High Court of Kerala
-
నేతల వెంట ‘ఈడీ’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కొచ్చి: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేరళ హైకోర్టు కీలక సూచన చేసింది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. మసాలా బాండ్లకు సంబంధించి ఫెరా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ తనకు పదే పదే సమన్లు ఇవ్వడంపై కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిటిషనర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈడీకి సూచించింది. పిటిషన్ విచారణను మే 22కువాయిదా వేసింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గం నుంచి సీపీఎం నుంచి బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. నేతలు, సినీ ప్రముఖులపై ఐటీ, ఈడీ దాడులు -
మైనర్‌కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్‌కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
లక్షద్వీప్ ఎంపీకి ఎదురుదెబ్బ
ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కుMohammed Faizal ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కనపెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ.. ఆరువారాల గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో.. ఆ గడువులోగా(ఆరువారాల) లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్‌సభ ఎంపీని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అనర్హత వేటు.. ఎత్తివేత అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం.. జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్ విడుదల చేసింది. 35లో నలుగురు మాత్రమే.. ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘‘ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. -
సన్నీ లియోన్ కేసు విచారణపై కేరళ హైకోర్టు స్టే
కొచ్చి: బాలివుడ్ నటి సన్నీ లియోన్‌కి కోజికోడ్‌లో ఒక స్టేజ్ షోకి సంబంధించిన కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆమెపై నాలుగేళ్ల క్రితం కోజికోడ్‌లో స్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌కి ఒప్పందం విషయమై నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సన్నీ లియోన్‌పై కోజికోడ్‌లో రంగస్థల ప్రదర్శన కోసం ఒక సంస్థలో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లఘించారంటూ కార్యక్రమ నిర్వహకుడు షియాస్ కుంజుమహమ్మద్ నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే సన్నీ లియోన్ తనపై దాఖలైన ఎఫ్ఆర్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ జియాద్ రెహమాన్ విచారణ నిలిపేశారు. ఈ మేరకు సన్నీ లియోన్ పిటిషన్లో..తాను, తన భర్త, తమ ఉద్యోగిపై వచ్చి ఆరోపణలను తిరస్కరించారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని వివరించారు. అలాగే తమను అరెస్టు చేసే విధంగా పోలీసులుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అందువల్ల వారు ఏమి చేయలేకపోయారని చెప్పారు. తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేయడంతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లందని వాపోయారు. ఐతే ఆమెపై ఎర్నాకులంకి చెందిన కార్యక్రమ నిర్వాహాకుడు షియాస్ కుంజుమహమ్మద్ ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షియాస్ సన్నిలియోన్ విదేశాలలో స్టేజ్ షోల ప్రదర్శనకు సుమారు రూ. 39 లక్షలు అదుకుని మరీ ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కారు. (చదవండి: ఆప్ అభ్యర్థి కిడ్నాప్!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా) -
వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ లేఖలు.. మండిపడ్డ సీఎం
తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని లేఖలు పంపారు. సోమవారం ఉదయంలోగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆదివారం సాయంత్ర కోరారు. అయితే వారు రాజీనామాలు చేయకపోవడంతో సోమవారం అందిరికీ షోకాజ్ నోటీసులు పంపారు. వారంతా పదవుల్లో కొనసాగేందుకు ఉన్న చటబద్ధమైన హక్కేమిటో చెప్పాలని అడిగారు. దీంతో వైస్ ఛాన్సలర్లంతా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన న్యాయవస్థానం.. వీరికి తాత్కాలిక ఊరటనిచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత.. రాజీనామా చేయాలని పంపిన లేఖకు ఔచిత్యం లేకుండాపోయిందని పేర్కోంది. అయితే యూనివర్సీల ఛాన్సలర్ అయిన గవర్నర్.. ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేవరకు వైస్ ఛాన్సలర్లు పదవుల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ వీరిని పదపుల నుంచి తొలిగిస్తూ చట్టపరమైన ఆదేశాలిస్తే అందరూ పదవులను కోల్పోతారు. ఈ వైస్ ఛాన్సలర్లంతా చట్టవిరుద్ధంగా పదవులు దక్కించుకున్నారు, ఎల్డీఎఫ్ సహకారంతో పదవులు చేపట్టారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయాలని లేఖలు పంపారు. గవర్నర్ తీరుపై కేరళ సీఎం పనిరయ్ విజయన్ మండిపడ్డారు. అరిఫ్ ఖాన్ తన పరిధి మేరకు నడుచుకోవాలని హితవుపలికారు. వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆయనే అని, అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా జరిగిందేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. చదవండి: పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై! -
గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు
కొచ్చి: గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్ కింద 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గర్భిణీ స్తీకి చట్టబద్దంగా విడాకులు తీసుకున్న లేదా వింతంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను ప్రెగ్నెన్సీని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్ తాను డిగ్రీ చదువుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొంది. వివాహం అనంతరం తన భర్త ఆమె తల్లి కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌గా ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరిచండమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ వీజీ అరుణ్ వింతంతువు లేదా చట్ట బద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టంలోకి గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో మార్పులు సంభవించిన మహిళలను కూడా చేరుస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాదు సదరు పిటిషనర్‌కి గర్భం తొలగించుకునేందుకు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు) -
‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్ఏ టెస్ట్ చేయండి’: విడాకుల్లో కొత్త ట్విస్ట్
తిరువనంతపురం: భార్యాభర్తల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు భార్యకు పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదని ఓ భర్త కోర్టులో సరికొత్త వాదనకు తెరలేపాడు. అందరికీ డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. అతడికి 2006 మే 5వ తేదీ వివాహమైంది. వివాహమైన 22 రోజులకే లడ్డాఖ్‌కు వెళ్లాడు. అయితే 2007 మార్చి 9వ తేదీన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి అయితే పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో కలవలేదు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా కలవకపోయినా బిడ్డ పుట్టడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ కేసు ఇప్పుడు హైకోర్టుకు చేరింది. కోర్టు వాదనల సమయంలో ఆయన మరికొన్ని విస్తుగొల్పే విషయాలు తెలిపారు. తనకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని వైద్యులు చెప్పారని, అందుకే తనకు పిల్లలు కలగరని చెప్పినట్లు తిరువనంతపురం వైద్య కళాశాల ఇచ్చిన సర్టిఫికెట్ కోర్టుకు చూపించారు. చదవండి: బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు ఈ సందర్భంగా భార్యపై ఆరోపణలు చేశాడు. ‘నా భార్యకు ఆమె సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని, అతడి వలన నా భార్యకు కొడుకు పుట్టాడు’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే డీఎన్ఏ పరీక్ష చేయాలని విజ్ఞప్తి చేశాడు. అతడి వాదనలు విన్న న్యాయస్థానం డీఎన్ఏ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణ సాగుతోంది. మరి డీఎన్ఏ పరీక్షలో ఏం తేలుతుందో వేచి చూడాలి. -
అత్యాచారానికి కేరళ హైకోర్టు సరికొత్త నిర్వచనం
తిరువనంతపురం: అమ్మాయిని పురుషుడి అవయవంతో ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుంది అని కేరళ హైకోర్టు పేర్కొంది. అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై గురువారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టులో నిందితుడు తాను లైంగిక దాడికి పాల్పడలేదని.. కేవలం తన జననాంగంతో టచ్ చేశానని.. అది లైంగిక దాడికి కింద ఎలా వస్తుందని కోర్టుకు తెలిపాడు. అతడి వాదనను విన్న న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం అత్యాచారంపై ఓ వివరణ ఇచ్చింది. సెక్షన్ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం (రేప్) చేసినట్టేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం బాధితురాలి వయసును ఆమె తరఫు న్యాయవాది నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. నిందితుడికి మాత్రం జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ జియాద్ రహ్మన్‌తో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. -
జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ
తిరువనంతరపురం : ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతంలో కోత విధించడానికి ఆర్డినెన్స్ జారీచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇది వరకే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్యోగసంఘాలు పిటిషన్ దాఖలుచేశాయి. దీన్ని విచారించిన హైకోర్టు రెండునెలల స్టే విధించింది. జీతాల కోతకు సంబంధించి అంటువ్యాధుల చట్టంలో కాని, విపత్తు నిర్వహణ చట్టంలో కానీ ఎలాంటి చట్టబద్దమైన ఆధారం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరి జీతాల్లో ఐదు మాసాలపాటు వారి నెల జీతంలో 6రోజుల వేతనంలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ డెడక్షన్ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి అనంతరం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. (నెల జీతం కట్..వారికి మినహాయింపు) తాజా హైకోర్టు ప్రకటనతో ఆర్డినెన్స్ జారీ చేయడం అత్యవసరం అని భావించినట్లు వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు జీతాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆర్డినెన్స్‌తో మార్గం సుగుమమైంది. అంతేకాకుండా మంత్రులు, శాసనసభ్యుల నెలవారీ జీతంలో 30 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేస్తామని సీఎం తెలిపారు. -
అమలాపాల్‌కు బెయిల్ మంజూరు
చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పన్ను ఎగవేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసులు అమలపై కేసు నమోదు చేయడంతో.. కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అమల పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. మంగళవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అమల లొంగిపోగా.. బుధవారం రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2017లో అమలాపాల్ రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా రూ. 20 లక్షల పన్నును అమలా ఎగవేశారనేది ప్రధాన ఆరోపణ.