిర్లక్ష్యం తగదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఉచిత నిర్బంధ విద్యను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని విస్మరించాయి. ఆ చట్టం అమలు కోసం నిరాహారదీక్షచేయడానికి వెనుకాడను. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ గురించి మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాహక్కు చట్టం అమలు దారుణంగా ఉంది. ఇక్కడ విద్యావ్యవస్థను కార్పొరేట్ కల్చర్ శాసిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నిర్వహించడం దారుణం. వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీలైతే వారికి వివిధ ఎంట్రన్స్ టెస్టుల్లో ప్రభుత్వమే కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయా? ఎందుకు రావు? 2015, జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కార్పొరేట్ స్కూలులో పేద విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంతో ఆర్టీఈ అమలు కోసం ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ చట్టం అమలుకు అంగీకరించారు. ఆ సమయంలో నా దీక్షకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. అందుకే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఈ–2009 చట్టం అమలుకు, కార్పొరేట్ విద్య అంతానికి.. కోచింగ్ సెంటర్లు మూయించాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. -
‘కార్పొరేట్లకు తలవంచుతా.. నేనెవర్ని?’
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్(79)పై అల్లరిమూక దాడిచేసిన ఘటనపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నేను దేశంలో శక్తిమంతమైన కార్పొరేట్లకు తలవంచుతాను. బలం, అధికారమే నాకు ముఖ్యం. నేను ప్రజల్లో భయం, విద్వేషం వ్యాప్తిచేసి అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తా. బలహీనుల్ని తొక్కిపడేస్తా. నాకు ఎంతమేరకు ఉపయోగపడతారన్న దాన్ని బట్టే చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తా. నేనెవర్ని?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్వామి అగ్నివేశ్‌పై అల్లరిమూక దాడి వీడియో క్లిప్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. జార్ఖండ్‌లోని పకుర్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేశ్‌పై మంగళవారం దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. బీజేపీ అనుబంధ బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలే తనపై దాడిచేశారని అగ్నివేశ్ ఆరోపించారు. -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. -
ఆధునికతకు అక్షరాది కందుకూరి
తెలుగు సమాజంలో ఏ ఒక్క వ్యక్తి పుట్టుకతో అయినా ఇదిగో ఆధునికత మొదలు ఇతనితో అని చెప్పగలమా అంటే, అది ఒక్క కందుకూరి వీరేశలింగం విషయంలోనే సాధ్యం. ఆయన శతవర్ధంతి వత్సరం మే, ఇరవై ఏడున ఆరంభం అవుతున్నది. ఏ చదువులు లేకుండా అజ్ఞానంలో, బలైపోతున్న పసి ఆడపిల్లల జీవితాలు, యుక్తవయసు వచ్చేలోపే బాల వితంతువులుగా లక్షలాదిమంది బాలికలు సమాజంలో ఉండటం, వీటిని ఎవరు సహించినా, తాను వ్యతిరేకినంటూ, వీటిని ప్రశ్నించడానికి 1881లో రాజమండ్రి సోషల్ ప్రావి న్షియల్ క్లబ్లో కందుకూరి వీరేశలింగం ఒక ప్రసంగం చేశారు. దీనికి ప్రధాన ప్రేరణ, ఈ బాల్య వివాహాల జాడ్యం దేశమంతటా ఉండటం. 1880లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం, తొమ్మిదేళ్ల వయసులో భార్య అంటే ఏమో ఎరుగని వయసు బాలురు, పసి భార్యలను పోగొట్టుకున్న వారు దేశంలో 14,773 మంది ఉన్నారు. అదే సంవత్సరం, తొమ్మిదేండ్ల వయసు ఉన్న బాలికలు, తమ భర్తలను పోగొట్టుకున్న వారు, 78,976 మంది లెక్క తేలారు. వీళ్ళు కాకుండా, తరుణ వయసుకొచ్చిన 2,07,388 మంది బాలికలు తమ యవ్వనారంభ జీవితాలను వితంతువులుగా మొదలెడుతున్నారు. ఇవీ సంప్రదాయ భారతదేశపు సంఘం చేస్తున్న దుర్మార్గ పరంపర. ఇది కేవలం తెలుగు ప్రాంతాలకే చెందినదిగా, కొందరు భావించి, గురజాడ (1887–1892 నాటక రచనా కాలం ప్రదర్శన 1892లో) కన్యాశుల్కం నాటకం రాసే నాటికే, ఈ సమస్య లేదు అని చెప్తూ ఉంటారు. అది వాస్తవదూరం. ఈ అగ్రవర్ణ మూర్ఖత్వాన్ని నిరసిస్తూ, గురజాడ వాడిన వాటికన్నా, కటువైన మాటల్లో, ఈ బాల్య వివాహ దురాచారాన్ని రూపుమాపితే గానీ సమాజం బాగుపడదని విశ్వసించిన నాటికి, వీరేశలింగం వయసుడిగిన ముసలివారు కారు. ఆయన వయసు అప్పుడు కేవలం 33ఏళ్ళు. మనం తరచూ చూసే వృద్ధ కందుకూరి ఫోటోకి, ఈ అతి బాల్య వివాహాలపట్ల నిరసన తెలుపుతూ, తొలి వితంతు వివాహాన్ని 1881లో దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జరిపించిన వ్యక్తి రూపానికి పొలికే లేదు. దక్షిణ భారత రామ్‌మోహన్‌రాయ్‌గా గుర్తింపదగ్గ ఆధునికుడు వీరేశలింగం. కేవలం అక్షరయోధుడే కాదు, ఆచరణసేనాని కందుకూరి. ప్రసంగాలు, రచనలే కాదు – పెళ్లిళ్లు జరగాలి– అదీ కందుకూరి కార్యదీక్ష. ఆయన రచనలన్నీ, సాంఘికమౌఢ్యాన్ని పేల్చివేసే మందుపాతరలు. ఏకబిగిన వితంతు వివాహదీక్షతో, సంఘసంస్కరణలో జాతీయస్థాయి సంస్కర్తగా తన జీవితకాలంలోనే ఎదిగారు కందుకూరి. అప్పటి జాతీయ సంఘ సంస్కర్తలతో కలిసి, తన కార్యాచరణలో ఉన్నారు. ఈ భిన్న ప్రాంతాల ప్రముఖులు, జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె అధ్యక్షతలో, దేశంలోని ప్రధాన నగరాల్లో జాతీయ సామాజిక సంస్కరణ సభలను నిర్వహించేవారు. ఈ మేధావులు సంఘసంస్కరణ మన రాజకీయాకాంక్షలతోబాటుగా, అంతకన్నా వేగంగా సాగాలని, అప్పుడే భారతీయ సమాజం ఆధునికం కాగలదని విశ్వసించి ఆచరించినవారు. 1898లో మదరాసులో జరిగిన మహాసభలకు కందుకూరిని అధ్యక్షులను చేసి గౌరవించారు. ఇక్కడ అధ్యక్షహోదాలో ఆంగ్లంలో ప్రసంగించారు కందుకూరి. ఇక్కడే జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడే ‘దక్షిణ భారత విద్యాసాగరునిగా’ కందుకూరికి బిరుదునిచ్చారు. అరుదైన ఈ ఆంగ్ల ప్రసంగ పూర్తిపాఠం, ఇటీవల లభ్యమైంది. దీనిని మే 27న, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హాల్లో ఒక రోజుపాటు జరిగే శతవర్ధంతి వత్సర ప్రారంభోత్సవంలో విడుదలచేసి ఈ ప్రతిని ప్రదర్శనయోగ్యంగా విజయనగరంలోని గురజాడ స్మారక మందిరానికి, అలాగే, రాజమండ్రిలోని కందుకూరి దంపతుల సమాధి ఉన్న ఆనందాశ్రమానికి, ప్రదర్శన నిమిత్తం జాతికి సమర్పించడం జరుగుతుంది. ‘వ్యాకరణాల సంకెల’ అని, 1895లోనే ‘‘సరస్వతీ నారద విలాపం’’లో రాసిన కందుకూరి, ‘కవితా ఓ కవితా’లో ‘వ్యాకరణల సంకెళ్లు, శ్మశానాల వంటి నిఘంటువులు, చంధస్సర్ప పరిష్వంగం’ అన్న శ్రీశ్రీ కన్నా 45 ఏళ్లు ముందరే, సాహిత్య సరస్వతి భాష బరువుల కింద నలిగి రోదిస్తున్నదని చెప్పిన వాస్తవిక వాది. వీరి రచనల సమగ్ర ప్రచురణలు, వీలైతే నేటి తరాల కోసం, కాస్త సరళ భాషలో తీసుకురావడం, అలాగే, పలు తెలుగు నగరాల్లో కందుకూరి శతవర్ధంతి సందర్భంగా ‘కందుకూరి జయమాల’ సాహిత్య, సాంస్కృతిక సభల నిర్వహణ, ప్రస్తుతం తెలుగు జాతి బాధ్యత. (మే 27న కందుకూరి శతవర్ధంతి సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మొజాయిక్ సాహిత్య సంస్థ, అరసం సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా) రామతీర్థ ,వ్యాసకర్త కవి, విమర్శకుడు 98492 00385 -
అన్నా హజారే రాయని డైరీ
మాధవ్ శింగరాజు రామ్‌లీల మైదానంలో దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాత్రంతా చల్లగా ఉంటోంది. పగలంతా వేడిగా ఉంటోంది. ‘‘ఎందుకు పెద్దాయనా ఈ వయసులో! చెయ్యగలిగినవాళ్లే ఏమీ చెయ్యడం లేదు. ఏమీ చెయ్యలేనివాళ్లం.. మనం చేయించగలమా?’’ అన్నాడు ఒకాయన వచ్చి. ‘‘చెయ్యగలిగినవాళ్లు మౌనంగా ఉంటున్నారని, చేయించవలసినవాళ్లం మనమూ మౌనంగానే ఉండిపోదామా? చెప్పండి’’ అన్నాను. వచ్చి, నా పక్కనే కూర్చున్నారు ఆయన. డెబ్భైఏళ్ల వయసుకీ, ఎనభైæ ఏళ్ల వయసుకీ దీక్షలో కూర్చోవడంలో తేడా ఏమీ ఉండదు. ఏ వయసు వాళ్లు దీక్షలో కూర్చున్నా యూపీఏకి, ఎన్డీయేకి కూడా ఏమీ తేడా ఉండదు! దీక్షకు కొద్దికొద్దిగా జనం జమ అవుతున్నారు. జనం జమ కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తోంది. రామ్‌లీలకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో నీటి చుక్కన్నది దొరక్కుండా జాగ్రత్త పడుతోంది. హజారే ఆమరణ దీక్ష చేస్తున్నాడు కాబట్టి, ఆయన కోసం వచ్చేవాళ్లకూ అన్నమూ నీళ్లు అక్కర్లేదనుకున్నట్లుంది. ఆకలికో ఏమో, రాత్రంతా ఒకటే కలలు. మొదట కేజ్రీవాల్ వచ్చాడు కలలోకి. ‘మీరేమీ చిక్కిపోలేదు హజారేజీ’ అన్నాడు! ‘ఒకరోజు దీక్షకే నేను చిక్కి శల్యం అయిపోవాలని ఎలా ఆశిస్తావు కేజ్రీ’ అన్నాను. ‘అయ్యో.. నా ఉద్దేశం అది కాదు హజారేజీ. ఏడేళ్ల క్రితం మనిద్దరం కలిసి దీక్ష చేశాం. అప్పటికీ, ఇప్పటికీ మీరేం చిక్కిపోలేదని అంటున్నాను’ అన్నాడు. అతడివైపు చూశాను. చాలా చిక్కిపోయి ఉన్నాడు! ‘నువ్వేంటి కేజ్రీ అలా అయిపోయావ్?’ అని అడిగాను. ‘నా కిందివాళ్లెవరూ పని చేయడం లేదు హజారేజీ. వాళ్ల చేత పని చేయించలేక.. రోజూ ఆమరణ దీక్ష చేస్తున్నట్లే ఉంది నాకు’ అన్నాడు. ‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు కేజ్రీ’ అని అడిగాను. టప్పున కల చెదిరిపోయింది. కేజ్రీవాల్ మాయమై, మోదీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో గ్లాసు ఉంది. అందులో నిమ్మరసం ఉంది. ‘తాగండి హజారేజీ. చల్లగా ఉంటుంది. ఎండకు బాగుంటుంది’ అన్నాడు. ‘నన్ను చల్లార్చడానికా? దీక్షను చల్లార్చడానికా మోదీజీ?’ అన్నాను. ‘ఎవరు చేయని దీక్ష చెప్పండి హజారేజీ?! చూస్తూనే ఉన్నారు కదా. పార్లమెంటులో రోజుకో దీక్ష అవుతోంది. ఆ దీక్షలు తప్పించుకోడానికి పార్లమెంటుకు వెళ్లకూడదనే దీక్షలో ఉన్నాను నేనిప్పుడు’ అన్నాడు మోదీ. ‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు మోదీజీ’ అన్నాను. టప్పున కల చెదిరిపోయింది. మోదీజీ మాయమై, మెలకువ వచ్చింది. రామ్‌లీలా మైదానంలో ఈ పీడకలలేంటో! -
సమాన అవకాశాలు ఇవ్వాలి
సాక్షి, యాదాద్రి : తడక కల్పన.. ఎంఏ సోషియాలజీ, పీహెచ్డీ చదివింది. సౌత్ ఏసియా నెట్వర్క్ ఫెమినిజంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కోర్సును పూర్తి చేశారు. మహిళలు, ఆడపిల్లలు, చేనేత కార్మికుల హక్కులపై పోరాడుతుంది. బంగ్లాదేశ్, మయన్మార్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సెమినా ర్లలో మహిళల సమస్యలపై ప్రసంగించారు. ‘సాక్షి’ చేపట్టిన మహిళా క్యాంపెయిన్ ‘నేను శక్తి’కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఆడపిల్ల ఈ దేశంలో పుట్టడానికే నోచుకోలేని దయనీయ స్థితిలో ఉంది. తల్లి కడుపులో ఆడపిల్ల పడగానే నిలువునా చంపేస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలియగానే తోటి మహిళ(అత్త, ఆడబిడ్డ) ఇలా కోడలిని వేధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళా బతకడ మే కష్టమైంది. ఇక సాధికారిత ఎలా సాధ్యమవుతుంది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని నాలుగో గర్భంలో ఉన్న ఆడపిల్లకు జన్మనివ్వద్దని అబార్షన్ చే యిస్తే ఆ మహిళ చనిపోయింది. అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్, కుటుంబ సభ్యులను సమాజం కాపాడింది. ఆడ పిల్లలను కేవలం విలాస వస్తువుగా, ఆస్తిగా మాత్రమే చూస్తున్నారు. వస్తువును తనకు నచ్చిన విధంగా వాడుకునే ఆలోచన తప్ప ఆమెకు కొన్ని భావాలు ఉంటాయి. వాటిని గౌరవించాలన్న వ్యక్తిత్వం లేదు. ఆడపిల్లను కంటే తల్లిదండ్రులు నష్టంగా కొడుకును కంటే లాభంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. అందుకే ఇంకా ఈరోజుకు వరకట్న చావులు, నవవధువుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి. కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉండాలి మహిళలకు తమ గర్భంలో ఉన్న శిశువు ఆడైన, మగైన కనే అధికారం ఉం డాలి. ఎలాంటి దుస్తులు ధరించాలి. ఏం తినాలి, ఏం చదవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, అనే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న తప్పులకు మహిళలను బాధ్యులుగా చేయ డం మారాలి. అమ్మాయిలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఇస్తూ వారి ని నిందించే విధానం మానుకోవాలి. సమాన అవకాశాలతోనే సాధికారత మహిళలు సాధికారితతో అన్నిరంగాల్లో రాణించాలంటే వారికి అవకాశాలు ఇవ్వాలి. ప్రకృతి ఇచ్చిన శరీరాకృతిని అడ్డం పెట్టుకుని వారి ఆశయాలను, స్ఫూర్తిని దెబ్బతీసే సమాజం మారాలి. మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. అయినా వివక్ష, వేధింపులు, నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల శక్తి, సామర్థ్యాలను చూడలేని వారు వారి పట్ల చిన్న చూపుతో సూటిపోటి మాటలతో నిరుత్సాహ పరుస్తున్నారు. నిర్ణయాధికారాల్లో సమా న భాగస్వామ్యం అన్ని రంగాల్లో సమాన అవకాశాల కోసం మాత్రమే మహిళలు పోటీపడుతున్నారు. ఆడ పిల్లలు 5వ తరగతి తర్వాత చదువులో ముం దుకుపోలేకపోతున్నారు.అవకాశాలు కల్పించి గౌరవం ఇస్తే రిజర్వేషన్లు లేకుండానే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. -
ప్రథమ మహిళ..
ఒకప్పుడు గడప దాటాలంటే ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు. ఎన్నెన్నో కట్టుబాట్లు. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు అనే భావన. పరిస్థితి మారింది. నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కాలానుగుణంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే... తాము ఎవరి కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు... ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తామేంటో నిరూపిస్తున్నారు. ఆంక్షలు అణిచివేతలను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మొదటి మహిళామణులు వీరు... చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ బ్రిటీష్ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో 1883లో పట్టా పొందారు. అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి యూరోపియన్ మెడిసిన్‌లో పట్టా పొందారు. 1886లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మహిళా డాక్టర్‌గా, ఆనందీ గోపాల్ జోషీ సరసన నిలిచారు. చంద్రముఖి బసు బేతూన్ కాలేజీలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. కామినీ రాయ్ బెంగాలీ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, స్త్రీవాదిగా సుపరిచితమైన కామినీ రాయ్ భారత్‌లోనే మొదటి ఆనర్స్ పట్టా పొందిన మహిళ. సాహిత్య రంగంలో ఆమె కృషికి మహాశ్వేత, పౌరంకీ, జిబాన్, పుండరీక్, ద్వీప్ ఔర్ ధూప్, నిర్మాల్య వంటి రచనలు నిదర్శనాలు. కర్నాలియా సోరబ్జీ కర్నాలియా భారత్‌లో మొదటి న్యాయవాదిగా, ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ విద్యనభ్యసించిన మొట్టమెదటి మహిళగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తి. విశ్వ విద్యాలయ మహిళా సమాఖ్య, భారత మహిళా సమాఖ్య బెంగాల్ శాఖ, బెంగాల్ లీగ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఫర్ వుమెన్ వంటి సంస్థలతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1909లో ‘ఖైజర్-ఎ-హింద్’ అవార్డుతో సత్కరించింది. హొమి వైర్‌వాలా భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హొమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది . ఆసిమా ఛటర్జీ సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. మూర్చ నిరోధక, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్షిప్’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు. బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. 1995లో నాసా ఆస్ట్రోనాట్ కార్‌్ప్స బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు 10.4 మిలియన్ కి.మీ. దూరం ప్రయాణించారు. అంతరిక్ష నౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన బృందంలో ఒకరైన కల్పనా చావ్లాతో సహా ఆరుగురు వ్యోమగాములు మరణించారు. మరణానంతరం కాంగ్రెషనల్ స్సేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా సర్వీస్ మెడల్ పొందారు. ఆనందిబాయి గోపాలరావు జోషి నేటికీ ఆడపిల్లకు చదువెందుకనుకునే సమాజం ఇది....అలాంటిది 18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించి దేశంలోనే తొలి మహిళా వైద్యురాలుగా గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే. శీలా దవ్రే ఆటో డ్రైవర్ అంటే ఇప్పటికి మనకు గుర్తుకు వచ్చేది మగవారే....అలాంటి పురుషాధిక్య రంగంలోకి ప్రవేశించి వారికి ధీటుగా నిలదోక్కుకున్నారు శీలా దవ్రే. పూనాలో జన్మించిన దవ్రే 1988 నుంచి ఆటో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. రోషిణి శర్మ దేశంలో తొలి మహిళా బైక్ రైడర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బైక్ పై ప్రయాణించారు. అరుణిమా సిన్హా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా...ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఇంతటితో జీవితం ముగిపోయిందని బాధపడనూలేదు. క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు. రీటా ఫారియా పావెల్ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే పోటీలో నిలిచి గెలిచిన తొలి వైద్యురాలిగా కూడా చరిత్రకెక్కారు. ఆరతి సాహా ఇంగ్లీష్ చానల్‌ను ఈదిన తొలి ఆసియన్. 1959లో ఈ ఘనత సాధించారు. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆరతినే కావడం విశేషం. ఇందిరా గాంధీ భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977 వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’(1971) అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ వారు నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలిచారు. ప్రతిభా పాటిల్ మన దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. సుఖోయ్–30ఎమ్కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు. అంజలి గుప్తా ఫిలాసఫి చదివి, ఆ విద్యతో ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారు. భారత వాయుసేనలో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా చేరిన తొలి మహిళ. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో పనిచేశారు. జస్టిస్ ఎమ్ ఫాతిమా బీబీ సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు. సరళ థాక్రల్ అతిపిన్న వయసులో(21) విమానాలు నడిపేందుకు లైసెన్స్ పొందిన తొలి మహిళ . లైసెన్స్ పొందిన తరువాత, వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. ఎయిర్ మెయిల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారు. దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ మొదటి మహిళా పైలట్, కెప్టెన్. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. హరితా కౌర్ డియోల్ ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధీశాలి హరితా కౌర్ డియోల్.1994 లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా పైలెట్‌గా పేరు పొందారు. ప్రియ ఝింగాన్ పోలీసు నేపథ్యం కుటుంబంలో పుట్టి పెరిగారు . సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరికతో 1993 లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన మొట్టమొదటి మహిళా క్యాడెట్‌గా గుర్తింపు పొందారు. - ధరణి, సుష్మారెడ్డి -
నిబంధనల మేరకే వ్యవహరిస్తాం
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రైతులను భయపెట్టి తీసుకున్న భూముల్లో నిర్మిస్తున్న రాజధాని వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్తలు రాసిన లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించింది. రాజధాని నిర్మాణంతో స్థానికులు జీవనోపాధిని కోల్పోతారని, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని 46 మంది ప్రముఖ సామాజిక కార్యకర్తలు, నిపుణులు నవంబర్ 27న ప్రపంచబ్యాంకుకు లేఖ రాసిన విషయం విదితమే. లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు ప్రపంచబ్యాంకు స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేసే విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్‌లో ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం రాజధానిలో పర్యటించి రూపొందించిన నివేదికను వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించడం పట్ల సామాజిక కార్యకర్తలు లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ తనిఖీ బృందం నివేదికను పరిశీలిస్తున్నామని, ఈ నెల 12న బ్యాంకు వెబ్సైట్లో దానిని అప్లోడ్ చేస్తామని ప్రపంచబ్యాంకు తెలిపింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని, రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాతే రుణ మంజూరు విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి వీలుగా ఒక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రపంచ బ్యాంకు ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత కమిటీలో వివిధ రంగాల నిపుణులను నియమిస్తారని తెలిసింది. -
బోండా ఉమా తమ్ముడిని అంటూ బెదిరింపులు
-
సేవాకార్యక్రమాలు అభినందనీయం
కరప (కాకినాడ రూరల్) : హక్కుల పోరాటానికి రక్తం చిందించే కార్మికులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ కార్మిక సంక్షేమ మండలి డైరెక్టర్ రావులపల్లి రవీంద్రనా«థ్ అన్నారు. కరప మండలం నడకుదురులో ఆదివారం శ్రీరామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు నిధులను చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం దారుణమన్నారు. సంక్షేమబోర్డు పరిరక్షణకు, కార్మిక సమస్యల పరిష్కారానికి విజయవాడలో ఈ నెల 24న తలపెట్టిన ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు రావాలన్నారు. పలువురు మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన కార్మికులందరికీ పింఛ¯ŒS ఇవ్వాలని డిమాండ్ చేశారు. నడకుదురు రామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముమ్మిడి అచ్చియ్య(బాబ్జీ) మాట్లాడుతూ తమ సంఘ సభ్యుడి కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, రక్తం కావాలని అడిగితే ఇటువంటి వ్యాధిగ్రస్తుల చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 50 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. డాక్టర్ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏడాదికి 24 ప్యాకెట్ల రక్తం అవసరమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా రాఘవరావు, రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిశోర్, కె.సత్తిబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తుక కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాక మధు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మిడిఅచ్చియ్య, వెలుగుబంట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ముమ్మిడి అర్జునరావు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు అమ్మ
-
త్వరలో ఏపీ స్టడీ సర్కిల్ ప్రారంభం
ఎంవీపీ కాలనీ: ఏపీ స్టడీ సర్కిల్ త్వరలో విశాఖలో ప్రారంభంకానుందని సోషల్ వెల్ఫేర్ ఉపసంచాలకుడు డి.వి.రమణమూర్తి తెలిపారు. ఎంవీపీకాలనీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దీనికోసం ప్రభుత్వం రుషికొండలో చేపట్టిన భవనాల నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సిద్ధం చేస్తామన్నారు. అప్పటి వరకు నాన్ రెసిడెనసియల్ (వసతి సౌకర్యం లేకుండా) తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ పద్ధతిలో ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తయ్యిందని, త్వరలో రెండో బ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, జేఎన్టీయూ నిర్వహించే విద్యోన్నతి పథకానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుందని వెల్లడించారు. -
మహాశ్వేతాదేవి ఇకలేరు
కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి(91) గురువారం మృతి చెందారు. రెండు నెలలుగా పలు అవయవాలు పనిచేయకపోవడం, తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహాశ్వేతాదేవి మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అణచివేతను, అన్యాయాన్ని ఎదిరిస్తూ తన రచనల ద్వారా బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా రచయిత్రి మృతి తననెంతో ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. శ్వేతాదేవి మృతికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్తి ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని మమత ప్రకటించారు. గిరిజనులు, పేద గ్రామీణుల అభివృద్ధి కోసం శ్వేతాదేవి కొన్ని సంఘాలను ఏర్పాటుచేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బడుగుబలహీన వర్గాల హక్కుల కోసం పోరాడడానికి ఆమె సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. చిన్న కథలు, నవలల ద్వారా అట్టడుగు వర్గాల స్వరాన్ని వినిపించేవారు. సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన రచనలకుగాను పద్మ విభూషణ్, మెగసెసె, జ్ఞానపీఠ్ అవార్డులను పొందారు. హజర్ చురషిర్ మా(మదర్ ఆఫ్ 1084), అరిన్యిర్ అధికార్(రైట్ ఆఫ్ ది ఫారెస్ట్), ఝాన్సీ రాణి(ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), అగ్నిగర్భ(ది ఫైర్ విత్ఇన్), రుదలి, సిధు కన్హూర్ డాకీ తదితర రచనలు పీడిత వర్గాల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి. నవలలు, చిన్న కథలు రాయడం కోసం ఆమె బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని అనేక గిరిజన ప్రాంతాలను సందర్శించారు. ఈమె రచనలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. ప్రముఖ రచయిత్రిగా ఎంతో కీర్తిప్రతిష్టలు పొందిన ఆమె ఎంతో నిరాడంబరంగా జీవించారు. 1926లో మధ్యతరగతి కుటుంబంలో ఢాకాలో ఆమె జన్మించారు. తండ్రి మనీష్ కటక్ ఆ సమయంలో ప్రఖ్యాత కవి. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతిన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న శ్వేతాదేవి.. ప్రముఖ నాటక రచయిత బిజోన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు వీరు విడాకులు తీసుకున్నారు. 2014లో చనిపోయిన ఈమె కుమారుడు నబరున్ కూడా ప్రఖ్యాత కవి, రచయిత. ఈయన సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. ఆత్మకథ పూర్తి చేయలేకపోయారు: మహాశ్వేతాదేవి తన ఆత్మకథను పూర్తి చేయలేకపోయారని ఆమె సన్నిహితుడు జోషీ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో నందిగ్రామ్ హింసాత్మక ఘటనల అనంతరం శ్వేతాదేవి ఆత్మకథ రాయడం ప్రారంభించారని, అయితే, ఇల్లు మారుస్తున్న సమయంలో ఆ డైరీ మాయమైందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: మహాశ్వేతాదేవి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు. వైఎస్ జగన్ సంతాపం ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భార త సాహితీ రంగానికి ఆమె మృతి ఎప్పటికీ తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి తన పరిజ్ఞానంతో ఎందరో రచయితలకు, మేధావులకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఉంటే తక్కువ వడ్డీకే లోన్!
ముంబై: మీరు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ? తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే, మీ సోషల్ మీడియా అకౌంట్లలో స్నేహితులు, ఆఫీసు సహచరులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కాస్త మంచిదే!. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మాదిరిగానే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తుల సోషల్ మీడియా రిలేషన్స్ బట్టి లోన్ లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వ్యక్తి సోషల్ వర్త్, పర్సనల్ డిటైల్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు అతను లేదా ఆమె ఏ మేరకు లోన్ ను తిరిగి చెల్లించగలరనే అంశాన్ని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మొదటి సారి లోన్ కి దరఖాస్తు చేసుకునే వారికి సోషల్ వర్త్ బాగా కీలకంగా మారుతోంది. వ్యక్తి సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులు కొత్త విధానాలను ఉపయోగిస్తున్నాయని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పుంజా తెలిపారు. తమకు ఇప్పటికే ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఉందని లోన్ ప్రాససింగ్ లో ఈ పద్దతిని ఫాలో అయిపోతున్నట్లు వివరించారు. తాము ఎక్కువగా ఇప్పుడే ఉద్యోగం లో చేరిన వారికి లోన్ లను కల్పిస్తున్నట్లు చెప్పారు. వారి గురించిన సమాచరాన్ని సేకరించడానికి ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, లింక్డ్ ఇన్ లపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లోన్ తీసుకోవాలని అనుకుంటే కచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తూ ఉండాలని చెప్పారు. -
మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారం
జోగిని వ్యవస్థను ప్రోత్సహించినా శిక్షార్హులే! లీగల్ కౌన్సెలింగ్ నేనొక సోషల్ వర్కర్ని. మాదొక మారుమూల గ్రామం. అక్షరాస్యత చాలా తక్కువ. మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువ. మహిళల పరిస్థితి ఘోరం. మీరు చెబితే నమ్మరేమో. ఒక అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఒక దేవస్థానానికి అంకితమిచ్చి, వివాహంలాంటిది జరిపించారు. ఆ అమ్మాయి మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారానికి గురౌతూనే ఉంది. అదేమంటే ఆమె జోగిని కనుక అది సహజమంటున్నారు. నేనేమైనా సహాయం చేయగలనా? - కల్పన, ఆదిలాబాద్. ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఉన్నందుకు సభ్యసమాజం సిగ్గుపడాలి. ఒక స్త్రీని ఊరుమ్మడి సరుకుగా మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో ఈ జోగిని వ్యవస్థ ఉంది. వీరినే దేవదాసీలు, బసివినులు, మాతమ్మలు, తమ్మమ్మలు అని అంటుంటారు. పండుగలు, జాతరలు, ఊరేగింపులు వంటి సందర్భాలలో వీరిని చూస్తుంటాము. విచిత్ర వేషధారణలో, అనేక విన్యాసాలు చేస్తూ వీరు కనిపిస్తారు. వీరు లేకుండా కొలుపులు, జాతరలు ప్రారంభం కావు. కేవలం అప్పుడే వారికి ప్రాధాన్యత ఇస్తారు. మిగతా సమయాల్లో ఊర్లోని మగాళ్ల కోర్కెలు తీర్చే యంత్రాల్లాగే చేస్తారు. వీరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేవదాసి (అకింతం) నిషేధ చట్టం 1988 ఉంది. ఈ చట్టప్రకారం ఏదైనా హిందూ దేవత, విగ్రహం లేదా దేవస్థానానికి సేవ చేసే నిమిత్తం అంకితమివ్వబడే స్త్రీని దేవదాసి అంటారు. ఒక స్త్రీని దేవదాసిగా/బసివిని/జోగినిగా అంకితం చేయడం నేరం. అలా అంకితం చేసే కలాపం నిర్వహించినా, పాల్గొన్నా, ప్రోత్సహించినా రెండు నుంచి మూడు సంవత్సరాల శిక్ష, మూడువేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. మీరు చెప్పిన కేసులో ఆ అమ్మాయి అమ్మానాన్నలే ఆమెను దేవదాసిగా అంకితమిచ్చారు. తల్లిదండ్రులే స్వయంగా అలా దేవుడికి అంకితమిస్తే రెండు నుండి ఐదు సంవత్సరాల శిక్ష పడుతుంది. పోలీసు కంప్లైంట్ ఇవ్వవచ్చు. లేకుంటే మీ స్వచ్ఛంద సంస్థ తరపున మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టవచ్చు. తల్లిదండ్రులను, నిర్వహించినవారిని, హాజరైన వారినీ, ప్రోత్సహించిన వారినీ పార్టీలుగా చేయవచ్చు. నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తనుండి కోర్టుద్వారా విడాకులు తీసుకున్నాను. మాకు 5, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు. నా భర్త పిల్లల కస్టడీ కోరుతూ ఆశ్రయించారు. జడ్జిగారు మమ్ములను లోపలికి పిలిపించి, పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి తల్లికే కస్టడీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అని, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికి మా వారు బాబును తనకి ఇమ్మని, పాపను నన్నే ఉంచుకోమని ప్రపోజల్ పెట్టారు. కేస్ ఇంకా మొదలు కాలేదు. నా సందేహం ఏమిటంటే, పిల్లలను ఇలా విడదీసి పంచుకోవడం న్యాయమా? నాకు విషయం తలచుకుంటేనే దుఃఖం వస్తోంది. మరో ముఖ్యవిషయం. మావారు ఒక క్రిమినల్ కేసులో నిందితుడు. రిమాండ్‌కి కూడా వెళ్లి వచ్చారు. ఒకవేళ అతనికి శిక్ష పడితే పిల్లలపై తీవ్రప్రభావం చూపిస్తుంది కదా! ఈ విషయంలో పిల్లలిద్దరి కస్టడీ నాకు వచ్చే అవకాశం ఉందా? - పి.సత్యవతి, విశాఖపట్నం మీకు తప్పకుండా పిల్లలిద్దరి కస్టడీ వస్తుంది. ఎందుకంటే కస్టడీ కేసులో పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు టీచర్ కనుక పిల్లల చదువు విషయంలో, పెంపకం విషయంలో తగిన జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందని కోర్టువారు అనేక కేసుల్లో తీర్మానించారు. పిల్లలిద్దరూ ఒకేచోట పెరిగితే వారి మధ్య బంధాలు బలంగా ఉంటాయని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు వృద్ధిపొంది, ఒకరికొకరు తోడుగా ఉంటారని అనేక తీర్పులు ఉన్నాయి. మీకు ఇంకొక ప్లస్‌పాయింట్ ఉంది. మీ భర్త రిమాండ్‌కు వెళ్లివచ్చారు. శిక్ష కూడా పడే అవకాశం ఉంది. తండ్రి క్రిమినల్ కేసులో ఇరుక్కొని, జుడీషియల్ కస్టడీకి వెళ్లి వచ్చి, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, అవన్నీ పిల్లల మానసిక పరిస్థితిపై ఎంతో ప్రభావం చూపి, వారి ఎదుగుదలపై దుష్ర్పభావం పడుతుందని న్యాయమూర్తులు అనేక కేసుల్లో తీర్పునిచ్చి, అలాంటప్పుడు కస్టడీ తల్లికే ఇవ్వాలని తీర్మానించారు. మీ కే సు విచారణకు వస్తే మీరు మీ భర్తకు సంబంధించిన క్రిమినల్ కేసు ఆధారాలను కోర్టు ముందు ఫైల్ చేయాలి. మీ ఆవేదన తీరుతుంది. తండ్రికి ఎటూ విజిటింగ్ హక్కులు ఉండనే ఉన్నాయి. మేము ఒక గ్రౌండ్ ఫ్లోర్లో వుంటున్నాము. నా భర్త ఉద్యోగి. నేను గృహిణిని. ఇటీవలే మాకు వివాహమైంది. మా ఇంటి గుమ్మం ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే మెట్ల ఎదురుగా వుంటుంది. పైకి వెళ్లేవాళ్లు, కిందికి వచ్చేవాళ్లు కనిపిస్తుంటారు. సమస్యేమిటంటే ఒక పోకిరీ వ్యక్తి అస్తమానం పైకీ కిందికీ వెళుతూ నావైపే తదేకంగా చూస్తున్నాడు. అతను పైపోర్షన్లో ఉంటున్నాడు. మొదట్లో పట్టించుకోలేదు. నేనే తలుపులు బిగించుకుని ఉంటున్నాను. అస్తమానం అలా వుండలేను కదా. ఇటీవలకాలంలో అతను చాలా అసభ్యమైన సైగలు చేస్తున్నాడు. వివిధ హావభావాలు (శృంగారపరమైన) ప్రదర్శిస్తున్నాడు. నేను గమనించకుండా వుంటే ఏదో ఒక శబ్దం చేసి అటు చూసేలా చేస్తున్నాడు. నేనెంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఎవరికీ చెప్పుకోలేను. గట్టిగా మందలించలేను. పైగా నా భర్త చాలా అనుమానం మనిషి. సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హైదరాబాద్ నిజంగా మీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. కొందరు దుర్మార్గులు ఇలా ఆడవారిని మానసికంగా హింసించడం ఎక్కువైంది. దీనివల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ముందుగా ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా వుందేమో కనుక్కోండి. ఉంటే తప్పుకుండా రికార్డ్ అవుతుంది. యాక్షన్ తీసుకోవచ్చు. లేకుండా షీ టీమ్స్ వారికిగానీ, లేకుంటే మహిళా ప్రొటెక్షన్ సెల్‌కి గానీ ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు వారు మహిళా హెల్ప్‌లైన్స్ నిర్విస్తున్నారు. మీ పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదు ఆన్లైన్లో ఇవ్వవచ్చు. కొన్ని ఆధారాలు కావాలి కదా. మీరు మీ సెల్ఫోన్లో అతని చేష్టలు చిత్రీకరించే ప్రయత్నం చేయండి. లేకుంటే మీకు నమ్మకస్తులైనవారు అవి చూసేలా చేయండి. మహిళలకు అసభ్యమైన సైగలు చేసినా ఏ పదజాలం వాడినా అసభ్యమైన పాటలు పాడినా, బూతు బొమ్మలు చూపినా, చూసేలా చేసినా, భావ ప్రకటనలు చేసినా, అసభ్యమైన హావభావాలు ప్రదర్శించినా అది నిర్భయ చట్టం కిందకు అంటే సె.354ఏ కిందకు వస్తాయి. ఒక సంవత్సరం శిక్ష, జరిమానా పడే అవకాశం వుంది. -
'పార్లమెంటులో మాట్లాడతా.. అనుమతించరా..!'
న్యూఢిల్లీ: తనకు పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు అనుమతిప్పించాలంటూ ప్రముఖ సామాజివేత్త, స్వామి భూమానంద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. పార్లమెంటు చట్టాల ఏర్పాటు ప్రాముఖ్యతతోపాటు, సభా కార్యక్రమాలకు భంగం కలగడం ద్వారా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే అంశాలను ఆయన మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రణబ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు జాతీయ అభివృద్ద ఎజెండాపై కూడా ఆయన ప్రసంగించాలనుకుంటున్నట్లు తెలిపారు. -
పొయిటిక్ లవ్
సోషల్ వరల్డ్‌లో ఓపెన్‌గా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న యువతరం రియల్ వరల్డ్‌లోకి వచ్చేసరికి అంత ఓపెన్‌గా ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ఫ్యూజన్గా సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుతం ట్రెండ్‌ని ఆవిష్కరిస్తూ రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగ శౌర్య, పల్లక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సంగీత జ్ఞాని ఇళయారాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేయనున్నారు. ఈలోపు నేటి నుంచి శుక్రవారం వరకూ విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, వరంగల్‌లో ఒక్కో పాటను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. రమేశ్ వర్మ చాలా ట్రెండీగా, పొయిటిక్గా తెరకెక్కించారు. ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యాం కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి. -
అలరించిన నృత్యం
-
నిరశన దీక్షను విరమించుకున్న అన్నా
ముంబై: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న తలపెట్టిన నిరశన దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గడం, మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్నా హజారే తెలిపారు. భూసేకరణ బిల్లు ఉపసంహరణ, ఓఆర్ఓపీ విధానం అమలు డిమాండ్లతో అక్టోబరు 2న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరశన దీక్ష చేపట్టాలని అన్నా హజారే గతంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడం అన్నా దీక్షను విరమించుకున్నారు. అన్నా తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధీలో ఈ విషయం చెప్పారు. -
హైకోర్టుకు వెళ్లండి
పోలవరం నిర్వాసితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుబోధ్ మార్కండేయ, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపిస్తూ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేకపోయినా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని ధర్మాసనానికి విన్నవించారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇప్పించాలని కోరగా జస్టిస్ ఆర్.కె.అగర్వాల్ స్పందిస్తూ ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ‘పిటిషనర్ ఈ ప్రజాహిత వ్యాజ్యం ద్వారా హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌కు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉంది..’ అని ఆదేశాలు జారీచేశారు. -
అమాత్యులు లేకపోయినా..
- మంత్రుల బంగ్లాల్లో భారీ నీటి వినియోగం - రూ. లక్షల్లో వస్తున్న బిల్లులు.. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి - ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త చేతన్ కోటారి సాక్షి, ముంబై: మంత్రులు తమ బంగ్లాల్లో లేకపోయినా అక్కడ భారీగా నీటి వినియోగం జరుగుతున్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. పరిమితి లేకుండా నీటి వినియోగం జరుగుతుండటంతో రెండేళ్లుగా సరఫరా తగ్గించినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. వివరాల్లోకెళితే మల్బార్హిల్స్లోని కొన్ని మంత్రుల బంగ్లాలలో ఎవ్వరూ లేకున్నా నీటి వినియోగం జరుగుతోంది. దీంతో ఈ బిల్లులు రూ. లక్షల్లో వస్తున్నాయి. నీటిని ఎవరు వినియోగిస్తున్నారో తెలియక సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రుల బంగ్లాల్లోని 41 నీటి మీటర్లలో 18 పని చేయకున్నా వాడకం మాత్రం భారీగా జరుగుతోంది. గతేడాది 2014-15లో దాదాపు 22 బంగ్లాల్లో రూ. ఆరు లక్షలు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించని నగర ప్రజల నీటి సరఫరాను మాత్రం అధికారులు నిలిపి వేస్తున్నారు. తోర్న, శివ్గిరి, రాయల్‌స్టోన్, అజంత, డోంగిరి, రామ్టేక్ బంగ్లాల్లోని వాటర్ మీటర్లు పని చేయకపోయినా వాటి గురించి పట్టించుకోలేదు. కొన్ని బంగ్లాలు ఉపయోగంలో లేకున్నా నీటి ఉపయోగం మాత్రం కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బంగ్లాల చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ క్వాటర్స్ల్లోని వారు నీరు వినియోగిస్తున్నారా, లేక మధ్యలోనే చోరీ చే స్తున్నారా అనే వైపుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి.. ఈ తాజా వైనం సామాజిక కార్యకర్త చేతన్ కోటారి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించడంతో బయటపడింది. 2014-15లో అన్ని బంగ్లాలోని వాటర్ బిల్లులు రూ.42 లక్షలు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. పురాతన్, జెట్‌వాన్ బాంగ్లాల్లో 2014-15లో రూ.లక్ష వరకు బిల్లులు ఉండగా, ఒక్క వర్షా బంగ్లాలోనే నీటి బిల్లు రూ.3.6 లక్షల వరకు జరిగింది. ముక్తా బంగ్లాలో రూ.2.8 లక్షలు, జెట్‌వాన్ రూ.2.1 లక్షలు, చిత్రకుట్ రూ.2.05 లక్షలు వచ్చాయి. ఇక 2012-13లో జట్వాన్ బంగ్లా నీటి బిల్లు రూ.5.7 లక్షలకు పైనే వచ్చింది. రామ్టేక్, చిత్రకుట్, సేవాసదన్ బంగ్లాలకు రూ.3.7 లక్షల నుంచి రూ.2.1 లక్షల నీటి బిల్లు వచ్చింది. మామూలుగా రెండు నెలల్లోగా నీటి బిల్లులను చెల్లించాలని, మీటర్లలో లోపం వల్ల జాప్యం జరుగుతోందని ప్రజా పనుల విభాగ అధికారి ఒకరు తెలిపారు. -
హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి
రాలేగావ్ సిద్ధిఖీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఉపయోగించిన మహింద్రా స్కార్పియో వాహనాన్ని ఆయన కీలక అనుచరుడు వేలంలో రూ. తొమ్మిదిలక్షలకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారే నిర్వహించిన ఎన్నో అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో, లోక్‌పాల్ బిల్లు సమయంలో గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆ వాహనాన్ని ఉపయోగించారు. ఆదివారం హజారే సొంతగ్రామం రాలేగాం సిద్ధిఖీలో వేలం పాట నిర్వహించారు. దీనిని అహ్మద్ నగర్ కు చెందిన అతుల్ లోఖండే మొత్తం రూ.9,11,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారేకు ఇప్పుడు కొత్త వాహనం కావాలని, ఆయన గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారని, వాహనాన్ని మార్చాల్సిన అవసరం ఉండి వేలం పెట్టామని ఆయన మరో అనుచరుడు దత్త అవారీ చెప్పారు. ఆ వాహనానికి ఘనమైన చరిత్రే ఉందని వివరించారు. -
‘ట్రాఫిక్’ అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నై నగరం లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగులపై ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తి చేతులకు ఎట్టకేలకూ సంకెళ్లు వేశారు. నగరంలో విచ్చలవిడిగా వెలిసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులను సామాజిక సేవా కార్యకర్త రామస్వామి ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ అనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రామస్వామి పెట్టిన అనేక కేసులు మద్రాసు హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను నిలదీసే ధైర్యంలేక సర్దుకుపోతున్న ప్రజలకు 70 ఏళ్ల ట్రాఫిక్ రామస్వామి అభిమాన పాత్రుడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రామస్వామి తనదైన శైలిలో పోరాడుతూనే ఉండగా, ప్రజాశ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఎవ్వరూ అడ్డుకునే సాహసం చేయలేక పోయారు. జయ ఫ్లెక్సీలు చింపివేత ట్రాఫిక్ రామస్వామి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫ్లెక్సీలను తానే స్వయంగా చించివేశారు. ఆ తరువాత అన్నా ఫ్లైఓవర్, అన్నాసాలై దర్గా సమీపంలోని బ్యానర్లను చించారు. సచివాలయం సమీపంలో జయకు శుభాకాంక్షలు తెలుపుతూ అమర్చిన బ్యానర్లను తొలగించనుండగా పోలీసులు అడ్డుకుని పంపివేశారు. బుధవారం సాయంత్రం వేప్పేరి పరిసరాల్లోని రోడ్లలోని కట్అవుట్, బ్యానర్లను తొలగిస్తుండగా ఆ మార్గంలో కారులో వస్తున్న హోటల్ యజమాని వీరమణి పక్కకు తప్పుకోవాలని రామస్వామిని కోరారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపగించుకున్న వీరమణి వేప్పేరీ పోలీసులకు రామస్వామిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బుధవారం రాత్రి ట్రాఫిక్ రామస్వామి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల ధ్వంసం, చట్టవిరుద్ధంగా వ్యవహరించడం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం రామస్వామిని ఎగ్మూరు కోర్టులో ప్రవేశపెట్టి పుళల్‌జైలుకు తరలించారు. -
సమానం అంటే సగమని కాదు
షబానా అజ్మీ.. బాలీవుడ్ నటి మాత్రమే కాదు.. సామాజిక రుగ్మతలపై తనదైన గొంతును వినిపించే సోషల్ యాక్టివిస్ట్. మహిళా సమస్యలపై, ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలపై నిరసన గళం వినిపించే రెబల్‌స్టార్. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏకంగా ఐదు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరు. ఇటీవల ఓ చర్చావేదికలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన షబానా ‘సిటీప్లస్’తో తన మనోభావాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. శ్రావణ్ జయ ప్రస్తుతం మన దేశంలో స్త్రీలపై అత్యాచారం జరగని రాష్ట్రాన్ని చూపించగలరా? ఎప్పుడో ఒకప్పుడు కాదు. ప్రతిరోజూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి గంటకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ, మానవ హక్కుల కోసం గతంలో పోరాడాను. నేటి మహిళ స్థితి ఇంకా దీనావస్థలో ఉంది. గతంలో స్త్రీలపై అత్యాచారం జరిగితే పోలీసుల రికార్డుల్లో మాత్రమే నమోదయ్యేది. నేరం చేసినవారికి శిక్ష పడిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అయితే నిర్భయ చట్టం వచ్చాక పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి రావడం, స్త్రీల ర క్షణ గురించి కొంతమేరకైనా మాట్లాడటం హ ర్షించదగ్గ విషయం. కాని ‘నిర్భయ’, ‘బేటీ బచావో’ లాంటి చట్టాలు వచ్చాక కూడా అకృత్యాలు జరగడం విచారకరం. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు అదుపులోకి రావు. స్త్రీని గౌరవంగా చూడాలన్న నైతిక ప్రేరణ కలిగించడం ముఖ్యం. అది ప్రతి ఒక్కరూ అనివార్యంగా తెలుసుకోవాలి. నేటికీ బాల్య వివాహాలు.. స్త్రీ, పురుష విభేదాలు అతి ఎక్కువగా ఉన్న మనదేశంలో సమానత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమైన అంశం. నా తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. నాన్న (కైఫీ అజ్మీ), అమ్మ (షౌకత్ అజ్మీ).. వారిద్దరి భావోద్వేగాలు నాలోనూ ఉన్నాయి. అందుకే నటిగా బిజీగా ఉన్నా కూడా సామాజిక రుగ్మతలపై పోరాటం చేశా. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఆడపిలల్ని కనడంలో అయిష్టత చూపిస్తున్నారు. ఒకవైపు పురిటిలోనే చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. సమానత్వం అంటే జనాభాలో సగం మహిళలు ఉండటం కాదు.. హక్కుల్లో, అన్నింటా మహిళలకు సగ భాగం ఉండాలి కదా! ప్రాధాన్యమివ్వని సినిమా... సినిమాల్లో ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూపించే దౌర్భాగ్యం నుంచి దర్శకనిర్మాతలు బయటికి రావాలి. మన చిత్రాల్లో రానురాను మహిళలకు ఇంపార్టెన్స్ తగ్గుతోంది. ఏదో ఒకటి, రెండు తప్ప అన్ని సినిమాల స్క్రిప్టులు హీరోలను దృష్టిలో పెట్టుకుని రాసేవే. నే ను దాదాపు 120 సినిమాల్లో నటించాను. ప్రతి సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటా. ప్రస్తుతం ‘జబా’్జ అనే సినిమాలో నటిస్తున్నాను. మన సినిమాలు ప్రాక్టికల్‌గా, రియాలిటీ కి దగ్గరగా ఉండాలి. ఇండియన్ సినిమాలో సెన్సారింగ్ అంటే మాటల్ని, దృశ్యాల్ని కట్ చేయడమే. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఇప్పటికీ బ్రిటిష్ సెన్సారింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. కాని సెన్సార్ చేయడం అంటే ‘కట్’ చేయడం మాత్రమే కాదు. ఏదైనా దృశ్యం అభ్యంతరకరంగా కాని, నిబంధనలను ఉల్లఘించే విధంగా కాని ఉంటే కట్ చేయాలి. అలాకాక ప్రేక్షకుల వయసు, విచక్షణ జ్ఞానానికి సంబంధించిన దృశ్యాలు ఉంటే వాటిని కట్ చేయడం కంటే ఆ చిత్రానికి రేటింగ్ మార్చి ఇవ్వాలి. అమెరికాలో చిత్రాలకు ఇదే తరహాలో సెన్సార్ విధానాన్ని పాటిస్తున్నారు. -
ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే...
ముంబై: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను కొన్ని హిందుత్వ సంస్థలు ప్రస్తుతించడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందని గాంధేయవాది, సామాజిక కార్యకర్త రామ్ పునియాని ఆరోపించారు. ఈ తతంగమంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందన్నారు. ఈ అంశంపై నరేంద్ర మోదీ సర్కారు మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. 'నాథూరాం గాడ్సేను హిందూ సంస్థలు ప్రస్తుతించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇదంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. కాని ఇది ప్రమాదకరమైన ప్రయాణం' అని రామ్ పునియాని వ్యాఖ్యానించారు. -
రాజకీయ మురికికి దూరంగా ఉంటా: హజారే
రాలేగావ్ సిద్ధి: తాను రాజకీయ మురికి కూపానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నా హజారే చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘జన్ లోక్‌పాల్’ కోసం ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తానని చెప్పారు. బుధవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఫోన్ చేసిన అన్నా సమాధానమివ్వలేదని కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయ మురికికి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆ మురికిలో నేను ఉండలేను’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో బేడీ చేరికపై అడగ్గా.. దానిపై తానేమీ మాట్లాడనని చెప్పారు. -
కొత్త సంవత్సరం ప్రారంభం
పొద్దున్నే అలారమ్ మోగుతుంది. అలా బద్దకంగా కళ్లు తెరిచి ఠక్కున స్నూజ్ బట్న్ నొక్కేసి.. దుప్పటి ముసుగేసేస్తాం. ఐదు పది నిమిషాలకు మళ్లీ సౌండ్... చెవుల్లో రింగ్మంటుంది. సీన్ రిపీట్! బెడ్‌పై అటూ ఇటూ దొర్లుతుండగానే.. మళ్లీ ట్రింగ్... ట్రింగ్! షెడ్యూల్ టైమ్ దాటిపోతుంది. బలవంతంగా బెడ్ దిగింది మొదలు... ఒకటే హడావుడి. ఓ చేత్తో బ్రష్ చేసుకుంటూనే... మరో చేతులో పేపర్! కాఫీ సిప్ చేస్తూనే... బాత్కు పరుగులు. నాలుగైదు చేతులుంటే బాగుండనిపిస్తుంది. బ్రేక్‘ఫాస్ట్’అయిపోయి... ఆఫీసు టైమ్ దాటిపోయి... టెన్షన్ టెన్షన్. ఇదీ సగటు సిటీజనుడి రొటీన్ లైఫ్. కానీ ఒక్క రోజు తప్ప! అదే జనవరి ఫస్ట్! ఎందుకంటే కొత్త సంవత్సరం కదా..! ఆ రోజు ఏవేవో చేసేయాలని... ఎన్నెన్నో ప్రారంభించేయాలని తలపోస్తాం. అలారమ్ మోగకముందే మెలకువ వచ్చేస్తుంది. ఆ రోజంతా నయా జోష్ ఆస్వాదనంలో గడిచిపోతుంది. తీసుకున్న నిర్ణయాలు ఆ తరువాత ఎటుపోతాయో... ఏమౌతాయో తెలియదు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినంత ఉత్సాహం ఆనక కనిపించదు. ఇది కాదు మనం కోరుకునేది. ఆ సంతోషం... ఉత్సాహం... ఉల్లాసం ఏడాదంతా కొనసాగాలని... ఆహ్లాదకర గమనంలో ఆరోగ్యకర జీవితం గడపాలని. అందుకు శ్రీకారం చుట్టేందుకు న్యూ ఇయర్ అకేషన్‌కు మించిన సందర్భం మరోటి రాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని... పట్టుదలతో దీక్షగా వాటిని పాటిస్తే, ఈ ఒక్క రోజే కాదు... ఏడాదంతా ఆనందకరంగా ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట. సో.. ఈ జనవరి ఫస్ట్‌కు లైఫ్ స్టైల్‌ను రైట్ ట్రాక్ పైకి తెచ్చే నిపుణుల సూచనలు కొన్ని మీ కోసం... ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం సహకరిస్తేనే ఏ పనైనా నిరాటంకంగా చేయగలం. ముందుకు పోగలం. అంటే తొలి ప్రాధాన్యం పుష్టికరమైన ఆహారానిది. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌ను తగ్గించి ఇంటి వంటలు తినండి. దీనివల్ల పోషకాలే కాదు... శుచి, శుభ్రత, నాణ్యత ఉన్న ఆహారం శరీరానికి చేరుతుంది. ఫాస్ట్ ఫుడ్స్‌ను పాలు, పండ్లు వాటితో రిప్లేస్ చేయండి. వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం... సమయ పాలన. మీకున్న వెసులుబాటును బట్టి ఓ షెడ్యూల్ తయారు చేసుకోండి. దాని ప్రకారం నిద్ర లేవడం... తినడం... పడుకోవడం అలవాటు చేసుకోండి. శ్రమయేవ జయతే ఫుడ్ తరువాత శరీరానికి కావల్సింది వ్యాయామం. గజిబిజీ లైఫ్‌లో ఒత్తిడిని దూరం చేసేది ఇదొక్కటే. అందుకే ఈ రోజే వెళ్లి జిమ్‌లో చేరండి. అది కూడా ఏడాదంతా కొనసాగించాలన్న దృఢ సంకల్పంతోనే! కుదరని పక్షంలో కనీసం రోజుకు ఓ గంట వాకింగ్, వార్మప్స్ చేయండి. ఇది మీ బాడీని ఫిట్‌గా ఉంచడమే కాదు... లేజీనెస్ పోయి మీలో ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది. ఒక్కళ్లకే బోర్ కొడితే... ఫ్రెండ్స్‌తో కలసి ఏదో ఒక గేమ్ మొదలెట్టండి. మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. వీటన్నింటితో పాటు తప్పకుండా మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రేమైక జీవనం... భారతదేశంలో అద్భుతమైంది కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో మరెక్కడా కనిపించని బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మన కుటుంబాల్లోనే ఉంటాయి. ఎంత ఎడతెరిపి లేని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కనీసం వారంలో ఒక రోజు కుటుంబంతో స్పెండ్ చేయండి. ఆ రోజు అంతా కలుసుకొనేలా ప్లాన్ చేసుకోండి. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం మరింత బలపడుతుంది. అలాగే కొత్త ఫ్రెండ్షిప్నకూ బాటలు వేయండి. రేపటి కోసం... హెల్త్ ఎంత ముఖ్యమో జీవితంలో వెల్త్ కూడా అంతే ముఖ్యం. సరైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది. సో... చేతులో ఉన్నది ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేయకుండా రేపటి గురించి ఆలోచించండి. ప్రతి నెలా మీ జీతంలో నుంచో... పాకెట్ మనీలో నుంచో ఎంతో కొంత సేవింగ్ చేయండి. ఉద్యోగస్తులైతే... ఆన్లైన్లో ఆటోమేటిక్ మంత్లీ ట్రాన్స్ఫర్ ఎంచుకోండి. తద్వారా నెలనెలా మీ జీతం అకౌంట్లో పడగానే సేవింగ్స్‌కు ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. మిగిలిన దాన్లోనే మంత్లీ ఎక్స్పెన్సెసెస్ ప్లాన్ చేసుకుంటారు. సమాజ హితం... ఎప్పుడూ మనం, మన కుటుంబమే కాదు... కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఎలాంటి ఆలనాపాలనా లేని అనాథలు, స్థోమత లేక పూట గడవని అభాగ్యులు ఎందరో ఉన్నారు ఈ మహానగరంలో. అలాంటి వారి కోసం ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపినవారమవుతాము. సామాజిక హితం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల మనకూ ఎంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది. అలాగే సోషల్ వర్క్ యాక్టివిటీస్కూ చేయూతనివ్వండి. సో... థింక్ పాజిటివ్... లెట్స్ గివ్ ఏ స్టార్ట్ ఫర్ చేంజ్ టు యువర్ లైఫ్! హ్యాపీ న్యూ ఇయర్! -
‘లోక్‌పాల్’ అమలు కోసం త్వరలో దీక్ష
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వెల్లడి హైదరాబాద్: లోక్‌పాల్ చట్టం సత్వర అమలు కోసం మరో పోరాటం చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు, గాంధేయవాది అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘపోరాటం అనంతరం మునుపటి యూపీఏ ప్రభుత్వం చేసిన లోక్‌పాల్ చట్టం అమలుపై ప్రస్తుత సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. శనివారం హైదరాబాద్ వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో ‘సాయి దేశం- గాంధీ మార్గం’ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛత్రపతి శివాజీ గ్రౌండ్లో జరిగిన సభలో పాల్గొని యువత, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సమాజమే ఒక కుటుంబంగా భావించి, అందరితో కలసిమెలసి జీవిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరూ తాను బతుకుతూ సమాజాన్ని బతికించాలన్న స్వామి వివేకానందుని మాటలను పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ గాంధేయ మార్గంలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్య గౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేశ్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
హమ్మయ్య.. పక్షులు బతికిపోయాయి!
* ‘దీపావళి’నాడు తగ్గిన పక్షుల మరణాలు, గాయాల కేసులు * గత ఏడాదికంటే 20% తగ్గిన నష్టం * అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జంతు ప్రేమికులు * పెరిగిన టపాసుల ధరలూ కారణమే.. సాక్షి, ముంబై : నగరంలో ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన పక్షుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఈ కేసుల సంఖ్య 20 శాతం తక్కువగా నమోదయ్యిందని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ప్రతిసారి దీపావళికి టపాసుల శబ్ధ ధాటికి చాలా పక్షులు గాయాలపాలు కాగా, మరికొన్ని మృత్యువాత పడుతుంటాయి. దీంతో పక్షి ప్రేమికులు ఈసారి నగరవాసుల్లో కొంత మేర అవగాహన కల్పించారు. అన్ని పండుగల కంటే దీపావళి నాడు జంతువులు, పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయని జంతు ప్రేమికులు పేర్కొన్నారు. లెక్కలేనన్ని జంతువులు గాయాలపాలవుతాయన్నారు. టపాసులు కాల్చడంతో చాలా జంతువులు శబ్దధాటికి బయటికి పరుగులు తీస్తుంటాయని, ఈ క్రమంలో అవి వాహనాల కింద పడి గాయాలపాలు అవుతుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా తాము నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. చిన్నపిల్లలతో ఈ అంశమై మాట్లాడడమే కాకుండా పోలీస్స్టేషన్లను కూడా ఆశ్రయించామన్నారు. అంతేకాకుండా ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా తమ జంతువులు తప్పిపోయినా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా తమకు ఫిర్యాదు అందజేయాలని నగరవాసులకు సూచించామన్నారు. ఇదిలా ఉండగా, టపాసుల ధరలు పెరిగిపోవడంతో ఈసారి నగరవాసులు ఎక్కువ స్థాయిలో టపాసులు కాల్చలేదని, దీంతో పక్షులు, జంతువులు చాలావరకు గాయాలబారినుంచి బయటపడ్డాయని వారు అభిప్రాయపడ్డారు. పరేల్‌లోని బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (బీఎస్పీసీఏ)కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి గాయపడిన పక్షుల సంఖ్య గత ఏడాది కన్నా 25 శాతం తగ్గిందన్నారు. బీఎస్పీసీఏ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ జె.సి.కన్నా మాట్లాడుతూ.. దీపావళిని పురస్కరించుకొని ఆస్పత్రుల్లో చేరిన పక్షులు, జంతువులు కేసులు ఈసారి చాలా వరకు తగ్గాయన్నారు. ముఖ్యంగా గాలి పటాలు ఎగురవేయడం ద్వారా చాలా పక్షులు తీవ్రంగా గాయపడుతుంటాయి. దీంతో తమ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వస్తుంటారన్నారు. కాగా, ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన 18 పక్షులను తమ వద్దకు చికిత్స కోసం తీసుకు వచ్చారన్నారు. ఒక్కోసారి కొంత మంది పిల్లలు శునకాలు, పిల్లులు, గొర్రెల తోకలకు టపాసులను కట్టి ఆడుకుంటారని తెలిపారు. ఇలాంటి వాటిల్లో గాయపడిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయమై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. టపాసుల ధరలు పెరగడంతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు. -
అప్పట్లో ఇది ‘బాగ్’నగర్
జ్ఞాపకం ఎం.వేదకుమార్,సామాజిక కార్యకర్త హైదరాబాద్‌కు మా ఊరు... మెదక్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 60 కిలోమీటర్ల దూరం. బాపు (నాన్న)తో తరచూ నగరానికి వచ్చిపోతూ ఉండేవాళ్లం. మొట్టమొదటిసారి (1963-64) నేను చూసింది నాంపల్లి సరాయి (గెస్ట్ హౌస్). రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. కాదంటే బాగ్‌లింగంపల్లి ‘టికానా’లో (తాత్కాలిక మకాం)బస చేసేవాళ్లం. గౌలిగూడ, పీల్ఖానా, జామ్‌బాగ్, పుత్లీబౌలీ, సుల్తాన్‌బజార్, ఉస్మాన్‌గంజ్ బాగా పరిచయం. ఇక సికింద్రాబాద్‌లో జనరల్ బజార్, కింగ్స్ వే, ప్యారడైజ్ ప్రాంతాలు తిరిగేవాళ్లం. ఇప్పటి అబిడ్స్ ప్రాంతంలో అప్పట్లో ‘అబిద్ అలీ సాహెబ్’ షాప్ ఉండేది. రిక్షాల రిథమ్... అప్పట్లో రిక్షాలకు గజ్జెలు కట్టేవారు. అవి రోడ్లపై వెళుతుంటే ఆ శబ్దం ఎంతో లయబద్ధంగా ఉండేది. ఎక్కడ చూసినా టాంగాలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవి. వాటిని ముచ్చటగా చూసేవాళ్లం. నగరానికి వచ్చినప్పుడు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నది విద్యుత్ వెలుగులు. మాకు కొత్త. గుడ్డి బస్సు భలే... ఆర్టీసీ బస్సులకు ఒకవైపే ఇంజిన్. దానిపైన క్యాబిన్. చూడ్డానికి ఒంటి కన్నులా అనిపించేవి. ‘గుడ్డి బస్సుల’ని పిలిచేవాళ్లం. ఇక డబుల్ డక్కర్ బస్సులు వురో వింత. బస్సుపై మరో అంతస్తు. అందులో ఎక్కి వెళుతుంటే... ఓ కొత్త ప్రపంచంలా ఫీలింగ్. సైకిల్ సిటీ... నగరమంతా రోడ్ల వెంబడి పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనం పరచుకున్నట్లుండేది. ఆహ్లాదాన్ని పంచే పార్కులు, హుస్సేన్‌సాగర్ అందాలు.. చూస్తుంటేనే మనసు ఉప్పొంగి పోయేది. ఇక పేదవారే కాదు, ధనవంతులు కూడా సైకిల్‌పైనే సవారీ. రిక్షా ఎక్కితే మరొకరిని శ్రమ పెట్టడమనే భావన. అందుకే కార్మికులే కాదు.. లాయర్లు, ఉద్యోగస్తులకూ ప్రియ నేస్తం సైకిల్. అప్పట్లో సైకిళ్లకు లెసైన్స్‌లు తప్పనిసరి. ‘బాగ్’ లింగంపల్లి వేలాది చెట్లతో పచ్చగా ఉండేది. అన్ని రకాల పక్షులకు నిలయమది. ‘లేక్ సిటీ’గా, ‘బైసైకిల్ఫ్రెండ్లీ సిటీ’గా, ‘బాగ్’నగరంగా సహజసిద్ధమైన అందాలతో విరాజిల్లేది నగరం. ఉస్మానియా హాస్పిటల్ ముందు మూసీకి ఆనుకుని ఉండే ‘అఫ్జల్ పార్కు’లో కాలక్షేపం చేసేవాళ్లం. ఇరానీ కేఫుల్లో చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కట్లు, బన్‌మస్కా, సమోసా ఇష్టంగా లాగించేవాళ్లం. కాస్మోపాలిటిన్... మొజాంజాహీ మార్కెట్ అప్పట్లో సూపర్ బజార్ లెక్క. మీర్ ఆలం మండీ, మోండా మార్కెట్లు బాగా ఫేమస్. అంతా ఒక ప్లాన్డ్గా వీటిని ఏర్పాటు చేశారు. వరల్డ్ బెస్ట్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మనది. ప్రతి వీధికీ కమ్యూనిటీ ట్యాప్ తప్పనిసరి. నగరం చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల ఎండాకాలం కూడా కూల్‌గా ఉండేది. అన్ని వసతులతో కళకళలాడుతూ భారత్‌లోనే తొలి కాస్మోపాలిటిన్ సిటీగా విలసిల్లింది. ఆమ్ఆద్మీ క్యాంటిన్స్, వాటిల్లో న్యూస్ పేపర్లు, ఇంటలెక్చువల్స్ డిస్కషన్స్ నడిచేవి. ప్రతి ‘మొహల్లా’ (కాలనీ), గల్లీ, ‘కోచే’ (సందులు) ప్రణాళికాబద్ధంగా ఉండేవి. దుమ్ము, ధూళి కనిపించేవి కావు. అప్పట్లో హైదరాబాద్ పోతున్నామంటే... ‘నువ్వు తెల్లగా అవుతావురా’ అనేవారు ఊళ్లో. అది గండిపేట నీళ్ల మహత్యం. భిన్నత్వంలో ఏకత్వం... తెలుగువారితో పాటు గుజరాతీలు, కాయుస్థులు, తమిళులు, రాజస్థానీలు.. అంతా ఎంతో సామరస్యంగా మెలిగేవారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినవారు ఇక్కడివారి కంటే స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడేవారు. మినీ భారత్‌ను తలపించే సంస్కృతి హైదరాబాద్‌లోనే కనిపించేది. ప్రభుత్వంతో పాటు ప్రతి కమ్యూనిటీ సొసైటీకి చెందిన విద్యా సంస్థల ద్వారా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండేది. వివేకవర్ధని, ధర్మవత్ కాలేజీ, కేశవ్ మెమోరియల్, మాడపాటి, న్యూ సైన్స్ కాలేజీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కవులు, కళాకారులకు మహా వేదిక నగరం. అన్నయ్య బి.నర్సింగరావు (ప్రముఖ దర్శకుడు), ఆయన మిత్ర బృందంతో కలిసి కల్చరల్, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. ఇలాంటివెన్నో మధురానుభూతులు నా మదిలో ఎప్పటికీ పదిలమే. -
ఆ విలువ ఇప్పుడు తెలుసుకున్నా!
గొప్పవాళ్లు అంటే డబ్బున్నవాళ్లు కాదు, మంచి మనసున్నవాళ్లు అన్న నిజాన్ని నాకెవ్వరూ చెప్పలేదు. అది తెలిసేనాటికి జరగరాని తప్పు జరిగిపోయింది. మా ఇంట్లో ఒక ఆయా ఉండేది. నేను పుట్టకముందు నుంచీ తను మా ఇంట్లోనే ఉంది. నేను పుట్టాక నన్ను మాత్రమే చూసుకునే పనిని అప్పచెప్పారు తనకి. నాన్న బిజినెస్ టూర్లు, అమ్మ పార్టీలతో బిజీగా ఉంటే ఆవిడే నన్ను పెంచింది. నేను నిద్ర లేచేసరికి టూత్ బ్రష్‌తో రెడీగా ఉండేది. నేను బడి నుంచి వచ్చేసరికి ఫలహారం పళ్లెంతో సిద్ధంగా ఉండేది. నేను నిద్రపోదామనుకునేసరికి పాలగ్లాసుతో ప్రత్యక్షమైపోయేది. ఏదీ కావాలని అడగక్కర్లేదు. తనే అర్థం చేసేసుకునేది. కానీ నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు... తనకి టీబీ సోకింది. ఆ విషయం తెలియగానే అమ్మానాన్నా తనని పని మానేసి వెళ్లిపొమ్మన్నారు. తను ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. పొమ్మన్నందుకు ఏడ్చిందనుకున్నాను కానీ కొన్నాళ్ల తర్వాత తను రాసిన ఉత్తరం చదివితే తెలిసింది... నన్ను వదిలి వెళ్లిపోలేక ఏడ్చిందని. కానీ అప్పుడిక చేసేదేమీ లేదు. ఎందుకంటే తను చనిపోయింది. కన్నుమూసే ముందు ఆ ఉత్తరం నాకు పోస్ట్ చేయమని మరీ మరీ చెప్పిందట. ఆ ఉత్తరం ఆసాంతం చదివాను. మొదటిసారి... వెక్కివెక్కి ఏడ్చాను. ఓ ఆయా కోసం ఏడవటమేంటని అమ్మ చీవాట్లు వేసింది. నేను ఒకటే మాట అన్నాను... ‘‘నన్ను పెంచింది తనే కదా అమ్మా, తన కోసం ఏడవడంలో తప్పేముంది’’ అని. నా మాటకి అమ్మకి చిర్రెత్తుకొచ్చింది. పిచ్చి మాటలు మాట్లాడకు అని నాలుగు తిట్లు తిట్టి వెళ్లిపోయింది. కానీ నేను మాత్రం తట్టుకోలేకపోయాను. నిజంగా ఆయమ్మే నన్ను పెంచింది. నా చిన్నతనమంతా తన ఒడిలోనే గడిచింది. అలాంటి మనిషికి ఏదో జబ్బు చేస్తే... నిర్దాక్షిణ్యంగా గెంటేస్తుంటే... నేను కనీసం మాట్లాడలేదు. ఆమె మీద జాలి కూడా చూపించలేదు. తను ఏడుస్తోంది నా కోసమేనని కూడా నాకు అర్థం కాలేదు. డబ్బు విలువ తప్ప బంధాల విలువ తెలియకుండా పెరిగాను కదా! అంతకంటే ఎలా ప్రవర్తిస్తాను! పాపం వైద్యానికి కూడా డబ్బులేక చాలా అవస్థ పడి చనిపోయిందని, చివరి వరకూ నన్నే తలచుకుందని తన కూతురి ద్వారా తెలిసింది. నేను అనుకుంటే నాన్నను అడిగి ఆయమ్మకి సాయం చేసి వుండవచ్చు. కానీ అలా చేయలేకపోయినందుకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి కదా! అందుకే అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా సోషల్‌వర్క్ చదివాను. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆయమ్మ లాంటి పేదవాళ్లందరికీ ఉచిత వైద్యం చేయిస్తున్నాను. ఇప్పుడు నేనందరికీ ఒకటే చెబుతున్నాను... ఎవరి విలువైనా వాళ్లు ఉన్నప్పుడే తెలుసుకోండి, తర్వాత తెలుసుకున్నా ఉపయోగం ఉండదు. అంతేకాదు... అనుబంధాలు, ఆప్యాయతల కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. ఆ నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకండి! - అవంతిక, కాన్పూర్ -
మోడీ- సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ..?
నరేంద్ర మోడీ- సామాజిక కార్యకర్త, ఎల్ కే అద్వానీ- జర్నలిస్ట్, రాజ్‌నాథ్ సింగ్- టీచర్, మురళీ మనోహర్ జోషి- ప్రొఫెసర్, సోనియా గాంధీ- రాజకీయ, సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ- వ్యూహ సలహాదారు(స్ట్రాటజీ కన్సల్టెంట్)... ఏమిటీ అగ్ర నాయకులందరూ రాజకీయాలు వదిలేసి ఇలా ఎప్పుడు మారిపోయారని అనుకుంటున్నారా. కంగారు పడకండి వీరంతా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. రాజకీయాల పరంగా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారన్న ప్రశ్నకు ఆయా నాయకులు ఇచ్చిన సమాధానాలివి. ఈ జాబితాను పార్లమెంట్ వెబ్సైట్ లో పెట్టారు. 16వ లోక్‌సభలో ఉన్న 539 మంది ఎంపీలను ఆయా వృత్తులు పరంగా 33 విభాగాల కింద పొందుపరిచారు. ఇందులో వ్యవసాయదారులు, బిల్డర్లు, వైద్యులు, విద్యావేత్తలు, టీచర్లు, క్రీడాకారులు, కళాకారులు, మతబోధకుడు, సామాజిక సంస్కర్తలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను రచించిన వ్యూహాలు ఘోరంగా విఫలమైనా రాహుల్ గాంధీ తనను స్ట్రాటజీ కన్సల్టెంట్ గా చెప్పుకోవడం విశేషం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బర్హంపూర్ ఎంపీ ఆదిర్ రాజన్ చౌదరీ.. తాను సామాజిక సంస్కర్తగా పేర్కొనడం మరీ విడ్డూరం. ఎందుకంటే ఆయనపై ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. భారత టెస్టు క్రికెటర్ కీర్తి ఆజాద్- క్రీడాకారుడిగా చెప్పుకోవడానికే ఇష్టపడ్డారు. ఇక యువ ఎంపీ అనురాగ్ థాకూర్ ఒక్కరే క్రికెటర్ గా చెప్పుకున్నారు. శశి థరూర్ తనను తాను దౌత్యవేత్తగా పరిచయం చేసుకున్నారు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే మత బోధకుడిగా చెప్పుకున్నారు. పూనమ్ మహాజన్- బిజినెస్ పర్సన్-గా, మేనకా గాంధీ- రచయితగా, సౌగతా రాయ్-విద్యావేత్తగా తమను తామను నిర్వచించుకున్నారు. సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లు న్యాయవాద వృత్తిపై మక్కువ చూపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా-రాజకీయ, సామాజిక కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడ్డారు. -
ఉద్యమించిన మానవత్వం
రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా: హేతువాదం-కాంతికిరణాలు-చీకటి వెలుగులు వంటి నవలలు, భారతీయ భాషలలోకి అనువాదమైన ‘హిందూయిజం అండ్ ఉమెన్: రీజనల్ పర్స్పెక్టివ్ 1860 - 1993’ వంటి వ్యాససంపుటిలు అనేకం ఆమె వెలువరిం చారు. సమాజంలో మహిళల స్థానం (1985), మహిళలు - శాంతి (1986), వరకట్న దురాచారం (1987), అశ్లీలత (1987), లైంగిక స్వేచ్ఛ (1989), సాహిత్యం-మహిళ- సంస్కరణ-విప్లవం(1992), పెళ్లి-నాడు-నేడు(1993) వంటి అంశాల మీద గోష్టులు నిర్వహించారు. ‘నల్లవారి స్వేచ్ఛ-సమానత్వం కోసం కృషి చేసిన అబ్రహాం లింకన్, కెనడీ తెల్లవారిచేత హత్యచేయబడినట్లే నల్లవారికోసం పనిచేస్తోన్న మార్టిన్ లూథర్ కింగ్ కూడా తెల్లవాడి చేత హత్యచేయబడ్డాడు’ 1964లో రేడియోలో ఈ వార్త విన్న కోట్లాది ప్రజలు దుఃఖించారు. కొందరు అందులో దాగిన జాతి వివక్షను గుర్తించి ఆక్రోశం చెందారు. ఆగ్రహించారు. అటువంటి వారిలో గురువారం కన్నుమూసిన మల్లాది సుబ్బమ్మ ఒకరు. ఈ సంఘటన ఆమెను నిలువనివ్వలేదు. ఈ వివక్షత తెల్లవారిలోనే ఉందా? మనలో లేదా! ఆలోచనల దొంతరలు. ‘నల్ల భార్యవల్ల నల్ల పిల్ల పుట్టిందని ఒక భర్త భార్యాపిల్లలను వదలివేసి తెల్లగా ఉన్న భార్యను మరోపెళ్లి చేసుకుంటాడు.’ సుబ్బమ్మ రాసిన తొలి కథ ‘పనికి రాని ముత్యం’ పత్రికల నుంచి తిరుగు టపాలో వచ్చింది. ఎందుకని? ఇతివృత్తాన్ని కొంచెం మార్చి, అనేక కథలు చదవగా అలవడిన మెరుగుపడిన శైలితో అదే ఇతివృత్తాన్ని మార్చి పంపింది. పదేళ్ల తర్వాత కథ ప్రచురితం అయ్యింది! తనను తాను నిత్యం సానబెట్టుకున్న మల్లాది సుబ్బమ్మ వ్యక్తిత్వానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ! ‘మలిన’గురువులు! గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో 1924 ఆగస్టు 2న జన్మించిన సుబ్బమ్మకు బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తితో బాల్యంలోనే వివాహం అయ్యింది. ‘శుద్ధ’ శోత్రియ కుటుంబం. 22వ ఏటకే నలుగురు బిడ్డలను కన్నారు. భర్త లిబరల్. అత్త అమాయక అద్వైతి. ఆమె గురువు ఆషాఢభూతి. శిష్యులు ధన-మాన-ప్రాణాలను సంతోషంగా సమర్పించుకోవాలన్న ‘మలిన’ గురువు మహత్యం(ఆమె మాటల్లోనే)తో సుబ్బమ్మ రెబెల్ అయ్యింది. మెతకవాడయినా మంచివాడయిన భర్త సహకారంతో మరచిపోయిన అక్షరాలను మళ్లీ దిద్దారు. గ్రంథా లయాలలో ప్రపంచ సాహిత్యాన్ని చదువుతూ అనుభవానికి నిలిచే పరీక్షలతో హేతువాదిగా రూపొందారు. ఆత్మవిశ్వాసోద్యమం! మూఢనమ్మకాలను స్వానుభవంతో వ్యతిరేకించిన మల్లాది సుబ్బమ్మకూ విశ్వాసం ఉంది. అది మతగ్రంథాలలోంచి, సిద్ధాంతాలలోంచి వచ్చింది కాదు. తనలోని చైతన్యానికి కారణం తనలోని ఆత్మవిశ్వాసమేనని పలుమార్లు, పలు వేదికలపై వ్యాసాల ద్వారా చెప్పారు. తనపై తాను విశ్వాసం కోల్పోయిన వ్యక్తి బానిసేనని, బానిసలు స్వేచ్ఛను కోరవచ్చేమో కాని పొందలేరని స్పష్టం చేసేవారు. తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచే సిద్ధాంతాలను, పార్టీలను, సంఘాలను చూశారు. కాబట్టే లిబరల్ ఫెమినిస్టులు పెట్టుబడిదారుల ప్రయోజన చట్రాల్లో పనిచేస్తారని, మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌లు వర్గసిద్ధాంతాల ప్రయోజనాల పరిధిలోనే పనిచేస్తారని భావించారు. ప్రతి మహిళ తనను తాను ముందుగా మనిషిగా భావించాలని, పురుషుడూ అలా భావించాలని, సహజాతాలరీత్యా అంగీకరించని పురుషాధిక్యతపై పోరాడేందుకు ‘రాడికల్ హ్యూమనిజం’ ఆసరా తీసుకోవాలని సూచించారు. ఫెమినిస్ట్లను స్త్రీత్వం కోల్పోయిన వారిగా విమర్శించే పురుషాధిక్యులను చీల్చి చెండాడుతూనే ‘అశ్లీలతా ఛాందసం’పై కూడా చురకలం టించారు. సమానుల మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది. అసమానుల మధ్య ప్రేమ ఎలా సాధ్యం అంటూ పురుషప్రపంచాన్ని ప్రేమాస్పదులు కావలసినదిగా హితవు పలికారు. ఏది అశ్లీలం? ఏది అసభ్యత? ఎవరు నిర్ణయిం చాలి!’ అనే వ్యాసంలో ‘కాంతుడు నీవు ఏకాంతమున పెనగువేళ’ తరహా రామదాసు తదితరుల అభివర్ణనలను ఉదహరిస్తూ సాహిత్యాన్ని చూడాల్సిన సౌందర్యదృష్టినీ ప్రతిపాదించారు. మల్లాది సుబ్బమ్మకు తనదైన పరిశీలన ఉంది. విషపానం చేస్తూ ‘మగువను మగవారితో సమానం చేస్తే ఆమె అతనికంటే అధికురాలవుతుంద’న్న సోక్రటీస్ పట్ల మల్లాది సుబ్బమ్మ కారుణ్యాన్నే ప్రదర్శించారు ‘భార్యపరమగయ్యాళి కాబట్టి అపోహ పడ్డారని’ వ్యాఖ్యానించడం ద్వారా! పున్నా కృష్ణమూర్తి -
యువత చేతిలో సమాజాభివృద్ధి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నెహ్రూ యువకేంద్రం, సెట్‌శ్రీ, వివేకానంద సేవా సమితి, యంగ్ ఇండియా సంయుక్తంగా అంబేద్కర్ అడిటోరియంలో ఆదివారం నిర్వహిం చాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ యువత మేల్కొని సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటే దేశ స్థితిగతులు మారుతాయన్నారు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్- వీక్నెస్ ఈజ్ డెత్ అని పేర్కొంటూ భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అనేక సర్వేలు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారన్నారు. ఆ స్థానం పొంద డానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కనీసం 10 లక్షల మంది యువత ఉందని, వారందరూ సమా జాన్ని నడిపించే సారథులు కావాలన్నారు. వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించడంలో, బడిమానేసిన వారిని తిరిగి బడిబాట పట్టేలా చేయడం, క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడం, సాక్షర భారత్ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం 20 రూపాయలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పొందూరు మండలంలో ఎంఎస్సీ చదివిన యువకులు చెత్త సేకరణకు ముందుకు వచ్చారంటూ.. వారిని అభినందించారు. గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకుగాను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలను ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు సూర్యమహాల్ కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురి రక్తదానం వివేకానందుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పలు వురు రక్తదానం చేశారు. కె.ఆర్.స్టేడియంలో రిమ్స్ ఆధ్వర్యంలో రక్తదాన సేకరణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో సహా పలువురు రక్తదానం చేశారు. కార్యక్ర మంలో ఎన్‌వైకే జిల్లా సమన్వయకర్త కె.వి.రమణ, సెట్‌శ్రీ సీఈఓ వి.వి.ఆర్.ఎస్.మూర్తి, కేంద్ర సహాయమంత్రి కె.కృపా రాణి ఓఎస్డీ సురంగి మోహనరావు, హైదరాబాద్ రామకృష్ణ మఠానికి చెందిన కె.ఎల్.మూర్తి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మో హన్‌రావు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారా యణ పాల్గొన్నారు. -
బయటపెట్టండి!
ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. దిసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ ఆదివారం డిమాండ్ చేశారు. అప్పుడే కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారి ముఖాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నివేదిక సిద్ధమై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిని మరాఠీలోకి మార్చుకోలేకపోవడంపై గల్గాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం నివేదికను మరాఠీలోకి మార్చుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులెవరో నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను వేసి, రూ. 7.04 కోట్లు ఖర్చుచేసిందని, దానిని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి చర్చ జరిపేందుకు నిరాకరించడమెందుకని ప్రశ్నించారు. కుంభకోణానికి పాల్పడిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే కవచంలా ఉండి కాపాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చవాన్ కార్యదర్శి భగవాన్ సాహేకు లేఖ రాశారు. ‘రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి నివేదికను ఆంగ్లంతోపాటు మరాఠీలోకి అనువదించుకోవాలి. ముంబై ఉగ్రదాడిపై నియమించిన రామ్‌ప్రధాన్ కమిటీ నివేదికను రెండు భాషల్లో సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదర్శ్ కుంభకోణం నివేదిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగ లో తొక్కుతోంద’ని లేఖలో పేర్కొన్నారు. -
పటిష్టమైన జనలోక్‌పాల్ బిల్లు కావాలి
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అవినీతిని బయటపెట్టేందుకు పటిష్టమైన జనలోక్‌పాల్ కావాలని ‘మన కోసం’ సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివరామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం 3వ రాష్ట కమిటీ సమావేశం పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో గల ఒక హోటల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోరలు లేని లోక్‌పాల్‌బిల్లు తీసుకురావటం వల్ల ప్రజలకు ఉపయోగం లేనదన్నారు. 2005లో కేంద్ర ప్రభుత్వం సహ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు. నాటి నుంచి సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప చట్టం అమలు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటం లేదని ఆరోపించారు. సహ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు అవసరమైన సిబ్బంది, నిధులు, అధికారులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తను ఏర్పాటు చేయటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చన్నారు. అన్ని రాజకీయపార్టీలను కూడా సహ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేజ్రీవాల్ స్ఫూర్తితో మనకోసం సంస్థ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, ప్రధాన కార్యదర్శి జాస్తి తాతారావు, ఉపాధ్యక్షుడు జి.నాగరత్నం నాయుడు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన కమిటీ వివరాలు రాష్ట్ర అధయక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి.మురళి, కోశాధికారిగా కె.రాజారావు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఐదుగురు ప్రచార కార్యదర్శులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉన్నారు.