తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని లేఖలు పంపారు. సోమవారం ఉదయంలోగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆదివారం సాయంత్ర కోరారు. అయితే వారు రాజీనామాలు చేయకపోవడంతో సోమవారం అందిరికీ షోకాజ్ నోటీసులు పంపారు. వారంతా పదవుల్లో కొనసాగేందుకు ఉన్న చటబద్ధమైన హక్కేమిటో చెప్పాలని అడిగారు.
దీంతో వైస్ ఛాన్సలర్లంతా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన న్యాయవస్థానం.. వీరికి తాత్కాలిక ఊరటనిచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత.. రాజీనామా చేయాలని పంపిన లేఖకు ఔచిత్యం లేకుండాపోయిందని పేర్కోంది. అయితే యూనివర్సీల ఛాన్సలర్ అయిన గవర్నర్.. ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేవరకు వైస్ ఛాన్సలర్లు పదవుల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ వీరిని పదపుల నుంచి తొలిగిస్తూ చట్టపరమైన ఆదేశాలిస్తే అందరూ పదవులను కోల్పోతారు.
ఈ వైస్ ఛాన్సలర్లంతా చట్టవిరుద్ధంగా పదవులు దక్కించుకున్నారు, ఎల్‌డీఎఫ్ సహకారంతో పదవులు చేపట్టారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయాలని లేఖలు పంపారు.
గవర్నర్ తీరుపై కేరళ సీఎం పనిరయ్ విజయన్ మండిపడ్డారు. అరిఫ్ ఖాన్ తన పరిధి మేరకు నడుచుకోవాలని హితవుపలికారు. వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆయనే అని, అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా జరిగిందేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు.
చదవండి: పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై!
Comments
Please login to add a commentAdd a comment