
రాహుల్‌కు అన్నా హజారే ప్రశంసలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల్లో ముంచెత్తారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం విషయంలో నిబద్ధతతో వ్యవహరించారని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన రాహుల్‌కు ఓ లేఖ రాశారు. కాగా, అన్నాకు ధన్యవాదాలు చెబుతూ రాహుల్‌గాంధీ కూడా జవాబు పంపారు. ఈ రెండు లేఖల ప్రతులను మంగళవారం ఏఐసీసీ విడుదల చేసింది. ‘‘లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు మీరు కనబర్చిన చిత్తశుద్ధిని స్వాగతిస్తున్నాను'. అని తెలిపారు. పార్లమెంటు అదనంగా ఏమైనా సమర్థవంతమైన అస్త్రాలు పొందుపరిస్తే, ఈ చట్టం జాతి ప్రయోజనాలకు ఎంతగానో దోహదపడుతుందని హజారే లేఖలో పేర్కొన్నారు.