Anna Hazare
-
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాహజారే రియాక్షన్
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్న అన్నాహజారే.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారన్నారు.గతంలో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి అన్నాహజారే.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌పై అన్నాహజారే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు.. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సందర్భంలోనూ ఆయన మండిపడ్డారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. 50 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీదే హవా చూపుతోంది. ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అవినీతి కేసుల్లో చాలామంది నేతలు ఇరుక్కోవడం ఆప్‌కు వ్యతిరేకతగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడంతో పలువురు ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు పెరిగాయి. మరోవైపు, ఢిల్లీసీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మరింత దిగజార్చాయి. -
వారికే ఓటేయండి.. అన్నా హజారే పిలుపు
ముంబై: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మచ్చ లేని వ్యక్తిత్వం కలిగిన వారు, దేశం కోసం త్యాగం చేయగలిగే వారికే ఓటేయాలని ఢిల్లీ పౌరులకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు. అలాగే, అప్రయోజకులకు ఓటు వేయవద్దని, అలాచేస్తే దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అన్నా హజారే శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నా హజారే..‘త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు కలిగిన వారు, సన్మార్గంలో నడిచేవారు, అవమానాలను దిగమింగి అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు.ఇదే సమయంలో ‘నేను తాగుతాను కాబట్టి, ఇది ఇతరులు కూడా తాగేందుకు అనుకూలంగా ఉంటుంది’ అనే వైఖరి ఎన్నికల ప్రక్రియలో పనికి రాదన్నారు. ఢిల్లీ కేంద్రంగా గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఆయనతో పోరాటంలో పాలుపంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ అనంతర కాలంలో ఆప్‌ను స్థాపించి, ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడం హజారేకు ఇష్టంలేదు. ఆ తర్వాత పరిణామాల్లో ఇద్దరూ దూరమయ్యారు. -
సీఎం కేజ్రీవాల్ ఇలా చేస్తారనుకోలేదు.. ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తి
సాక్షి, బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి ( India Against Corruption) కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో కేజ్రీవాల్‌తో పాటు ఎన్.సంతోష్ హెగ్డేలు ఉన్నారు. అయితే నాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ నేడు లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై హెగ్డే స్పందించారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర నిరాశ చెందాను. ఆప్ (అధికారంలోకి వచ్చిన తర్వాత) అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తుందని అనుకున్నాను. కానీ అది జరగలేదు.అధికారంతో భ్రష్టుపట్టించారని పీటీఐతో మాట్లాడారు. ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం ‘‘ ఈరోజు రాజకీయాలు అవినీతి గుహగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి విముక్తి పొందలేదు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం కూడా అదే. రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే మా సూత్రం. ఉద్యమం కాస్త రాజకీయ పార్టీగా కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆప్‌ను స్థాపించారు. అప్పుడే నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. పార్టీ పెట్టి అవినీతి నిర్మూల చేస్తానని అనుకోలేదు. అది జరగదు కూడా. అందుకు కేజ్రీవాల్ అరెస్టే ఉదాహరణ’’ అన్నారు. ఉద్యమం కొనసాగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపన జరిగింది. అందులో చేరాలంటూ కేజ్రీవాల్ తనని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే అందుకు నేను ఒప్పుకోలేదని నాటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విపక్షాల విమర్శల్లో అర్ధం లేదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని, వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విపక్షాలు ఆరోపణలపై హెగ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు . ప్రతిపక్షాన్ని నాశనం చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణల్ని నేను నమ్మను. అవును.. ఎంపిక చేసి నేతల్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అది నేరం కాదు. ఎందుకంటే న్యాయ శాస్త్రంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ,ఈడీలు ఇలా చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే మద్దతు పలికారు. -
‘లిక్కర్’కు దూరంగా ఉండాలని హెచ్చరించా: అన్నా హజారే
ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఆయన చర్యలే కారణమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. మద్యం పాలసీకి సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌ను చాలా సందర్భాల్లో హెచ్చరించానని అన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మద్యం మనిషి ఆరోగ్యానికి హానికరమని చిన్న పిల్లలకు కూడా తెలుసు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పాను. లిక్కర్ పాలసీని రూపొందించడం మన ఉద్యోగం కాదని వివరించా. అయినా వినలేదు. పాలసీని రూపొందించి అమలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేయకపోతే అరెస్టై ఉండేవారే కాదు. మరింత ఎక్కువ డబ్బు సంపాదించడానికే మద్యం పాలసీని కేజ్రీవాల్ తయారు చేసి ఉంటారు. మద్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో నాతో కలిసి పనిచేసిన కేజ్రీవాల్ అదే మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అరెస్టు కావడం బాధ కలిగిస్తోంది’’ అని అన్నా హజారే పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దశాబ్దం క్రితం జరిగిన ఉద్యమంలో అన్నా హజరే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రధాన ప్రతిపక్ష నేతలందరూ అతడికి మద్దతుగా నిలవగా.. హజారే మాత్రం ఢిల్లీ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని మండిపడ్డారు. తనతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి.. ఈరోజు మద్యం పాలసీ రూపొందించినందుకు బాధపడుతున్నానని అన్నారు. లిక్కర్ పాలసీపై కేజ్రీవాల్‌కు లేఖ రాశానని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. తన సొంత లాభం కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. ఆప్ మద్యం పాలసీని రూపొందించకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నపుడు నేను ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పాను. లిక్కర్ పాలసీని వదిలేయమని కేజ్రీవాల్‌కు చాలాసార్లు చెప్పారు. అయినా అతను వినలేదు. డబ్బులకు ఆశపడి పాలసీ రూపొందించారు. కేజ్రీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదు. ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను. అతను నా మాట వినలేదు. అయినా ఇప్పుడు ఏం చేయలేం. చట్టం తనపని తాను చేస్తుంది’ అని అన్నా హజారే పేర్కొన్నారు. చదవండి: అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం #WATCH | Ahmednagar, Maharashtra: On ED arresting Delhi CM Arvind Kejriwal, Social activist Anna Hazare says, "I am very upset that Arvind Kejriwal, who used to work with me, raise his voice against liquor, is now making liquor policies. His arrest is because of his own deeds..." pic.twitter.com/aqeJEeecfM— ANI (@ANI) March 22, 2024 కాగా హజారే గతంలోనూ లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. 2022లో ఆయన కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో..‘ మీరు సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి లేఖ రాస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వ రూపొందిన మద్యం పాలసీ గురించి ఇటీవల వార్తల్లో చూసి నేను బాధపడ్డాను. మద్యం లాగే, అధికారం కూడా మత్తుగా ఉంటుంది. మీరు అధికారం మత్తులో ఉన్నారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అన్నా హజారే 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. దీని నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. ఆ సమయంలో కేజ్రీవాల్‌కు తన ఆశీస్సులు అందించి.. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు హజారే. అయితే ఆ తర్వాత ఆప్ పార్టీపై హజారే పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. కానీ కేజ్రీవాల్ కానీ ఆయన పార్టీ నేతలను కానీ హజారే విమర్శలపై స్పందించలేదు. మరోవైపు అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నారు కేజ్రీవాల్. తన ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ కలాం రోడ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి బస చేశారు. నేడు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. పదిరోజుల కస్టడీ కోరనుంది. -
అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్ కౌంటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంపై విమర్శలు గుప్పిస్తూ ప్రముఖ గాంధేయవాది, ఉద్యమకారుడు అన్నా హజారే బహిరంగ లేఖ రాయటంపై కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ గురిపెడుతోందన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే.. సీబీఐ మాత్రం ఎలాంటి స్కాం జరగలేదని నిరూపించిందన్నారు. ‘లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే.. సీబీఐ ఎలాంటి కుంభకోణం జరగలేదని తేల్చింది. వారి మాటలను ప్రజలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ ఎక్కుపెడుతోంది. అన్నా హజారేను బీజేపీ ఉపయోగించినట్లు ప్రముఖ వ్యక్తులను ఉపయోగించటం రాజకీయాల్లో సాధారణమే.’ అని ఆరోపించారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంపై వివాదం తలెత్తిన క్రమంలో తన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు అన్నాహజారే. ముఖ్యమంత్రి అయ్యాక అధికారం అనే మత్తుతో విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదని, అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో చిక్కుకున్నారని దుయ్యబట్టారు అన్నా హజారే. ఇదీ చదవండి: అధికారంతో విషమెక్కావ్.. ఆదర్శాలను తుంగలో తొక్కావ్!.. ఆప్ సర్కార్‌పై అన్నా హజారే ఆగ్రహం -
అధికారంతో విషమెక్కావ్.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే ఆగ్రహం
రాలేగావున్/ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ గాంధేయవాది ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్. నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్?.. నువ్వు, మనీశ్ సిసోడియా, అంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది అని ఆయన లేఖలో మండిపడ్డారు. నేను సూచించినట్లుగా.. మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో. అయినా బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆగ్రహం వెల్లగక్కారు హజారే. మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో మండిపడ్డారు హజారే. తన స్వస్థలం రాలేగావున్లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో కితాబిచ్చారాయన. ఇదీ చదవండి: నాకు క్లీన్ చిట్ దొరికిందోచ్! -
అన్నా ఉద్యమాన్ని మోసం చేసి ‘ఆప్’ పుట్టింది: హర్యానా మంత్రి
హర్యానా: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 2011లో సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అన్నా హజారే ఉద్యమన్ని మోసం చేయడం వల్లనే ఆప్ పుట్టిందని అన్నారు. ‘ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఆందోళనను మోసం చేయడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. పంజాబ్ ప్రజలు అటువంటి వారిని(ఆప్) ఎన్నుకున్నారు, భవిష్యత్తులో వారు తమ వాగ్దానాలను నెరవేర్చగలరో? లేదా విఫలమవుతారో? చూద్దాం’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి అనిల్ విజ్.. ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఢిల్లీ వీధుల్లో మద్యం అమ్మడంలో ప్రావీణ్యం సంపాదించిందని దుయ్యబట్టారు. అటువంటి పార్టీ పంజాబ్‌లో గెలవడం వల్ల ఆ రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే. -
ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష
పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
ఆదాయం కోసం ప్రభుత్వం అడ్డదారులు: అన్నా హజారే
సాక్షి, ముంబై: సూపర్ మార్కెట్లలో, కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతుండగా, ప్రముఖ సమాజ సేవకుడు అన్నా హజారే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని సోమవారం అన్నాహజారే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం రైతుల హితవు కోసం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క వైన్ అంటే మద్యం కాదని కూడా అంటోంది. కానీ ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ విక్రయం ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో త్వరలో బయటపడు తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజ్యాం గం ప్రకారం ప్రజలను వ్యసనాల నుంచి, మాదక ద్రవ్యాలనుంచి విముక్తి చేయడం, మద్యపానానికి దూరంగా ఉంచడం ప్రభుత్వాల విధి. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాల ద్వారా, జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వమే అదనపు ఆదాయం కోసం వ్యసనాలకు బాట వేసే నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల హితవు కోసమైతే పేదలు, సాధారణ రైతులు పండించిన పంటలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. కానీ రైతులకు మేలు చేసే అలాంటి చర్యలను విస్మరిస్తూ, యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల లీటర్ల వైన్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు 2021 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీపై విక్రయ పన్ను 300 శాతం నుంచి 150 శాతానికి కుదించింది. మద్యం ధరలు తగ్గడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా 2.5 లక్షల బాటిళ్ల విక్రయం పెరిగిపోయింది. ప్రభుత్వానికి లభించే రూ.100 కోట్ల ఆదాయం ఏకంగా రూ.250 కోట్లకు చేరుకుంది. ప్రజలు మద్యానికి బానిసలై సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఆదాయం పెరిగితే చాలని ప్రభుత్వం అనుకుంటోందా అని హజారే ప్రశ్నించారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కొందరు మంత్రులు ఈ నిర్ణయాన్ని సమరి్ధస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అదనపు ఆదాయం కోసం మద్యం విక్రయానికి మార్గం సుగమం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమంటే రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుందని నిలదీశారు. ఔరంగాబాద్‌లో విక్రయించండి చూద్దాం: ఇమ్తియాజ్ జలీల్ కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతివ్వాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఔరంగాబాద్ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి మహాయోధుడు ఏలిన రాష్ట్రం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన ఇలాంటి పుణ్యభూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇంకా ఎవరైనా సరే ఔరంగాబాద్‌కు వచ్చి కిరాణ షాపుల్లో వైన్ విక్రయాన్ని ప్రారంభించి చూపాలని సవాలు విసిరారు. ఆ తరువాత షాపులను ధ్వంసం చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నామని ఇమ్తియాజ్ అన్నారు. వైన్ విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. వైన్ విక్రయాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే చరస్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల పంటలను కూడా పండించేందుకు అనుమతివ్వాలని ఇమ్తియాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీది ద్వంద్వ వైఖరి: భుజ్‌బల్ సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి అనుమతించిందని, అక్కడ తప్పు కానిది, మహారాష్ట్రలోనే తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష బీజేపీది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వం పెద్దమొత్తంలో మద్యం విక్రయాలకు, బార్లను సైతం తెరవడానికి అనుమతి ఇచ్చారు. మహారాష్ట్రలోనే బీజేపీకి ఇది తప్పుడు నిర్ణయంగా కనిపిస్తోందా అని మాలిక్ ప్రశ్నించారు. ‘వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్ణయం రైతులకు కచ్చితంగా ఆర్థికంగా సహాయపడుతుంది. కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తారు. మా ప్రభుత్వ నిర్ణయ మాత్రం రైతులకు మేలు చేసేందుకే’ అని ఆయన సమర్థించుకున్నారు. అయితే ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు వైన్‌ను విక్రయించకూడదని, నిషేధం అమలులో ఉన్న జిల్లాల్లోనూ వైన్ అమ్మకాలను అనుమతించబోమని భుజ్‌బల్ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఉపసంహరించుకుందని, మహారాష్ట్రను ‘మద్య’రాష్ట్ర చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. -
అన్నా హజారేకు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. 84 ఏళ్ల అన్నా హజారేకు ఛాతిలో నొప్పి రావడంతో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు. అన్నా హజారేకు యాంజియోగ్రఫీ పరీక్షలు చేయగా గుండెలోని కరోనరీ ఆర్టెరీలో చిన్న బ్లాకేజీ ఉన్నట్లు తేలిందని, దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకావం ఉందన్నారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రికి కాల్ చేసి అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. చదవండి: కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే! -
10 రోజుల్లో ఆలయాలు తెరవకపోతే..: అన్నా హజారే
సాక్షి, ముంబై: రాష్ట్రంలో కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ పది రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. లేకపోతే జైల్ భరో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్ షాపులు కూడా తెరిచే ఉంటున్నాయని, ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని అన్నా హజారే నిలదీశారు. పది రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్ బచావ్ కృతి సమితి జైల్ భరో నిర్వహిస్తుందని, అందుకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల వల్ల గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నియమాలను దశలవారీగా సడలిస్తున్నారు. దీంతో బార్లు, వైన్ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార రంగ సంస్థలు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లాక్డౌన్ నియమాలకు కట్టుబడి జనాలు కూడా నిర్భయంగా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. వివిధ సేవా సంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతినివ్వడం లేదు. దీంతో అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మందిర్ బచావ్ కృతి సమితి బృందం రాళేగణ్‌సిద్ధి గ్రామంలో అన్నా హాజారేతో భేటీ అయి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే, ఆలయాలను మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: BMC Election 2022: ఆ ఓట్లన్నీ బీజేపీకే.. చెక్ పెట్టేందుకు శివసేన.. -
అందుకే మరోసారి లేఖ రాశా: హజారే
పుణే: ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతకు ఉపసంహరించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తనకు భద్రత కల్పించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. తనకు గతంలో బెదిరింపులు వచ్చినా లెక్కచేయలేదన్నారు. ఇటీవల చాలామందికి భద్రతను తగ్గించడం లేదా తొలగించిన ప్రభుత్వం తను కోరినా స్పందించలేదన్నారు. అందుకే మరోసారి లేఖ రాశానని హజారే పేర్కొన్నారు. కాగా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం సెక్యురిటీ పెంచడం గమనార్హం. వై ప్లస్ సెక్యూరిటీ నుంచి జెడ్ ప్లస్‌కు పెంచారు. 29 మంది నాయకుల భద్రతా కేటగిరీలో మార్పులు చేసింది. -
లోక్‌పాల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: సామాజికవేత్త్త అన్నా హజారే దీక్షను విరమించడంతో లోక్‌పాల్ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌గా భావించే లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ అయింది. అర్హతలు, నిబంధనలు ► లోక్‌పాల్ చైర్మన్ పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన వారు లేదా అవినీతి వ్యతిరేక విధానాలు, ప్రజా పాలన, విజిలెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, న్యాయ శాస్త్రం, మేనేజ్మెంట్ తదితర రంగాల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు. ► 45 ఏళ్లకు తక్కువగా ఉన్నవారు అనర్హులు. ► లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. అందులో నలుగురు న్యాయశాస్త్రంలో అనుభవం కలిగి ఉండాలి. ► కనీసం నలుగురికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళల నుంచి అవకాశం కల్పిస్తారు. ► చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది అమలవుతుంది). ∙చైర్మన్ జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాలకు సమానంగా ఉంటాయి. సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా చెల్లిస్తారు. ∙పదవీ కాలంలో వారు ఎలాంటి ఇతర లాభదాయక పదవులు నిర్వహించరాదు. ఎన్నికల్లో పోటీచేయరాదు. ∙దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 22. -
అవినీతి అంతంచేసే చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ కింద కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, మహరాష్ట్రలో లోకాయుక్తను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత వారం రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం విరమించిన విషయం తెల్సిందే. హజారే దీక్షను విరమింపచేసేందుకు జూనియర్ మంత్రులను పంపించినా లాభం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి హజారే దీక్షను విరమింప చేశారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తానని ఫడ్నవీస్ హామీ ఇచ్చి ఉండవచ్చుగానీ కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తానని ఏ హోదాలో హామీ ఇచ్చారో, ఆ హామీని అన్నా హజారే ఎలా విశ్వసించారో వారికే తెలియాలి. ‘దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా భారత యుద్ధం’ అంటూ అన్నా హజారే పోరాటం చేయడం వల్లనే 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాటి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతో తోడ్పడింది. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్ర మోదీ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేక పోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించని మోదీ లోక్‌పాల్‌ను నియమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో! 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారెవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆర్జేడీ నాయకుడు లాలూను జైలుకు పంపించడం, యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతిలపై, పశ్చిమ బెంగాల్లో పోలీసు కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరపడం రాజకీయ కక్షలే తప్పించి అవినీతి నిర్మూలనా చర్యలు ఎంత మాత్రం కావు. నేతల అవినీతిని పక్కన పెడితే అధికార యంత్రాంగంలో, సైనికుల్లో, పోలీసుల్లో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఎలాంటి చట్టాలను తీసుకరాలేదు. అన్ని ప్రభుత్వ రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అందుకు చట్టాలను తీసుకొచ్చినట్లయితే సగం అవినీతి దానంతట అదే తగ్గిపోయి ఉండేది. మోదీ ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం గహ నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచింది. తద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు లబ్ధి చేకూరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో ఇలాంటి చట్టాలను తీసుకరావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకతు ఆస్కారమిస్తూ అవినీతి బట్టబయలకు అవకాశం ఇస్తున్న ‘సమాచార హక్కు’ చట్టాన్ని నీరుకార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం విచిత్రం. తనతో సహా కొంత మంది మంత్రుల విద్యార్హతలను సమాచార హక్కు కింద వెల్లడించకుండా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ను పీఎంవో కార్యాలయం అడ్డుకున్న విషయం తెల్సిందే. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడానికి వీలుగా వారి జీతభత్యాలను, పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయించే విధంగా సమాచార చట్టంలో రహస్యంగా సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుల జడ్జీలతో సమానంగా కేంద్ర సమాచార కమిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జీల జీతభత్యాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయిస్తుందన్న విషయం తెల్సిందే. పార్లమెంట్‌ను మభ్యపెట్టడం ద్వారా కేవలం కేబినెట్ ఆమోదంతో ఆ సవరణ తీసుకరావాలనుకుంది. అదికాస్త బయటకు పొక్కడంతో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక పోయింది. గోవా పోలీసు అధికారి అమ్జద్ కరోల్ 2014లో ఓ పేద మహిళలను బహిరంగంగా వివస్త్రను చేసి చితకబాదినా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విధుల నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ 2017లో అధికారుల అవినీతి కారణంగా తమకు ఎంత అధ్వాన్నమైన ఆహారాన్ని ఇస్తున్నారో వీడియో ద్వారా బయటపెడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోకపోగా క్రమశిక్షణారాహిత్యం కింద బహదూర్ యాదవ్‌ను తొలగించారు. ఢిల్లీలో ప్రతిష్టాకరమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్) ఆస్పత్రిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అప్పటి ఆస్పత్రి విజిలెన్స్ కమిషనర్ మెగసెసే అవార్డు గ్రహీత సంజీవ్ చతుర్వేదీ బయటపెట్టినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడానికి బాధ్యుడయిన ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌పైనా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చట్టాలు అవసరం. అందుకు చిత్తశుద్ధి ఇంకా ఎంతో అవసరం. -
అన్నా హజారే దీక్ష విరమణ
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర) : అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం దీక్షను విరమించారు. తన డిమాండ్లను నెరవేర్చేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన హామీతో దీక్ష విరమిస్తున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. లోకాయుక్త నియామకంపై ఫిబ్రవరి 13న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీక్ష విరమణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హజారే వెల్లడించారు. సీఎంతో చర్చలు సంతృప్తికరంగా సాగడంతో తాను సంతోషంగా దీక్ష విరమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్ అమలు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ దిశగా ఈనెల 13న నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. లోకాయుక్త కోసం జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తారని, రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం స్వయంగా అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధి గ్రామానికి చేరుకుని ఆయనతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర స్ధాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల పరిదిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని అన్నా హజారే చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
పద్మభూషణ్ వెనక్కిచ్చేస్తా: హజారే
రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్ చేశారు. కాగా, హజారేకు డాక్టర్ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామప్రజలు అహ్మద్‌నగర్–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
నిరహార దీక్ష చేపట్టిన అన్నా హజారే
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఇచ్చిన మాటను తప్పిన ప్రభుత్వమిది
-
యువ దీప్తి.. మహాత్మ స్ఫూర్తి
-
యువతతోనే అద్భుతాలు
సాక్షి, హైదరాబాద్: సరైనమార్గనిర్దేశనం ద్వారా యువతతో అద్భుతాలు సృష్టించొచ్చని గాంధేయవాది, పద్మభూషణ్ అన్నా హజారే సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, దేశమే మీకుటుంబం అన్న భావనతో యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా నమ్మి ఆచరిస్తున్న ఫలితంగానే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన రాలేగావ్ సిద్ధీ ఈ రోజు పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సు’కు అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది యువ ప్రతినిధులు హాజరు కాగా, సుస్థిరాభివృద్ధికి, సృజనాత్మకతలకు గాంధేయ మార్గం అన్న ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చోపచర్చలు ఉంటాయి. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హజారే మాట్లాడుతూ.. యువత గ్రామాలకు సేవ చేయడం మొదలుపెడితే మనదేశం అమెరికా, రష్యాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఏదో సాధించాలన్న తపన యువతలో ఉన్నప్పటికీ తగిన మార్గనిర్దేశనం లేకపోవడంతో కొంతమంది పెడదారి పడుతున్నారన్నారు. ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా కృషి చేసి యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ రచనలతో మార్పు.. యువకుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు? అన్న ప్రశ్న తనకూ వచ్చిందని..పాతికేళ్ల వయసులో ఢిల్లీ రైల్వే స్టేషన్లో గాంధీజీ రచనలతో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చేసిందని హజారే గుర్తు చేసుకున్నారు. మానవ జీవిత పరమార్థం సేవేనని నిర్ణయించుకుని స్వగ్రామమైన రాలేగావ్సిద్ధీతో కొత్త ప్రస్థానం మొదలుపెట్టానని వివరించారు. తిండికి గతిలేని స్థితి నుంచి రోజుకు 150 ట్రక్కుల కూరగాయలు ఎగుమతి చేసే స్థితికి రాలేగావ్సిద్ధీ చేరుకుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూనే రాలేగావ్‌సిద్ధీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని హితవు పలికారు. పెళ్లి విషయంలో తనను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నా హజారే చలోక్తి విసిరారు. ‘‘పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. అలాగని అదే మీ కుటుంబం అనుకోవద్ద’’ని చెప్పారు. అభివృద్ధి, అవినీతి రెండు ఒకే నాణేనికి రెండు పార్శా్వలని, అవినీతి అంతానికి తాను చేసిన ఉద్యమం ఫలితంగా సమాచార హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. యువతకు తగిన విధానాలు అవసరం: కవిత యువతకు, సమాజ శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లోనూ తగిన విధానాలు లేవని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి వంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ మనుషులుగా మనం సృష్టించినవేనన్నారు. ప్రతీరోజూ 22 వేల మం ది పిల్లలు బాల్యంలోనే తనువు చాలిస్తుండటం, 80 కోట్ల మంది ఆకలితో నిద్రపోతుండటం, గాలి కాలుష్యం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి సాయంతో ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ సమస్యలను సరి కొత్త దృక్కోణంతో చూడగలదని.. అదే స్థాయి లో పరిష్కారాలు కూడా చూపగలదన్నారు. సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచి న రాలేగావ్‌సిద్ధీని నేటికీ వందలాది మంది సందర్శిస్తున్నారంటే అది అన్నా హజారే కృషి ఫలితమేనన్నా రు. తమ హక్కులను సాధించుకునేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా వేసిన తొలి అడుగుగా యువ నేతృత్వ సదస్సును పరిగణించాలన్నారు. -
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
-
భవిష్యత్ అవసరాల కోసమే: ఎంపీ కవిత
-
గాంధేయ మార్గంలో.. సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా..
సాక్షి, హైదరాబాద్: ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి –నూతన ఆవిష్కరణ’లే ప్రధాన ఎజెండాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి నోవాటెల్‌లో అంతర్జాతీయ యువజన సదస్సు ప్రారంభమైంది. 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతి నిధులతోపాటు 16 దేశాల నుండి డెబ్బై మందికిపైగా నిపుణులు హాజరయ్యారు. తొలిరోజు సం ప్రదాయ దుస్తుల్లో హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి తెలంగాణ వంటకాలు వడ్డించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యసాధనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పేదరిక నిర్మూలన, ఆహార సమృద్ధి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, జెండర్ ఈక్వాలిటీ వంటి పదిహేడు అంశాలపై లోతైన చర్చలు, విశ్లేషణలు సాగనున్నాయి. అన్నా హజారే తొలివక్తగా... పద్మభూషణ్ అన్నాహజారే శనివారం ఉదయం సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ తాపా ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. సదస్సులో ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌గుప్తా, ఎంపీలు గౌరవ్ గొగోయ్, అసదుద్దీన్ ఒవైసీ, కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు. ఆయా సెషన్లలో వివిధ అంశాలపై మాసిడోనియా మాజీమంత్రి గ్లీగోర్, యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపీ కన్వల్జిత్సింగ్ బక్షీ, శ్రీలంక డిప్యూటీ మినిస్టర్ బుధీక పతిరాన పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం వివిధ అంశాలపై అర్పిత్ చతుర్వేది, పుల్లెల గోపీచంద్, కమల్‌సింగ్, షబ్నం సిద్ధిఖీ, అండ్రూ ఫ్లెమింగ్, సీమా మల్హోత్రా తదితరులు ప్రసంగిస్తారు. భవిష్యత్ అవసరాల కోసమే: ఎంపీ కవిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే దిశగా మూడు రోజుల అంతర్జాతీయ యువజన సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల తెలిపారు. -
‘అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష’
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అన్నా.. ప్రధాని చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు.. కానీ చేతల్లో మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచాయి. కానీ ఇప్పటివరకూ లోక్‌పాల్, లోకాయుక్తను నియమించలేదన్నారు. అందుకు నిరసనగా కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు. అంతేకాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని హమీ ఇచ్చింది. కానీ ఇంత వరకూ అందుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆ కమిషనే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్లపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
లోక్‌పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్‌పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. -
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్‌లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్‌పై రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్‌కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసుకెళ్లారు. -
సీఎంపై చెప్పుదాడి!
-
హజారే దీక్ష విరమణ.. సీఎంపై చెప్పుదాడి!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటుకోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరో రోజులపాటు చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను ముగించారు. అవినీతి వ్యతిరేక పోరాటయోధుడిగా పేరొందిన 80 ఏళ్ల హజారే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహించారు. సీఎం ఫడ్నవిస్ స్వయంగా రాంలీలా మైదానానికి వచ్చి.. ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతుండగా.. జనంలోంచి ఓ వ్యక్తి ఆయన లక్ష్యంగా చెప్పు విసిరారు. అది ఫడ్నవిస్‌కు దూరంగా పడింది. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని హజారే డిమాండ్ చేశారు. ఆరు నెలల్లోగా అంటే ఆగస్టులోగా తన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే సెప్టెంబర్‌లో మళ్లీ ఆందోళనకు ఆయన హెచ్చరించారు. -
హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం
-
హజారే డిమాండ్లకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు. -
అన్నా హజారే రాయని డైరీ
మాధవ్ శింగరాజు రామ్‌లీల మైదానంలో దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాత్రంతా చల్లగా ఉంటోంది. పగలంతా వేడిగా ఉంటోంది. ‘‘ఎందుకు పెద్దాయనా ఈ వయసులో! చెయ్యగలిగినవాళ్లే ఏమీ చెయ్యడం లేదు. ఏమీ చెయ్యలేనివాళ్లం.. మనం చేయించగలమా?’’ అన్నాడు ఒకాయన వచ్చి. ‘‘చెయ్యగలిగినవాళ్లు మౌనంగా ఉంటున్నారని, చేయించవలసినవాళ్లం మనమూ మౌనంగానే ఉండిపోదామా? చెప్పండి’’ అన్నాను. వచ్చి, నా పక్కనే కూర్చున్నారు ఆయన. డెబ్భైఏళ్ల వయసుకీ, ఎనభైæ ఏళ్ల వయసుకీ దీక్షలో కూర్చోవడంలో తేడా ఏమీ ఉండదు. ఏ వయసు వాళ్లు దీక్షలో కూర్చున్నా యూపీఏకి, ఎన్డీయేకి కూడా ఏమీ తేడా ఉండదు! దీక్షకు కొద్దికొద్దిగా జనం జమ అవుతున్నారు. జనం జమ కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తోంది. రామ్‌లీలకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో నీటి చుక్కన్నది దొరక్కుండా జాగ్రత్త పడుతోంది. హజారే ఆమరణ దీక్ష చేస్తున్నాడు కాబట్టి, ఆయన కోసం వచ్చేవాళ్లకూ అన్నమూ నీళ్లు అక్కర్లేదనుకున్నట్లుంది. ఆకలికో ఏమో, రాత్రంతా ఒకటే కలలు. మొదట కేజ్రీవాల్ వచ్చాడు కలలోకి. ‘మీరేమీ చిక్కిపోలేదు హజారేజీ’ అన్నాడు! ‘ఒకరోజు దీక్షకే నేను చిక్కి శల్యం అయిపోవాలని ఎలా ఆశిస్తావు కేజ్రీ’ అన్నాను. ‘అయ్యో.. నా ఉద్దేశం అది కాదు హజారేజీ. ఏడేళ్ల క్రితం మనిద్దరం కలిసి దీక్ష చేశాం. అప్పటికీ, ఇప్పటికీ మీరేం చిక్కిపోలేదని అంటున్నాను’ అన్నాడు. అతడివైపు చూశాను. చాలా చిక్కిపోయి ఉన్నాడు! ‘నువ్వేంటి కేజ్రీ అలా అయిపోయావ్?’ అని అడిగాను. ‘నా కిందివాళ్లెవరూ పని చేయడం లేదు హజారేజీ. వాళ్ల చేత పని చేయించలేక.. రోజూ ఆమరణ దీక్ష చేస్తున్నట్లే ఉంది నాకు’ అన్నాడు. ‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు కేజ్రీ’ అని అడిగాను. టప్పున కల చెదిరిపోయింది. కేజ్రీవాల్ మాయమై, మోదీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో గ్లాసు ఉంది. అందులో నిమ్మరసం ఉంది. ‘తాగండి హజారేజీ. చల్లగా ఉంటుంది. ఎండకు బాగుంటుంది’ అన్నాడు. ‘నన్ను చల్లార్చడానికా? దీక్షను చల్లార్చడానికా మోదీజీ?’ అన్నాను. ‘ఎవరు చేయని దీక్ష చెప్పండి హజారేజీ?! చూస్తూనే ఉన్నారు కదా. పార్లమెంటులో రోజుకో దీక్ష అవుతోంది. ఆ దీక్షలు తప్పించుకోడానికి పార్లమెంటుకు వెళ్లకూడదనే దీక్షలో ఉన్నాను నేనిప్పుడు’ అన్నాడు మోదీ. ‘అవినీతిపై ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు మోదీజీ’ అన్నాను. టప్పున కల చెదిరిపోయింది. మోదీజీ మాయమై, మెలకువ వచ్చింది. రామ్‌లీలా మైదానంలో ఈ పీడకలలేంటో! -
హజారే దీక్ష వెనక అజ్ఞాత శక్తి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అవినీతిని అరికట్టేందుకు, ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులను కూడా విచారించేందుకు జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకరావాలంటూ అన్నా హజారే మరోసారి రామ్ లీలా మైదానంలో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఈ సారైనా విజయం సాధిస్తుందా ? ఫలితం సంగతి మాట పక్కనే పెడితే కనీసం ఆయన దీక్షకు అంతటి ప్రాచుర్యం లభిస్తుందా? నాటి దీక్ష అరవింద్ కేజ్రివాల్ నాయకత్వాన ఆప్ పార్టీ ఆవిర్భవించేందుకు దోహదం పడిందీ. ఇప్పుడు అలాంటి పార్టీ మరోటి పుట్టుకొస్తుందా ? 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారా ప్రారంభించిన దీక్షకు అంతటి ఆదరణ లభించడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా హోస్ని ముబారక్, కల్నల్ గడాఫీ లాంటి నియంతలను మట్టి కరిపించిన ‘అరబ్ వసంతం’ పేరిట మధ్యప్రాచ్యంలో ఉప్పెనలా ప్రజా ఉద్యమం కొనసాగుతున్న రోజులవి. దేశీయంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన రోజులు. అన్నా హజారే లాంటి ఉద్యమాలను 24 గంటలపాటు ప్రసారం చేయడానికి అవసరమైన ఫుటేజ్ కోసం టీవీలు కూడా వెతుక్కుంటున్న రోజులు. అన్నింటికన్నా అవినీతిని అంతమొందించాలన్న మొండి సంకల్పంతో అరవింద్ కేజ్రివాల్, ఆయన సహచరుడు మానిష్ సిసోడియా ముందుకొచ్చిన రోజులు. నిజం చెప్పాలంటే నాడు ఆర్టీఐ కార్యకర్తగా మెగసెసె అవార్డు అందుకున్న అరవింద్ కేజ్రివాల్, అన్నా హజారే ఉద్యమానికి ఊపిరిలా నిలబడ్డారు. హజారేను రాందేవ్ బాబా, శ్రీశ్రీ రవిశంకర్, కిరణబేడీ, ప్రశాంత్ భూషణ్‌ను తన సహచరుడు సిసోడియా సహకారంతో కలుసుకొని వారిని ఒక వేదికపైకి తీసుకొచ్చిందే కేజ్రివాల్. అప్పటికే మహారాష్ట్ర మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా పలుసార్లు నిరాహార దీక్షలు చేసిన అన్నా హజారే ముందుంటే బావుంటుందని భావించే కేజ్రివాల్ ఆయనకు ఆ తర్వాత పోరాటంలో సముచిత స్థానం కల్పించారు. 2011, జనవరి నెలలో మొదటిసారి అవినీతికి వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించినప్పుడు పలువురు వక్తల్లో అన్నా హజారే ఒకరు మాత్రమే. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా నడిపించినా ఫలితం లేకపోవడంతో అరవింద్ కేజ్రివాల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పోరాడాలనుకున్నారు. ముందుగా అందుకు స్వాగతం పలికిన అన్నా హజారే ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ తప్పుకున్నారు. హిమాచల్ నుంచి పార్టీని ప్రారంభించాలనుకున్నప్పుడు అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసి రావాల్సిందిగా సిసోడియాను అక్కడికి పంపించిందే హజారియా. చివరకు రాజకీయ పార్టీకి దూరంగా ఉండాలనుకోవడం ఆరెస్సెస్ ఒత్తిడే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెల్లార్లు రామ్‌లీలా మైదానంలో జనం ఉన్నా లేకున్నా పడిగాపులు కాసిన వారంతా ఎక్కువగా ఆరెస్సెస్ కార్యకర్తలే. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై పోరాటం కనుక ఆరెస్సెస్ తన కార్యకర్తలను పెద్ద ఎత్తున పంపించింది. నేడు బీజేపీ అధికారంలో ఉంది కనుక అన్నా హజారే ఉద్యమానికి ఆరెస్సెస్ కలిసి వచ్చే అవకాశం లేదు. అరవింద్ కేజ్రివాల్ బృందం అండ అంతకన్నా లేదు. నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా, అవినీతి కుంభకోణాలు నాడంతగా లేవు. నాడు టెలికాం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ మన్మోహన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కారణంగానే కేజ్రివాల్ ప్రధానంగా ప్రజా ఉద్యమంలోకి వచ్చారు. ఇక ఏ టీవీ అన్నా హజారేతోపాటు పడిగాపులు పడేందుకు నేడు సిద్ధంగా లేవు. చాలా టీవీలు ప్రజల గొంతును మరచిపోయి ‘హిజ్ వాయిస్’గా మారిపోయాయి. అంతర్జాతీయంగా కూడా ప్రజా ఉద్యమాల స్ఫూర్తి లేదు. మరి, ఏ ప్రతిఫలాన్ని ఆశించి అన్నా హజారే మళ్లీ ఉద్యమం చేపట్టారో అర్థం కావడం లేదు. మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేయడానికి వచ్చారా ? మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు వచ్చారా? ఆ సంకల్పంతోనే మరో సారి ఆరెస్సెస్ ఆయన వెంట ఉండి ఆయన్ని పక్కదారి పట్టించిందా? కాలమే సమాధానం చెప్పాలి. గతంలో అన్నా హజారే ఒత్తిడి వల్ల ఆరుగురు మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నుంచి తొలగించిన నాటికి నేటికి ఒక్క మహారాష్ట్రలోనే అవినీతి 600 రెట్లు పెరిగిందన్నది ఓ సర్వే అంచనా. -
లోక్‌పాల్ కోసం అన్నా హజారే నిరశన
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి వ్యతి రేకంగా హాజారే ఏడేళ్ల కింద ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించి, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేయడం తెల్సిందే. రామ్‌లీలా మైదానంలో శుక్రవా రం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈసారి ఆయన టార్గెట్‌గా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచే అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. -
అన్నా సత్యాగ్రహానికి శ్రీకారం
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమంతో దాదాపు ఏడేళ్ల కిందట అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్‌ను ఊపేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం నుంచి మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. 2011లో సత్యాగ్రహం చేపట్టిన ఢిల్లీలోని రాంలీలా మైదానమే తాజా ఆందోళనకూ వేదికైంది. రైతులు సమస్యలతో సతమతమవుతుంటే వాటి పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. తుదిశ్వాస విడిచే వరకూ తాను ప్రజల పక్షాన పోరాడతానని అన్నా హజారే స్పష్టం చేశారు. కాగా, దీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరసనకారులు ఢిల్లీ రాకుండా కేంద్ర ప్రభుత్వం రైళ్లను రద్దు చేస్తోందని హజారే ఆరోపించారు. ఢిల్లీకి రైళ్లలో తరలివస్తున్న నిరసనకారులను నిలిపివేస్తూ..వారిని హింసకు దిగేలా ప్రభుత్వం ప్రేరేపిస్తోందన్నారు. తనకు ఎలాంటి పోలీసు భద్రతా అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశానన్నారు. తమ ఆందోళన పట్ల ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. అవినీతి కేసుల విచారణకు జన్‌లోక్‌పాల్ నియామకంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నా హజారే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్నా తొలుత రాజ్‌ఘాట్‌ను సందర్శించి అనంతరం రాం లీలా మైదాన్‌లో దీక్షకు ఉపక్రమించారు. దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అన్నా దీక్షకు తరలివస్తారని ఆయన సహచరులు చెప్పారు. -
మోదీకి అహం బాగా పెరిగిపోయింది
సాక్షి, ముంబై : ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మాటల తుటాలు పేల్చారు. ప్రధాని అయ్యాక మోదీకి అహం బాగా పెరిగిపోయిందంటూ హజారే విరుచుకుపడ్డారు. సంగలి జిల్లా అట్పది మండలంలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ ర్యాలీలో హజారే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ మూడేళ్లలో ప్రధాని మోదీకి 30కి పైగా లేఖలు రాశాను. ఒక్కదానికి కూడా బదులు ఇవ్వలేదు. ప్రధాని పదవి చేపట్టాక మోదీకి అహం బాగా పెరిగిపోయింది. అందులో నా లేఖలను బదులు ఇవ్వటం లేదు’’ అని హజారే విమర్శించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన రావటం ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చి 23 నుంచి మరోసారి ఆయన జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్, లోకాయుక్తా నియామకం, రైతులకు 5 వేల పెన్షన్, పంట ఉత్పత్తులకు అధిక రేట్ల విధింపు తదితర డిమాండ్లతో ఆయన ఉద్యమం చేపట్టబోతున్నారు. ఈలోగా మూడు ప్రజా ర్యాలీలను నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి ర్యాలీని నిర్వహించారు. ఇక ఢిల్లీ రాజకీయ పరిణామాల గురించి(ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం) ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు హజారే విముఖత వ్యక్తం చేశారు. -
2జీ స్కామ్ తీర్పు.. హజారే ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే 2జీ స్పెక్ట్రమ్ కేసు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీర్పుపై మీడియా ఆయన్ని సంప్రదించగా.. కోర్టు తీర్పు సరైందని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత అంశంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన తర్వాత మీడియా ఒత్తిడి చేయటంతో మాట్లాడారు. ‘‘కోర్టు తీర్పులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. అవి ఖచ్ఛితంగా.. సహేతుకంగా ఉన్నాయనే భావిస్తున్నాం. న్యాయస్థానాలు కేవలం సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని.. విచారణ చేపట్టాకే తీర్పులు ప్రకటిస్తాయి. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే నిరపరాధిగానే తేలుస్తాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు ఏడేళ్ల తర్వాత సీబీఐ కోర్టు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించటం తెలిసిందే. డీఎంకే నేతలు కనిమొళి, రాజాలు ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కున్నారు. యూపీఏ రెండో దఫా అధికారం చేపట్టాక సుమారు 1.76 లక్షల కోట్ల అవినీతి స్కాంగా 2జీ స్పెక్ట్రమ్ వార్తల్లో నిలిచింది. -
బీజేపీకి రూ.80 వేల కోట్లు.. హజారే సంచలనం
సాక్షి, గువాహటి : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే ఎన్డీయే, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల్లోనే బీజేపీ ఖాతాలో రూ.80వేల కోట్లు వచ్చి పడ్డాయని అన్నారు. చందాల పేరిట అక్రమంగా డబ్బును పోగేసిందని మండిపడ్డారు. ఆసియాలోనే భారత్ గత మూడేళ్లలో అవినీతిలో నెంబర్ 1 స్థానంలో ఉందని, ఇవి తాను అన్న మాటలు కావని ఫోర్బ్స్ మేగజిన్‌ను ఉటంకించారు. 'గడిచిన మూడేళ్లల్లో భారత్ ఆసియా ఖండంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇది నేను మాత్రమే అన్న మాటలు కావు.. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వేను నిర్వహించిన ఫోర్బ్స్ మేగజిన్ స్పష్టంగా పేర్కొంది. నేను మూడేళ్లుగా మౌనంగా ఉన్నాను. ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి కొంత సమయం ఇవ్వాలి. అందుకే మౌనంగా ఉన్నాను. కానీ, ఇప్పుడు వారు చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే టైం వచ్చింది. రైతుల కోసం శక్తిమంతమైన జన్ లోక్‌పాల్ తీసుకొచ్చేందుకు నేను మరో మహోధ్యమం మొదలు పెట్టబోతున్నాను. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాను. సామాన్య జనం ఇంకా పలు సమస్యలతో సతమతమవుతున్నారు. రైతులు బాధపడుతున్నారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నాయి కానీ ఇష్టమొచ్చినట్లు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ సమాన తక్కువ వడ్డీ రేట్లను ఫిక్స్ చేయాలి. రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో నేను ప్రధాని మోదీకి 32 లేఖలు రాశాను.. అన్నీ వెళ్లాయి కానీ పీఎంవో నుంచి ఎలాంటి బదులు లేదు. ప్రత్యేకంగా రైతుల సమస్య తీర్చడం కోసమైన ఒక బలమైన లోక్‌పాల్ బిల్లును తెచ్చేందుకు ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఉద్యమిస్తా. ప్రజలతో మాట్లాడేందుకు ఎక్కడికైనా వెళతా.. జైలుకు వెళ్లేందుకైనా మేం సిద్ధం. వారు మనల్ని జైలులో పెడితే ఈ దేశంలో ఉన్నవారంతా కూడా జైలు కొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం చెబుతాం. ఒకప్పుడు ప్రభుత్వ అధికారులు తప్పకుండా వారి ఆస్తుల చిట్టాను ప్రకటించేవారు. ఈ ప్రభుత్వం వచ్చి అది లేకుండా చేసింది. అదే సమయంలో 7.5 శాతం తమ ఆదాయాన్ని పార్టీలకు ఫండ్‌గా ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎంత డబ్బయినా పార్టీకి ఫండ్‌గా ఇవ్వొచ్చు' అని హజారే మండిపడ్డారు. -
మరో కేజ్రీవాల్‌ను రానీయను!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి తన ఉద్యమంలో మరోసారి పుట్టడం జరగదని సామాజిక వేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకురాలేకపోవడంపై భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాల్లో జరిగిన ర్యాలీ పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌పాల్‌పై చిత్తశుద్ధి లేదని అన్నారు. నేను చేసే ఉద్యమాల్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మళ్లీ రాబోడని అన్నా హజారే స్పష్టం చేశారు. అవినీతిపై అన్నాహజారే 2011 చేపట్టిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. తరువాత.. ఉద్యమం నుంచి బయటకు వచ్చి.. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపి ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును చట్టం చేయడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హజారే చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 23న దేశ రాజధాని ఢిల్లీలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
లోక్‌పాల్‌ను నిర్వీర్యం చేశారు
సాక్షి,న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అవినీతి నిరోధక లోక్‌పాల్ చట్టాన్ని నీరుగార్చిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆరోపించారు. అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన హయాంలో లోక్‌పాల్ చట్టాన్ని బలహీనంగా రూపొందించారు. ప్రస్తుత ప్రధాని మోదీ దాన్ని మరింత నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రభుత్వ అధికారుల భార్య, కుమారుడు, కుమార్తె ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని 2016 జులైలో చట్టానికి సవరణలు చేశారని గుర్తుచేశారు. చట్ట ప్రకారం అధికారుల కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఏటా వెల్లడించాలనే నిబంధన ఉందని చెప్పారు. కేవలం ఒక్క రోజులోనే ఎలాంటి చర్చ చేపట్టకుండా లోక్‌సభలో సవరణ బిల్లును ఆమోదించారని అన్నారు. దేశంలో 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ 5000 పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘32 లేఖలు రాసినా మోదీ స్పందించలేదు’
ఖజురహో: లోక్‌పాల్ బిల్లు, రైతులు, వ్యవసాయ సమస్యలపై ఇప్పటివరకు 32 లేఖలు రాసినా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. దీంతో ‘మీరు తీవ్రమైన పనిఒత్తిడితో నాకు జవాబు ఇవ్వలేకపోయి ఉండొచ్చు లేకుంటే మీ అహంకారం అందుకు కారణమై ఉండొచ్చు’అని లేఖ రాసినట్లు వెల్లడించారు. రెండ్రోజుల జాతీయ జల కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు శనివారం నాడిక్కడికి వచ్చిన హాజరే ఈ మేరకు స్పందించారు. మోదీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రానందున వచ్చే మార్చి 23 నుంచి నిరవధిక ఆందోళనలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. లోక్‌పాల్ చట్టం ఏర్పాటు చేసి, రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసిన తర్వాతే ఆందోళనల్ని విరమిస్తానన్నారు. తన ఆందోళన పూర్తి అహింసాయుత మార్గంలో సాగుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తేడా లేదని హజారే విమర్శించారు. -
మళ్లీ గొంతెత్తిన అన్నా
న్యూఢిల్లీః అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా లోక్‌పాల్ నియామకంలో జాప్యం పట్ల మోడీ సర్కార్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్ నియామకంతో పాటు ప్రతి రాష్ట్రంలో లోకాయుక్త, అవినీతిని అంతమొందించేందుకు సిటిజన్స్ చార్టర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై సత్వరం స్పందించకుంటే మరో ఆందోళన తప్పదని ప్రధానికి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆరేళ్ల కిందట 2011లో తాను చేపట్టిన అవినీతి వ్యతిరేక భారత్ ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా హజారే ప్రస్తావించారు. అవినీతికి వ్యతిరేకిస్తూ చారిత్రక ఉద్యమం జరిగి ఆరేళ్లయినా అవినీతిని తుడిచివేసేందుకు నిర్థిష్ట చట్టాన్నిప్రభుత్వం రూపొందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా లోక్‌పాల్, లోకాయుక్తల నియామకం, రైతుల సంక్షేమానికి సంబంధించి స్వామినాథన్ సిఫార్సుల అమలుపై తాను పలుమార్లు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా తన లేఖలను విస్మరిస్తూ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ప్రధానికి రాసిన లేఖలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బాలీవుడ్ మూవీలో అన్నా హజరే
గాందేయవాది, అవినీతి పై పోరాట చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజరే ఓ బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు దర్శకుడు రవి సదాశివ్ తెరకెక్కించిన బచ్చే కచ్చే సచ్చే సినిమా హజరే కొన్ని నిమిషాల పాటు కనిపించే చిన్న పాత్రలో నటించారు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, ముఖేష్ తివారిలు ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు రవి సదాశివ్ స్వయంగా మీనా ఉద్దండతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో అథినేత, సరదాగా కాసేపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రవి సదాశివ్, బాలీవుడ్ సినిమా బచ్చే కచ్చే సచ్చే సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు. -
కేజ్రీవాల్ రాజీనామా కోసం ధర్నా చేస్తా
-
కేజ్రీవాల్ రాజీనామా కోసం ధర్నా చేస్తా: అన్నాహజారే
భూములకు సంబంధించిన కుంభకోణాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు నిజమని తేలితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీసేయాలని, లేదా ఆయన రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తానని, అందుకోసం అవసరమైతే ఆందోళన కూడా చేస్తానని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. అయితే, మాజీ మంత్రి కపిల్ మిశ్రా మాత్రం తన పదవి పోయిన తర్వాతే కేజ్రీవాల్‌పై ఈ ఆరోపణలు చేశారని చెప్పారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే డబ్బులు చేతులు మారి ఉంటే, అప్పుడే ఎందుకు అధికారులను అప్రమత్తం చేయలేదని అన్నాహజారే ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ గట్టిగా జరగాలని, ఒకవేళ కేజ్రీవాల్ తప్పు చేసినట్లు రుజువైతే తాను జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలో స్వయంగా కూర్చుని అతడి రాజీనామా డిమాండ్ చేస్తానని తెలిపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్ సిద్దిలో గల తన ఇంట్లో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా తనతో కలిసి పోరాడిన కేజ్రీవాల్ మీద ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలు రావడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోని సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు తీసుకుంటుండగా తాను చూశానని కపిల్ మిశ్రా ఆరోపించగా, దాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఖండించిన విషయం తెలిసిందే. -
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
-
శిష్యుడి ‘అవినీతి’పై హజారే ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకున్నారన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలతో రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కపిల్ ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తుండగా, అవినీతిని చీపురుతో ఊడ్చిపారేస్తానన్న కేజ్రీవాల్ తానే అవినీతిపరుడయ్యాడంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇక కేజ్రీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై ఆయన గురువు అన్నా హజారే ఆచితూచి స్పందించారు. ఆదివారం రాలేగావ్‌సిద్ధిలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు బాధాకరమన్నారు. ‘అవినీతిని రూపుమాపేందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటిది ఆయనే లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది బాధాకరం’ అని హజారే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గరం గరం.. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆదివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన తర్వాత పొలిటికల్ సీన్ వేగంగా మారింది. కేజ్రీవాల్‌ను తూర్పారపట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించగా, సీఎంను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు వినతిపత్రం అందించారు. (కేజ్రీవాల్‌పై బాంబు పేల్చిన మిశ్రా) -
మరో పోరాటానికి హజారే సిద్ధం
పుణె: అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. లోక్ పాల్ నియామకంపై కేంద్రం చూపుతున్న ఉదాసీనత వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగనున్నట్టు హజారే బుధవారం ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు లోక్ పాల్ నియామకం జరగకపోవడం పట్ల ఆయన ఆందోళన చేశారు. లోక్ పాల్ నియామకంపై జాప్యానికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు. దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో చూస్తానని చెప్పారు. తాను ఎప్పటి నుంచి ఆందోళన చేపట్టబోయేది తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లోకాయుక్త నియామకాలు చేపట్టకపోవడాన్ని హజారే తప్పుబట్టారు. -
శిష్యునిపై గురువు సీరియస్..
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే తప్పుబట్టారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని ఎన్నికల సంఘాన్ని కేజ్రీవాల్ కోరడంపై హజారే తీవ్రంగా స్పందించారు. ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకు వెళ్తుంటే.. ఇంకా స్కూల్ బ్యాలెట్ పేపర్ పద్ధతిని వాడాలని సూచించడం సరికాదని కేజ్రీవాల్‌ను మందలించారు. 2011 హజారే సారథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ ఆయన శిష్యుడిగా కీలకపాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి నిరోధక చట్టం తీసుకురావాలని విద్యార్థులు, యువతతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను హజారే వ్యతిరేకించారు. కానీ ఢిల్లీ సీఎం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ కాంగ్రెస్‌కు మేలు.. పంజాబ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరగడంతో కాంగ్రెస్ కు మేలు జరిగిందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర ఓట్లు ట్యాంపరింగ్‌తో బీజేపీ-అకాలీదళ్‌కు వెళ్లాయని ఆరోపించారు. దీంతో ఆప్‌కు తక్కువ సీట్లు వచ్చాయని, కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుందని తెలిపారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, ఆప్‌లు సమానంగా సీట్లు గెలుచుకుంటాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా కేజ్రీవాల్ ఆరోపణల పై బీజేపీ నాయకులు ఆయనకు మతిభ్రమించిందని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
హజారే ఆర్ఎస్ఎస్ ఏజెంట్: ఎన్సీపీ
ముంబై: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆర్ ఎస్ఎస్ ఏజెంట్ అని ఎన్సీపీ ఆరోపించింది. రూ. 25 వేల కోట్ల షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని హజారా బాంబే హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎన్సీపీ తప్పుబట్టింది. తమ పార్టీ నాయకుడు శరద్ పవార్ పై బురద చల్లేందుకు ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్రలో హజారే పావుగా మారారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను హజారే ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హజారే ఇటీవల హైకోర్టులో రెండు పిల్స్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరద్ పవార్, అజిత్ పవార్ సహా పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. -
కేజ్రీవాల్‌పై హజారే ధ్వజం
-
కేజ్రీవాల్‌పై హజారే ధ్వజం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చర్యలపై మండిపడ్డారు. మిగితా పార్టీలకు ఆప్‌కు పెద్ద తేడా ఏముందని ధ్వజమెత్తారు. ఆప్ అధికారిక వెబ్ సైట్లో నుంచి పార్టీకి విరాళం ఇచ్చిన వారి పేర్లను తొలగించడంపై కేజ్రీవాల్‌ను హజారే ఎండగట్టారు. వారి పేర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని, మిగితా పార్టీలకు ఆప్‌కు తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు. మార్పు తీసుకొస్తానంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కేజ్రీవాల్ నెరవేర్చలేకపోయారని అన్నారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. 'పార్టీకి విరాళం ఇచ్చిన వారి వివరాలను పార్టీ వెబ్సైట్లో ఉంచుతానని హామీ ఇచ్చావు. కానీ 2016 జూన్ నుంచి వారి వివరాలను పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించారని నాకు లేఖ వచ్చింది. సమాజంలో మార్పు తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చావు. కానీ, నువ్వు వాటిని నెరవేర్చలేదు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. -
2వేల నోట్లతో అవినీతి పెరగొచ్చు: అన్నాహజారే
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన అన్నా హజారే.. ఇప్పుడు కొత్తగా జారీ చేసిన రెండు వేల రూపాయల నోట్లతో అవినీతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వాళ్లలో ఎక్కువమంది నల్లధనం కట్టలు కట్టలుగా ఉన్నవారేనని, పరిస్థితులు చక్కబడేవరకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవని చెప్పారు. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా పెద్దనోట్ల రద్దు విషయంలో జరిగిన గందరగోళంతో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షం, అధికారపక్షం పరస్పరం తీవ్రంగా దూషణలకు పాల్పడటంతో ఉభయ సభలు అస్సలు కార్యకలాపాలు ఏవీ జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. -
అన్నా మెచ్చుకుంటే.. కేజ్రీవాల్ తిట్టారు!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన అన్నా హజారే మెచ్చుకుంటే.. ఆయన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విమర్శించారు. నల్లధనాన్ని, అవినీతిని, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇది చాలా విప్లవాత్మకమైన చర్య అని అన్నా హజారే వ్యాఖ్యానించారు. అయితే, కేవలం ఈ నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం సమస్య ఏమీ తీరిపోదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల వాళ్లకు వారం రోజుల ముందుగానే ఈ నోట్ల రద్దు విషయాన్ని చెప్పేశారని, వాళ్లంతా జాగ్రత్త పడిన తర్వాతే ప్రధాని ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చే సంస్కృతిపై అన్నా హజారే స్పందించారు. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక రాజకీయాలను ప్రక్షాణల చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికలు, రాజకీయాల్లో కూడా నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాలని, ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలే అవుతుందని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ పెద్ద మొత్తాల్లో విరాళాలు తీసుకుంటాయని, కానీ ఆదాయపన్ను అధికారుల దాడుల నుంచి తప్పించుకోడానికి దాతల పేర్ల మీద రసీదులు ఇస్తుంటారని ఆయన ఆరోపించారు. కొత్త కరెన్సీ నోట్లు కూడా నల్ల కుబేరుల చేతుల్లో పడకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. -
’ఇక ఎన్నికల పనిపట్టండి’
అహ్మద్‌నగర్: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నదని, విప్లవాత్మక నిర్ణయం అని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నల్ల ధనం తగ్గిపోతుందని, ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు తరలిస్తున్న పెద్ద మొత్తాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందన్నారు. అవినీతి కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలేవీ కూడా నల్లధనాన్ని రూపుమాపే చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో వేసిన ముందడుగని, దీంతో ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతమవుతుందన్నారు. రాజకీయ పార్టీలు కూడా పెద్ద మొత్తంలో అక్రమ నిధులు తరలిస్తున్నందున, ప్రభుత్వం తదుపరి దృష్టిని ఎన్నికల విధానాన్ని శుద్ధి చేసే అంశంపై పెట్టాలని సూచించారు. ఎన్నికల్లోకి నల్లధనం రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పెద్ద మొత్తంలో ఎన్నికల సంస్కరణలు చేయాలని కోరారు. దాదాపు అన్ని పార్టీలు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొని రశీదులు మాత్రం రూ.20 వేలు అంటూ ఇస్తుంటారని, ఇవన్నీ పన్ను ఎగువేతకోసమేనని ఆరోపించారు. ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిపేందుకు ఇదే తగిన సమయం అని హజారే చెప్పారు. -
త్వరలో అన్నా మరో ఉద్యమం
పుణె: ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో సంపూర్ణ మద్యనిషేధం కోసం ఉద్యమించనున్నట్టు హజారే ప్రకటించారు. మద్యపానం వల్ల కుటుంబాలు చెడిపోతున్నాయని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో హజారే మాట్లాడుతూ.. మద్య నిషేధం కోసం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. ఇందుకోసం ముసాయిదాను దాదాపుగా సిద్ధంచేశామని, దీన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సమర్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మద్యపాన నిషేధ చట్టానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ముసాయిదాను పటిష్టంగా రూపొందించేందుకు సాయం చేయాల్సిందిగా వేదికపై ఉన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గాడ్బొలేను హజారే కోరారు. -
కపిల్ షోలో అన్నా హజారే
ముంబై: పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ షోకు ప్రముఖ గాంధేయవాది అన్నా బాబూరావు హజారే వెళ్లారు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం కపిల్ షోకు హాజరయ్యారు. హజారే ఒక టీవీ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి. తన సినిమా కచ్చితంగా ఆసక్తిగా ఉంటుందని ఆయన చెప్పినట్టు సమాచారం. 130 నిమిషాల నిడివిగల ఈ సినిమాను యేడాది కాలంగా నిర్మిస్తున్నారు. రైస్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించగా, శశాంక్ ఉదాపుర్కర్ దర్శకత్వం వహించారు. హజారే స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధితో పాటు మరిన్ని రాష్ట్రాలలో ఈసినిమాను చిత్రీకరించారు. రంజిత్ కపూర్, శరత్ సక్సేనా, గోవింద నమడియో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల మూవీ టీజర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు. -
కేజ్రీవాల్ కు హజారే ఝలక్
రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే అన్నారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంత్రులపై చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో హజరే విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ప్రవర్తనపై తనకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు. ఆప్ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ ప్రతిష్ట దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చుట్టూవున్న నాయకుల కారణంగా అప్రదిష్టపాలయ్యారని అన్నారు. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ‘ఆప్’లో స్థానం కల్పించివుంటే కేజ్రీవాల్ కు సమస్యలు వచ్చేవి కాదని అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ మళ్లీ ప్రజల విశ్వాసం పొందాలంటే అధికారం వదులుకుని, దేశ సేవకు మరోసారి ముందుకు రావాలని సూచించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం రాజకీయ నాయకులు మహిళలను పావులుగా వాడుకుంటున్నారని వస్తున్న వార్తలు దురదృష్టకరమని హజారే వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్ నన్ను హర్ట్ చేశాడు: హజారే
రాలేగావ్ సిద్ది(మహారాష్ట్ర) : ఢిల్లీ రాష్ట్ర అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం, జైళ్లకు వెళ్లడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తనతో ఉన్నప్పుడు గ్రామ్ స్వరాజ్ పేరుతో ఒక పుస్తకం రాశారని తెలిపిన హజారే.. గ్రామ్ స్వరాజ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని హజారే పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని హజారే చెప్పారు. -
ఆ నీచులకు మరణశిక్ష విధించాలి
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కొపార్డి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి, దోషులకు ఉరిశిక్ష వేయాలని హజారే ఓ ప్రకటనలో కోరారు. గతవారం ముగ్గురు దుండగులు బాధితురాలిని సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మహారాష్ట్రను కుదిపేసింది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫడ్నవిస్ ఈ ఘటనపై ప్రకటన చేస్తూ నిందితులను అరెస్ట్ చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చూస్తానని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. -
అన్నా హజారేను హతమారుస్తాం
పుణె: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నాహజారేను హతమారుస్తానంటూ ఓ వ్యక్తి ఆయన కార్యాలయానికి బెదిరింపు లేఖ పంపారు. మరాఠీలో చేతిరాతతో రాసి ఉన్న లేఖలో హజారే సమాజంలో అశాంతికి కారణమవుతున్నారని, అందుకే అంతమొందిస్తామని ఉందని ఆయన కార్యాలయ ప్రతినిధి శ్యామ్ అశ్వా తెలిపారు. లేఖలో రాసిన వ్యక్తి తనను నెవెసాకు చెందిన అంబాదాస్ గా పేర్కొన్నాడు. హజారేకు బెదిరింపు లేఖపై సమాచారాన్ని గురించి ఆయన కార్యాలయాన్ని కోరగా వారు నిరాకరించారని పార్నర్ పోలీసులు తెలిపారు. 33 నెలల్లో ఇది 15వ బెదిరింపు లేఖ. కానీ ఈసారి ఆయనను జనవరి 26న హతమారుస్తామని లేఖలో పేర్కొన్నారు. గాంధేయవాది ఇటువంటి బెదిరింపులకు భయపడరని హజారే వ్యక్తిగత కార్యదర్శి అసవ తెలిపారు. హజారేకు జెడ్ కేటగిరీ రక్షణ ఉంది. -
వర్షపు నీటితో వివాదాలకు పరిష్కారం: హజారే
కోయంబత్తూర్: వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోని ఏ రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం తలెత్తదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా మిగులు జలాలతో ప్రతీ రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. తమిళనాడుకు కేరళ, కర్ణాటకతో ఉన్న వివాదాలపై విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒకప్పుడు 4 జిల్లాల్లోని పరివాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేసి నేడు ప్రాభవం కోల్పోయిన నోయల్ నది పునరుద్ధరణకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని హజారే శనివారం కోయంబత్తూర్‌లో ప్రారంభించి మాట్లాడారు. -
సీబీఐ సోదాలపై స్పందించిన హజారే
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరపడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ పై గతంలోనే చర్య తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే ముందే రాజేంద్ర కుమార్ గత చరిత్రను గురించి తెలుసుకుని ఉండాల్సిందని కేజ్రీవాల్ కు సూచించారు. 'ఈ ఘటన(అవినీతి ఆరోపణలు) అరవింద్ కేజ్రీవాల్ హయాంలో జరగలేదు. ఈ కేసుపై ఏడాదిన్నర నుంచి బీజేపీ ఎటువంటి చర్య తీసుకోలేదు. రాజేంద్ర కుమార్ పై కచ్చితంగా గతంలోనే చర్య తీసుకోవాల్సింది' అని రాలెగావ్ సిద్ధిలో విలేకరులతో హజారే అన్నారు. తన చట్టూ దృఢమైన వ్యక్తిత్వం గలవారు ఉండేలా చూసుకోవాలని కేజ్రీవాల్ కు ఎప్పుడూ చెబుతుంటానని వెల్లడించారు. రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు మంగళవారం ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. సీఎం ఆఫీసులోనూ సీబీఐ దాడులు చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. -
అన్నాజీ.. థాంక్యూ!
న్యూఢిల్లీ: ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతునిచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నా హజారేకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌పాల్ బిల్లు విషయమై హజారే ప్రతిపాదించిన సూచనలను తప్పకుండా అమలుచేస్తామని చెప్పారు. 'ఆశీస్సులు, మద్దతు అందజేసినందుకు అన్నాజీకి కృతజ్ఞతలు. మీ సూచనలను మేం తప్పకుండా అమలుచేస్తాం' అని కేజ్రీవాల్ మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ సర్కార్ సోమవారం జన్‌లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును అన్నా హజారే స్వాగతించారు. ఈ బిల్లులో భాగంగా నలుగురు సభ్యులు -ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్పీకర్, ఒక స్వతంత్ర సభ్యుడితో స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగా.. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండాలని, అందులో స్వతంత్ర సభ్యుడిగా సామాజికవేత్తను నియమించాలని హజారే సూచించారు. -
హజారేతో 'ఆప్' నేతల భేటీ
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు గురించి హజారేకు వివరించారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఆయన తెలిపారు. దీని ద్వారా అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు. హజారేను ఆప్ నాయకులు కలిసిన విషయాన్ని ఆయన అనుచరుడు దత్త అవారి ధ్రువీకరించారు. జనలోక్ పాల్ బిల్లును కేజ్రీవాల్ సర్కారు సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును తెచ్చింది. 2011లో తయారు చేసిన జనలోక్ పాల్ బిల్లుకు ఇది సమానంగా ఉంటుందని 'ఆప్' వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. -
'అన్నా హజారే కలలకు నమ్మక ద్రోహం'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ను కౌగిలించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమ్ఆద్మీ అసంతృప్త నేత శాంతి భూషణ్.. కేజ్రీవాల్ చర్యపై మండి పడ్డారు. అన్నా హజారే కలలకు నమ్మకద్రోహం చేసేదిలా కేజ్రీవాల్ చర్య ఉందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ మాజీ సహచరుడు, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఈ కౌగిలింత చర్యను సిగ్గుమాలిన పనిగా అభివర్ణించాడు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో తమ ఆదర్శాలను వదిలేస్తున్నారని ఆయన విమర్శించాడు. అయితే కేజ్రీవాల్ మద్దతు దారులు మాత్రం వేదిక మీద లాలు ప్రసాదే బలవంతంగా కేజ్రీవాల్‌ను కౌగిలించుకున్నారని ఆరోపించడం విశేషం. అయినా కౌగిలించుకున్నంత మాత్రాన ఇద్దరి అభిప్రాయాలు ఒకటయినట్టు కాదని, దీనిని వేదికపై జరిగిన చిన్న ఘటనగా చూడాలే తప్ప రాద్దాంతం చేయడం తగదంటున్నారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న అమ్ఆద్మీ పార్టీ అనతి కాలంలోనే ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కుంభకోణాలతో మసకబారిన లాలు ప్రసాద్‌తో అమ్ఆద్మీ అధినేత వ్యవహరించిన తీరుకు నెటిజియన్లు సైతం గరంగా ఉన్నారు. -
రుణమాఫీతో ప్రజా ధనం వృధా: హజారే
పూణే: రైతు రుణమాఫీ పథకం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేసే ఓ పొలిటికల్ జిమ్మిక్కని సామాజిక కార్యకర్త అన్నాహజారే మండిపడ్డారు. దీని వల్ల ప్రజల(టాక్స్ పేయర్స్) డబ్బును వృథా చేయడం తప్ప, సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. గతంలోనూ రుణ మాఫీ చేయడం వల్ల రైతులకు ఒక పరిష్కరం చూపేలా ఉపయోగపడలేదని తెలిపారు. ఈ పథకం రైతులు ఒకరిపై ఆధారపడి బతికేలా, నిస్సహాయ పరిస్థితిని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. శరద్ పవార్(ఎన్సీపీ), బీజేపీ మిత్రపక్షం శివసేనలు కరువు ప్రాంతంలోని రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కరువు ను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోకుండా దీన్ని నాయకులు ఒక రాజకీయ సమస్యలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులుగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద డ్యాం లు నిర్మించడంపైనే శ్రద్ధ పెట్టారని, ఎన్ని డ్యాంలు నిర్మించినా ఇంకా నీటి సమస్య అలాగే ఉందన్నారు. రైతులకు అవసరమై ప్రాజెక్టులు కట్టడంకన్నా రాజకీయనాయకులకు ఉపయోగం చేకురే ప్రాజెక్టులనే ఎక్కువగా నిర్మించారన్నారు. కరువును దీర్ఘకాలికంగా ఎదుర్కొవాలంటే గ్రామాల్లో వాటర్ షెడ్‌ను నిర్మించాలని తెలిపారు. -
నిరశన దీక్షను విరమించుకున్న అన్నా
ముంబై: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న తలపెట్టిన నిరశన దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గడం, మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్నా హజారే తెలిపారు. భూసేకరణ బిల్లు ఉపసంహరణ, ఓఆర్ఓపీ విధానం అమలు డిమాండ్లతో అక్టోబరు 2న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరశన దీక్ష చేపట్టాలని అన్నా హజారే గతంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడం అన్నా దీక్షను విరమించుకున్నారు. అన్నా తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధీలో ఈ విషయం చెప్పారు. -
హతమారుస్తామంటూ 'అన్నా'కు బెదిరింపు
ముంబయి: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి దూరంగా జరగకుంటే హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ పంపించారు. 'ఆ లేఖ ఆగస్టు 7వ తేదితో పూర్తిగా ఆంగ్లంలో రాసి ఉంది' అని పోలీసు అధికారులు పీటీఐకు తెలిపారు. బ్లాక్ మ్యాజిక్కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నరేంద్ర దబోల్కర్‌కు పట్టిన గతే నీకు పడుతుందని హజారేను ఆ లేఖలో హెచ్చరించినట్లు వివరించారు. దీంతోపాటు ఆయన సొంతగ్రామం మహారాష్ట్రలోని రాలేగాం సిద్ధిలో నుంచి కాలు బయటపెట్టొద్దని కూడా బెదిరించారని చెప్పారు. లేఖ ఆధారంగా పోలీసులు 506(నేర పూరిత కుట్ర ఆలోచన) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
ఊవెంటనే ఒక ర్యాంకు, ఒక పెన్షన్: హజారే
న్యూఢిల్లీ: ఎన్డీయే నేతృత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సైనిక సిబ్బందికి సంబంధించి ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకంతో సహా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ధ్వజమెత్తారు. సైనికులకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాడుతానని తెలిపారు. ఒక ర్యాంకు, ఒక పెన్షన్ పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ సైనిక ఉద్యోగులకు హజారే మద్దతు తెలిపారు. ఈ పథకం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్నట్లు చెప్పారు. పర్యటన ముగిసిన అనంతరం అక్టోబర్ 2న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం హజారేతో భేటీ అయ్యారు. -
భూ సేకరణపై అన్నా నిరశన
రాలెగావ్ సిద్ధి: సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగబోతున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లు, రక్షణ శాఖలో ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అంశాలపై ఆయన ఆందోళన చేపట్టనున్నారు. అక్టోబర్ 2న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను దీక్ష చేపట్టనున్నట్లు తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నెల 26న షహీద్ దిన్ సందర్భంగా అన్నాను అమర జవాన్ల కుటుంబ సభ్యులు సన్మానించనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత దేశ వ్యాప్తంగా రైతులు, మాజీ సైనికోద్యోగులు భూ బిల్లును నిరసిస్తూ, ఓఆర్ఓపీ త్వరగా అమలు చేయాలని కోరుతూ ర్యాలీలు నిర్వహిస్తారని అన్నా తెలిపారు. -
'నోటీసులు అందాక చూస్తా..'
ముంబయి: తనకు నోటీసులు అందిన తర్వాత న్యాయసలహా తీసుకొని ముందుకు వెళతానని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. పుణెలో ఆయన స్థాపించిన స్వచ్ఛంద సంస్థ 'భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్-మహారాష్ట్ర' అనే పేరులో భ్రష్టాచార్ అనే పదాన్ని పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థల కమిషనర్ తొలగించారు. దీనిపై మీరు ఏమైనా స్పందిస్తారా.. చట్టపరంగా ముందుకు వెళతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు మాత్రమే కాకుండా మొత్తం 16 స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు పంపిచారని, అయితే తనకు నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని అన్నా హజారే చెప్పారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
జూన్ 15 హ్యాపీ బర్త్ డే ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అన్నా హజారే (సామాజిక కార్యకర్త), లక్ష్మీమిట్టల్ (పారిశ్రామికవేత్త) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఈ సంవత్సరం వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. ప్రేమాభిమానాలను ఇచ్చి పుచ్చుకుంటారు. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. విలాస వస్తువులు లేదా వాహనం సమకూర్చుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఇతర దేశాలలో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది. లక్కీ నంబర్స్: 2,5,6,7; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు సూచనలు: రోజూ రాత్రిపూట కనీసం ఒక అరగంటపాటు వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
హజారే కారుకు తొమ్మిది లక్షలు వచ్చాయి
రాలేగావ్ సిద్ధిఖీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఉపయోగించిన మహింద్రా స్కార్పియో వాహనాన్ని ఆయన కీలక అనుచరుడు వేలంలో రూ. తొమ్మిదిలక్షలకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారే నిర్వహించిన ఎన్నో అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో, లోక్‌పాల్ బిల్లు సమయంలో గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆ వాహనాన్ని ఉపయోగించారు. ఆదివారం హజారే సొంతగ్రామం రాలేగాం సిద్ధిఖీలో వేలం పాట నిర్వహించారు. దీనిని అహ్మద్ నగర్ కు చెందిన అతుల్ లోఖండే మొత్తం రూ.9,11,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. హజారేకు ఇప్పుడు కొత్త వాహనం కావాలని, ఆయన గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారని, వాహనాన్ని మార్చాల్సిన అవసరం ఉండి వేలం పెట్టామని ఆయన మరో అనుచరుడు దత్త అవారీ చెప్పారు. ఆ వాహనానికి ఘనమైన చరిత్రే ఉందని వివరించారు. -
భూ బిల్లుపై దీక్షకు సిద్ధం : అన్నా హజారే
-
భూ బిల్లుపై దీక్షకు సిద్ధం
విలాస్ టొకాలే లాతూ(మహారాష్ట్ర): సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ రైతులకన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. భూసేకరణ బిల్లులోని రైతు వ్యతిరేక అంశాలను తొలగించని పక్షంలో మరో నిరశన దీక్ష చేపట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం బిల్లులో మార్పులు చేయని పక్షంలో 2011లో లోక్‌పాల్ అంశంపై చేసినట్టే నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. దేశవ్యాప్తంగా జైల్ భరో ఆందోళన చేపడతామన్నారు. రైతు అనుకూల మార్పులు చేయాల్సిందిగా తాను ఇప్పటికే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. -
మోదీ కంటే ఫడ్నవీస్ బెస్ట్: హజారే
లాతూర్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఫడ్నవీస్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కంటే మహారాష్ట్ర సర్కారు మంచి పనులు చేస్తోందని అన్నారు. మహారాష్ట్రలో నీటి సంరక్షణ, పనిచేయని అధికారులకు జరిమానాలు విధించడం వంటి మంచిపనులు చేపట్టారని ఫడ్నవీస్ ను మెచ్చుకున్నారు. తాను రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. కాగా మోదీ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లును హజారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఏ ప్రతిపాదించిన ఈ బిల్లులో రైతు వ్యతిరేక అంశాలు తొలగించకపోతే మరోసారి దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. -
అన్నా లేఖతో ఆత్మరక్షణలో ఏపీ సర్కార్
-
అన్నా, మేధాలకు లేఖలు!
పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ భూ సమీకరణపై వివరణ ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్: పైకి గంభీరమైన ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. రాజధాని కోసం ప్రభుత్వం భూములు సమీకరించడాన్ని తప్పుబడుతున్న సామాజిక ఉద్యమ నేతలు అన్నా హజారే, మేధాపాట్కర్ లాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఈ ఉద్యమకారులు జరిపిన అనేక పోరాటాలను తాను సమర్థించగా.. ఇప్పుడు ప్రభుత్వ వైఖరిపై వారినుంచే అభ్యంతరాలు వ్యక్తం కావడం బాబును ఇరకాటంలో పడేసింది. రాజధాని ప్రాంతంలో మేధాపాట్కర్ ఇప్పటికే పర్యటించడం, అన్నా హజారే నేరుగా తనకే లేఖ రాయడం వంటి అంశాలపై శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. చివరకు రాజధాని కోసం రైతులందరూ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని పేర్కొంటూ వారిద్దరికీ లేఖలు రాయాలనే నిర్ణయానికొచ్చారు. అయితే ఈ లేఖలను పార్టీ పరంగా రాయాలా? లేక ప్రభుత్వ పరంగానా? అన్న అంశంపై చర్చించారు. చివరకు ప్రభుత్వ పరంగా రాయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు కిమిడి కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ సలహాదారులు సి. కుటుంబరావు, పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ఉద్యమకారులెవరూ మాట్లాడలేదన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి విషయాలేవీ లేఖలో ప్రస్తావించకపోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలావుండగా ఏపీ రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ రెండో తేదీన నిర్వహించాలా? లేక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదో తేదీన నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాలపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పునర్నిర్మాణ, పునరంకిత, సంకల్ప దినోత్సవం.. తదితరాల్లో ఏ పేరుతో నిర్వహిస్తే బావుంటుందనే అంశంపైనా చర్చించారు. ఆ భూముల్ని జగ్గీ పరిశీలించారు... జగ్గీ వాసుదేవ్‌కు భూముల కేటాయింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన కేవలం భూములను పరిశీలించి వెళ్లారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలపై వివరణ ఇవ్వాల్సిందిగా నేతలు, అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని బాబు ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయమై ఏం జరిగిందీ వివరాలు సేకరించాల్సిందిగా సూచించారు. -
అన్నా వచ్చి ఏంచేస్తారు?
- మీడియాతో మంత్రి ప్రత్తిపాటి, కుటుంబరావు హైదరాబాద్: అంతా అయిపోయాక రాజధాని ప్రాంతంలో సామాజిక ఉద్యమనేత అన్నా హజారే వచ్చినా ఏం లాభం లేదని, రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయనొచ్చి ఏం చేస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. మేథాపాట్కర్, అన్నా హజారేలు రాజధాని ప్రాంతానికి రావడం వల్ల భూముల రేట్లు పడిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు తమ భూములకు ఏడాదికి కౌలు తీసుకున్నారని, ఇప్పటికి రూ.20 కోట్లు కౌలు కింద చెల్లించామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలిసి మంత్రి పుల్లారావు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో రైతులు కూడా తమకు భూ సమీకరణ చేపట్టాలని కోరుతున్నారని, భూ సమీకరణ కృష్ణా జిల్లాలో జరపడం లేదని బాధ పడుతున్నందునే అక్కడ కూడా సమీకరణ చేపడుతున్నామన్నారు. రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈనెల 27 (సోమవారం) నుంచి మే 15 వరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు చెప్పారు. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఫిర్యాదులను కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు పంపి పరిష్కారానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో 40 మందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు. రుణమాఫీకి సంబంధించి 53 లక్షల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు చెప్పారు. 53 లక్షల రైతులకు రుణమాఫీ లేఖలు పంపుతామని, అలాగే పంచాయతీల్లో ఎంత రుణం మాఫీ అయ్యిందో జాబితాలు, హోర్డింగులు పెడతామన్నారు. రుణమాఫీ బాండ్లను కూడా డిజైన్ చేస్తున్నామని, సీఎం చంద్రబాబు పరిశీలన తర్వాత రైతులకు బాండ్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కోసం 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వీటిల్లో 14వేలకు పైగా ఈ - మెయిల్ రూపంలో వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు 13 వేల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మరో 8 వేల ఖాతాల పరిశీలన జరుగుతోందని, 16 వందల ఖాతాలకు రేషన్‌కార్డులు లేవన్నారు. అయితే రెండు రోజుల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. బ్యాంకు మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు : కుటుంబరావు బ్యాంకుల్లో తప్పుల వల్లే చాలా ఖాతాలకు నిధులు వెళ్లడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రతి రోజూ తమ దృష్టికి వస్తున్నాయని, ఆయా బ్యాంకుల మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తామన్నారు. రాజధాని ప్రాంతం ధాన్యాగారం కాదన్నారు. ఈ వ్యవహారమై శివరామకృష్ణన్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంత భూముల్లో రకరకాల పంటలు పండిస్తారనడంలో అర్థం లేదని, అంత సారవంతమైన భూములైతే రైతులు ఎందుకిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, కడప, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తప్ప మిగిలిన ప్రాంతాల నుంచే రుణమాఫీ ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని కుటుంబరావు వివరించారు. -
అంతా అయిపోయాక హజారే వస్తే ఏం లాభం
-
అంతా అయిపోయాక హజారే వస్తే ఏం లాభం
అన్నాహజారే ఇప్పుడు అంతా అయిపోయాక వస్తే ఏం లాభమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఏపీ రాజధానికి 33 వేల ఎకరాల భూములను ఇప్పటికే సమీకరించామని ఆయన చెప్పారు. రైతులందరూ భూములు ఇచ్చారని, వాళ్లంతా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లు ఇప్పుడు పర్యటించినంత మాత్రాన ఏమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నగరం రావడం ఇష్టంలేనివాళ్లే అన్నాహజారే, మేధాపాట్కర్లను రప్పిస్తున్నారని విమర్శించారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధానికి వ్యతిరేకం కాదని, భూసేకరణ చేస్తేనే వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. -
చంద్రబాబుకు అన్నాహజారే లేఖ
-
‘అన్నపూర్ణ’కు అప్రతిష్ట
ఆంధ్రప్రదేశ్ ► రాజధానికి భూ సమీకరణపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఉద్యమకారుడు అన్నాహజారే ఘాటు లేఖ ► రెండు మూడు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తారా? ► ఇది దేశ ఆహారభద్రతకు పెను ముప్పుగా పరిణమించదా? ► ఒత్తిడి తెచ్చి భూములు సమీకరించినట్టు వెల్లడైంది ► త్వరలో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తా హైదరాబాద్: దేశానికి అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తేవొద్దని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఏడాదికి రెండు మూడు పంటలు పండే భూములను తీసుకుంటే దేశ ఆహార భద్రతకు తూట్లు పొడిచినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. రైతులెవరూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్న సంగతి వెల్లడైందని, బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరించడంతోనే వారు ప్రభుత్వానికి భూములిచ్చినట్టు తేటతెల్లమైందని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు వాటిని తిరిగి తమకు అప్పగించాలని కోరుతున్నారని, అందువల్ల వారికి తక్షణం ఆ భూములను అప్పగించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. పంట భూముల పరిరక్షణకోసం రైతులకు దన్నుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తానని అన్నాహజారే అందులో తెలిపారు. అన్నాహజారే లేఖలో పేర్కొన్న అంశాలివీ... ‘‘రాష్ట్ర విభజన బాధాకరమే. ఆర్థికలోటులో ఆంధ్రప్రదేశ్ ఉందన్నది నాకు తెలుసు. రాష్ట్రం ఆర్థిక లోటును తొందరలోనే అధిగమిస్తుందని భావిస్తున్నా. రాజధాని నగరం నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను అధికారులు రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి సమీకరించారంటూ కొందరు నాకు వినతిపత్రాలను పంపారు. రెండు మూడు పంటలు పండే భూములను పరిరక్షించాలని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరుంది. ఆ భూములను సేకరించడం ద్వారా అన్నపూర్ణ అనే పేరున్న రాష్ట్రానికి అప్రతిష్ట తేవొద్దు. రాజధాని ప్రాంత గ్రామాల్లో సామాజిక ఉద్యమకారులు పీవీ రాజగోపాల్, స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, ఎంజీ దేవసహాయం వంటి వారు ఎంతోమంది పర్యటించారు. వేలాదిమంది రైతులతో వారు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ఏ ఒక్క రైతూ స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలాలు లేవన్నది వారి పర్యటనల్లో వెల్లడైంది. భూ సమీకరణకు అంగీకరించకపోతే బలవంతంగానైనా భూసేకరణ చేస్తామని అధికారులు బెదిరించడంతోనే రైతులు భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అప్పట్లో ఒత్తిళ్లకు తలొగ్గి భూములు అప్పగించిన రైతులు ఇప్పుడు తమ భూములు తమకు అప్పగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ రైతులకు తక్షణమే భూములను అప్పగించండి. పారిశ్రామికీకరణకు.. అభివృద్ధికి నేను వ్యతిరేకమనుకుంటే తప్పు. వ్యవసాయయోగ్యం కాని భూముల్లో రాజధాని నగరం నిర్మించండి. బంజరు భూముల్లోనే పరిశ్రమలను స్థాపించండి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయయోగ్యం కాని భూములను తక్షణమే వర్గీకరించండి. ఆహార భద్రత దృష్ట్యా వ్యవసాయ యోగ్యమైన భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించవద్దు. పాలేకర్ సూచించిన రీతిలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అమలుచేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని రాజధాని నగరాన్ని నిర్మించండి. నేను త్వరలోనే రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తా. రైతులు, రైతు కూలీలతో సమావేశమవుతా. నేను సూచించిన సలహాలను పాటిస్తారని భావిస్తున్నా’’ అని అన్నాహజారే తన లేఖలో పేర్కొన్నారు. -
'త్వరలో ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పేరుంది.... బహుళ పంట భూములను రాజధానికి వినియోగించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ సంఘ సేవకుడు అన్నాహజారే విజ్ఞప్తి చేశారు. బుధవారం చంద్రబాబుకు అన్నాహజారే లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానికి భూ సేకరణపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నాహజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆహారభద్రతకు చాలా అవసరమైన ప్రాంతాలని ఆ లేఖలో అన్నాహజారే పేర్కొన్నారు. మా మిషన్ సభ్యులు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు చాలా సమస్యలు చెప్పారని తెలిపారు. బలవంతంగా తమ పంట భూములు తీసుకుంటున్నారని రైతులు తమ మిషన్ సభ్యుల ఎదుట అవేదన వ్యక్తం చేశారన్నారు. భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించారని రైతులు ఆందోళనతో తమ సభ్యులకు చెప్పారని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహాజారే వివరించారు. ఏపీలో వ్యవసాయేతర భూములను ప్రకటించి ఆ భూములు రాజధాని నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. త్వరలో రాజధాని ప్రాంతాంలో పర్యటిస్తానని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహజారే స్పష్టం చేశారు. -
అన్నా హజారేకు సోనియా లేఖ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు. 'భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై మీరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న మీరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నా'అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
భయంతోనే భూములు ఇచ్చాం
అన్నా హజారే మిత్ర బృందంతో రాజధాని రైతుల ఆవేదన తాడికొండ (గుంటూరు):తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భయపడి భూములు ఇచ్చామని, రాజధాని ప్రాంత రైతులు జాతీయ ఐక్య కూటమి కన్వీనర్ పి.వి.రాజగోపాల్ ఎదుట వాపోయారు. రాజధాని ప్రాంతంలో రైతుల్లో నుంచి భూములు బలవంతంగా లాక్కొంటున్నారని తెలుసుకున్న అన్నహజారే మిత్ర బృందం అయిన రాజగోపాల్ బృందం రాజధాని గ్రామంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తుళ్ళూరు మండలంలోని మందడం,తాళయపాలెం, ఉద్దడ్రాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు, మనోభావాలు తెలుసుకుని రైతుల తరుపున పోరాడతామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా లింగాయపాలెం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు బలవంతంగా భూములు ఇచ్చినట్లయితే వెనక్కు తీసుకోవచ్చని, ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకునేటటై్లతే తాము రైతుల తరుపున నిలబడి పోరాడతామని చెప్పారు. రాజధాని ప్రాంత సమస్యలను ఢిల్లీలో అన్నహజారే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణానికి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా రాజధాని పర్యటన కమిటి నాయకులు లింగాయపాలెం గ్రామానికి చెందిన అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాజధాని ప్రాంత రైతుల తరుపున ఢిల్లీలో నిర్వహించిన సేవా గ్రామ్ కార్యక్రమానికి వెళ్ళి రాజధాని ప్రాంత పరిస్థితిపై అన్నహాజరేకు వివరించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరు నుంచి అన్నహజారే 1100 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధానిప్రాంతాన్ని సందర్శించడానికి మేధాపాట్కార్ కూడా రానున్నట్లు చెప్పారు. అనంతరం రాయపూడిలోని నిమ్మతోటలను పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఎంటీమ్ ప్రతినిధి బలిశెట్టి సత్యనారాయణ, విష్ణు, ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, చిట్టిబాబు, పలువురు నాయకులు, పాల్గొన్నారు. -
మార్చి 25నుంచి అన్నాహజారే పాదయాత్ర
-
'అన్నాను చంపే సమయమొచ్చింది'
థానే: ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు ఫేస్బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. ‘అన్నా హజారేను చంపే సమయం వచ్చింది. నేనే కాబోయే నాథూరామ్ గాడ్సే’ అని కెనడా ఎన్నారై గగన్ విధు ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు గగన్తో పాటు అతనికి సహకరించిన నీల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, హజారే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఫేస్బుక్ సందేశం వచ్చిన కంప్యూటర్ ఐపీ అడ్రస్ కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్నా మద్దతుదారుడు అశోక్ గౌతమ్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. -
‘భూ బిల్లు’ను తెస్తే.. ఢిల్లీకి పాదయాత్ర
కేంద్రానికి అన్నా హజారే హెచ్చరిక సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూ ఆర్డినెన్సు బిల్లును తీసుకొస్తే సేవాగ్రామ్ (మహారాష్ట్ర) నుంచి ఢిల్లీకి మార్చిలో పాదయాత్ర మొదలుపెడతానని గాంధేయవాది అన్నా హజారే కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. పాదయాత్ర చేపడితే రెండు మూడు నెలల పాటు కొనసాగుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలోని వార్ధాలో వచ్చే నెల 9న సమావేశమై పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శుక్రవారం అన్నా హజారే మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన భూ ఆర్డినెన్సులోని అంశాలే భూసేకరణ 2013 సవరణ బిల్లులోనూ ఉన్నాయన్నారు. చర్చల కోసం ప్రధాని మోదీ ఆహ్వానిస్తే వెళ్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మోదీకి నా పేరంటే అలర్జీ. నా సహచరులు ఆయనతో చర్చిస్తారు. ప్రభుత్వంతో చర్చించడం ద్రోహం కాదు’ అని బదులిచ్చారు. -
హజారేకే మద్దతు ఎందుకు ఇవ్వలేదు బాబూ?
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ నెల్లూరు (సెంట్రల్): ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అన్నా హజారే ఫొటోను పెట్టుకుని ఊరూరా తిరిగిన చంద్రబాబుకు ఇప్పుడు హజారే దీక్ష ఎందుకు గుర్తుకు రాలేదో సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ప్రశ్నించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అన్నాహజారేను ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన మద్దతు చాలా అవసరమంటూ నిత్యం డాబు మాటలు చెప్పే చంద్రబాబు.. ఇప్పుడు భూసేకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే ఎందుకు చంద్రబాబు మద్దతు ఇవ్వటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హజారే చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలి.. లేకుంటే కేంద్రంలో ఉన్న మీ ఇద్దరు మంత్రులతో రాజీనామా అయినా చేయించాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజధాని కోసం రైతుల వద్ద భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేలేక కేంద్రంలో అడుక్కుంటూ..రాష్ట్రంలోకి వచ్చి మీసాలు తిప్పుతూ చంద్రబాబు కాలం వెల్లతీస్తున్నారని ఎద్దేవా చేశారు. -
జైల్‌భరోకు సిద్ధం కండి..
అన్యాయపు ఆర్డినెన్సును అడ్డుకోండి: అన్నా అన్నా దీక్షలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్సు రైతుల కడుపుకొట్టే ఆర్డినెన్సు అని గాంధేయవాది అన్నా హజారే మోదీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోనంత వరకూ యుద్ధం ఆపేది లేదని మంగళవారం స్పష్టం చేశారు. తాము చేస్తున్నది మరో స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించిన అన్నా.. ఎన్డీఏ తెచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాదయాత్రల నిర్వహణకు సంకల్పించాలని ప్రజలకు అన్నా పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన అన్నా ఆందోళన మంగళవారంతో ముగిసింది. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్టు వర్కింగ్ పీపుల్, అఖిల భారతీయ కిసాన్ సభ, నర్మదా బచావ్ ఆందోళన్ తదితర సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక, వైఎస్సార్సీపీ అన్నా ఆందోళనకు మద్దతు తెలిపాయి. భారీ ధర్నా వేదికపైనుంచి అన్నా హజారే మాట్లాడుతూ రైతుల కోసం బలిదానాలకు సిద్ధంకావాలన్నారు. నిరాహార దీక్ష చేసి తాను చనిపోవాలని అనుకోవడం లేదని, ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కాగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న అన్నాహజారేకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వేదిక పంచుకున్నారు. ఆయనతో పాటు ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు 67మందీ ధర్నాలో పాల్గొన్నారు. కార్పొరేట్ల కోసం ఓ దళారిలాగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. భూసేకరణ బిల్లు పేదల వ్యతిరేక బిల్లు, రైతుల వ్యతిరేక బిల్లు అని తెలుపుతూ బిల్లును వ్యతిరేకించడంలో అన్నా వెంట ఉన్నామని చెప్పారు. సచివాలయానికి ఆహ్వానించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వ సచివాలయానికి బుధవారం రావలసిందిగా అన్నాను కేజ్రీవాల్ ఆహ్వానించారు. అన్నా రాకవల్ల ఢిల్లీ సచివాలయం పవిత్రమవుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాధిపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు స్ఫూర్తినిచ్చేందుకు వారితో మాట్లాడాలని అన్నాను కోరారు. అయితే అన్నా వేరే కార్యక్రమం వల్ల సచివాలయానికి వెళ్లక పోవచ్చని సమాచారం. -
'పార్టీలన్నీ మా ఉద్యమంలో పాలుపంచుకోవచ్చు'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అన్నా చేపట్టిన ఉద్యమానికి పలుపార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధమైయ్యాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అన్నా తలపెట్టిన ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. దీంతో కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన తొలి నిరసన. అయితే తాను ఎట్టిపరిస్థితిల్లోనూ దీక్షకు మాత్రం దిగనని హజారే స్పష్టం చేశారు. దేశ ప్రజలకు తన ప్రాణాలు ముఖ్యమని.. అందుచేత ఉద్యమాన్ని పాదయాత్ర రూపంలో తీవ్ర స్థాయికి తీసుకువెళతానని ప్రకటించారు. పార్టీలకతీతంగా తన ఉద్యమం ఉంటుందన్నారు. ఈ ఉద్యమంలో ఏ పార్టీ అయినా పాల్గొని తమకు మద్దతు తెలుపవచ్చన్నారు. మూడు-నాలుగు నెలలపాటు తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు. -
హజారే దీక్షకు తరలిన గుంటూరు, కృష్ణా రైతులు!
-
మిగిలిన భూమి రియల్ ఎస్టేట్ కోసమా?
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సారవంతమైన భూములను ఏకపక్షంగా లాక్కొని రైతులకు అన్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. మంగళవారం ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారేను అంబటి, ఏపీ రాజధాని ప్రాంత రైతు నేతలు కలిశారు. అన్నా హజారే దీక్ష వద్ద రాజధాని కౌలు పంటల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అంబటి తెలిపారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ కూడా ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాజధానికి రెండు వేల ఎకరాలు సరిపోయే పక్షంలో, మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించనున్నారా?అని అంబటి ప్రశ్నించారు. -
భూ ఆర్డినెన్స్‌పై హజారే సమరం
జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజుల దీక్ష సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు అన్యాయం చేసే భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని గాంధేయవాది అన్నా హజారే డిమాండ్ చేశారు. ఆంగ్లేయుల హయాంలో కూడా రైతులకు ఇంతటి అన్యాయం జరగలేదని, వారి పాలనలో కంటే దారుణమైన ఆర్డినెన్సును మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకొని, భూసేకరణ చట్టం-2013లోనే రైతుకు మరింత మేలు చేకూర్చే అంశాలను జోడించి మంచి చట్టం తేవాలన్నారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయకుంటే మూడు, నాలుగు నెలలు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి జైల్‌భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భూసేకరణపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన సోమవారం జంతర్ మంతర్ వద్ద రెండ్రోజుల నిరసన దీక్ష ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ రైతులకు ఎప్పుడూ ఇలాంటి అన్యాయం జరిగి ఉండకపోవచ్చు. ఈ అప్రజాస్వామ్యకమైన ఆర్డినెన్స్‌ను అమలు చేయడమంటే రైతుల భూమిని ప్రభుత్వం కబ్జా చేయడమే. బ్రిటిష్ పాలకులు కూడా మన రైతులకు ఇంత అన్యాయం ఎప్పుడూ చేయలేదు. అధికారంలో కాంగ్రెస్, విపక్షంలో మీరు(బీజేపీ) ఉండగా ఇద్దరూ కలిసి 2013లో భూసేకరణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు మీ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక అకస్మాత్తుగా ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది రైతులకు తీరని అన్యాయం చేయడమే’ అని అన్నారు. ‘ఎన్నికల ముందు మంచిరోజులు తెస్తామన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు. కానీ ఇప్పుడు నిర్భందంగా రైతుల భూములను పారిశ్రామికవేత్తలకిస్త్తున్నారు. మంచిరోజులు ప్రజలకు రాలేదు. కార్పొరేట్లకే వచ్చాయి’ అని అన్నారు. రెండో స్వతంత్ర పోరాటం.. ‘భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించాక ప్రజలే యజమానులని, ప్రభుత్వం సేవకుడని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది తలకిందులైంది. ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతీ జిల్లాకు తీసుకువెళ్తా. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుల నుంచి వారి అనుమతి లేకుండా భూమిని ఎలా లాక్కుంటారు’ అని హజారే నిలదీశారు. రైతులకు జరగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి జైలుకెళ్లడానికీ సిద్ధమేనన్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది రాలేగావ్ సిద్ధినమూనా అని, గుజరాత్ నమూనాఅభివృద్ధి కాదన్నారు. అన్నాతో కేజ్రీవాల్ భేటీ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సదన్‌లో అన్నా హజారేను కలుసుకున్నారు. ఇద్దరూ గంటపాటు చర్చించారు. అనంతరం కేజ్రీవాల్ సన్నిహితుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ... మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా దీక్షలో కూర్చుంటారని తెలిపారు. -
'భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు'
రైతుల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అన్నా హజారేకు చెప్పడానికే తాము ఢిల్లీ వచ్చామని తెలిపారు. న్యూఢిల్లీలో అన్నా హజారే చేస్తున్న ఆందోళనలో రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. రాజధానికి 2 వేల ఎకరాల భూమి సరిపోతుందని, అలాంటప్పుడు మిగిలిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, బినామీల కోసమే రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కాగా, ఏపీ రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మేధా పాట్కర్ మంగళవారం నాడు జంతర్ మంతర్ వద్ద ప్రారంభిస్తారు. -
రైతుల గురించి హజారేకు ఏం తెలుసు?
రైతుల గురించి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారేకు ఏమీ తెలియదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ అన్నారు. ఆయన కంటే తనకే వారి అవసరాలు ఎక్కువగా తెలుసని చెప్పారు. గురువారం భూవనరుల శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతుల సమస్యలపై హజారే నిరశన దీక్షను గురించి ప్రశ్నించగా బదులిచ్చారు. జంతర్ మంతర్ వద్ద ఎవరు దీక్ష చేస్తున్నారో ఎవరు చేయడం లేదో తనకు తెలియదని, అయినా తమ ప్రభుత్వమేమి రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పారు. త్వరలో తీసుకురానున్న భూసేకరణ సవరణ బిల్లులో రైతులకు నాలుగింతల నష్ట పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులను తాము అర్ధం చేసుకున్నంతగా హజారే అర్ధం చేసుకోలేదని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు వారి గురించి ఏమి తెలియకపోయి ఉండొచ్చని అన్నారు. ఫిబ్రవరి 23న అన్నా హజారే కొంతమంది రైతులతో జంతర్ మంతర్ వద్ద భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
అన్నాతో భేటీ కానున్న రాజధాని రైతులు
సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను ఢిల్లీ స్థాయిలోనూ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ను కలిసి తమ గోడు వినిపించనున్నారు. భూ సేకరణ చ ట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీల్లో అన్నా హజారే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. దీంతో ఆ రోజుల్లో ఢిల్లీ వెళ్లి అన్నా హజారేను కలవాలని రాజధాని నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు నిర్ణయించారు. దాదాపు 15 మంది రైతులు, రైతు కూలీలు ఈ నెల 21న విజయవాడ నుంచి రైలులో బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. వారిలో కారుమంచి ఇంద్రనీల్, శ్రీనాథ్ చౌదరి, గద్దె శేఖర్, పాల్, జార్జి, బుజ్జి తదితరులున్నారు. మూడు పంటలు పండే తమ భూమిని బలవంతంగా లాగేసుకునేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తోందో అన్నా హజారేకు సవివరంగా తెలియజేసేందుకు వీరు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఒకటి తయారు చేశారు. తమవి ఎంతటి సారవంతమైన భూములో, ఎలాంటి పంటలు పండుతాయో తెలిపేందుకు.. ఆ భూములన్నింటినీ వీడియో తీయించి ఓ షార్ట్ ఫిల్మ్‌ను కూడా రైతులు రూపొందించారు. ఇలావుండగా వీరు తమ సమస్యను అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు సైతం వివరించనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్లను కూడా ఇప్పటికే కోరారు. -
24న హజారే నిరాహార దీక్ష
సాక్షి, ముంబై: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీలో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. రాలేగావ్‌సిద్దిలో మీడియాతో మాట్లాడిన అన్నా.. ఈ నెల 24న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్-మంతర్ మైదానంలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. రైతుల కష్టాలతోపాటు వివిధ సమస్యలపై పలుమార్లు మోదీకి లేఖలు రాసినా ఇంతవరకు జవాబు రాలేదని ఆరోపించారు. -
ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య
సాక్షి, ముంబై: ఢిల్లీలో బీజేపీ పరాజయానికి కిరణ్ బేడీ కాకుండా మోదీయే కారణమన్న అన్నా హజారే వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పరుషంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లాటేపేక్షా సునామి మోటీ అస్తే’ (అలల కంటే సునామి ప్రభావం అధికంగా ఉంటుంది) అని ఢిల్లీ ప్రజలు నిరూపించారంటూ మోదీని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి పరాజయం అని పేర్కొనడం తప్పు కాదన్నారు. దేశమంతా మోదీ అలలు ఊపేస్తున్నాయన్న చర్చ జరిగిందని, కానీ ఢిల్లీ ప్రజలు అలల కన్నా సునామీ గొప్పదని నిరూపించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో అభినందించారు. ఢిల్లీలోని ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, ఆశలకు లొంగకుండా కావల్సిన వారికే పట్టంకట్టారని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావన శివసేన కార్యకర్తల్లో నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా 18 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్తాను..! ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే తప్పకుండా వెళతానని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. తాను కేజ్రీవాల్‌తో మాట్లాడి అభినందించానని చెప్పారు. ఢిల్లీ కోసం పని చేయాలని చెప్పానని, సీఎం పదవి నుంచి రాజీనామా చేసే తప్పిదం మరోసారి చేయకూడదని కూడా సూచించానని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ యాత్ర ప్రారంభమైంది ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ముక్త్ భారత్ యాత్ర (బీజేపీ లేని దేశం) ప్రారంభమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఓ చెంపపెట్టుగా ఉందన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసే బీజేపీని ప్రజలు తిరస్కరించడం ప్రారంభించారని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఘనవిజయం సాధించిన ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ప్రజలు బుద్దిచెప్పారు తమకు తిరుగులేదన్న అహంకారంతో ముందుకు వెళ్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారని ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండే పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రూ. 10 లక్షల సూట్‌పై వంద రూపాయల సామాన్యుని మఫ్లర్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ధనంజయ్ ముండే విలేకరులతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల అనంతరం జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. దీంతో బీజేపీ నాయకులకు అహంకారం, గర్వం పెరిగిపోయింది. దీన్ని గమనించిన సామాన్య ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారని ఆయన పేర్కొన్నారు. -
‘అన్నా’ను బీజేపీ చంపేసింది
* నాడు గాంధీని గాడ్సే చంపాడు.. నేడు బీజేపీ ‘అన్నా’ను చంపింది * బీజేపీ పోస్టర్లో అన్నా ఫొటోకు దండ వేయడంపై కేజ్రీవాల్ ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ బీజేపీ విడుదల చేసిన కార్టూను వివాదాస్పదమైంది. ఆ చిత్రంలో అన్నా హజారే చిత్రపటానికి పూలమాల వేసినట్లు చూపటం ద్వారా ఆయన్ను బీజేపీ చంపేసిందని ఆప్ విరుచుకు పడింది. ‘నాడు గాంధీని గాడ్సే చంపేశాడు. ఇప్పుడు అన్నాని బీజేపీ తన ప్రకటనలో చంపేసింది’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ తన పిల్లలపై ఒట్టేసి కాంగ్రెస్ మద్దతు తీసుకోనంటూనే, కాంగ్రెస్‌ను పెళ్లాడినట్లుగా బీజేపీ పత్రికల్లో ప్రకటనలిచ్చింది. ఆప్ మహిళా వ్యతిరేకి: కాగా ఆప్ విమర్శలను పట్టించుకోని బీజేపీ ఆ పార్టీపై మరింత దూకుడు పెంచింది. ఆప్ మహిళా వ్యతిరేక పార్టీ అని, రాజ్యాంగ సంస్థలపై దానికి నమ్మకం లేదని బీజేపీ ఢిల్లీ కార్యాలయంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ విమర్శించారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే కేజ్రీవాల్, 2013 ఎన్నికల ఖర్చు లెక్కలు ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్ నుంచి మద్దతుగా ఫోన్లలో ప్రచారం నిర్వహిస్తున్న ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి ఢిల్లీలో వాలంటీర్లు దొరకడంలేదా? అని అడిగారు. కిరణ్‌బేడీ అందరికన్నా యోగ్యురాలైన ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆప్ సంరక్షకుడు శాంతిభూషణ్ తోపాటు సాక్షాత్తూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాలే పేర్కొంటూ ఆమెను ఆప్‌లో చేరాలని ఆహ్వానించారని, కానీ కిరణ్ బేడీ బీజేపీ సీఎం అభ్యర్ధిగా బరిలోకిదిగడంతోనే ఆప్ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేయటం విడ్డూరమని నిర్మల ఆక్షేపించారు. జన్‌లోక్‌పాల్ అంశంపై కేజ్రీవాల్ ఎందుకు పోరాడలేదని నిర్మల ప్రశ్నించారు. గెలిస్తే.. మూడు రాజ్యసభ సీట్లు వస్తాయి ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీ మూడొంతుల మెజార్టీ సాధిస్తే మూడు రాజ్యసభ సీట్లు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్రం, ఢిల్లీ సర్కారు కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌పై 10 క్రిమినల్ కేసులు:అరవింద్ కేజ్రీవాల్‌పై మొత్తం 10 క్రిమినల్ కేసులు నమోదైనట్టు ది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 673మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించిం ది. కాంగ్రెస్ నేత షోయబ్ ఇక్బాల్ తరువాత ఎక్కువ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న నేతగా కేజ్రీవాల్ ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. -
మళ్లీ లోక్‌పాల్ ఉద్యమం: అన్నా హజారే
నల్లధనం తెస్తానని చెప్పి మోదీ మోసం చేశారు రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇది గుణపాఠంగా మారాలని ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావటమే కాకుండా ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో తలపడుతున్న ఒకప్పటి తన అనుచరులు కేజ్రీవాల్, కిరణ్ బేడీల గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. బేడీ, కేజ్రీవాల్‌లపై తనకు ఎలాంటి కోపం లేదని.. వారి నుంచి ఏదీ ఆశించనప్పుడు కోపమెందుకు వస్తుందనానరు. ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై తనకు ఆసక్తి లేదన్నారు. పార్టీ రాజకీయాల ద్వారా ఎవరూ ఎలాంటి మార్పూ తీసుకురాలేరన్నారు. తనను ఆ గొడవల్లోకి లాగవద్దని తేల్చి చెప్పారు. లోక్‌పాల్ అంశంపై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం చేస్తానని హజారే తెలిపారు. ‘లోక్‌పాల్ చట్టంపై రాష్ట్రపతి సంతకం చేసి 365 రోజలైనా మోదీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదు’ అని అరోపించారు. ప్రభుత్వం అవినీతిని తీవ్రంగా పరిగణించడం లేదు కనుక లోక్‌పాల్, భూసేకరణ చట్టం తదితర అంశాలపై మళ్లీ ఆందోళన చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజా సేవకే అంకితం: అన్నాహజారే
గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన వీఎస్కేయూ బళ్లారి : ప్రజా సమస్యలపై పోరాడే తమలాంటి వారికి ప్రభుత్వం, సంఘ సంస్థలు అందజేసే పట్టాలు, పురస్కారాలు మరింత బాధ్యత పెంచుతాయని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే పేర్కొన్నారు. నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) శనివారం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైసూరు పేటా తొడిగి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశానన్నారు. జనలోక్పాల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త సంస్థలు చురుకుగా పని చేయాలన్నారు. రాజ్యాంగమే మనకు ఇచ్చిన పోరాట హక్కును సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల మద్దతు ఉండే ఏ పోరాటాలైనా నీరుగారి పోవన్నారు. గతంలో తాను అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చిన పోరాట పిలుపునకు యావత్ దేశ నలుమూలల నుంచి మద్దతు దొరికిందని గుర్తు చేశారు. సీనియర్ గాంధేయవాది దొరెస్వామి, ఇన్చార్జి వీసీ సోమశేఖర్, రిజిస్ట్రార్ విజయకుమార్, ఎల్ఆర్ నాయక్ పాల్గొన్నారు. -
రాజకీయ మురికికి దూరంగా ఉంటా: హజారే
రాలేగావ్ సిద్ధి: తాను రాజకీయ మురికి కూపానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నా హజారే చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘జన్ లోక్‌పాల్’ కోసం ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తానని చెప్పారు. బుధవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఫోన్ చేసిన అన్నా సమాధానమివ్వలేదని కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయ మురికికి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆ మురికిలో నేను ఉండలేను’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో బేడీ చేరికపై అడగ్గా.. దానిపై తానేమీ మాట్లాడనని చెప్పారు. -
కిరణ్ బేడి తీరు పై అసంతృప్తితో హజారే
-
కిరణ్ బేడీపై హజారే కినుక!
ఫోన్ చేసినా స్పందించని గాంధేయవాది బీజేపీలో చేరడంపై అసంతృప్తిగా ఉన్న అన్నా న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ తీరుపై ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే అసంతృప్తిగా ఉన్నారా? ఆమెతో మాట్లాడేందుకూ ఇష్టపడలేదా? అవుననే అంటున్నారు అన్నా సన్నిహితులు. ఒకనాటి అన్నా టీమ్ సభ్యురాలైన బేడీ తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు వారు చెపుతున్నారు. బేడీ తీరుతో ఆయన మనస్తాపం చెందారని పేర్కొన్నారు. బీజేపీలో చేరిన రోజు నుంచి కిరణ్‌బేడీ రోజూ ఫోన్ చేస్తున్నా అన్నా స్పందించడం లేదని, ఆదివారం ఉదయం, రాత్రి కూడా ఆమె ఫోన్ చేసినా ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని వెల్లడించారు. శుక్రవారం అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరడానికి ముందు బేడీ తనను సంప్రదించలేదని, ఒక ఏడాదిగా ఆమె తనను కలవలేదని చెప్పిన సంగతి తెలిసిందే. 2011లో అన్నా చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడాన్ని అన్నా హజారే వ్యతిరేకించారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ఆద్మీ పార్టీని ప్రారంభించడాన్ని కూడా అన్నా హజారే వ్యతిరేకించారు. తొలుత వ్యతిరేకించినా.. ఆ తర్వాత కేజ్రీవాల్‌కు తన ఆశీస్సు లు అందించారు. నిబద్ధత కలిగిన ముక్కు సూటి వ్యక్తిగా.. కిరణ్‌బేడీని అన్నా భావిస్తారని అందువల్ల.. ఆమె విషయంలోనూ ఆయన కేజ్రీవాల్ తరహాలోనే స్పందించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అన్నాకు చాలా సార్లు ఫోన్ చేశా: బేడీ హజారేకు తాను చాలా సార్లు ఫోన్ చేశానని, ఆయితే ఆయన మాట్లాడలేదని బేడీ చెప్పారు. తాను ఫోన్ చేసిన సమయంలో ఆయన నిద్రపోతూనోచ లేక విశ్రాంతి తీసుకుంటునో ఉండొచ్చన్నారు. ‘మీరు బీజేపీలో చేరడంపై అన్నా అసంతృప్తితో ఉన్నారా’ అని ఆదివారం విలేకరులు ప్రశ్నించగా స్పందించారు. తాను సోమవారం కూడా అన్నాకు ఫోన్ చేస్తానని, తాను ఈ విషయం చెపితే అన్నా ఎలా స్పందిస్తారో తనకు తెలుసని చెప్పారు. -
‘లోక్‌పాల్’ అమలు కోసం త్వరలో దీక్ష
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వెల్లడి హైదరాబాద్: లోక్‌పాల్ చట్టం సత్వర అమలు కోసం మరో పోరాటం చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు, గాంధేయవాది అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘపోరాటం అనంతరం మునుపటి యూపీఏ ప్రభుత్వం చేసిన లోక్‌పాల్ చట్టం అమలుపై ప్రస్తుత సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. శనివారం హైదరాబాద్ వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో ‘సాయి దేశం- గాంధీ మార్గం’ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛత్రపతి శివాజీ గ్రౌండ్లో జరిగిన సభలో పాల్గొని యువత, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సమాజమే ఒక కుటుంబంగా భావించి, అందరితో కలసిమెలసి జీవిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరూ తాను బతుకుతూ సమాజాన్ని బతికించాలన్న స్వామి వివేకానందుని మాటలను పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ గాంధేయ మార్గంలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్య గౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేశ్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
ఆకట్టుకున్న ‘గాంధీ మార్గం’
వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో శనివారం ‘సాయిదేశం-గాంధీమార్గం’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు, గాంధేయవాది అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన హజారే ఛత్రపతి శివాజీ మైదానంలో జరిగిన సభలో ప్రసంగించి ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్యగౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేష్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - ఎల్బీనగర్/తుర్కయంజాల్ -
నేడు నగరానికి హజారే
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే శనివారం నగరానికి వస్తున్నట్టు ‘సాయి దేశం-గాంధీ మార్గం’ సంస్థ తెలిపింది. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ఛత్రపతి శివాజీ (నాగార్జున) మైదానంలో జరిగే కార్యక్రమంలో, స్థానిక సాహెబ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొంటారని వివరించింది. -
కేజ్రీవాల్ ప్రధాని కావాలనుకున్నారు: హజారే
రాలేగావ్ సిద్ది: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలని ఆశ పడ్డారని అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నా హజారే తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం కేజ్రీవాల్ చేసిన పొరపాట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యమ పంథా వదలొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదని వాపోయారు. ఢిల్లీ సీఎం అయిన తర్వాత కేజ్రీవాల్ ను ఒకసారి కలిసినట్టు హజారే తెలిపారు. ఢిల్లీకి పరిమితం కావాలని, జాతీయస్థాయిలో రాజకీయాల గురించి అప్పుడే ఆలోచించొద్దని సలహాయిచ్చానని చెప్పారు. అయితే తన సూచనను కేజ్రీవాల్ పట్టించుకోలేదన్నారు. ఆప్ ఒంటెత్తు పోకడలు ఉన్నాయని, పరిస్థితి మారకుంటే ఆ పార్టీ మనుగడ కష్టమని హజారే అన్నారు. -
జైలుకెళ్లడం ఓ ఫ్యాషన్ : అన్నా హజారే
బెంగళూరు : ఏ పోరాట యోధుడికైనా జైలు కెళ్లడం అనేది అలంకారంగా ఉంటుందని, అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి జైలుకెళ్లడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బాధపడ్డారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన హజారే ‘అసలీ ఆజాదీ’ పేరిట మరో ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. గాంధీభవన్‌లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ‘అసలీ ఆజాదీ’ ఉద్యమాన్ని హజారే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ వ్యక్తి అయినా న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్ కోసం షూరిటీ మొత్తాన్ని చెల్లించనని మొండిగా ప్రవర్తించడం ఎంత మాత్రం సరికాదని కేజ్రీవాల్, ఆయన అనుచరులనుద్దేశించి విమర్శలు చేశారు. తమపై అన్యాయంగా కేసులు మోపారని భావిస్తే వాటిని నిరాధారమైనవిగా నిరూపించే ప్రయత్నం చేయాలన్నారు. అలా కాకుండా బెయిల్ తీసుకోవడానికి షూరిటీ చెల్లించనని చెప్పడాన్ని న్యాయ వ్యవస్థను గౌరవించే ఏ ఒక్కరూ సహించరని చెప్పారు. ఈ విషయంపై కేజ్రీవాల్‌కి మీరేమైనా సలహా ఇస్తారా అన్న మీడియా ప్రశ్నకు.. ‘ఇంతకు ముందు కేజ్రీవాల్ నా సహచరునిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నా పరిధిలో లేరు’ అని అన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనని, అయితే మోడీకి అంతా శుభమే జరగాలని మాత్రం కోరుకుంటున్నానని అన్నా హజారే తెలిపారు. -
మరో ఉద్యమానికి శ్రీకారం
పింప్రి, న్యూస్‌లైన్: త్వరలో మరో ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల కోసం పనిచేయని, ప్రజల మాట వినని నాయకులను వెనక్కు తీసుకువచ్చే చట్టం ‘రైట్ టు రీకాల్’ కోసం త్వరలో ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘లడో లోక్‌పాల్ ఛా.. ఉద్రేక్ ఆమ్ ఆద్మీ ఛా’ పుస్తకాన్ని పుణేలో సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా హజారే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి జనశక్తి బలమేంటో చూపించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే సూచన కనిపించడం లేదన్నారు. యువ శక్తి ఈ ఎన్నికలలో ముఖ్య భూమికగా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో నోటు ద్వారా అధికారానికి వచ్చి ప్రజల బాగోగులను మరిచి, ఐదు సంవత్సరాల వరకు నియోజకవర్గంవైపు చూడని ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అధికారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ‘వెనక్కు పిలిచే’ హక్కును కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ హక్కు కోసం త్వరలో త్వరలో ఆందోళన చేస్తామని, ప్రజలే దేశానికి యజమానులని, అభివృద్ధి అనేది కిందిస్థాయి నుంచి జరగాలని, ఈ విషయంపై ప్రజల్లో జన జాగృతి కల్పిస్తానని ఆయన తెలిపారు. మరో నెలరోజుల్లో ఆందోళనకు సిద్ధమవుతానని తెలిపారు. ఇదిలావుండగా హజారే ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ధనంజయ విజలే రచించారు. ఈ కార్యక్రమంలో స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు రాజుశెట్టి, డాక్టర్ విశ్వంభర్ చౌదరి, అవినాష్ ధర్మాధికారి, సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతటి పెద్ద ఉద్యమంగా మారిందో తెలిసిందే. హాజరే దీక్షకు దిగివచ్చిన కేంద్రం ఎట్టకేటకు జన్‌లోక్‌పాల్ బిల్లును రూపొందించి, అమల్లోకి కూడా తెచ్చింది. కాగా తాజాగా హజారే ప్రాంభించనున్న ఉద్యమం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. -
పోలీసుల్ని పరుగులు పెట్టించిన 'డమ్మీ అన్నా'
-
‘దీనానాథ్’ అవార్డు ప్రదానం
ముంబై: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులను సామాజిక కార్యకర్త అన్నాహజారే, సంగీత విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, సీనియర్ నటుడు రిషి కపూర్ తదితరులకు గురువారం రాత్రి ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి యేటా ఏప్రిల్ 24వ తేదీన ‘స్మృతి దిన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, సంగీతం, నటన, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు దీనానాథ్ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు వివరించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష పారితోషికం, మెమెంటో అందజేశామన్నారు. సినిమా రంగానికి గాను సీనియర్ నటుడు రిషికపూర్‌కు, సంగీత రంగంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త అన్నాహజారే, శివాజీ సతమ్, పండిట్ పండరీనాథ్ కొల్హా పురీ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. కాగా రిషికపూర్ రెండేళ్ల వయసులో తన చేతుల్లో ఆడుకున్నాడని, ఇప్పుడు ఒక సీనియర్ నటుడిగా తన తండ్రి పేరిట అవార్డును అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉస్తాద్ జాకీర్ హస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అతడు తనను కన్నకూతురిగా చూసుకునేవారని, ఒకే రోజు ఆయన సంగీత సారథ్యంలో ఆరు పాటలు రికార్డు చేశామని లత వివరించారు. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన రాలేగాంసిద్ధి మీదుగా ప్రయాణించినప్పుడు హృదయ్నాథ్ మంగేష్కర్ తనను కలిసినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఇటీవల కాలంలో రూ.కోటికిపైగా పారితోషికం కలిగిన అవార్డులను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారని అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే లతా మంగేష్కర్ తనను ఈ అవార్డు కోసం సంప్రదించిన వెంటనే ఆనందంగా అంగీకరించానని వివరించారు. -
లోక్‌పాల్‌పై నీలినీడలు!
పదేళ్లుగా చేస్తున్న నిర్వాకం చాల్లేదేమో... దిగిపోయే ఘడియల్లో కూడా యూపీఏ తెంపరితనాన్నే ప్రదర్శిస్తోంది. సంప్రదాయాలకూ, విలువలకూ నీళ్లొదిలి అడ్డదారిలో లోక్‌పాల్ నియామకానికి అది తహతహలాడిపోతోంది. లోక్‌పాల్‌ను ఎలాగైనా ఈ వారంలో ప్రతిష్టించాలని తెగ హడావుడి చేస్తోంది. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముగియడానికి పక్షం రోజుల సమయం ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ తరుణంలో కీలకమైన నియామకాలు చేయకూడదన్నది సంప్రదాయం. కానీ, యూపీఏ సర్కారు వీటన్నిటినీ తోసిరాజంటున్నది. ఇలాంటి వ్యవస్థ కోసం గత నాలుగున్నర దశాబ్దాలుగా పార్లమెంటులో ఏవేవో ప్రయత్నాలు జరిగినట్టు కనబడటం, చివరకు ఏమీ కాకుండానే ముగిసిపోవడం ఈ దేశ ప్రజలు చూశారు. మూడేళ్లక్రితం అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి నిర్మూలన పోరాటానికి అనూహ్యమైన స్పందన లభించాక రాజకీయ పక్షాలన్నీ ఈ విషయంలో ఇక తప్పించుకోలేకపోయాయి. పర్యవసానంగా రెండేళ్లనాడు బిల్లు ప్రవేశపెట్టినా... అందులో లొసుగుల సంగతలా ఉంచి, దాని ఆమోదానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో యూపీఏ సర్కారు విఫలమైంది. చివరాఖరికి లోక్‌పాల్‌ను అయిందనిపించినా దానికి అనుబంధంగా ఆమోదం పొందాల్సిన సిటిజన్స్ ఛార్టర్ బిల్లువంటివి ముందుకు కదలనేలేదు. ఇక లోక్‌పాల్‌కు నేతృత్వంవహించగల వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన సెర్చ్ కమిటీ ఏర్పడలేదు. అందులో తాముండేది లేదని కమిటీ చైర్మన్‌గా నిర్ణయించిన జస్టిస్ కేటీ థామస్, సభ్యుడు ఫాలీ ఎస్. నారిమన్‌లు ముందే ప్రకటించారు. ఎంపిక ప్రక్రియ తీరుపై వారు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సమర్ధుడైన, నిజాయితీపరుడైన వ్యక్తిని లోక్‌పాల్‌కు ఎంపిక చేయడం ఇప్పుడున్న నిబంధనల చట్రంలో సాధ్యంకాదని ఇద్దరూ చెప్పారు. సెర్చ్ కమిటీ ఎంతో ప్రయాసపడి ఎంపిక చేసినా చివరకు ఆ సిఫార్సులను ఎంపిక కమిటీ ఎలాంటి కారణాలూ చెప్పకుండా తోసిపుచ్చవచ్చునని వారన్నారు. సుప్రసిద్ధ న్యాయకోవిదులు ఇలాంటివి ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం ప్రభుత్వ బాధ్యత. కనీసం ఆ అభ్యంతరాలు సహేతుకమైనవి కాదని అయినా నిరూపించగలగాలి. కానీ, సర్కారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. సరికదా ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని అధికారం మెట్లు దిగే సమయంలో ఎక్కడలేని తొందరా ప్రదర్శిస్తోంది. లోక్‌పాల్ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సూచించిన మరో న్యాయమూర్తి, సుప్రసిద్ధ న్యాయకోవిదులొకరు ఉంటారు. కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం నామినేట్ చేశారు. ఈ కమిటీ 27, 28 తేదీల్లో సమావేశమై లోక్‌పాల్‌ను ఎంపిక చేయాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సెర్చ్ కమిటీ పాత్ర ఏమిటో తెలియదు. అది లేకుండానే, ఏమీ చెప్పకుండానే ఎంపిక కమిటీ ఎలా సమావేశమవుతుందో, లోక్‌పాల్‌ను ఎలా ఎంపిక చేస్తుందో అనూహ్యం. అసలు లోక్‌పాల్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీచేసిన వాణిజ్య ప్రకటనే వింతగా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోసహా ఎవరైనా ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చట. కానీ, తాము ఎందుకు అర్హులమో 200 పదాలు మించకుండా రాయాలట. పైగా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుడితో ఒక సిఫార్సు లేఖనూ జతచేయాలట. ఆత్మగౌరవమున్నవారెవరైనా ఈ నిబంధనలను అవమానంగానే భావిస్తారు. తమ పనితీరుపై సిఫార్సు లేఖ ఇవ్వమని బయటివారిని దేబిరించలేరు. సెర్చ్ కమిటీ వ్యవహారంపైనా, ఇలాంటి వెర్రిమొర్రి నిబంధనలపైనా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలై ఉంది. ఒకపక్క దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయమేమిటో తెలియాలి. ఇటు ఎన్నికలూ పూర్తవ్వాలి. కానీ, కేంద్రం మాత్రం తన దోవన తాను పోదల్చుకున్నది. అందుకు అది చూపుతున్న సాకు వింతగా ఉన్నది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం స్తంభించిపోనక్కరలేదన్న ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని తన వాదనకు అరువు తెచ్చుకుంటోంది. లోక్‌పాల్ ఏర్పాటు మరో నెలరోజులు ఆగడంవల్ల కొంపలు మునిగేదేమీ లేదు. అది ఏర్పడకపోతే ప్రభుత్వం స్తంభించే పరిస్థితీ లేదు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. ఈలోగా లోక్‌పాల్ అర్హతకు సంబంధించిన నిబంధనలు, లోక్‌పాల్ ఎంపికలో సెర్చ్ కమిటీ పాత్ర, ప్రాముఖ్యత వంటివన్నీ తేలతాయి. వీటిని పక్కనబెట్టి, సంప్రదాయాలనూ తోసిరాజని చేసే నియామకంవల్ల ఆ పదవికి ఉండే పవిత్రతా, దాని ప్రధాన ఉద్దేశమూ దెబ్బతింటాయి. విశ్వసనీయత సైతం ప్రశ్నార్ధకమవుతుంది. ఈ తరహా చర్యలు ప్రభుత్వంలో ఉన్నవారి అపరిపక్వతను తెలియజేస్తాయి. తమకు అనుకూలుడైన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు వెళ్తాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదని చాన్నాళ్లక్రితమే వెల్లడైంది. ముఖ్యమైన బిల్లులన్నీ ప్రధాన ప్రతిపక్షం సహకారంతో గట్టెక్కించింది. పైగా రాగల ఎన్నికల్లో యూపీఏ ఓటమి ఖాయమని సర్వేలన్నీ చెబుతు న్నాయి. బీజేపీ ఇప్పటికే లోక్‌పాల్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నది. ఈ ప్రక్రియను ఆపాలంటూ సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలైంది. ఇప్పటికైనా యూపీఏ పెద్దలు విజ్ఞతను ప్రదర్శించాలి. హుందాగా వ్యవహరించి ఈ వివాదానికి ముగింపు పలకాలి. -
అభ్యర్థి నచ్చకపోతే 'నోటా' నొక్కండి: హజారే
లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే 'నోటా' బటన్ నొక్కి నిరసన వ్యక్తం చేయాలని ఓటర్లకు అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే పిలుపునిచ్చారు. పార్టీలను మార్చితే దేశంలో మార్పు సంభవించదు అని హజారే అన్నారు. అధికార పార్టిని మార్చితే ఎలాంటి మార్పు ఉండదు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో గణనీయమైన మార్పులు సాధించాలంటే అసెంబ్లీ, లోకసభలకు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని హజారే పిలుపునిచ్చారు. ఏ పార్టీయైనా అవినీతిపరుడు, గుండాలను, దోపిడిదారులను నిలబెడితే.. ఓటర్లు తగిన బుద్ది చెప్పాలని ఆయన కోరారు. 500 రూపాయలకు తన హక్కులను అమ్ముకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సొంత గ్రామం రాలేగావ్ సిద్దిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మమతకు మద్దతుపై హజారే వెనక్కి
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మద్దతు విషయంలో సామాజిక కార్యకర్త అన్నాహజారే వెనక్కి తగ్గారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం ఇంతకుముందు మమతకు మద్దతు పలికిన ఆయన రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చేది లేదని తాజాగా స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ‘సంయుక్త ర్యాలీ’కి హాజరవకుండా మమతాబెనర్జీని ఇరకాటంలో పడేసిన హజారే శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. తనను మోసగించిన కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం బెంగాల్ సీఎం చుట్టూ చేరి ఉన్నారని, అందువల్ల ఆమెకు మద్దతివ్వడం తనకు కష్టసాధ్యంగా మారిందని చెప్పారు. ర్యాలీ విఫలమైన తరువాత కూడా ప్రధాని పదవికి మమతకే మద్దతిస్తారా? అని ప్రశ్నించగా... ఆయన పైవిధంగా స్పందించారు. రాబోయే ఎన్నికలకోసం తృణమూల్ రూపొందించిన ప్రచార ప్రకటనలో తన పేరును ఉపయోగించుకోవద్దని సూచించినట్టు చెప్పారు. -
దీదీకి హ్యాండిచ్చిన హజారే
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే హ్యాండిచ్చారు. ఢిల్లీలో బుధవారం తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీకి ఆయన దూరంగా ఉన్నారు. ర్యాలీలో పాల్గొనవలసిందిగా చివరి నిమిషం వరకు అన్నా హజారేను ఒప్పించేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఇందుకు గల కారణం తృణమూల్ ర్యాలీకి జనం తక్కువ రావడం అన్నాకు అసంతృప్తి కలిగించినట్టు సమాచారం. మరోవైపు అన్నా తీరుపై దీదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్లో పనంతా వదిలిపెట్టి వచ్చానని మమత నిష్టూరమాడారు. ఏ పార్టీని ప్రచారం చేయనని భీష్మించు కూర్చున్న అన్నా హజారే ఈ మధ్య తన పంతం పక్కన పెట్టి తృణమూల్ తరపున ప్రచారం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి అయినా మమతా బెనర్జీ అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తని మమతను అన్నాహజారే ప్రశంసించిన విషయం తెలిసిందే. -
మమత బెనర్జీకి హ్యాండిచ్చిన అన్నా హజారే
-
50 మంది స్వతంత్రుల తరఫున ప్రచారం చేస్తా: అన్నా
జల్నా: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీకి నిలిచే 50 మంది స్వతంత్ర అభ్యర్థుల తరఫున తాను ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన 17 అంశాలతో తాను రూపొందించిన అజెండాను ఈ 50 మంది అభ్యర్థుల్లో 12 మంది అంగీకరించారని, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారేనని తెలిపారు. ఇప్పటికే తన ఎజెండాలోని అంశాలను బెంగాల్ సీఎం మమతా కూడా అంగీకరించారని వెల్లడించారు. తన అజెండాను అంగీకరించని కేజ్రీవాల్‌కు తన మద్దతు ఉండబోదని నొక్కి చెప్పారు. కాగా, జల్నా స్థానం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలాసాహెబ్ దరాడేకు ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు అన్నా విజ్ఞప్తి చేశారు. -
దీదీకి అన్నాహజారే మద్దతు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నా ఎజెండా అమలుచేసేందుకు మమత అంగీకరించారు ఆమె నిరాడంబరత, సమాజం పట్ల దృక్పథం అద్భుతం దీదీ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవస్థలో మార్పులు వస్తాయి కేజ్రీవాల్, మోడీలను బలపరచబోను: హజారే న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. దీదీకి అధికారమిస్తే దేశ ప్రగతి వేగవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేజ్రీవాల్‌ను, మోడీని బలపరచబోనని.. అలాగని వ్యతిరేకించబోనని హజారే స్పష్టం చేశారు. మరోవైపు తృణమూల్‌కు మద్దతివ్వాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ.. మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హజారే మాట్లాడారు. ఆయన మాటల్లోనే... - వివిధ రాజకీయ, పాలనా, భూ సంస్కరణలకు సంబంధించిన 17 సూత్రాల ఎజెండాను అన్ని రాజకీయ పార్టీలకు పంపాను. - వాటన్నింటినీ అమలు చేసేందుకు మమతా బెనర్జీ అంగీకరించడంతో.. ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. - నేను పంపిన ఎజెండాపై కేజ్రీవాల్ ఏ మాత్రం స్పందించలేదు. దాంతో ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. - తృణమూల్ పార్టీకి మాత్రమేకాదు.. మమతా బెనర్జీ వ్యక్తిత్వం, నిరాడంబరత, సమాజం పట్ల ఆమె దృక్పథాన్ని చూసే మద్దతిస్తున్నాం. - ఒక రాష్ట్రానికి సీఎం అయినా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు, ప్రభుత్వ వాహనాలనూ వాడరు. - వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దీదీ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాం. దాంతోపాటు అవినీతి రహిత రాజకీయాల కోసం మార్చి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తా. - ఆమె 100 సీట్లు సాధించగలిగినా.. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి తోడ్పడుతుంది. - కాగా, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి, అదనపు డీజీ వినయ్కుమర్ సింగ్ రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్’ అనే పుస్తకాన్ని హజారే ఆవిష్కరించారు. - ఈ సందర్భంగా తాను మమతా బెనర్జీకి మాత్రమే మద్దతు ఇస్తున్నానని, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని అంశాలపై విభేదాలున్నాయి: మమత హజారే ఎజెండాలోని చాలా అంశాలను బెంగాల్లో మా ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. - భూసేకరణ వంటి రెండు మూడు అంశాల్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిపై చర్చిస్తాం. - హజారే సలహా తీసుకుని బెంగాల్, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తర, దక్షిణ భారత్‌లోని మరిన్ని చోట్ల లోక్‌సభకు పోటీ చేస్తాం. - యూపీఏ, ఎన్డీఏలలో దేనికీ మద్దతివ్వబోం. మమతకు మద్దతు వద్దు: మహిళా సంఘాలు వచ్చే ఎన్నికల్లో తృణమూల్‌కు మద్దతుగా ప్రచారం చేయాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఇండియన్ డెమొక్రాటిక్ విమెన్ అసోసియేషన్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ తదితర సంస్థలు సంయుక్తంగా రాసిన ఈ లేఖలో... ‘‘దీదీకి మీరు మద్దతు ప్రకటించారని తెలిసి, ఆశ్చర్యానికి లోనయ్యాం. బెంగాల్లో ఆమె పార్టీ తృణమూల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అరాచకాలు పెరిగిపోయాయి. మహిళలకు భద్రమైన రాష్ట్రంగా ఉన్న బెంగాల్లో ఏ మాత్రం భద్రత లేని పరిస్థితి కల్పించారు. మహిళలు, యువతులు, పిల్లలపై జరుగుతున్న ఎన్నో దారుణమైన నేరాలకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే నిందితులు. తమ కులం కానివాడిని ప్రేమించినందుకు పంచాయతీ ఆదేశంతో ఓ గిరిజన యువతిపై 13 మంది చేసిన ఘటనపై పోలీసులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. తృణమూల్‌కు మద్దతివ్వాలన్న మీ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
మమతకే మద్దతు, కేజ్రీవాల్‌కు లేదు: హజారే
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని అన్నా హజారే ప్రకటించారు. తాను రాసిన లేఖకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని, ఆయన పార్టీకి మద్దతు ఇవ్వబోమని హజారే స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై హజారే ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె నిరాడంబర జీవితం గడుపుతున్నారని అన్నారు. అందరు ముఖ్యమంత్రుల్లా బంగ్లాలు, కార్లు వాడుకోవడం లేదని... ఒకే గది ఉన్న ఇంట్లో నివాసముంటున్నారని చెప్పారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశానికి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు. మమతా సిద్ధాంతాలను సమర్థిస్తున్నట్టు హజారే చెప్పారు. మమతా బెనర్జీ, హజారే ఫైట్ ఫర్ ఇండియా ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
‘రెడ్ జోన్’కు వ్యతిరేకంగా ధర్నా
పుణే: రెడ్ జోన్ వాసుల దుస్థితిని రాజకీయ నాయకులతోపాటు రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకుగాను దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి గురువారం ధర్నా చేసింది. నిగిడిలోని భక్తిశక్తి చౌక్ వద్ద జరిగిన ఈ కార ్యక్రమంలో శివసేన ఎంపీ శివాజీరావ్ అఢల్రావ్ పాటిల్, ఎమ్మెల్యే బాలాభెగ్డే, లక్ష్మణ్ జగ్తాప్, మేయర్ మోహినీ లాండే, బీజేపీ నాయకుడు ఏక్నాథ్పవార్, వందలాదిమంది స్థానికులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు ఏక్నాథ్ పవార్, ఆ పార్టీ పింప్రి-చించ్వాడ్ శాఖ అధ్యక్షుడు సదాశివ్ ఖడేలతోపాటు దేహూ రోడ్ రెడ్ జోన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఢిల్లీలో ఆందోళనకు దిగుతాం ధర్నా అనంతరం దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సుడం తరస్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సమయంలో దేశ రాజధానిలో ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. జిల్లాలోని దిఘి, దేహూరోడ్, లోహెగావ్, పాషణ్ సుతర్వాడిలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ఆరు లక్షలమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. తమ బాధలను ప్రముఖ సంఘసేవకుడు అన్నాహజారే దృష్టికి తీసుకెళ్లామని, తమ ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ఆయన అంగీకరించారన్నారు. కాగా దేహూరోడ్ ఆయుధ కర్మాగారం (డీఏడీ) పరిధిలోకి దేహూ కంటోన్మెంట్ తోపాటు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అనేక ప్రాంతాలు వస్తాయి. ది వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ చట్టం-1903 ప్రకారం రెడ్ జోన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టకూడదు. రక్షణ శాఖకు చెందిన ఆయుధ డిపోలపై వీటి ప్రభావం పడడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి నష్టం వాటిల్లకుండా చేయాలనేది ఈ చట్టం ముఖ్యోద్దేశం. -
అత్యున్నత ఆదర్శవాది!
విశ్లేషణం అన్నాహజారే... స్వాతంత్య్ర పోరాటం తర్వాత జాతిని కదిలించిన ఒకే ఒక్కడు. యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన భారతీయుడు. గ్రామ స్వరాజ్యంపట్ల ఆయనకున్న విజన్, సమాజం పట్ల చిత్తశుద్ధి ఆయనను దేశానికే అన్నా (తండ్రి)గా నిలిపాయి. మహారాష్ర్టలోని మారుమూల పల్లెటూరు రాలేగావ్ సిద్ధిలో జన్మించిన కిషన్ బాబూరావ్ హజారే... అన్నా హజారేగా మారడం వెనుక ఆయన నమ్మిన విలువలు, ఆచరించే ఆదర్శాలు, వివేకానందుని స్ఫూర్తి, గాంధీ మార్గం, దాదాపు నాలుగు దశాబ్దాల జీవితం ఉంది. గ్రామ స్వరాజ్యంపట్ల అన్నాకు ఓ విజన్ ఉంది. అది ఆయన మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనబడుతుంది. అన్నా మాట్లాడేటప్పుడు గమనించండి... ఆయన చేతి కదలికలు కంటికంటే పై స్థాయిలో ఉంటాయి. అవి ఆయనది విజువల్ వ్యక్తిత్వమని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు చురుగ్గా ఉంటారు, విలువలు పాటిస్తారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా పని పూర్తికాకపోతే, లక్ష్యం సిద్ధించకపోతే సహించలేరు. ఈ అసహనం అన్నా వ్యక్తిత్వంలో మనం గమనించవచ్చు. అన్నా మాట్లాడేటప్పుడు తరచూ తన హృదయాన్ని తాకుతారు, అరచేతులను అభయహస్తంలా చూపుతారు. అంటే ఆయన మనసులో ఉన్నదే మాట్లాడుతారని, ఓపెన్‌గా ఉంటారని అర్థమవుతుంది. అయితే చూపుడువేలును చూపిస్తూ మాట్లాడటం ఆయనలోని బెదిరింపు తత్వానికి, నిరంకుశ ధోరణికి అద్దం పడుతుంది. అన్నా తరచుగా పిడికిలి బిగించడం గమనించారా? అవి ఆయనలోని ఆవేశానికి, చిత్తశుద్ధికి ప్రతీకగా నిలుస్తాయి. బిగించిన పిడికిలి శరీరాన్నీ, మనసునూ పోరాటానికి సన్నద్ధం చేస్తుంది. ఆ పోరాటపటిమ అన్నాలో స్పష్టంగా గమనించవచ్చు. మొదట లోపాలనే చూస్తాను... బాడీ లాంగ్వేజ్‌తోపాటు మాట్లాడే మాటలు కూడా వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అన్నా మాటలు గమనిస్తే ఆయన వ్యక్తిలోనైనా సమాజంలోనైనా మొదట లోపాలనే చూస్తారని, ఆ తర్వాతే సానుకూలాంశాలను గ్రహిస్తారని తెలుస్తుంది. కావాలంటే ఈ మాటలు చూడండి: - ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. కేవలం తెల్లవారి స్థానంలో నల్లవారు వచ్చారంతే. - స్పందనలేని ఈ నాయకుల చేతుల్లో దేశం ఏమవుతుందోనని భయంగా ఉంది. కానీ జనశక్తితో వారిని మార్చగలం. - గ్రామ స్వరాజ్యం లేకుండా మనదేశం అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆ స్వరాజ్యం సామాన్యుని భాగస్వామ్యం, సామాజిక నిబద్ధత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వీటన్నింటిలోనూ ఆయన మొదట నెగెటివ్ కోణాన్ని ప్రస్తావించి, ఆ తర్వాతే పరిష్కారం గురించి చెప్పారు. తన సన్నిహిత సహచరుడు కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టడాన్ని మొదట వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఆహ్వానించడం కూడా ఇలాంటిదే. తీవ్ర ఆదర్శవాది అన్నా... తాను నమ్మిన విలువలకోసం, తన ఊరికోసం, సమాజంకోసం వివాహాన్నే త్యాగం చేసిన ఆదర్శమూర్తి. అంతేకాదు ఆ ఆదర్శాలను మరువకుండా కొనసాగించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. కాకపోతే ఆయన కొంత తీవ్రమైన ఆదర్శవాది. తాను ఆచరించే ఆదర్శాలను అందరూ పాటించాలని కోరుకుంటాడు. అందులో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడు. వ్యక్తుల ఇష్టాయిష్టాలను పట్టించుకోడు. అవి తన ఆదర్శాలు మాత్రమేనని, అందరూ పాటించాల్సిన అవసరం లేదని గుర్తించడు. తన ఆదర్శాలను ఇతరుల మీద రుద్దడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అంగీకరించడు. ఆదర్శాలు పాటించనివారిని శిక్షించాలంటాడు. అందుకు అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా వెనుకాడడు. శరద్‌పవార్‌పై దాడి జరిగినప్పుడు... ఒక్క దెబ్బేనా? అని వ్యాఖ్యానిస్తాడు. ప్రధాని కావడానికి ఒకరోజు గుడిసెలో గడిపితే సరిపోదని రాహుల్‌గాంధీని ఎద్దేవా చేస్తాడు. ఇవన్నీ ఆయనలోని తీవ్ర ఆదర్శ ధోరణికి నిదర్శనం. కానీ ఈ లోపాలన్నీ సూర్యునిలాంటి ఆయన ఆదర్శజీవనం ముందు మిణుగురు పురుగుల్లా తేలిపోయాయి. - విశేష్, సైకాలజిస్ట్ -
హజారే ఉద్యమం వల్లే.. లోక్‌పాల్ చట్టం
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారేపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. హజారే నేతృత్వంలో పౌరసమాజం సాగించిన ఉద్యమం ఫలితంగానే లోక్‌పాల్ చట్టం వచ్చిందని ఆయన అన్నారు. దేశంలో ప్రజల భాగస్వామ్యంతో రూపొందిన తొలి చట్టం ఇదేనన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో శనివారం ఏర్పాటైన 10వ నెహ్రూ స్మారకోపన్యాస కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ‘నెహ్రూ-పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అంశంపై రాష్ట్రపతి మాట్లాడారు. లోక్‌పాల్ బిల్లు కోసం హజారే ఉద్యమం ప్రారంభించినప్పుడు పౌరసమాజం నుంచి ఆయనకు భారీ మద్దతు లభించిందని గుర్తు చేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... - చట్టాల రూపకల్పనలో పౌరసమాజం కీలక పాత్ర పోషించగలదని ‘లోక్‌పాల్’ ఉద్యమం చాటింది. - {పజాస్వామిక వ్యవస్థలో ప్రజలే యజమానులు. రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎన్నికైన ప్రజాప్రతినిధులు వమ్ము చేయరాదు. - రాజకీయాల్లోకి నేరచరితుల ప్రవేశం, అవినీతి ఆందోళనకరంగా మారాయి. - సంచలన వార్తల కోసం పరుగులు తీసే మీడియా వ్యాప్తి, పౌరసమాజానికి చెందిన సంస్థల వంటి కొత్త శక్తులు రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. -
'కేజ్రివాల్ అంకుల్... మా కుటుంబాన్ని ఆదుకోండి'
పేదరికంతో బాధపడుతూ బ్రతకడానికి అష్టకష్టాలు పడుతున్న తమను ఆదుకోవాలని ఓ మైనర్ బాలుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ని అభ్యర్థించారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే సాగించిన ఉద్యమంలో బీహార్ లోని సర్ఫు్ద్దీన్ పూర్ కు గ్రామానికి చెందిన దినేశ్ యాదవ్ 2011లో ఆత్మహుతి చేసుకున్నారు. దాంతో దినేశ్ యాదవ్ మృతితో ఆ కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కేజ్రివాల్ ను వేడుకున్నారు. తన తండ్రి మరణం తర్వాత పలువురు నేతలు ఆదుకుంటామని చేసిన హామీల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. 'కేజ్రివాల్ అంకుల్, లోక్ పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో మా నాన్న ఆత్మత్యాగానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి మేము పేదరికంతో బాధపడుతున్నాం అని యాదవ్ పెద్ద కుమారుడు 14 ఏళ్ల గుడ్డు అభ్యర్థించారు. మానాన్న మరణం తర్వాత స్కూల్ వెళ్లడం లేదు. తప్పని పరిస్థితిలో తాము కూలీలుగా పనిచేస్తున్నాం' అని గుడ్డు వెల్డడించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం మా బతుకుల్ని బాగు చేస్తుందనే ఒకే ఆశతో బతుకుతున్నాం అని యాదవ్ భార్య మల్ మతియా దేవి అన్నారు. కనీసం ఢిల్లీకి వెళ్లడానికి చార్టీలు కూడా లేవు అన్నారు. దినేష్ మరణంతో ఆయన తల్లి తండ్రులు, భార్య, ఐదుగురు పిల్లలు పరిస్థితి దిక్కు తోచని విధంగా మారింది. -
లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో లోక్‌పాల్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లును పార్లమెంటు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమోదించింది. ప్రధానమంత్రిని సైతం ఈ బిల్లు పరిధిలోకి తెస్తూ డిసెంబర్ 18న పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంతకుమించి ఈ బిల్లు కోసం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం మరువలేనిది. ఉన్నతస్థాయి అవినీతికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని 1960 ల్లోనే కేంద్రంలో పెద్దలు భావించారు. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. దీనిని 1969లో 4వ లోక్‌సభలో ఆమోదించారు. కానీ అప్పుడది రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లలో లోక్‌పాల్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే 98 గంటల తర్వాత ఏప్రిల్ 11న దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ఇది బలహీనంగా ఉందని, అందులో తాను కోరిన మార్పులు చేపట్టలేదని హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్లో ఆయన మళ్లీ దీక్షకు దిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ చేపట్టారు. అందులో పలు సవరణలు చేసి ఆమోదించారు. ఆ సవరణలకు హజారే సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న బిల్లును మళ్లీ లోక్‌సభకు పంపించి, సవరణలతో సహా ఆమోదించారు. దీంతో లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. ఈరోజు రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టమైంది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్‌పాల్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. తాను పంపిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుంది. లోక్‌పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని, ఇందుకు ఏడాది గడువు ఉంటుందని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఎవరిపైనైనా తప్పుడు ఆరోపణలు చేస్తే జరిమానా, జైలు శిక్షలు కూడా ఉంటాయి. -
లోక్‌పాల్ సాహకారం
ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమోదించటం ఈ ఏడాది సంభవించిన మరో కీలకమైన మార్పు. ప్రధానమంత్రిని సైతం లోక్‌పాల్ పరిధిలోకి తెస్తూ ఈ బిల్లును డిసెంబర్ 18న పార్లమెంటు ఆమోదించింది. ఇది ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా మారటమే మిగిలివుంది. ఈ బిల్లు వెనుక సుదీర్ఘమైన చరిత్ర.. అంతకుమించి ఈ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన బలమైన ఉద్యమం ఉన్నాయి. ఉన్నతస్థాయి అవినీతికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని 1960 ల్లోనే కేంద్రంలో పెద్దలు భావించారు. తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. దీనిని 1969లో 4వ లోక్‌సభలో ఆమోదించారు. కానీ అప్పుడది రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008 ల్లో లోక్‌పాల్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే 98 గంటల తర్వాత ఏప్రిల్ 11న దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ఇది బలహీనంగా ఉందని, అందులో తాను కోరిన మార్పులు చేపట్టాలని హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్లో మళ్లీ దీక్షకు దిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ చేపట్టి.. అందులో పలు సవరణలు చేసి ఆమోదించారు. ఆ సవరణలకు హజారే సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న బిల్లును మళ్లీ లోక్‌సభకు పంపించి.. సవరణలతో సహా ఆమోదించారు. దీంతో లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులను లోక్‌పాల్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. తాను పంపిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుంది. లోక్‌పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని.. ఇందుకు ఏడాది గడువు ఉంటుందని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఎవరిపైన అయినా తప్పుడు ఆరోపణలు చేస్తే జరిమానా, జైలుశిక్షలు కూడా ఉంటాయి. -
అన్నాహజారేను ఆహ్వానిస్తా:కేజ్రీవాల్
ఘజియాబాద్: తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అవినీతి ఉద్యమకారుడు అన్నా హజారేను ఆహ్వానించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరుకు వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ తన గురువు అన్నా హజారేను ఆహ్వానిస్తానన్నారు. తనకు ఆమ్ ఆద్మీ నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని అన్నా తెలిపిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. అన్నాకు ఆరోగ్యం సరిగా లేనందునే ఆ కార్యక్రమానికి రాలేకపోవచ్చనే అనుమానం వ్యకం చేశారని కేజ్రీ తెలిపారు. అయినప్పటికీ ఆయనతో మరోమారు ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తానన్నారు. కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులుగా మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భార్తి, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోని, సత్యేంద్ర జైన్లు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వారం లోపల కేజ్రీవాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జనవరి 1న నూతన అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. -
జన విజయం
-
జన విజయం
చరిత్రాత్మక లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం కేంద్రం స్థాయిలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ప్రధాని, ఎంపీలు, ఉద్యోగులంతా లోక్‌పాల్ పరిధిలోకి రాజ్యసభ సవరణలతో సహా బిల్లుకు లోక్‌సభ ఆమోదం రాష్ట్ర విభజనపై సభ్యుల ఆందోళన మధ్యలోనే చర్చ బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవటంపై సుష్మా విమర్శ మరిన్ని బిల్లుల కోసం భేటీలను పొడిగించాలన్న రాహుల్ ఈ ఘనత ప్రజలు, ఆ పెద్దాయనదే: సుష్మా లోక్‌పాల్ బిల్లుపై జరిగిన స్వల్ప చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. లోక్‌పాల్ బిల్లు గతంలో బలహీనంగా ఉన్నందున బీజేపీ వ్యతిరేకించిందన్నారు. అయితే రాజ్యసభలో ఈ బిల్లును తగినవిధంగా సవరించినందున మద్దతు ప్రకటించామన్నారు. బిల్లు ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ఈ ఘనత దేశ ప్రజలతో పాటు.. పలుమార్లు నిరాహార దీక్షలు చేపట్టిన పెద్దాయన (అన్నాహజారే)కు దక్కాలని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరుకు లోక్‌పాల్ సరిపోదు: రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. అవినీతిపై పోరాటానికి లోక్‌పాల్ బిల్లు ఒక్కటే సరిపోదని.. సమగ్రమైన అవినీతి వ్యతిరేక నియమావళి అవసరమని చెప్పారు. యూపీఏ సర్కారు అవినీతి వ్యతిరేక వ్యవస్థను రూపొందించిందని, ఇందులో భాగమైన మరో ఆరు బిల్లులను ఆమోదించటానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలను పొడిగించాలని ఆయన సూచించారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణ బిల్లు, న్యాయ ప్రమాణాలు, బాధ్యత బిల్లు, సేవలు అందించటానికి నిర్ణీత కాలాన్ని నిర్దేశించే బిల్లు, ప్రభుత్వ సేకరణ, విదేశీ లంచాలు వంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాలుగా ఎనిమిది సార్లు విఫలయత్నాల అనంతరం.. భారతదేశం చరిత్రాత్మక లోక్‌పాల్ చట్టాన్ని ఆమోదించింది. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు - 2013ను బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును 2011 డిసెంబర్లోనే లోక్‌సభ తొలిసారి ఆమోదించింది. అయితే.. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి ముందు పలు సవరణలు చేసింది. ఆ బిల్లును బుధవారం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో లోక్‌పాల్ బిల్లును సవరణలతో సహా లోక్‌సభ ఆమోదించింది. సమాజ్‌వాది, శివసేన మినహా మిగతా పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇది అరాచకానికి దారితీస్తుంది: ములాయం లోక్‌పాల్ బిల్లు ప్రమాదకరమైనదని.. ఇది అరాచకానికి దారితీస్తుందని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ నిరసన వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేసే ముందు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. బిల్లును ఉపసంహరించుకోవాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ భయంతో పనిచేయరని, అభివృద్ధి ఉండదని, పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని పేర్కొన్నారు. ఈ బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతిస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీని ప్రశ్నించారు. శివసేన పార్టీ నేత అనంత్‌గీతె కూడా పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవటం ద్వారా.. ఆయన పార్లమెంటుకు కాకుండా మరెక్కడో జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు... లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్ మాట్లాడుతూ.. రాజ్యసభలో మంగళవారం చేసిన సవరణలకు సంబంధించిన కాపీలను లోక్‌సభ సభ్యులకు బుధవారం నాడే అందించారని, నిబంధనల ప్రకారం.. ఏ చట్టాన్నయినా మరొక సభ ఆమోదం కోసం తీసుకునేటపుడు కనీసం రెండు రోజుల సమయం ఇవ్వాలని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీనిని స్పీకర్ రద్దు చేస్తూ.. రెండు రోజుల నిబంధనను సడలించటానికి తాను అంగీకరించానని తెలిపారు. గందరగోళంలోనే చర్చ, ఆమోదం: బిల్లుపై చర్చ జరుగుతున్నంత సేపూ.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లో నిలుచుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సభ్యులు కూడా వెల్‌లోనే ఉండి తమ ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్లు చేస్తున్నారు. అస్సాంలో గిరిజనులపై దాడికి నిరసనగా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎంపీ ఎస్.కె.బిస్వ్ముతియారీ కూడా వెల్‌లో నిలుచుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు, గందరగోళం మధ్యనే స్పీకర్ మీరాకుమార్ లోక్‌పాల్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించి.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అవినీతిపై పోరులో చారిత్రక ఘట్టం: ప్రధాని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇది చరిత్రాత్మక చట్టం. పార్లమెంటు తన విజ్ఞతతో ఈ చట్టం చేయాలని నిర్ణయించటం పట్ల మేం ఎంతో సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘బిల్లు ఆమోదం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని సోనియా చెప్పారు. అవినీతిపై పోరాటానికి ఇంకా చాలా చేయాలని మరో ఏడు బిల్లులను ఆమోదించాల్సి ఉందని చెప్పారు. బిల్లు ఆమోదంలో రాహుల్‌దే కీలక పాత్ర: కాంగ్రెస్ లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ శ్లాఘించింది. ‘‘రాహుల్ మనోభావాల్లో ఒక సందేశం ఉంది... అది.. ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందనేది. ఒక్క లోక్‌పాల్ ద్వారానే అవినీతిపై పోరాడలేమని కూడా రాహుల్ చెప్పారు. ఆర్టీఐ చట్టం పునాదిగా సమగ్ర అవినీతి వ్యతిరేక నియామవళి అవసరముందని చెప్పారు’’ అని పార్టీ అధికార ప్రతినిధి రాజ్‌బబ్బర్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. లోక్‌పాల్‌ను రాజకీయ వర్గమే పాలిస్తుంది: ఆప్ చెన్నై: పార్లమెంటు ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బిల్లు తాము కోరినట్లుగా లేదని, లోక్‌పాల్‌ను కూడా రాజకీయ వర్గమే పరిపాలిస్తుందని ఆ పార్టీ నేత యోగేంద్రయాదవ్ విమర్శించారు. ‘‘అన్నాహజారేకు పార్లమెంటు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేదు’’ అని ఆయన బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బిల్లును హజారే అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించగా.. అది ఆయన కోరుకున్న బిల్లు కాదని ఆయన గుర్తిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. హజారే పట్టుదలకు నివాళి: మోడీ అహ్మదాబాద్: లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించటం.. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే పోరాటానికి, పట్టుదలకు నివాళి అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. హజారే ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు బుధవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఆమోదం ప్రజలందరి విజయమంటూ పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు. -
రాలేగావ్లో సంబరాలు
సాక్షి, ముంబై: లోక్‌సభలో బుధవారం లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందటంతో అన్నాహజారే స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో సంబరాలు మిన్నంటాయి. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పండ్ల రసం సేవించిన అన్నాహజారే తన తొమ్మిది రోజుల దీక్షను విరమించారు. దీంతో రాలేగావ్వాసుల ముఖాల్లో ఆనందం దోబూచులాడింది. లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిందని, దీంతో అన్నా తన దీక్షను విరమించారంటూ టీవీల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా వారంతా కేరింతలు కొట్టారు. జైహింద్... వందే మాతరం, భారత్ మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కొందరు జాతీయ గీతాలను ఆలపించగా, మరికొందరు భక్తిగీతాలు పాడారు. -
అరవింద్ కేజ్రీవాల్ శిష్యుడి విధి నిర్వర్తించలేదు: రాందేవ్ బాబా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై యోగా గురువు రాందేవ్ బాబా మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో అన్నాహజారేతో విభేదించడాన్ని ఆయన వ్యతిరేకించారు. శిష్యుడి విధులను కేజ్రీవాల్ నిర్వర్తించలేదన్నారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని మీరట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విమర్శించారు. అన్నా హజారే ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా గురుశిష్య పరంపరకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వెళ్లారన్నారు. అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిగ్గుపడటం కూడా సరికాదని రాందేవ్ చెప్పారు. ఆయన బాధ్యతలను తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ స్వలింగ సంపర్కానికి మద్దతు ఇవ్వడాన్ని రాందేవ్ తీవ్రంగా విమర్శించారు. సుప్రీం తీర్పును విమర్శించడం ద్వారా ఆ పార్టీ ప్రజల మద్దతును కోల్పోయిందని చెప్పారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న నరేంద్రమోడీ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని తెలిపారు. -
లోక్‌పాల్ ఆమోదంతో అన్నా శిబిరంలో సంబరం
-
లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై హజారే హర్షం
రాలేగావ్ : జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందటం సంతోషకరమని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు హజారే అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో గత మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో పాటు లోక్‌సభలోనూ బిల్లు ఆమోదం పొందటంతో హజారే తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి బిల్లు ఆమోదానికి పోరాడుతున్నామన్నారు. ప్రజలు బలమైన లోక్‌పాల్ బిల్లును కోరుకుంటున్నారన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హజారే కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించటంతో హజారే మద్దతుదారులు దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. గత 40 ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించటంతో కేంద్రం... లోక్‌పాల్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఆయన ఆమోద ముద్ర అనంతరం బిల్లు చట్టం కానుంది. -
‘అన్నా’ను ఏమీ అనొద్దు: రాందాస్
సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు అంశంపై అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య తలెత్తిన వాగ్వాదంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే జోక్యం చేసుకున్నారు. అథవాలే అన్నాహజారేకి అండదండగా నిలిచారు. మంగళవారం ఆయన ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ‘ఇకనుంచి అన్నాహజారేపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేకపోతే మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వం’ అని అరవింద్‌ను హెచ్చరించారు. లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కేజ్రీవాల్ అనవసరంగా లోక్‌పాల్‌ను జోక్పాల్ అంటూ ఎగతాళి చేయొద్దన్నారు. ఈ వైఖరి మార్చుకోని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సభ కూడా నిర్వహించకుండా అడ్డుకుంటామంటూ రాందాస్ ఘాటుగా హెచ్చరించారు. ‘లోక్‌పాల్ బిల్లుపై అన్నాహజారే పూర్తిగా అధ్యయనం చేశారు. అందులో సీబీఐ, ప్రధానిలనుకూడా చేర్చాలంటూ ఆయన చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అన్నాహజారే కారణంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా స్థానాలు వచ్చాయని, ఆ విషయం ఎంతమాత్రం మర్చిపోవద్దని సూచించారు. -
రాహుల్‌కు అన్నా హజారే ప్రశంసలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల్లో ముంచెత్తారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం విషయంలో నిబద్ధతతో వ్యవహరించారని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన రాహుల్‌కు ఓ లేఖ రాశారు. కాగా, అన్నాకు ధన్యవాదాలు చెబుతూ రాహుల్‌గాంధీ కూడా జవాబు పంపారు. ఈ రెండు లేఖల ప్రతులను మంగళవారం ఏఐసీసీ విడుదల చేసింది. ‘‘లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు మీరు కనబర్చిన చిత్తశుద్ధిని స్వాగతిస్తున్నాను'. అని తెలిపారు. పార్లమెంటు అదనంగా ఏమైనా సమర్థవంతమైన అస్త్రాలు పొందుపరిస్తే, ఈ చట్టం జాతి ప్రయోజనాలకు ఎంతగానో దోహదపడుతుందని హజారే లేఖలో పేర్కొన్నారు. -
విషమించిన అన్నా హజారే ఆరోగ్యం!!
అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తోంది. లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఆయన బరువు 4.3 కిలోలు తగ్గిపోయారని అన్నా అనుచరుడు సురేష్ పఠారే తెలిపారు. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించిందని జాతీయ వార్తా చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లుకు చేసిన సవరణలను అన్నా హజారే స్వాగతిస్తుండగా, ఒకప్పటి ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ లాంటివాళ్లు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినది లోక్‌పాల్ కాదు.. జోక్పాల్ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయితే, బిల్లు నచ్చకపోతే దానిపై నిరాహార దీక్ష చేపట్టాలంటూ ఆయనపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాను కొందరు తప్పుదోవ పట్టించారని, అసలు ఈ బిల్లు ప్రతులన్నింటినీ అన్నా, ఆయన బృంద సభ్యులు ఎవరైనా చదివారా అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తాను నమ్మిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నా ఆచరిస్తారని, మూడేళ్లుగా ఆయనను చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. అన్నా ఆరోగ్యం విషమించడంతో తాను ఢిల్లీ పర్యటనను మానుకుని అన్నాతోనే ఉన్నానని, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకు, అన్నా దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. -
‘లోక్‌పాల్’లోలోపాలుంటే ఉద్యమించు
ఆప్ నేత కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురక బిల్లు పేలవమైనదన్న విమర్శలపై మండిపాటు బిల్లులోని అంశాలపట్ల హర్షం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉభయ సభలు ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని వెల్లడి రాలెగావ్ సిద్ధీ (మహారాష్ట్ర): పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు పేలవమైనదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శలను అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తప్పుబట్టారు. బిల్లు ఆమోదం పొందాక అందులో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే వాటిని సరిదిద్దేందుకు దీక్ష చేపట్టాలని కేజ్రీవాల్‌కు చురకలంటించారు. ప్రభుత్వం పటిష్ట లోక్‌పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలంటూ తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధీలో నిరవధిక దీక్షకు దిగిన హజారే ఆదివారం తన దీక్ష ఆరో రోజు ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. ‘బిల్లులోని నిబంధనలను నేను క్షుణ్ణంగా చదివా. నా డిమాండ్లలో చాలా వాటికి బిల్లులో చోటు లభించింది. సీబీఐపై అజమాయిషీని ప్రభుత్వం ఈ బిల్లులో తొలగించింది. అటువంటి మరో 13 అంశాలను కూడా బిల్లులో పొందుపరిచింది. ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపట్ల సంతోషంగా ఉన్నా. రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటు, పౌర సేవల పత్రం (సిటిజన్స్ చార్టర్) వంటి డిమాండ్లకు కూడా బిల్లులో చోటుదక్కుతుందని ఆశిస్తున్నా. ఈ బిల్లు ప్రజలకు అనుకూలంగా ఉంది. అందుకే దీన్ని స్వాగతిస్తున్నా. బిల్లు తెచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒకవేళ బిల్లులో లోపాలున్నాయని నీకు (కేజ్రీవాల్) అనిపిస్తే వాటిని సరిదిద్దేందుకు ఉద్యమించు, ఆందోళన చేపట్టు, నిరాహారదీక్షకు దిగు’ అని హజారే వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌తో విభేదాలపై ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. ‘వారి (ఆప్ నేతలు) గురించి నేనేమీ చెప్పను. మేమెందుకు గొడవ పడాలి. ఆయన (కేజ్రీవాల్) ఆలోచనల మీద ఆయన్ను దృష్టిపెట్టుకోనివ్వండి. నిజం ఎప్పటికీ నిజమే. అదే చివరకు గెలుస్తుంది’ అని హజారే బదులిచ్చారు. అయితే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించే వరకూ దీక్ష విరమించబోనన్నారు. వీలైతే లోక్‌సభలోనూ ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని సూచించారు. భవిష్యత్తులో తిరస్కార హక్కు, రీకాల్ హక్కుల వంటి అంశాలపై ఉద్యమిస్తానని చెప్పారు. హజారే వైఖరి విచారకరం: కేజ్రీవాల్ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానంటూ హజారే చేసిన ప్రకటన విచారకరమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును బలహీనమైనదిగా అభివర్ణించారు. ప్రస్తుత బిల్లుకు ఆమోదం లభిస్తే దానివల్ల కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి తప్ప ఇంకెవరికీ మేలు జరగదని విమర్శించారు. -
హజారే-కేజ్రీవాల్ బృందాల మధ్య భగ్గుమన్న విభేదాలు
-
హజారే దీక్షకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, ముంబై: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్‌జన్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తన స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో చేస్తున్న దీక్షకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. హజారే దీక్ష శుక్రవారం నాలుగవ రోజుకి చేరుకుంది. హజారే చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చేందుకు శుక్రవారం ఆర్మీ మాజీ చీఫ్ వి. కె. సింగ్ రాలేగావ్‌సిద్ధి చేరుకున్నారు. అన్నా హజారేతో భేటీ అనంతరం ఆందోళనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో అక్కడే దీక్షలో కూర్చుని ఉన్న ఆప్ అభిమాని గోపాల్ రాయ్ దీనికి అభ్యంతరం చెప్పారు. దాంతో కొంతసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన హజారే వెంటనే మైక్ తీసుకుని గోపాల్ రాయ్‌ని మందలించారు. ‘నిన్ను ఇక్కడ దీక్షలో పాల్గొనమని ఎవరు పిలిచారు?.. ఎందుకు సింగ్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నావు.. ఇక్కడ తమాషాలు చేయొద్దు.. ఏమైనా చేద్దాం అనుకుంటే బయటకు వెళ్లి చేసుకో..’ అని హజారే ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేది లేక రాయ్ మౌనం వహించాడు. దీంతో హజారేకు, ఆప్‌కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయినట్లయ్యింది. మద్దతు పలికిన ఎమ్మెన్నెస్.. హజారే దీక్షకు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచే కాక రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించడం ప్రారంభమైంది. శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అన్నాహజారే ఆందోళనకు మద్దతు పలికింది. ఆ పార్టీ నాయకుడు బాలానాంద్‌గావ్కర్ శుక్రవారం ఉదయం రాలేగావ్‌సిద్ధికి చేరుకుని అన్నాహజారేతో భేటీ అయ్యారు. అనంతరం కొంతసేపు ఆందోళనలో పాల్గొన్నారు. క్షీణిస్తున్న హజారే ఆరోగ్యం... దీక్ష చేస్తున్న హజారే ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అతడిని పరీక్షించిన డాక్టర్లు, గత మూడు రోజుల్లో అన్నా హజారే 3.2 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు. బీపీ నార్మల్‌గానే ఉన్నప్పటికీ దీక్షను కొనసాగిస్తే ప్రమాదం తప్పదన్నారు. అయితే దీక్షపై వెనక్కి తగ్గేది లేదని హజారే స్పష్టం చేశారు. తాను బాగానే ఉన్నానని పేర్కొంటూ మరో అయిదు రోజులవరకు తనకు ఏమీ కాదన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏడు కిలోలకుపైగా బరువుతగ్గినప్పటికీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నా తెలుపుతున్నారు. అయితే అన్నాహజారే ఆరోగ్యం గురించి రాలేగావ్‌సిద్ధి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అన్నా- ఆప్ మధ్య భగ్గుమన్న విభేదాలు
అన్నా హజారే బృందానికి.. ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. లోక్‌పాల్ బిల్లు కోసం నాలుగో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారేను పలకరించేందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్‌ని హజారే.. అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌తో వాగ్వాదం ఫలితంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వీకే సింగ్ ఆమ్మ ఆద్మీ పార్టీ పేరు గానీ, కేజ్రీవాల్ పేరుగానీ ప్రస్తావించకుండానే విమర్శలు మొదలుపెట్టడంతో ''ఎందుకు అడ్డుకుంటున్నారు? గొడవ చేయాలనుకుంటే, ఇక్కడినుంచి వెళ్లిపోవచ్చు'' అని గోపాల్ రాయ్‌తో హజారే అన్నారు. బహిరంగ సభ వేదికపైనే 'ఆప్' నాయకుడు ఒకరిని హజారే ఇలా అనడంతో ఇద్దరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. హజారేతో పాటు వేదిక పంచుకున్న వీకే సింగ్ మాట్లాడుతూ, అవినీతిపై పోరాటానికి మనం వేర్వేరు బృందాలుగా విడిపోకూడదని చెప్పారు. దీనికి రాయ్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అన్నాహజారే కలగజేసుకుని రాయ్‌ని వెంటనే రాలెగావ్ సిద్ధి వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. ''దీక్ష చేయాలని మిమ్మల్ని అడగలేదు. గొడవ చేయాలనుకుంటే రాలెగావ్ సిద్ధి వదిలి పోవచ్చు'' అని చెప్పారు. -
ఆప్ నేతలకు దూరంగా అన్నా!
సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హాజరేను ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కుమార్ విశ్వాస్, మరో ఇద్దరు సభ్యుల బృందం కలిసింది. అయితే వారిని వేదికిపై అనుమంతించేందుకు హజారే ఇష్టం చూపలేదు. దీంతో వారు కింద కూర్చుండి అన్నా ఆందోళనకు మద్దతు పలికారు. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ కూడా హాజారేను కలిసి, ఆయన దీక్షకు మద్దతు పలికారు. వేదికపెకైక్కి అన్నాతో మాట్లాడిన అనంతరం పాట్కర్ వెళ్లిపోయారు. అన్నా మద్దతుదారుల నిరసన.. ఆప్ సభ్యులకు గురువారం మరో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న దీక్షకు మద్దతు పలికేందుకు ఆప్ బృందం సభ్యులు రాలేగావ్ సిద్ధీకి చేరుకోడంతో వారిని చూసేందుకు ముందుకు వచ్చిన హజారే మద్దతుదారుల్లో ఓ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ముర్దాబాద్’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అతనికి మరికొంతమంది తోడవడంతో కొంత కలకలం చెలరేగింది. ఆప్ సభ్యులను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని తెలిసింది. ఈ విషయమై అన్నా సన్నిహితులు మాట్లాడుతూ... అన్నా హాజరేతో భేటీ అయ్యేందుకు వస్తానని ప్రకటించి, మూడురోజులైనా ఆప్ నేత కేజ్రీవాల్ రాలేగాం సిద్ధి రాకపోవడంతోనే అన్నా మద్దతుదారుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైందని వివరించారు. కొంతమంది నినాదాలతో తమ నిరసనను తెలపగా అన్నా బృందం సభ్యులు వారికి సర్దిచెప్పడంతో శాంతించారని వివరించారు. అనంతరం అన్నా బృందం ఆప్ సభ్యులకు స్వాగతం పలికిందన్నారు. క్షీణిస్తున్న అన్నా ఆరోగ్యం.. చలితోపాటు వయసుపైబడిన కారణంగా దీక్ష చేస్తున్న అన్నా ఆరోగ్యం కొంత క్షిణించినట్టు తెలిసింది. ఆయన బరువు తగ్గారని అన్నా బృందం సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు తన ఆందోళన కొనసాగుతుందని హజారే మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు మద్దతిచ్చేందుకు గురువారం ఉదయం ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ గురువారం రాలేగావ్ సిద్ధీకి చేరుకున్నారు. కొంతసేపు హజారేతో మాట్లాడిన ఆమె అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ.. జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం దీక్ష చేస్తున్న అన్నా హజారే మద్దతుదారులు గురువారం ఉదయం కూడా ప్రభాత్‌ఫేరీ నిర్వహించారు. అనంతరం పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సంతోష్ భారతిపై విశ్వాస్ విమర్శలు... లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న ఆందోళనలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం చూసుకుంటున్న సంతోష్ భారతిపై ఆప్ సభ్యుడు కుమార్ విశ్వాస్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అన్నా బృందంలో కొందరు విలేకరుల రూపంలో దళారులుగా చేరారని, వారు ఇన్ఫార్మర్లంటూ సంతోషపై పరోక్ష విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ నాయకులకు వేదికపై చోటులేదు... రాజకీయ పార్టీల నాయకులకు వేదికపై చోటు లేదని అన్నా హజారే పేర్కొన్నారు. అన్నాను కలిసేందుకు వచ్చిన ఆప్ సభ్యులను కూడా ప్రజలు కూర్చుండే చోటే కూర్చోబెట్టారు. కొంత సేపటి తర్వాత కుమార్ విశ్వాస్‌కు అన్నాహజారేతో ఏకాంతంగా మాట్లాడేందుకు మాత్రం అవకాశమివ్వడం గమనార్హం. -
‘లోక్‌పాల్’పై కేంద్రానిది ప్రజాస్వామ్య వంచన: అన్నా హజారే
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): పటిష్ట లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తోందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దుయ్యబట్టారు. కేంద్రం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలంటూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన హజారే గురువారం తన దీక్ష మూడో రోజు ఈ అంశంపై ప్రధాని కార్యాలయానికి (పీఎంవో) లేఖ రాశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనా సమావేశాల ఎజెండాలో బిల్లు ప్రస్తావన లేదని, ఇది తనను, దేశ ప్రజలను వంచించడమేనంటూ పీఎంవోలో సహాయ మంత్రి వి. నారాయణసామికి పంపిన లేఖలో మండిపడ్డారు. దీక్ష విరమించాలంటూ నారాయణసామి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ప్రభుత్వం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును ఆమోదించే వరకూ దీక్షను విరమించబోనని తేల్చిచెప్పారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసేందుకు కూడా సిద్ధమన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం హజారేను కలిసి దీక్షకు మద్దతు తె లిపింది. ఆప్ అగ్ర నేత అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం వల్ల హజారేను కలిసేందుకు రాలేకపోయారని విశ్వాస్ పేర్కొన్నారు. -
హజారే దీక్షకు స్పందన అంతంతే
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకి చేరుకుంది. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతిచ్చేందుకు మొదటి రోజు అన్నా టీమ్‌లోని సభ్యులెవరూ రాలేదు. కాని రెండవ రోజు కిరణ్ బేడీ రాలేగన్సిద్ధి చేరుకున్నారు. ఈసారి అన్నా చేపట్టిన నిరాహార దీక్షకు ఊహించినంతగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. అయితే అన్నా మాత్రం జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంపై వెనక్కి తగ్గేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాలేగన్సిద్ధి గ్రామంలో బుధవారం ఉదయం మొదటి రోజు మాదిరిగానే ప్రభాత్ భేరీ నిర్వహించారు. నిరాహార దీక్ష సందర్భంగా అక్కడ మద్దతిచ్చేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారందరి కోసం వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మండేలా వ్యాక్స్ విగ్రహ ఆవిష్కరణ... ఇటీవలే మరణించిన నల్ల వజ్రం, దక్షిణాఫ్రికా ప్రథమ నల్లజాతి అధ్యక్షులైన నెల్సన్ మండేలా వ్యాక్స్ విగ్రహాన్ని అన్నా హజారే బుధవారం ఉదయం ఆవిష్కరించారు. పుణే జిల్లా లోనవాలాలోని వ్యాక్స్ మ్యూజియం కోసం ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని అన్నా హజారే చేతులమీదుగా ఆవిష్కరించిన అనంతరం ఆ విగ్రహాన్ని లోనవాలా వ్యాక్స్ మ్యూజియంకు తరలించారు. అన్నా కాల్ సెంటర్ ప్రారంభం... రాలేగన్సిద్ధిలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమ తమ గ్రామాలు, తాలూకాలు, జిల్లాల్లోనే కార్యకర్తలు జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఆందోళనలు చేయాలని అన్నా హజారే పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందుకోసం ఓ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దానికి అన్నా కాల్ సెంటర్‌గా నామకరణం చేశారు. -
అన్నా దీక్ష ఆరంభం
లోక్‌పాల్ ఆమోదం దాకా విరమించనని వెల్లడి ప్రజలు మార్పు కోరుతున్నారన్నది ఢిల్లీ ఫలితాలతో స్పష్టం శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతామన్న కేంద్రం జన్ లోక్‌పాల్ ధ్యేయంగా అనేక ఉద్యమాలు చేపట్టిన ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దాని కోసం మరోసారి ఉద్యమించారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదానికి పట్టుబడుతూ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న సొంతూరు రాలేగావ్ సిద్ధిలో మంగళవారం ఆమరణ దీక్షకు దిగారు. యాదవ్‌బాబా ఆలయ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసైనా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆవశ్యకతను నిజాయితీగా అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. తక్షణమే జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లు జాప్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ సహా ప్రధాన విపక్షం బీజేపీలదే బాధ్యతని మండిపడ్డారు. ‘లోక్‌పాల్ ఆమోదం విషయమై ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు నాకు హామీ ఇచ్చి మాటతప్పారు. ఇటు నన్ను, అటు ప్రజలను మోసం చేశారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు’ అని అన్నా దుయ్యబట్టారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి పుట్టించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్టు చెప్పారు. గతంలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన సమయంలో సోనియా స్వయంగా తనకు లేఖ రాశారని, లోక్‌పాల్‌ను తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, దీక్ష విరమించాలని కోరి, తర్వాత మోసం చేశారని ఆగ్రహించారు. ఎలాంటి రాజకీయ జెండాలూ లేకుండా వస్తామంటే ఆప్ నేత కేజ్రీవాల్ సహా అందరినీ దీక్షా వేదిక వద్దకు ఆహ్వానిస్తానని అన్నా చెప్పారు. లోక్‌పాల్ కోసం గడిచిన మూడేళ్లలో అన్నా నాలుగోసారి దీక్షకు దిగడం గమనార్హం. ప్రజలు మార్పు కోరుతున్నారు.. దేశ ప్రజలు రాజకీయంగా మార్పు కోరుకుంటున్నారని, ఢిల్లీ ఫలితాల్లో ఈ అభిప్రాయం సుస్పష్టమైందని అన్నా ఉద్ఘాటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ ముందుకొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మోడీ ప్రభంజనం కొనసాగుతుందని భావిస్తున్న బీజేపీ అలాంటిదేమీ లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రానందున మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని, పొత్తుల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నా అన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం: కేంద్రం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో మీడియాకు చెప్పారు. బిల్లు విషయమై రాజ్యసభ చైర్మన్‌కు ఇప్పటికే నోటీసు కూడా అందించామన్నారు. అన్నా దీక్షను విరమించాలని మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. -
‘హజారే, కేజ్రీవాల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదుకు తిరస్కృతి’
న్యూఢిల్లీ: అన్నా ఎస్ఎంస్ కార్డులు విక్రయించి నాలుగు కోట్ల మందిని మోసం చేశారని, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలన్న పిటిషన్‌ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఢిల్లీవాసి రుమల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ మంగళవారం విచారించారు. ఎలాంటి నేరం చేసినట్టు వెల్లడి కాలేదని, వారిపై చర్యలు అవసరం లేదని పోలీసులు తెలపడంతో ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడాది పాటు హజారే నేతృత్వంలో జరిగే ప్రచారాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తామన్న హామీతో 2012 ఫిబ్రవరిలో ఎస్ఎంస్ కార్డులను ప్రారంభించారని సింగ్ పిటిషన్లో ఆరోపించారు. ఇది హజారేతో పాటు ఆయన మాజీ బృంద సభ్యులకు రూ.100 కోట్లు తెచ్చిపెట్టిందన్నారు. అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే ఆ సేవలను నిలిచిపోయాయని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే హజారేతో పాటు ఆయన బృంద సభ్యులు ఎలాంటి నేరం చేసినట్టు రుజువు కాలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. -
ఐదోసారి దీక్షకు దిగిన అన్నా హజారే దీక్ష చావో రేవో..
సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్‌సిద్ధి గ్రామంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు డిగ్రీల గడ్డకట్టించే చలికి కూడా బెదరకుండా కాసేపు నడిచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. ‘కరో యా మరో’, ‘ఆర్ యా పార్’ (చావో రేవో) అనే నినాదంతో ఉదయం సుమారు 11 గంటల ప్రాం తంలో దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు ముందు ఆయన గ్రామస్తులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షాస్థలమైన యాదవ్‌బాబా మందిరం వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అన్నా హజారే కొత్తగా స్థాపించిన జనతంత్ర మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష గురించి తెలుసుకున్న అనేక మంది దీక్షకు మద్దతు తెలిపేందుకు రాలెగావ్‌సిద్ధికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో విపరీతంగా రద్దీ కనిపిం చింది. అన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఎవరూ గుమిగూడాల్సిన అవసరంలేదని, ప్రజలు వారి వారి గ్రామాల్లో తాలూకాలు, జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఎవరితోనూ చర్చ లు జరిపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా దీక్ష చేయడం ఇది ఐదోసారి. ‘బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం మాకు చాలా సార్లు హమీ ఇచ్చింది. ఏడాది గడిచినా దానికి మోక్షం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ఇలా గే కాలయాపన చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ శీతాకాల సమావేశాల్లో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సిందే. బిల్లుకు ఆమోదం లభించేదాకా నా దీక్షను కొనసాగిస్తా’ అని ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. ఇక అన్నాకు మద్దతుగా ముంబై, నాగపూర్, పుణేతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ అవి నీతి కేసులను విచారించడానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు జన్‌లోక్‌పాల్ బిల్లు ఉపయోగపడుతుంది. అన్నా నేతృత్వంలోని పౌరసంఘం సభ్యులు దీనిని తొలిసారిగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన బిల్లులో కొన్ని మార్పులు చేసింది. సీబీఐ, ప్రధానిని లోక్‌పాల్ బిల్లులో చేర్చడానికి తిరస్కరించింది. దీంతో ఈ మాజీ సైనికోద్యోగి ఐదోసారి దీక్షకు దిగారు. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం... అన్నా హజారే దీక్షతో రాలెగావ్‌సిద్ధికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖులు రావడం ప్రారంభమైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఆయన గతంలో ముంబైలో చేపట్టిన దీక్షకు పెద్దగా స్పందన రానప్పటికీ ఈసారి మాత్రం మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు రాలెగావ్‌సిద్ది గ్రామానికి చేరుకొని భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. యాదవ్ బాబా ఆలయం వద్ద రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై అన్నా హజారే దీక్షలో కూర్చుండగా, మరో వేదికపై ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేదికపై అన్నా ఒక్కరే కూర్చున్నారు. వేదిక వెనుక కనిపిస్తున్న బ్యానర్‌పై కేవలం మహాత్మాగాంధీ చిత్రం ఉంది.