సాక్షి, కామారెడ్డి : మరోసారి తనకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే ఉన్నత హోదాలో ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి మార్పు రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వాన్ని మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమని, అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా టీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ అని అన్నారు. ఆయన బాటలో మరో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరటానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment