ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబందనల కింది ఈ మేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది.
పరారీలో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో అక్రమమైన లావాదేవీలు ఉన్నయనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2022లోనే నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. 2021 అక్టోబర్‌లో ముంబయిలోని క్రూయిజ్ షిప్‌పై నార్కోటిక్ బ్యూరో మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాడి చేశారు. ఈ దాడిలో నవాబ్ మాలిక్ బంధువు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే మంత్రి నవాబ్ మాలిక్ అక్రమ లావాదేవీలు జరిపారనే కేసులో నిందితునిగా ఉన్నారు.
ఈ ఏడాది జులైలోనే ముంబయి కోర్టు ఆయన బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యంగా ఫిట్‌గానే ఉన్నారని పేర్కొంది. ఎలాంటి అనారోగ్యంతో బాధపడడంలేదని తెలిపింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్రమంగా దెబ్బతిన్నదని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో స్టేజ్2 నుంచి స్టేజ్ 3కి చేరుకున్నారని బెయిల్ ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం రెండు నెలల బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment