Granted
-
నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు..
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబందనల కింది ఈ మేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది. పరారీలో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో అక్రమమైన లావాదేవీలు ఉన్నయనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2022లోనే నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. 2021 అక్టోబర్‌లో ముంబయిలోని క్రూయిజ్ షిప్‌పై నార్కోటిక్ బ్యూరో మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాడి చేశారు. ఈ దాడిలో నవాబ్ మాలిక్ బంధువు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే మంత్రి నవాబ్ మాలిక్ అక్రమ లావాదేవీలు జరిపారనే కేసులో నిందితునిగా ఉన్నారు. ఈ ఏడాది జులైలోనే ముంబయి కోర్టు ఆయన బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యంగా ఫిట్‌గానే ఉన్నారని పేర్కొంది. ఎలాంటి అనారోగ్యంతో బాధపడడంలేదని తెలిపింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్రమంగా దెబ్బతిన్నదని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో స్టేజ్2 నుంచి స్టేజ్ 3కి చేరుకున్నారని బెయిల్ ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం రెండు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
Defamation Case: రాహుల్‌కి పరువు నష్టం కేసులో ఉపశమనం!
ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్‌కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్కి ముడిపెడుతూ.. రాహుల్ పలు ఆరోపణలు చేశారు. దీంతో థానే జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్‌పై రాజేష్ కుంతే అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్‌లో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ తేదీల్లో రాహుల్ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్‌ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. (చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్ గాంధీ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి) -
రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతం కేసులో దోషిలా తేలిన ఏజీ పెరారివాలన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుచేసింది. పెరారివాలన్‌కు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే, గత 30 సంవత్సరాలుగా ఆయన జైల్లో మగ్గిపోయారని, పెరోల్ కాలంలోనూ సత్ప్రవర్తనతో మెలిగాడని బెయిల్ ఉత్తర్వుల మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎండీఎంఏ కేసు పూర్తయ్యేదాకా తన జీవితకాల శిక్షను రద్దు చేయాలంటూ 47 ఏళ్ల పెరారివాలన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1991 మే 21న రాజీవ్‌గాంధీని మహిళా ఆత్మాహుతి బాంబర్ ధను హత్యచేయడం తెల్సిందే. ఈ ఘటనలో ప్రమేయమున్న మురుగన్, సంథమ్, నళినిలతోపాటు పెరారివాలన్‌లకు ఉరిశిక్ష పడింది. అయితే శంథన్, మురుగన్, పెరారివాలన్‌ల క్షమాభిక్ష పిటిషన్లు 11 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉండటంతో 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు పెరారివాలన్ ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. (చదవండి: ‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం) -
ఏడు నిమిషాల్లో రేషన్ కార్డు!
బల్లికురవ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ గ్రామాల్లోని లబ్ధిదారులకు భరోసానిస్తోంది. రేషన్‌కార్డు కోసం మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలోని సూరేపల్లి గ్రామంలోని ఓ దివ్యాంగ కుటుంబం గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో అనేకసార్లు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలో కార్డు మంజూరుకు మోకాలడ్డారు. దీంతో విసిగి వేసారిన ఆ కుటుంబం సోమవారం గ్రామ వలంటీర్‌కు రేషన్‌కార్డు లేదని చెప్పిన 7 నిమిషాల్లోనే తక్షణమే మంజూరు చేయడంతో పాటు కార్డు అందజేశారు. వివరాల్లోకి వెళితే.. సూరేపల్లి గ్రామానికి చెందిన తోరటి వినోద్ కుమార్‌కు పుట్టుకతోనే పోలియో సోకింది. ఏ పనీ చేయలేడు. 2014లో గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మరో దివ్యాంగురాలు రాహేలును వివాహం చేసుకున్నాడు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్న అక్కసుతో జన్మభూమి కమిటీ తమకు కార్డు రాకుండా అడ్డుకున్నారని వినోద్ కుమార్, రాహేలు వాపోయారు. గ్రామ వలంటీర్ మార్కు తమ ఇంటికి రాగా కార్డు లేదని చెప్పగా వెంటే సచివాలయానికి తీసుకువెళ్లి 10.50 గంటలకు దరఖాస్తు చేయించగా 7 నిమిషాల్లోనే వీఆర్వో వీరనారాయణ, తహసీల్దార్ అశోక్ వర్ధన్ మంజూరు చేయటంతో వెంటనే ప్రింట్ తీసి లబ్ధిదారు రాహేలుకు అందజేశారు. సీఎం, అధికారులకు రుణపడి ఉంటా : తోరటి రాహేలు 5 సంవత్సరాల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి.. చివరకు మాకు రాదని విసిగిపోయాం. వలంటీర్ మార్కు మా ఇంటికి వచ్చి మీకు కార్డు వెంటనే ఇప్పిస్తామని చెప్పి 7 నిమిషాల్లోనే అందజేయటం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, అధికారులకు, వలంటీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. రేషన్‌కార్డు లేక ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందలేదు. -
అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు
అనంతపురం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అథితి గృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014కు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.70 వేలు ఉండేదన్నారు. ఆ మొత్తం సరిపోక 2 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి లబ్ధిదారులకు అదనంగా రూ.25 వేలు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన జీఓ 64ను విడుదల చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని 27,197 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్లు నిర్మించుకునే వారికి యూనిట్‌కు రూ.1.50 లక్ష మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీ, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
విద్యావలంటీర్ల వేతనాలు విడుదల
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వేతనాల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 467 మంది విద్యావలంటీర్ల వేతనాలకు సంబంధించి రూ.89లక్షలు విడుదలయ్యాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో విద్యావలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ల్యాప్స్ చేసిన ఎంఈఓలు ఆయా నెలలతో పాటు జూన్ నెల వేతనాలు అందజేయాలని, అప్పట్లో ఇచ్చిన వారికి కేవలం జూన్ వేతనం చెల్లించాలని ఆయన సూచించారు. ఒక్కో విద్యావలంటీర్‌కు రూ.8వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు. -
కలెక్టర్ ఆగ్రహం
–నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తప్పించండి – బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా మార్చాలి –కలెక్టర్ యోగితారాణా డిచ్పల్లి : నిజామాబాద్‌ను బహిరంగ మల విసర్జన (ఓడీఎఫ్) లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి రూ. 60 కోట్ల నిధులు మంజూరు చేసినా ఫలితం రావడం లేదని సంబంధిత అధికారులపై కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డిచ్పల్లి ట్రైజం ట్రైనింగ్ సెంటర్లో జిల్లాలోని ఓడీఎఫ్‌కు సంబంధించిన అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రజలు తమవంతుగా రూ. 900 చెల్లించేలా అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేయాలన్నారు. ఐకేపీ సభ్యులు మరుగుదొడ్లు నిర్మించుకుని వాడిన వారికి శిక్షణ ఇప్పించి ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛభారత్ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అయినా సంబంధిత అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడంలో అశ్రద్ధ వహించడం శోచనీయమని కలెక్టర్ యోగితారాణా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని, అందుకు రాత్రి బసలు నిర్వహించైనా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా 32 శాతంతో నిజామాబాద్ జిల్లా చివరగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. 8 నెలలుగా పనులు చేయాలని చెప్పినా అధికారులలో చలనం లేకపోవడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఓడీఎఫ్‌గా జిల్లాలో బీర్కూర్, నందిపేట్, వేల్పూర్‌లలో నిర్మిచిన మరుగుదొడ్లు చాలా బాగున్నాయన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకరించని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తప్పించాలని జెడ్పీ సీఈవోకు సూచించారు. స్వచ్ఛభారత్ రాష్ట్ర సంచాలకులు రామ్మోహన్రావు మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఎలాంటి కష్టం లేదని, శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నట్లయితే కాని పని ఉండదని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు యాదిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నగేశ్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏపీవోలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజ్‌కి డీఎన్బీ పోస్టులు
నిజామాబాద్‌అర్బన్ :ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఎట్టకేలకు డీఎన్బీ(డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డు) పోస్టులు మంజూరయ్యాయి. కళాశాల ఏర్పడిన ఏడాదిలోనే డిప్లొమా పోస్టులకు అనుమతి లభించింది. అనంతరం డీఎన్బీ కోర్సులకు సంబంధించి ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండుసార్లు కళాశాలకు వచ్చి, విభాగాల వారీగా వసతులను పరిశీలించిన అనంతరం పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌లో మాత్రమే డీఎన్బీ పోస్టులను కేటాయించారు. దీని ద్వారా వైద్యులు ఆయా విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేషన్, పోస్టు డిప్లొమా కొనసాగిస్తారు. జనరల్ మెడిసిన్ పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –4, జనరల్ సర్జరీ పోస్టు గ్రాడ్యుయేషన్–2, గైనిక్ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –6, మత్తుమందు విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌కు –6 సీట్లు కేటాయించారు. రూ. 8 లక్షల ఉపకార వేతనంగా ఇవ్వనున్నారు. గతంలో చిన్నపిల్లల విభాగంలో రెండు సీట్లను కేటాయించారు. ప్రస్తుతం 18 సీట్లతో మొత్తం 20 డీఎన్బీ పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి 40 మంది సీనియర్ రెసిడెన్సియల్ వైద్యులను కేటాయించారు. వీరికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర గురువారం విధులను కేటాయించారు. అన్ని విభాగాలకు సంబంధించి సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులు అందుబాటులో ఉన్నారు. వీరు స్థానికంగా ఉండి వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. -
గీత కార్మికుల కమిటీ హాల్‌కు రూ.30లక్షలు
ధన్వాడ : గీత కార్మికుల కమిటీ హల్ కోసం నిధులు కేటాయించాలని మంత్రి పద్మరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయాని స్థానిక ఎమ్మెల్వేను ఒప్పించి ఏసీడీఎఫ్ నిధుల కింద రూ.30 లక్షలు మంజూరు చేయించారు. అనంతరం మంత్రులను, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ కవిత, సర్పంచ్ ఇందిర, గీతకార్మికులు గోవర్దన్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సురెందర్‌గౌడ్, నారాయణగౌడ్, పాండురంగాగౌడ్, చంద్రయ్యగౌడ్‌లు పాల్గొన్నారు. నాయకులు బుచ్చప్ప, రాజ్‌యాదవ్, రాజెందర్‌రెడ్డి, గౌనిశ్రీను, పాల్గొన్నారు. -
మూడో‘సారీ సగమే’..!
♦ రుణమాఫీలో జిల్లాకు రావాల్సింది రూ.409 కోట్లు.. ♦ మంజూరు అయింది రూ.204.50 కోట్లు ♦ ఒకేసారి మాఫీ చేయాలంటున్న రైతులు ♦ పట్టించుకోని ప్రభుత్వం ‘విడతలవారీ’తో ఇబ్బంది.. బ్యాంకు నుంచి నేను గతంలో రూ.90వేలు అప్పు తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పటికీ రెండుసార్లు మాత్రమే రుణమాఫీ వచ్చింది. మొదటి విడతలో రూ.27,500 రుణమాఫీ వచ్చింది. రెండోసారి వడ్డీ పోగా.. రూ.22వేలు ఇచ్చారు. తర్వాత వడ్డీ డబ్బులు బ్యాంకులో పడ్డాయన్నారు. అవి వచ్చాయో రాలేదో తెలియదు. విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండెకరాల్లో పత్తి పంట, మూడెకరాల్లో పెసర పంట సాగు చేశా. విడతలవారీగా రుణమాఫీ ఇవ్వడంతో రైతులకు అప్పు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి లేకుండాపోతుంది. ప్రభుత్వం మిగిలిన రెండు విడతల రుణమాఫీని చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలి. - తోట శ్రీను, రైతు, బచ్చోడు, తిరుమలాయపాలెం మండలం సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం చెప్పేదానికి.. చేసేదానికి పొంతన ఉండటం లేదు. రుణమాఫీని ఏటా విడతలవారీగా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. సగానికి కోత పెడుతోంది. మూడో విడత మంజూరులోనూ సగం మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడతలో జిల్లాకు రూ.409కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఇప్పుడు 204.50కోట్లు మాత్రమే మంజూరవుతున్నాయి. రుణమాఫీ ఒకేసారి చేస్తే బాగుంటుందని రైతుల నుంచి డిమాండ్ వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో రుణమాఫీ కింద 3.80లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. విడతలవారీగా రూ.1711కోట్లు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.409కోట్ల చొప్పున విడతలవారీగా ఈ మొత్తం అంతా విడుదల చేయాలి. కానీ.. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.818కోట్లు మంజూరు చేసింది. మూడో విడతలో రూ.409కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇందులో సగానికి ప్రభుత్వం కోత పెట్టింది. దీంతో ఈ ఏడాది మూడో విడతలో రూ.204.50కోట్లు మాత్రమే రుణమాఫీ కానుంది. ప్రభుత్వం మంజూరు చేసినట్లు ప్రకటిస్తున్నా.. రైతులకు రుణాలు మాఫీ కావడానికి ఏడాది పడుతోంది. రుణమాఫీ డబ్బులకు కూడా బ్యాంకుల్లో వడ్డీ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఏకమొత్తంలో ఒకేసారి ప్రభుత్వం మంజూరు చేస్తే వడ్డీ తక్కువ పడుతుందని, ఇలా విడతలవారీగా చేయడం వల్ల వడ్డీనే రూ.వేల చొప్పున చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి బ్యాంకర్లు రుణాల లక్ష్యం నిర్దేశించినట్లు పేర్కొంటున్నా.. రైతులు మాత్రం రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్, రబీకి రూ.2,600కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు రుణాల మంజూరులో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ కాకపోవడం, సీజన్‌కు తగ్గట్లుగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. మూడోసారి రుణమాఫీలో కూడా సగమే ఇవ్వడంతో దీనికి వడ్డీనే వేలకు వేలు పోతుందని, మళ్లీ ఇందులో మొత్తం ఎప్పుడు విడుదలవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇంకా కావాల్సింది రూ.688.50 కోట్లు రుణమాఫీలో భాగంగా రూ.1711కోట్లలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,022.50కోట్లు విడతలవారీగా మంజూరు చేసింది. ఇంకా రూ.688.50కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఇవి ఇచ్చే మొత్తంలోనూ సగం ఇస్తే వడ్డీకే పోతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి జిల్లాకు రూ.409కోట్లు వస్తాయని భావించినా.. ఇందులోనూ సగం కోత పెట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే బ్యాంకులు వడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉండదని రైతులు పేర్కొంటున్నారు. వడ్డీ వసూలు చేస్తున్నరు.. రూ.లక్షలోపు రుణం పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వెంటనే మాట మార్చి విడతలవారీగా రుణమాఫీ అనడంతో.. బ్యాంకోళ్లు మిగిలిన రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి. నాకున్న మూడెకరాలకు బ్యాంకులో రూ.60వేలు పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ పథకం వర్తింపజేయడంతో.. మొదటి, రెండో దఫాగా రూ.30వేలు మాఫీ చేసింది. రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోవడంతో.. మిగిలిన రుణానికి బ్యాంకోళ్లు ఏడాది వడ్డీ వేశారు. ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. బ్యాంకోళ్లు వడ్డీ చెల్లించాల్సిందేనని, మిగిలిన రుణ పైకానికి రెన్యూవల్ చేసుకోవాలని ఒత్తిడి తె స్తున్నారు. - ఇమ్మడి వెంకటేశ్వర్లు, కారేపల్లి -
హాలీవుడ్ హీరోపై గృహహింస ఆరోపణలు
కాలిఫోర్నియా: మూడేళ్లు ప్రేమించుకుని అట్టహాసంగా పెళ్లి చేసుకున్న హాలీవుడ్ జంట కాపురం మూడ్నాళ్ల ముచ్చటే అయింది. దాదాపు పెళ్లైన 15 నెలలకే పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సూపర్ హిట్ సిరీస్ హీరో జానీ డెప్ (52) యాంబర్ హార్డ్ (30) జంట రచ్చకెక్కింది. గత సోమవారం భర్తపై యాంబర్ గృహహింస ఆరోపణలు చేయడంతో, తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయని తెలపడంతో .. వీరి విడాకులకు స్థానిక కోర్టు అంగీకారం తెలిపింది. ఈ వ్యవహారంలో కోర్టు ముందు హాజరైన యాంబర్ ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలను సాక్ష్యాలుగా తాజాగా లాస్ ఏంజెల్స్ లోని సుపీరియర్ కోర్టుకు సమర్పించింది. శనివారం ఈ సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఆమె నివాసానికి 100 అడుగులు దూరంలో ఉండాలంటూ జానీ డెప్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆమె ఈ వివాదంలో తొలిసారి మీడియాతో ముందు నోరు విప్పింది. పెళ్లయిన దగ్గర్నించీ, తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని అంబర్ వాపోయింది. బాగా మద్యం సేవించి తనపై దాడిచేసేవాడని.. నిత్యం భయంతో బిక్కచచ్చిపోతూ బతికేదాన్నని తెలిపింది. కన్నీంటిపర్యంతమైంది విపరీతంగా మద్యం సేవించి.. తనపై చేయి చేసుకున్నాడని.. జుట్టుపట్టిలాడి ఈడ్చేశాడనీ, మొఖంపై కొట్టాడని ఆరోపించింది. అయితే భార్య ఆరోపణలను కొట్టి పారేసిన డెప్ లాయర్ కోర్టు ముందు కౌంటర్ వాదనలు దాఖలు చేశాడు. డబ్బుకోసమే ఆ ఆరోపణలు చేస్తోందని విమర్శించాడు. కాగా హాలీవుడ్ స్టార్ జానీ డెప్ అంబర్ హార్డ్ ను పెళ్లాడి సంవత్సరంన్నర తిరగకుండానే విడాకులు తీసేసుకుని వార్తలకెక్కారు. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ లో కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో విభిన్న శైలిలో నటించి మెప్పించిన డెప్, హార్డ్ ను ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు. 2011లో ద రమ్ డైరీ సినిమాలో కలిసి నటించిన డెప్ హార్డ్‌కు దగ్గరయ్యాడు. మూడు సంవత్సరాలుపాటు ప్రేమించుని రహస్యంగా ఈ హాలీవుడ్ ప్రేమపక్షులు ఫిబ్రవరి 2015 లో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్. కాగా డెప్ హాలీవుడ్ మూవీ షూటింగ్ నిమిత్తం పోర్చుగల్ లో ఉన్నట్టు సమాచారం. -
రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లు
మంజూరు చేసిన కేంద్రం 45 పట్టణాలు, నగరాలు ఎంపిక ఇళ్ల నిర్మాణానికి రూ. 342 కోట్ల మేర ఆర్థిక సాయం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ తెలంగాణ రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లను మంజూరు చేసింది. తెలంగాణలోని 45 పట్టణాలు, నగరాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)లో భాగంగా అఫర్డబుల్ హౌజింగ్ ఇన్ పార్ట్నర్షిప్ (ఏహెచ్‌పీ)’ విధానంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మొత్తం రూ. 1,397 కోట్లు ఖర్చుకానుండగా ఇందులో కేంద్రం రూ. 342 కోట్లను (ఒక్కో ఇంటికి రూ. లక్షన్నర చొప్పున) ఆర్థిక సాయంగా అందించనుంది. తెలంగాణ గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దానకిశోర్ గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలను వివరించారు. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సమకూరుస్తుందని, కేంద్రం వాటా పోను మిగిలిన నిర్మాణ వ్యయం కూడా భరిస్తుందని వివరించారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 7 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరం ఉందని, ఇతర నగరాలు, పట్టణాల్లో దాదాపు 6 లక్షల ఇళ్ల నిర్మాణం అవసర మవుతుందని వివరించారు. తొలుత తెలంగాణకు కేవలం 10,290 ఇళ్లు మాత్రమే కేటాయించారన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని ఇళ్లను మంజూరు చేయడంతోపాటు పథకాన్ని మరిన్ని పట్టణాలకు వర్తింపజేయాలని కోరుతూ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ...కేంద్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం డిసెంబర్ 21న రాష్ట్రానికి దాదాపు 47 వేల ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంమీద తొలి రెండు విడతల్లో తెలంగాణకు 57,664 ఇళ్లను మంజూరు చేసింది. తాజాగా వీటికితోడుగా మరో 22,817 ఇళ్లు మంజూరవడంతో ఇళ్ల సంఖ్య 80,481కు చేరుకోగా ఆర్థిక సాయం రూ. 1,207 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా ఇళ్లు మంజూరైన 45 నగరాలు/పట్టణాల జాబితాలో హైదరాబాద్ (1,585 ఇళ్లు), కామారెడ్డి (1,367), నిజామాబాద్ (1,367), ఖమ్మం (1,352), గజ్వేల్ (1,033), వరంగల్ (1,008 ఇళ్లు) ఉన్నాయి. -
జోడేఘాట్‌లో ప్రపంచస్థాయి మ్యూజియం
-
బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి స్థలం కేటాయించాలి
కొరిటెపాడు : బీఎస్ఎన్ఎల్ ఎ.పి సర్కిల్ నూతన కార్యాలయం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం మంజూరు చేయడానికి కృషి చేయాలని బీఎస్ఎన్ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు విజ్ఞప్తి చేశారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోసం కృషి చేయాలని కోరుతూ స్థానిక లక్ష్మీపురంలోని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు కార్యాలయంలో ఎం.ఎల్.ఎన్.రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక రాష్ట్రం అయిన నేపథ్యంలో రాష్ట్రంలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి కార్యాలయం ఏర్పాటుకు అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం అవసరం వుందని స్థలం మంజూరుకు ప్రభుత్వంతో మాట్లాడి కేటాయించేలా చూడాలని కోరారు. స్పందించినఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ సీఆర్డీఎ మాస్టర్ ప్లాన్ వచ్చిన అనంతరం ప్రభుత్వ కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి బీఎస్ఎన్ఎల్ ఎ.పి సర్కిల్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రాయపాటిని కలసిన వారిలో బీఎస్ఎన్ఎల్ డీజీఎం ఎ.ప్రభాకర్ తదితరులున్నారు. -
పెన్షన్... టెన్షన్...
-
పెన్షన్... టెన్షన్...
మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ బ్యాంకుల్లో జమకాని నగదు మంత్రుల కోసం మరి కొన్ని చోట్ల వాయిదా లబ్ధిదారుల పడిగాపులు సిటీబ్యూరో: నగరంలో బుధవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. అనేక ప్రాంతాల్లో విచారణ పూర్తి కాకపోవడం... అందరికీ మంజూరు కాకపోవడం... ప్రజల నిరసనలతో ఈ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. రోజంతా ఎదురు చూసి విసిగి వేసారిన లబ్ధిదారులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. గ్రేటర్‌లోని మారేడుపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాలు, ఎల్బీనగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. మారేడుపల్లి, ముషీరాబాద్‌లకు సంబంధించి బ్యాంకుల్లో సంబంధిత మొత్తం జమ కాకపోవటంతో పంపిణీ చేయలేదు. సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 10 నుంచి రెండు నెలల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో గ్రేటర్‌లోని పింఛన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి ఎదురు చూశారు. అధికారులు రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ఆగ్రవేశాలు వ్యక్తంచేశారు. కొన్ని కేంద్రాలలోనైతే నిరసనలకు దిగారు. ఈ పరిస్థితి సమూర్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 చోట్ల పంపిణీ చేయలేదు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో త హశీల్దారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా.. శివారు ప్రాంతాల బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. అయితే వారు దిల్షుక్నగర్ మినహాయించి ఎక్కడా పంపిణీ చేయలేదు. నగరంలో 7,900 మందికి... నగరంలో బుధవారం 7,900 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో 6,900 మందికి... శివారు ప్రాంతాల్లో వెయ్యి మందికి అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పింఛన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు. షేక్‌పేట మండల పరిధిలో బుధవారం మూడు చోట్ల అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ 800 మందికి వీటిని అందజేశారు. బహదూర్‌పురా మండలంలో అత్యధికంగా పంపిణీచేసినట్లు తెలుస్తుంది. అమీర్‌పేట, అంబర్‌పేట, చార్మినార్, పాతబస్తీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్ జిల్లాలో దీన్ని కలెక్టర్ ముఖేష్‌కుమార్ పర్యవేక్షించారు. ఎన్ని వింతలో... ఆసరా కార్డుల్లో వింతలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని కొంపల్లిలో ఇద్దరు వితంతువులకు జారీ చేసిన ఆసరా కార్డులపై యువకుడు, పాఠశాల విద్యార్థినిల ఫొటోలు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. గుడిపల్లి ప్రమీల(38) కార్డుపై యువకుడి ఫొటో దర్శనమివ్వగా.... బాలోని నీరజ(33) కార్డుపై చిన్నారి ఫోటో ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ కె.అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా... అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఎవరిదో ఒక ఆధార్ నెంబరు ఇస్తే నోట్ చేసుకుని వచ్చి కంప్యూటర్లో పొందుపరిచారని తెలిపారు. ఈక్రమంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఉప్పల్‌లో సర్కిల్లోని వెంకట్‌రెడ్డి నగర్, రామాం తానపూర్లకు చెందిన వికలాంగులు ఉపేంద్ర (59), జి.మాణిక్యం(44)లకు జారీ చేసిన ఆసరా కార్డుైలపై ‘వితంతువు’గా ముద్రించారు. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఒ క్కో కార్డును పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. -
గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం!