descendants
-
ప్రమాదంలో గాయపడి బిర్సా ముండా మునిమనవడు మృతి
రాంచీ: గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా కన్ను మూశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఈ నెల 25న ఖుంటి జిల్లాలో వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మంగళ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఖుంటిలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డకట్టడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తు న్నారు. శుక్రవారం ఆయన కార్డియో వాస్క్యులర్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాస విడిచారని రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హిరేన్ చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ రిమ్స్‌కు వెళ్లి మంగళ్ ముండా కుటుంబసభ్యులను ఓదా ర్చారు. మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. -
వారసులకు ‘హోం’ సిక్
హోం మినిస్టర్... ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతలకే హోం మినిస్టర్‌గా అవకాశం దక్కింది. అప్పట్లో ఆ పదవి చేపట్టిన వారిలో దాదాపు తెలంగాణకు చెందిన వారే అత్యధికులు. కాలక్రమేణా ప్రాధాన్యతల్లో మార్పుల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంటున్నప్పటికీ ఆ పోస్టు పవర్ మాత్రం తగ్గలేదు. అలాంటి కీలక పదవి చేపట్టి విజయవంతంగా ప్రస్థానం సాగించినప్పటికీ... వారి తర్వాతి తరం మాత్రం రాజకీయంగా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతోంది. గత మూడు దశాబ్దాల చరిత్ర పరిశీలిస్తే హోం మంత్రులుగా పనిచేసిన నేతల కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత తరం ఇంకా రాజకీయంగా ఓనమాలు నేర్చే స్థాయిలోనే ఉంది. ♦ ఎన్టీఆర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పనిచేశారు. టీడీపీ నుంచి బయటికొచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య పి.సబితారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తొలిదఫాలో గనులు, భూగర్భ వనరులు, జౌళి శాఖ మంత్రిగా... రెండోసారి వైఎస్ సీఎం అయ్యాక హోం మంత్రిగా కొనసాగారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2014 పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయనకు మరో అవకాశం రాలేదు. ♦ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో కుందూరు జానారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున నాగార్జునసాగర్ అసెంబ్లీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ♦ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా ఎలిమినేటి మాధవరెడ్డి కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత పోర్ట్ పోలియో మారి పంచాయతీరాజ్ మంత్రిగా వ్యవహరించారు. మందుపాతర పేలిన ఘటనలో ఆయన మరణించడంతో భార్య ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కొంతకాలం మంత్రిగా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి చట్టసభల్లోకి వారసులెవరూ రాలేదు. కానీ ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి స్థానిక సంస్థల్లోకి ఎంట్రీ ఇచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ♦ చంద్రబాబు మంత్రివర్గంలో చక్రం తిప్పిన నేత తూళ్ల దేవేందర్‌గౌడ్. బాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి, చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, ఆయనకు అవకాశం దక్కలేదు. ♦ కేసీఆర్ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కించుకుని రెవెన్యూ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా కొనసాగుతున్న మహమూద్ అలీ కూడా తనయుడు ఆజాం అలీని ప్రత్యక్ష రాజకీయాల్లో దింపే ప్రయత్నం చేశారు. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. ♦ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి కొనసాగారు. ఆయన 2018 ఎన్నికల్లో అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి బరిలో నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. -చిలుకూరి అయ్యప్ప -
ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు. అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు. ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు. ఇక బీహార్‌లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
కన్నడనాట వారసుల పోరు.. తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని..
కర్ణాటక ఎన్నికలంటే వంశపారంపర్య రాజకీయాలే కళ్లముందు కదలాడుతాయి. జేడీ(ఎస్) కుటుంబానికి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసి పదవులు దక్కించుకోవడం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వారసులకి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రెండో తరం, మూడో తరం కూడా తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగాలు, తల్లిపైనున్న అసంతృప్తిని మోయడానికి సిద్ధమైన కొడుకు, భార్య టికెట్ కోసం ఏకంగా కుటుంబంపైనే తిరుగుబాటు సిద్ధమైన వారితో రాజకీయం రసకందాయంలో పడింది. తండ్రి కోసం యతీంద్ర త్యాగం ► మహాభారతంలో భీముడు, ఘటోత్కచుడు బంధం ఎలాగుంటుందో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర మధ్య సంబంధం అలాగే ఉంటుందని చెప్పుకుంటారు. యతీంద్ర తండ్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తన భవి ష్యత్‌ను కూడా పణంగా పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో వరుణ అసెంబ్లీ సీటుని తన తండ్రి కోసం త్యాగం చేశారు. గత ఎన్నికల్లో 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో వరుణ నుంచి నెగ్గిన యతీంద్ర కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సిద్దరామయ్య సీఎం అవడం కోసం ఈ సీటుని వదులుకున్నారు. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డికె. శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి ఆశిస్తూ ఉండడంతో సిద్దరామయ్యని ఓడిస్తారన్న ప్రచారం జరుగుతోంది..వరుణ నియోజక వర్గం నుంచి పోటీపడితే సిద్దరామయ్యకి తిరుగుండదని యుతీంద్ర పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రియాంక్ ఖర్గే.. లిట్మస్ టెస్ట్ ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సొంత రాష్ట్రంలో జరుగు తున్న తొలి ఎన్నికల కావడంతో ఈ స్థానం నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ప్రియాంక్ 4 వేల కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి బసవరాజ్ బొమ్మై ప్రభు త్వాన్ని ఇరకాటం పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌కు 140 సీట్లు ఖాయమని ప్రియాంక్ అంటుంటే, ‘ప్రియాంక్ ఖర్గే కనబడుట లేదు’ అంటూ ఆయన నియోజకవర్గంలో బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది! కుమారునికి యడ్డీ అండ ► వంశ పారంపర్య రాజకీయాలపై కాంగ్రెస్‌ను మొదట్నుంచి చీల్చి చెండాడుతున్న బీజేపీ కూడా కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. యడ్డీ 1983 నుంచి రికార్డు స్థాయిలో ఏడుసార్లు నెగ్గిన శివమొగ్గలో షికారిపుర నుంచి ఈ సారి విజయేంద్ర పోటీ పడుతున్నారు. ఎన్నికల వ్యవహారాలను తన భుజస్కంధాలపై మోస్తున్న యడియూరప్ప తన కుమారుడు విజయేంద్ర కోసం తాను స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో విజయేంద్రకు టికెట్ దక్కింది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ విజయేంద్రకి గతంలో రెండు సార్లు టికెట్ రాక నిరాశ చెందారు. ముచ్చటగా మూడో సారి ప్రయత్నం ఫలించడంతో ఇక ఎన్నికల్లో గెలుపుపై ఆయన దృష్టి సారించారు. జేడీ(ఎస్)లో హాసన్ ప్రకంపనలు ► కుటుంబ పార్టీగా ముద్ర పడిన జేడీ(ఎస్)లో ఈ సారి ఎన్నికలు కుటుంబంలో చీలికకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్.డీ. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన భార్య భవానీ రాజకీయ ఎంట్రీకి ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. హాసన్ నియోజకవర్గం నుంచి ఆమెకి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు హెచ్.డి. కుమారస్వామి హాసన్ స్థానాన్ని తన వదినకు ఇవ్వలేమని హెచ్‌పి. స్వరూప్కే ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్డి రేవణ్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారులు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి ఎంపీగా ఉంటే, మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు భవానీకి కూడా టిక్కెట్ ఇస్తే వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదో వ్యక్తి అవుతారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తాను, తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్డి రేవణ్ణ బెదిరింపులకు దిగడం పార్టీలో కలకలానికి దారి తీస్తోంది. అమ్మ కొడుకు ► హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీపడుతున్న రామనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇన్నాళ్లూ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తన కొడుకు కోసం ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఇటీవల నిఖిల్ రామనగర్‌లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో తల్లి వైఫల్యాలు ఇప్పుడు కుమారుడి భవిష్యత్‌ను ఎటు తీసుకువెళతాయా అన్న సందేహాలున్నాయి. మౌలిక సదు పాయాలు, తాగు నీటి సౌకర్యం కూడా లేకపోవ డంతో స్థానికులు నిఖిల్‌ను నిలదీస్తున్నారు. మరి ఈ స్థానం నుంచి నిఖిల్ నెగ్గుతారా లేదా అన్నది సందేహంగానే మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మురిసిపోయిన కాకతీయులు నడయాడిన నేల (ఫొటోలు)
-
వరంగల్ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వంశ 22వ వారసుడు
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఈ నేపథ్యంలో తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ దర్శించుకోనున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా బంజ్‌దేవ్ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారువరంగల్ రాకపై ‘సాక్షి’ ప్రత్యేకంగా మహారాజుతో ముచ్చటించింది. పూర్వీకులు సాగించిన పాలన, ఓరుగల్లు వైభవం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది... కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లా. మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సైన్స్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‌కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా. విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే... రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు గర్విస్తున్నాను. వరంగల్ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. తెలంగాణలోని టార్చ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేయనున్నా. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా. బస్తర్ కేంద్రంగానే కాకతీయుల పాలన... బస్తర్ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‌లో విస్తరించి ఉంది. నేను జగదల్పూర్లో ఉన్న కోటలో ఉంటున్నా. అన్ని ఆయుధాలూ వాడగలను.. నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్పూర్లోని నా ప్యాలెస్‌కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు
వారిస్ వస్తున్నారోచ్.. హిందీలో వారిస్ వస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ విజిటింగ్ కార్డ్‌తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్‌తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్ మీదే. ‘వారిస్ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్ కిడ్స్‌కి వెల్కమ్ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో వారసుల ఎంట్రీ లిస్ట్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్ డైరెక్షన్లో ఓ వెబ్ ఫిలిం చేయనున్నారని టాక్. కామిక్ బుక్ ఆర్చీస్ ఆధారంగా ‘ది ఆర్చీస్’ అనే మ్యూజిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్ కథలా ఉంటుంది ఆర్చీస్ నవల. ఈ ప్రాజెక్ట్ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్ జరిగినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ షాప్స్‌లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్ టాక్. ఇదే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్‌కు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని, న్యూయార్క్‌లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు’’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్’ ప్రాజెక్ట్‌లో భాగమయిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీమ్ అలీఖాన్ (సైఫ్–అమృతా సింగ్‌ల కుమారుడు ఇబ్రహీమ్) పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం జోయా అక్తర్ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్ జోన్స్ అనే నలుగురు టీనేజ్ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్ కిడ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్‌తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్ సిరీస్‌లో బాబిల్ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ చిన్న కొడుకు రజ్వీర్ (సన్నీ పెద్ద కొడుకు కరణ్ 2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్. అవ్నీష్ దర్శకుడు. మరోవైపు అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తనయుడు (ఆమిర్–రీనా దత్ల కుమారుడు) జునైద్ ఖాన్ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ యాక్టర్‌గా కన్నా కూడా రైటర్‌గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్యన్ రైటర్‌గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్ కిడ్స్ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్‌తో నిలబడే వారసులు ఎందరో చూడాలి. -
తమ్ముళ్లు... చెల్లెళ్లు వస్తున్నారోచ్
చిత్ర పరిశ్రమలో హీరోలకు వారసులుగా వారి తనయులు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ.. ఇప్పటి తరంలో చిరంజీవి, నాగార్జున.. ఇలా చాలామంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు... భవిష్యత్‌లోనూ ఇస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న కొందరి తమ్ముళ్లు, హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలుగా పరిచయం కానున్నారు. మరికొందరు ఆల్రెడీ వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం... ‘అర్జున్‌రెడ్డి’ (2017) బంపర్ హిట్‌తో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయ్యారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘గీత గోవిందం’ (2018), ‘టాక్సీవాలా’ (2018) వంటి చిత్రాల హిట్స్‌తో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ క్రేజీ హీరో ఓవర్‌నైట్ స్టార్ కాలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి హీరో అయ్యారు.. ఆ తర్వాత స్టార్ హీరో అయ్యారు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకి ఓ విజిటింగ్ కార్డ్ అయ్యారు. ‘దొరసాని’ (2019) చిత్రంతో ఆనంద్ హీరోగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం వినోద్, దామోదర అట్టాడ అనే కొత్త దర్శకులు తెరకెక్కిస్తోన్న రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ– ఆనంద్ దేవరకొండ దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కూడా హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నారు. రానా– అభిరామ్ బెల్లకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తారు. సాయి శ్రీనివాస్– సాయి గణేశ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్ర పోషించారు. సాయిధరమ్ తేజ్– వైష్ణవ్ తేజ్ మరోవైపు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ తమ్ముడు అమ్రాన్ ప్రీత్‌సింగ్ హీరోగా తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’(2020) అనే సినిమా తెరకెక్కుతోంది. దాసరి లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నితేష్ రాయ్ దర్శకత్వం వహించనున్న ‘రామ్ రాజ్య’ అనే హిందీ చిత్రంలోనూ అమ్రాన్ హీరోగా నటించనున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, అమ్రాన్ హీరోయిన్ మెహరీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్‌లో ఓ లీడ్ క్యారెక్టర్ చేశారు. తొలుత క్రికెటర్ కావాలనుకున్నారట గుర్ఫతే. అయితే ఆ తర్వాత యాక్టింగ్‌ను కెరీర్‌గా మార్చుకుని ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఆ మ్యూజిక్ వీడియో బీటౌన్‌లో కాస్త పాపులర్ కావడంతో ‘గిల్టీ’లో గుర్ఫతేకి చాన్స్ దక్కింది. త్వరలో బాలీవుడ్లో కూడా గుర్ఫతే లీడ్‌గా ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. మెహరీన్–గుర్ఫతే సింగ్ జీవితా రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ఇప్పుడు ‘విధి విలాసం’ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ‘2స్టేట్స్’ తెలుగు రీమేక్‌తో హీరోయిన్గా శివాని ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. తాజాగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు శివానీ రాజశేఖర్. ఇందులో తేజ సజ్జా హీరో. తమిళంలో కూడా తన ఎంట్రీని ఖరారు చేసుకున్నారు శివానీ రాజశేఖర్. ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకటేష్ దర్శకుడు. శివాని–శివాత్మిక దివంగత నటుడు శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ ‘రాజ్‌దూత్’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మేఘాంశ్ బ్రదర్ శశాంక్ తనకు దర్శకత్వంలో ఆసక్తి ఉందని ఓ సందర్భంలో చెప్పారు. ఇంకా అల్లు అర్జున్–అల్లు శిరీష్, మంచువిష్ణు, మంచు మనోజ్– మంచు లక్ష్మీ, నాగచైతన్య– అఖిల్, వరుణ్‌తేజ్ – నిహారిక కొణిదెల.. ఇలా ఇండస్ట్రీలో ఆల్రెడీ కొందరు బ్రదర్స్, బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అందాలతార, ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ బాలీవుడ్లో మంచి ఫామ్‌లో ఉన్నారు. జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఖుషీ కపూర్-జాన్వీ కపూర్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్ కూడా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నారు. సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటించిన ‘లవ్యాత్రి’ సినిమాతో ఇసాబెల్లా కైఫ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇసబెల్లా కైఫ్-కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ తమ్ముడు నామన్ నీల్‌నితిన్ ‘బైపాస్ రోడ్’ అనే చిత్రంతో డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఈ చిత్రంలో నీల్‌నితిన్ ముఖేష్ హీరోగా నటించాడు.నటి సుష్మితాసేన్ తమ్ముడు రాజీవ్ సేన్ బాలీవుడ్లో ‘ఇటీ: కేన్ యు సాల్వ్ యువర్ ఓన్ మర్డర్?’ అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు. హీరోయిన్ కృతీసనన్ సిస్టర్ నుపూర్ సనన్ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కృతీసనన్, నుపూర్ సనన్‌లు కలిసి గతంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
మేమే రాములోరి వారసులం..
అయోధ్యలో రామజన్మభూమి– బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాస్పద స్థల యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా శ్రీరాముడి వారసుల అంశం తెరపైకి వచ్చింది. శ్రీరాముడి వారసులెవరైనా ఇంకా అయోధ్యలో ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణలో భాగంగా ఇటీవల ప్రశ్నించడంతో రఘుకుల రాముడి వారసులం మేమేనంటూ కొన్ని రాజవంశాలు ప్రకటించాయి. ఆ వివరాలు.. కుశుడి వంశస్తులం: జైపూర్ యువరాణి దియా కుమారి రాముడి వారసులం తామేమని జైపూర్ యువరాణి, రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ రాజవంశీకుల చరిత్రను సుప్రీంకోర్టు ఎదుట సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసేందుకు సిద్ధమన్నారు. పదేళ్ళ క్రితం జైపూర్ మహారాణి దియా కుమారి తల్లి పద్మినీదేవి కూడా తాము రాముడి వారసులమని ప్రకటించిన విషయం గమనార్హం. జైపూర్ రాజు, తన భర్త భవానీ సింగ్ కుశుడికి 309వ వంశీకుడని ఆ రోజు ఆమె ప్రకటించారు. మాది లవుడి వంశం: సతేంద్రరాఘవ్ ‘రాముడికి నిజమైన వారసులం మేమే’ అని రాజస్తాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యేంద్ర రాఘవ్ చెప్పారు. అందుకు వాల్మీకి రామాయణం లో కూడా సాక్ష్యాలున్నాయన్నారు. తాము రాము డి కుమారుడైన లవుడి తరువాత మూడవ తరానికి చెందిన బద్గుజార్ గోత్రస్తులమన్నారు. ‘బద్గుజార్ వంశం రాముడి పెద్ద కుమారుడు లవుడి వంశం. ప్రస్తు త అయోధ్యలోని నార్త్ కౌశల్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ కౌశల్ వరకు లవుడి సామ్రాజ్యం విస్తరించి ఉందని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తోంద’న్నారు. మాదీ శ్రీరాముని వంశమే: మేవార్ రాజకుటుంబం శ్రీరాముడి వంశమైన ఇక్ష్వాక వంశం వారసులం తామని మేవార్ రాజకుటుంబీకులు చెబుతున్నారు. ‘ మేము రాముని వారసులం అనేది చరిత్ర చెప్పే సత్యం. అయితే, మేం రామజన్మభూమిపై హక్కులు కోరబోం. అక్కడ రామాలయం నిర్మించాలన్నదే మా అభిమతం’ అని అరవింద్ సింగ్ మేవార్ ట్వీట్ చేశారు. సూర్యవంశీ రాజ్‌పుత్‌లు కూడా.. ‘సూర్యవంశీ రాజ్‌పుత్‌లమైన మేం కూడా శ్రీరాముడి వంశస్తులమే. ఇది సత్యం. మా వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కోర్టు కోరితే ఇస్తాం’ అని రాజస్తాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ కచరియావాలా స్పష్టం చేశారు. -
గాంధీజీ కలను నిజం చేద్దాం
న్యూఢిల్లీ: స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. వచ్చే నెల అక్టోబర్ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. అనంతరం ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ స్కూల్లో పరిసరాల్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. 4.5లక్షల గ్రామాలు బహిర్భూమి రహితం ‘స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు 40 నుంచి 90 శాతానికి విస్తరించాయి. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం నాలుగేళ్లలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 450 జిల్లాలు, 4.5 లక్షల గ్రామాలు బహిర్భూమి రహితంగా మారడాన్ని మీరు ఊహించారా? ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని ప్రధాని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2, 2018 నాటికి దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ బహిర్భూమి∙రహిత రాష్ట్రంగా మారనుందని స్వచ్ఛ భారత్ సర్వే వెల్లడించిందని గుర్తు చేశారు. ‘అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ 1.36 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం’ అని యోగి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ప్రభు త్వం చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసించారు. మీడియా కృషిని ప్రశంసించిన ప్రధాని ప్రజల జీవన ప్రమాణాల్ని మెరగుపర్చడంలో స్వచ్ఛత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వల్ల మూడు లక్షల మంది ప్రాణాల్ని కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. డయేరియా కేసులు 30 శాతం తగ్గుతాయి’ అని ఆయన వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, బిహార్, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల ప్రజలతో మోదీ సంభాషించారు. కశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలో ప్యాంగాంగ్ సరస్సు శుద్ధిలో పాలుపంచుకుంటోన్న టిబెట్ సరిహద్దు పోలీసు బలగాలతో పాటు పట్నా సాహిబ్ గురుద్వారాకు చెందిన సిక్కు మతపెద్దలు, అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మతగురువులు, దైనిక్ జాగరణ్ మీడియా గ్రూపు సిబ్బందితో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో వార్తా పత్రికలు, చానళ్లు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీలకు ప్రశంసలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్‌టాటాలు కూడా ప్రధానితో సంభాషించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాల్ని కొనియాడారు. అలాగే తమిళనాడులో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాలుపంచుకోవడాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫరీదాబాద్‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్నాలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. -
కన్నడ బరిలో వారసుల సందడి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై కసరత్తును తీవ్రతరం చేశాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. సిద్ధరామయ్య కొడుకు X యడ్యూరప్ప కొడుకు ? మైసూర్ జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటీచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తన కుమారుడికి మార్గం సుగమం చేయడానికే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా, పొరుగునే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని భావిస్తోంది. పైగా ఆ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టికెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. టిక్కెట్లకు పోటాపోటీ.. మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం సౌమ్య బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నేత పరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీ(ఎస్) నుంచి దేవెగౌడ కుటుంబమంతా! జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేవెగౌడ కొడుకు హెచ్డీ కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రేవణ్ణ తన కొడుకు ప్రజ్వల్‌ను ఈసారి ఎన్నికల బరిలో దించబోతుండడంతో, కుమారస్వామి తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపించబోతుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వారసులకు పది రోజుల్లో ఉద్యోగం
కారుణ్య నియామకాలపై సర్కారు స్పష్టత సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి వారసులకు ఉద్యోగమిచ్చే కారుణ్య నియామక పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలపై మరోసారి స్పష్టతనిచ్చింది. మరణించిన ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసు కున్న 10 రోజుల్లో ఈ నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు తేదీ నుంచి పది పనిదినాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కుటుంబ దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉండే బాధితులకు తక్షణ సాయం అందేందుకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. -
వారసులు వస్తున్నారు
-
వారసులొస్తున్నారు..!
సాక్షి, చెన్నై : జిల్లాల కార్యదర్శుల పదవుల్ని తమ వారసులకు ఇప్పించే పనిలో మాజీలు సిద్ధం అయ్యారు. తమ వాడికంటే తమ వాడికి జిల్లా ల పదవులు ఇవ్వాలంటూ అధినేత ఎం కరుణానిధిపై మాజీలు ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డా రు. ఇక తన మద్దతు దారులకు ఎన్నికల ఓటమిపై వివరణ అడిగేందుకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సిద్ధం అయ్యారు. వారికి నోటీసులు పంపించేందుకు అధిష్టానాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. డీఎంకేలో ప్రక్షాళన పర్వం ఆరంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని జిల్లాల్ని పార్టీపరంగా 65కు పెంచారు. జిల్లాల విభజన పర్వం ముగియడంతో, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని సాగనంపే పనిలో డీఎంకే అధిష్టానం ఉంది. అలాగే, పంచాయతీ యూనియన్లు, నగర కమిటీల విభజన ప్రక్రియను వేగవంతం చేసి ఉన్నారు. వీటిని విభజించినానంతరం సంస్థాగత ఎన్నికల ద్వారా యూనియన్లు, నగర కమిటీల పదవుల్ని భర్తీ చేయబోతున్నారు. ఈ ప్రక్రియ ముగియడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అనంతరం పార్టీ జిల్లా కమిటీల ఎంపిక మీద దృష్టి పెట్టడం ఖాయం. ఈ పదవుల భర్తీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, అంతలోపు అసెంబ్లీ ఎన్నికల తేది సమీపించే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, పంచాయతీ యూనియన్లు, నగర కమిటీల ఎన్నికల అనంతరం జిల్లాల కార్యదర్శుల పదవిల్ని అధిష్టానం ఏక గ్రీవంగా తీర్మానించి ప్రకటించే వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. దీన్ని పసిగట్టిన జిల్లాల మాజీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు తమ వారసుల్ని తెర మీదకు తెచ్చె పనిలో పడ్డారు. వారసులొస్తున్నారు..: పార్టీలో సీనియర్లుగా ఉన్న అనేక మంది నాయకులు సొంత జిల్లాలు రెండు లేదా మూడుగా విభజించబడి ఉన్నాయి. కొందరు సీనియర్లు జిల్లాల కార్యదర్శులుగా ఇది వరకు వ్యవహరించారు. అయితే, వీరికి మళ్లీ పదవులు అనుమానమే. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే రీతిలో డీఎంకే అధిష్టానం ముందుకు వెళుతుండడంతో జిల్లాల్లో తమ పలుకుబడి మీద ప్రభావం చూపించ వచ్చన్న బెంగ సీనియర్లు, మాజీల్లో బయలు దేరింది. దీంతో తమకు పట్టున్న ప్రాంతాలతో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్ని తమ గుప్పెట్లోకి మళ్లీ తీసుకోవడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు. వేలూరు జిల్లా మూడుగా విభజించబడడంతో సీనియర్ నేత దురై మురుగన్‌కు షాక్ అని చెప్పవచ్చు. తనకు ఎలాగో పదవి వచ్చే అవకాశం లేనందున తన వారసుడు కదిర్ ఆనంద్‌ను వేలూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయాలన్న డిమాండ్‌ను అధినేత కరుణానిధి ముం దు ఉంచినట్టు సమాచారం. అలాగే, విల్లుపురం సెంట్రల్ జిల్లా కార్యదర్శి పదవిని తన వారసుడు గౌతం శిగామణికి ఇవ్వాలంటూ మరో నేత పొన్ముడి, తిరువారూర్ పదవి తనయుడు రాజా అప్పగించాలంటూ టీఆర్ బాలు నినాదాన్ని అందుకుని ఉన్నారు. అలా గే, కోయంబత్తూరు దక్షిణ జిల్లా కార్యదర్శిగా తన కుమారుడు పైలియర్ను ఎంపిక చేయాలంటూ పొంగలూరు పళని స్వామి, దిండుగల్ కార్యదర్శిగా తనయుడు సెంథిల్‌కుమార్‌ను నియమించాలని ఐ పెరియస్వామి, రామనాథపురం పదవికి తన వారసుడు తంగవేలన్కు కేటాయించాలని సంపత్, తూత్తుకుడి కార్యదర్శి పదవిని తనయుడు జగన్‌కు ఇవ్వాలం టూ పెరియస్వామి కరుణానిధి వద్ద ప్రతిపాదన ఉంచినట్టు తెలిసింది. సీనియర్లు అంద రూ తమ వారసుల్ని తెర మీదకు తీసుకు రావడంతో అధినేత కరుణానిధి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్నా అరివాళయం వర్గాలు పేర్కొం టున్నాయి. ఎలాగో స్టాలిన్‌ను ముందు ఉంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నందున, తమ వారసులకు పదవుల్ని కేటాయించిన పక్షంలో యువరక్తాన్ని ఎంపిక చేసినట్టు అవుతుందన్న సూచనను కరుణానిధికి చేయడం గమనార్హం. నేతలకు ఒత్తిడికి కరుణానిధి తలొగ్గిన పక్షంలో తమ వారసుల్ని అడ్డం పెట్టుకుని మాజీలు, సీనియర్లు మళ్లీ చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే...! నోటీసులు : లోక్ సభ ఎన్నికల ఓటమి కారణాలపై ఇప్పటికే 33 మందిని డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించింది. వీరిలో ఏడుగురు ఇచ్చిన వివరణతో ఏకీ భవించి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. మిగిలిన వారి నుంచి వివరణలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ తన మద్దతు దారులపై దృష్టి పెట్టారు. ఏక పక్షంగా స్టాలిన్ నిర్ణయాలు ఉన్నాయన్న ప్రచా రం , స్టాలిన్ అడుగులకు కరుణ మడుగులు వత్తుతున్నారన్న ఆరోపణలకు కల్లెం వేయడానికి సిద్ధం అయ్యారు. తన మద్దతు దారులుగా ఉన్న సీనియర్లు కేఎన్ నెహ్రు, పొన్ముడి, ఏవీ వేలు, తాము అన్భురసు తదితర నాయకులకు ఓటమి కారణాలపై వివరణ కోరేందుకు స్టాలి న్ సూచన మేరకు అధిష్టానం రెడీ అయిందటా..!. ఎలాగో వీరి వారసులకు పదవులు దక్కబోతున్న దృష్ట్యా, ముందస్తుగా సీనియర్ల వద్ద వివరణల సేకరణ నినాదంతో నోటీసులకు రెడీ అయినట్టున్నారు. లండన్ నుంచి స్టాలిన్ రాగానే, వీరందరికీ వివరణ నోటీసులు వెళ్లబోతోండడం గమనార్హం. -
బాబోయ్.. వారసులొచ్చారు!
ఒకప్పుడు ప్రచారం అంటే నాయకులు గజగజలాడేవారు ఒక్క ఓటైనా.. అమూల్యమే అన్న విధంగా ప్రతి వ్యక్తినీ చిరునవ్వుతో పలకరిస్తూ సాగే వారు.. నేటికీ కొన్ని పార్టీల అభ్యర్థులు ఇదే అవలంబిస్తున్నారు. ఐదేళ్లపాటు పదవీ పీఠంపై ఎక్కించనున్నవారిని కనీసం ప్రచారంలోనైనా ప్రసన్నం చేసుకొనేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. అయితే ఈ ఏడాది రాజకీయ తెరంగేట్రం చేస్తున్న కొందరి నాయకుల కుమారులు మాత్రం కనీస మర్యాదలకు నీళ్లొదులుతున్నారు. అసలే వీరి రాకతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ‘సుకుమారుల’ చేష్టలతో విసిగిపోతున్నారు. ఆయా అభ్యర్థులు తమ తండ్రులు చేసిన తప్పిదాలను మరచి మరీ విర్రవీగుతుండటంతో ఓటర్లు కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అద్దంకి, సంతనూతలపాడు, కొండపి, గిద్దలూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్దంకి: డిష్యుం.. డిష్యుం.. రణం బలరాంకష్ణమూర్తి టీడీపీలో రాష్ట్రస్థాయి గుర్తింపుతో ఉన్నప్పటికీ.. జిల్లాస్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉందనేది బహిరంగ సత్యం. అందుకనే, పార్టీ అధినేత చంద్రబాబు కూడా బలరాంను వ్యూహాత్మకంగా పక్కనబె ట్టి..ఆయన కుమారుడు వెంకటేష్‌కు సీటిచ్చారట. అయితే గతంలో బలరాంపై ఫ్యాక్షన్ ముద్ర ఉంది. పలు క్రిమినల్ కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరణం వెంకటేష్ తెరపైకి రావడంతో నియోజకవర్గంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఫ్యాక్షనిజం వస్తుందేమోననేది వారి ఆవేదన. దీనికి అద్దంకిలో ఈ మధ్య జరిగిన ఘర్షణనే ఉదహరిస్తున్నారు. దీంతో తొలిసారి పోటీచేస్తున్న వెంకటేష్‌కు ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత చరిత్ర గమనిస్తే ఎన్నికల్లో గెలిచిన వారికి 2500 నుంచి 5వేల లోపు మాత్రమే మెజార్టీ ఉండేది. గొట్టిపాటి రవికుమార్ వెలుగులోకి వచ్చాక నియోజకవర్గంలోని ప్రజలు 17వేలకు పైగా ఓట్ల మెజార్టీనిచ్చారు. ఆయన అభివృద్ధిని అంతా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరణం వారసత్వ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీపముండగానే.. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు, ఆయన కుమారుడు రాజ్‌విమల్ తు.చ తప్పకుండా పాటించారు. పదవిని అనుభవించినంత కాలం ప్రతి చిన్నపనికీ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, అందినకాడికి పైసాపైసా పోగేశారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా అపఖ్యాతి మూటకట్టుకున్న శేషు ఈ దఫా కాంగ్రెస్ తరఫున తన కుమారుడు గుర్రాల రాజ్‌విమల్‌ను బరిలో దించారు. వాళ్లు ప్రచారానికి వెళుతున్నా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలవీరాంజనేయస్వామి ప్రచారంలో వెనుకబడిపోగా.. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్‌రావుకు మాత్రం రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. మమ.. సంతనూతలపాడు కాంగ్రెస్ అభ్యర్థి వేమా శ్రీనివాసరావు కూడా రాజకీయ వారసుడే.. ఆయన మాజీ ఎమ్మెల్యే వేమా ఎల్లయ్య తనయుడు. ఈయనకు ప్రజల మద్దతు కరువైంది. ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా.. అన్ని సామాజికి వర్గాలను కలుపుకోలేక పోతున్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి వారసత్వంతో కాంగ్రెస్ తరఫున ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కందుల గౌతంరెడ్డి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వైఎస్ఆర్ సీపీ, టీడీపీల పోరులో.. ఈయనకు డిపాజిట్లైనా వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘వారసుల’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాజకీయాల్లో కొత్త వ్యక్తులు కావడం.. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నేతల వారసులు కావడంతో పోటీ రసకందాయంలో పడింది. తెలుగుదేశం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు టి.వీరేందర్ బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లో ఈ ముగ్గురివీ కొత్త ము ఖాలే. పోటీ చేస్తున్న ఈముగ్గురు అభ్యర్థుల నే పథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వారిరువురూ అన్నాతమ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇరువురూ ఒకే మాజీ హోంమంత్రుల సుపుత్రులు.. తరగతిలో దోస్తులు.. తూళ్ల వీరేందర్‌గౌడ్ తండ్రి టి.దేవేందర్‌గౌడ్ మాజీ హోంమంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు కార్తీక్‌రెడ్డి తల్లితండ్రులిద్దరూ హోంమంత్రులుగా పదవులు ఏలినవారే. అంతేకాక.. వీరేందర్, కార్తీక్‌లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆబిడ్స్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఇద్దరిదీ ఒకే తరగతి కావడం విశేషం. తాజాగా ఈ ఇరువురూ ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం విశేషం. -
‘సన్’స్ట్రోక్
సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారసుల పోటీ తండ్రుల కంటే తామే బెటరంటున్న యువ నేతలు గ్రేటర్ కాంగ్రెస్‌లో ముదురుతున్న ఇంటి పోరు సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పలువురు గ్రేటర్ కాంగ్రెస్ ఎంపీ, ఎంఎల్ఏలను ఇంటిపోరు ఇబ్బంది పెడుతోంది. సాధారణంగా పదవుల్లో ఉన్న తండ్రులు తమ వారసులను రాజకీయాల్లో తీసుకు రావాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సిటీలో సీన్ రివర్సైంది. పెద్దలను పక్కనబెట్టి మరీ ముందుకు దూసుకొస్తున్నారు యువ నేతలు. తండ్రుల అభీష్టం ఎలా ఉన్నా తమకు సీట్లు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మారు మీరు విశ్రాంతి తీసుకుని మాకు అవకాశం కల్పించాల్సిందేనంటూ తండ్రులకు హుకుం జారీ చేస్తున్న వారసుల తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభ్యర్థిత్వం కోసం బయట హేమాహేమీలతో పోటీపడుతున్న పలువురు నేతలు సైతం.. ఇంటిపోరుతో వేగలేక ఇబ్బందికర పరిస్థితిలో పడిపోవటం తాజా రాజకీయ వి‘చిత్రం’. ప్రస్తుతం కుమారుల నుంచి ఇంటి పోరు ఎదుర్కొంటున్న వారిలో అంజన్‌కుమార్ యాదవ్, ముఖేష్‌గౌడ్, భిక్షపతియాదవ్ తదితరులుండగా, ఉప్పల్ ఎమ్మెల్యే బి.రాజిరెడ్డి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన ఈసారి టికెట్ విషయంలో సోదరుడైన లక్ష్మారెడ్డి నుంచి పోటీ ఎదుర్కొంటు న్నారు. వయోభారం రీత్యా తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన రాజిరెడ్డిని కోరుతున్నట్టు సమాచారం. ఇక, ముషీరాబాద్ ఎంఎల్ఏ టి.మణెమ్మ ఇంట్లోనూ వారసుల పోటీ నెలకొంది. వయోభారం కారణంగా మణెమ్మ ఈ మారు పోటీ చేసే పరిస్థితి లేకపోవటంతో కుమారుడు శ్రీనివాసరెడ్డి, కూతురు శోభారాణిలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే తర పున శ్రీనివాసరెడ్డి ఏకంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుండటం విశేషం. నాన్నా.. నాకూ కావాలి సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ నేను సైతం.. అంటూ వచ్చే ఎన్నికల్లో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీటు కోసం తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి టికెట్ తెచ్చిపెట్టాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. అంబర్‌పేట - ముషీరాబాద్ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం తనకు దక్కుతుందన్న ధీమాలో అనిల్‌కుమార్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నేను సైతం.. సనత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డి ఈ మారు పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా శశిధర్‌రెడ్డి మున్ముందు ఢిల్లీ రాజకీయాలకే పరిమితమైతే రాష్ట్ర రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా వ్యవహరించే ప్రతిపాదనను ఆదిత్య తన తండ్రి ముందుంచిన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. తండ్రీకొడుకుల సవాల్ శేరిలింగంపల్లి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్‌లు పోటీ పడుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడికి టికెట్ ఇవ్వాలంటూ తండ్రీకొడుకులిద్దరూ దరఖాస్తు చేసుకోవటం విశేషం. వయోభారం కారణంగా ఈ మారు విశ్రాంతి తీసుకోవాలని రవికుమార్ యాదవ్ తండ్రికి సూచిస్తుండగా.. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. తండ్రీకొడుకుల పోటీతో ఆ నియోకజవర్గ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకింత అయోమయం నెలకొంది. నేనే అభ్యర్థిని.. బతిమాలడం... ఒత్తిడి తేవడం... ఏంటి అనుకున్నారో ఏమో.. ఏకంగా తానే అభ్యర్థినని ప్రకటించేసుకున్నారు రాష్ట్ర మంత్రి మూల ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. ఈ మారు తనను అభ్యర్థిగా చేయాలని విక్రమ్ గౌడ్ తన తండ్రి ముందుంచిన డిమాండ్‌ను ఆయన ఇంకా పరిగణలోకి తీసుకోకున్నా తానే అభ్యర్థినంటూ విక్రమ్ సన్నిహితుల వద్ద తేల్చేశారు.