రాజకీయ మురికికి దూరంగా ఉంటా: హజారే
రాలేగావ్ సిద్ధి: తాను రాజకీయ మురికి కూపానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నా హజారే చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘జన్ లోక్‌పాల్’ కోసం ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తానని చెప్పారు. బుధవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాను ఫోన్ చేసిన అన్నా సమాధానమివ్వలేదని కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయ మురికికి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆ మురికిలో నేను ఉండలేను’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో బేడీ చేరికపై అడగ్గా.. దానిపై తానేమీ మాట్లాడనని చెప్పారు.