హాలీవుడ్ హీరోపై గృహహింస ఆరోపణలు | Amber Heard granted restraining order against Johnny Depp | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హీరోపై గృహహింస ఆరోపణలు

Published Sat, May 28 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

హాలీవుడ్ హీరోపై గృహహింస ఆరోపణలు

హాలీవుడ్ హీరోపై గృహహింస ఆరోపణలు

కాలిఫోర్నియా: మూడేళ్లు  ప్రేమించుకుని అట్టహాసంగా పెళ్లి చేసుకున్న హాలీవుడ్ జంట కాపురం మూడ్నాళ్ల ముచ్చటే అయింది.   దాదాపు  పెళ్లైన 15 నెలలకే   పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' సూపర్ హిట్ సిరీస్  హీరో జానీ డెప్ (52) యాంబర్ హార్డ్‌  (30) జంట  రచ్చకెక్కింది.  గత సోమవారం భర్తపై  యాంబర్ గృహహింస ఆరోపణలు  చేయడంతో, తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయని తెలపడంతో ..  వీరి విడాకులకు స్థానిక కోర్టు అంగీకారం తెలిపింది.  ఈ వ్యవహారంలో కోర్టు ముందు హాజరైన యాంబర్  ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలను సాక్ష్యాలుగా  తాజాగా లాస్ ఏంజెల్స్ లోని సుపీరియర్   కోర్టుకు సమర్పించింది.  శనివారం ఈ సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఆమె నివాసానికి 100  అడుగులు దూరంలో  ఉండాలంటూ జానీ డెప్ కు   కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అనంతరం ఆమె  ఈ వివాదంలో తొలిసారి మీడియాతో ముందు నోరు విప్పింది.  పెళ్లయిన దగ్గర్నించీ, తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని అంబర్  వాపోయింది.  బాగా మద్యం సేవించి తనపై దాడిచేసేవాడని.. నిత్యం భయంతో బిక్కచచ్చిపోతూ బతికేదాన్నని తెలిపింది.  కన్నీంటిపర్యంతమైంది విపరీతంగా మద్యం సేవించి.. తనపై చేయి చేసుకున్నాడని.. జుట్టుపట్టిలాడి ఈడ్చేశాడనీ, మొఖంపై  కొట్టాడని ఆరోపించింది. అయితే  భార్య ఆరోపణలను కొట్టి పారేసిన డెప్  లాయర్ కోర్టు ముందు కౌంటర్ వాదనలు దాఖలు చేశాడు. డబ్బుకోసమే ఆ ఆరోపణలు చేస్తోందని విమర్శించాడు. 

కాగా  హాలీవుడ్ స్టార్ జానీ డెప్ అంబర్ హార్డ్ ను పెళ్లాడి సంవత్సరంన్నర తిరగకుండానే విడాకులు తీసేసుకుని వార్తలకెక్కారు.  పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ లో కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో విభిన్న శైలిలో నటించి మెప్పించిన  డెప్, హార్డ్ ను  ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు.  2011లో ద రమ్ డైరీ సినిమాలో కలిసి నటించిన   డెప్ హార్డ్‌కు దగ్గరయ్యాడు. మూడు సంవత్సరాలుపాటు ప్రేమించుని రహస్యంగా ఈ  హాలీవుడ్ ప్రేమపక్షులు  ఫిబ్రవరి 2015 లో ఒక్కటయ్యారు. అయితే  వీరి పెళ్లి అప్పట్లో   హాట్ టాపిక్. కాగా డెప్  హాలీవుడ్ మూవీ షూటింగ్  నిమిత్తం  పోర్చుగల్ లో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement