![Shabbir Ali Responds On Kishan Reddy And Bandi Sanjay Comments](/styles/webp/s3/article_images/2025/02/18/Shabbir-Ali-1.jpg.webp?itok=cfEClwuW)
హైదరాబాద్: కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీసీలలో మైనార్టీలను కలిపారని వారు చెప్పడం సరికాదన్నారు. సాధారణ వ్యక్తి చదువుకుని మాట్లాడితే వదిలేయొచ్చు..కానీ కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారన్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.
‘కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్న.హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారు.ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రులే కదా... బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి..గుజరాత్ లో కూడా తొలగించండి. మతంలో కూడా పేదరికం లేదా..? , మీరు పిలిస్తే...మీ పార్టీ కార్యాలయంకి వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా. కానీ మాతల మధ్య చిచ్చు పెట్టొద్దు. మనం అంతా భారతీయులం. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించండి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment