termination
-
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్‌కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్‌ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఓ ఇరవై ఏళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకునేందుకు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం(మే15) కీలక తీర్పిచ్చింది. తన గర్భం తొలగించుకునేందుకు అనుమతివ్వాలని యువతి చేసిన విజ్ఞప్తిని గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో యువతి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ‘సారీ ఈ విషయంలో మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని తెలిపింది. యువతి తరపు న్యాయవాదికి సుప్రీం ప్రశ్నలివీ... గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కుంది. దీనికి మీరేమంటారు’ అని యువతి తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కేవలం తల్లి గురించే చెబుతోందని యువతి న్యాయవాది సమాధానమిచ్చారు.బెంచ్ తిరిగి స్పందిస్తూ ‘ఇప్పుడు గర్భం 7 నెలలు దాటింది. గర్భస్త శిశువుకు ఉన్న బతికే హక్కుపై మీరేం చెప్తారో చెప్పండి’ అని బెంచ్ మళ్లీ న్యాయవాదిని అడిగింది. ‘శిశువు జన్మించేదాకా అది తల్లి హక్కే తప్ప శిశువుకు ప్రత్యేక హక్కులేవీ ఉండవు.యువతి మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఆమె ప్రస్తుతం నీట్ పరీక్ష క్లాసులు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సమాజానికి ముఖం చూపించలేరు. యువతి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి’అని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి బెంచ్ స్పందిస్తూ ‘సారీ’అని సమాధానమిచ్చింది. యువతి, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఇప్పటికే సర్టిఫై చేసింది. కాగా, 24 వారాలు దాటిన గర్భం తీయించుకోవాలంటే తల్లికి, శిశువుకుగాని ఆరోగ్యపరంగా ఏదైనా హాని ఉంటేనే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద అనుమతిస్తారు. -
జీ–సోనీ విలీన డీల్ రద్దు!!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్, సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్‌కు తెర తీసినందుకు గాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ‘సోనీ గ్రూప్ కార్పొరేషన్లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్) సంస్థ .. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్‌టైమ్ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెపె్టంబర్ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది. ఇదీ జరిగింది.. ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్ సరీ్వసులు, రెండు ఫిలిమ్ స్టూడియోలతో భార త్లో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్‌లైన్‌లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేంటి.. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దు అయిన నేపథ్యంలో జీల్‌కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్‌తో జీల్‌కి ఒప్పందం ఉంది. దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్‌కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్‌లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
మైనర్‌కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్‌కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..!
సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూసీ బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన తప్పదని స్విస్ వారపత్రిక ‘హ్యాండెల్స్ జూటింగ్’ తాజాగా తెలిపింది. ఈ క్రెడిట్ సూసీ బ్యాంకును స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంక్ యూబీఎస్ టేకోవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల విలీనాన్ని యూబీఎస్ ప్రారంభించిందని, క్రెడిట్ సూసీలోని వేలాది మంది ఉద్యోగులు త్వరలో తొలగింపు నోటీసులు అందుకోనున్నారని ఆ పత్రిక పేర్కొంది. క్రెడిట్ సూసీ బ్యాంకును 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి గత మార్చి నెలలో యూబీఎస్ అంగీకరించింది. ఇక అప్పటి నుంచి దీని ప్రభావం ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. విలీనం అనంతరం క్రెడిట్సూసీలోని చాలామంది ఉద్యోగులను తొలగించే యోచనలో యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఉన్నట్లు సదరు స్విస్ పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ సూసీకి చెందిన 30,000 నుంచి 35,000 ఉద్యోగాల కోత ఉంటుందని స్విస్ మీడియా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: Credit Suisse Layoffs 2023: 35,000 ఉద్యోగాలు కట్! సంక్షోభంలో చిక్కుకున్న స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు.. గత సంవత్సరం చివరి నాటికి యూబీఎస్, క్రెడిట్ సూసీ బ్యాంకుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లోనే పనిచేస్తున్నారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి యూబీఎస్ నిరాకరించింది. -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
వ్యాక్సిన్ మస్ట్.. లేదంటే జాబ్‌కే ఎసరు?
ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను ఇంకొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఆఫీసులకు వచ్చినా.. హైబ్రిడ్ వర్క్‌లో కొనసాగినా.. వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నా సరే వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని కండిషన్లు పెడుతున్నాయి కంపెనీలు. లేకుంటే ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి. ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ ఇన్కార్పొరేటెడ్, ఎంప్లాయిస్‌కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కంపెనీ ఎంప్లాయిస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని జనవరి 14వ తేదీన డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ అప్లోడ్ చేయని పక్షంలో అన్‌పెయిడ్ లీవ్ కింద వాళ్లను పరిగణించి.. ఈ నెలాఖరులోపు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముందస్తు సంతకాలు ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఉద్యోగ నియామకాల టైంలోనూ, ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించే ఒప్పందాల సమయంలోనూ వ్యాక్సినేషన్ పాలసీని ముందుపెడుతూ తప్పనిసరిగా సంతకాలు చేయించుకుంటున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్లకు ఎవరైతే దూరంగా ఉంటారో.. వాళ్లను అన్‌పెయిడ్ సెలవులపై పంపించడం, జీతాల కోతల, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యాక్సినేషన్ మస్ట్ పాలసీలకు తలొగ్గుతున్న దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ.. వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మినహాయింపులు సైతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావించి వ్యాక్సిన్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
నో వ్యాక్సిన్.. నో శాలరీ.. నో జాబ్!
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్‌ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్‌లైన్ విధించారు. ఇక వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్, ఇంటెల్ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్, మెటాలతో పాటు భారత్‌కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ! వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నారు. నో రిక్రూట్మెంట్ ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది. చాలా కంపెనీల్లో హెచ్ఆర్లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం. చదవండి: ఒమిక్రాన్ అలజడి! భారత్‌ను కుదిపేయనుందా? -
గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగుల తొలగింపు!
కరోనా టైంలో వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా ఉద్యోగులకు ఊరట ఇస్తూ వస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు.. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో ‘ఆఫీస్ రిటర్న్’ను కొంత కాలం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్ఫాబెట్ కంపెనీ ‘గూగుల్’ అయితే ఏకంగా నిరవధిక వాయిదాను ప్రకటించింది కూడా. అయితే వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను తొలగించాలన్న గూగుల్ ఉత్తర్వులపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. తాజాగా గూగుల్ లీడర్షిప్ పేరిట ఒక మెమో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. డిసెంబర్ 3లోపు వ్యాక్సినేషన్ స్టేటస్‌ను సమర్పించని ఉద్యోగులపై చర్యలు తప్పవని అందులో ఉంది. ఈ మేరకు సీఎన్‌బీసీ, రాయిటర్స్లు ఆ మెమోకు సంబంధించిన కాపీలను ప్రచురించాయి. వ్యాక్సిన్ స్టేటస్‌ను సమర్పించని ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించమో లేదంటే శాశ్వతంగా విధుల నుంచి(అసలు వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లను) తొలగించడమో చేయాలని భావిస్తోంది. ఈ అఫీషియల్ మెమో ప్రకారం.. డిసెంబర్ 3లోపు వ్యాక్సినేషన్ స్టేటస్‌ను అప్లోడ్ చేయని గూగుల్ ఉద్యోగులపై చర్యలు తప్పవు. అలాగే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న ఉద్యోగులు.. ఎన్ని విజ్ఞప్తులు చేసినా గూగుల్ ఇక పట్టించుకోదు. వ్యాక్సినేషన్ రూల్స్ ఉల్లంఘించిన వాళ్లపై జనవరి 18, 2022 లోపు చర్యలు ఉంటాయి. వాళ్లను ముందుగా 30 పెయిడ్ లీవ్ మీద పక్కనపెడతారు. లేదంటే అన్‌పెయిడ్ పర్సనల్ లీవ్ మీద ఆరు నెలలు పక్కనపెడతారు. ఆపై ఏకంగా విధుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ మెమోపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు నిరాకరించారు. ఇక యూఎస్ కంపెనీలకు బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అనుసారం.. వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది గూగుల్. దీనిపై ఆన్లైన్ సైన్ పిటిషన్ ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో.. అఘమేఘాల మీద ఆ ఉత్తర్వుల్ని సైతం నిలుపుదల చేసినట్లు ప్రకటించుకున్న గూగుల్. ఈ క్రమంలో ఇలా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021.. మనోడు కాకున్నా తెగ వెతికారు! -
‘జూమ్‌లో 900 మంది తొలగింపు’.. విశాల్‌పై చర్యలు!
CEO Vishal Garg Who Fired 900 On Zoom Call Takes Time Off With Immediate Effect: బెటర్ డాట్ కామ్ సీఈవోగా కిందటి ఏడాది ఫోర్బ్స్ జాబితాకు ఎక్కిన విశాల్ గార్గ్.. ఈమధ్య జూమ్ మీటింగ్ వ్యవహారంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. జూమ్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో ఒకేసారి 900 మందితో ‘మీ ఉద్యోగాలు పోయాన’ని ప్రకటించాడు. దీంతో రగడ మొదలైంది. ఆన్లైన్ వేదికగా ఉద్యోగుల లేఆఫ్ ప్రకటన చేసిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ తీరును టెక్ దిగ్గజాలు సైతం తప్పుబట్టారు. ఈ విమర్శల పర్వం మధ్యే తాను చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాడు విశాల్. అయినప్పటికీ వివాదం సర్దుమణగడం లేదు. ఈ తరుణంలో శుక్రవారం అర్థాంతరంగా ఆయన్ని సెలవులపై తప్పించడం చర్చనీయాంశంగా మారింది. జూమ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన విశాల్‌కు.. ఈ-మెయిల్ ద్వారా సెలవులపై వెళ్లాలని బెటర్ డాట్ కామ్ కంపెనీ ఒత్తిడి చేసినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ మేరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కెవిన్ ర్యాన్ ప్రస్తుతం బెటల్ డామ్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. అంతేకాదు బోర్డుకు రిపోర్ట్ చేసే బాధ్యతను కూడా ఆయనే స్వీకరించారు అని ఆ కథనంలో పేర్కొంది. అయితే కెవిన్‌తో పాటు కీలక వ్యవహారాలను చూసుకునేందుకు స్వతంత్ర్య బోర్డు (మూడో పార్టీ)కు బాధ్యతలు అప్పగించడమే అసలు ఆసక్తికి కారణమైంది. బిజినెస్ టైకూన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, షేర్ల విలువ పడిపోతుండడంతో విశాల్‌కు బెటర్ డాట్ కామ్ శాశ్వతంగా పక్కన పెట్టనుందా? అనే అనుమానం వ్యక్తం చేసింది రాయిటర్స్. అయితే ఇదంతా జిమిక్కు అని, వ్యవహారం చల్లబడే వరకు మాత్రమే బెటర్ డాట్ కామ్ తీసుకున్న చర్య మాత్రమేనని ఓ బిజినెస్ డెయిలీ కథనం ప్రచురించింది. పైగా క్రిస్మస్ బోనస్ అందుకున్న విషయాన్ని సైతం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే ఈ ఊహాగానాలపై బెటర్ డాట్ కామ్ స్పందించలేదు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 ‘‘విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఇక మరో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ అడుగు ముందుకేశారు. ‘ఇది సబబేనా? కాదా? ఇలాంటి పొరపాటు తర్వాత ఆ కంపెనీ సీఈవో మనుగడ కొనసాగించగలడు అని మీరు భావిస్తున్నారా? అతనికి(విశాల్) మరో ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా? న్యాయమా?’ అంటూ ట్విటర్ ఫాలోవర్స్ అభిప్రాయాన్ని కోరారాయన. I’m curious whether you think a CEO can survive after a blunder like this? Is it fair, or not, to allow a second chance…? https://t.co/sPDcr9qmYE — anand mahindra (@anandmahindra) December 9, 2021 తొలగింపునకు కారణం ఇదే.. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ మోర్టగేజ్ లెండింగ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. -
జూమ్ మీటింగ్‌లో చెప్పి తప్పు చేశా: విశాల్ క్షమాపణ
Better.com CEO Apology For Laying Off 900 Employees Via Zoom Call: జూమ్ మీటింగ్ వేదికగా 900 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించిన ఘటన విమర్శలకు దారితీయడంతో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఎట్టకేలకు స్పందించాడు. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్.. బెటర్ డాట్ కామ్. అనే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీకి సీఈవో. గత ఏడాది నవంబర్ నెలలో వ్యాపార పత్రిక ఫోర్బ్స్ లో స్థానం సంపాదించుకున్నాడాయన. అయితే కిందటి వారం జూమ్ మీటింగ్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సమావేశం జరుగుతుండగా.. ఒక్కసారిగా ఒకేసారి 900 ఎంప్లాయిస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో షాక్ అవ్వడం ఉద్యోగుల వంతు అయ్యింది. ఆన్లైన్లో అదీ జూమ్ కాల్లో ఉండగా.. ఉద్యోగులకు అలాంటి షాక్ ఇవ్వడంపై విశాల్ తీరును చాలామంది తప్పుబట్టారు. ఓ ఉద్యోగి ద్వారా తొలింపునకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. ఇక ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా లాంటి వాళ్లు సైతం ఇది పూర్తిగా తప్పు అంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. విమర్శలు తారాస్థాయికి చేరడంతో విశాల్ గార్గే బహిరంగ లేఖ ద్వారా తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు తెలియజేశారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 అలా తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పిదంగా పేర్కొంటూ క్షమాపణలు చెప్పాడు విశాల్ గార్గ్. ‘నేను ఇలా ప్రవర్తించిన తీరు వార్తల్లోకి ఎక్కడం పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చేసింది’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. -
Abortion: గర్భ విచ్ఛిత్తి గడువు పెంపు.. 20 నుంచి 24 వారాలు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భ విచ్ఛిత్తిపై కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఈ మేరకు మార్చి నెలలో పార్లమెంట్ ఆమోదించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను నోటిఫై చేసింది. కొన్ని వర్గాల మహిళలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ చట్టం ప్రకారం.. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు. -
వారసుడి కోసం: 8 సార్లు గర్భస్రావం..1500 స్టెరాయిడ్లు
ముంబై: అంతరిక్షంలోకి వెళ్తున్న సరే.. నేటికి మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. కుమార్తె అంటే భారంగానే భావిస్తారు చాలామంది తల్లిదండ్రులు. కొడుకునే కనాలని పట్టుబడతారు కొందరు మగాళ్లు.. ఆడపిల్లను కంటే కోడలిని ఇంట్లో అడుగుపెట్టనివ్వరు చాలా మంది అత్తమామలు. ఎందుకంటే కొడుకు పున్నామా నరకం నుంచి రక్షిస్తాడంటారు.. కానీ వాస్తవం ఏంటంటే వృద్ధాప్యంలో ఆ కొడుకే వారికి బతికుండగానే నరకం చూపిస్తాడు.. అప్పుడు వారిని ఆదరించేది.. కడుపులో పెట్టుకుని చూసుకునేది కుమార్తె. నిత్యం మన చుట్టు ఇలాంటి దృశ్యాలు ఎన్ని కనిపిస్తున్నప్పటికి చాలామందిలో మార్పు రావడంలేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి వార్తనే. వారసుడే కావాలన్న ఉన్మాదంతో ఓ వ్యక్తి భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. కొడుకును కనడం కోసం ఆమెకు 1,500 స్టెరాయిడ్లు ఇప్పించాడు. ఇన్నాళ్లు ఈ నరకాన్ని మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన బాధితురాలు(40)కి 2007లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. బాధితురాలి అత్తగారి కుటుంబంలో అందరూ ఉన్నతవిద్యావంతులే. భర్త, అత్తగారు లాయర్లు కాగా ఆడపడుచు ఓ డాక్టర్. మానవత్వం, విచక్షణ లేనప్పుడు ఎంత గొప్ప చదువుల చదివితే మాత్రం ఏం ప్రయోజనం. వారికి మగసంతానం అంటే పిచ్చి. పెళ్లైన నాటిన నుంచి బాధితురాలి భర్త తరచుగా ఆమె దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించేవాడు. కొడుకు పుడితే కుటుంబాన్ని కాపాడతాడని.. ఆస్తికి వారసుడు ఉంటాడని తెలిపేవాడు. ఈ క్రమంలో బాధితురాలు 2009లో మొదట ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి భర్త ఆమెను ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి.. లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. భార్య చేతనే తనకు ఈ బిడ్డ వద్దని డాక్టర్లకు చెప్పించి మరీ గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత నుంచి బాధితురాలి మీద అఘాయిత్యాలు మొదలయ్యియి. అత్తింటివారు మగపిల్లాడి కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారు. భర్త కూడా చికిత్స తీసుకోసాగాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం బాధితురాలి భర్త.. ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేశారు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ టెస్ట్, చికిత్సను భారతదేశంలో నిషేధించడంతో అతడు బ్యాంకాక్ తీసుకెళ్లాడు. ఇక బాధితురాలికి దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. విషయం తెలుసుకున్న తర్వాత ఆమెకు సహనం నశించింది. కొడుకు కోసం తనకు అప్పటికే ఎనిమిది సార్లు అబార్షన్ చేయించడమే కాక ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఇంత భారీ ఎత్తున స్టెరాయిడ్లు ఇవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అత్తింటి ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
వాషింగ్టన్: శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్ ఎస్–బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ విఫలమైంది. 2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్ ఎస్.జిల్లీ అక్టోబర్ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్ సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు. -
శాండోజ్ కొనుగోలు ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ జనరిక్ ఫార్మా కంపెనీ శాండోజ్‌ను కొనుగోలు చేసే ఒప్పందాన్ని అరబిందో ఫార్మా రద్దు చేసుకుంది. అనుకున్న సమయంలోగా యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో ఇరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరబిందో ఫార్మా తెలిపింది. నోవార్టిస్ కంపెనీకి చెందిన శాండోజ్ అమెరికాలో జనరిక్ ఔషధాలు, బయోసిమిలర్ ఔషధాల్లో దిగ్గజ కంపెనీగా ఉంది. నోవార్టిస్ డివిజన్‌గా ఉన్న శాండోజ్ ఐఎన్‌సీ వాణిజ్య కార్యకలాపాలను, మూడు తయారీ కేంద్రాలను 900 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకునేందుకు అరబిందో ఫార్మా 2018 సెప్టెంబర్‌లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అమెరికాలో తన సొంత సబ్సిడరీ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఐఎన్‌సీ ద్వారా శాండోజ్‌ను సొంతం చేసుకోవాలనుకుంది. ఇది సఫలమై ఉంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్ ఔషధాల పరంగా రెండో అతిపెద్ద జనరిక్ ఔషధ కంపెనీగా అరబిందో అవతరించి ఉండేది. -
ఐసీఐసీఐపై కౌంటర్ వేయనున్న చందా కొచర్
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్ తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రంజిత్, జస్టిస్ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడంపైనే ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్ తరుపున విక్రమ్ నన్‌కాని, సుజయ్ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్ తరపున డారియస్ కమ్‌బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందాకొచర్‌పై వీడియోకాన్ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్, భర్త దీపక్ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్ షీటు చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన బోర్డు, ఆరోపణలపై విచారణకు నియమించిన మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక అనంతరం ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. -
మిర్యాలగూడలో భ్రూణహత్యలు!
-
మిర్యాలగూడలో భ్రూణహత్యలు!
మిర్యాలగూడ అర్బన్(నల్గొండ జిల్లా): మిర్యాలగూడ మండలంలోని ఎన్ఎస్పీ గెస్ట్‌హౌస్ ముందు మూడు మానవపిండాలు లభ్యమయ్యాయి. వీటిని ఒకే కవర్లో పెట్టి అక్కడ పడేసి వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానికులు గమనించి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. భ్రూణహత్యలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కవర్‌పై ‘శ్వేత నర్సింగ్ హోమ్’ అనే పేరు ఉంది. సంఘటనాస్థలాన్ని సీఐ పాండు రంగా రెడ్డి, వైద్యాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.