'దొంగ మంత్రి అని తేలిపోయింది' | talasani srinivas yadav blackmailed me, says shabbir ali | Sakshi
Sakshi News home page

'దొంగ మంత్రి అని తేలిపోయింది'

Published Wed, Jul 22 2015 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

'దొంగ మంత్రి అని తేలిపోయింది'

'దొంగ మంత్రి అని తేలిపోయింది'

హైదరాబాద్: రాజీనామా వ్యవహారంలో తలసాని శ్రీనివాస యాదవ్ దొంగ మంత్రి అని తేలిపోయిందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. రాజీనామా చేయలేదని దొంగ మంత్రి అన్నందుకు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తలసాని బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి సీఎం కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. పాలనా అనుభవం లేకపోవడంతో ధనిక రాష్ట్రం కాస్త దివాళా తీసిందని దుయ్యబట్టారు. రూ. 7500 కోట్ల మిగులుతో ఏర్పడ్డ రాష్ట్రం, ఉద్యోగుల వేతనాల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ఆర్ బీఐ అనుమతితో రూ.1400 కోట్లు అప్పు తెచ్చారని వెల్లడించారు. రైతు రుణమాఫీకి ఇవ్వాల్సిన వాయిదా కూడా ఇవ్వలేదని షబ్బీర్ అలీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement