సాక్షి, మైసూరు: 'రాష్ట్రంలో ఆరుగురు మంత్రుల సీడీలు ఉన్నది నిజం. అందుకే వారు సీడీలను బయటపెట్టరాదని కోర్టుకు వెళ్లారు' అని సామాజిక కార్యకర్త రాజశేఖర ములాలి అన్నారు. శనివారం నాడు ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఆరుమంది మంత్రులతో పాటు మొత్తం 68 మంది తమ వీడియోలను ప్రసారం కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్నట్లు చెప్పారు.
కాగా కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీలల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం వీడియో విడుదల చేయగా.. ఇది ఢిల్లీ నుంచే అప్‌లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ సీడీ కేసులో ఉన్న అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపైకనా సిట్ కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. దీంతో ఇదివరకే ఐదారు మందిని విచారించి సమాచారం సేకరించింది.
చదవండి: ఆ యువతి తెలుసు.. ఏ పాపం తెలీదు
Comments
Please login to add a commentAdd a comment