సాక్షి, చెన్నై : జిల్లాల కార్యదర్శుల పదవుల్ని తమ వారసులకు ఇప్పించే పనిలో మాజీలు సిద్ధం అయ్యారు. తమ వాడికంటే తమ వాడికి జిల్లా ల పదవులు ఇవ్వాలంటూ అధినేత ఎం కరుణానిధిపై మాజీలు ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డా రు. ఇక తన మద్దతు దారులకు ఎన్నికల ఓటమిపై వివరణ అడిగేందుకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సిద్ధం అయ్యారు. వారికి నోటీసులు పంపించేందుకు అధిష్టానాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. డీఎంకేలో ప్రక్షాళన పర్వం ఆరంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని జిల్లాల్ని పార్టీపరంగా 65కు పెంచారు. జిల్లాల విభజన పర్వం ముగియడంతో, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని సాగనంపే పనిలో డీఎంకే అధిష్టానం ఉంది.
అలాగే, పంచాయతీ యూనియన్లు, నగర కమిటీల విభజన ప్రక్రియను వేగవంతం చేసి ఉన్నారు. వీటిని విభజించినానంతరం సంస్థాగత ఎన్నికల ద్వారా యూనియన్లు, నగర కమిటీల పదవుల్ని భర్తీ చేయబోతున్నారు. ఈ ప్రక్రియ ముగియడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అనంతరం పార్టీ జిల్లా కమిటీల ఎంపిక మీద దృష్టి పెట్టడం ఖాయం. ఈ పదవుల భర్తీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, అంతలోపు అసెంబ్లీ ఎన్నికల తేది సమీపించే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, పంచాయతీ యూనియన్లు, నగర కమిటీల ఎన్నికల అనంతరం జిల్లాల కార్యదర్శుల పదవిల్ని అధిష్టానం ఏక గ్రీవంగా తీర్మానించి ప్రకటించే వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. దీన్ని పసిగట్టిన జిల్లాల మాజీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు తమ వారసుల్ని తెర మీదకు తెచ్చె పనిలో పడ్డారు.
వారసులొస్తున్నారు..:
పార్టీలో సీనియర్లుగా ఉన్న అనేక మంది నాయకులు సొంత జిల్లాలు రెండు లేదా మూడుగా విభజించబడి ఉన్నాయి. కొందరు సీనియర్లు జిల్లాల కార్యదర్శులుగా ఇది వరకు వ్యవహరించారు. అయితే, వీరికి మళ్లీ పదవులు అనుమానమే. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే రీతిలో డీఎంకే అధిష్టానం ముందుకు వెళుతుండడంతో జిల్లాల్లో తమ పలుకుబడి మీద ప్రభావం చూపించ వచ్చన్న బెంగ సీనియర్లు, మాజీల్లో బయలు దేరింది. దీంతో తమకు పట్టున్న ప్రాంతాలతో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్ని తమ గుప్పెట్లోకి మళ్లీ తీసుకోవడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు. వేలూరు జిల్లా మూడుగా విభజించబడడంతో సీనియర్ నేత దురై మురుగన్‌కు షాక్ అని చెప్పవచ్చు.
తనకు ఎలాగో పదవి వచ్చే అవకాశం లేనందున తన వారసుడు కదిర్ ఆనంద్‌ను వేలూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయాలన్న డిమాండ్‌ను అధినేత కరుణానిధి ముం దు ఉంచినట్టు సమాచారం. అలాగే, విల్లుపురం సెంట్రల్ జిల్లా కార్యదర్శి పదవిని తన వారసుడు గౌతం శిగామణికి ఇవ్వాలంటూ మరో నేత పొన్ముడి, తిరువారూర్ పదవి తనయుడు రాజా అప్పగించాలంటూ టీఆర్ బాలు నినాదాన్ని అందుకుని ఉన్నారు. అలా గే, కోయంబత్తూరు దక్షిణ జిల్లా కార్యదర్శిగా తన కుమారుడు పైలియర్‌ను ఎంపిక చేయాలంటూ పొంగలూరు పళని స్వామి, దిండుగల్ కార్యదర్శిగా తనయుడు సెంథిల్‌కుమార్‌ను నియమించాలని ఐ పెరియస్వామి,
రామనాథపురం పదవికి తన వారసుడు తంగవేలన్‌కు కేటాయించాలని సంపత్, తూత్తుకుడి కార్యదర్శి పదవిని తనయుడు జగన్‌కు ఇవ్వాలం టూ పెరియస్వామి కరుణానిధి వద్ద ప్రతిపాదన ఉంచినట్టు తెలిసింది. సీనియర్లు అంద రూ తమ వారసుల్ని తెర మీదకు తీసుకు రావడంతో అధినేత కరుణానిధి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్నా అరివాళయం వర్గాలు పేర్కొం టున్నాయి. ఎలాగో స్టాలిన్‌ను ముందు ఉంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నందున, తమ వారసులకు పదవుల్ని కేటాయించిన పక్షంలో యువరక్తాన్ని ఎంపిక చేసినట్టు అవుతుందన్న సూచనను కరుణానిధికి చేయడం గమనార్హం. నేతలకు ఒత్తిడికి కరుణానిధి తలొగ్గిన పక్షంలో తమ వారసుల్ని అడ్డం పెట్టుకుని మాజీలు, సీనియర్లు మళ్లీ చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే...!
నోటీసులు :
లోక్ సభ ఎన్నికల ఓటమి కారణాలపై ఇప్పటికే 33 మందిని డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించింది. వీరిలో ఏడుగురు ఇచ్చిన వివరణతో ఏకీ భవించి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. మిగిలిన వారి నుంచి వివరణలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ తన మద్దతు దారులపై దృష్టి పెట్టారు. ఏక పక్షంగా స్టాలిన్ నిర్ణయాలు ఉన్నాయన్న ప్రచా రం , స్టాలిన్ అడుగులకు కరుణ మడుగులు వత్తుతున్నారన్న ఆరోపణలకు కల్లెం వేయడానికి సిద్ధం అయ్యారు. తన మద్దతు దారులుగా ఉన్న సీనియర్లు కేఎన్ నెహ్రు, పొన్ముడి, ఏవీ వేలు, తాము అన్భురసు తదితర నాయకులకు ఓటమి కారణాలపై వివరణ కోరేందుకు స్టాలి న్ సూచన మేరకు అధిష్టానం రెడీ అయిందటా..!. ఎలాగో వీరి వారసులకు పదవులు దక్కబోతున్న దృష్ట్యా, ముందస్తుగా సీనియర్ల వద్ద వివరణల సేకరణ నినాదంతో నోటీసులకు రెడీ అయినట్టున్నారు. లండన్ నుంచి స్టాలిన్ రాగానే, వీరందరికీ వివరణ నోటీసులు వెళ్లబోతోండడం గమనార్హం.
వారసులొస్తున్నారు..!
Published Sun, Jul 6 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement