Nawab Malik
-
Maharashtra: ఎన్సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్‌పై బీజేపీ మండిపాటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరైన నవాబ్ మాలిక్ అభ్యర్థిత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలకు మన్‌ఖుర్ద్ శివాజీ నగర స్థానానికి ఆఖరి నిమిషంలో ఆయన రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ సభ్యుడిగా చేశారు. చివరికి ఎన్సీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నుంచే పోటీలోకి దిగుతున్నారు. కాగా మాలిక్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.తాజాగా నవాబ్ మాలిక్ రెండు నామినేషన్లు వేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అశిష్ షెలార్ మాట్లాడుతూ.. కూటమిలోని అన్నిపార్టీలు తమ సొంత అభ్యర్థిని నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. ‘ఎన్సీపీకి సంబంధించి నవాబ్ మాలిక్ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించే ఇక్కడ సమస్య. బీజేపీ వైఖరిని దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పదే పదే స్పష్టం చేశారు, నేను మళ్ళీ చెబుతున్నాను. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదు. మేము అతని కోసం ప్రచారం చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే దావూద్ సంబంధిత కేసులతో సంబంధం ఉన్న ఎవరికీ మేము ప్రచారం చేయము’. అని పేర్కొన్నారు.వాస్తవానికి నవాబ్ మాలిక్ అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటు తన కుమార్తె సనా మాలిక్‌కు న్సీపీ కేటాయించింది. దీంతో నవాబ్ మాలిక్ మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే నవాబ్ మాలిక్‌కు నామినేషన్ ఇవ్వవద్దని అజిత్ పవార్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం -
నటి భర్త కంటే బెటర్: ప్రత్యర్థిపై నవాబ్ మాలిక్ కుమార్తె
ముంబై: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ నేత( అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరిన నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌తో ఆమె తలపడనున్నారు. ఈ సందర్భంగా సనా మాలిక్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఫహద్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు. తాను నవాబ్ మాలిక్ కుమార్తె అయినందుకు గర్వపడుతున్నానని, నవాబ్ మాలిక్ కూతురు అనుశక్తి నగర్ కూతురిగా మారగలదని తెలిపారు. ఇది ఓ నటి భర్త కావడం కంటే మేలే అంటూ విమర్శలు గుప్పించారు.అనుశక్తి నగర్‌లోని ప్రజల కోసం తాను కష్టపడి పనిచేశానని, నామినేషను దాఖలు చేసే సమయంలో స్థానికులు తన వెంట రావడం వారి మద్దతుకు నిదర్శనమని సనా మాలిక్ అన్నారు. ఫహద్ అహ్మద్ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆమె అన్నారు.‘ ఇది రాజకీయం. ఎవరూ శత్రువులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం అహ్మద్ నా ప్రత్యర్థి. నేను ఫహద్ గురించి మాట్లాడను, కానీ ఇక్కడి ప్రజలకు నన్ను నవాబ్ మాలిక్ కూతురిగా మాత్రమే తెలుసునని నేను చెబుతాను, కానీ నేను వారి ఇళ్లకు వెళ్లినప్పుడు, వారితో టీ తాగేటప్పుడు, మా మాటలు వినండి, వారు నన్ను తెలుసుకుంటారు. సమస్యలు" అని సనా మాలిక్ అన్నారు.కాగా సనా మాలిక్ తండ్రి నవాబ్ మాలిక్, అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి ఆయన పోటీ చేయున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో..ఫిబ్రవరి 2022లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు..
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబందనల కింది ఈ మేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది. పరారీలో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో అక్రమమైన లావాదేవీలు ఉన్నయనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2022లోనే నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. 2021 అక్టోబర్‌లో ముంబయిలోని క్రూయిజ్ షిప్‌పై నార్కోటిక్ బ్యూరో మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాడి చేశారు. ఈ దాడిలో నవాబ్ మాలిక్ బంధువు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే మంత్రి నవాబ్ మాలిక్ అక్రమ లావాదేవీలు జరిపారనే కేసులో నిందితునిగా ఉన్నారు. ఈ ఏడాది జులైలోనే ముంబయి కోర్టు ఆయన బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యంగా ఫిట్‌గానే ఉన్నారని పేర్కొంది. ఎలాంటి అనారోగ్యంతో బాధపడడంలేదని తెలిపింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్రమంగా దెబ్బతిన్నదని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో స్టేజ్2 నుంచి స్టేజ్ 3కి చేరుకున్నారని బెయిల్ ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం రెండు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. -
మనీలాండరింగ్ కేసు.. మాజీ మంత్రికి చుక్కెదురు
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థను బుధవారం తిరస్కరించింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాల అభియోగాలు.. ఆపై లావాదేవీల కారణంగా మనీలాండరింగ్ కేసు ఈ మహారాష్ట్ర మాజీ మంత్రిపై దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్ఎన్ రోకడే అభ్యర్థనను తిరస్కరించారు. మనీలాండరింగ్ కేసులో తనను విచారించేందుకు ఎలాంటి కారణాలు లేవని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే.. దర్యాప్తు సంస్థ మాత్రం ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు అనే కారణం ఒక్కటి చాలని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు నివేదించింది. ఈ బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 14వ తేదీన వాదనలు పూర్తికాగా.. ఆదేశాలను రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా.. ఇవాళ బెయిల్ తిరస్కరిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. నవాబ్ మాలిక్‌ను.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. -
సమీర్ వాంఖడే కులంపై అనుమానాలు.. క్లీన్చిట్ ఇచ్చిన కాస్ట్ ప్యానెల్
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్ షిప్‌పై వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే. -
ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుతో ఎన్సీపీకి గట్టి దెబ్బతగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(PMLA)యాక్ట్ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో మనీల్యాండరింగ్ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్ మంత్రి చగ్గన్ భుజ్‌బల్.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. -
మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో మహ్మద్ నవాబ్ మహ్మద్ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్ సంస్థ, మాలిక్ ఇన్ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్ చట్టం కింద అటాచ్ చేశామని ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. విచారణకు సుప్రీం ఓకే మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో ఉంచిన తనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ చేసిన అభ్యర్ధనపై విచారణకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. మాలిక్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ చేసిన అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ పరిశీలించి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. పీఎంఎల్ చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, కానీ తన క్లయింటును 2000 సంవత్సరానికి ముందు జరిగిన నేరానికి పీఎంఎల్ఏ కింద అరెస్టు చేశారని సిబాల్ వాదించారు. అంతకుముందు ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మాలిక్ సుప్రీంను ఆశ్రయించారు. మాలిక్ విడుదల అభ్యర్థనను పీఎంఎల్ఏ కోర్టు కొట్టివేయడంలో తప్పులేదని, అలాగే ఆయన్ను రిమాండ్‌కు పంపడంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల జైలు నుంచి విడుదల చేయాలన్న మాలిక్ కోరికను తిరస్కరిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. -
దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు. అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్‌తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు. -
పేలుళ్ల నిందితుడి నుంచి భూమి ఎలా కొనుగోలు చేస్తారు?
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గురువారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభ, మండలి సభ్యుల సమావేశం ఫడ్నవీస్ అధ్యక్షతన బుధ వారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1993 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సహాయం చేశా రన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాబ్‌మాలిక్‌కు మహాప్రభుత్వం మద్దతివ్వడం సరికాదని, అతన్ని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. మాలిక్ రాజీనామాను కోరకుండా, ప్రభుత్వం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను గత వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి 3 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్ర వికాస్ ఆఘాది(ఎంవీఏ)అంటే... మహారాష్ట్ర దేనికీ తలవంచదని చెబుతారని, కానీ ఎంవీఏ దావూద్ ఇబ్రహీం ముందు తలవంచుతుందని, మహారాష్ట్ర ప్రజలతో మాత్రం మొండిగా ఉంటుందని ఫడ్నవీస్ చమత్కరించారు. ముంబై పేలుళ్లను మరిచిపోయి, వాటి నిందితుడి నుంచి మాలిక్ భూములు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ఆ చర్యలతోనే ఎన్సీపీ నైతికత ఏంటో అర్థమవుతోందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎంవీఏ ప్రభుత్వం ఎన్నిక నియమాలనే మార్చేసి దానికి గవర్నర్ ఆమోదం కోరుకుంటోందని, అదెలా సాధ్య మవుతుందని ప్రశ్నించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధినేత చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ... మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో మాలిక్ మంత్రివర్గం నుంచి వైదొల గకుంటే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే... బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో సంప్రదాయంగా ముఖ్యమంత్రి ఉద్ధావ్ థాకరే ఇచ్చే టీ పార్టీని బహిష్కరిస్తున్నామని బీజేపీ తెలిపింది. మార్చి 25వరకు బడ్జెట్‌సమావేశాలు కొనసాగనున్నాయి. -
7న నవాబ్ మాలిక్‌పై ధిక్కరణ కేసు విచారణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇప్పటికే వేరే కేసులో జైలులో ఉన్నందున, ధిక్కరణ కేసులో విచారణ చేపట్టడం కుదరదని ముంబై హైకోర్టు తెలిపింది. ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై అనేక వ్యాఖ్యలు చేశారంటూ ధ్యాన్‌దేవ్ పిటిషన్ వేశారు. నవాబ్ మాలిక్ కస్టడీ గడువు ఈ నెల 3వ తేదీ వరకు ఉన్నట్లు లాయర్ ఫెరోజ్ బరూచా తెలిపారు. దీంతో, న్యాయస్థానం మాలిక్‌కు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
నవాబ్ మాలిక్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలున్నాయని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో బుధవారం అరెస్టైన నవాబ్ మాలిక్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేసేందుకు అవసరమైన సమయం కావాలని, ఈకేసు దర్యాప్తు నిమిత్తం ఆయన పోలీసు కస్టడీకి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆర్.ఎన్.రొకడే శుక్రవారం తెలిపారు. పీఎంఎల్ఏ కోర్టు నవాబ్ మాలిక్‌కు మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి బుధవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన అక్రమ నగదు చలామణీ కార్యకలాపాల్లో నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే కేసు కీలక విచారణకు సంబంధించి నిందితులు సహకరించలేదని కోర్టు ఉత్తుర్వుల్లో పేర్కొంటూ మార్చి 3 వరకు నవాబ్ మాలిక్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నందున కేసు వెనుక అసలు వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ నిమిత్తం నవాబ్ మాలిక్‌ను కస్టడీకి అప్పగించడం తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేరం జరిగి 20 ఏళ్లు దాటినందున సరైన దిశలో నేరాన్ని దర్యాప్తు చేసేందుకు కొంత సమయం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కడుపునొప్పితో మాలిక్ ఆస్పత్రిలో చేరిక రెండ్రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్రమంత్రి, ఎన్సీపీ సీనియర్‌నేత నవాబ్ మాలిక్ తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం జేజే ఆస్పత్రిలో చేరారు. అయితే శుక్రవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో తనకు కడుపు నొప్పి వస్తుందని, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులెదుర్కొం టున్నట్లు ఈడీ అధికారులకు నవాబ్ మాలిక్ చెప్పడంతో వెంటనే ఈడీ అధికారలు ఆయనను నగరంలోని జేజే ఆస్పత్రికి తరలించి, యూరాలజీ విభాగంలో చేర్పించారు. ఈ మేరకు మాలిక్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. (క్లిక్: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?) అది సీఎం అభీష్టమే: సంజయ్ రౌత్ అక్రమ నగదు చలామణీ కేసులో రెండ్రోజుల క్రితం నవాబ్ మాలిక్ అరెస్టైన నేపథ్యంలో ఆయన చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పూర్తి వ్యక్తిగత నిర్ణయమని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ ఆయనపై విరుచుకుపడుతోంది. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని, అవసరమైతే ఆయన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ శుక్రవారం నగరంలోని విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో కీలుబొమ్మలుగా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గంలోని మంత్రి రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. అయితే నవాబ్ మాలిక్ రాజీనామాను సంకీర్ణ కూటమిలోని ఎన్పీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. భివండీలో నిరసనలు.. భివండీ: రాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు పట్ల భివండీ శుక్రవారం అట్టుడికిపోయింది. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ మహావికాస్ ఆఘాడీకి చెందిన నాయకులు భివండీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈడీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రాంత్కార్యాలయం ఎదురుగా ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో శివసేన పట్టణ ప్రముఖులు సుభాష్ మానే, భివండీ పట్టణ ఎన్సీపీ అధ్యక్షుడు షోయబ్ ఖాన్ గుడ్డు, మహిళా అధ్యక్షురాలు స్వాతి కాంబ్లే, భివండీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రషీద్ తాహిర్ మోమిన్, పాటు శామ్ పాటిల్, మధన్ బోయ్, మహేంద్ర కుంబారే, కోమల్ పాటిల్, రాణి అగ్రవాల్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. (చదవండి: బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?) -
‘మహా’ మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?
MVA protests against Malik’s arrest: మహారాష్ట్ర మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మహ్మద్ నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మాలిక్ అరెస్ట్ మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. శివసేన నేతృత్వంలోని అధికార మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో భాగంగానే నవాబ్‌ను పావుగా వాడుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఎవరీ నవాబ్ మాలిక్? 62 ఏళ్ల నవాబ్ మాలిక్ ప్రస్తుతం ముంబై సబర్బన్‌లోని అణుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి విధానసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీకీపీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన 1959, జూన్ 20న ఉత్తరప్రదేశ్‌లోని దుస్వాలో జన్మించారు. బాంబే యూనివర్సిటీ పరిధిలోని బుర్హానీ కాలేజీ నుంచి 1978లో 12వ తరగతి పాస్ అయినట్టు ఎన్నికల అఫిడవిట్లో మాలిక్ పేర్కొన్నారు. తన వృత్తి వ్యవసాయం, వ్యాపారం అని తెలిపారు. కలినా (మహారాష్ట్ర) నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనట్టు వెల్లడించారు. తనపై క్రిమినల్ కేసులు లేవని, రూ.5.74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని 2019 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 1996, 1999, 2004లో నెహ్రు నగర్ నుంచి విధాన సభకు ఎన్నికయ్యారు. ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధిగా, పార్టీ ముంబై నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వాంఖెడే వర్సెస్ మాలిక్ ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో గతేడాది అక్టోబర్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ అరెస్టైన సందర్భంలో సంచలన ఆరోపణలతో నవాబ్ మాలిక్ పతాక శీర్షికలకు ఎక్కారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేలపై ఆయన చేసిన ఆరోపణలు పెద్ద కలకలమే సృష్టించాయి. ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడమే కాకుండా.. ట్విటర్ వేదికగా సమీర్ వాంఖెడేను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నవాబ్ మాలిక్ టార్చర్ తట్టుకోలేక వాంఖెడే.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఉన్నత న్యాయస్థానం జోక్యంతో సమీర్‌కు మంత్రి మాలిక్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెర పడింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) మోదీ సర్కారుపై మండిపాటు కాగా, మోదీ సర్కారుకు వంతపాడుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కూడా నవాబ్ మాలిక్ వదిలిపెట్టలేదు. రైతుల ఉద్యమం, మహాత్మ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాదు.. కంగనకు కేంద్రం కల్పించిన ‘వై ప్లస్’ భద్రతను కూడా తొలగించాలని గట్టిగా డిమాండ్ చేశారాయన. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్ ఈడీ, ఎన్సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రకటించారు. అయితే, 2005 నాటి కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆయనను అదుపులోకి తీసుకుంది. పాత కేసును తిరగదోడి ఇప్పుడు మాలిక్‌ను అరెస్ట్ చేయడాన్ని కక్ష సాధింపుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు పేర్కొంటున్నాయి. మహా అఘాడీకి ఎదురుదెబ్బ మంత్రి మాలిక్ అరెస్ట్ మహా అఘాడీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బలమైన సీనియర్ నాయకుడిని కోల్పోవడం కూటమి మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. కూటమిలోని పార్టీలకు ఈ వ్యవహారం తలనొప్పిగా పరిణమించే అవకాశముంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్ తప్పించాలని ప్రభుత్వంపై విపక్ష బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. తమకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న ఆయనను జైలుకు పంపించడం ద్వారా బీజేపీ పైచేయి సాధించింది. కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న కేడర్‌లో చురుకు తెచ్చి క్రియాశీలంగా పనిచేసేందుకు తాజా పరిణామం కమలనాథులకు ఉపయోగపడుతుంది. (క్లిక్: ఉక్రెయిన్‌లో భారతీయుల ఆర్తనాదాలు.. ప్రభుత్వం ముందున్న ప్లానేంటి?) ‘మహా’ పొలిటికల్ హీట్ నవాబ్ మాలిక్ అరెస్ట్‌తో మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం రేగింది. ఆయన అరెస్ట్‌ను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఖండించగా.. బీజేపీ సమర్థించింది. మాలిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా గురువారం బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అటు నవాబ్ మాలిక్ అరెస్ట్‌కు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా పలువురు మంత్రులు పాల్గొనడం గమనార్హం. కాగా, మంత్రి నవాబ్ మాలిక్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అధికార, విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో మహారాష్ట్రలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. మొత్తానికి మాలిక్ అరెస్ట్ వ్యవహారం మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. - సాక్షి వెబ్ ప్రత్యేకం -
ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్
-
ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్టు
ముంబై: మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి బుధవారం ఉదయం 8 గంటలకు మాలిక్‌ను తీసుకువచ్చిన ఈడీ అధికారులు ఆయన్ను దాదాపు 6 గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కస్టడీలోకి తీసుకొని బందోబస్తుతో వైద్య పరీక్షలకు పంపారు. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనకు ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3వరకు ఈడీ కస్టడీ విధించింది. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. అఘాడీలో ఆందోళన నవాబ్ మాలిక్ అరెస్టుతో అధికార మహా అఘాడీ కూటమిలో కలకలం రేగింది. ఎన్సీపీకి చెందిన మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, హసన్ ముషరిఫ్, రాజేశ్ తోపె తదితరులు అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. మాలిక్ అరెస్టు తర్వాత పరిణామాలపై చర్చలు జరిపారు. మాలిక్ రాజీనామా చేస్తే ఆయన పోర్టుఫోలియోలను ఎవరికివ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మాలిక్ మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలాసాహెబ్, అశోక్, సునీల్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆరోపించారు. గతేడాది మాలిక్ అల్లుడు సమీర్‌ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటి కేసు ఈ నెల 15న ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. 2.86 ఎకరాల భూమిన కారుచౌకగా మాలిక్ దక్కించుకున్నారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. కక్షపూరిత చర్య: ఎన్సీపీ కొందరు చేసిన తప్పులు బయటపెడుతున్నందుకే నవాబ్ మాలిక్‌ను కేంద్రం అరెస్టు చేయించిందని, కేంద్ర అధికార దుర్వినియోగానికి ఈ అరెస్టు నిదర్శనమని ఎన్సీపీ విమర్శించింది. ఇలాంటి రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తామని శివసేన, కాంగ్రెస్ ప్రకటించాయి. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి శివసేన, కాంగ్రెస్ మహా అఘాడీ కూటమి పేరిట అధికారంలో ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీలు మాఫియాలాగా బీజేపీ వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. 2024 వరకు ఈ ధోరణి కొనసాగుతుందని, తర్వాత వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. అండర్‌వరల్డ్‌తో సంబంధం లేని ఒక ముస్లిం యాక్టివిస్టును అరెస్టు చేయాలంటే దావూద్ పేరు తీసుకువస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. సదరు కేసు నమోదై 25ఏళ్లు గడిచిపోయాయని, కానీ ఇప్పటికీ తమ వ్యతిరేకులను ఇబ్బంది పెట్టేందుకు ఆ కేసులో పేర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మాలిక్ అరెస్టును నిరసిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు ఈడీ ఆఫీసుకు దగ్గర్లోని ఎన్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అరెస్టైన మాలిక్‌కు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని, రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ డిమాండ్ చేశారు. మాలిక్ అరెస్టును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఖండించారు. -
నిన్న బీజేపీపై కామెంట్స్.. నేడు మంత్రి ఇంటికి ఈడీ ఎంట్రీ
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు బీజేపీ, శివసేన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇంతలోనే బుధవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం బుధవారం ఉదయం ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. ముంబై అండర్ వరల్డ్ డాన్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మాలిక్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఏజెన్సీ మాలిక్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ బరిలో దిగనున్నారన్న వార్తలపై మాలిక్ స్పందించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈడీ చర్యపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. మాలిక్‌ను అతని ఇంటి నుండి ఏజెన్సీ తీసుకువెళ్లిన విధానం మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేసే విధంగా ఉందని విమర్శించారు. నవాబ్ మాలిక్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అని అన్నారు. ఒక మంత్రిని రాష్ట్రానికి వచ్చి కేంద్ర ఏజెన్సీలు ఇలా తీసుకువెళ్తాయా అని ప్రశ్నించారు. 2024 తర్వాత మీరు కూడా(బీజేపీ) ఇలాగే విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండానే మాలిక్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారని మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ అన్నారు. అయితే, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలాకు సంబంధించి ముంబైలో ఫిబ్రవరి 15న ఈడీ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే నవాబ్ మాలిక్‌ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. Today morning the ED had come to @nawabmalikncp saheb's residence. They accompanied saheb in his vehicle to the ED office. Advocate Amir Malik, Saheb's son has accompanied saheb along with. — Office of Nawab Malik (@OfficeofNM) February 23, 2022 -
బిహార్ రాజకీయాల్లో పుకార్లు... రాష్ట్రపతిగా నితీశ్?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ భారత రాష్ట్రపతి కాబోతున్నారా? అసలు ఆ పదవికి నితీశ్ సరిపోతారా? అనే ప్రశ్నలు మంగళవారం బిహార్ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియబోతున్న నేపథ్యంలో రాష్ట్రపతిగా నితీశ్ అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి పదవికి పట్నాలోని నితీశ్ కుమార్‌ను ముడివేయడానికి ముంబైలో బీజం పడింది. నితీశ్ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే తమ పార్టీ మద్దతునిస్తుందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. అయితే ముందుగా నితీశ్ బీజేపీతో మైత్రి వదులుకోవాలని సూచించారు. దీంతో నిప్పు లేనిదే పొగరాదన్నట్లు నితీశ్‌ను రాష్ట్రపతిగా చేసే యత్నాలు ఆరంభమయ్యాయని బిహార్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై నితీశ్‌ను మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పారు. నితీశ్ మిత్రపక్షం బీజేపీ కూడా ఈ విషయమై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కోవింద్ పదవీ కాలం జూలైలో ముగుస్తుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయసభల సభ్యులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు. లోక్‌సభలో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా, రాష్ట్రపతిగా తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నిక చేయాలంటే బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం. అందుకే నితీశ్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని బీజేపీ నిలబెట్టవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మిశ్రమ స్పందన నితీశ్ సొంతపార్టీ నేతలు తాజా ఊహాగానాలపై సంతోషం ప్రకటించగా, బద్ద శత్రువైన లాలూకు చెందిన ఆర్జేడీ నేతలు ఈ విషయమై మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. హత్యకేసులో నిందితుడిని రాష్ట్రపతి కుర్చీలో ఎలా కూర్చోబెడతారని లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ప్రశ్నించారు. ఎప్పటికైనా తన తండ్రి లాలూ ప్రధాని అవుతాడన్నారు. అయితే ఒక బిహారీగా నితీశ్ రాష్ట్రపతి అయితే సంతోషిస్తామని ఆర్జేడీ నేత మృత్యంజయ్ తివారీ చెప్పారు. గత రెండు దఫాల రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ సొంత కూటమికి వ్యతిరేకంగా నిలబడిన అభ్యర్థులకు మద్దతునిచ్చాడని ఆర్జేడీ నేత శక్తియాదవ్ గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన నితీశ్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసి చర్చించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, పీఆర్ ఏజెన్సీ అండతో ఎవరైనా రాష్ట్రపతి గద్దెనెక్కితే దేశ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పదవికి నితీశ్ సరిపోతారని బిహార్ మాజీ సీఎం జితన్‌రామ్ మాంజీ అభిప్రాయపడగా, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ మాత్రం నితీశ్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ వ్యతిరేక కూటమి? దేశంలోబీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే యత్నాలు ఆరంభమయ్యాయని మాలిక్ అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌తో సమావేశమయ్యారన్నారు. వీరితో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలను కలిపి ఐక్య కూటమి నిర్మించాలన్నది ప్రతిపక్ష ప్రణాళిక అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరితో నితీశ్, నవీన్ పట్నాయక్ చేరితే కూటమి మరింత బలోపేతమవుతుందని వీరి విశ్లేషణ. కానీ కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోవడంపైనే ప్రతిపక్షాల్లో విబేధాలున్నాయి. -
బాంబే హైకోర్టుకు నవాబ్ మాలిక్ క్షమాపణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ వేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్ వివరించారు. మాలిక్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్‌పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ నిబంధనలు మార్చండి: ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది. -
నా ఇంటిపై రెక్కీ: మాలిక్
ముంబై: ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్‌లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్ చాట్స్ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్ మాలిక్ హెచ్చరించారు. -
చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్
Minister Nawab Malik Counter To Kangana: మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఉద్దేశిస్తూ "చట్టానికి ఎవరూ అతీతులు కారు" అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బాలీవుడ్ నటి కంగానా పై ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: IT Raids: వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!) అంతేకాదు కంగనా రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయన్నారు. పైగా ఆమె పై కేసు నమోదు చేసి చర్య తీసుకుంటే సరిపోదని ఆమెకు కేంద్రం గతేడాది ఇచ్చిన వై ప్లస్ భద్రతను కూడా తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్రం ఆమె తండ్రి అభ్యర్ధన మేరకు ఈ భద్రతను ఇచ్చిన సంగతిని కూడా గుర్తుచేశారు. గత కొన్ని రోజులుగా కంగనా ప్రతి ఒక్కరినీ దుర్భాషలాడుతున్న తీరు.. మన జాతిపిత (మహాత్మా గాంధీ)ని అవమానించడం.. ఆజాదీ (స్వాతంత్య్రం) నకిలీదని, మనం బిచ్చగాళ్లమని... వ్యాఖ్యలు చేసి ఆమె వివిధ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందంటూ నవాబ్ మాలిక్ మండిపడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవండతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన తరుణంలో కూడా కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపడమే కాక ఆమెకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు కంగనా చేస్తున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగానే మేలో ట్విటర్.. నిబంధనలను పదే పదే ఉల్లంఘించిదంటూ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ సిక్కు గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంఎస్) భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలో కంగనా రనౌత్‌కు ప్రదానం చేసిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్
ముంబై: వక్ఫ్ ఆస్తుల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు చోట్ల సోదాలు చేస్తూ తనను భయపెట్టగలనని భావిస్తోందని, అది అసాధ్యమని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పలు చోట్ల వక్ఫ్ ఆస్తులను అక్రమంగా అమ్మేశారని, మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు గురువారం పుణెసహా ఏడు చోట్ల సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాలిక్ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘ సోదాలు చేస్తే నేనేమీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు అధీనంలోని 30వేల ఆస్తుల్లో నిరభ్యంతరంగా సోదాలు చేసుకోవచ్చని ఈడీకి ఆయన ఆహ్వానం పలికారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్ ఈడీ, ఎన్సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మాలిక్ ఆరోపించారు. ‘ఈడీ విధినిర్వహణ నిజంగా చేయదలిస్తే, బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో షియా వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోండి’ అని చురకలంటించారు. ఫడ్నవిస్‌కు పరువు నష్టం నోటీసులు పంపిన నవాబ్ అల్లుడు తన ఇంట్లో మాదకద్రవ్యాలు దొరికాయంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరువు నష్టం కింద రూ.5 కోట్లు చెల్లించాలని, క్షమాపణలు చెప్పాలని ఫడ్నవిస్‌కు తన లాయర్ ద్వారా సమీర్ నోటీసులు పంపించారు. ఈ నోటీస్‌పై చట్టపరంగానే స్పందిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పారు. -
దావూద్ అనుచరుడితో ఫడ్నవీస్‌కు లింకు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా చెప్పుకునే రియాజ్ భాటితో లింకులు ఉన్నాయని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఫడ్నవీస్, రియాజ్ భాటి కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. రియాజ్ భాటి నకిలీ పాస్‌పోర్టు కేసులో పట్టుబడితే రెండు రోజుల్లోనే అతనిని విడుదల చేశారని, ఆ తర్వాత ఫడ్నవీస్‌తో కలిసి ఒక ఫంక్షన్లో కనిపించారని వెల్లడించారు. నవాబ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఫడ్నవీస్‌పై ఇంకా వెయ్యాల్సిన బాంబులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు నకిలీ నోట్ల రాకెట్‌ని చూసీచూడనట్టు వదిలేశారని, నేరచరిత కలిగిన వారిని ప్రభుత్వ బోర్డుల్లో నియమించారని తీవ్ర విమర్శలు చేశారు. పందితో పోరాడితే.. నవాబ్ ఆరోపణల తర్వాత ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా ప్రముఖ నాటక రచయిత జార్జ్ ఫెర్నాండెజ్ షా కొటేషన్‌ని పోస్టు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ‘నేను చాలా కాలం క్రితమే ఒక విషయం నేర్చుకున్నాను. పందితో ఎప్పుడూ కొట్లాడకూడదు. అలా చేస్తే మనకి బురద అంటుకుంటుంది. పందికి అది ఇష్టంగా అనిపిస్తుంది’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. చదవండి: పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు -
మాజీ సీఎం ఫడ్నవిస్‌పై సంచలన ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్
-
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పై మాజీ సీఎం ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు
-
మాజీ సీఎంకు నవాబ్ కౌంటర్: హైడ్రోజన్ బాంబు వేయబోతున్నా కాస్కో!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రోజుకో పరిణామంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో బీజేపీ, శివసేన,ఎన్సీపీ ప్రభుత్వం మధ్య రగిలిన వార్ మరింత ముదురుతోంది. తనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. రేపు (బుధవారం) హైడ్రోజన్ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్‌తో ఆయనకున్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతాను అంటూ నవాబ్ మాలిక్ ప్రకంపనలు సెగ రేపారు. ఫడ్నవిస్ తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమే అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇటీవల కాలంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన నవాబ్‌మాలిక్‌పై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు దేవేంద్ర ఫడ్నవిస్. నవాబ్కు, ఆయన కుటుంబ సభ్యులకు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో దావూద్ గ్యాంగ్ సభ్యుడి మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం దుమారాన్ని రేపింది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని, అసలు వారినుంచి భూమి ఎందుకు కొన్నారని ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పపవార్కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. राष्ट्रवादी काँग्रेसचे राष्ट्रीय प्रवक्ते ना. नवाब मलिक यांच्या पत्रकार परिषदेचे थेट प्रक्षेपण https://t.co/4fHBSM4Lln — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 9, 2021 -
డ్రగ్స్ బిజినెస్‌లో ఉన్నారా.. మీకిది తగునా?
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమీర్ భార్య సోదరి గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ తాజాగా మాలిక్ ట్వీట్ చేశారు. దీనికి తనదైన శైలిలో సమీర్ కౌంటర్ ఇచ్చారు. ‘గుడ్ వర్క్ మిత్రమా. కానీ ఒక మహిళ పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? నిజానికి, మేము పత్రికా ప్రకటనను జారీ చేసేటప్పుడు, మహిళల గౌరవాన్ని కాపాడటానికి వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును ఇలా బహిరంగపరచడం మీకు తగునా? మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామ’ని సమీర్ పేర్కొన్నారు. (చదవండి: మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు) సమీర్ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ పేరు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో ఉందని నవాబ్ మాలిక్ వెల్లడించారు. ‘సమీర్ దావూద్ వాంఖెడే.. మీ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాల’ని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. 2008 జనవరిలో ఈ కేసు నమోదైనప్పుడు తాను సర్వీస్‌లో కూడా లేనని సమీర్ వాంఖడే తెలిపారు. 2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే తన సోదరి ఈ కేసులో బాధితురాలిగా ఉందని సమీర్ భార్య క్రాంతి రెడ్కర్ అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. నవాబ్ మాలిక్‌ను తన సోదరి చట్టపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు చురకలు అంటించింది. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయనను ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తండ్రి ధ్యాన్‌దేవ్ వేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. నవాబ్ మాలిక్ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ధ్యాన్‌దేవ్ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవ్ జామ్‌ధార్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని మాలిక్‌ను ఆదేశించింది. ‘మీరు (నవాబ్ మాలిక్) రేపటిలోగా మీ సమాధానం ఇవ్వండి. మీరు ట్విటర్లోనే కాదు, ఇక్కడకు వచ్చి కూడా సమాధానం ఇవ్వొచ్చు’ అంటూ మాలిక్‌కు చురకలు అంటించింది. కాగా, ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్ వాంఖెడేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో మాలిక్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాంఖెడే కుటుంబానికి వ్యతిరేకంగా మళ్లీ ఎటువంటి ప్రకటనలు చేయకుండా మాలిక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. (చదవండి: ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్) ప్రతిరోజు తప్పుడు ప్రకటనలతో వాంఖెడే కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా నవాబ్‌మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని వాంఖెడే తరఫు న్యాయవాది అర్షద్ షేక్ కోర్టులో వాదించారు. సోషల్ మీడియాలో అసత్య పోస్ట్‌లు పెడుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ఉదయం కూడా సమీర్ వాంఖడే భార్య సోదరి గురించి ట్వీట్ చేశారని వెల్లడించారు. కనీసం విచారణ ముగిసే వరకు నవాబ్ మాలిక్ ఎటువంటి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దావాపై అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అతుల్ దామ్లే కోరారు. ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన వాటిని నవాబ్ మాలిక్ ఆపాదించడం సరికాదని కోర్టుకు తెలిపారు. కాగా, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా తమ కుటుంబ పరువు తీసిన నవాబ్ మాలిక్‌పై రూ.1.25 కోట్లకు ధ్యాన్‌దేవ్ వాంఖెడే దావా వేశారు. (చదవండి: ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు
ముంబై: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పెంచుతోంది. షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ని కిడ్నాప్ చేసి కోట్లు దండుకోవాలని కుట్రపన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రకి బీజేపీ నేత మోహిత్ భారతీయ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. మాలిక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే కూడా కుట్రలో భాగస్వామేనని అన్నారు. క్రూయిజ్ నౌకపై దాడి జరగడానికి ముందు ఒషివరలోని ఒక శ్మశాన వాటిక వద్ద మోహిత్‌ను వాంఖెడే కలిశారన్నారు. అయితే వాంఖెడేకి అదృష్టం కలిసి వచ్చి సీసీటీవీ ఫుటేజీ దొరకలేదన్నారు. అయితే తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతో వాంఖెడే డ్రగ్స్ కేసును ఆర్యన్‌పై బనాయించారన్నారు. వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో మోహిత్ కూడా ఒక సభ్యుడని మాలిక్ ఆరోపించారు. జర్నలిస్టు ఆర్కె బజాజ్, అడ్వకేట్ ప్రదీప్ నంబియార్లు వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో ఉన్నారన్నారు. ‘‘ఆర్యన్‌ని విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు అడిగారు డీల్ రూ.18 కోట్లకు కుదిరింది. రూ.50 లక్షలు షారూక్ ఇచ్చారు. కానీ కిరణ్ గోసవితో ఆర్యన్ సెల్ఫీ బయటకొచ్చి వారి కుట్ర భగ్నమైంది’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ‘సిట్’ విచారణకు ఆర్యన్ ఖాన్ గైర్హాజరు డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట ఆదివారం విచారణకు హాజరు కాలేదు. జ్వరంతో బాధ పడుతున్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నారని ఆర్యన్ వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్యన్ సోమవారం ‘సిట్’ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహనిందితుడైన అర్బాజ్ మర్చంట్‌ను ఆదివారం సిట్ దాదాపు 9 గంటలు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై బీజేపీ యువ నేత సునీల్ పాటిల్ ఆదివారం పోలీస్ ‘సిట్’ ముందు విచారణకు హాజరయ్యాడు. -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్‌పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
ముంబై నుంచి బాలీవుడ్‌ని తరలించడమే ప్లాన్.. నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యాలు
ముంబై: బాలీవుడ్‌ను మహరాష్ట్ర నుంచి తరిమేసేందుకే బీజేపీ కుట్రపూరితంగా డ్రగ్స్ కేసును వాడుకుంటోందని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ చర్యలతో బాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ ఓ ప్లానింగ్‌తో చేస్తున్న కుట్ర అని మాలిక్ విలేకరుల సమావేశంలో అన్నారు. తన మాటలకు బలం చేకూర్చేలా..నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినీ ప్రముఖులతో జరిపిన సమావేశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లిన కిరణ్ గోసావి కటకటాల వెనుక ఉన్నాడు. డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని 2018 చీటింగ్ కేసుకు సంబంధించి పుణె పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే రక్షణ కావాలిన బాంబే హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. వాంఖడేకు మూడు రోజుల నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయబోమని ముంబై పోలీసులు హైకోర్టుకు హామీ ఇచ్చారు. సమీర్ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాంఖడే తన గొంతును అణచివేయడానికి ప్రయత్నించాడన్న మాలిక్.. తన ఆరోపణలన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎట్టికేలకు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు -
ఆర్యన్‌కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్‌కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్‌కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్‌ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో కుమారుడు డ్రగ్స్ కేసు ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడేపై వేటు వేసుందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భార్య క్రాంతి రేడ్కర్ వాంఖడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ మధ్య ముదురుతున్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరాఠీ ప్రజల సమాన హక్కుల కోసం పోరాడుతున్న శివసేనను చూస్తూ పెరిగిన మరాఠీ అమ్మాయినైనా తాను ప్రతీరోజు అవమానాల పాలు కావాల్సి వస్తోందని, ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలాసాహెబ్ రాష్ట్రంలో ఒక మహిళకు తీరని అవమానం జరుగుతోందని క్రాంతి వాపోయారు. ఈ రోజు బాలాసాహెబ్ ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ ఠాక్రేల సిద్ధాంతాలను గౌరవిస్తూ పెరిగాను. ఎవరికీ అన్యాయం చేయకూడదని, అన్యాయాన్ని అస్సలు సహించకూడదని ఆ నేతలంతా తనకు నేర్పించారని ఆమె అన్నారు. బాలాసాబ్లో మిమ్మల్ని చూసుకుంటున్నానంటూ సీఎం ఠాక్రే నుద్దేశించి లేఖ రాశారు. తన కుటుంబానికి అన్యాయం చేయరనే విశ్వాసాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన క్రాంతి ఎన్సీబీ అధికారి, తన భర్త సమీర్ వాంఖడేకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సీఎం అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. సమీర్ పనిచేయడం, చాలా మందికి నచ్చడం లేదని, డ్రగ్స్ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను తొలిగించాలని భావిస్తున్నారని, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని క్రాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాలిక్ ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే సోదరి, న్యాయవాది యాస్మీన్ గురువారం ముంబై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె సమర్పించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాగా ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే దోపిడీ, అక్రమ ట్యాపింగ్, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు వెల్లు వెత్తాయి. క్రూయిజ్ షిప్ వివాదంలో ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు మంత్రి నవాబ్‌మాలిక్ కూడా సమీర్‌పై ఆరోపణలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మోసపూరితంగా జనన , మరియు, కుల ధృవీకరణ పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మరోవైపు సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి ఎన్సీబీ దాడులు చేస్తోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. माननीय उद्धव ठाकरे साहेब @CMOMaharashtra पत्रास करण की … pic.twitter.com/0VJxURk5oi — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 28, 2021 -
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్‌ఖాన్‌ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్‌కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్‌కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
Aryan khan:బాలీవుడ్ నటుల ఫోన్స్‌ని వాంఖడే ట్యాప్ చేశారు: నవాబ్ మాలిక్
Aryan Khan Drug's Case: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఆర్యన్ పెట్టిన బెయిల్ పిటిషన్‌ని ఇప్పటికే మూడు సార్లు రిజెక్ట్ చేయగా.. మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ఓ ముస్లీం అని, సర్టిఫికేట్లని ఫోర్జరీ చేసి తన మతం గురించి దాచాడని నవాబ్ ఆరోపించారు. ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని తెలిపిన మంత్రి.. తాజాగా నవాబ్ మరోసారి వాంఖడేపై విరుచుకుపడ్డారు. వాంఖడే బాలీవుడ్ నటుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించాడు. అనంతరం డబ్బు డిమాండ్ చేసేవారన్నారు. దీనికి సంబంధించిన ఓ లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది పేరు లేని ఎన్సీబీ ఆఫీసర్ పేరుతో ఆయనకి పంపించారని అందులో తెలిపారు. దీన్ని వాంఖడేపై విచారణలో భాగం చేయాలని ఎన్సీబీ ఉన్నతాధికారులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు Here are the contents of the letter received by me from an unnamed NCB official. As a responsible citizen I will be forwarding this letter to DG Narcotics requesting him to include this letter in the investigation being conducted on Sameer Wankhede pic.twitter.com/SOClI3ntAn — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021 -
మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..
ముంబై: తన మతంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే స్పందించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. సమీర్.. ముస్లిం మతానికి చెందినవారని పేర్కొంటూ ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ‘ఫోర్జరీ ఇక్కడ నుంచి ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు సమీర్, ఆయన మాజీ భార్య షబానా ఖురేషీ పెళ్లి నాటి ఫొటో కూడా ట్విటర్లో పెట్టారు. దీనిపై సమీర్ దీటుగా స్పందించారు. నవాబ్ మాలిక్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు అనవసర విషయాల్లో తనను ఇరికిస్తున్నారని, తనకు సంబంధించిన ఏ వివరాలైనా పరిశీలించుకోవచ్చని సమీర్ వాంఖెడే స్పష్టం చేశారు. ‘నా తండ్రి పేరు ద్యాన్ దేవ్ కచ్రుజీ వాంఖెడే. 2007 జూన్ 30న స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. నా తండ్రి హిందువు. నా తల్లి దివంగత శ్రీమతి జహీదా ముస్లిం. బహుళ మత, లౌకిక కుటుంబానికి చెందినవాడిగా.. నా వారసత్వం గురించి నేను గర్విస్తున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 2017లో, నేను షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ను వివాహం చేసుకున్నాను’ అని సమీర్ వాంఖెడే ఒక ప్రకటనలో తెలిపారు. చాలా బాధపడ్డాను నవాబ్ మాలిక్ ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదు నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి కూడా. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, చనిపోయిన నా తల్లిని కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసింది. గత కొన్ని రోజులుగా గౌరవ మంత్రి చర్యలు నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన మానసిక, మానసిక ఒత్తిడికి గురి చేశాయి. వ్యక్తిగత, పరువు నష్టం కలిగించే దాడులతో నేను బాధపడ్డాను’ అని సమీర్ వాంఖెడే ట్విటర్లో పేర్కొన్నారు. Me n my Husband Sameer r born Hindus.We hv never converted to any other religion.V respect all religions.Sameer’s father too is hindu married to my Muslim Mom in law who is no more.Sameer’s ex-marriage ws under special marriage act,divorced in 2016.Ours in hindu marriage act 2017 pic.twitter.com/BDQsyuvuI7 — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021 మతం మారలేదు: సమీర్ భార్య తన భర్తపై మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై సమీర్ వాంఖెడే భార్య షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ ట్విటర్లో స్పందించారు. తాను, తన భర్త జన్మతః హిందువులమని, మరో మతంలోకి మారలేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొంటూ తమ పెళ్లినాటి ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టబద్ద రక్షణ కల్పించాలంటూ సమీర్ వాంఖెడే ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి ఆయన లేఖ రాశారు. అయితే డ్రగ్స్ కేసులతో మహారాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన, ఎన్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు.. ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
ఆర్యన్ కేసులో బీజేపీ హస్తం!
ముంబై: బాలీవుడ్ స్టార్కిడ్ ఆర్యన్ ఖాన్ అరెస్టు కేసు విషయం పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, సోదాల్లో ఎన్సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్టకి చెందిన మహారాష్ట్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మరోవైపు ఎన్సీబీ, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో సహా 17మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. జాతీయ నార్కొటిక్ బ్యూరో జరిపిన ఈ సోదాలన్నీ డ్రామాలని, నకిలీవని నవాబ్ మాలిక్ విమర్శించారు. అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదన్నారు. ఈ సందర్భంగా రైడ్ జరుగుతున్నప్పటి కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. ఇందులోని ఒక వీడియోలో ఆర్యన్‌ను ఎస్కార్ట్ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అయితే అతను ఎన్సీబీ అధికారి కాదని, గోస్వామి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం అతను ఒక ప్రైవేట్ డిటెక్టివని నవాబ్ ఆరోపించారు. మరో వీడియోలో ఇదే కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చెంట్‌ను ఇద్దరు ఎస్కార్ట్ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ సభ్యుడని నవాబ్ చెప్పారు. వీరంతా ఎన్సీబీ అధికారులు కానప్పుడు రైడ్‌లో ఎందుకున్నారని ప్రశ్నించారు. మర్చంట్‌తో పాటు ఉన్న వ్యక్తి గుజరాత్లో సెపె్టంబర్ 21–22 తారీకుల్లో కనిపించాడని, అందువల్ల అతనికి ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్‌తో సంబంధం ఉండి ఉండొచ్చని ఆరోపించారు. సదరు వ్యక్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్‌ను, తమ ప్రభుత్వాన్ని మకిలిపట్టించేందుకు ఎన్సీబీని బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. నవాబ్ అల్లుడు సమీర్ ఖాన్‌ను ఎన్సీబీ డ్రగ్స్ కేసులో గత జనవరిలో అరెస్టు చేయగా, సెపె్టంబర్లో బెయిల్‌పై బయటకు వచ్చారు. అవును.. అక్కడే ఉన్నాను: నౌకలో ఎన్సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మాలిక్ ఆరోపణల్లో కేంద్రబిందువుగా మారిన మనీశ్ భన్సాలీ తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తనేనని, కానీ ఏ నాయకుడిని ఇంతవరకు కలవలేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలి్పంచాలని కోరతానన్నారు. ‘‘అక్టోబర్ 1న డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం వచ్చింది. దీన్ని ఎన్సీబీకి చెప్పమని నా స్నేహితుడు సూచించాడు. ఈ పార్టీ విషయమై ఎన్సీబీ వద్ద స్వల్ప సమాచారమే ఉంది. మేము మరికొంత అందించాం. అక్టోబర్ 2న రైడ్‌ను ప్లాన్ చేశారు. సాక్షిగా నేను సంఘటనా స్థలంలో ఉన్నాను’’ అని మనీశ్ వెల్లడించారు. ఎన్సీబీ అధికారులతో తాను ఉన్నానని, అందుకే వీడియోల్లో ఎస్కార్ట్ చేస్తున్నట్లు కనిపించిందని ఇండియాటుడేకు ఆయన తెలిపారు. నవాబ్ మాలిక్ మలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దేశం కోసం పనిచేస్తున్నామని, నౌకలో షారూఖ్ కొడుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు. వారంతా సాక్షులు తమ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు నిరాధారాలని, గతంలో తాము చేసిన అరెస్టులకు ప్రతీకారంగా చేస్తున్నవై ఉండొచ్చని ఎన్సీబీ డీఐజీ జ్ఞానేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమ విచారణ చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. రైడ్‌లో ఎన్సీపీ అధికారులతో పాటు గోస్వామి, భన్సాలీతో పాటు ప్రభాకర్, గోమెజ్, ఉస్మానీ, వైగాంకర్, రానే, ప్రకాశ్, ఫయాజ్, ఇబ్రహీంలు పాల్గొన్నారని, వీరంతా సాక్షులుగా వ్యవహరించారని వివరించారు. ఎన్సీబీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలుండబట్టే కోర్టు అతన్ని కస్టడీకి పంపిందని బీజేపీ ఎంఎల్ఏ అతుల్ అభిప్రాయపడ్డారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే వెంటనే బెయిల్ వచ్చేదన్నారు. అల్లుడి అరెస్టును మనసులో ఉంచుకొని మాలిక్ ఆరోపణలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్ ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్సీబీ అధికారులు తాజాగా మరొక డ్రగ్ విక్రేతను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముంబైలోని సబ్–అర్బన్ పోవాయ్‌లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీఐ ముంబై జోనల్ అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో, బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్ కొడుకుసహా మొత్తం 17 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. కాగా, మంగళవారం అరెస్టయిన నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్లు సమీర్ సెహగల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా, గోపాల్ ఆనంద్‌లను 14 తేదీ దాకా ఎస్సీబీ కస్టడీకి పంపుతూ ముంబైలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నెర్లికర్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు కొందరు బుధవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్ తండ్రి అస్లాం వారిలో ఉన్నారు. తన కుమారుడు అమాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. అర్బాజ్‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలుచేశారు. అక్టోబర్ రెండో తేదీన ముంబై పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని విన్నవించు కున్నారు. దీనిపై మీ స్పందన తెలపాలని ఎన్సీబీని కోర్టు ఆదేశించింది. -
బీజేపీ, ఎన్సీపీలు కలుసుకోవు: నవాబ్ మల్లిక్
ముంబై: ఎన్సీపీ, బీజేపీలు ఎప్పుడూ కలుసుకోలేవని, ఇరు పార్టీలు నది చివరల వంటివని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి నవాబ్ మల్లిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీని, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కలుసుకోవంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చలకు తెరదీశాయి. బీజేపీతో ఎన్సీపీ దోస్తీ కట్టబోతోందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శనివారం నవాబ్ మల్లిక్ స్పందించారు. ‘ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదు. ఎందుకంటే రెండు పార్టీలు సైద్ధాంతికంగా భిన్నమైనవి, బీజేపీ, ఎన్సీపీలు ఒక నదికి రెండు చివరలు, అవి నదిలో నీరు ఉన్నంత వరకు కలిసి రావు‘ అని ఎన్‌సిపి ప్రతినిధి విలేకరులతో అన్నారు. ఎంవీఏ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. కొంతమంది ఆఘాడీ ప్రభుత్వాన్ని పడిపోతుందని తేదీలతో సహా చెబుతున్నారని, కానీ, వారి అంచనా ఎప్పటికీ నిజం కాబోదని నవాబ్ చురకలంటించారు. జాతీయన నిర్వచనంలో బీజేపీ, ఎన్సీపీలు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. ఆ పార్టీని ఆయన వాషింగ్ మెషీన్‌తో పోల్చారు. అక్కడ డాకోయిట్ కూడా సాధువుగా మారవచ్చు అన్నారు, ఇతర పార్టీల నాయకులను బలవంతంగా చేర్చుకోవడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతోందని మలిక్ ఆరోపించారు. ఎన్సీపీ నాయకులు ఈడీ నోటీసులకు భయపడరని, ఎందుకంటే వారు తప్పు చేయరని వారికీ తెలుసని అన్నారు. కాగా, మోదీ, పవార్ సమావేశంపై స్పందిస్తూ.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలపై చర్చించడానికి కలిశారని స్పష్టంచేశారు. అంతేకాకుండా సమావేశంపై సీఎం ఉద్ధవ్‌కు కూడా తెలియజేశారని తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హెచ్‌కేపాటిల్‌కు కూడా దీనిపై ముందుగానే సమాచారం ఉందని అన్నారు. ‘బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు సహకార రంగ బ్యాంకులను దెబ్బతీస్తాయి, ఎందుకంటే ఆర్బీఐకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. సహకార బ్యాంకులు అధికార పరిమితులను ఎదుర్కొన్నాయి. సహకారం ఒక రాష్ట్ర విషయం ... పవార్ ఈ అంశంపై వాటాదారులందరితో చర్చిస్తున్నారు’’ అని నవాబ్ చెప్పారు. -
పవార్‌తో పీకే భేటీ.. కారణమిదేనంటున్న ఎన్సీపీ నేత
ముంబై: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. 2024లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల తన ‘మిషన్-2024’ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని పలువురు భావిస్తున్నారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన వీరి చర్చల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి ధీటైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై, అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ప్రతి రాజకీయ నేతనూ కలుస్తానని.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని, అందులో తప్పు లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాగా తాజాగా పీకే, పవార్ భేటీపై ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘శరద్ పవర్‌ను శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మర్యాద పూర్వకంగానే ఇంట్లో కలిశారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలు సాగింది. అయితే ఇందులో ఎన్సీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకునే చర్చ ఏం జరగలేదు. అతను ఒక వ్యూహకర్త. అతను విషయాలను వేరే విధంగా విశ్లేషిస్తాడు. తన అనుభవాన్ని పవర్ సాబ్తో పంచుకున్నారు. పవర్ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేకంగా బలమైన రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని పవర్ కోరుకుంటున్నారు. ఆ దిశగానే ఎన్సీపీ పనిచేస్తోంది’ అని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక నాయకులను తమ పార్టీలో చేరమని బీజేపీ నాయకులు బెదిరించారని అందుకే ప్రజలు బీజేపీని తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరారని, బెంగాల్లో టీఎంసీలో ఇంకా చేరాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీల జాబితా ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యూహరచయితగా వ్యవహరించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయనని ప్రశాంత్ తేల్చి చెప్పారు. చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024 -
'పాక్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి'
ముంబై : పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేసి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ భావిస్తే అందుకు తాము మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. కరాచీ భారత్‌లో భాగం అవుతుందన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఫడ్నవిస్ వ్యాఖ్యలపై స్పందించిన మాలిక్ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..'పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా భారత్‌లో విలీనం కావాలని మేం భావిస్తున్నాం. బెర్లిన్ గోడను పడగొట్టగలిగితే.. పాక్, బంగ్లాదేశ్ భారత్‌లో ఎందుకు విలీనం కావు? ఒకవేళ ఈ మూడింటిని కలిపి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ కోరుకుంటే దాన్ని మేము స్వాగతిస్తాం'అని పేర్కొన్నారు. (బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ) ముంబై మున్సిపల్ ఎన్నికల్లోనూ(బిఎంసి)ము శివసేనతో కలిసే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు మిగిలి ఉన్నాయని, ఆయా పార్టీలను పటిష్ఠం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. తాము కూడా తమ పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్నామని, శివసేన కోరుకుంటే కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. (ఐదేళ్లలో ఏం చేశారంటే లాక్డౌన్ విధించానని చెప్పాలా? ) -
జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం
ముంబై: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు అని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ‘మోదీ, అమిత్‌షాల గర్వాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచిపెట్టేశారు. ప్రజాస్వామ్యం గెలిచింద’ని ఆయన ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్, మనీష కయాండే (ఫైల్ ఫొటోలు) మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన బీజేపీపై ప్రజలకు విశ్వాసం సడలుతోందని శివసేన అధికార ప్రతినిధి మనీష కయాండే అభిప్రాయపడ్డారు. ‘వారు (బీజేపీ) అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తామని ప్రజలతో చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నార్సీ వంటి అంశాలను అందుకే తెర ముందుకు తీసుకొచ్చార’ని మనీష పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా బాగానే కష్టపడినప్పటికీ.. జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోయిందని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తాజా ట్రెండ్స్ ప్రకారం జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 24 స్థానాలతో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఏజేఎస్‌యూ 4, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 4 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది. (చదవండి: జార్ఖండ్ పీఠం మాదే..) -
‘మహా’ ట్విస్ట్; బీజేపీ ఖేల్ ఖతం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ఆట ముగిసిందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రంలోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని బీజేపీని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మాలిక్ స్పందించారు. ‘సత్యం గెలిచింది. బీజేపీ ఆట ముగిసింద’ని హిందీలో ట్వీట్ చేశారు. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగొచ్చారని అంతకుముందు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి సంతృప్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్విరాజ్ చవాన్ అన్నారు. రాజ్యాంగం దినోత్సవం నాడు రాజ్యాంగాన్ని గౌరవించే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కూటమి అసెంబ్లీలో బలం నిరూపించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అసలు రంగు రేపు బయట పడుతుందని అన్నారు. తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని, హోటల్లో కాదని బీజేపీ నాయకుడు రాంమాధవ్ వ్యాఖ్యానించారు. (చదవండి: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవర్ రాజీనామా) -
‘కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు’
ముంబై : తమకు 119 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం దారుణన్నారు. వారి మాటలు నిజమే అయితే గవర్నర్ అడిగినపుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమానికి అంగీకారం తెలిపిన శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు అప్పగించేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్, ఎన్సీపీ స్పీకర్, మండలి చైర్మన్ పదవులను పంచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్... స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తమకు మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సుముఖంగా ఉన్నారని.. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఇది సాధ్యమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై నవాబ్ మాలిక్ స్పందించారు. ‘ బీజేపీ నాయకులు ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లో ధైర్యం నింపే వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మా చేతిలో(ప్రభుత్వ ఏర్పాటు విషయమై) ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తించడం లేదు. అవును వాళ్లకి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ నిజాలను అంగీకరించకతప్పదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 105 సీట్లు సంపాదించుకున్న బీజేపీకి అయినా, మరే ఇతర పార్టీలకైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం కదా అంటూ ఎద్దేవా చేశారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
మహా ఉత్కంఠ : ఎన్సీపీ కీలక ప్రకటన
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, శివసేనలు ఎవరికి వారు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేస్తుండగా ఎన్సీపీ కీలక సంకేతాలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తామని ఎన్సీపీ సూచనప్రాయంగా వెల్లడించింది. బీజేపీ తోడ్పాటు లేకుండా ఛత్రపతి శివాజీ పేర్కొన్న తరహాలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకువస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అడుగులు వేస్తే ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాగా ప్రజలు తమకు విపక్ష స్ధానాన్ని కట్టబెట్టినందున, ఎన్సీపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన క్రమంలో నవాబ్ మాలిక్ ప్రకటన అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. నవంబర్ 7 నాటికి నూతన ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నేత సుధీర్ ముంగతివర్ ప్రకటన పట్ల మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము అనుమతించబోమని, రాష్ట్రానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో నూతన దిశను అందిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు సిద్ధమని, శివసేన ఇతర పార్టీలు దీనిపై తమ వైఖరిని వెల్లడించాలని కోరారు. -
హజారే ఆర్ఎస్ఎస్ ఏజెంట్: ఎన్సీపీ
ముంబై: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆర్ ఎస్ఎస్ ఏజెంట్ అని ఎన్సీపీ ఆరోపించింది. రూ. 25 వేల కోట్ల షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని హజారా బాంబే హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎన్సీపీ తప్పుబట్టింది. తమ పార్టీ నాయకుడు శరద్ పవార్ పై బురద చల్లేందుకు ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్రలో హజారే పావుగా మారారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను హజారే ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. షుగర్ కోపరేటివ్ ఫ్యాక్టరీస్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హజారే ఇటీవల హైకోర్టులో రెండు పిల్స్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరద్ పవార్, అజిత్ పవార్ సహా పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. -
స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ హవా
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుని కంగుతిన్న ఎన్సీపీ మూడు నెలల్లోనే ఊరట కలిగించే ఫలితాలను చవిచూసింది. రాష్ట్రంలోని పలు పురపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అనూహ్య రీతిలో వెలువడిన ఈ ఫలితాలు అధికార బీజేపీనికలవరపాటుకు గురిచేశాయి. అటు మున్సిపల్ కార్పొరేషన్, ఇటు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్సీపీ తన హవాను కొనసాగించింది. పుణే, పింప్రి-చించ్వడ్లో తన పట్టును నిలుపుకున్న ఎన్సీపీ, ఠాణే, ఉల్హాస్నగర్లలో ఖాతాలు తెరిచింది. మహానగర పాలక సంస్థల్లోని 14 స్థానాల్లో ఎన్సీపీ ఆరు గెలుచుకుంది. పలు మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిళ్లకు ఎన్నికలు, కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్లలో శివసేనకు నాలుగు, బీజేపీ, కాంగ్రెస్‌కు రెండు చొప్పున స్థానాలు లభించాయి. అదేవిధంగా నగరపాలక, పంచాయతీ సమితిల్లో మొత్తం 108 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎన్సీపీ 31 స్థానాలు దక్కించుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత బీజేపీకి 26, శివసేన 20, కాంగ్రెస్‌కు 19 స్థానాలు లభించాయి. వీటితోపాటు ఎన్సీపీ బరిలో దింపిన ముగ్గురు, మరో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఠాణే, మీరా-భయందర్‌లలో శివసేన, బీజేపీలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. నాందేడ్‌లో కాంగ్రెస్ తన స్థానాలను తిరిగి గెలుచుకుంది. బీజేపీకి గట్టిపట్టున్న జల్గావ్లో ఎన్సీపీ షాక్ ఇచ్చింది. ఇక్కడి 21 సీట్లలో ఎన్సీపీ 11 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీడ్‌లోని కేజ్ మున్సిపల్ కౌన్సిల్‌ను బీజేపీ నుంచి కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక్కడ 17 సీట్లకు గాను ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. ఈ ఫలితం బీడ్ జిల్లాకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కన్నన్ మున్సిపల్ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ, బీజేపీ-సేన ప్రభుత్వం తన వాగ్దానాలను నిలపుకోలేదని అన్నారు. టోల్ మాఫీ చేస్తామని, స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) రద్దు చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రావుసాహెబ్ దాణ్వే నిరాకరించారు. -
144 సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, ముంబై : ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే స్పష్టం చేశారు. సీట్ల పంపకాల అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయమై గురువారం ఎన్సీపీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్ల పంపకాల అంశంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ సమావేశంలో 144 సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే తదితర ప్రముఖులు పాల్గొని, తమ ప్రతిపాదనలు, డిమాండ్లను ఎన్సీపీ ముందుంచినట్లు చెప్పారు. ఈ విషయాలపై కాంగ్రెస్ మహారాష్ట్ర ఇంచార్జీ మోహన్‌ప్రకాష్ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్‌తో చర్చిస్తారు. వీరిద్దరి చర్చల అనంతరం మరో రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాల విషయంపై మళ్లీ సమావేశం జరగనుందని చెప్పారు. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సునీల్ తట్కరే తెలిపారు. మరోవైపు రమేష్ కదం ఎన్సీపీలో చేరికతో కోంకణ్‌లో ముఖ్యంగా చిప్లూన్‌లో ఉత్సాహమైన వాతవరణం నెలకొందన్నారు. ఇక రాణే విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఢిల్లీ మహారాష్ట్ర సదన్‌లోని సంఘటనపై మాత్రం రాష్ట్ర సంస్కతి, సాంప్రదాయలకు వ్యతిరేకమైన సంఘటనగా పేర్కొంటూ శివసేనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రజాసామ్య కూటమిలో జతకట్టనుందన్న విషయంపై ఇంత వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. -
‘పోలింగ్‌కు ముందే సరిచేసుకోవాల్సింది’
ముంబై: ఓటర్ల జాబితాలో కొందరి పేర్ల గల్లంతు విషయమై ప్రతిపక్షాల తీరును ఎన్సీపీ తప్పుబట్టింది. ఏమైనా పొరపాట్లు జరిగివుంటే వాటిని పోలింగ్‌కు ముందే సరిచేసుకోవాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముంబై, పుణేలలో పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటూ అనేక ఫిర్యాదులొచ్చాయన్నారు. మృతులతోపాటు తొలగింపునకు గురైన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పార్టీలకు సీడీల రూపంలో అందజేసిందన్నారు. అంతేకాకుండా బూత్‌స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని సవరించుకోవాలంటూ సూచిం చిందన్నారు. అయితే ఏ పార్టీ ఆ పని చేయలేదన్నారు. తొలగింపు, సవరణల తర్వాత తాజా జాబితాలను కూడా ప్రచురించిందన్నారు. అయితే ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం వచ్చే నెల 17వ తేదీ తర్వాత తమ తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని కోరుతూ ప్రజలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించిన తర్వాత కూడా వాటిని ఆయా పార్టీలు పట్టించుకోలేదని, సరిచూసుకోలేదని అన్నారు. ఆయా పార్టీలు తమ కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. -
ఏదీ నీ ‘పవార్’!
సాక్షి, ముంబై: ‘రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలను ప్రకృతి విపత్తు ఆగమాగం చేసింది. ఇలాంటి వీరికి మేమున్నామనే భరోసాను కలిగించే నాయకుడే కరువయ్యారు. బ్యాంక్ రుణాలు కూడా అన్నదాతలకు సకాలంలో అందడం లేదు. వీరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి చేజారిపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి చెందిన శరద్ పవార్ సమాధానం చెప్పాల’ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిని గద్దె దింపాలని వార్ధాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. తొలుత మరాఠీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్న మోడీ, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి’ జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. కానీ ప్రస్తుతం మనదేశంలో జవాన్లు (సైనికులు), రైతులు సురక్షితంగా లేరన్నారు. రైతులను గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం ఐదు శాతం రుణాలే రైతులకు అందుతున్నాయి. మిగతా 95 శాతం రుణాలను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఇస్తోంది. ఇలా వ్యవహరిస్తే రైతులు ఆత్మహత్యలు ఎలా తగ్గుతాయ’ని మోడీ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వచ్చిన అనంతరం రైతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని, సాగుతాగు నీటిపై ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులు రూపొందిస్తామని చెప్పారు. పత్తి రైతుల కోసం ‘ఫైవ్ ఎఫ్ ఫార్ములా’ రూపొందిస్తామన్నారు. ఈ సభలో బీజేపీ ప్రముఖ నాయకులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
బీజేపీతో పొత్తు ఎందుకు?
ముంబై: చిన్న రాష్ట్రాల విషయంలో శివసేన రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఎన్సీపీ ఆరోపించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బీజేపీతో ఆ పార్టీ పొత్తు ఎందుకంటూ నిలదీసింది. పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు పలికారన్నారు. ఒకవేళ ఉద్ధవ్ నిజంగానే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుదారుడైతే సమైక్య మహారాష్ట్రకు భిన్నంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక విదర్భకు మద్దతుగా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవిస్ ఆ ప్రాంతంలో ఇటీవల సైకిల్ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా నవాబ్ గుర్తుచేశారు. -
కంకణాలతో ఒరిగేదేమీ లేదు
సాక్షి, ముంబై: భవానీమాతకు పూజచేసి తీసుకొచ్చిన కంక ణాన్ని శివసైనికులకు పంపిణీ చేసినంత మాత్రాన ఒరిగేదేమీలేదంటూ శివసేనను పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎద్దేవా చేసింది. సైన్‌లోని సోమయ్య మైదానంలో గురువారం జరిగిన ప్రతిజ్ఞాదివస్ ర్యాలీలో శివసైనికులకు కంకణం పంపిణీచేసి ప్రతిజ్ఞ చేయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ శుక్రవారం ఉద్ధవ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్ర కోటపై కాంగ్రెస్ తరఫున ప్రధాని మన్మోహన్ సింగ్ జెండా ఎగరవేయడం, ప్రసంగించడం ఇదే చివరిసారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మరి పంద్రాగస్టు మినహా గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం ఉండదనే విషయం ఉద్ధవ్‌కు తెలియదా? అంటూ చురకలంటించారు. నరేంద్ర మోడీకి దగ్గరైన తరువాత ఉద్ధవ్ బుకాయించడం నేర్చుకున్నారంటూ విమర్శించారు. ‘బాల్‌ఠాక్రే జీవించి ఉన్న సమంయలో ఎక్కడో చేసిన ప్రసంగపు సీడీని ప్రదర్శించారు. ఆ తరువాత ఉద్ధవ్ స్వయంగా శివసైనికులచేత ప్రతిజ్ఞ చేయించారు. శివసైనికులపై ఆయనకు నమ్మకం లేదనే విషయం దీనినిబట్టి తేలిపోయింది. కొద్దిరోజులుగా అనేకమంది పదాధికారులు, కార్యకర్తలు పార్టీని విడిచి వెళుతున్నారు. వారికి శివ్బంధన్ పేరుతో కంకణం కట్టి పార్టీ నుంచి బయటపడకుండా ఉద్ధవ్ జాగ్రత్తపడుతున్నారు’ అని నవాబ్ అన్నారు. అలా చేస్తే అతుక్కుపోరు చేతి మణికట్టుకు దారం కట్టి ప్రతిజ్ఙ చేయించినంత మాత్రాన పార్టీకి కార్యకర్తలు అతుక్కుపోరంటూ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉద్ధవ్‌కు చురకలంచారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలు, పదాధికారులు, కార్యకర్తలు పార్టీలోనే కొనసాగేందుకు కంకణం కట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పవార్ సలహా ఇచ్చారు. బాల్‌ఠాక్రే సభలో లేకపోయినప్పటికీ ఆయన ప్రతిజ్ఞను సీడీ ద్వారా వినిపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఉద్ధవ్‌కు పార్టీపై పట్టులేదనే విషయం దీనినిబట్టి స్పష్టమైందన్నారు. -
రిజర్వేషన్లపై మీ వైఖరేంటి..
ముంబై: లౌకికత్వం, రిజర్వేషన్లపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్సీపీ ప్రశ్నించింది. బడుగువర్గాల సంక్షేమం కోసం అప్పటి కేంద్రమంత్రి అర్జున్‌సింగ్ ఐఐఎం, ఐఐటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించగా దాన్ని అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు చెందిన ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ ఫోరం’ విభేదిస్తోంది. కాగా, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పోటీచేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ‘మేం రిజర్వేషన్లపై స్పష్టంగా ఉన్నాం. మీ సంగతేంటి..’ అని ఆప్ నాయకులను ప్రశ్నించారు. అలాగే శివసేన దివంగత నాయకుడు బాల్‌ఠాక్రేకు రాజకీయాల్లో మహిళలు రాణించడం ససేమిరా ఇష్టం లేదన్నారు. ‘మహిళలు వంటగదులకే పరిమితమవ్వాలని ఠాక్రే పలు సభల్లో వ్యాఖ్యానించారు. మహిళల పాత్ర ముందు వంటగదికి.. తర్వాత పిల్లల క్షేమం చూసుకోవడానికే పరిమితమవ్వాలి అంటూ ఠాక్రే అనేవారిని.. అదే పద్ధతిని ఆ పార్టీ ఇప్పటికీ పాటిస్తోందని విమర్శించారు. తమకు అధికారమిస్తే రోడ్లు, ఫ్లైఓవర్లు, జాతీయ రహదారులపై టోల్‌ను రద్దుచేస్తామని బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ నేత నితిన్ గడ్కారీ రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు. ఆయా రహదారులపై టోల్ వసూలు ద్వారా పెట్టుబడులను వసూలు చేసుకోవాలని సూచించారు. దీన్ని అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం అంగీకరించింది. అలాంటిది ఇప్పుడు అధికారం కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు..’ అని ఆయన దుయ్యబట్టారు. -
మోడీ..చరిత్ర తెలుసుకో: ఎన్సీపీ
ముంబై: రాష్ట్ర చరిత్రపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఏ మాత్రం అవగాహన లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తూర్పారబట్టింది. 1960 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, మోడీ చెప్పినట్టుగా 26 మంది కాదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ)ను మోడీ తప్పుబట్టడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇది ఈ ఒక్క రాష్ట్రంలోనే అమలుచేయడం లేదని, వేరే రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి ఉందని తెలి పారు. రాష్ట్రం నుంచి ఉత్తర ప్రాంత రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసే భారీ వాహనాలు గుజరాత్ మీదుగానే వెళుతున్నాయని చెప్పారు. మోటారు వాహనాల పన్నును అత్యధికంగా వారే వసూలు చేస్తున్నారని మాలిక్ మండిపడ్డారు. గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చే వాహనాలు చాలా తక్కువ అని చెప్పారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు గేట్లు కూడా ఏర్పాటుచేయలేదన్న మోడీ ఆరోపణలను తప్పుబట్టారు. నిర్వాసితులకు ఇప్పటివరకు మధ్యప్రదేశ్ పునరావాసం కల్పించకపోవడంతో గేట్లు అంశం పెండింగ్‌లో ఉందన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు వజ్రాల వ్యాపారులు రూ.25 కోట్ల విరాళం ఇవ్వడంపై మాలిక్ మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ వాళ్లు లూటీ చేయడం ప్రారంభించారన్నారు. మోడీ ర్యాలీకి హాజరైన వారిలో ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చిన వారే ఉన్నారని తెలిపారు. మోడీ నినాదం ‘ఓట్ ఫర్ ఇండియా’ అయితే, తమది ఓట్ ఫర్ భారత్ అని చమత్కరించారు. వచ్చే ఎన్నికలు ఇండియా, భారత్‌ల మధ్య పోరుకు సాక్ష్యంగా నిలుస్తాయని తెలిపారు. -
రెండోరోజూ రభస
నాగపూర్: రెండోరోజు కూడా అదే దృశ్యం పునరావృతమైంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో అనేక పర్యాయాలు వాయిదాపడింది. చివరికి సభాపతి బుధవారానికి వాయిదా వేశారు. సభా కార్యకలాపా లు ప్రారంభమైన అనంతరం 48వ నిబంధన కింద సభకు వివరణ ఇచ్చేందుకు తొలుత పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే పైకి లేవగానే ప్రతిపక్ష సభ్యులు రాణేతోపాటు కళంకిత మంత్రులను పదవులను తప్పించాలంటూ నినదించడం ప్రారంభించారు. దీంతో సభ గంటపాటు వాయిదాపడింది. తిరిగి సభా కార్యకలాపాలు మొదలవగానే సభాపతి స్థానంలో ఆశీసునుడైన నవాబ్ మాలిక్... ఒకసభ్యుడు 48వ నిబంధనను వినియోగించుకుంటే మరో సభ్యుడు 22వ నిబంధనను వాడుకునేందుకు కుదరదంటూ ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సేను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే మాట్లాడుతూ జల్గావ్ పాల సహకార సంఘం అంశం అత్యంత పురాతనమైనదన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి నగ్రే పాటిల్ అనే భద్రతా అధికారిని తొలుత సస్పెండ్ చేశామని, ఆ తర్వాత కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడనే ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. 1995 నాటి ఈ ఆర్థిక అక్రమాల కేసులో తాను మోసగాడిన ని, దొంగనంటూ ఏక్‌నాథ్‌ఖడ్సే నిందించారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఖడ్సే తన మంత్రివర్గ సహచరుడని గుర్తుచేశారు. తనను ఇలా పిలవడమంటే అతనిని అతనే ఆవిధంగా పిలుచుకున్నట్టవుతుందన్నారు. కుంభ కోణంలో నిందితుడనే పదం ఖడ్సేకి కూడా వర్తిస్తుందన్నారు. అందువల్ల ఖడ్సే తనకు క్షమాపణ చెప్పాలని రాణే డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంతో బాగా విశ్వసించే లెఫ్టినెంట్లు ఆనందిబెన్ పటేల్, పురుషోత్తం సోలంకిలపై నేరాభియోగాలు నమోదయ్యాయని, అందువల్ల ఇక్కడి మంత్రుల గురించి ఖడ్సే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదన్నారు. చివరికి బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకుంటూ కెమెరాకి దొరికిపోయారన్నారు. అనంతరం అధికార ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపక్షంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా వెల్‌లోకి దూసుకుపోయాయి. బాబా సిద్ధిఖి, అమీన్ పటేల్, విజయ్ వడ్డెటివార్, వీరేంద్ర జగ్తాప్ (కాంగ్రెస్), జితేంద్ర అవాడ్లు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా సభలో గట్టిగా నినదించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులైన గిరీష్ మహాజన్, యోగేష్ సాగర్, తారాచంద్ సింగ్ (బీజేపీ), ఏక్నాథ్ ఖడ్సే (శివసేన) పోడియంపైకి ఎక్కారు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న నవాబ్‌మాలిక్ సభను మరో పది నిమిషాలపాటు వాయిదా వేశారు. మరలా సభాకార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో మరోసారి 30 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి మరోసారి సభ ప్రారంభం కాగానే సదాశివ్ పాటిల్ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు. ఆ తర్వాత పైకిలేచిన పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే 22వ నిబంధనను ప్రస్తావించడంద్వారా ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సేని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీనిని సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ సమర్థించారు. దీంతో అటు ప్రతిపక్షంతోపాటు ఇటు అధికార పక్ష సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకుపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన రోజంతా సభను వాయిదా వేశారు. -
క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యమేల ?
సాక్షి, ముంబై: అక్రమకట్టడాలను క్రమబద్ధీకరించే విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వైఖరీపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. నాగపూర్‌లో జరగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ముంబై, ఠాణే, పుణే, నాసిక్ ఇలా అనేక నగరాల్లోని మూడు కోట్ల ప్రజలకు మేలు జరిగే కట్టడాల క్రమబద్ధీకరణ అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత ప్రజలందరికీ న్యాయం చేయాలని, అందుకుగా అవసరమైతే చట్టంలో సవరణ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలు కోరడం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై ఎలాంటి వైఖరీ చెప్పకుండా దాటవేస్తున్నారని మాలిక్ ఆరోపించారు. ఇటీవలే పింప్రి-చించ్వాడ్, పుణేలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం నలుగురు ఎమ్మెల్యేలతోపాటు అనేక మంది ఎన్సీపీ కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎన్సీపీ హెచ్చరించింది. -
చవాన్ వల్లే ఎన్సీపీ పుంజుకుంది
సాక్షి, ముంబై: ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పుణ్యమా అని రాష్ట్రంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బలం పెరిగిందని ఆ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 ఏళ్లలో పనిచేసిన సీఎంలు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, అశోక్ చవాన్లతో పొల్చుకుంటే పృథ్వీరాజ్ చవాన్‌కు అత్తెసరు మార్కులే వస్తాయని ఎన్సీపీ భవన్లో గురువారం మీడియాకు తెలిపారు. ఏడాది జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్సీపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుందని, ఈ ఫలితాలే ఎవరి బలం ఎంతా అన్నది తెలియజేస్తుందని అన్నారు. కాంగ్రెస్ వల్లే ఎన్సీపీకి పుంజుకుందన్న ఆ పార్టీ నాయకుల మాటలను కొట్టిపారేశారు. ‘14 ఏళ్ల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా కల్పిస్తారు. ప్రజలకు మా మీదున్న నమ్మకంతో మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎన్సీపీ బలం పెరగాలంటే మళ్లీ చవాన్నే ముఖ్యమంత్రి చేస్తామ’ని మాలిక్ వ్యంగంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించిన ప్రముఖుల పురస్కారాలను తిరిగి తీసుకోవాలని (లతా మంగేష్కర్ పేరు ఉచ్చరించకుండా) ఇటీవల ముంబై రీజియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్థన్ చందూర్కర్ చేసిన వ్యాఖ్యలపై మాలిక్ స్పందించారు. అయన వైఖరి తమకి ఆమోదయోగ్యం కాదన్నారు. మిత్రపక్షమైనా ఇలా ఒకరి మనసు బాధపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. -
కాంగ్రెస్, బీజేపీ తలోమాట
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభ్యులపై అనర్హత వేటు పడకుండా చూసే ఉద్దేశంతో తెచ్చిన ఆర్డినెన్స్ అంశాన్ని ప్రభుత్వం ముగిసిన అధ్యాయంగా అభివర్ణించింది. ఆర్డినెన్స్‌పై రాహుల్ తన అభిప్రాయాలను బలంగా వినిపించారని, ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుందని గురువారం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు రాహుల్‌ను కాంగ్రెస్ తన కోర్ గ్రూప్‌లో చేర్చుకోవాలని యూపీఏ భాగస్వామ్య పార్టీ అయిన ఎన్సీపీ సలహా ఇచ్చింది. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే తగిన ఆలోచన చేయాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ఇదిలా ఉండగా, ఆర్డినెన్స్ అంశంలో యూపీఏ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. దోషులుగా తేలిన చట్టసభ్యులపై అనర్హత వేటు పడకుండా చూసేందుకు రూపొందించిన ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లుకు విపక్షం తొలుత మద్దతు పలికినట్లుగా యూపీఏ మంత్రులు ప్రచారం సాగిస్తున్నారని, అయితే, తాము తొలి నుంచీ దీని వ్యతిరేకంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆగస్టు 13న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఖరారు చేసి, పార్లమెంటు స్థాయీ సంఘానికి సిఫారసు చేయనున్నట్లుగా ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే, ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, ఈ అంశంపై రాజ్యాంగ సవరణ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారన్నారు.