Resignation Issue
-
వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ లేఖలు.. మండిపడ్డ సీఎం
తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని లేఖలు పంపారు. సోమవారం ఉదయంలోగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆదివారం సాయంత్ర కోరారు. అయితే వారు రాజీనామాలు చేయకపోవడంతో సోమవారం అందిరికీ షోకాజ్ నోటీసులు పంపారు. వారంతా పదవుల్లో కొనసాగేందుకు ఉన్న చటబద్ధమైన హక్కేమిటో చెప్పాలని అడిగారు. దీంతో వైస్ ఛాన్సలర్లంతా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన న్యాయవస్థానం.. వీరికి తాత్కాలిక ఊరటనిచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత.. రాజీనామా చేయాలని పంపిన లేఖకు ఔచిత్యం లేకుండాపోయిందని పేర్కోంది. అయితే యూనివర్సీల ఛాన్సలర్ అయిన గవర్నర్.. ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేవరకు వైస్ ఛాన్సలర్లు పదవుల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ వీరిని పదపుల నుంచి తొలిగిస్తూ చట్టపరమైన ఆదేశాలిస్తే అందరూ పదవులను కోల్పోతారు. ఈ వైస్ ఛాన్సలర్లంతా చట్టవిరుద్ధంగా పదవులు దక్కించుకున్నారు, ఎల్డీఎఫ్ సహకారంతో పదవులు చేపట్టారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయాలని లేఖలు పంపారు. గవర్నర్ తీరుపై కేరళ సీఎం పనిరయ్ విజయన్ మండిపడ్డారు. అరిఫ్ ఖాన్ తన పరిధి మేరకు నడుచుకోవాలని హితవుపలికారు. వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆయనే అని, అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా జరిగిందేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. చదవండి: పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై! -
‘కొలువుకు టాటా’.. ప్రపంచవ్యాప్తంగా రాజీనామాల ట్రెండ్
ప్రపంచాన్ని గడగడలాడించి 65 లక్షల మందిని కబళించిన కరోనా దిగ్గజ కంపెనీలకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ విజృంభన మొదలైనప్పటి నుంచీ లక్షల మంది ఉద్యోగాలు మానేస్తున్నారు. ప్రపంచమంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కరోనా కల్లోలం సద్దుమణిగినా రాజీనామాల జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్లలో 13,382 మంది ఉద్యోగులపై మెకిన్సే సర్వే చేసింది. రాజీనామాలకు కారణాలతో పాటు ఏం చేస్తే ఉద్యోగం మానకుండా ఉంటారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. కనీసం 40 శాతం మంది తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తేలింది. వీరంతా మూడు నుంచి ఆర్నెల్లలో రాజీనామా యోచనలో ఉన్నారట. చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన, మరింత తృప్తినిచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారట. ఎదుగుదలకు అవకాశాల్లేక మానేసినట్టు 41 శాతం మంది చెప్పారు. మొత్తమ్మీద ఆశించిన వేతనం, ఇతరత్రా తగినన్ని లాభాలు లేకపోవడం రాజీనామాలకు ప్రధాన కారణమని సర్వే తేల్చింది. ఈ ఏడాదిలో ఒక్క అమెరికాలోనే ఇప్పటిదాకా దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు మానేసినట్లు తేలింది. 2022 అంతా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చన్నది నిపుణుల అంచనా. ఇందుకు కరోనా కొంతవరకే కారణమని మెకిన్సే నివేదికను సిద్ధం చేసిన వారిలో ఒకరైన బోనీ డౌలింగ్ అన్నారు. ‘‘ఉద్యోగమనే భావనే సమూలంగా మారుతున్న వైనం కొన్నాళ్లుగా స్పష్టంగా కన్పిస్తోంది. జీవితంలో ప్రాథమ్యాల విషయంలో ఆలోచనా శైలిలోనే మార్పు కనిపిస్తోంది. ఏ ఉద్యోగం చేసినా తమకు నచ్చినట్లు ఉండాలని ఆశిస్తున్నారు’’ అని వివరించారు. ఉద్యోగుల మార్కెట్ ఇప్పుడిప్పుడే కరోనా ముందునాటి స్థితికి చేరుకోవడం కష్టమేనన్నారు. నచ్చని రంగాలకు గుడ్‌బై... కరోనా తరువాత రాజీనామా చేసిన వాళ్లలో సగం ఇతర రంగాలకు మళ్లుతున్నట్లు మెకిన్సే చెబుతోంది. సర్వేలో భాగంగా గత రెండేళ్లలో ఉద్యోగాలు మానేసిన ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాలకు చెందిన 2,800 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నించింది. వీరిలో 48 శాతం ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నట్లు తేలింది. ‘‘కరోనా వేళ విపరీతమైన ఒత్తిడికి గురై శక్తివిహీనంగా మారిపోయిన భావన తట్టుకోలేక పలువురు ఉద్యోగాలు మానేశారు. ఉన్న రంగంలో మెరుగైన ఆదాయం కష్టమని కొందరు ఇతర రంగాల వైపు మళ్లారు. రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మానేసిన వారిలో ఏకంగా 60 శాతం రంగం మారడమో, పూర్తిగా మానేయడమో చేశార’’ని తేల్చింది. భారత్‌లోనూ... భారత ఐటీ కంపెనీల్లో ఈ ఏడాది వేలకొద్ది రాజీనామాలు జరిగాయి. గత ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌కు ఏకంగా 28.4 శాతం మంది రాజీనామా చేశారు. తర్వాత స్థానాల్లో విప్రో (23.3), టెక్ మహీంద్రా (22), టీసీఎస్ (19.7) ఉన్నాయి. ‘‘ఒకే కంపెనీలో మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎదుగుదలకు అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. కెరీర్ కోసం అవసరమైతే ఏడాదిలో రెండు ఉద్యోగాలు కూడా మారతాం’’ అని ఓ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ రఘురామ మంచినేని అన్నారు. భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు భారీగా ఉండటమూ రాజీనామాలకు ఓ కారణమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లంతా పెద్ద కంపెనీల్లో చేరి కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు’’అని సాక్షి ప్రతినిధితో అన్నారు. స్వయం ఉపాధే బెటర్... మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేసిన వారిలో 29 శాతమే మళ్లీ సంప్రదాయ కొలువుల్లో చేరారు. మిగతా వారిలో చాలామంది సొంత వ్యాపారాలకు మొగ్గారు. కొందరు పార్ట్‌టైం కొలువులకు జై కొట్టారు. కరోనా సమయంలో అమెరికాలో సొంత వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 శాతం పెరిగిందట. 2021లోనే 54 లక్షల దరఖాస్తులు వచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది. మనోళ్లు అక్కడలా... అమెరికాలోని భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం కాసులు కురిపించింది. ఓవైపు వేలాది మంది రాజీనామాలు చేస్తుంటే మనవాళ్లేమో ఫుల్ టైం కొలువుకు తోడు రెండు, మూడు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా చేశారు. ఇది వారికీ, అటు ఉద్యోగుల కొరతతో అల్లాడిన పలు కంపెనీలకూ కలిసొచ్చింది. కానీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇకపై వారానికి కనీసం 3 రోజులు విధిగా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేయడంతో చాలామంది పార్ట్ టైం కొలువులకు స్వస్తి పలకాల్సి వస్తోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
వారానికి 4 రోజుల పని, సై..సై..అంటున్న ఉద్యోగులు!
ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస్తున్న దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ నుంచి సురక్షితంగా ఉండేందుకు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో కంపెనీలు వర్కింగ్ డేస్‌ను తగ్గించేస్తున్నాయి.వారానికి 5రోజులు కాకుండా 4రోజుల పాటు వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రిజిగ్నేషన్ సమస్యను అధికమించడంతో పాటు వర్క్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుందని సర్వేలు తేల్చడంతో సంస్థల యజమానులు వారానికి 4 రోజుల పని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన 60కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి 4రోజుల పాటు వర్క్ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాస్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించనున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే స్పెయిన్, ఐస్‌ల్యాండ్,యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి. పైన పేర్కొన్న దేశాలు సైతం ఆగస్ట్ నుంచి ఉద్యోగులకు సైతం వర్క్ వర్కింగ్ డేస్‌ను కుదించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా,వీక్లీ వర్కింగ్ డేస్‌ను తగ్గించడం వల్ల సంస్థలకు అనేక లాభాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడంతో పాటు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ పనిలో ఉత్సాహాం చూపిస్తారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల్లో సంతోషం పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా.కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు నేను నేర్చుకోవాలని.. టైమ్ లేక కంప్లీట్ చేయలేకపోయిన టెక్నాలజీ కోర్స్ల్ని పూర్తి చేస్తా'నని లూయిస్ అనే ఉద్యోగి తెలిపాడు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఉద్యోగుల శాలరీలను డబుల్ చేస్తున్నట్లు తెలిపారు. సత్య నాదెళ్ల ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నట్టేట ముంచారు. మీరొద్దు. మీరిచ్చే జీతాలొద్దు. కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు ఊడబీకారు. నష్టాలంటూ శాలరీల్లో కోత విధించారు. డబుల్ హైక్‌లు, ప్రమోషన్లు ఇస్తామంటే మేం ఎందుకు పనిచేస్తాం. కరోనా తెచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నామంటూ..ఉద్యోగస్తులు.. వారు చేస్తున్న ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నాం". ఇదిగో ఇలా పుట్టుకొచ్చిందే ఈ దిగ్రేట్ రిజిగ్నేషన్. ఇప్పుడీ ఈ అంశం ప్రపంచ దేశాలకు చెందిన అన్నీ సంస్థల్ని కలవరానికి గురిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. 'నియర్లీ డుబల్డ్ ది గ్లోబల్ మెరిట్'. ముఖ్యంగా మిడ్ కెరియర్ (35 నుంచి 45 మధ్య వయస్సు) ఉద్యోగుల శాలరీలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు క్లయింట్లకు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయింది. నా తరుపున మీ అందరికి కృతజ్ఞతలు.అందుకే మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. చదవండి👉నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని బీజేపీ కరాఖండిగా చెప్పేసింది. లఖీంపూర్ హింసాత్మక ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించకూడదని సీనియర్ నేత పియూశ్ గోయల్ అన్నారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ లఖీంపూర్ ఘటనలో మంత్రి అజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నారు. ‘ మోదీ సర్కార్‌ను విమర్శించడానికి సరైన కారణాలు లేకనే విపక్షాలు ఇలా సస్పెండ్ అయిన సభ్యుల అంశాన్ని పదేపదే పార్లమెంట్లో లేవనెత్తుతున్నాయి’ అని గోయల్ విమర్శించారు. -
వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట పూర్వ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్, ఆంథోల్ ప్రాంతానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్‌లు గురువారం ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భోజన విరామం తర్వాత విచారించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. దీనికి ధర్మాస నం నిరాకరించింది. ‘వెంకట్రామిరెడ్డి 2011లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఐఏఎస్ అధికారుల నియామకాలు చేపట్టేది రాష్ట్రపతి. వారు కేంద్ర ప్రభుత్వ అ«దీనంలో ఉంటూ.. విధులు నిర్వహిస్తారు. వారి రాజీనామా ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేయడానికి 3 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలి. వెంకట్రామిరెడ్డి రాజీనామాతో ఆయనపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని నిర్ధారిస్తూ విజిలెన్స్ విభాగం నివేదికను జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ పరిశీలించకుండా రాజీనామా ఆమోదించడం చట్టవిరుద్ధం. అయితే వెంకట్రామిరెడ్డి 14న స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే అదే రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించినట్లుగా పత్రికల్లో కథనాలొచ్చాయి. వెంటనే టీఆర్ఎస్లో చేరి 16న ఎంఎల్సీ అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించేలా ఆదేశించండి’ అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, తెలంగాణ శాసన మండలి కార్యదర్శి, ఎంఎల్సీ ఎన్నికల రిటర్నింగ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో పి.వెంకట్రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. -
దళితులను మోసం చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఉపఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ నిలిపేయదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే ‘దళితబంధు’పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం పేరుతోదళితులను మరోసారి మోసం చేసినందుకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్ధిదారుకు కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసి, తాజాగా మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మరో డ్రామాకు తెరలేపారని సంజయ్ మండిపడ్డారు. ఈ పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో సంజయ్ పైవిధంగా స్పందించారు. దళితబంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్నా, వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ చేశారని మండిపడ్డారు. ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్ ఆ తరువాత మాటమార్చి షరతులు విధించారని ఆరోపించారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారని, దళితుడిని సీఎం చేస్తానని, వారికి మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమేకాక, తాజాగా దళితబంధు స్కీంను నిలిపివేయడానికి ఆస్కారమివ్వడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
ఐఏఎస్‌ల మధ్య రగడ: మంత్రి ‘రాజీ’ చర్చలు
మైసూరు: జిల్లాధికారి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేసి తన ఉద్యోగానికి రాజీనామ చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ శుక్రవారం సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్‌తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్‌కు మంత్రి సూచించారు. కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్‌కు మనవి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలికె కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ శుక్రవారం పాలికె కార్యాలయం వద్ద సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిణి సింధూరిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా) ఆలోచించే రాజీనామా చేశా: శిల్పానాగ్ తాను బాగా ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్ఆర్ ఫండ్స్‌కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. నిధుల వివరాలు అడగడం తప్పా? : కలెక్టర్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన రూ.12 కోట్ల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వారం గ్రామాలకు వైద్యులు అనే కార్యక్రమానికి సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్ఆర్ ఫండ్స్‌ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరగా మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. తనపై అసంతృప్తి ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని, దాన్ని అనుసరించి వ్యవహరించాలని సూచించారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తానని ఆమె తెలిపారు. మైసూర్లో శిల్పా నాగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్న ఉద్యోగులు -
కాంగ్రెస్‌కు షాక్: మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వైఖరిని నిరసిస్తూ ఓ మంత్రి, ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే పార్టీ వైఖరి సక్రమంగా లేకనే రాజీనామా చేశామని వారు ప్రకటించారు. వీరి రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రజా పనుల శాఖ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపాయందన్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ శివకుళందైను కలిసి స్వయంగా రాజీనామా పత్రాలను సమర్పించారు. తనపై పార్టీ నాయకత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని మంత్రి నమశ్శివాయం బహిరంగంగానే చెబుతున్నారు. అసంతృప్తిని వెళ్లగక్కినా పార్టీ పట్టించుకోకపోవడంతో నమశ్శివాయం ఇక ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. అందులో భాగంగా ఇటీవల తన అనుచరులతో సమావేశమై చర్చించి చివరకు పార్టీని వీడాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి ద్రోహం చేస్తున్నారనే కారణంతో నమశ్శివాయంను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి బహిష్కరిస్తున్నట్లు పాండిచ్చేరి పీసీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణియన్ ప్రకటించారు. రాజీనామాలు చేసినా పార్టీ దిగిరాకపోవడంపై వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. పైగా పార్టీ నుంచి తమను బహిష్కరించడంతో నమశ్శివాయంతోపాటు దీపాయందన్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్‌కు 7 మంది, ఏఐఏడీఎంకేకు నలుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. వీరిద్దరి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చి ఇబ్బందేం లేదు. కాకపోతే ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఉన్నారని.. వారు రాజీనామా చేస్తే మాత్రం ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
విధానసౌధలో బీజేపీ ఆందోళన
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ జవాబిచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు. మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప ‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్ రమేశ్ కుమార్‌తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్ కార్యాలయంలోకి సుధాకర్‌ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్ భార్య వజూభాయ్‌వాలాకు ఫోన్ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. దీంతో కమిషనర్ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్‌భవన్‌కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది. అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్‌కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందన్నారు. -
‘12 మందిమి ఆత్మహత్య చేసుకుంటాం’
పట్నా : రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే మూకుమ్ముడి ఆత్మహత్యలకు పాల్పడతామంటున్నారు బిహార్ కాంగ్రెస్ కార్యకర్తలు. వివరాలు.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాహుల్ బిహార్ వెళ్లారు. గతంలో రాహుల్‌పై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ పట్నా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై విచారణ జరిపిన పట్నా కోర్టు శనివారం ఆయనకు రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే రాహుల్ రాక గురించి తెలిసిన కార్యకర్తలు రాజీనామాను ఉపసంహరించుకునేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు పట్నాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోకపోతే జులై 11న 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో మూకుమ్మడి రాజీనామాలు
న్యూఢిల్లీ : అధ్యక్ష పదవికి రాజీనామాపై పట్టువీడని రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాహుల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేతలు పీసీ చాకో, షీలా దీక్షిత్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, జేపీ అగర్వాల్, మహాబల్ మిశ్రా, అర్విందర్ లవ్లీ తదితరులు కలిసి శుక్రవారం మరోసారి రాహుల్ నివాసానికి వెళ్లారు. రాజీనామా అంశంపై రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే వివేక్ తంఖా పార్టీ లా, ఆర్టీఐ సెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ.. పార్టీ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా.. నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాహుల్ నివాసం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం వీరంతా రాహుల్‌ను కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఆ భేటీలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. తొలిసారి రాహుల్ గాంధీ రాజీనామ అంశంపై మీడియాతో మాట్లాడారు మొయిలీ. రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గేలా లేరన్నారు. ఇక మీదట ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదన్నారు. త్వరలోనే రాహుల్ రాజీనామా అంశంలో సీడబ్ల్యూసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. లేదంటే ఇలాంటి ఊహాగానాలు పెరుగుతాయని తెలిపారు. అయితే రాహుల్ రాజీనామాను ఆమోదించేలోపే ఆ పదవికి మరో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు. -
‘రాహుల్ రాజీనామా డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్ రాజీనామాకు సిద్ధపడటాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్ కైలాష్ విజయ్‌వర్గియ డ్రామాగా అభివర్ణించారు. మనకు ఇచ్చేది, తీసుకునేంది అంతా భగవంతుడేనని, రాజీనామా చేస్తానని రాహుల్ అనడం డ్రామానేనని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేఫథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఓటమిని నేతలు సమక్షించారు. కీలక సమయంలో పార్టీ నాయకత్వ స్ధానంలో కొనసాగాలని రాహుల్‌ను కోరారు. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని, కిందిస్ధాయి నుంచి ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని సీడబ్య్లూసీ సభ్యులు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. -
రాజీనామా చేయను
వాషింగ్టన్: ఫేస్‌బుక్‌కు తాను రాజీనామా చేయనని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్బర్గ్ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. ‘ఈ కంపెనీకి షెరిల్ ఎంతో కీలకమైన వ్యక్తి. మాకున్న ఎన్నో సమస్యలను ఆమె మోస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు’ అని జుకర్‌బర్గ్ అన్నారు. గత దశాబ్దకాలంగా ఆమెతో కలిసి తాను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాననీ, మరికొన్ని దశాబ్దాలపాటు తామిద్దరం కలిసే పనిచేస్తామని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశం మొదలుకుని ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌కు నిత్యం ఏదో ఒక సమస్య వచ్చిపడుతుండటం తెలిసిందే. నకిలీ వార్తలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, నిబంధలన ఉల్లంఘనలకు జరిమానాలు ఎదుర్కోవడం తదితర సమస్యలతో ఫేస్బుక్ సతమతమవుతోంది. అయితే వారం రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారీ కథనం రాస్తూ ఫేస్బుక్ తమ ప్రత్యర్థి కంపెనీలపై బురదజల్లేందుకు వాషింగ్టన్కు చెందిన ఓ ప్రజా సంబంధాల కంపెనీని నియమించుకుందని వెల్లడించింది. ప్రత్యర్థి కంపెనీలకు వ్యతిరేకంగా ఆ సంస్థ కథనాలు రాయించి ప్రాచుర్యంలోకి తెచ్చిందంది. ఈ కంపెనీకి రిపబ్లికన్ పార్టీతో సంబంధాలున్నాయని తెలిపింది. అలాగే అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ ద్వారా రష్యా జోక్యానికి సంబంధించి ఆ సంస్థకు ముందే సమాచారం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని ఆరోపించింది. ఫేస్బుక్ పెద్దలు ఆలస్యంగా స్పందించారనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అవన్నీ అబద్ధాలే: జుకర్‌బర్గ్, షెరిల్ జుకర్‌బర్గ్, శాండ్బర్గ్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించారు. వాషింగ్టన్ కంపె నీని ఫేస్బుక్ నియమించుకున్న సమాచారమే తమకు తెలీదనీ, ఆ పత్రికలో కథనం చదివిన తర్వాతనే తెలుసుకున్నామని వారిద్దరు చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీతో తమ సంస్థ సంబంధాలను రద్దు చేసుకుందని తెలిపారు. అలాగే రష్యా జోక్యం గురించి కూడా తమకు ముం దుగా తెలీదనీ, అంతా తెలి సినా మౌనంగా ఉన్నామనడం సరికా దని చెప్పారు. జుకర్‌బర్గ్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని కొంతకాలంగా ఆ సంస్థ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. కొత్త ఫీచర్ ‘యువర్ టైమ్’ ఫేస్బుక్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పనులు మానుకుని గంటల తరబడి ఫేస్‌బుక్‌కు అతుక్కుపోయే చాలా మందికి ఇది ఉపయోగడనుంది. ఫేస్‌బుక్‌ను మీరు ఎంతసేపు వాడుతున్నారో రోజువారీ, వారం వారీ లెక్కలను ఈ కొత్త ఫీచర్ మీకు తెలియజేస్తుంది. అంతేకాదు.. రోజుకు ఎంతసేపు మీరు ఫేస్‌బుక్‌ను వాడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించి ఆ విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకుంటే.. ఆ సమయం పూర్తి కాగానే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌ను బ్రౌజ్ చేస్తున్నారంటూ మీకు హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు ఫేస్బుక్ యాప్‌లో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళితే ‘యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్’ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు ఫేస్బుక్లో ఇప్పటివరకు గడిపిన సమయం కనిపించడంతోపాటు, రోజూ ఎంతసేపు బ్రౌజ్ చేయాలనుకుంటే అంత సమయం సెట్ చేసుకోవచ్చు. ఏ రోజైనా మీరు అంత కన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌పై గడుపుతున్నట్లయితే వెంటనే మీకు ఫేస్బుక్ నుంచి హెచ్చరికలు వస్తాయి. -
రాజీనామాల ఆమోదం కోసం...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయి తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. బడ్జెట్ సెషన్స్ చివరిరోజు రాజీనామాలు చేసిన ఎంపీలు.. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాల విషయంలో పునరాలోచన చేయాలని స్పీకర్ ఇంతకు ముందు ఎంపీలను కోరారు. కానీ, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
'దొంగ మంత్రి అని తేలిపోయింది'
-
'దొంగ మంత్రి అని తేలిపోయింది'
హైదరాబాద్: రాజీనామా వ్యవహారంలో తలసాని శ్రీనివాస యాదవ్ దొంగ మంత్రి అని తేలిపోయిందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. రాజీనామా చేయలేదని దొంగ మంత్రి అన్నందుకు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తలసాని బెదిరింపులకు భయపడేది లేదన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి సీఎం కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. పాలనా అనుభవం లేకపోవడంతో ధనిక రాష్ట్రం కాస్త దివాళా తీసిందని దుయ్యబట్టారు. రూ. 7500 కోట్ల మిగులుతో ఏర్పడ్డ రాష్ట్రం, ఉద్యోగుల వేతనాల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ఆర్ బీఐ అనుమతితో రూ.1400 కోట్లు అప్పు తెచ్చారని వెల్లడించారు. రైతు రుణమాఫీకి ఇవ్వాల్సిన వాయిదా కూడా ఇవ్వలేదని షబ్బీర్ అలీ అన్నారు.