కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది.
‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది.
గతంలో బాలిక అబార్షన్‌కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది.
ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment