
హజారే ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్: ఎన్సీపీ
అన్నా హజారే.. ఆర్ ఎస్‌ఎస్ ఏజెంట్ అని ఎన్సీపీ ఆరోపించింది.
ముంబై: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆర్ ఎస్‌ఎస్ ఏజెంట్ అని ఎన్సీపీ ఆరోపించింది. రూ. 25 వేల కోట్ల షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని హజారా బాంబే హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎన్సీపీ తప్పుబట్టింది.
తమ పార్టీ నాయకుడు శరద్ పవార్ పై బురద చల్లేందుకు ఆర్‌ఎస్ఎస్ పన్నిన కుట్రలో హజారే పావుగా మారారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను హజారే ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు.
షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హజారే ఇటీవల హైకోర్టులో రెండు పిల్స్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరద్ పవార్, అజిత్ పవార్ సహా పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.