కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment