Konda visweswar reddy
-
బీజేపీ విప్‌గా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. డాక్టర్ సంజయ్ జైస్వాల్‌ను పార్టీ చీఫ్ విప్‌గా నియమించగా.. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మొత్తం 16 మందికి లోక్‌సభలో విప్‌లుగా అవకాశం కలి్పంచారు.ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్ శివ్ శక్తినాథ్ బక్షి సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేశారు. -
అధికార బీఆర్ఎస్పై అన్నిచోట్లా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/చేవెళ్ల: రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లినా అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ..నేడు అవినీతిపరులు, మాఫియా చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆయన అనుచరులు, పలువురు ప్రస్తుత, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు 60 మంది బీజేపీలో చేరారు. వీరిలో చేవెళ్ల, నవాబుపేట, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, రైతు నాయకులు, దళిత సామాజిక వర్గ యువకులు ఉన్నారు. వారికి కిషన్‌రెడ్డి కండువా కప్పి పారీ్టలోకి ఆహా్వనించారు. తెలంగాణలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దళిత నాయకుల్లో రత్నం ఒకరని పేర్కొన్నారు. రాహుల్ తప్పుడు ప్రచారం ‘బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలపై ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. తెలంగాణ పోరాట చరిత్ర గురించి తెలియని రాజకీయ అజ్ఞాని. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్ ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘బీఆర్ఎస్కు కాంగ్రెస్ బీ–టీమ్.అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్.. కొనే పార్టీ బీఆర్ఎస్. 2018లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. వారిలో కొందరిని మంత్రులుగా కొనసాగిస్తున్న దరిద్ర పు పార్టీ బీఆర్ఎస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలకు కనీసం 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోంది. ఎన్నికల్లో అక్కడ మహిళలు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిండా మోసం చేసింది..’అని విమర్శించారు. ‘మేము ప్రజల టీమ్ తప్ప.. ఏ పార్టీకి టీమ్ కాదు..’అని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేవెళ్లకే జీవితం అంకితం: రత్నం తనకు రాజకీయ జీవితం అందించిన చేవెళ్ల ప్రజలకు అధికారంతో సంబంధం లేకుండా జీవితాంతం సేవ చేస్తానని కేఎస్ రత్నం అన్నారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే ముందు స్థానిక లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రత్నం పూజలు చేశారు. -
ఈవీఎంలు రిగ్గింగ్ చేసినా గెలుపు నాదే..
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను 3లక్షల మెజార్టీతో గెలుస్తానని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే నాయకుడు కావాలని చేవెళ్ల ప్రజలు కోరుతున్నారని, టీఆర్ఎస్ నేతలు ఈవీఎంలు రిగ్గింగ్ చేసినా తన గెలుపు ఖాయమని మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పరిగిలో నిర్వహించిన సభతో తమ బలమేంటో కేసీఆర్‌కు తెలిసిందని, చేవెళ్లలో రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీలు కొట్లాడుతున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 400కి పైగా గ్రామాలు తిరిగానని, ఆరులక్షల మందిని కలిశానని, మూడు లక్షల హైఫైలు ఇచ్చానని, ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని కొండా చెప్పారు. అభివృద్ధి కోసమే కొండా కాంగ్రెస్‌లోకి.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తల్లి ప్రమోదిని అన్నారు. మంగళవారం యాలాల మండల కేంద్రంతో పాటు బెన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అభివృద్ధి కోసమే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారని గుర్తు చేశారు. సౌమ్యుడిగా, పేదల పక్షపాతిగా పేరున్న కొండాను ఎంపీగా గెలిపించుకుందామని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి పేదవాడు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుతం పింఛన్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. -
‘కొండా విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు’
సాక్షి, కామారెడ్డి : మరోసారి తనకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే ఉన్నత హోదాలో ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి మార్పు రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమని, అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని అన్నారు. ఆయన బాటలో మరో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరటానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. -
గులాబీకి గుడ్‌బై
అడుగడుగునా నాకు అవమానాలు జరిగాయి. నా ప్రతిపాదనలను అధికారులు పట్టించుకోవద్దని మంత్రి మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఇక పార్టీలో ఇమడలేను. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు. – ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల వేళ జిల్లాలో టీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వ్యవహారశైలితో కినుక వహించిన ఆయన.. కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్ బుజ్జగించినప్పటికీ శాంతించని ఆయన పార్టీని వీడేందుకే మొగ్గుచూపారు. 2013లో టీఆర్ఎస్లో చేరిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించి లోక్‌సభలో అడుగు పెట్టారు. మారుమూల గ్రామం మొదలు.. ఐటీ హబ్‌గా పేరెన్నికగన్న అతిపెద్ద సెగ్మెంట్ నుంచి పోటీచేసిన తొలిసారే గెలుపొందడం ద్వారా ఆయన రికార్డు సృష్టించారు. ఇమడలేక.. గత నాలుగేళ్లుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో కొండా కలత చెందారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారికీ గాకుండా.. ఉద్యమాన్ని అణిచివేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ అంశంపై పలుమార్లు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ లైన్‌ను మాత్రం దాటలేదు. జిల్లా వ్యవహారాలను మంత్రి మహేందర్‌రెడ్డి శాసిస్తుండడం ఆయనకు పార్టీ పెద్దలు కూడా అండగా నిలవడంతో తట్టుకోలేకపోయారు. అడుగడుగునా తనకు అవమానాలు జరిగాయని, పలుమార్లు మహేందర్ పెత్తనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా సర్దుకుపోవాలని పార్టీ పెద్దలు సూచించడంతో ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి, కొండా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురిదీ ఒకే నియోజకవర్గం కావడంతో మనస్పర్థలు మరింత ముదిరాయి. తన ప్రతిపాదనలను అధికారులు పట్టించుకోవద్దని మంత్రి మౌఖిక ఆదేశాలు జారీచేశారని అనుమానించిన ఆయన ఇక పార్టీలో ఇమడలేనని బయటకు వచ్చారు. అంతేకాకుండా పుప్పాలగూడలోని తన భూమిని మంత్రి వివాదాస్పదం చేశారని ఆయన వాపోయారు. పైలెట్ తొలగింపుతో.. వాస్తవానికి మాజీ మంత్రి సబిత, మహేందర్‌రెడ్డి కుటుంబాల రాజకీయ పెత్తనానికి గండికొట్టాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు అంతర్గతంగా చెబుతుంటారు. అయితే, పార్టీ తీర్థం పుచ్చుకున్న కొన్నాళ్లకే మహేందర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరడంతో అనివార్యంగా కలిసి ముందుకుసాగారు. అయితే, మహేందర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అసహనానికి గురైన ఆయన రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానన్న భావనను కూడా తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. అయిష్టంగానే నెట్టుకొస్తున్న ఆయనకు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించాయి. తా ను సూచించినవారికి పదవులు దక్కకుండా తన అనుచరులను ఆకారణంగా బహిష్కరించడం వి శ్వేశ్వర్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ప్రధానంగా తాండూరు టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా వ్యవహరించిన పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చే యడం కలిచివేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ప నిచేస్తున్న పైలెట్‌తో పాటు మరికొందరు కా ర్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమేగాకుండా పా ర్టీ నుంచి తరిమివేయడాన్ని బహిరంగంగానే తప్పుబట్టారు. దీంతో పతాకస్థాయికి చేరిన అ భిప్రాయభేదాలు ఇటీవల కోట్‌పల్లి ప్రాజెక్టులో బోట్ నిర్వాకులపై దాడిచేసిన వారికి మంత్రి అండగా నిలవడంతో మరింత పెరిగాయి. ఈ క్ర మంలోనే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించిన ఆయన తొలుత బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని సంకేతాలందాయి. అయితే, కొన్నాళ్ల క్రితం కేటీఆర్‌తో భేటీ విశ్వేశ్వర్‌రెడ్డి ఈ వార్తలను ఖండించినప్పటికీ మంగళవారం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడంతో ఆయన అసంతృప్తి తేటతెల్లమైంది. ఈ నెల 23న మేడ్చల్‌లో జరిగే సోనియా, రాహుల్‌గాంధీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. దీనిపై బుధవారం నిర్వహించే విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసే అవకాశముంది. -
ఆయన ఎంపీగా గెలవడం మా దౌర్భాగ్యం
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి): కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందడం ఆ ప్రాంత వాసుల దౌర్భాగ్యమని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి ఎంపీ శవయాత్ర నిర్వహించి బీజేఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలని అక్కడి ప్రజలంతా ఎదురు చూస్తుంటే కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ చెప్పడం దుర్మార్గమన్నారు. కేవలం వారి స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల బాగోగుల గురించి ఏమి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత చేవెళ్లను కాదని ప్రస్తుతం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారన్నారు. జిల్లా వాసులకు అన్యాయం జరిగే పనులు చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలోనే.. ప్రాణహిత చేవెళ్ల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు. -
వ్యూహం ఫలించింది.. విజయం వరించింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇరువురు నేతలు.. అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి... జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వారి గెలుపు వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది చివర్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. అంతేకాకుండా చేవెళ్ల తన సొంతగడ్డ అంటూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక నేతలతో మమేకం కావడంతో పాటు ప్రత్యేకించి కొందరు యువకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయించారు. ఇలా ఎన్నికలకు ముందే పార్లమెంటు సెగ్మెంటులోని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న విశ్వేశ్వర్.. చేవెళ్లలో గులాభి దళపతి సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో సతీమణితో పాటు బంధువర్గాన్ని ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించడంతో సఫలీకృతులయ్యారు. పెద్దగా ప్రభావం లేని టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరుస్తూ తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో పాటు సోషల్ మీడియా తదితర టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నారు. చివరకు అనుకున్నట్లుగా భారీ మెజార్టీతో బలమైన పార్టీలకు చెందిన ప్రత్యర్థులను మట్టికరిపించారు. సమన్వయం మల్లారెడ్డి విజయ రహస్యం... మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు సుపరిచితులైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం కొత్తే. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పూర్తిగా పట్టణ నియోజకవర్గం కావడం.. టీడీపీకి పట్టున్న ప్రాంతం.. మరోవైపు మోడీ గాలి.. వెరసి మల్లారెడ్డి విజయానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా బడా నేతలే. స్థానికంగా బలమైన నేత మైనంపల్లి హన్మంతరావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రముఖుల ఎదుర్కొని చివరకు మల్లారెడ్డి విజయం సాధించారు. పార్టీకి కొత్త అయినప్పటికీ.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధినేతతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు కలిసివచ్చిన అంశం. మరో వైపు పార్టీ శ్రేణులను, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. మొత్తంమీద 30వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
శంకర్పల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం అన్నారు. సోమవారం మండలంలోని జనవాడ, మిర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, పొద్దుటూర్ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో.. అదే విధంగా నవ తెలంగాణ నిర్మాణం కూడా ఆ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. దేశ సంపదను దోచుకున్న ఆ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి తాగు సాగునీరు అందిస్తామని, పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌడిచెర్ల నర్సింహ, మాజీ ఎంపీపీ బీర్ల నర్సింహ, మిర్జాగూడ సర్పంచ్ సంజీవ్‌కుమార్, మాజీ సర్పంచ్ అయిలయ్య, జిల్లా గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్‌యాదవ్, రాములు, చోటు, పంతం జంగయ్య, యాదయ్య, ఎజాస్, శ్రీశైలం, అఫ్సర్, గోవింద్‌రెడ్డి ,శ్రీరాములు పాల్గొన్నారు. -
అభివృద్ధే మా నినాదం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని గ్రామీణ, నగర ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. వృత్తి, కుటుంబం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన తాను ప్రజలకు వీలైనంత ఎక్కువగా సేవ చేయాలనే సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చేవెళ్ల ఎంపీగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నానో అనే అంశంపై ఒక స్పష్టమైన ప్రణాళిక విడుదల చేశారు. తను, తన బృందం మూడేళ్లపాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అవసరాలు తెలుసుకున్న తర్వాతే మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. రైతులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలందరికీ సమ ప్రాధాన్యం కల్పించినట్టు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని కొండా హామీ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు, ఒక టెలీమెడిసిన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సాంకేతిక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోకి పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. శంకర్‌పల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక డిగ్రీ కళాశాల, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పుతామన్నారు. ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిస్కారానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని కొండా పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, తమిళనాడు అందుకు ఉదాహరణ అని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన హైదరాబాద్ మహానగరం రానున్న పదేళ్లలో దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదుగుతుందని, ఐటీఐఆర్, ఇతర పెట్టుబడుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో అటవీ సంరక్షణ పేరిట తెచ్చిన జీఓ 111 జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిందని, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
‘వారసుల’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాజకీయాల్లో కొత్త వ్యక్తులు కావడం.. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నేతల వారసులు కావడంతో పోటీ రసకందాయంలో పడింది. తెలుగుదేశం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు టి.వీరేందర్ బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లో ఈ ముగ్గురివీ కొత్త ము ఖాలే. పోటీ చేస్తున్న ఈముగ్గురు అభ్యర్థుల నే పథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వారిరువురూ అన్నాతమ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇరువురూ ఒకే మాజీ హోంమంత్రుల సుపుత్రులు.. తరగతిలో దోస్తులు.. తూళ్ల వీరేందర్‌గౌడ్ తండ్రి టి.దేవేందర్‌గౌడ్ మాజీ హోంమంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు కార్తీక్‌రెడ్డి తల్లితండ్రులిద్దరూ హోంమంత్రులుగా పదవులు ఏలినవారే. అంతేకాక.. వీరేందర్, కార్తీక్‌లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆబిడ్స్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఇద్దరిదీ ఒకే తరగతి కావడం విశేషం. తాజాగా ఈ ఇరువురూ ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం విశేషం. -
తెలంగాణ అభివృద్ధే ధ్యేయం
తాండూరు, న్యూస్‌లైన్: తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ పని చేస్తోందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి విజయాదేవి పోటీ చేస్తున్న 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ 200 మంది సామర్థ్యంతో డిజిటల్ టాకీసులను ఏర్పాటు చేస్తామన్నారు. వీటినే ఉదయం పూట క్లాస్‌రూమ్‌లుగా ఉపయోగించుకోవచ్చన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగాన్ని అన్నివిధాలా అభివృద్ధిపరిచేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. వందకుపైగా సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చడమే టీఆర్ఎస్ లక్ష ్యమన్నారు. తాండూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి పాటుపడతామన్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు తాండూరులో అభివృద్దిని విస్మరించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బైండ్ల విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్, నాయకులు రంగారావు, విజయ్, సంగమేశ్వర్, సోమశేఖర్, అనురాధ పాల్గొన్నారు. అనంతరం ఆయన పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. దోశ వెరీ టేస్ట్ ఉదయం తాండూరుకు వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శాంతినగర్‌లోని ఓ హోటల్లో దోశ తిన్నారు. తాండూరు దోశ వెరీ టేస్ట్ అని కితాబిచ్చారు. బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్లగా.. హోటల్ యజమాని కృతజ్ఞతగా వద్దన్నా.. నో ప్రాబ్లం తీసుకోండి అంటూ బిల్లు చెల్లించారు.