సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాజకీయాల్లో కొత్త వ్యక్తులు కావడం.. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నేతల వారసులు కావడంతో పోటీ రసకందాయంలో పడింది. తెలుగుదేశం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు టి.వీరేందర్ బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లో ఈ ముగ్గురివీ కొత్త ము ఖాలే. పోటీ చేస్తున్న ఈముగ్గురు అభ్యర్థుల నే పథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
వారిరువురూ అన్నాతమ్ముళ్లు..
వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇరువురూ ఒకే
మాజీ హోంమంత్రుల
సుపుత్రులు.. తరగతిలో దోస్తులు..
తూళ్ల వీరేందర్‌గౌడ్ తండ్రి టి.దేవేందర్‌గౌడ్ మాజీ హోంమంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు కార్తీక్‌రెడ్డి తల్లితండ్రులిద్దరూ హోంమంత్రులుగా పదవులు ఏలినవారే. అంతేకాక.. వీరేందర్, కార్తీక్‌లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆబిడ్స్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో ఇద్దరిదీ ఒకే తరగతి కావడం విశేషం. తాజాగా ఈ ఇరువురూ ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం విశేషం.
‘వారసుల’ పోరు!
Published Thu, Apr 10 2014 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement