Shabbir Ali
-
‘కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చుపెడుతున్నారు’
హైదరాబాద్: కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీసీలలో మైనార్టీలను కలిపారని వారు చెప్పడం సరికాదన్నారు. సాధారణ వ్యక్తి చదువుకుని మాట్లాడితే వదిలేయొచ్చు..కానీ కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారన్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.‘కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్న.హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారు.ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులే కదా... బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి..గుజరాత్ లో కూడా తొలగించండి. మతంలో కూడా పేదరికం లేదా..? , మీరు పిలిస్తే...మీ పార్టీ కార్యాలయంకి వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా. కానీ మాతల మధ్య చిచ్చు పెట్టొద్దు. మనం అంతా భారతీయులం. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించండి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
కేటీఆర్ కు డ్రగ్స్ కు ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది: షబ్బీర్ అలీ
-
బీఆర్ఎస్కు 11 ఎకరాలెందుకు?: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. అలాగే, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనిఅయిపోయిందన్నారు.కాగా, షబ్బీర్ అలీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేతగా హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా?. శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా?. మా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా?. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతున్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది. హైదరాబాద్‌లో 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు?. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి వాడాలి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ. దానికి కూడా మేమే భూమి ఇచ్చాం. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారు. కేసీఆర్ తెలంగాణని అమ్మకానికి పెట్టారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్‌లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్‌లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
డీఎస్ నా రాజకీయ గురువు : ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో గల మూన్నూరుకాపు కల్యాణ మండపంలో ఆయనకు పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మానసభ మాట్లాడారు. కాంగ్రెస్‌లో కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తుందన్నారు. మారుమూల గిరిజన గ్రామమైన రాహత్‌నగర్ నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, టీపీసీసీలో పనిచేశానన్నారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఏం రేవంత్‌రెడ్డితో చొరవతోనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి కాంగ్రెస్‌కు చిప్ప ఇచ్చా రని శాసనమండలి సమావేశాలలో తాను ఎమ్మెల్సీ కవితతో అన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను తీరుస్తుందన్నారు. ప్రజాగ్రహానికి గురై కేసీఆర్ ఇంటికి పోయాడన్నారు. ప్రజల చేతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వదిలేసిన 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను అందించిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో మరో లక్ష ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ (డీఎస్) తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. 1983లో డీఎస్ ద్వారా తాను ఎన్‌ఎస్‌యూఐలోకి వచ్చినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. బీజేపీ ఓట్ల కోసం మతం, ప్రాంతాల వారీగా విభజన చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, నాయకులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీవిప్ ఈరవత్రి ఆనిల్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్, బాడ్సిశేఖర్గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ భక్తవత్సలం(ఢిల్లీ), దిగంబర్పవార్, దిలీప్‌పవార్, అశోక్‌గౌడ్, జయసింహాగౌడ్, రామార్తి గోపి, ప్రీతం, వైశాక్షి సంతోష్, వేణుగోపాల్‌యాదవ్, రాజనరేందర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయిలు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు షబ్బీర్ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు..
సాక్షి, కామారెడ్డి: ఎట్టకేలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీనియారిటీకి గుర్తింపు దక్కింది. ఆయనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల సలహాదారుగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మాజీ మంత్రి, పీఏసీ చైర్మన్ షబ్బీర్ అలీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత నిరాశచెందారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కేదని భావించారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న షబ్బీర్‌అలీ.. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం, తద్వారా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదేళ్లుగా అధికార పదవి లేకుండా ఉన్న షబ్బీర్ అలీకి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు హోదా లభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా షబ్బీర్ అలీకి అధికారిక పదవి లభించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారనున్నాయి. స్థానికంగా అధికార పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు యాక్టివ్ అయ్యారు. దీనికి తోడు షబ్బీర్‌కు సలహాదారు పదవి రావడంతో వారు మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇవి చదవండి: అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. అదిరిన కొత్త లుక్.. -
స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్ అలీ
సాక్షి, నిజామాబాద్: స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేసిందని.. ప్రభుత్వ శ్వేత పత్రం తప్పు అని బీఆర్ఎస్ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే కేటీఆర్ తప్పులు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదీ చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. -
సీఎంగా కన్ఫామ్ కాగానే రేవంత్ రెడ్డి నాతో చెప్పిన మాట ఇదే..!
-
ఓడితే మంత్రి పదవి ఇస్తారా?
-
ఐటీ మంత్రిగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు..?
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ మొదలైంది. జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న దానిపై ఊహాగానాలు జోరందు కున్నాయి. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్‌అలీ గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ సంస్థల యజమాని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కాలం కలిసొస్తే ఐటీ మంత్రిగా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎల్లారెడ్డి, జుక్కల్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కూడా తొలిసారి విజయం సాధించారు. ఇందులో మదన్మోహన్రావు ఐటీ కంపెనీల యజమాని. ఆయన కు పార్టీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే ఆయనకు ఎల్లారెడ్డి టికెట్టు రావడానికి కారణమైంది. ఆయనకు మంత్రి మండలిలోనూ అవకాశం కల్పిస్తారని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అనుభవంతో పాటు పార్టీలో ఐటీ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవలందించినందున ఆయనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాలో.. జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అప్పటి చెన్నారెడ్డి మంత్రిమండలిలో అవకాశం దక్కించుకున్నారు. తర్వా త 2004 ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించింది. ఆయన 2014, 2018 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆయన నాలుగైదేళ్లుగా జనంలోనే ఉండి నిరంతరం పనిచేశారు. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి దిగడంతో షబ్బీర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి వచ్చారు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్‌ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబ్బీర్‌కు మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లానుంచి గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
కేసీఆర్‌కు అబద్దాలు చెప్పడం అలవాటే: షబ్బీర్ అలీ
-
చూసుకుందాం.. దమ్ముంటే రా
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం. పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు. కామారెడ్డికి గోదావరి తెస్తాం ‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం. ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా? కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం.... కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్‌పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
కామారెడ్డిలో పోటీపై షబ్బీర్ అలీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్ ఆలీ తేల్చిచెప్పారు. ‘కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే షబ్బీర్ అలీ పేరు ప్రకటించలేదా?
-
షబ్బీర్ అలీకి కొత్త టెన్షన్.. ప్రమాదంలో పొలిటికల్ కెరీర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటీకే కొందరు నేతలు పార్టీలు మారుతుండగా.. కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మరికొందరు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ.. ఇప్పటి వరకు పోటీ చేసిన స్థానాల్లో కాకుండా కొత్త చోట్ల బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని సమాచారం. కాగా, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రత్యర్థిగా కేసీఆర్ ఉండటంతోనే పోటీకి ఆయన విముఖత చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్‌రావును కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. షబ్బీర్ అలీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు.. మొదటి లిస్టులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్! -
గజ్వేల్ మరో డల్లాస్.. ఏమైంది?
గజ్వేల్/తూప్రాన్: ‘గజ్వేల్‌ను మరో డల్లాస్, లండన్, న్యూయార్క్ చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు.. ఇక్కడికి వచ్చి చూస్తే అట్ల ఏమీ కనిపిస్తలేదు.. ఉన్న బస్టాండ్‌ను కూలగొట్టి రేకుల షెడ్డును నిర్మించిండ్రు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇంకా పూర్తి చెయ్యలే. గిదేనా..? మీరు చేసిన అభివృద్ధి? ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు.. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోవడం ఖాయం’ అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. సోమవారం కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో అర్ధంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనులతోపాటు గజ్వేల్ పట్టణంలో బస్టాండ్, రింగు రోడ్డు, మినీ స్టేడియంను పరిశీలించారు. గజ్వేల్‌ను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటన ల నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటిస్తున్నానని చెప్పారు. మంత్రులు చెబుతున్నదానికి ఇక్కడ పరిస్థితికి పొంతన లేదని విమర్శించారు. వర్గల్లో పేదలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 1,200 ఎకరాల భూమిని ఫుడ్ పార్కు పేరిట లాక్కుంటున్నారని ఆరోపించారు. తూప్రాన్‌లో పర్యటన.. మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డితో కలిసి తూప్రాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అల్లాపూర్ రోడ్డును పరిశీలించి ఇదే అభివృద్ధి అంటే..? అంటూ విమర్శించారు. -
కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం: షబ్బీర్ అలీ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు. సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. -
గంప గోవర్ధన్ పోటీచేస్తే ఓడిపోతారన్న ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ పోటీ
నిజామాబాద్: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పోటీచేస్తే ఓడిపోతారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందన్నారు. హాథ్ సే హాథ్ జోడో, గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాయిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను నిలువరించడానికి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ నినాదం తెరపైకి వచ్చిందన్నారు. సీఎంను పోటీకి ఆహ్వానించానని గంప గోవర్ధన్ అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. గజ్వేల్‌లోని గ్రామాలను నీట ముంచి, ప్రస్తుతం కామారెడ్డిని ముంచడానికి వస్తున్నారా అని సీఎంను ప్రశ్నించారు. కామారెడ్డినుంచి కేసీఆర్, కేటీఆర్, కవితలలో ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, అమ్ముల ముకుందం, గోనె శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, నౌసిలాల్, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీకాంగ్రెస్ నేతలకు షాక్.. ఈడీ నోటీసులు జారీ!
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులు కాంగ్రెస్ నేతలను అక్టోబర్ 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు. -
షబ్బీర్ అలీని సస్పెండ్ చేయండి : కోమటిరెడ్డి
-
రైతు సమస్యలపై క్షేత్రస్థాయికి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతుసమస్యలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బృందాలు పర్యటించి రైతు సమస్యలపై నివేదికను టీపీసీసీకి అందించాలని శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండకు చిన్నారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సంభాని చంద్రశేఖర్, మెదక్‌కు దాసోజు శ్రవణ్, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్లకు మల్లు రవి, శివసేనారెడ్డి, కామారెడ్డి జిల్లాకు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, ప్రీతమ్, మెట్టు సాయికుమార్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని, వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట పొలాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకొని టీపీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 8న ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌ను ముట్టడించాలని, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు, దళితబంధు అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు: రేవంత్‌రెడ్డి సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరి వేస్తే ఉరేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన ఉద్యమించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరికుప్పపై రైతు గుండె ఆగి చనిపోతే సహజ మరణమని కలెక్టర్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఆగమవుతున్నారని, కేసీఆర్‌కు రైతుల ఉసురు తగలడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను తగ్గిస్తే ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. మానవతా రాయ్, శివసేనా రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, హర్కర వేణుగోపాల్, ప్రీతం, మెట్టు సాయి, నర్సింహారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు పంపకాల్లో గొడవతోనే ఉపఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక పార్టీల పంచాయతీ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతోనే ఆ ఎన్నిక జరిగిందని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. సీఎం సీటు, డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలసి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ పరాజయంపై పీఏసీ సమావేశంలో చర్చించామని చెప్పారు. ఓట్లెందుకు తగ్గాయి? అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగిందనే అంశాలపై చర్చించామని.. ఓటమిపై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక నవంబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో ప్రతి జిల్లాలోని నాయకత్వం స్థానికంగా పాల్గొంటుందని.. రోజుకు 7 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర నిర్వహణ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో మండల, జిల్లా, డివిజన్ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీతో అంటకాగేది ప్రాంతీయ పార్టీలే.. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న టీఆర్ఎస్ ఆరోపణలు సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. గాడ్సేవాదంతో నడిచే బీజేపీతో గాంధేయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పటికీ కలవదన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ప్రాంతీయ పార్టీలే బీజేపీ, అమిత్‌షా, మోదీలతో అంటకాగుతున్నాయని, టీఆర్ఎస్ కూడా బీజేపీకి మడుగులొత్తుతోందని విమర్శించారు. తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? పేదోళ్ల రక్తతర్పణంతో వచ్చిన తెలంగాణను రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీ అభ్యర్థి రాజేం దర్ రూ.500 కోట్లు, అహంకారంతో టీఆర్ఎస్ నేతలు రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. డబ్బుల కోసం ఓటర్లు ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలుక్షుద్ర రాజకీయాలతో తెలంగాణను ఎటు తీసుకెళుతున్నాయో మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అర్థం చేసుకోవాలన్నారు. -
నన్ను చెప్పనిస్తే ఉంటా.. లేదంటే వెళ్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా... లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..) ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తాం: షబ్బీర్ అలీ రెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు. ‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్ అలీ తెలిపారు. -
15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని అన్నారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
TS: ‘కోర్’ స్థానంలో పీఏసీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో కొత్త కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో ఉన్న టీపీసీసీ కోర్ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ నియామకంపై చర్చ కమిటీ కూర్పులో తేడా కనిపించకపోయినా ఉన్నట్టుండి అధిష్టానం నుంచి ప్రకటన రావడం, ఈ కమిటీలో కొత్తగా కన్వీనర్ హోదా కల్పించడంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉండే కోర్ కమిటీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతరులు సభ్యులుగా ఉండేవారు. కానీ, తాజాగా నియమించిన పీఏసీకి కొత్తగా కన్వీనర్‌ను నియమించి ఆ బాధ్యతలను మొదటి నుంచీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్వీనర్ హోదాలో షబ్బీర్ అలీ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్య నేతలకు ఉపశమనం ఈ కమిటీ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం మరో సంకేతాన్ని కూడా పంపిందన్నది రాజకీయ వర్గాల భావనగా కనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల చరిష్మా కొంత మేర తగ్గిందని, అయితే తాజా కమిటీలో ముఖ్యులందరికీ స్థానం కల్పించడంతో ఆయా శిబిరాల్లో కొత్త జోష్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సీనియర్లకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలను అధిష్టానం దీనిద్వారా పంపిందని అంటున్నారు. గతంలో కోర్ కమిటీలో ఉన్నట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో సైతం ప్రాతినిధ్యం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలు ఆట మొదలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
-
మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా.. ఇప్పుడు నిలిపి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది. చదవండి: వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే.. -
షబ్బీర్ అలీకి కీలక పదవి!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చదవండి: ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. అయితే ఇటీవలి కాలంలో కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. -
ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు అబద్దాలు చెప్పడంలో గిన్నిస్ బుక్‌లో మొదటి స్థానంలో ఇవ్వచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గాంధీ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 2016 ఎన్నికల్లో 100 రోజుల ప్రణాళిక అన్నారు.. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్నారు.. ఇప్పుడు ఏమైంది? ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే ఎంబీసీలకు కార్పొరేషన్ ఎక్కడా.. మాటంటే మాటే అన్న సీఎం కేసీఆర్ ఏం మాటయ్య నీది అని మండిపడ్డారు. యువకులకు నిరుద్యోగ భృతి ఎక్కడా? అని ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అని కేసీఆర్ వాగ్దానాలు ఇస్తున్నారని, గతంలో ఇచ్చిన వాగ్దానాలే అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ మోసగాళ్లేనని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. పాత బస్తి మెట్రో ఎక్కడా? అని ప్రశ్నించారు. అంతేగాక మూసీ ప్రక్షాళన అన్నారు.. చేశారా అన్నారు. కృష్ణ జలాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది కాంగ్రెస్ అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. చదవండి: డిసెంబర్ నుంచి నీటి బిల్లులు రద్దు: కేసీఆర్ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్న రఘునందన్ వైఎస్ఆర్ను విమర్శించే స్థాయి రఘునందన్‌కు లేదని షబ్బీర్ అలీ అన్నారు. ఒక్కసారి గెలవగానే రఘునందన్ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఘునందన్ గురించి మాట్లాడటం అనవసరమని పేర్కొన్నారు. (చదవండి: ఎంఐఎంతో మాకు ఏం సంబంధం?) -
తండ్రీ, కొడుకులు ఇద్దరూ మోసగాళ్లే: షబ్బీర్ అలీ
-
సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి సవాలు
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. జిల్లాలోని మాచారెడ్డి చౌరస్తాలో ప్రభుత్వ తీరుపై గురువారం రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సన్నరకం వేయకపోతే కొనుగోలు చేయమని, రైతు బంధు ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. సీఎం మాటకు భయపడి రైతులు దొడ్డురకం కాదని సన్నరకం వేసి 90 శాతం పంటను రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, సన్నరకం వరిని రూ. 2500 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న చోటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా పత్తి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 80 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తను వేసిన పంటపై సీఎం అబద్దం చేప్తే సవాలు విసిరి వారం అవుతున్నా ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. ఒకవేళ తను తప్పు చేస్తే ఉరి తీయాలని లేకపోతే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని షబ్బీర్ అలీ సవాలు విసిరిరారు. కాగా, సీఎం కేసీఆర్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. -
అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిస్టార్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బంధీ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థి గురించి గాంధీ భవన్లో సమావేశమై చర్చించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన రేపు చేస్తామని తెలిపారు. దీని గురించి పార్టీలో ఇంకా చర్చ జరగుతుందన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా విలువలు పాటించిందని ప్రశంసించారు. ఇక టికెట్ దక్కుతుందని భావిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి విషయం గురించి ఉత్తమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య విలువలు మరింత పెరుగుతాయి అనుకున్నాము. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ లూటీ చేస్తూ.. రాజకీయాన్ని కమర్షియల్ చేసింది. టీఆరెస్ పార్టీ రాజకీయాలను దిగజార్చుతుంది. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బరిలో మళ్ళీ నిలబెట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలో రాజకీయ పార్టీలు సమావేశాలు-భేటీలు పెట్టొద్దన్న టీఆర్ఎస్ తాను మాత్రం అన్ని జరిపింది. ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ ఇతర పార్టీ నేతలను డబ్బులు పెట్టి కొంటుంది. ఎన్నికల ఉల్లంఘనకు టీఆర్ఎస్ పార్టీ పాల్పడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతాం’ అన్నారు ఉత్తమ్. (చదవండి: ఒక్కటి కాదు.. ఐదు మంత్రి పదవులు ) అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చారని రాములు నాయక్- భూపతి రెడ్డిని డిస్క్వాలిపై చేశారు. లోక్ సభలో ఓడిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టారు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు సూటికేసులు చేతులు మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి-నిజామాబాద్ కలెక్టర్‌కు విజ్ఞపి చేసినా పట్టించుకోవట్లేదు. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిసార్ట్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బందీ చేశారు. లోకల్ బాడీలో ఏ పార్టీ తరపున ఎన్నికైతే పదవీకాలం అయ్యే వరకు అదే పార్టీలో కొనసాగాలి. పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిపై చేయాలి అని కోరారు. -
కూల్చివేతలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్: సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో ప్రార్థనా స్థలాలను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో శనివారం మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని రెండు మసీదులు, ఒక ఆలయం కూల్చివేత పూర్తిగా చట్టవిరుద్ధమని, అన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ మొత్తం తన వ్యక్తిగత జాగీరుగా చూస్తున్నారని, ఆయనకు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉం దని అన్నారు. మొదటి దశ నిరసనలో తమ తమ నివా సాల వద్ద నల్ల జెండాలను ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు. బ్లాక్ మాస్క్‌లు, బ్లాక్ బ్యాడ్జీలు ధరించి అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ హైకమాండ్‌ను సంప్రదించి రెండో దశలో నిరసన ఎలా తెలపాలో నిర్ణయిస్తామని చెప్పారు. సచివాలయంలోని ప్రార్థనా స్థలాలను కూల్చివేసినందుకు ముఖ్యమంత్రి తెలిపిన విచారాన్ని తాము తిరస్కరిస్తున్నట్టు షబ్బీర్ అలీ చెప్పారు. ఈ క్షమాపణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ వెలుపల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం చైర్మన్ సమీర్వలీ ఉల్లా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జాఫర్ జావీద్, ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.అఫ్జలుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదు
సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకోలేదని, మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బిర్ అలీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కోర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నాలుగైదు చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటం వల్ల కొందరికి న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. వారి సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాస్ నీలిమ శ్రీనివాస్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా అని సూటిగా ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కామారెడ్డిలో 40 స్థానాల వరకు గెలుచుకుంటామని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. -
గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్ నేతల గలాటా
సాక్షి, హైదరాబాద్: గులాం నబీ ఆజాద్ రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గాంధీభవన్ వేదికగా ఆజాద్ సమక్షంలోనే పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ సీనియర్ నేతలంతా శవాలతో సమానమని షబ్బీర్ ఎలా అంటారని వీహెచ్ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన షబ్బీర్ తానెప్పుడు అలా అన్నానో చెప్పాలని వీహెచ్‌ను నిలదీశారు. ‘నేను ఎవరితో మాట్లాడలేదు. మీడియాతో అసలే మాట్లాడలేదు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’అంటూ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆజాద్ కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వండి: కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మంగళవారం గాంధీభవన్ హోరెత్తిపోయింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆజాద్‌ను కలిసిన కోమటిరెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై కొంత చర్చ జరిగింది. కొందరు వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోరగా, మరికొందరు మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని కోరారు. దీంతో ఆజాద్ స్పందిస్తూ.. ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆజాద్‌తో సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన వెల్లడించారు. -
‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్: గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు. -
కేసీఆర్ హఠావో... ఆర్టీసీ బచావో
కామారెడ్డి టౌన్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. కేసీఆర్ హఠావో.. ఆర్టీసీ బచావో అని నినదించారు. ఆర్టీసీ కార్మికులు సోమవారం కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ర్యాలీకి షబ్బీర్ అలీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ ‘‘ఆర్టీసీలో ఒక్క కార్మికుడిని డిస్మిస్ చేసినా ప్రజలే నిన్ను (కేసీఆర్‌ను) డిస్మిస్ చేస్తారు’’అని హెచ్చరించారు. ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా టీఆర్ఎస్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీని, కార్మికులను మెచ్చుకుని వారి కాళ్లకు ముళ్లు గుచ్చితే నోటితో తీయాలన్న కేసీఆర్.. ఇçప్పుడు వారిని బెదిరించడం సమంజçసమా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
ఎస్మా అంటే కేసీఆర్ ఉద్యోగాన్నే ప్రజలు తీసేస్తరు
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే ప్రజలు కేసీఆర్కున్న సీఎం ఉద్యోగాన్నే తీసేస్తారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సీఎంకు తగదని హితవు పలికారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వం కూడా ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను అణచివేసి ఉంటే ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రి అని, ఆయన ఉద్యమ సమయంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని, వారి సమస్యలు వెంటనే పరిష్కారించాలని కోరారు. దాదాపు 10 నెలల తర్వాత ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్ తన తప్పులు మాఫీ చేయాలని మాత్రమే కోరారని, ఆయన కలసిన ఎజెండా ఒకటైతే బయట మరోటి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. తాను ప్రధాని ముందుంచిన 22 డిమాండ్లలో రిజర్వేషన్ల అంశం ఎందుకు లేదని ప్రశ్నించారు. -
సానా సతీష్ ఈడీ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్త సానా సతీష్‌బాబు కీలక విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. సానా సతీష్‌తో సంబంధం ఉన్న ప్రముఖులకు ఈడీ నోటీసులు అందించింది. వీరిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపార వేత్త చాముండిలకు ఉన్నారు. (చదవండి : అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్) మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నారు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్ బెయిల్‌కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సానా లావాదేవీలు నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతే కాకుండా సుఖేష్ బెయిల్ కోసం షబ్బీర్ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారికి ఈడీ నోటీసులు అందించింది. సుఖేష్ గుప్తా కోసం లైజనింగ్ చేసిన ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా తనకు ఎలాంటి నోటీలులు అందలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
'కేంద్ర బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదు'
సాక్షి, కామారెడ్డి : కేంద్ర బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం అంబానీ, అదానీలను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇప్పటికీ రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబందు అందరికీ వర్తించడం లేదని, డీఎస్సీ నోటిఫికేషన్ వేయకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని షబ్బీర్ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గ్రామ పంచాయితీలకు ఇస్తామన్న నిధులను విడుదల చేయకపోవడం కేసీఆర్ అసమర్థ పాలనను సూచిస్తుందని తెలిపారు. -
‘వారికి వెంకయ్యే మధ్యవర్తి’
సాక్షి, నిజామాబాద్ : వెంకయ్య నాయుడు మధ్యవర్తిగా ఉండి బీజేపీలో చేరేలా ప్రొత్సాహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమయ్యి మూడు వారాలు గడుస్తున్నా వానలు లేక రైతాంగం బాధపడుతుందన్నారు. కానీ కేసీఆర్ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల్లో రూ. 60 కోట్ల అప్పు ఉంటే.. టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు కేసీఆర్ పాలన సాగుతుందని షబ్బీర్ అలీ విమర్శించారు. సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు, మసీదులు తొలగిస్తే సహించేది లేదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడం మోదీ, కేసీఆర్‌ల తరం కాదన్నారు షబ్బీర్ అలీ. ఆ భవనాలు మరో 100 ఏళ్ల పని చేస్తాయి : జీవవన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ అసెంబ్లీలు భవనాలు ఇంకా 100 సంవత్సరాల వరకూ పని చేస్తాయని తెలిపారు. -
టీఆర్ఎస్ పాలనలో సదుపాయాల్లేవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో కనీస సదుపాయాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలం కాలేకపోయిందని, ఈ అసమర్థ ప్రభుత్వానికి అధికారం ఎలా వస్తోందో ఆ దేవుడికే తెలియాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, అక్షరాస్యతలో దేశంలో తెలంగాణ 25వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలసి ఆయన మాట్లాడారు. రూ.3 వేల విలువ చేసే కేసీఆర్ కిట్స్ ఇస్తున్న ప్రభుత్వం జిల్లా కేంద్ర దవాఖానాల్లో కనీసం వెంటిలేటర్ సౌకర్యం కల్పించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కమీషన్ల కక్కుర్తితో మిషన్ భగీరథ నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రాణహిత నది నీటి వినియోగంలో రాష్ట్రం మూడేళ్లు వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని సీఎం హోదాలో తొలి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో మరో లక్ష వరకు ఖాళీలు ఏర్పడ్డాయని, మొత్తం 2.2 లక్షల ఉద్యోగాలకుగాను ఈ ప్రభుత్వం కేవలం 20 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోతే ఉద్యమిస్తాం... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది కేసీఆర్ కిట్స్ కోసమో, ఆసరా పింఛన్ల కోసమో అన్నట్టు కేసీఆర్ భావిస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయో శ్వేతపత్రం ప్రకటించాలని, వీటిని ఎలా భర్తీ చేస్తారో కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికై నాలుగు నెలలైనా సర్పంచ్‌లకు ఇంతవరకు చెక్‌పవర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 24 గంటల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తమను నిరాశకు గురిచేసిందన్నారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల్లో ఏమేమి నెరవేర్చారో చెబుతారని ఆశించామని, కానీ ఆసరా పింఛన్లు, కరెంటు తప్ప దేని గురించి చెప్పలేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం సాధించాల్సిన ప్రగతిలో 10 శాతం కూడా సాధ్యం కాలేదని అన్నారు. టీఆర్ఎస్ ఐదేళ్ల పాలన పూర్తిగా వైఫల్యాలమయమని, ఇది కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని షబ్బీర్ అలీ విమర్శించారు. -
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు?
సాక్షి, బాన్సువాడ: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మంగళవారం స్పీకర్‌ను బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్దమని వారు స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ నివాసంలో భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..ఇంతకు ముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, జూలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల బాన్సువాడకు వచ్చి కలిసినట్టు పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేస్తామంటూ.. ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారం అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడూ.. గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేసామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. డిస్ క్వాలిఫై నోటీసు ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలో ఓ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. -
‘ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్డెట్’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బడ్డెట్‌ను ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్ తక్కువగా కేటాయించిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కేటాయింపుపై బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులో గత బడ్జెట్ కంటే సుమారు 100 కోట్లకుపైగా తగ్గించారని చెప్పారు. రుణమాఫీ ఏక కాలంలో చేస్తారా.. విడతల వారిగా చేస్తారా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. మొన్నటి అకాల వర్షం వలన జరిగిన పంట నష్టానికి ఇప్పటి వరకు కనీసం పర్యవేక్షణ చేయలేదని మండిపడ్డారు. ధరణి వెబ్ సైట్ పనిచేయడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు బడ్జెట్లో డబ్బులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేశారు కానీ బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదన్నారు. విద్య, వైద్యానికి బడ్జెట్లో డబ్బులు తక్కువగా కేటాయించారని తెలిపారు. -
బహిరంగ సభ స్పీచ్‌లా గవర్నర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం బహిరంగ సభ స్పీచ్‌లా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని, గతంలో చెప్పిన విషయాలే ఇప్పుడు చెప్పారని విమర్శించారు. 2014లో ప్రకటించిన, ప్రారంభించిన పథకాలను ఎప్పుడు పూర్తి చేస్తారో, ప్రస్తుత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పట్నుంచి ప్రారంభిస్తారో చెప్పలేదన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెబితే సంతోషించేవారమని భట్టి అన్నారు. పింఛన్లు, నిరుద్యోగ భృతిల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగం సాగిందని చెప్పారు. తనను సీఎల్పీ నాయకునిగా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో పాటు టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిని కలుపుకుని సమష్టిగా ముందుకెళ్తామన్నారు. ఆ విషయాలు చెబితే బాగుండేది: షబ్బీర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ స్పీచ్‌ను గవర్నర్ కాపీ కొట్టి ఉభయసభలనుద్దేశించి చదివారని షబ్బీర్ అలీ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం కాపీ పేస్ట్‌లా సాగిందని, రైతు రుణమాఫీ, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారో చెబితే బాగుండేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పదవీ విరమణ వయసు పెంపుపై స్పష్టత లేదని, ముస్లిం రిజర్వేషన్లపై కూడా అలాగే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అప్పటి హామీలే ఇప్పుడు ప్రస్తావించారు: శ్రీధర్ బాబు 2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకిచ్చిన హామీలనే గవర్నర్ ఇప్పుడు ప్రస్తావించారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌పై గవర్నర్ అబద్ధాలు చదివారని, దేశంలో మిగులు విద్యుత్ ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. కాంగ్రెస్ అమలు చేసిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని, అలా కాకుండా గత ప్రభుత్వాలు తప్పు చేశాయనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీపై స్పష్టత లేద న్నారు. రుణమాఫీ ఏకకాలంలో చేస్తా రో లేదో చెప్పాలన్నారు. రైతుబంధు పథకం కింద ఇంకా చాలా మంది రైతులకు డబ్బులు అందలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ రాష్ట్ర ప్రజల గొంతుక.. అసెంబ్లీలో సీఎల్పీ రాష్ట్ర ప్రజల గొంతుక అవుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా పనిచేస్తామని భట్టి చెప్పారు. సభ హుందాగా, ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందని ఆశిస్తున్నామని, ప్రతిపక్షం బలంగా ఉండాలని పాలకులు కోరుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోతారంటూ అధికార టీఆర్ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోందని, టీఆర్ఎస్ ఆకర్‡్షకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగరని అన్నారు. -
కేసీఆర్ స్పీచ్‌లా గవర్నర్ ప్రసంగం
-
‘టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది’
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అందరిని కలుపుకుని ముందుకెళతానని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, పింఛన్ గురించి గవర్నర్ ఏం చెప్పలేదని తెలిపారు. పాలకులు.. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆకర్ష్‌కు తమ ఎమ్మెల్యేలు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్లోకి వెళ్లలేదని.. కావాలనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గవర్నర్ ప్రసంగం కాపీ, పేస్ట్‌లా ఉంది : షబ్బీర్ ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడే మాటలనే గవర్నర్ కాపీ కొట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ, పింఛన్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారో గవర్నర్ స్పష్టం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై కూడా గవర్నర్ ప్రసంగంలో మైనార్టీగా ప్రస్తావించారని.. దీని గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీల్లో కోర్టును సాకుగా చూపి బీసీలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ ఎటుపోయాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. యాభై శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు బీసీలపై ప్రేమఉంటే.. బీసీ రిజర్వేషన్లపై ఎందుకు కోర్టులో రివ్వ్యూ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్దాలు కొన్ని రోజులే నడుస్తాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కారణాలను సమీక్షించుకుంటున్నామని తెలిపారు. పొరపాట్లను సరిదిద్దుకుంటామని, రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ రెడీగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి.. కాంగ్రెస్‌ను ప్రజలు తప్పక గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్ సభ ఎలక్షన్ ఫలితాలు ఉంటాయని జోష్యం చెప్పారు. -
ఆ ఇద్దరిని అనర్హులను చేయండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు పిటిషన్ ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు సభ్యులు పార్టీ మారినందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డిలు కూడా తమకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని మండలి చైర్మన్‌ను కోరారు. చైర్మన్ స్వామిగౌడ్‌ను కలసి రాములు నాయక్ లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. భూపతిరెడ్డి కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు రాగా, చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యమేనా: షబ్బీర్ అలీ మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం షబ్బీర్‌అలీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సంతోష్, లలితలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ ఇచ్చినట్లు తెలిపారు. చట్టాలను కాపాడాల్సిన వారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన పిటిషన్లను పట్టించుకోకుండా, టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగానే ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బర్రెలను, గొర్రెలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్నారని ఆరోపించారు. తమ పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు గానీ, మండలి చైర్మన్‌కు గానీ లేదని, ఎన్నికల కమిషన్ మాత్రమే ఆ పనిచేయగలదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా గెలిచిన నాటి నుంచి సీఎం కేసీఆర్ తిరగడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక కార్యకర్తగానే ఎమ్మెల్సీ అయ్యా: రాములు నాయక్ తనను ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ చేశారనే సమాచారాన్ని గవర్నర్ కార్యాలయం నుంచి కోరానని, అందుకే సమయం కావాలని అడిగినట్లు చెప్పారు. సామాజిక కార్యకర్త హోదాలోనే తనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చిందని, తాను టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనట్లు కాదని, తాను కాంగ్రెస్ సభ్యుడిని కూడా కాదన్నారు. అయినా చైర్మన్ స్పందన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎస్టీని కాబట్టే కేసీఆర్ తనపై చర్యలు తీసుకుం టున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సుపారీ ఇచ్చి తనను అంతమొందించే కుట్ర జరుగుతోం దని, తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో చేరిన వారికో న్యాయం, తనకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని, కోర్టుకు వెళ్తానని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, తనకు అందిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు తనకు కూడా సమయం కావాలని కోరినట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చెప్పారు. -
షబ్బీర్ ‘హోదా’కు గండం!
సాక్షి, కామారెడ్డి: శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ ‘హోదా’కు గండం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు శుక్రవారం లేఖ సమర్పించారు. మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉండగా, ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మిగిలిన ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు గతంలోనే టీఆర్ఎస్ పంచన చేరారు. తాజాగా మరో ఇద్దరు కూడా కా రెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ నలుగురు కలిసి కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు. లేఖను పరిశీలించిన మండలి చైర్మన్.. కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతో మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం కేవలం రెండుకు చేరింది. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారి పదవీ కాలం కూడా వచ్చే మార్చితో ముగియనుంది. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా కోల్పోయిన పక్షంలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ తన హోదాను కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘చే’జారి.. కారెక్కి! రాష్ట్రంలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 88 చోట్ల గెలుపొంది, రెండోసారి అధికారంలోకి వచ్చింది. వచ్చే నెలలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి మేలో జరిగే పార్లమెంటు ఎన్నికల వరకూ అన్నింటా విజయం సాధించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా శాసన మండలిలో ప్రతిపక్షాన్ని బలహీన పర్చేందుకు ఎత్తులు వేసింది. మెజారిటీ సభ్యులు ‘చే’జారడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ‘కారెక్కే’ందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఆ పార్టీ చేతి నుంచి ప్రతిపక్ష హోదా జారిపోతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ ప్రతిపక్ష నేత హోదాను కోల్పోవలసి వస్తుందని భావిస్తున్నారు. షబ్బీర్‌అలీ ఎమ్మెల్సీ పదవి రానున్న మార్చి నెలాఖరుతో ముగియనుంది. అప్పటి వరకు ప్రతిపక్ష నేత హోదా కొనసాగుతుందనుకున్న ఆయనకు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించడమే గాకుండా కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలేనం చేసినట్టుగానే, శాసన మండలిలో కాంగ్రెస్ సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు, షబ్బీర్‌అలీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలి చైర్మన్‌ను కలిసి, సీఎల్పీ సమావేశమే జరగలేదని, విలీనం నిర్ణయం తీసుకోలేదని లేఖ సమర్పించారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ సభ్యులుగా ‘గుర్తించిన’ చైర్మన్.. మండలిలో కాంగ్రెస్ సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెజారిటీ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ సత్వరమే నిర్ణయంం తీసుకున్నారు. ఆ నలుగురు సభ్యులను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు బులెటిన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోనుంది. అయితే, మండలిలో కాంగ్రెస్ సభాపక్షానికి తానే నేతగా ఉన్నానని, తాను లేకుండా తీసుకునే నిర్ణయం ఎలా చెల్లుతుందని షబ్బీర్‌అలీ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ స్వామిగౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో శాసనసభలో టీడీపీ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడానికి మండలి చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో షబ్బీర్ ‘హోదా’ దాదాపు పోయినట్లేనని సమాచారం. ఓటమి నుంచి తేరుకోకముందే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్‌అలీ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి చెందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆయన కేవలం 4,557 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆశలు పెట్టుకున్న షబ్బీర్ స్వల్ప తేడాతో ఓటమి చెందడంతో నిరాశ చెందారు. ఆ ఓటమి నుంచి తేరుకోక ముందే శాసనమండలి ప్రతిపక్ష నేత హోదాపై టీఆర్ఎస్ గురి పెట్టింది. మండలిలో నలుగురికి గాలం వేయడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. పైగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు తాము మండలిలో కాంగ్రెస్ సభాపక్షాన్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి చైర్మన్ అంగీకరించడంతో షబ్బీర్‌అలీ ప్రతిపక్ష నేత హోదా పోతుందన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. -
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజే ఆ వార్త నిజమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి.. నిన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసిన ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్ కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఉన్న 7 మంది ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు చేరింది. మిగిలిన ఇద్దరు సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చిలో ముగియనుంది. దీంతో మండలిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం శూన్యమవనుంది. ఇదిలాఉండగా..విలీన పరిణామాలతో షాక్ తిన్న కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది. తమ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను హుటాహుటిన మండలికి పంపింది. మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ని కలిసిన షబ్బీర్, పొంగులేటి విలీన ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపారు. -
కేసీఆర్,మండలి ఛైర్మన్‌పై మండిపడ్డ షబ్బీర్ అలీ
-
రాత్రికి రాత్రే ఓటింగ్ శాతం ఎలా పెరిగింది?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గడిబిడి జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు తేడా వచ్చిందన్నారు. వేల సంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రికిరాత్రే 11 శాతం ఓటింగ్ ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి పిరాయించిన దామోదర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామోదర రెడ్డి ఫిరాయింపుకు సంబంధించి పూర్తి వివరాలు మండలి చైర్మన్‌కు అందించామన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన చైర్మన్..తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని నాలుగేళ్లుగా ఫిర్యాదు చేసిన కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నాలుగున్నరేళ్లు మంత్రిగా కొనసాగించారని విమర్శించారు. కేసీఆర్‌కి శిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు. గెలుపు ఓటమిలు సహజం రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని షబ్బీర్ అలీ అన్నారు. ఓడిపోయినంత మాత్రన ఇంట్లో ఉండమని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీలపై అప్పుడే కేసీఆర్ మాటమార్చారని దుయ్యబట్టారు. మూడు రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏంటో.. కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతో వేయి మంది బీసీ సర్పంచ్‌లు, 9వేల మంది వార్డ్ మెంబర్లు నష్టపోయారని ఆరోపించారు. బీసీలు మెల్కొని ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని కోరారు. -
ఉమ్మడి జిల్లాను స్వీప్ చేస్తున్నాం: షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం కామారెడ్డిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల మూలంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందన్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడిపోయిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మూడు నెలలుగా ప్రచారం నిర్వహిస్తే, తమ పార్టీ అభ్యర్థులు కేవలం ఇరవై రోజులే ప్రచారంలో పాల్గొని కబడ్డీ ఆడుకున్నారని తెలిపారు. జిల్లాలో చాలాచోట్ల పోలీసులు టీఆర్ఎస్కు ఏజెంట్లుగా పనిచేసి వారి ఆగడాలను అడ్డుకోలేకపోయారన్నారు. చాలాచోట్ల టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు చేస్తే కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపైనే దాడులు జరిగితే, తమవారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఓటర్లకు ఒకవైపు ప్రలోభాల ఎరచూపారని, మరోవైపు టీఆర్ఎస్కు ఓటేయకుంటే పింఛన్లు రద్దవుతాయని బెదిరించారని తెలిపారు. ఎన్ని రకాల ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులు సురేందర్, బాల్‌రాజులపై రకరకాల ఒత్తిడి తీసుకువచ్చారని, వాళ్లు భయపడకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదం పొందారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, తమ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేసినా, కోర్టుల్లో కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున నిరంతరం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఓటు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి నియోజక వర్గ అభ్యర్థి నల్లమడుగు సురేందర్, నాయకులు ఎంజీ వేణు, నల్లవెల్లి అశోక్, కైలాస్ శ్రీను, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, భీంరెడ్డి, బాల్‌రాజు, మోత్కూరి శ్రీను, అన్వర్, గోనె శ్రీను, అంజద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలతో సమాలోచనలు జిల్లాలోని ఆయా నియోకజ వర్గాలకు చెందిన నేతలు శనివారం షబ్బీర్‌అలీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములపై పార్టీ నేతలతో మాట్లాడారు. ఎల్లారెడ్డి అభ్యర్థి సురేందర్, బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజు తదితరులతో పాటు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిజామాబాద్‌లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలుస్తుంది
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పలు జాతీయ న్యూస్ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ సర్వేలు ఎలా ఉన్నా.. ప్రజలు సర్వేలు చూసి ఓట్లు వేయరని తెలిపారు. మహాకూటమిదే అధికారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ.. మహాకూటమికి 70 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను మించి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఓట్లు భారీగా గల్లంతు అయ్యాయని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. -
ఒకే ఒక్కడు: షబ్బీర్‌అలీ
సాక్షి,కామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుని రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఘనతను ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత, కాంగ్రేస్ అభ్యర్ధి షబ్బీర్ అలీ సొంతం చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మరెవరికీ ఇప్పటివరకు కేబినెట్లో పనిచేసే అవకాశం దక్కలేదు. ఇక్కడి నుంచి మంత్రి పదవిలో కొనసాగిన ఏకైక నేత షబ్బీర్ ఒక్కరే. ఆయన మంత్రిగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన మరోసారి విజయం సాధిస్తే మూడోసారి మంత్రి పదవిలో గానీ, మరేదైనా ఉన్నత పదవిలోగానీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రెండుసార్లు మంత్రిగా.. 1952 నుంచి ఇప్పటివరకు కామారెడ్డి నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా, 11 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఒక్క షబ్బీర్‌అలీని మాత్రమే మంత్రి పదవి వరించింది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు 1989 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి వరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న తెలుగుదేశం హవాకు షబ్బీర్ బ్రేకులు వేశారు. టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌అలీ తన 37 ఏటనే మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రి అయ్యారు. అప్పటి నుంచే జాతీయ స్థాయిలో పార్టీ ప్రముఖులతో సంబంధాలు పెరిగాయి. ఏఐసీసీలోని ముఖ్య నేతలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడిగా పేరు సంపాదించారు. 2004 ఎన్నికల్లో మరోమారు గెలిచిన ఆయన అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. అయిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో విద్యుత్ సబ్స్టేషన్లు, గోదావరి జలాలు, ఆలయాల అభివృద్ధి, ఇందిరాగాంధీ స్టేడియం, మైనారిటీ గురుకులం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తనదైన ముద్ర వేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేసి, తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ ప్రస్తుత ఎన్నికల బరిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి గెలిస్తే.. రెండుసార్లు మంత్రి పదవిలో కొనసాగిన షబ్బీర్‌అలీ ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పలుసార్లు అదృష్టం కలిసి రాలేకపోయినా ఈ సారి మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే మరోసారి ఉన్నత పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. -
టీఆర్ఎస్ను ఓడించేందుకే మహాకూటమి: షబ్బీర్‌అలీ
సాక్షి, కామారెడ్డి రూరల్: టీఆర్ఎస్ను ఓడించేందుకే మహాకూటమి ఏర్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మండలంలోని దేవునిపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. డప్పు, డోలు వాయిద్యాలు, వాడవాడల పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి, ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ అయిందని, ప్రజలకు మాత్రం ఒరింగేదేమి లేదన్నారు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ తొలగిస్తామన్నారు. జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, మాజీ సర్పంచ్‌లు ఉరుదొండ రాజయ్య, బండారి యాదవరెడ్డి, ఎంపీ టీసీ నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, భూమని బాల్‌రాజు, చెట్కూరి గంగారాం, నీలం సుధాకర్, నీలం వెంకటి, నాగల్ల రాజయ్య, మర్కంటి స్వామి, నాగరాజు, కిరణ్‌కుమార్, నౌసిన్, మిద్దెలసాయిలు, బాలస్వామి, దొడ్లె మల్లేష్, గంగారాజ్యం, ప్రభాకర్, భైరయ్య, అరీఫ్, సాకలి శ్రీను, సాకలి నర్సింలు పాల్గొన్నారు. గెలిస్తే కామారెడ్డి ప్రజలకు సేవచేస్తా దోమకొండ: తనను గెలిపిస్తే కామారెడ్డి ప్రజలకు సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన దోమకొండలో విజయశాంతితో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాము గెలిస్తే తిరిగి ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. పేద ప్రజలకు తినడానికి రేషన్ ద్వారా తొమ్మిది రకాల సరుకులు, ఏడాదికి ఆరు సిలిండర్లు అందిస్తామని ఆయన వివరించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందించి ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పార్టీ నాయకులు తిర్మల్‌గౌడ్, నల్లపు శ్రీను, మర్రిలింగం, అనంతరెడ్డి ఉన్నారు. ఓటమి భయంతో కుట్రలు చేస్తున్నారు సాక్షి, కామారెడ్డి: నియోజకవర్గంలో ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓడిపోతామన్న భయం పట్టుకుని రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తన గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. దేవునిపల్లిలో ప్రచారం నిర్వహించిన షబ్బీర్‌అలీ, బీబీపేట, దోమకొండల్లో సినీనటి విజయశాంతితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. కాంగ్రెస్‌లో చేరిన ఇసన్నపల్లివాసులు భిక్కనూరు: మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ప లువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. శాస న మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ వీరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు గుడిసె రాములు, వడ్ల తిర్మల్స్వామి, రాజేష్, రమేశ్ ఉన్నారు. -
కామారెడ్డిలో .. ఉద్దండుల సమరానికి 24 ఏళ్లు
సాక్షి, కామారెడ్డి క్రైం: పార్టీలు మారాయి.. కానీ ప్రత్యర్థులు మారలేదు.. రెండున్నర దశాబ్దాల పోటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 24 ఏళ్లుగా ప్రతిసారి నువ్వా, నేనా అన్నట్లుగానే కామారెడ్డి రాజకీయ రణక్షేత్రంలో తలపడుతున్నారు ప్రధాన పార్టీల ప్రత్యర్థులు షబ్బీర్‌అలీ, గంపగోవర్ధన్లు. సూటి ప్రశ్నలు, ఘాటైన విమర్శలు, దేనికైనా సిద్ధమే అనే పోటీతత్వం వారిద్దరిది. అందుకే కామారెడ్డి రాజకీయ ముఖచిత్రం ప్రతిసారి ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. విజయం ఒక్కరినే వరిస్తుంది, కానీ ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య జరుగనునన్న ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుందని రాజకీయవర్గాలు విశ్లేశిస్తున్నాయి. 1994 నుంచి .. కామారెడ్డి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్. మాచారెడ్డి మండలానికి చెందిన షబ్బీర్‌అలీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1989, 2004 ఎన్నికల్లో గెలిచిన షబ్బీర్‌అలీ రెడు సార్లు మంత్రిగా పనిచేశారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన గంప గోవర్ధన్ సింగిల్‌విండో చైర్మన్‌గా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీపై గెలిచారు. 1994లో టీడీపీ నుంచి యూసుఫ్‌అలీకి టికెట్ ఇవ్వడం, 2004లో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా గంపకు టికెట్ దక్కలేదు. 2009లో రెండోసారి, 2014లో మూడోసారి గంప, షబ్బీర్ల మధ్యనే పోటీ కొనసాగింది. మూడుసార్లు విజయం గంపగోవర్ధన్నే వరించినప్పటికీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగాయి. 2014లో టీఆర్ఎస్ నుంచి గంప, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీలో నిలిచారు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీతో గెలవడం చూస్తే వారిద్దరి మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది. బలమైన కేడర్ వారి సొంతం కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌అలీలు ఇద్దరికీ బలమైన కేడర్ ఉంది. ఇద్దరికీ గ్రామ, మండల స్థాయిలో వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనాన్ని తరలించగల సమర్థులు. రెండుసార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ తాను అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను అక్కున చేర్చుకుని అండగా నిలిచారు. అలాగే గంపగోవర్ధన్ అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకుల, కార్యకర్తల అభ్యున్నతికి చేయందించారు. అందుకే ఇప్పటికీ వారితో కలిసి పనిచేయడానికి ఆయా పార్టీల్లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. పోటాపోటీ పార్టీలకు కార్యకర్తలే బలం. బలమైన క్యాడర్‌ను సంపాదించుకున్న చిరకాల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్ల మధ్య పోటీత్వమూ ఎక్కువే. ఎన్నికల్లో తలపడిన ప్రతిసారీ పోటీ హోరాహోరీగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, కామారెడ్డి అభివృద్ధి విషయంలో, రాజకీయాల విషయంలోనూ ఒకరిపై ఒకరు తరచుగా ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఏకంగా వారు ఇద్దరూ తమ ఆస్తులు వెల్లడించేందుకు కామారెడ్డి గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్ద రెండు నెలల క్రితం పంచాయతీ పెట్టుకున్న సందర్భం పోలీస్‌శాఖను సైతం అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య జరుగనున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. రసవత్తరంగా పోరు ప్రతిసారి ఎన్నికల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగే పోరులో తానే తక్కువ కాదంటూ ఈసారి బీజేపీ వచ్చి చేరింది. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు అనగానే అందరి దృష్టి గంప, షబ్బీర్లపైనే ఉండేది. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఇప్పటివరకు పాలించిన గంప, షబ్బీర్లనే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గంప గోవర్ధన్ ముందుకు వెళ్తుండగా, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ మేనిఫెస్టోతో షబ్బీర్‌అలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కామారెడ్డి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఉద్దండుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. -
కేసీఆర్ ఫ్యామిలీకే బంగారు తెలంగాణ : షబ్బీర్ అలీ
సాక్షి, కామారెడ్డి రూరల్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారు స్తానని చెప్పిన కేసీఆర్ అది ఆయన కుటుంబానికే లబ్ధి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం మండలంలోని అడ్లూర్, ఇల్చిపూర్‌ల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో, బోనాలతో షబ్బీర్అలీకి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకుంటే కేసీఆర్ బంగారు తెలంగాణను ఆయన ఇంట్లోనే బందిచేశాడన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ 180 వాగ్ధానాలు చేశాడని, నాలుగున్నరేళ్లలో ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పింఛన్లు ఏమైనా వాళ్ల తాత జాగీరా, కేసీఆర్ ఇంట్లోంచి ఇస్తున్నాడ అని అన్నారు. గోదావరి జలాలు, గ్రామానికో సబ్‌స్టేషన్, ప్రాణహి త చేవేళ్ల, డెయిరీ కళాశాల వంటి పనులు చేపట్టిన ఘనత తనదేనన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యూసుఫ్‌అలీ, జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెరుమండ్ల రాములు, యూత్ అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, ఎంపీటీసీ సభ్యులు నిమ్మవిజయ్‌కుమార్‌రెడ్డి, ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, ఆనంద్‌రా వు, మాణిక్యరెడ్డి, సంతోష్, భూమయ్య, తిరుపతి, ప్రతాప్, నా గగౌడ్, జి బాలయ్య, పెంటగౌడ్, ధర్మగౌడ్, ఈశ్వర్, మహేష్, హన్మంతు, ముదాం నర్సింలు, బాల్‌నర్సాగౌడ్ పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి మద్దతుగా మండలంలోని దేవునిపల్లి, క్యాసంపల్లి, గర్గుల్, ఇస్రోజివాడి, అడ్లూర్, శాబ్దిపూర్, టే క్రియాల్‌ల్లో గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. మండల యూత్ అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, నీలం వెంకటి, నీలం సుధాకర్, చెట్కూరి గంగారం, రియాజ్, మునీర్, నాగరాజు, నౌసిన్, నాగల్ల రాజయ్య, మర్కంటి స్వామి, మిద్దెల సాయిలు, కిరణ్‌కుమార్, బాలస్వామి, సాకలి శ్రీనివాస్ పాల్గొన్నారు. సాక్షి, భిక్కనూరు: మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. షబ్బీర్‌అలీ హయాంలో మండల కేంద్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివ రించారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి లింబాద్రి, మాజీ సర్పంచ్‌లు సత్యంరెడ్డి, నాగభూషణంగౌడ్, మాజీ ఉపసర్పంచ్లు దయాకర్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నాయకులు సుదర్శన్, సరస్వతి ప్రభాకర్, భూమయ్య, దశరత్, నర్సింలు, నీల అంజ య్య, లక్ష్మీనారాయణ, కల్లూరి సిద్దరాములు పాల్గొన్నారు. -
మైనారిటీలకు పెద్దపీట.. గంప గోవర్ధన్
సాక్షి, కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని హసన్ ఫంక్షన్హాల్లో ఎంఐఎం కార్యకర్తలు, ముస్లీం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. షాదీముబారక్‌తో పేద ముస్లీం ఆడపిల్లల వివాహానికి ఆర్థికంగా ఆదుకున్నామని గుర్తు చేశారు. ముస్లీం రిజర్వేషన్ల కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరిసుష్మ, వైస్‌చైర్మన్ మసూద్‌అలీ, నాయకులు కాళ్లగణేష్, జూకంటి ప్రభాకర్, పిప్పిరి వెంకటి ఉన్నారు. పాతపట్టణంలో గంప గోవర్ధన్ ప్రచారం సాక్షి, కామారెడ్డి అర్బన్: పాత పట్టణంలో గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ తన ఎన్నికల ప్రచారం చేశారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారానికి జిల్లా ముదిరాజ్ ఐక్యవేదిక అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని అభినందనలు తెలిపారు. నాయకులు రావుల గంగాధర్, ప్రభాకర్ యాదవ్, చందు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సాక్షి, కామారెడ్డి రూరల్: మండలంలోని లింగాపూర్‌కు చెందిన కింది వాడకట్టు మున్నూరుకాపు రైతులు 30 మంది మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో చెరోల్ల కాశయ్య, లింగం, బొందయ్య, సంగయ్య, నారాయణ, బాలయ్య, ప్రవీన్, సంగయ్య, నర్సింలు, రాజయ్య చేరారు. టీఆర్ఎస్ నాయకులు షానూర్, బండారి నర్సారెడ్డి, నీరడి బాల్‌రాజు, తోట సంగమేశ్వర్, రాంరెడ్డి యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, భాగయ్య ఉన్నారు. మండలంలోని అడ్లూర్‌కు చెందిన పద్మశాలి సంఘంకు చెందిన 40 మంది గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, గోపిగౌడ్, బల్వంత్‌రావు, లద్దూరి లక్ష్మీపతియాదవ్, గోపిగౌడ్ ఉన్నారు. -
మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్.. షబ్బీర్‌అలీ
సాక్షి, మాచారెడ్డి: ఇచ్చిన మాటకు కట్టుబడేది కాంగ్రెస్ పార్టీయేనని మండలి విపక్షనేత, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్‌అలీ షబ్బీర్ అన్నారు. బుధవారం మండలంలోని లచ్చాపేట్, ఘన్పూర్(ఎం), మాచారెడ్డి చౌరస్తా, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, బండరామేశ్వర్‌పల్లి, యెల్పుగొండల్లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. కేసీఆర్ మాయ, మాటలు నమ్మే రోజులు పోయాయన్నారు. ప్రతి రెండు బోర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి రైతులకు విద్యుత్ కొరత తీర్చానని షబ్బీర్‌అలీ వివరించారు. మండలంలోని యువతకు ఎన్నో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో ఇప్పించానన్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పాలనలో హౌసింగ్బోర్డులు తొలగించేశారన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, పంపరి శ్రీనివాస్, ప్రజాకూటమి నేతలు వీఎల్ నర్సింహారెడ్డి, రాజిరెడ్డి, మాణిక్యరెడ్డి, రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు భూంరెడ్డి, అలీఖాన్, బ్రహ్మనందారెడ్డి, రమేశ్‌గౌడ్, రాజ్‌కుమార్ ఉన్నారు. కాంగ్రెస్‌లో పలువురి చేరిక సాక్షి, కామారెడ్డి రూరల్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం ప్రతినిధులు 20 మంది సభ్యులు, స్టార్ బాయ్స్ యూత్ సభ్యులు 10 మంది షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి పెద్ద నారాయణ, బండారి యాదవరెడ్డి ఉన్నారు. పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం సాక్షి, కామారెడ్డి టౌన్: పట్టణంలోని 23, 24 వార్డుల్లో కాంగ్రెస్ పట్టణ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేశారు. మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తు ఓటర్లను అభ్యర్థించారు. పదేళ్లుగా అభివృద్ధిని నోచుకోని కామారెడ్డిని అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కన్నయ్య, నాయకులు ఇర్ఫాన్, రాజు, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాకూటమి తరఫున... పట్టణంలో మహాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి మద్దతుగా సీపీఐ, తెలుగుదేశం, నాయకులు బుధవారం పట్టణంలో ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తు వచ్చాడని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిచంచాలన్నారు. చేతి గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి, నాయకులు బాల్‌రాజ్, దశరథ్, ప్రవీన్, టీడీపీ నాయకుడు మాణిక్యరెడ్డి పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ
సాక్షి, కామారెడ్డి రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే కేసీఆర్ కుటుంబానికి, ఆయన ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ వచ్చిందని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం చిన్నమల్లారెడ్డి, తిమ్మక్‌పల్లి(కె), సరంపల్లి, లింగాయిపల్లి, కోటాల్‌పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో, బోనాలతో షబ్బీర్అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాలుగున్నరేళ్లలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నాడని విమర్శించారు. డబుల్ బెడ్రూ ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూపంపిణీ చేస్తానని చేయలేదని, కేసీఆర్ జూటా మాటలు నమ్మవద్దన్నారు. రూ. 300 కోట్లతో కేసీఆర్, మూడంతుస్తుల భవనాన్ని గంప గోవర్ధన్‌లు నిర్మించుకున్నారన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇవ్వరని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార న్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో రూ. 11 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేదని ఇప్పుడు రూ. 2 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పేరుతో రోడ్లన్నీ నాశనం చేశారని కానీ ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదన్నారు. పథకాల పేరుతో టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, ఒక్కొక్కరికి 7 కిలోల సన్నబియ్యంతో పాటు 9 రకాల సరుకులు అందిస్తామని, ఏడాదిరి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సయ్యద్ యూసుఫ్‌అలీ, ఎడ్ల రాజిరెడ్డి, జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఉరుదొండ నరేశ్, ఎంపీటీసీ సభ్యుడు ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్ పాల్గొన్నారు. -
అభ్యర్థుల పోటా పోటీ
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ⇔నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనిస్తున్నారు. ⇔నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్ రణరంగాన్ని తలపిస్తోంది. ⇔బోధన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ⇔ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డిలు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ⇔బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ⇔కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ⇔ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. ⇔బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది. ⇔జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంలు సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ⇔పలు స్థానాల్లో బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
తండ్రి ఫామ్‌హౌస్‌కు తనయుడు అమెరికాకు
బిక్కనూరు : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పామ్‌హౌజ్‌కు, ఆయన తనయుడు కేటీఆర్ అమెరికాలో రెస్టు తీసుకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలు నాల్గున్నర ఏళ్లుగా కేసీఆర్ నియంత పాలనను కళ్లార చూశారని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను పాతర పెట్టెందుకు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కాగా మూటలు కట్టుకోవడం ప్రజా ధనాన్ని దోచుకోవడం టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. షబ్బీర్అలీకి గ్రామస్తులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఇంద్రకరన్‌రెడ్డి, నల్లవెళ్లి అశోక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు లింబాద్రి, కుంట చిన్నమల్లారెడ్డి, నేతలు పుల్లురి రామస్వామి, నర్సింలు, బాల్‌నర్సవ్వ, సుదర్శన్, నాగభూషణంగౌడ్, సిద్దగౌడ్, అంకం రాజు, లింగారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్రం ఘనత కేసీఆర్‌దే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మాజీ ప్రభుత్వ విప్ సయ్యద్ యూసుప్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తరపున ప్రచారం చేశారు. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రం ద్రోహుల చేతిలో తల్లడిల్లుతుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రైతుబంధు చెక్కులు 30 శాతం మందికి ఇంకా అందలేదన్నారు. తాత ముత్తాతల నుంచి భూములు ఉన్న రైతులకు రైతుబంధు పథకం వర్తించలేదని, రియల్టర్లకు, భూములు క్రయవిక్రయాలు చేసే వారికి మాత్రం రైతుబంధు చెక్కులు అందాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు రాకేష్, భూమయ్య, సిద్దరాములు ఉన్నారు. -
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
సాక్షి, కామారెడ్డి రూరల్: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం మండలంలోని అడ్లూర్ జీపీ పరిధిలోని డ్రైవర్స్, గుమాస్తా, బీడీ వర్కర్స్ కాలనీ, రామేశ్వర్‌పల్లిల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల ప్రజలు షబ్బీర్అలీకి బోనాలు, డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెరుమండ్ల రాములు, ఎంపీటీసీ నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, భూమని బాల్‌రాజు, మర్కంటి శంకర్, ఉరుదొండ నరేష్, గరిగె పద్మ నర్సాగౌడ్, సమద్, రవిపాటిల్, సుంకరి శ్రీనివాస్, బాలకిషన్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. టేకేదార్ల సమస్యలను పరిష్కరిస్తాం కామారెడ్డి : టీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కాలరాశారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్హాల్లో బుధవారం నియోజకవర్గానికి చెందిన టేకేదార్లు కాంగ్రెస్‌లో చేరారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ టేకేదార్ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరనున్నాయన్నారు. వారి సమస్యలను మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఈసారి గెలిస్తే ఉన్నత పదవిలో ఉండడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాంగ్రెస్‌లో చేరిన 13వ వార్డు యువకులు కామారెడ్డి టౌన్: పట్టణంలోని 13వ వార్డుకు చెందిన యువకులు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే యూసూఫ్ అలీ, కౌన్సిలర్ నిమ్మ దామోదర్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, నర్సింలు ఉన్నారు. కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం రాజంపేట: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా ప్రచారం చేశారు. షబ్బీర్‌అలీని గెలిపించాలని కోరుతూ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో మోసపూరిత వాగ్దానాలతో కాలం వెళ్లదీసిందని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసిన పార్టీకి తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. పెద్దపల్లి వీరన్న, ఇంతియాజ్‌అలీ, అక్బర్, భీమయ్య, గంగయ్య పాల్గొన్నారు. -
‘కొండా విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు’
సాక్షి, కామారెడ్డి : మరోసారి తనకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే ఉన్నత హోదాలో ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి మార్పు రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమని, అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని అన్నారు. ఆయన బాటలో మరో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరటానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. -
గిరిజనుల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి,మాచారెడ్డి: గిరిపుత్రుల భూముల జోలికి వస్తే కేసీఆర్‌కు పుట్టగతులుండవని మండలి విపక్షనేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ హెచ్చరించారు. గిరిజనుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మాచారెడ్డి మండలంలో ని సోమారంపేట, బంజపల్లి, రత్నగిరిపల్లి, రాజ్‌ఖాన్‌పేట గ్రామాల్లో సోమవారం నిర్వహిం చిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోనే పేద గిరిజనులకు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తే, ఇప్పుడు ఆ భూ ములను బలవంతంగా అటవీశాఖ అధికారులే లాక్కోవడానికి నీ జాగీరు కాదని కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. నా కంఠంలో ప్రాణముండగా గిరిజనుల నుంచి ఒకసెంటు భూమి కూడా పోనివ్వనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గిరిజనుల భూములకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ల నుంచి తాగునీరు తీసుకువచ్చి ఇక్కడ వ్యవసాయ భూములకు నీరందించామన్నారు. గంప గోవర్ధన్ ప్రాణహిత చేవెళ్లను, గోదావరి జలాలను అడ్డుకుంటున్నాడని విమర్శించారు. నేతలు పొన్నాల లక్ష్మారెడ్డి, పంపరి శ్రీనివాస్, అధికం నర్సాగౌడ్, రమేశ్‌గౌడ్, రెడ్డిపేట నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ది అహంకార పాలన
సాక్షి, కామారెడ్డి/మాచారెడ్డి: రాష్ట్రంలో అహంకార, కుటుంబ పాలనను గద్దెదింపేందుకు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, జనసమితి పార్టీలతో జతకట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మాచారెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మారెడ్డితో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పింఛన్లు ఆగిపోతాయంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు పింఛన్‌దారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొడతామన్నారు. మాచారెడ్డి మండలంలో జెం డాలు కట్టేవారు లేరని కేటీఆర్ అన్నాడని, ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు, ఆయన అనుచరులే తమ పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, కామారెడ్డిలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపైనే టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు నజీరొద్దీన్,రామస్వామిగౌడ్, సీపీఐ నాయకులు దశరత్, బాల్‌రాజు, కాంగ్రెస్ నేతలు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, నల్లవెల్లి అశోక్, పంపరి శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, ఫిరంగి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా..
కామారెడ్డి: తెలంగాణ మంత్రి, సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ ఈ ఎన్నికల్లో గెలవకపోతే సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ..తాను గెలవకపోతే సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరారు. సవాల్‌కు కేటీఆర్ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మహాకూటమి ఏర్పడిందని, కేసీఆర్ అహంకార పాలనను గద్దె దించడమే మహా కూటమి లక్ష్యమని వెల్లడించారు. తండ్రీ కుమారులిద్దరూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ గత ఎన్నికల సమయంలో చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పారని, అయితే ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని సూటిగా అడిగారు. హైదరాబాద్‌లో అంతా గుంతలమయం అయిన రోడ్లే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మారుస్తామని చెప్పి వారి కుటుంబాన్నే బంగారు కుటుంబంగా చేసుకున్నారని మండిపడ్డారు. -
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు
సాక్షి,కామారెడ్డి: రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రస్తుతం 2 లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నారని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ఆరెపల్లి, పోతారం, భవానీపేట్, భవానీపేట్ తండాల్లో పర్యటించారు. ఆయా గ్రా మాల్లో పాదయాత్ర చేస్తు ఇంటింటా పాదయాత్ర నిర్వహించారు. మాచారెడ్డి మండలానికి తన హయాంలో 4వేల కరెంట్ స్తంభాలు ఇచ్చి కరెంట్ క ష్టాలు తీర్చానని ఆయన అన్నారు. గంపగోవర్ధన్ కనీసం ఆ కరెంట్ స్తంభాలకు వీధిలైట్లు కూడా బిగించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రతి గ్రామానికి రోడ్డు వేయించానని చెప్పారు. గరీబోడిని చెప్పకుంటూ మూడంతస్తుల భవనా న్ని నిర్మించుకున్నాడన్నారు. కేసీఆర్ 300కోట్లతో ఇల్లు, రూ.3కోట్లతో బాత్రూం నిర్మించుకున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో పుట్టిన బిడ్డపై కూడా రూ.50అప్పు మోపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సబ్సిడీ ట్రాక్టర్లనీ పార్టీ నాయకులకే ఇచ్చుకున్నారన్నారు. కేసీఆర్, మోడీ కలిసి 28శాతం జీఎస్టీ బీడీ కార్మికులకు పనిలేకుండా చేశారన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్ష లు ఇస్తామని, ఏక కాలంలో రూ.2లక్షల రుణాల ను మాఫీ చేస్తామన్నారు. అర్హులందరికి పింఛన్లు, రేషన్ దుకాణాల ద్వారా 7కిలోల సన్నబియ్యంతో పాటు 8 రకాల నిత్యావసర వస్తువులు అందజేస్తామన్నారు.2004లో మాదిరిగా తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నియోజకవర్గ ప్రజల రు ణం తీర్చుకుంటానని షబ్బీర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పంపరి శ్రీనివాస్, నాయకులు గణేష్‌నాయక్, అధికం నర్సాగౌడ్, బ్ర హ్మానందారెడ్డి, రమేశ్‌గౌడ్, నవీన్‌రెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్ మల్లారెడ్డి, రవిగౌడ్ ఉన్నారు. పతి కోసం సతి ప్రచారం సాక్షి,కామారెడ్డి: మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ సతీమణీ నఫీజ్ పర్వీన్, కుమారుడు ఇలియాస్‌లు ప్రచారం నిర్వహించారు. షబ్బీర్‌అలీ సతీమణీ నఫీజ్ పర్వీన్ -
ఎమ్మెల్యే గిరి కోసం..
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీకి కామారెడ్డి స్థానం దాదాపు ఖరారైంది. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్ స్థానాన్ని, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ స్థానాన్ని ఆశిస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న వారిలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండటం ఆసక్తికరంగా మారింది. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతలు.. ఇప్పుడు శాసనసభలో కూడా అడు గు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా స్థానాలకు టికెట్ రేసులో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ముందువరుసలో ఉన్నారు. మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీకి కామారెడ్డి స్థానం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకుల లలిత ఆర్మూర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆమె కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన భూపతిరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ స్థానం కోసం పోటీ పడుతున్న ముగ్గురు కాంగ్రెస్ నేతల్లో భూపతిరెడ్డి ముందున్నారు. అలాగే ఈ టికెట్‌ను ఆశిస్తున్న మరో కాంగ్రెస్ నేత అర్క ల నర్సారెడ్డి కూడా మాజీ ఎమ్మెల్సీ కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురు ఎమ్మెల్సీలు, మరో మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమవడంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాలో ఈ నేతల పేర్లు ఉండటం గమనార్హం. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు, మరో మాజీ ఎమ్మెల్సీలో పార్టీ అధిష్టానం ఎవరెవరికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ ఎమ్మెల్సీల అంశంపై ప్రత్యేకంగా చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ జాతీయ నాయకులు కుంతియా ఇదే విషయంపై పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల తరపున ప్రచారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సై అంటుంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లా లో ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ నుం చి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో వీజీ గౌడ్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజేశ్వర్‌రావు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీజీగౌడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు, చేవెళ్ల, పరిగి వంటి చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆ పార్టీ బహిరంగ సభలకు హాజరువుతున్నారు. -
అప్పుడేమో ఆరు రాష్ట్రాల బడ్జెట్ కావాలన్నారు..!
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే టీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ‘మేం పెంచుతామన్న పెన్షన్లకు కేసీఆర్ ఇంకా 16 రూపాయలు ఎక్కువ పెంచారు. మేం ఆరు నెలల కిందటే మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. దానిని అమలు చేయడానికి ఆరు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అవుతుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు మాకు సాధ్యం కాకపోతే మీకెలా సాధ్యం అవుతుంది’ అని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. గత రుణమాఫీ నాలుగు విడతలుగా అమలు చేశారని, ఇప్పుడేమో మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ మాటలను, హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ కూటమి టికెట్లు పంపకాల అంశం కొలిక్కి వస్తుందన్నారు. -
కామారెడ్డిలో పొలిటికల్ టెన్షన్
కామారెడ్డి: జిల్లాలో రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు ఆస్తులపై బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. గంప గోవర్థన్ తన ఆస్తులు ఇవిగో అంటూ కామారెడ్డి మార్కెట్ యార్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చి హడావిడి చేశారు. తన ఆస్తుల చిట్టా, షబ్బీర్ ఆస్తుల చిట్టా చదివి వినిపించారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ ఉందని చెప్పి తప్పించుకోవడం సరికాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కాసేపటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా తన అనుచరులతో గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..తనది తెరిచిన పుస్తకమన్నారు. ప్రతీ పైసాకు లెక్క ఉందని, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని తెలిపారు. చర్చలకు అనుమతి లేదని కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి నేతలకు సూచించారు. ఇటీవల రోడ్‌షోలో గంప గోవర్థన్ ఆస్తులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. -
రాజకీయ వే‘ఢీ!’
చిరకాల ప్రత్యర్థులైన తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వర్గాల మధ్య మాట ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సీజన్ కావడంతో అది పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎవరి ఆస్తి ఎంతో తేల్చుకోవడానికి బుధవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. కానీ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున బహిరంగ చర్చలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో గంప గోవర్ధన్, షబ్బీర్ అలీల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో అది మరింత ముదిరింది. గత నెల 30న కామారెడ్డి పట్టణంతో పాటు భిక్కనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు. గంప గోవర్ధన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు ఆస్తు లు సంపాదించాడంటూ విమర్శలు సంధించారు. దీంతో గంప గోవర్ధన్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన నిజాయితీనే శంకిస్తారా అంటూ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలపై తీవ్ర విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తు లు, షబ్బీర్‌అలీ రాజకీయాల్లోకి రాకముం దు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సమకూరిన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే బుధవారం కామారెడ్డి గాంధీ గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు రావాల న్నారు. దీనిపై షబ్బీర్‌అలీ అనుచరులు స్పందించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. ఎన్నికల సమయంలో వెనకడుగు వేసేది లేదని ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బుధవారం కామారెడ్డికి రావాలంటూ తమ క్యాడర్‌కు సమాచారం అందించారు. అనుమతి లేదంటున్న పోలీసులు.. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కింది. ఒకవేళ ఇరు పార్టీల నేతలు గాంధీ గంజ్‌కు చేరుకుంటే రచ్చరచ్చ అవుతుందని పోలీసు లు భావిస్తున్నారు. అందుకే అనుమతి లేదంటూ ప్రకటనలు జారీ చేశారు. జిల్లా లో ఎన్నికల కోడ్‌తోపాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, చర్చలు జరపడానికి వీళ్లేదని ఎస్పీ శ్వేత స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయమై ఆయా పార్టీల ముఖ్య నేతలకు కూడా సమాచారాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం కామారెడ్డిలో ఏం జరుగుతుందన్న అంశంపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను గమనిస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందని, ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణను మోసం చేయాలని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిర్వహించిన మైనారిటీలో సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు గుణపాఠం కాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనారిటీల పక్షపాతి అని, పేద ముస్లింల కోసం వైఎస్సార్ హయాంలో ఎన్నో పథకాలను కాంగ్రెస్ అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌కు ఓటు వేస్తె మోదీకి వేసినట్టేనని, కేసీఆర్ ఊసరవెల్లిలాంటి వారని విమర్శించారు. కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్ మైనారిటీలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్లో ఎస్సీలకు, మహిళలకు చోటు దక్కలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పార్లమెంటులో తాము పోరాటం చేసినపుడు కేసీఆర్ లేరని పేర్కొన్నారు. డైనమిక్ యువ నేత రేవంత్ అంటే కేసీఆర్‌కు భయమన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. చిన్న దొంగ కేసీఆర్ అయితే.. పెద్దదొంగ నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని, కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పేర్కొన్నారు. -
సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పాటు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా వ్యాక్యానించారు. ఆదివారం ముషీరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్సీ కుంతియాతో పాటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 9 నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడిగారు. మోదీ, ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోంది..రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకుని కుమ్మక్కయ్యారని ఆరోపించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ..హైదరాబాద్‌ని అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నెంబర్ వన్ పిట్టలదొర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. ఏఐసీసీ నేత బోసురాజు మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్‌కు సెపరేట్‌గా మేనిఫెస్టో సబ్ కమిటీ వేస్తామని తెలిపారు. గ్రేటర్ సమస్యలపై సబ్‌కమిటీ చర్చిస్తుందన్నారు. 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్సేనని, తెలంగాణాకు అందరూ సపోర్ట్ చేసినా అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ వద్దన్నారని విమర్శించారు. గ్రేటర్లో 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
వైఎస్సార్ ఆశయ సాధనే కాంగ్రెస్ ధ్యేయం
భిక్కనూరు(కామారెడ్డి జిల్లా): ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కలలు గన్న ఇందిరమ్మ రాజ్యం.. రైతు రాజుగా బతకాలనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందని శాసన మండలి విపక్ష నేత, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం భిక్కనూరులోని పాత ఎస్సీ కాలనీ, గిద్ద ఎస్సీకాలనీ, తిప్పాపూర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిశ్శబ్ద ప్రజా సునామీ ఉందని, ఈ సునామీలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తన ఇంట్లో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మహిళలపై కేసీఆర్‌కు ఎలాంటి గౌరవం లేదని, మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూంలు కట్టిస్తానని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ కలలు గన్న రైతు రాజ్యం సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తిప్పాపూర్‌లో ప్రచారం ప్రారంభించడం లక్కీచాంప్ తిప్పాపూర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం తనకు లక్కీచాంప్ అని షబ్బీర్ అలీ అన్నారు. 1989, 2004లో కూడా తిప్పాపూర్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించానని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్నప్పుడే ఎన్నికల తేదీ డిసెంబర్ 7గా ఈసీ ప్రకటించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే మొదటగా తిప్పాపూర్‌కు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతానన్నారు. -
‘ఆ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకు పోతుంది’
సాక్షి, కామారెడ్డి : మహాకూటమి ప్రచారం సునామీలో టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ఎలక్షన్స్ ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఎలక్షన్స్‌ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. -
ఆలూ లేదు.. చూలూ లేదు.. నంబర్ టు రేస్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘డిప్యూటీ సీఎం’దుమారం రేగింది! కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహ్మద్ అలీ షబ్బీర్ నంబర్–2 అవుతారంటూ కామారెడ్డి రోడ్‌షో సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కొత్త లొల్లికి దారితీసింది. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాక, అభ్యర్థుల ప్రకటన వెలువడక సతమతమవుతున్న వేళ మరో తలనొప్పి ఏమిటనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలపై బయటకు ఎవరూ విమర్శలు చేయకపోయినా ఈ కొత్త సంస్కృతి విపరీత పరిణామాలకు దారితీస్తుందని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు పార్టీలో ఐక్యతకు గండికొడతాయని, ఎన్నికల సమయంలో పదవుల గురించి మాట్లాడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందంటూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడొకరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ప్రాంతీయ పార్టీ నేతల మాదిరి కాంగ్రెస్‌లో నేతలు మాట్లాడటం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని ఆ ఎంపీ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ ముఖ్యుల్లో కలవరం... రేవంత్ పథకం ప్రకారం మాట్లాడారో లేక యాధృచికంగా మాట్లాడారో కానీ షబ్బీర్ అలీ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి సీనియర్ నేతలు, టీపీసీసీ ముఖ్యులు కోలుకునేందుకే కొంత సమయం పట్టిందని, ఉన్నట్లుండి రేవంత్ ఎందుకు అలా మాట్లాడారన్న దానిపై ఆరా తీశారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏఐసీసీ స్థాయి నేతలు వచ్చినప్పుడు కూడా అధికారంలోకి వస్తే సీఎం ఎవరని అడిగినా వారు చెప్పడం లేదని, అలాంటప్పుడు రేవంత్ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో అంతుపట్టడం లేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే 10 మంది సీఎం అభ్యర్థులున్నారంటూ అధికార టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు తోడు తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం ఆశావహుల జాబితా కూడా చాంతాడంత అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు షబ్బీర్ అలీతోపాటు తాము కూడా డిప్యూటీ సీఎం పదవికి అర్హులమేననే చర్చ అప్పుడే కాంగ్రెస్ వర్గాల్లో ప్రారంభమైంది. ముఖ్యంగా సామాజిక కోణంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు ఇప్పుడు ఈ జాబితాలో చేరుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారిలో సీఎం స్థాయి నేతలు కూడా ఉన్నారని, వారితోపాటు తాము కూడా డిప్యూటీ సీఎం బరిలో ఉంటామని అర డజను మంది నేతలు బయలుదేరడం పార్టీలో రేవంత్ వ్యాఖ్యల తీవ్రతను తెలియజేస్తోంది.