Karunanidhi
-
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్‌సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్‌సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్‌రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
తగ్గేదేలే.. ముఖ్యమంత్రి స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకే కార్యకర్తలకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలో ఇటీవల కాలంగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలను గుర్తుచేస్తూ, ఏడాది పొడవునా వేడుకలను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. తమిళనాడు హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎంత వరకై నా వెళ్లి ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత మేధాసంపతికి దోహదపడే విధంగా మదురైలో కలైంజ్ఞర్ కరుణానిధి స్మారక గ్రంథాలయం రూపుదిద్దుకుంటున్నదని వివరించారు. ఇది మరి కొద్ది రోజుల్లో ప్రజాపయోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. తిరువారూర్‌లో నిర్మించిన కలైంజ్ఞర్ కోట్టం ఈనెల 20న ప్రారంభం కాబోతోందన్నారు. ఈ వేడుకకు బిహార్ సీఎం నితీష్కుమార్హాజరు కానున్నారని గుర్తు చేశారు. ఈ వేడుక జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున కేడర్ తరలిరావాలని పిలుపునిచ్చారు. బెదిరింపులకు భయపడ వద్దని, తాను ఉన్నానని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం స్వస్థలం తిరువారూర్‌కు ఆదివారం రాత్రి సీఎం స్టాలిన్ బయలుదేరి వెళ్లారు. సీఎం రాకతో మూడు రోజుల పాటు తిరువారూర్‌లో డ్రోన్లపై నిషేధం విధించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సీఎం పర్యటనకు భద్రతను పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టం చేసింది. -
కరుణ ‘నీడ’ ఇక లేరు.. స్టాలిన్ కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: దివంగత డీఎంకే అధినేత కరుణానిధికి 48 ఏళ్లు వెన్నంటే ఉంటూ సేవలు అందించిన షణ్ముగనాథన్(80) అనారోగ్యంతో మంగళవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం వద్ద సీఎం ఎంకే స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర ఉద్వేగంతో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. డీఎంకే అధినేత కరుణానిధి బతికున్నంత కాలం ఆయన వెన్నంటే షణ్ముగనాథన్ నడిచారు. ఎక్కడకు వెళ్లినా కరుణకు నీడగా వ్యవహరించే వారు. కరుణానిధి వెనుకే కూర్చుని ఆయన చేసే ప్రసంగాల్లో చిన్న వాఖ్యం కూడా వదలకుండా షార్ట్ హ్యాండ్ రైటింగ్‌తో రాసుకుని, వాటిని నిమిషాల వ్యవధిలో టైప్ చేసి మరీ మీడియాకు అందించేవారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) కరుణ మరణం తరువాత షణ్ముగనాథన్ వయోభారం, అనారోగ్య సమస్యలతో చెన్నై తేనాంపేటలోని ఇంటికే పరిమితం అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎండీఎంకే నేత వైగోలు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని చూసి స్టాలిన్ కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత కరుణానిధి నీడను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు.. 36 కోట్లతో స్మారక మండపం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రానికి నిరుపమాన సేవలందించిన దివంగత ముఖ్యమంత్రి, కలైంజ్ఞర్ కరుణానిధికి ఘనమైన స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చెన్నై మెరీనాబీచ్‌లో రూ.39 కోట్లతో ఈ స్మారకమండపాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ మేరకు మండపం నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థలు, రాయితీల కోర్కెల పై చర్చతో అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘తమిళ సమాజాభివృద్ధి, శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడిన కరుణానిధి గురించి చేయబోయే ప్రకటనతో నేనే కాదు, ఈ ప్రభుత్వమే గర్వపడుతోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళులు గౌరవాన్ని పెంపొందించేలా ఆయన వ్యవహరించారు. దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచిన రాజకీయ మేధావి. తమిళనాడు అసెంబ్లీకి మమ్మల్నంతా శాశ్వత సభ్యులుగా అందించిన ధీశాలి. కోట్లాది ప్రజల హృదయాల్లో తోబుట్టువుగా మారారు. సినీ పరిశ్రమతో 70 ఏళ్ల అనుబంధం, జర్నలిస్టుగా 70 ఏళ్ల జీవితం, 60 ఏళ్లపాటూ ఎమ్మెల్యే, డీఎంకే అధ్యక్షునిగా 50 ఏళ్ల పాలన, 13 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు కరుణానిధి. విజయం ఆయనను వీడలేదు, ఓటమి ఆయనను తాకలేదు. 1969లో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత మొత్తం ఐదుసార్లు రాష్ట్రాన్ని పాలించారు. జార్జికోట(సచివాలయం)లో కూర్చున్నా గుడిసెవాసుల గురించి ఆలోచిస్తుంటానని నిరూపించిన ప్రజా నాయకుడు. తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలకు అలుపెరుగని సేవ చేశారు. ప్రస్తుతం మనమంతా అనుభవించి, ఆస్వాదించే ఆధునిక తమిళనాడు కరుణానిధి కృషి ఫలితమే. కరుణానిధి గొప్పదనం గురించి ఇలా ఎన్నిరోజులైనా చెప్పుకుంటూ పోవచ్చు. ప్రజల కోసం జన్మించి, వారి సంక్షేమం కోసమే తుదివరకు పోరాడి అలసిపోయిన కరుణానిధి శాశ్వత విశ్రాంతి కోసం 2018 ఆగస్టు 7వ తేదీన తనువు చాలించారు. ఇలా తనను తాను తమిళనాడుకు అర్పించుకున్న ఆ మహానేత కరుణానిధిని నిరంతరం స్మరించుకోవడమే అసలైన నివాళి. అందుకే చెన్నై మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధివద్ద 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.39 కోట్లతో స్మారకమండపాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది..’’ అని ప్రకటించారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉపనేత ఓ పన్నీర్‌సెల్వం, మంత్రులు, విపక్షాల సభ్యులు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ, పత్రిక, సినీ, సాహిత్యరంగాల్లో విశేషఖ్యాతి గడించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సరైన గౌరవమని కొనియాడారు. చదవండి: Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..! కొత్త కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రకటన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ‘ప్రమోషన్’ దక్కింది. స్థానిక సంస్థల అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో చెన్నై పల్లవరం డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి మాట్లాడారు. చెన్నై నగర శివార్లకు స్థాయి పెంపు హోదా కల్పించాలని కోరారు. తాంబరంను మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తున్నట్లు అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తాంబరం, పల్లవరం, చెంబాక్కం, పమ్మల్, అనకాపుత్తూరు మునిసిపాలిటీలను, వాటి పరిధిలోని పంచాయతీలను ఒకటిగా చేసి తాంబరానికి కార్పొరేషన్‌గా స్థాయిని పెంచుతున్నట్లు పేర్కొంది. అదే విధంగా కాంచీపురం, కుంభకోణం, కరూరు, కడలూరు, శివకాశీలను సైతం కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. పల్లపట్టి, తిట్టకుడి, మాంగాడు, కున్రత్తూరు, నందిగ్రామం, గుడువాంజేరీ, పొన్నేరి, ఇడంగనశాలై, తారామంగళం, కోట్టకుప్పం, తిరునిన్రవూరు, శోలింగనల్లూరు, తారమంగళం, కూడలూరు, కారమడై, వడలూరు, తిరుక్కోయిలూరు, ఉళుందూరపేట్టై, సురండై, కలక్కాడు, అదిరామపట్టినం, మానమధురై, ముసిరి, కరుమత్తంపట్టి, మధుకరై, లాల్గుడి, కొల్లన్కోడును పురపాలక స్థాయికి పెంచుతున్నారు. పుగళూరు, టీఎన్‌పీఎల్ పుగళూరులను విలీనం చేసి పుగళూరు మునిసిపాలిటీలుగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: MK Stalin: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్ నిర్ణయాలు! -
సీఎం స్టాలిన్ ఉద్వేగం: ‘నాన్నకు ప్రేమతో..’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మీకు ఇచ్చిన హామీని నెరవేర్చానని సగర్వంగా తలెత్తుకుని తెలియజేసేందుకు మీ వద్దకు (చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణ సమాధి) వస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తన తండ్రి కరుణానిధి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తలై నిమిర్దిందు వరుగిరేన్’ (తలెత్తుకుని వస్తున్నాను) పేరున ఉద్వేగపూరితమైన వీడియో ను గురువారం విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘తిరువారూరులో ఉద్భవించి తమిళనాడునే తన సొంతూరుగా మార్చుకుని, నేతలకే నేతగా, ముఖ్యమంత్రులకే ముఖ్యమంత్రి కలైంజ్ఞర్. జూన్ 3వ తేదీ మీ జయంతి మాత్రమే కాదు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే కోట్లాది ప్రజలందరినీ ఉత్తేజితులను చేసేరోజు. ఈ రోడ్డులో ఒకరోజు నేను చేసిన ప్రతిజ్ఞను సహచరుల సహకారంతో నెరవేర్చి చూపాను. ఈ విషయాన్ని సగర్వంగా చాటుకునేందుకు మీ వద్దకు వస్తున్నాను. మీరు మరణించలేదు, పైనుంచి నన్ను గమనిస్తున్నారని, ఇంకా గమనిస్తూనే ఉంటారని భావిస్తున్నాను. జార్జికోట (చెన్నై సచివాలయం)ను అధిరోహించిన నాటి నుంచే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలేందుకు పాటుపడుతున్నాము. పాటుపడాలి, సాధించాలని అనేలా నన్ను తీర్చిదిద్దారు. మీరు చెప్పిన ఆ మాటలకు అద్దంపట్టేలా నడుచుకుంటున్నాను. ‘ఎవరైతే నిన్ను ప్రశంసించడం లేదు, వారిచేత ప్రశంసలు పొందేలా నడుచుకోవాలి’ అంటూ చెప్పిన మాటలు గుర్తున్నాయి. మీ మాటలే నాకు శాసనం. మీ జీవితం నాకు పాఠం. మీ వారసుడిగా విజయపూరితమైన సమాచారంతో మీ వద్దకు వస్తున్నాను. శుభాకాంక్షలు అని దీవించండి మహా నాయకుడా’ అని వీడియో సందేశం ద్వారా తన తండ్రికి స్టాలిన్ నివాళులర్పించారు. చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత -
తిరుగులేని స్టాలిన్.. వార్ వన్‌సైడ్!?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వేల అంచనాలు నిజం చేస్తూ ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 117 స్థానాలు దాటేసిన డీఎంకే ప్రస్తుతం 137 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఆ పార్టీ అధినేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ సైతం కలత్తూరులో విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇక పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు షాకిస్తూ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొలువుదీరడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. స్టాలిన్ సోదరి కనిమొళి సహా పార్టీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖచిత్రంగా మారి పాలనపై తమదైన ముద్ర వేసిన కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకుండానే జరిగిన అసెంబ్లీ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ అధికార అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఎలా ఢీకొడతారన్న అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సోదరుడు అళగిరితో విభేదాల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఒకవేళ సోదరుడు సొంతపార్టీ పెడితే దానిని ఎలా ఢీకొంటారన్న విషయాలపై విస్తృత చర్చ జరిగింది. అయితే, ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన స్టాలిన్, తండ్రిని గుర్తుచేస్తూనే తమకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న అంశాలపై ప్రసంగాలు చేశారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. అదే విధంగా, నూతన వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, నీట్ వివాదం, కరోనా వ్యాప్తి వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో బీజేపీతో కూటమిగా ఏర్పడిన అన్నాడీఎంకే విధానాలను తూర్పారబడుతూ ముందుకు సాగిపోయారు. మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు. మరోవైపు.. అన్నాడీఎంకే సైతం మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే... పోటీ చేసేది 20 సీట్లలోనేనైనా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్థానిక బీజేపీ నేత, నటి గౌతమి తదితర 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించింది. కానీ, ఓటర్లు మాత్రం వార్ వన్‌సైడ్ చేశారు. ఇంట గెలిచిన స్టాలిన్‌ను రచ్చ గెలిపిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో డీఎంకేలో కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా ఆయన తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకోనున్నారు. #WATCH | DMK supporters continue to celebrate outside party headquarters in Chennai as official trends show the party leading on 118 seats so far. Election Commission of India has banned any victory procession amid the #COVID19 situation in the country.#TamilNaduElections2021 pic.twitter.com/z6Fp5YRnKP — ANI (@ANI) May 2, 2021 చదవండి: తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు -
అసెంబ్లీ ఎన్నికలు: చరిత్ర పునరావృతమే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. అది అసాధ్యమని తేలితే కనీసం ప్రత్యర్థి గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని అభ్యర్థులు ఆశించడం రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల విజయావకాశాలను దెబ్బతీయడం కోసమే అన్నట్లుగా కొన్ని పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఏ కూటమికి కంటకంగా మారాయి, ఏ అభ్యర్థి గెలుపును ఎంత వరకు దెబ్బతీస్తాయని విశ్లేషించుకోక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ హవా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (తమిళనాడు)లో 1952, 1957, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించినా ఆ దూకుడుకు డీఎంకే అడ్డుకట్టవేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా తల ఎత్తుకు తిరిగే పరిస్థితినే కోల్పోయేలా చేసిన ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుంది. 1967 నాటి డీఎంకే చారిత్రాత్మక గెలుపుతో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి- ఎంజీ రామచంద్రన్ మధ్య విభేదాలు అన్నాదురై మరణం తరువాత 1971లో వచ్చిన ఎన్నికల్లో సైతం డీఎంకే ఘనవిజయం సాధించగా ఆపార్టీ అధ్యక్షులు కరుణానిధి సీఎం పీఠం అధిరోహించారు. కరుణానిధితో అభిప్రాయబేధాలు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎంజీఆర్ విజయపరంపర 1980, 1984 ఎన్నికల్లో సైతం కొనసాగింది. తన 70 ఏళ్ల వయసులో 1987 డిసెంబర్ 24వ తేదీన ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత పార్టీ చీలిపోగా, 1989 ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధిని గట్టిగా ఢీకొట్టడం ప్రారంభించారు. 1991- 2016 వరకు వారిద్దరే 1991లో జయలలిత, 1996లో కరుణానిధి, 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత ఒకరు సీఎం అవుతూ వచ్చారు. అయితే 2016లో వచ్చిన ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి గెలుపొంది అనాధిగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఎంజీఆర్ జీవించి ఉన్నత వరకు అధికారానికి దూరంగా ఉండక తప్పనిపరిస్థితిని ఎదుర్కొన్న డీఎంకే ఆ తర్వాత మాత్రమే గెలుపు బాటలోకి ప్రయాణించడం ప్రారంభించింది. ఎంజీఆర్‌తో సమానంగా జయలలిత కూడా కరుణకు పోటీగా నిలిచారు. ఇక రాజకీయాల్లో బలశాలులైన జయ, కరుణ ఇద్దరూ కన్నుమూసిన తర్వాత ఆ రెండు పార్టీలు తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ అనేక ప్రత్యేక ప్రాతిపధికలతో పోటీకి దిగి విజయం సాధించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఎంజీఆర్ మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయింది. ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉండిన జీకే మూపనార్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. అయినా, ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే విజయం సాధించింది. 1996లో డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను స్థాపించి మూడో అతిపెద్ద పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జీకే మూపనార్ తమిళ మానిల కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి డీఎంకేతో కూటమిగా ఏర్పడ్డారు. రజనీకాంత్ పరోక్ష మద్దతుతో ఈ కూటమి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించింది. మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి తొలి ఎన్నికల్లో తాను మాత్రమే గెలుపొందారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత అమ్మతో విభేదించగా, 2016 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి వైగో నాయకత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇలా రాష్ట్ర రాజకీయల చరిత్రలో అన్నాడీఎంకే, డీఎంకే ఢీకొనే ఏ కూటమి మనుగడ సాగించలేదు. అధికారంలో ఆ రెండింటిలో ఒకటే.. ఇదిలా ఉండగా, 1967 నుంచి 2016 వరకు వచ్చిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తాజా ఎన్నికలోల్ సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే రెండు కూటములకు పోటీగా మరో మూడు కూటములు ఏర్పడ్డాయి. ఐజేకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ మరో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కమల్ కూటమి ఒంటరిగా ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీమాన్‌కు రెండో అనుభవం. ఈ మూడు కూటములు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఓట్లను చీల్చడం ద్వారానే గెలుపు బాటలో ప్రయాణిస్తామని విశ్వసిస్తున్నాయి. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై దినకరన్ గురిపెట్టారు. అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసే ఓటర్లను కమల్, సీమాన్ నమ్ముకున్నారు. కొత్తగా బరిలో ఉన్న కూటముల అభ్యర్థుల గెలుపు సంగతి అటుంచితే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి మెజార్టీ లేదా గెలుపు అవకాశాలకు గండికొట్టడం ఖాయమని భావించవచ్చు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
కలైంజర్ సాక్షిగా కల్యాణం
చెన్నై, సేలం: దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ఒకరు బుధవారం ఆయన విగ్రహం ముందు వివాహం చేసుకున్నారు. చెన్నై తర్వాత కరుణానిధి విగ్రహం ఈరోడ్‌లో సౌత్‌జోన్‌లోని మనల్‌మేడులో మాత్రమే ఉంది. కరుణానిధి 97వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఇక్కడ కరుణానిధి విగ్రహానికి ఈరోడ్ డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి ముత్తు స్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి, అందియూర్ సెల్వరాజ్ ఇద్దరు వచ్చి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. సేలం జిల్లా సంగగిరికి చెందిన రాఘరాయన్ కుట్టై ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ (29), సంగగిరి సమీపంలో అత్తమ్మాపేటలో ఉంటున్న బిరిందియాదేవి (26) విగ్రహం ఎదుట పూలమాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలుచల్లి కలైంజర్ ఆశీస్సులు పొందారు. చంద్రకాంత్ మాట్లాడుతూ.. తమ అభిమాననేత నేత కలైంజర్ సాక్షిగా ప్రేమించిన యువతిని కల్యాణం చేసుకోవడం గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు. -
22ఏళ్ల తర్వాత...
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ (తెలుగులో ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలో కనిపించారు నటుడు ప్రకాశ్ రాజ్. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన కరుణానిధి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్‌రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటించనున్నారట. యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి పాత్ర కీలకమైనది. దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను శైలేష్ ఆర్. సింగ్, విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. -
చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ
సాక్షి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రధమ వర్ధంతి పురస్కరించుకుని డీఎంకే పార్టీ భారీగా శాంతి ర్యాలి నిర్వహించింది. డీఎంకే ఛీప్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, ఎంపి కనిమొళి, ఇతర కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. అన్నాసాలైలో అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత ప్రారంభమైన శాంతిర్యాలీ మౌనంగా మెరీనాతీరం వైపు కదిలింది. అనంతరం మెరీనాలోని కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ ముగిసింది. ర్యాలీ ముగింపులో భాగంగా కరుణానిధి సమాధి వద్ద డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. -
తిరువారూర్ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువారూర్ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ పనులు నిలిపివేయాలంటూ ఈసీ సోమవారం ఆదేశాలు జారీచేసింది. జనవరి 28న తిరువారూర్ ఉప ఎన్నికల జరగాల్సి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంతి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తిరువారూర్ ఉపఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల సంభవించిన గజ తుపాను బాధితులకు అందాల్సిన పరిహారం ఇంకా అందలేదని, పూర్తి అయ్యే వరకు ఉప ఎన్నిక వాయిదా వెయ్యాలని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీ పూర్తి అయ్యేంతవరకు ఉప ఎన్నికను వాయిదా వెయాలన్న అఖిలపక్షం డిమాండ్ మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సహా పలు పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తిరువారుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూసిన విషయం తెలిసిందే. -
జనవరి 28న తిరువారుర్ ఉప ఎన్నిక
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువారుర్ అసెంబ్లీ స్థానానికి జనవరి 28న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 31న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన చేసింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మరణించడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. తిరువారుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూశారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేస్తామని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతా సాహు తెలిపారు. అప్పటి నుంచి తిరువారుర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేది జనవరి 10. తర్వాతి రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 14. ఈవీఎంలు, వీవీప్యాట్లను వినియోగించనున్నట్టు ఈసీ తెలిపింది. -
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ
సాక్షి, చెన్నై : దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, సీతారాం ఏచూరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైగోలతో పాటు తదితర జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యారు. -
స్టాలిన్ కాళ్లపై పడొద్దు..
సాక్షి, చెన్నై : కలైంజ్ఞర్ కరుణానిధి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్.. పార్టీలో పలు సంస్కరణలు చేపట్టి తన మార్కును ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధినాయత్వం కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. స్టాలిన్ కాళ్లపై పడటం, భారీ పూలమాలతో సత్కరించడం వంటి పనులు మానుకోవాలంటూ సూచించింది. ‘అధ్యక్షుడి దృష్టిలో పడేందుకు ఆయన పాదాలు తాకడం వంటి దాస్యపు పనులు మనకు వద్దు. ప్రేమతో నమస్కరిస్తే చాలు. అలాగే మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేద్దాం. ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో మెలుగుదామని’ పిలుపునిచ్చింది. వాటికి బదులు పుస్తకాలు.. అధ్యక్షుడు స్టాలిన్, పార్టీ సీనియర్ నేతలను కలిసినపుడు... పూల మాలలు, శాలువాలతో సత్కరించే బదులుగా వారికి పుస్తకాలు బహూకరించాలని డీఎంకే అధినాయకత్వం కోరింది. అలా వచ్చిన పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాయాలకు పంపడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని పేర్కొంది. అదే విధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే పోస్టర్లు, ఫ్లెక్సీల సంస్కృతికి చరమగీతం పాడాలని సూచించింది. -
స్త్రీలోక సంచారం
వచ్చే ఏడాది మార్చిలో ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో, సమాఖ్యేత దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మూడు దేశాల పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. దక్షిణాఫ్రికా పట్టణం కేప్ టౌన్‌లోని ఏద్ ఎంకిజే హైస్కూల్‌ను సందర్శించినప్పుడు, ఆ పాఠశాల పిల్లలతో కలిసి చేసిన నృత్యంపై సోషల్ మీడియాలో వెక్కిరింపులు, విపరీత వ్యాఖ్యలు మొదలయ్యాయి. 61 ఏళ్ల థెరిసా మే.. మనిషి మొత్తం బిగదీసుకుపోయి కాళ్లు, చేతులు మాత్రమే కదుపుతూ రోబోలా డ్యాన్స్ చేశారని, ఓ ఆత్మ నిద్రలోంచి లేచి వచ్చినట్లుందనీ, ఆమె అసలు డ్యాన్స్ చేయకుండా ఉండినా బాగుండేదని ఆమెపై విమర్శలే ఎక్కువగా రాగా, అతి కొద్దిమంది మాత్రం.. పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఉత్సాహం రావడం సహజమే కాబట్టి, థెరిసా మే నృత్యాన్ని సహజమైనదిగా, పసి మనసంత అందమైనదిగా చూడాలని కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఈ ఏడాది మే 19న పెళ్లి రోజు ధరించిన వెడ్డింగ్ గౌన్‌ను అక్టోబర్ 26 నుంచి జనవరి 6 వరకు బెర్క్‌షైర్‌లోని విండ్సర్ పట్టణంలో ఉన్న విండ్సర్ క్యాజిల్‌లో, వచ్చే జూన్ 14 నుంచి అక్టోబర్ 6 వరకు స్కాట్లాండ్లోని హోలీరూడ్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వజ్రాలు పొదిగిన ఆ తెల్లటి గౌనుతో పాటు.. పెళ్లికి ప్రిన్స్ హ్యారీ ధరించిన దుస్తులను కూడా పౌరవీక్షణకు ఉంచుతున్నారు. ఒక హాస్యభరిత కార్యక్రమంలో (స్కిట్) మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సతీమణి కొరెట్టా స్కాట్ పాత్రను పోషించి, మార్టిన్‌పై జోకులు వేసినందుకు తను ఎంతగానో చింతిస్తున్నట్లు అమెరికన్ పాప్ గాయని కార్డీ బీ.. మార్టిన్ కుమార్తెకు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘రియల్ హౌస్‌వైఫ్స్’ అనే నాలుగు నిమిషాల నిడివి గల ఆ స్కిట్లో 24 ఏళ్ల కార్డీ.. పౌరహక్కుల నాయకుడైన మార్టిన్‌కు అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లు, అణకువ గల భార్యగా కొరెట్టా స్కాట్ ఆయన్ని సహనంగా భరించినట్లు కథ అల్లడంతో విమర్శలు మొదలై, విషయం అపాలజీ వరకు వెళ్లింది. మయన్మార్ సైన్యం ముస్లిం రోహింగ్యాలపై మారణహోమం జరిపిందని ఐక్యరాజ్య సమితి దర్యాప్తు బృందాలు నివేదిక ఇచ్చినందున.. అందుకు ప్రాయశ్చిత్తంగా ప్రస్తుత మయన్మార్ కౌన్సిలర్, విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఆంగ్ సాన్ సూచీకి తాము 1991లో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కు తీసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ ప్రైజ్ అన్నది.. అది ఫిజిక్స్‌లో గానీ, ‘పీస్’లో గానీ ఒక వ్యక్తి జరిపిన కృషికి ఇచ్చేదే కానీ.. తిరిగి వెనక్కు తీసుకునేది కాదని, కమిటీలో అలాంటి నియమ నిబంధనలు కూడా ఏమీ లేవని నోబెల్ కమిటీ సెక్రెటరీ ఓలవ్ ఎన్జోల్స్టాండ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో ‘ఆనంద’ అనే ఓ ప్రైవేటు టీవీ చానెల్లో పనిచేస్తున్న సుబర్ణ అఖ్తర్ నోడీ అనే 32 ఏళ్ల మహిళా జర్నలిస్టును.. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో నరికి చంపేశారు. తొమ్మిదేళ్ల కూతురుతో ఉంటున్న నోడీ, తన భర్త ఉండి విడాకుల కోసం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తూ ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో కాలింగ్ బెల్ నొక్కి, ఆమె తలుపు తియ్యగానే లోనికి ప్రవేశించిన దుండగులు కత్తితో ఆమెను నరికి చంపేయడం వెనుక ఆమె భర్త హస్తం ఉండివుండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో కొత్తగా తెర చిన ఒక బేకరీకి ‘యాన్ అండ్ ఫ్రాంక్’ అనే పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ వెంటనే ఆ పేరును మార్చాలని ఒత్తిడి తేవడంతో.. ఆశ్చర్యానికి లోనైన రోబెర్టో అనే ఆ బేకరీ యజమాని.. ‘‘యాన్ ఫ్రాంక్ నివసించిన ఇంటికి సమీపంలో మా షాపు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. ఇందులో తప్పేమిటో నాకు అర్థం కాలేదు కనుక నా బేకరీ పేరును మార్చాలని నేను అనుకోవడం లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల చేత చిక్కి, నిర్బంధ శిబిరంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన సాహస బాలిక ప్రపంచంలోనే ఎంతోమందికి అభిమాన కథానాయిక.. అలాగే నాక్కూడా’’ అని రోబెర్టో కరాఖండిగా చెప్పేశారు. కరుణానిధి భార్య.. 80 ఏళ్ల దయాళు అమ్మాళ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గోపాలపురం నివాసంలో ఉంటున్న అమ్మాళ్కు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. అమె ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయంపై మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. 86 ఏళ్ల వయసులో 2005 అక్టోబర్ 31న మరణించిన నవలా రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ వ్యాసకర్త అయిన అమృతాప్రీతమ్ జయంతి నేడు. 1919 ఆగస్టు 31న ఢిల్లీలో జన్మించి, తొలి పంజాబీ కవయిత్రిగా ప్రసిద్ధురాలైన అమృత.. జ్ఞానపీuŠ‡తో పాటు, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ, పద్మ విభూషణ్, శతాబ్ది సమ్మాన్ అవార్డులను పొందారు. -
ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ట్వీట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం కోయంబత్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆహ్వానం మేరకు తాను ఈ సంస్మరణ సభలో పాల్గొన్నానని, ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. -
డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్ నామినేషన్
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్ష పదవికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ ఆదివారం నామినేషన్ వేశారు. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి, మిగిలిన కార్యవర్గాన్ని కూడా ప్రకటించనున్నారు. కాగా నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధి స్మారక స్థలాన్ని సందర్శించారు. డీఎంకే అధ్యక్షుడుగా దాదాపు ఐదు దశాబ్దాలపాటు కొనసాగిన కరుణానిధి ఇటీవల కన్నుమూయడంతో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌ను గతంలోనే తన రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. కాగా, కరుణానిధి మరణానంతరం పార్టీపై ఆధిపత్యం కోసం స్టాలిన్ సోదరుడు అళగరి సైతం తాజాగా పావులు కదుపుతున్నారు. కరుణానిధి ఉన్నప్పుడే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళగిరి ఎలాగైనా తిరిగి పార్టీలోకి రావాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అది అంత తేలికైన విషయం కాదని స్టాలిన్ మద్దతుదారులు చెబుతున్నారు. -
అందుకోసం నేను ప్రాణాలైనా విడిచేవాణ్ణి: స్టాలిన్
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించి ఉండకపోయి ఉంటే.. తాను ప్రాణాలు విడిచి ఉండేవాడినని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దివంగత నేత కరుణానిధికి నివాళులర్పించేందుకు మంగళవారం చెన్నైలో జరిగిన డీఎంకే కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఆగస్టు 7న కరుణానిధి మరణించడానికి కొన్ని గంటల ముందు తానే స్వయంగా సీఎం పళనిస్వామి ఇంటికి వెళ్లానని స్టాలిన్ వివరించారు. ‘తలైవర్‌కు (కరుణాధి) డాక్టర్లు కొన్ని గంటల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో మెరీనా బీచ్‌లో స్థలం అడిగేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని భావించాం. సీనియర్ లీడర్లు తాము వెళ్లి సీఎంను కలిసి ఈ విషయాన్ని నివేదిస్తామని చెప్పారు. మీరు స్వయంగా వెళ్లవద్దని చెప్పారు. అయినా, నా గౌరవాన్ని పక్కనపెట్టి నేను స్వయంగా సీఎం ఇంటికి వెళ్లాను. పళనిస్వామి చేతులు పట్టుకొని మరీ మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాను. చట్టాలు అందుకు అనుమతించడం లేదని, లీగల్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉందని పళనిస్వామి చెప్పాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నందున లీగల్ ఒపీనియన్‌ను మార్చుకోవచ్చునని నేను చెప్పాను. కానీ తన ఇంటినుంచి మమ్మల్ని పంపించే ఉద్దేశంతో ఈ విషయాన్ని పరిగణిస్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కరుణానిధి మరణవార్తను వైద్యులు ప్రకటించారు. పార్టీ నేతలు వెంటనే వెళ్లి సీఎంను కలిసి.. మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కానీ సీఎం అందుకు ఒప్పుకోలేదని వారు పదినిమిషాల్లో నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు డీఎంకే లీగల్ సెల్ చీఫ్ విల్సన్ కోర్టును ఆశ్రయిద్దామని చెప్పాడు. మెరీనా బీచ్‌లో స్థలం వచ్చింది. ఇందుకు నేను విల్సన్‌కు రుణపడి ఉంటాను’ అని స్టాలిన్ భావోద్వేగంగా చెప్పారు. మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి కోసం స్థలం ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
రజనీకాంత్‌పై అన్నాడీఎంకే ఫైర్
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై విమర్శలు చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై అన్నాడీఎంకే మండిపడింది. పార్ట్ టైం నేత స్థాయి నుంచి పుల్ టైం రాజకీయ నాయకుడిగా మారడానికి ఓ సంతాప సభను ఉపయోగించు కున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నాడీఎంకే సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా రజనీ విమర్శలపై జయకుమార్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి సంతాప సభలో రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడాల్సింది కాదని అన్నారు. ‘అది మృతిచెందిన ఓ నాయకుడి సంతాప సభ. అక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. రాజకీయాలు మాట్లాడడం వల్ల రజనీకాంత్‌కు రాజకీయ పరిణితి లేదని అర్థమవుతోంది’ అని విమర్శించారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరుణానిధి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. మెరీనా బీచ్‌లో జరిగిన కరుణానిధి అంత్యక్రియలకు దేశంలోని అనేకమంది నాయకులు హాజరయ్యారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం హాజరు కాలేదన్నారు.. ‘‘ఈ అంత్యక్రియలకు మొత్తం భారత దేశమే తరలి వచ్చింది. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. గవర్నర్‌తో పాటు అనేకమంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ తమిళనాడు సీఎం మాత్రం రాలేదు. ఎందుకు? మంత్రి వర్గం అంతా రాకుడదా? మీరేమైనా ఎంజీఆర్ లేక జయలలిత అనుకుంటున్నారా?’’ అని రజనీ ప్రశ్నించారు. -
డీఎంకేలో ఆధిపత్యం కోసం అన్నదమ్ముల పోరు
-
డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముల పోరు
సాక్షి, చెన్నై: పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారనీ, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని కరుణానిధి పెద్ద కొడుకు, బహిష్కృత పార్టీ నేత అళగిరి సోమవారం వ్యాఖ్యానించారు. పార్టీపై ఆధిపత్యం విషయంలో కరుణానిధి మరో కొడుకు స్టాలిన్, అళగిరిల మధ్య గొడవల నేపథ్యంలో 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకాగా, కరుణ మరణంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టే వీలుంది. సోమవారం చెన్నైలో కరుణ సమాధి వద్ద నివాళులర్పించాక అళగిరి మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకేలోకి తిరిగి రాకుండా స్టాలిన్ అడ్డుకుంటున్నారన్నారు. ‘కరుణ నిజమైన అభిమానులు, మద్దతుదారులంతా నా పక్షానే ఉన్నారు. సమయమే సమాధానం చెబుతుంది’ అని అన్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉంది. డీఎంకేలోని అనేక మంది నేతలు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ సంప్రదింపుల్లో ఉన్నారని ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతే ఇక పార్టీ నాశనమైనట్లే. అప్పుడు కరుణానిధి ఆత్మ వారిని శిక్షిస్తుంది. ఊరికే వదిలిపెట్టదు’ అని అన్నారు. ఆయన మా పార్టీ మనిషి కాదు ‘అళగిరి మా పార్టీ మనిషి కాదు. ఆయన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని ఎమ్మెల్యే అన్బళగన్ అన్నారు. డీఎంకేలో అందరూ ఐక్యంగానే ఉన్నారనీ, స్టాలిన్ వెన్నంటే ఉంటామన్నారు. డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ సైతం ఇదే తరహాలో స్పందించారు. -
ఒక శతాబ్దాన్ని పూడ్చేశాం
నా ఆచార్యా నువ్వులేని సమయంలో నిన్ను తలచుకుంటున్నాను నేను చందమామని సాహితీ వెలుగునిచ్చిన సూరీడివి నీవే! నువ్వు విచిత్రాల చిత్రం చిత్రాల విచిత్రం నీ అడుగుజాడలను కలిపితే ఒక బాటే ఏర్పడుతుంది నీ మాటలను కలిపితేరము ఒక భాషే ఏర్పడుతుంది నీ విజయాలను కలిపితే ఒక చరిత్ర ఏర్పడుతుంది నీ అపజయాలను కలిపితే కొన్ని వేదాలు ఏర్పడతాయి ఎంత ఘనత – నీది ఎంత ఘనత నీ శ్రమలజాబితా పొడవు చూసి కొండలు బెణుకుతాయి నీతో పరుగిడి అలసి గాలి మూర్చబోయింది. వేసవి ఋతువుల్లో నువ్వు వాడవాడలా ఎలా ఎండని మోసావు? నేలకి నీడేది చెట్టు ఎండ మోయకుంటే? ఈ జాతికి నీడేది నువ్వు ఎండ మోయకుంటే? రాజకీయాన్ని తీసేసినా నువ్వు సాహిత్యమై మిగులుతావు సాహిత్యాన్ని తీసేసినా అధ్యక్షుడవై నిలుస్తావు నిన్ను నేటి తరం స్తుతిస్తుంది ఏడు తరాలు నెమరువేస్తాయి నిన్ను సమకాలీనం కొన్నివేళల మరిచిపోవచ్చు భవిష్యత్తు ఎన్నడు మరవబోదు తమిళులు కొందరు మరిచిపోవచ్చు తమిళం ఎన్నడు మరవబోదు కొండలను గులకరాళ్ళుగా గులకరాళ్ళను ఇసుక రేణువులుగా మార్చగల కాలమనే చెదలపుట్టకూడా నీ కీర్తిని తాకబోదు నిన్ను ద్రావిడ ఉద్యమ అశ్వమన్నారు ఒక సవరణ – తనమీద ఎవర్నీ అధిరోహించనీయని అసాధ్యమైన అశ్వం నీవు పక్షుల విహారం అడవి అభివృద్ధి అంటారు నీ విహారం దేశాభివృద్ధి నిన్న సంధ్యవేళ ఒక సాగరతీరాన మా శతాబ్దాన్ని పాతిపెట్టాము వేచియుంటాము అది ఒక యుగమై మొలకెత్తేందుకు. ‘కవిరారాజు’ వైరముత్తు తెలుగు అనువాదం: అవినేని భాస్కర్ -
ద్రవిడ ఉద్యమ దిగ్గజం
భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన అసాధారణ వ్యక్తి ఇటీవల అస్తమించిన కళైంజ్ఞార్ కరుణానిధి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక మునుపే 1910 దశకంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతర ప్రముఖులు స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ అసోసియేషన్ లక్ష్యాలలో ప్రధానమైనవి బ్రాహ్మణభావజాల ఆధిక్యాన్ని అంతం చేయడం, సమసమాజం నిర్మించడం, సామాజికన్యాయం సాధించడం. ఆ అసోసియేషన్ జస్టిస్ పార్టీగా ప్రాచుర్యం పొందింది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్య్ర సమరం చేయడం అసాధ్యమనే గాంధీజీ వైఖరితో తీవ్రంగా విభేదించిన రామస్వామినాయకర్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి జస్టిస్పార్టీలో చేరారు. ఆయన చేరికతో నాయకత్వంలో సమూలమైన మార్పు వచ్చింది. జస్టిస్ పార్టీ ఎజెండా కంటే భిన్నమైన విస్తృతమైన కార్యాచరణ అవసరమని భావించిన పెరియార్ (పెద్దాయన) రామస్వామి నాయకర్ ఆ పార్టీని రద్దు చేసి ‘ద్రవిడ కళగం’(ద్రవిడ సమాఖ్య)–డికె– నెలకొల్పారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకుడూ, అద్భుతమైన వక్త సీఎన్ అన్నాదురై పెరియార్‌కు ప్రథమ అనుచరుడిగా కుదురుకున్నారు. డికె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీలేని హేతువాదం ప్రాతిపదికగా ఉద్యమం విస్తృతంగా నిర్వహించడం సాధ్యం కాదని అయిదేళ్ళు తిరగకుండానే అన్నాదురై గ్రహించారు. హేతువాదం, సామాజికన్యాయం, నిరీశ్వరవాదం ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని పెరియార్ అభిప్రాయం. రాజకీయాల పొడ ఆయనకు గిట్టదు. రాజకీయ పార్టీ పెట్టి, గెలిచి అధికారంలోకి వచ్చి పెరియార్ చెబుతున్న లక్ష్యాలనే సాధించాలన్నది అన్నాదురై వాదన. డిఎంకె ఆవిర్భావం అన్నాదురై నాయకత్వంలో చెన్నైలో 1948 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఆవిర్భవించింది. అప్పటికే కరుణానిధికి 25 ఏళ్ళు. జస్టిస్ పార్టీ కార్యక్రమాలలో, హిందీ వ్యతిరేక ఉద్యమంలో 14వ ఏట నుంచే చురుకుగా పాల్గొన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చేశారు. తిరుచిరాపల్లిలో దాల్మియాపురం పేరును తిరిగి కళ్ళెగుడిగా మార్చే ఉద్యమంలో సాహసోపేతంగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభావంతమైన వక్తగా, సినిమా స్క్రిప్టు ద్వారా ద్రవిడ ఉద్యమ భావజాల వ్యాప్తికి అసాధారణ స్థాయిలో దోహదం చేసే రచయితగా, కార్యకర్తలను సమీకరించి ముందుకు నడిపించే సేనానిగా బహుముఖంగా రాణిస్తూ తమిళుల జీవితంతో పెనవేసుకుపోయారు. తమిళ సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివిధ రూపాలలో వినియోగించుకొని ‘ద్రవిడనాడు’ ఉద్యమస్ఫూర్తిని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర కరుణానిధిదే. సమాఖ్యస్ఫూర్తి, రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారం, సకలభాషల సమానత్వం, లౌకికవాదం డిఎంకె భావజాలంలో ప్రధానమైనవి. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కరుణానిధి పిన్నవయస్సులోనే స్వదస్తూరితో రాసిన వార్తాపత్రికను తయారు చేసి స్నేహితుల ద్వారా పంపిణీ చేయించేవారు. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’ (ఢంకా) కి అదే బీజం. ‘మురసొలి’లో కరుణానిధి పార్టీ కార్యకర్తలకోసం రాసిన లేఖలు వారికి పార్టీ విధానాలనూ, కార్యకారణ సంబంధాలనూ విశదీకరించడానికి ఉద్దేశించినవి. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సంభాషణకు ఆయన ‘మురసొలి’ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్ సైతం ‘కుడియారసు’ (రిపబ్లిక్–గణతంత్ర వ్యవస్థ) అనే పత్రిక ద్వారా తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకునేవారు. కరుణానిధి ప్రతిభావంతుడైన వక్త. ఛలోక్తులతో, వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉడికిస్తూ, సభను రక్తికట్టించే శక్తి అయన సొంతం. ఆయన ప్రసంగాల కేసెట్లు తమిళ సినిమా పాటల కేసెట్లకంటే బాగా అమ్ముడుపోయేవి. రాజకీయాలలో ఎంత సామర్థ్యం ఉన్నదో సాహిత్యంలోనూ అంతటి అధికారం ఉన్నది. సంగీతం అంటే ప్రాణం. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన రాజకీయ నాయకులు దేశంలోనే అరుదు. పురాణాలలోని, ఇతిహాసాలలోని పాత్రల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడం, పోస్టర్లూ, బ్యానర్లూ, కట్అవుట్లూ వంటి హంగులు ఉపయోగించుకోవడం భారత రాజకీయాలకు తమిళ రాజకీయం అందించిన కొత్తవిద్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు పసుపు రంగుతోసహా డిఎంకె ప్రచార ప్రక్రియలన్నిటినీ అనుకరించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అనేక రాష్ట్రాలకూ కటౌట్ల సంస్కృతి పాకింది. టీవీ చానళ్ళూ, వీడియో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం విస్తృతి, వైవిధ్యం అనూహ్యంగా పెరిగిపోయాయి. 2014 ఎన్నికలలో మోదీ విశ్వరూపం ప్రదర్శించడానికి వీడియో టెక్నాలజీ దోహదం చేసింది. కరుణానిధి ప్రస్థానం పార్టీలో అత్యంత ప్రభావశీలిగా ఎదిగిన కరుణానిధి 1957లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన సమయంలో కూడా డిఎంకె లక్ష్యాలలో స్వతంత్ర ద్రవిడనాడు ప్రధానమైనది. ఈ వేర్పాటువాదం డిఎంకె ఎజెండాలో చాలాకాలం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత జాతీయ రాజకీయాలతో మమేకమై, సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములైన తర్వాత వేర్పాటువాదం పూర్వపక్షమైపోయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన డిఎంకె అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నాదురై మంత్రివర్గంలో పబ్లిక్‌వర్క్స్ మంత్రి కరుణానిధి. రెండేళ్ళ తర్వాత కేన్సర్ కారణంగా అన్నాదురై మరణించారు. వారసత్వ పోరులో అప్పటి ఆప్తమిత్రుడు ఎంజి రామచంద్రన్ సహకారంతో నెడుంజళియన్ వంటి సీనియర్లను తోసిరాజని ముఖ్యమంత్రి పదవిని కరుణానిధి కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మురికివాడల నిర్మూలన, మనుషులు లాగే రిక్షాల నిషేధం, విద్యుదీకరణ పనులు ముమ్మరంగా చేశారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూపాయికి కిలో చొప్పున పాతిక కిలోలు బియ్యం ఇవ్వడం, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను నెలకొల్పడం, రేషన్ షాపులను నడపడం, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం, పంట రుణాలు మంజూరు చేయడం, పంట పండకపోతే రుణాలు మాఫ్ చేయడం వంటి అనేక సంక్షేమకార్యక్రమాలు కరుణానిధి, ఎంజీఆర్‌ల హయాంలోనే ఆరంభమైనాయి. అమ్మ క్యాంటీన్ వంటివి జయలలిత సృష్టి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కడచిన మూడు దశాబ్దాలలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రఘురామరాజన్ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా 2013లో చేసిన అధ్యయనంలో దేశంలోని ప్రవృద్ధ రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో (గుజరాత్, మహారాష్ట్ర తర్వాత) నిలిచింది. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కరుణానిధి పెద్దపీట వేశారు. తిరువళ్ళువార్ పేరిట వళ్ళువార్కొట్టాం నిర్మించారు. మూడు సాగరాలు– బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం ఏకమయ్యేచోట కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తు తిరువళ్ళువార్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఎంజీఆర్‌తో విభేదాలు కరుణానిధి అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ఆయనకూ, ఎంజీఆర్కీ మధ్య దూరం పెరిగింది. అధికారం కరుణానిధి తలకెక్కిందని ఎంజీఆర్ భావించారు. ఎంజీఆర్‌లో ఈర్షా్యద్వేషాలు పెరిగాయని కరుణానిధి తలపోశారు. సినిమాలలో ఎంజిఆర్‌కి పోటీగా పెద్దకొడుకు ముత్తును కరుణానిధి ప్రవేశపెట్టారు. కరుణానిధిపై ఎంజిఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. 1972లో డిఎంకె చీలిపోయింది. ఎంజీఆర్ ఏఐఏడిఎంకె స్థాపించి 1977 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తన ఆరోపణల ఆధారంగా కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇందిరాగాంధీనీ, ఆమె ఉపకారాన్నీ విస్మరించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను ఎంజిఆర్ తిరస్కరించారు. 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికలలోనూ, 1984లోనూ ఎంజీఆర్ విజయం సాధించడంతో కరుణానిధి పుష్కరకాలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉండవలసి వచ్చింది. 1989లో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్‌ను ప్రధాని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యధికశాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళ టైగర్లను సమర్థిస్తున్నారనే ఆరోపణపైన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ రద్దు చేశారు. 2006లో చివరిసారిగా, ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మూడోసారి స్వీకరించారు. 2016లోనూ ఆమే గెలిచారు. ద్రవిడ పార్టీలు జాతీయ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి. 1967–69లో ఇందిరాగాంధీకీ, నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, అతుల్యఘోష్ ఇత్యాది సీనియర్ నాయకులకూ మధ్య విభేదాలు చెలరేగి చీలిక దిశగా కాంగ్రెస్ ప్రయాణం సాగినప్పుడు కరుణానిధి ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో వి.వి. గిరిని గెలిపించడానికీ, నీలం సంజీవరెడ్డిని ఓడించడానికీ కరుణానిధి చట్టసభల సభ్యులను సమీకరించారు. 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. జార్జి ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఇందిర విరోధులకు తమిళనాడులో ఆశ్రయం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన ఇందిరాగాంధీ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలో స్టాలిన్‌ను హింసించినట్టు వార్తలు వచ్చాయి. కరుణానిధిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని 1976లో బర్తరఫ్ చేశారు. విప్లవ సంస్కరణల వెనకంజ ఈ దశలో ద్రవిడ భావజాలం పలచపడింది. అవినీతి, బంధుప్రీతి పెరిగాయి. వ్యక్తి ఆరాధన పతాకస్థాయికి చేరింది. ఈ విషయాలలో ద్రవిడ పార్టీలకీ, దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకీ పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనే డిఎంకె సైతం కేవలం కరుణానిధి కుటుంబ సభ్యుల చేతిలో ఉంది. జయలలితకు కుటుంబం లేదు కనుక ఆమె మరణించగానే ఏఐఏడిఎంకె చీలిపోయింది. డిఎంకె స్టాలిన్ సారధ్యంలో పదిలంగా ఉంది. ద్రవిడ భావజాలానికి విరుద్ధమైన బీజేపీ, కాంగ్రెస్‌లతో నిస్సంకోచంగా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ, యూపీఏ కూటములలో డిఎంకె, ఏఐఏడిఎంకెలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల అక్రమాలలో తమిళనాడేమీ తక్కువ తినలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ముందు కలర్ టీవీ సెట్లు ఉచితంగా ఓటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం కరుణానిధి హయాంలోనే అమలు జరిగింది. జయలలిత వారసుడుగా చెప్పుకుంటున్న దినకరన్ ఆర్కె పురం ఉపఎన్నికలో ఖర్చు చేసిన మొత్తం నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఖర్చుకు సమానం. ద్రవిడ పార్టీల పాలన యాభై సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న తమిళనాడు ఇతర రాష్ట్రాలతో సమానంగా అన్ని రకాలా దిగజారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు రాజకీయంగా ఎంతగా కీచులాడుకున్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే విధానం అమలు చేసేవారు. ముగ్గురూ కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన నిధులనూ, పరిశ్రమలనూ, ఇతర వనరులనూ దబాయించో, బతిమిలాడో సంపాదించేవారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడేవారు కాదు. ద్రవిడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీలో అధినేతకు పడిపడి పాదాభివందనం చేసే సంస్కృతి స్థిరపడింది. కుల నిర్మూలన కోసం పోరాడాలనే సంకల్పం సడలింది. తమిళనాడులో దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా లేదు. పెరియార్ ఆశించిన విప్లవాత్మక సంస్కరణలు ఆయన వారసుల అధికార రాజకీయ రంధిలో గల్లంతైనాయి. ఇందుకు కరుణానిధి మాత్రమే బాధ్యులు కారు. ఎంజీఆర్, జయలలిత కూడా ద్రవిడ ఉద్యమ స్ఫూర్తికి యధాశక్తి విఘాతం కలిగించారు. కె. రామచంద్రమూర్తి -
వందేళ్ల కథ
’’తమిళ కట్టు’’ అనే పలుకుబడి వుంది. ఆ పలుకుబడికి చేవ తెచ్చిన రచయిత, సంస్కరణ వాది, ప్రజా నాయకుడు కరుణా నిధి. అసలు పేరు దక్షిణా మూర్తి. పూర్వీకులు గుండ్లకమ్మ ప్రాంతం నుంచి కావేరి తీరానికి వలస వెళ్లారు. రచయితగా జీవితాన్ని ప్రారంభించి, నాటకకర్తగా, సినిమా రైటర్‌గా, పాత్రికేయునిగా విశేష ఖ్యాతి గడించారు. రాజకీయ రంగంలో దశాబ్దాల పాటు రాణించారు. తమిళనాట కరుణానిధి ఒక శతాబ్దిని తనదిగా చేసుకున్నారంటే, అస్సలు అతిశయోక్తి కాదు. పెరియార్ ప్రభావంతో హేతువాదిగా తనని తాను మలుచుకున్నాడు. కడదాకా ఆ వాదంతోనే గడిపారు. అయితే కరుణానిధి జననేత. తన సొంత అభిప్రాయాలను జనసామాన్యంమీద రుద్దేవారు కాదు. ఆ సంవ త్సరం తమిళనాడులో వర్షాలు లేవు. నీళ్లకి కటకటగా వుంది. మద్రాస్ కపాలి ట్యాంకులో పాలకుడు మట్టితవ్వితే, వర్షాలు పడతాయని స్థానికుల నమ్మకం. సరే, అని ఒక సూర్యోదయాన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి సంప్రదాయ సిద్ధంగా కపాలేశ్వరస్వామి ఆలయం దగ్గరకు మందీమార్బలంతో వచ్చారు. ఎండిపోయిన కపాలి కొలనులోకి దిగారు. తలకి పాగా చుట్టారు. పలుగు, పార పట్టి స్వయంగా మట్టి తవ్వి శ్రద్ధగా కరసేవ చేశారు. తమిళ, ఆంగ్ల, తెలుగు ప్రెస్ మొత్తం అక్కడికి కదిలి వచ్చింది. ఆ దృశ్యాన్ని కెమెరాల్లోకి ఎక్కించుకుని వెళ్లింది ప్రెస్. ప్రజల నమ్మకాలకు గౌరవం ఇస్తానని వినయంగా చెప్పారు కరుణ. మర్నాడు పత్రికలన్నీ ఆ ఫొటోల్ని, వార్తల్ని ప్రముఖంగా ప్రచురించాయి. ’’కళైజ్ఞర్ నల్ల జెంటి ల్మనప్పా’’ అని పెద్దలు ప్రస్తుతించారు. కరుణానిధి ఒకనాటి చక్రవర్తి రాజగోపాలాచారి తర్వాత, ఎన్న తగిన తమిళ మేధావిగా కరుణానిధిని చెబుతారు. తమిళ జననాడి ఆయనకు తెలిసినంత క్షుణ్ణంగా మరొకరికి తెలియదని చెప్పుకుంటారు. రాజాజీ పరమ ఆస్తిక భావాలతో జీవితం గడిపారు. కరుణ పరమ నాస్తిక భావాలతో గడిపారు. రచనలు కూడా భావాలకు తగ్గట్టే చేశారు. చాలా నాటకాలు రాశారు. చిత్ర రంగానికి వచ్చి ప దుల కొద్దీ స్క్రిప్ట్‌లు రాశారు. మదురై ప్రాచీన చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ఒక సంఘటనని ’’శిలప్పదికారం’’ నాటకంగా రచించారు. ఆ నాటకంలో ’’కణ్ణగి’’ కథానాయిక, తనకు రాజువల్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా ఆగ్ర హిస్తుంది. మదురై నగరం ఆమె ఆగ్రహా జ్వాలల్లో బూడిద అవుతుంది. మద్రాస్ మెరీనా బీచ్ దగ్గరో కణ్ణగి కాంస్య విగ్రహం ప్రతిషించారు. మహారాజు దౌష్ట్యాన్ని ధిక్కరించిన ఒక సామాన్య యువతిగా కణ్ణగి మంచి గుర్తింపు వుంది. ఆమె కుడిచేత బంగారు కడియం ఆగ్రహంతో ఎత్తిపట్టుకున్న ప్రతిమ మొదట మద్రాసు నగరం వైపు తిరిగి ఉండేది. అప్పట్లో సిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, కణ్ణగిని సముద్రం వైపుకి తిప్పారు. ఇలాంటి నమ్మకాలకు ద్రవిడ నేలలో నమ్మకం, గౌరవం ఎప్పుడూ ఉంది. యస్సెస్ రాజేంద్రన్, శివాజీ గణేశన్, యమ్.జి.ఆర్–యీ ముగ్గురూ కరుణానిధి ఉధృ తంగా డైలాగులు రాసే రోజుల్లో అగ్రహీరోలు. కరు ణానిధి మాటల్లో ఒక విలక్షణమైన పలుకు వుండేది. సమకాలీన వ్యవస్థపై పదునైన విసుర్లు, అచ్చ తమిళ నానుడులు, జాతీయాలు, వళ్లువర్ లాంటి కవుల మాటలు వొదిగిపోయేవి. ఆయన సంభాషణల్లో ఒక బరువు, ఒక పరిమళం తప్పక వుండేది. రచనలు చేయడం ఆయనకు హాబీ కాదు, పిచ్చి. సమ తామూర్తి శ్రీ మద్రామానుజుల చరిత్రని టీవీకి ఎక్కిస్తున్నపుడు కరుణ కలంపట్టారు. ఆనందిస్తూ, అనుభవిస్తూ ఆ మానవతావాది సీరియల్లో పాలు పంచు కున్నానన్నారు. కరుణానిధి ప్రసంగం ని జంగా ఒక జలపాతం సభకి దిగుతున్నట్టే వుం టుంది. ఆగటం, తడబడటం, సరిదిద్దడం వుం డదు. ముఖ్య విష యంతో బాటు పిట్ట కథలు చమ త్కార బాణాలు, సామెతలు, సెటైర్లు వర్షించేవి. కరుణానిధి ప్రసంగం వినడం ఒక అనుభవం. ఆ మ హాప్రవాహంలో తమిళం తప్ప యింకో భాషా పదం దొర్లేది కాదు. తమిళ భక్తి, ద్రావిడ భావోద్వేగం, సంస్కరణాభిలాష ధ్వనించేవి. 13 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా జన క్షేత్రంలో నిలవడం అసాధారణం. దేవుడికి మొక్కకపోయినా తమిళమ్మకి కారైకుడిలో గుడి కట్టారు.ప్రాచీన తమి ళకవులకు మండపాలు నిర్మించారు. ద్రవిడవాదానికి జెండాలెత్తినవాడు. కరుణ, యమ్జీఆర్ ఒక చెట్టు కొమ్మలే అయినా, వేరుగా ఎదిగారు. దూరం దూ రంగా జరిగారు. ద్రవిడ కట్టుకి మాత్రం తేడా రాలేదు. యమ్జీర్ తన గ్లామర్‌తో ఒక రాజ్యాన్ని పాలించారు. కరుణానిధి సొంతగ్రామర్లో ఒక రాజ్యాన్ని సృష్టించారు. శ్రీరమణ -
కరుణానిధిపై అమూల్ ట్వీట్, వైరల్
ప్రముఖ డయిరీ సంస్థ అమూల్ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్టైజింగ్లో ఎంతో ఉన్నతంగా నిలుస్తూ ఉంటాయి. క్రియేటివ్ కమ్యూనికేషన్స్‌లో అమూల్ మించిపోయిన వారు ఇంకెవ్వరూ ఉండరని అది చాలా సార్లు నిరూపించుకుంది. తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరుణానిధికి నివాళులర్పించేందుకు అమూల్, ఓ సృజనాత్మక ప్రకటనను విడుదల చేసింది. కరుణానిధిని ‘తమిల్ తలైవార్’గా అభిర్ణిస్తూ.. ఓ క్రియేటివ్ పిక్చర్‌ను ట్విటర్లో పోస్టు చేసింది. ఈ పిక్చర్లో కరుణానిధి తన ఆటోమేటిక్ చైర్లో తెల్లటి వస్త్రాలతో కూర్చుని ఉంటారు. తన సిగ్నేచర్ కళ్లద్దాలు, మెడలో కండువతో ఈ పిక్చర్‌ను రూపొందించింది. అమూల్ పాప, ఈ తలైవార్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు ఈ పిక్చర్లో ఉంది. దీంతో పాటు కరుణానిధి స్క్రీన్‌రైటింగ్ కెరీర్‌కు కూడా అమూల్ నివాళులర్పించింది. గొప్ప రచయిత, రాజకీయవేత్త అని అభివర్ణించింది. అమూల్ ఈ ప్రకటనకు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ ట్వీట్, 1500 సార్లకు పైగా రీట్వీట్ కాగ, 4,873 లైక్‌లు వచ్చాయి. అమూల్ సృజనాత్మకను కొందరు అభినందిస్తుండగా.... మరికొంత మంది అభిమానులు కరుణానిధిని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. #Amul Topical: Tribute to a great writer and politician... pic.twitter.com/jOzpJ1djBY — Amul.coop (@Amul_Coop) August 8, 2018 Good amul coop providing homage to great leader — Bheemarao (@Bheemaraobr) August 9, 2018 touching https://t.co/zLR7D67vIN — Neeta Kolhatkar (@neetakolhatkar) August 8, 2018 THE GREAT LEADER 👍👍👍 — SHEIK MOHAMED TAHIR (@SHEIKMOHAMEDTA1) August 9, 2018 -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 -
దళితులకు దగ్గరి బంధువు కరుణానిధి
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాదురై మరణంతో 1969లో ఎం. కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. అప్పటి వరకు అన్నాదురై మంత్రి వర్గంలో హిందీ వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఉద్యమాల స్ఫూర్తి కలిగిన వారు, విద్యావేత్తలు, వాక్ఛాతుర్యం కలిగిన వారు, యువకులు ఉండేవారు. ఆ తర్వాత 1969 నుంచి 1976 వరకు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మంత్రివర్గంలోకి, ముఖ్యంగా అధికార యంత్రాంగంలోకి ఈ రంగాలతోపాటు వెనకబడిన వర్గాలు, మరీ ఎక్కువ వెనకబడిన వర్గాల వారు, దళితులను తీసుకున్నారు. పాలనా వ్యవహారాల్లో కిందిస్థాయి పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార సలహా కమిటీల్లో అధికారులతోపాటు పార్టీ నాయకులకు కూడా కరుణానిధి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులుగానీ, పార్టీ నాయకులుగానీ అవినీతికి పాల్పడకుండా ఈ సలహా సంఘాలు పర్యవేక్షణ సంస్థలుగా పనిచేసేవి. 1969 నుంచి 1976 మధ్య తమిళనాడు పబ్లిక్ కమిషన్ సర్వీస్ నియామకాల తీరును పరిశీలించగా, అంతకుముందు ఎన్నడు లేని విధంగా వెనకబడిన వర్గాలు, బాగా వెనకబడిన వర్గాల వారు, దళితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావడం విశేషం. పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో దళితులకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, వాటి సంఖ్యా బలం, ఇప్పటికే ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ వర్గం వారికి ఎన్ని ఉద్యోగాలో ముందుగా ఓ ప్రణాళికను రచించి దానికి అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం వల్ల వెనకబడిన వర్గాల వారికి, దళితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో కూడా వారికి సరైన ప్రాతినిధ్యానికి బాటలు వేయవచ్చన్నది కరుణానిధి ఆచరించిన సిద్ధాంతం. దళితులకు, బీసీలకు సామాజిక హక్కులను సాకారం చేయాలంటూ 1925లో జరిగిన కాంచీపురం కాంగ్రెస్‌లో పెరియార్ రామస్వామి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొనే వారి అభ్యున్నతికి కరుణానిధి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కరుణానిధి నాటి యంత్రాంగం గ్రామీణాభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీ స్థాయి, సమతి స్థాయి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేసింది. బ్రిటీష్ కాలం నాటి నుంచి పరిపాలనారంగంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర. జిల్లా డీఎంకే నాయకులకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లు, అటు పార్టీ అదిష్టాన నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. అందుకని రోజువారి పాలనా వ్యవహారాల్లో జిల్లా పార్టీ నాయకులు జోక్యం చేసుకునే వారు. గ్రామీణస్థాయి నుంచి వచ్చిన ఉద్యమం కారణంగా డిఎంకే బలపడడంతో దిగువ స్థాయిలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జిల్లా నాయకులు మరింతగా బలపడ్డారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌తోపాటు జిల్లా డిఎంకే నాయకుడు ప్రత్యక్ష ప్రధాన పాత్రదారుడయ్యారు. ఇటు పార్టీది, అటు ప్రభుత్వ యంత్రాంగానిది ఒకటే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి. అందులోనూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగడం. (గమనిక: ‘ది ద్రావిడియన్ ఇయర్స్’ పేరిట ఎస్. నారాయణ్ రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలివి. నారాయణ్, కరుణానిధి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమే కాకుండా ఆ తర్వాత వాజపేయి ప్రధానికి ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు) -
పళని అనుకున్నదొకటి.. అయిందొకటి..!
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమాన సంద్రం మెరినా బీచ్‌లో ఆయనకు బుధవారం సాయంత్రం కడసారి వీడ్కోలు పలికింది. అయితే నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయ లబ్ది కోసం ముఖ్యమంత్రి పళనిస్వామి తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టిందనని ఆ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఏడీఎండీకేలో తన నాయకత్వంపై అయిష్టంగా ఉన్న పార్టీ క్యాడర్ టీటీవీ దినకరన్ వైపు చూస్తుండడంపై కలవరపడిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పళని నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, ప్రముఖులు, సినీ తారలు కరుణ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తుంటే.. ఏఐఏడీఎంకే రాజకీయాలు చేస్తోందనే వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అన్ని పార్టీలు డీఎంకేకు మద్దతుగా నిలవగా.. ఏ ఒక్క పార్టీ కూడా ఏఐడీఎంకే అనుకూలంగా మట్లాడలేదు. టీటీవీ దినకరన్ కూడా ‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడలేను’అని తప్పించుకున్నారు. దినకరన్‌వైపు చూస్తోన్న పార్టీ క్యాడర్‌ను మచ్చిక చేసుకుందామనుకున్న పళని ప్రభుత్వానికి ఇంటా బయటా మద్దతు లభించలేదు. చివరికి కోర్టులో ఉన్న పిటిషన్ల ఉపసంహరణతో మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు లైన్‌క్లియర్ అయింది. అక్కడ కరుణానిధి అంత్యక్రియలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. కొసమెరుపు.. పటిషన్ల ఉపసంహరణతో కోర్టు నిర్ణయానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కరుణ అంత్యక్రియలకు ఓకే చెప్పింది. కానీ, అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అనవసర వివాదానికి తెరలేపిన పళని స్వామి సెల్ఫ్ గోల్ చేసినట్లయింది. -
కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లానే!
-
ద్రవిడ రత్నాలు
-
కన్నీటి సంద్రమైన మెరీనా తీరం
-
కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి
తమిళ సినిమా (చెన్నై): కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సినీతారలు భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య, అల్లుడు, నటుడు ధనుష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, అజిత్, శాలిని దంపతులు, శివకుమార్, సూర్య, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్, నాజర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్ ప్రభు, టి.రాజేందర్, ప్రసన్న, స్నేహ, రాధా రవి, సత్యరాజ్, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌండ్రమణి, వివేక్, పార్తీపన్, సిబి రాజ్, శివకార్తీకేయన్, విజయ సేతుపతి, అధర్వ, నందా, బాబీ సింహా, పశుపతి, ఆర్కే.సురేశ్, మన్సూర్ అలీఖాన్, శ్రీమాన్, విమల్, పా.విజయ్, సంతానభారతి, నటి సరోజాదేవి,కోవై సరళ, దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, పి.వాసు, కేఎస్.రవికుమార్ తదితరులు నివాళులర్పించారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నటుడు విజయ్, విక్రమ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సంగీత దర్శకుడు రెహమాన్, దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. -
తమిళ రాజ‘కీ’యం ఎవరి చేతుల్లో?
సాక్షి ప్రతినిధి, చెన్నై/ సాక్షి నాలెడ్జ్ సెంటర్: జయలలిత కన్నుమూతతో ‘రెండాకులు’ రాలిపోయాయి. కరుణ మరణంతో ‘ఉదయసూర్యుడు’ అస్తమించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తమిళనాడులో కామరాజ్ నాడార్ హయాంలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. అన్నాదురై నేతృత్వంలో ఉదయించిన ద్రవిడ సిద్ధాంతాల డీఎంకే తిరుగులేని పార్టీగా మారింది. తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నాయకత్వంలో ఏర్పడిన అన్నాడీఎంకే తమిళనాట మరో బలీయమైన రాజకీయ పార్టీగా నిలిచింది. ఎంజీఆర్ జనాకర్షణ ధాటికి కరుణానిధి సైతం తల్లడిల్లిపోయారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఇక తమకు తిరుగులేదని ఆశించిన డీఎంకేకు నిరాశే మిగిలింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీని పరుగులు పెట్టించారు. ఎంజీఆర్‌కు ధీటుగా కరుణకు గట్టిపోటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే చాయిస్. ఎంజీఆర్ హయాంలో రెండుసార్లు, జయ హయాంలో ఒకసారి మినహా ప్రతిసారీ ఈ రెండు పార్టీలూ ఐదేళ్లకొకసారి అధికారాన్ని పంచుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేంత స్థాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల అధినేతలు జయలలిత, కరుణానిధి రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో తమిళనాట వారిద్దరి స్థాయి ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం కలిగిన నేతలు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చే స్థాయి ఎవరికి ఉందనే చర్చ మొదలైంది. కమల్, రజనీకాంత్‌ల ప్రభావమెంత? పురచ్చితలైవి జయలలిత జీవించి ఉన్నంతకాలం రాజకీయ ప్రవేశానికి వెనకడుగు వేసిన నటులు.. కమల్‌హాసన్, రజనీకాంత్ జయ మరణం తర్వాత తామున్నామంటూ ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే ఆస్తికత్వం, డీఎంకే నాస్తికత్వం సిద్ధాంతాలతో రాజకీయాలు నెరిపాయి. అలాగే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురూ సినీ నేపథ్యంతో ప్రాచుర్యం పొందినవారే. రజనీకాంత్, కమల్ సైతం సినీ క్రేజుపైనే ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవలతో మమేకమైన సందర్భాలు ఇద్దరికీ లేవు. అంతేకాకుండా అన్నాడీఎంకే, డీఎంకే మాదిరిగానే రజనీ, కమల్ ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ ప్రకటించారు. ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు అనేది ప్రజలందరికీ తెలిసిందే. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు, జిల్లాల్లో పర్యటనలతో కమల్ తన రాజకీయ ప్రయాణ వేగాన్ని పెంచగా, పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ 8 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక తమిళనాడులో సర్వే చేసి కమల్, రజనీ ఇద్దరికీ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేదని తేల్చింది. ఇద్దరికీ కలిపి కనీసం పది శాతం మంది కూడా వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సినీనటులు రాజకీయాల్లో రాణించే రోజులు అంతరించిపోయాయని సర్వేలో పేర్కొంది. స్టాలిన్‌కి తిరుగులేనట్టే.. కరుణానిధి తన రాజకీయ వారసుడిగా మూడో కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా కరుణ రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఆయన మేనల్లుడి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ‘నమక్కు నామే (మనకు మనమే)’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన లుకలుకలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాకుండా సంయమనం పాటించారు. ఈ నిదానమే ప్రజలకు నచ్చిందో ఏమో ఇటీవల జరిగిన సర్వేలో రాబోయేది డీఎంకే ప్రభుత్వం.. కాబోయే సీఎం స్టాలిన్ అని తేలింది. రజనీ చేతుల్లోకి అన్నాడీఎంకే! అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థాయిలో జయలలిత పార్టీని నడిపారు. ఆమె మరణం తర్వాత సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయకత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే అన్నాడీఎంకే బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అన్నాడీఎంకేను చీల్చి కొంతమేరకు బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలం, అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో అన్నాడీఎంకే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తేల్చిచెబుతున్నారు. వాస్తవానికి ‘అమ్మ’ మరణంతో అనాథగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా నిలవడం ద్వారా తమిళనాట వేళ్లూనుకోవాలని బీజేపీ తాపత్రయపడింది. అయితే అధికార పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపి ప్రయత్నాలకు గండిపడింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసిన బీజేపీకి తన మిత్రుడు రజనీకాంత్ కంటపడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విముఖత ప్రదర్శించిన రజనీకాంత్‌ను అన్నాడీఎంకే అధినేతగా చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీ ప్రకటనలో జాప్యాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో రజనీ నాయకత్వంలోని అన్నాడీఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రత్యర్థులుగా తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీకి 2021లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడేళ్ల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి. -
‘కావేరి’ నుంచి కడలి తీరం వరకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరి నది.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కడలిలో సంగమిస్తోంది. అదేవిధంగా జీవితంలో తన చివరి రోజులు కావేరి ఆస్పత్రిలో గడిపిన కరుణానిధి ప్రయాణం కూడా చెన్నైలోని కడలి తీరంలో ముగిసింది. 94 ఏళ్లపాటు సుదీర్ఘ జీవన ప్రయాణం సాగించిన కరుణ ఆస్పత్రిలో గడిపిన చివరి 11 రోజులను ఒక్కసారి మననం చేసుకుంటే.. జూలై 28: మూత్రవిసర్జన ఇబ్బందులతో ఇంటిలోనే చికిత్స పొందుతున్న కరుణ తెల్లవారుజామున 1.30 గంటలకు అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెషర్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. జూలై 29: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అయితే అదేరోజు సాయంత్రానికి కరుణ పరిస్థితి విషమించినట్లు, కన్నుమూసినట్లు వదంతులు రేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. జూలై 30: తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి కరుణ కోలుకుంటున్నారని ప్రకటించారు. జూలై 31: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమీపంలో నిల్చుని ఉండగా, ఆయన వచ్చిన సమాచారాన్ని స్టాలిన్ తండ్రి కరుణ చెవిలో చెబుతున్న ఫొటోలు మీడియాకు విడుదల కావడంతో పార్టీ శ్రేణులు ఆనందించాయి. ఆగస్టు 1: తమిళ సినీ నటీనటులు స్టాలిన్, కనిమొళిని కలుసుకుని కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 2: కేరళ సీఎం పినరాయి విజయన్, మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఆస్పత్రిలో కరుణను పరామర్శించారు. ఆగస్టు 3: కరుణకు జాండీస్ సోకినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ కరుణను పరామర్శించారు. ఆగస్టు 4: జాండీస్ ముదరడంతో కాలేయ వ్యాధికి చికిత్స చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 5: రాష్ట్రపతి కోవింద్ వచ్చి వెళ్లారు. అయితే ఫొటోలు విడుదల కాలేదు. ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్ కూడా విడుదల చేయలేదు. ఆగస్టు 6:కరుణ శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానివేశాయని, 24 గంటల తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 7: కావేరి ఆస్పత్రి పరిసరాల్లోకి తండోపతండాలుగా జనం చేరుకోవడం ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు బులెటిన్ విడుదలైంది. అదేరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి కన్నుమూయగా 6.41 గంటలకు బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 8: కరుణ భౌతికకాయాన్ని సీఐటీ నగర్ ఇంటి నుంచి తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెన్నై రాజాజీ హాల్లో వీవీఐపీలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాత్రి 7.25 గంటలకు కరుణ అంతిమ సంస్కారాలు ముగిశాయి. -
ఎట్టకేలకు మెరీనా తీరంలోనే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కలైంజర్ కరుణానిధి అంతిమ సంస్కారాలు, సమాధి ఎక్కడనే వివాదానికి తెరపడింది. ఈ సందర్భంగా అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకే మధ్య హైడ్రామా నడిచింది. ఇరుపక్షాల వాదోపవాదాల అనంతరం చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. మెరీనా బీచ్‌లో కరుణ అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం చేసిన వినతిని తమిళనాడు ప్రభుత్వం మొదట తిరస్కరించిన విషయం తెలిసిందే. బీచ్ తీరంలో సమాధులపై మద్రాసు హైకోర్టులో కేసులు, తద్వారా చట్టపరమైన చిక్కులు ఉన్నందున చెన్నై గిండీలోని గాంధీ మండపం పక్కనే రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అయితే ఇందుకు డీఎంకే సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి చేత మంగళవారం రాత్రి 9.20 గంటలకు మద్రాసు హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి కే.రమేష్, న్యాయమూర్తి సుందర్ సమక్షంలో స్టాలిన్ అత్యవసర పిటిషన్ దాఖలు చేయించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అభ్యంతర పిటిషన్లు వెనక్కు..: బీచ్‌లో సమాధులపై తాను వేసిన నాలుగు పిటిషన్లను కరుణ కోసం వెనక్కు తీసుకునేందుకు సిద్ధమని సీనియర్ న్యాయవాది దురైస్వామి ప్రకటించారు. అలాగే పీఎంకే నేత వేసిన పిటిషన్ సైతం ఉపసంహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో స్టాలిన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మంగళవారం రాత్రి 10.30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఈ వివాదంపై బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు విచారణ జరిపి ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. . అభ్యంతర పిటిషన్లు అన్నింటినీ ఉపసంహరించిన కారణంగా మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది. కన్నీటి పర్యంతమైన స్టాలిన్ మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియగానే.. రాజాజీ హాల్లో కరుణ పార్థివదేహం పక్కన నిల్చుని ఉన్న స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దురైమురుగన్, కనిమొళి తదితర నేతలు స్టాలిన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధికి అనుమతి వచ్చినట్లు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మైకులో ప్రకటించడంతో కార్యకర్తలు, ప్రజలు శాంతించారు. -
నింగికేగిన ‘నిధి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇక సెలవ్..’ అంటూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన కలైజ్ఞర్ కరుణానిధికి తుదిసారి నివాళులర్పించేందుకు హాజరైన అభిమానులతో మెరీనా తీరం కన్నీటి సంద్రమైంది. అశ్రునయనాలు, బరువెక్కిన గుండెలతో, సైనిక లాంఛనాల మధ్య తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం చెన్నైలో పూర్తయ్యాయి. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు కరుణ పార్థివదేహం రాజాజీహాల్ నుంచి మెరీనాబీచ్ వైపు సాగింది. ప్రజలు పెద్దఎత్తున అనుసరించడంతో భౌతికకాయం అంతిమ సంస్కార ప్రాంతానికి 6.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా ప్రజలు కరుణను తలచుకుని విలపించారు. కరుణానిధి ఇక లేరన్న వార్తను తట్టుకోలేక తమిళనాడులో 20 మంది చనిపోగా రాజాజీహాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సహా 26 మంది గాయపడ్డారు. కరుణానిధి మరణవార్త విని తిరువారూరు జిల్లాకు చెందిన గోవిందరాజ్ (60) అనే వీరాభిమాని వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. బారులు తీరిన అభిమానులు...: సుమారు ఏడాదిన్నరకు పైగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూయటంతో తమిళనాడు యావత్తూ తల్లడిల్లింది. కరుణ పార్థివదేహాన్ని తొలుత బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు రాజాజీ హాల్‌కు తరలించారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులు జాతీయ పతాకాన్ని ఆయన భౌతికకాయంపై కప్పారు. కలైజ్ఞర్ను తుదిసారిగా చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవునా క్యూలో నిల్చుని కరుణకు కడసారి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న రైళ్లన్నీ డీఎంకే అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయాయి. బుధవారం తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, హోటళ్లు, మాల్స్ మూతపడ్డాయి. ఆటోలు కూడా ఆగిపోయాయి. కన్నీరు మున్నీరైన కరుణ కుటుంబం: కరుణానిధి భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులంతా విషణ్ణ వదనాలతో నిలుచున్నారు. అళగిరి, స్టాలిన్, కనిమొళి తదితరులంతా శాశ్వత నిద్రలో ఉన్న తండ్రిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కొద్ది గంటలపాటు నిబ్బరంగా ఉన్న స్టాలిన్ మధ్యాహ్నం సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేక విలపించారు. కరుణను కడసారి చూసేందుకు వస్తున్న వివిధ పార్టీల నేతలను ఒకవైపు పలకరిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. మెరీనా బీచ్‌లో కరుణ సమాధికి స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించినట్లు తెలియగానే అశ్రు నయనాలతో అందరికీ నమస్కరించారు. హాజరైన పలువురు ప్రముఖులు: ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా రాజాజీహాల్‌కు చేరుకున్నారు. కరుణకు నివాళులర్పించిన అనంతరం స్టాలిన్, కనిమొళిలను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, స్పీకర్ ధనపాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, డిల్లీ, కర్నాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌రావు, నారాయణస్వామి, కేజ్రీవాల్, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పి.చిదంబరం, రాష్ట్ర అధ్యక్షులు తిరునావుక్కరసర్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బందోబస్తులో 1.20 లక్షల మంది పోలీసులు కలైజ్ఞర్ అంతిమ సంస్కారాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులను మోహరించారు. చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసం వద్ద పారామిలటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మాల్స్ మూతపడ్డాయి. ‘కాగితం’ ప్లాన్‌కు అనుగుణంగానే.. చెన్నై: మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. కరుణానిధి అంత్యక్రియలను ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఓ కాగితం మీద గీసిన ప్లాన్‌ను న్యాయస్థానానికి అందించారు. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై, మాజీ సీఎం జయలలిత స్మారకాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కరుణ అంత్యక్రియలు జరుపుతామని వెల్లడించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. గాంధీ మండపం సమీపంలో కరుణ అంత్యక్రియలతో పాటు స్మారకం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. అయితే ద్రవిడ ఉద్యమం, దాని భావజాలానికి సంబంధం లేని వ్యక్తులకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించారని డీఎంకే న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కాగితంలో పేర్కొన్నదానికి అనుగుణంగానే కరుణ అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభిప్రాయాలను తోసిపుచ్చింది. జననంలోనూ మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం తిరువొత్తియూరు (చెన్నై): సాధారణంగా మనిషికి వేర్వేరు వారాలు, నక్షత్రాల్లో జనన, మరణాలు సంభవిస్తుంటాయి. లక్షల మందిలో ఏ ఒక్కరికో జననం, మరణం ఒకే వారం, ఒకే నక్షత్రంలో సంభవిస్తుంది. కరుణానిధికి జననంలోనూ, మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం రావడం విశేషం. ఆయన 1924 జూన్ 3న జన్మించారు. ఆ రోజు మంగళవారం కాగా, నక్షత్రం మృగశిర. ఆయన మరణించిన వారం, నక్షత్రం అవే కావడం విశేషం. పితృ సమానులు: సోనియా రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తనకు పితృసమానులని సోనియా గాంధీ పేర్కొన్నారు. అలాంటి గొప్పవ్యక్తిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటన్నారు. ఈయన మార్గదర్శకత్వం లేకపోతే దేశం మరింత పేదరికంలోకి కూరుకుపోయుండేదని.. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు. రాజకీయ ప్రపంచంలో కరుణ ఓ గొప్ప శిఖరమని ఆమె ప్రశంసిచారు. తమిళ ప్రజలకు, భారతీయులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘కరుణ మృతి నాకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. నాపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువలేను. నాకు ఆయన పితృసమానులు’అని సోనియా ప్రశసించారు. కరుణకు పార్లమెంటు నివాళి న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంటు బుధవారం ఘనంగా నివాళులర్పించింది. అనంతరం ఉభయ సభలను ఆయన గౌరవార్థం వాయిదా వేశారు. సాధారణంగా సిట్టింగ్ ఎంపీ మరణిస్తేనే సంతాపం తెలిపి సభను వాయిదా వేస్తారు. కరుణానిధి ప్రస్తుత సభలో సభ్యుడు కాకపోగా, గతంలోనూ ఆయన ఎప్పుడూ ఎంపీగా పనిచేసింది లేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని తమిళనాడు శాసనసభకే ఆయన పరిమితం చేసుకున్నారు. అయినా సంప్రదాయాన్ని పక్కనబెట్టి బుధవారం కరుణానిధికి ఉభయ సభల్లోనూ నివాళులర్పించిన అనంతరం పార్లమెంటు వాయిదా పడింది. సభ ప్రారంభానికి ముందే కరుణానిధికి గౌరవ సూచకంగా సభను వాయిదా వేసే విషయమై రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య వివిధ పార్టీల నేతలను సంప్రదించారు. కరుణానిధి దేశ రాజకీయాల్లోనే ఉద్దండుడంటూ సభను వాయిదా వేసేందుకు నేతలందరూ అంగీకరించారు. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కూడా వెల్లడించారు. కరుణానిధి గొప్ప దార్శనికత ఉన్న ప్రజా నేత అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. మనస్సాక్షినే నమ్ముతాను.. ‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి.. -
రాజకీయ శూన్యత పూరించేదెవరు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే నేతలు ఎం.కరుణానిధి, జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎటు తిరుగుతాయి? మూడున్నర దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ఇద్దరు అగ్రనేతలు లేని లోటును ఎవరు తీరుస్తారు? ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ నాయకత్వంలోని కొత్త ప్రాంతీయపక్షాలు ఎంత వరకు ఈ ఖాళీని భర్తీ చేస్తాయి? అనే ప్రశ్నలు తమిళ రాజకీయ పండితులకు చర్చనీయాంశాలుగా మారాయి. కరుణానిధి తన రాజకీయ వారసునిగా మూడో కొడుకు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. ఫలితంగా ఆయన కుటుంబ సభ్యుల్లో రాజకీయలతో సంబంధమున్న రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఇంకా ఆయన మేనల్లుడి కొడుకు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్లు డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలు, ఆస్తులపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఏఐడీఎంకే నిలదొక్కుకుంటుందా? ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రస్తుతానికి కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో జయ సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం మాతసంస్థ ఏఐడీఎంకే నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో చీల్చి కొంత మేరకు బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐడీఎంకే పాలనకుగాని, పళనిస్వామికిగాని జనాదరణ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐడీఎంకే ఎన్ని పార్టీలుగా చీలిపోతుందో కూడా చెప్పలేమని తమిళ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలంతో అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో ఏఐడీఎంకే పూర్వ వైభవం సంపాదించడానికి చాన్సే లేదని తేల్చిచెబుతున్నారు. రజనీ, కమల్ పార్టీలకు ఇంకా పునాదులే లేవు ఇద్దరు తమిళ రాజకీయ దిగ్గజాలు జయ, కరుణ లేని పరిస్థితుల్లో తమ అదష్టం పరీక్షించుకోవడానికి మక్కల్ నీతి మెయ్యం అనే పార్టీ పెట్టిన కమల్‌హాసన్‌గాని, ఇంకా పార్టీ పేరు ప్రకటించకుండానే కొత్త పార్టీకి ఇంకా ఏర్పట్ల పనిలో మునిగి ఉన్న రజనీకాంత్‌గాని ఇప్పట్లో ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీచేసే సామర్ధ్యం లేదు. బ్రాహ్మణేతర కులాలకు సామాజికన్యాయం, మూఢాచారాల నిర్మూలన, హిందీ వ్యతిరేకత, తమిళ భాషా వికాసం వంటి సైద్ధాంతిక భూమికతో ఎదిగిన డీఎంకే, అన్నాడీఎంకేలు నేడు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకుండా ముందుకుసాగుతున్నాయి. ఇలాంటి సిద్ధాంతాలేవీ లేకుండా, సమకాలీన తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి సినీ గ్లామర్ ఒక్కటే ఈ ఇద్దరు నటులకు సరిపోదు. వామపక్షాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించే కమల్ పార్టీ నిర్మాణం కూడా అనుకున్నట్టు జరగడం లేదు. రజనీకాంత్‌కు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకున్న తనకున్న ‘ఆధ్యాత్మిక’ నేపథ్యంతో ఎన్నికల్లో బీజేపీకి దగ్గరవ్వచ్చేమోగాని అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. మళ్లీ పుంజుకునే అవకాశాలే లేని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కమల్‌హాసన్ ఆలోచిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతంతో తమిళులను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే పరిస్థితులు లేవు. స్టాలిన్ సామర్ధ్యంపైనే డీఎంకే భవితవ్యం! అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో నిండిన పార్టీ యంత్రాంగం, అవసరమైన వనరులు, తగినంత అనుభవం ఉన్న స్టాలిన్ చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని నడపగలిగితే డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. ఎప్పటి నుంచో పొత్తుల అనుబంధం ఉన్న కాంగ్రెస్, ఇతర చిన్నచితకా పార్టీలతో కలిసి బలమైన కూటమి నిర్మిస్తే కరుణానిధి వారసునిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ సిద్ధాంత వారసత్వం కూడా డీఎంకేకు కలిసొచ్చే ప్రధానాంశం. ప్రస్తుతమున్న సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో డీఎంకే పార్టీ మాత్రమే ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనగలదని రాజకీయ విశ్లేషకుల్లో అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మనస్సాక్షినే నమ్ముతాను..
‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. - ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. - సంకీర్ణ ప్రభుత్వామనేది తాత్కాలిక ఏర్పాటు. సంకీర్ణం కారణంగా మేం కొన్ని డిమాండ్లు సాధించుకోగలిగాం. తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తి లభిస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. చివరికి అది కూడా సంకీర్ణం వల్లే సాకారమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కరుణానిధి. - కేంద్రంలో తాను కలసిన వ్యక్తుల్లో వీపీ సింగ్‌ను గొప్ప మనిషిగా భావిస్తారు కరుణ. వీపీ చేపట్టిన సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు తమ స్నేహానికి వారధి వేశాయంటారు. - కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి కళానిధి చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి వుండేది కాదని కరుణ తన ఆత్మకథలో రాసుకున్నారు. నాటకం, కవిత్వం, తమిళ సాహిత్యం వైపే ఆయన మనసు మళ్లుతుండేదట. కరుణ తండ్రి ముత్తువేలు.. చనిపోవడానికి ఒక నెల ముందు కరుణానిధి మాటలు రాసిన‘రాజకుమారి’ సినిమా చూడాలనుకున్నారట. కానీ అప్పటికే ఆయన కంటి చూపుకు దూరమయ్యారు. కనీసం కొడుకు రాసిన మాటలైనా విందామనుకున్నారాయన. దీంతో తిరువారూర్‌లో ఓ థియేటర్‌కు తీసుకుపోయారు. ‘రచయితగా నేను ఎదిగిన తీరును చూసి ఆయన ఎంతో సంబరపడ్డారు’ అని ఆత్మకథలో చెప్పారు కరుణ. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
తుది వీడ్కోలు..!
వ్యక్తి ఆరాధన తమిళనాట తీవ్రస్థాయిలో ఉంటుంది. తాము ప్రేమించేనేత మరణిస్తే తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అభిమానులు మృతిచెందిన సంఘటనలు గతంలో చూశాం. అలాగే ఆ నేతల చివరి చూపుల కోసం లక్షలాది మంది తరలివచ్చి అంతిమయాత్రల్లో పాల్గొన్న దృశ్యాలు తమిళనాడులో కనిపిస్తాయి. అభిమానం ఎంతగా ఉందంటే అన్నాదురై అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య గిన్నెస్‌బుక్‌లో కూడా రికార్డ్ అయ్యింది. అన్నా మొదలుకుని కరుణానిధి వరకు ఈ అంతిమయాత్రలు సాగిన తీరు ఇలా ఉంది. అన్నాదురై: తమ భావాలు, అభిప్రాయాలతో, చేపట్టిన కార్యక్రమాలు, పనులతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన రాజకీయ ప్రముఖులు, నేతలకు మనదేశంలో నీరాజనాలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి నేతలు మరణించినపుడు వారి అంతిమయాత్రలో లెక్కకు మించి సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం తెలిసిందే. ద్రవిడోద్యమ దిగ్గజంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, తమిళ హక్కులు, సంస్కతి పరిరక్షణలో తుదికంటా పోరాడి తమిళనాడులోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన మాజీ సీఎం అన్నాదురై 59 ఏళ్ల వయసులో కేన్సర్‌తో మరణించారు. 1969 ఫిబ్రవరి 3న జరిగిన ఆయన అంతిమయాత్రకు కోటిన్నర మంది ప్రజలు హాజరుకావడంతో ‘అత్యధిక సంఖ్యలో ప్రజలు పలికిన తుది వీడ్కోలు’గా గిన్నెస్ ప్రపంచరికార్డ్ నమోదైంది. చెన్నైలో అన్నాదురై భౌతికకాయంతో కూడిన శవపేటికను లక్షలాది మంది అనుసరిస్తున్న ఫోటోలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఎంజీఆర్: తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, భావజాల వ్యాప్తికి సినీమాధ్యమం ద్వారా కృషి చేసిన వారిలో అన్నాదురై, ఎం.కరుణానిధి, ఎంజీ.రామచంద్రన్ ప్రముఖులు. అయితే సినిమా తెరపై వాటిని తన నటనరూపంలో చూపి ఎంజీఆర్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎత్తిచూపుతూ, వారితో మమేకమయ్యేలా రూపొందించిన పాత్రలు (కథ,స్క్రీన్ ప్లే కరుణానిధి) ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేతో విభేదించి సొంతంగా ఏఐడీఎంకేను స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకోలేదు. 1987 డిసెంబర్ 24న 71 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది. అంతిమయాత్రలో చెలరేగిన హింసలో 29 మంది మరణించారు. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 30 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్ భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని అనుసరించినవారు, అంతిమయాత్రలో పాల్గొన్న వారు కలిపి దాదాపు పది లక్షల మంది ఉండొచ్చునని ఓ అంచనా. జయలలిత: సినీనటిగా జీవితం ప్రారంభించిన జె.జయలలిత, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంజీఆర్ సన్నిహితురాలిగా మారి ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశారు. అటు ప్రతిపక్షపాత్రతో పాటు సీఎం పదవిని చేపట్టాక, అనేక సంక్షేమపథకాల అమలు ద్వారా పేదవర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. విప్లవనాయకి (పురచ్చి తలైవి)గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తమిళ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్నికల్లో గెలుపోటములు చవిచూశారు. మళ్లీ సీఎంగా ఎన్నికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన అంతిమయాత్రలో దాదాపు పదిలక్షల మంది పాల్గొన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కరుణానిధి: తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేసిన మాజీ సీఎం ఎం.కరుణానిధి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఐదుసార్లు సీఎంగా, 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ పర్యాయం ఎమ్మెల్సీగా, దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మెరీనా బీచ్‌లోనే కరుణానిధి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు డీఎంకే పట్టుబట్టడంతో ఈ అంశంపై కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. చివరకు న్యాయస్థానం దానికి అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలు వద్ద ఉంచిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందినట్టు పలువురు గాయపడినట్లు వార్తాసంస్థలు వెల్లడించాయి. అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన వారి నియంత్రణకు పోలీసులు లాఠీచార్జీ జరపడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఈ అంతిమయాత్ర చెన్నై నగర వీధుల మీదుగా మెరీనా బీచ్‌కు చేరుకుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నేతల్లో ఒకరైన కరుణానిధి అంతిమయాత్రలో లక్షల్లో ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనావేస్తున్నారు. మెరీనా తీరంలోనే మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి పార్ధివదేహాన్ని కూడా ఖననం చేశారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అందుకే కరుణానిధిని ఖననం చేశారు
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తొలుత పళనిస్వామి ప్రభుత్వం కరుణానిధి అంతిమ సంస్కరాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడానికి నిరాకరించిన సంగతి తెలిసింది. దాంతో స్టాలిన్, డీఎమ్‌కే వర్గాలు హై కోర్టుకు వెళ్లి మరి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా కృషి చేశారు. హిందువు కదా.. ఖననం ఎలా హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బురియల్) చేస్తారు. కానీ కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికి, ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు. అందువల్లనే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు. ఒక కరుణానిధినే కాక గతంలో పెరియార్ ఇ.వి. రామసామి, సీఎన్ అన్నాదురై వంటి మహామహులందరిని ఖననం చేశారు. ఇప్పుడు వారి దారిలోనే కరుణానిధిని కూడా ఖననం చేశారు. 14 ఏట నుంచి నాస్తికవాదం వైపు సమాజంలో ఉన్న బ్రాహ్మణాధిక్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఇ వి రామసామి నాయకర్ ‘ద్రవిడ ఉద్యమా’న్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమ భావజాలానికి ఆకర్షితులైన కరుణానిధి దీనిలో భాగస్వామి అయ్యారు. అనంతరం ఈ ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన ‘ద్రవిడ కళగం పార్టీ’(డీకేపీ)లో చేరారు. డీకే పార్టీలో వచ్చిన వివాదం ఫలితంగా ‘డీఎమ్‌కే’ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ కూడా దేవున్ని నమ్మదు. అయితే కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవున్ని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది. -
ముగిసిన కరుణానిధి అంతిమ సంస్కారాలు
-
మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు
-
నాన్నా.. ఒక్కసారి పిలవొచ్చా : స్టాలిన్ భావోద్వేగం
చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపట్ల ఆయన కుమారుడు, పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్ విషాదాన్ని వ్యక్తం చేస్తు భావోద్వేమైన లేఖను రాశారు. చివరిసారిగా ఒక్క సారి నాన్నా(అప్పా).. అని పిలవనా అంటూ బుధవారం ఉద్వేగపూరితమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఏం ఉందంటే.. ‘ అప్పా(నాన్న) ..అప్పా అని పిలిచేబదులు మిమ్మల్ని మా నాయకుడు(తలైవార్) అనే ఎక్కువ సార్లు పిలిచేవాడిని. చివరి సారిగా ఒక్క సారి నాన్నా అని పిలువనా లీడర్. ఎక్కడి వెళ్లాల్సివచ్చినా మాకు ముందే సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయావు. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి. ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెప్పారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి(సమాధి) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. ஒரே ஒருமுறை இப்போதாவது ‘அப்பா’ என அழைத்து கொள்ளட்டுமா ‘தலைவரே’! pic.twitter.com/HWyMPkSmLj — M.K.Stalin (@mkstalin) 7 August 2018 -
ప్రారంభమైన కరుణానిధి అంతిమయాత్ర
-
కరుణానిధి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి. కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే జెండాను కప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు మాజీ ప్రధాని దేవేగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్, తమిళనాడు మంత్రి డి జయకుమార్, గులాంనబీ అజాద్, శరద్ పవార్, వీరప్ప మొయిలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెరీనా బీచ్ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారంటే..
చెన్నై : ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. -
కరుణానిధికి నివాళి.. కేసీఆర్ పిడికిలి పైకెత్తి...
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన కేసీఆర్ కరుణానిధి కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ పిడికిలి పైకెత్తి కరుణానిధి అమర్‌రహే అని నినదించారు. కాగా సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. రాజాజీ హాల్లో జరిగిన తొక్కిసలాట అనంతరం మాట్లాడిన స్టాలిన్ కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
కరుణానిధికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్న రాహుల్.. రాజాజీ హాల్‌కు వెళ్లారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ పి సదాశివం, కాంగ్రెస్ నాయకులు గులాంనబీ అజాద్, వీరప్ప మెయిలీ కూడా రాజాజీ హాల్‌కు చేరుకుని కరుణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. -
‘కరుణానిధి చేతుల మీదుగా నా తొలి అవార్డు’
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విషాదం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కరుణానిధితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా తొలి జాతీయ అవార్డును కరుణానిధి చేతుల మీదుగా అందుకున్నాను’ అంటూ ఉద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ‘పూజ్యులు, ధైర్యశాలి అయిన కరుణానిధి చేతుల మీదుగా ‘సాత్ హిందుస్తానీ’ చిత్రానికి గాను నేను నా తొలి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాను. ఆ ఏడాది జాతీయ స్థాయి సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చెన్నై (మద్రాస్)లో జరిగింది. అప్పుడు కరుణానిధి సీఎంగా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సాత్ హిందుస్తానీ’ చిత్రానికి గాను అమితాబ్ బచ్చన్ ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూకామర్’ కెటగిరిలో అవార్డు అందుకున్నారు. T 2893 - பிரார்த்தனை மற்றும் இரங்கல் , for the Honourable and dynamic leader Shri Karunanidhi .. I received my very 1st National Award for 'Saat Hindustani' from him, when the ceremony was held in Chennai that year .. he was the CM ..🙏🙏🙏 pic.twitter.com/lu9Mc886EX — Amitabh Bachchan (@SrBachchan) August 8, 2018 కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
కరుణానిధి మృతి పట్ల పార్లమెంట్ సంతాపం
-
రాజాజీ హాల్లో తొక్కిసలాట.. ఇద్దరి మృతి
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం పళనిస్వామిని కలసి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహిస్తామంటే సహకరించలేదని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు సాధించామని పేర్కొన్న ఆయన దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించారు. 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమయాత్ర సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. మెరీనా బీచ్‌లో ఆర్మీ బలగాలు.. కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ భారీగా సైనిక బలగాలను మొహరించారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. -
స్టాలిన్‌కు సోనియా లేఖ
న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కలైంగర్ నా తండ్రి లాంటివారు. అటువంటి గొప్ప నాయకుడిని ఇక ముందు చూడలేం. దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. తెలివైన నాయకత్వంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటూ..’ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు సోనియా భావోద్వేగ పూరిత లేఖ రాశారు. కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
జనసంద్రంగా మారిన రాజాజీహాల్
-
కరుణానిధికి ప్రధాని మోదీ నివాళి
-
స్టాలిన్‌ను ఓదార్చిన ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై: దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ప్రధాని.. కాసేపటి క్రితం రాజాజీ హాల్‌కు వెళ్లి కలైంగర్ భౌతికా కాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్లను ఈ సందర్భంగా మోదీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు డీఎంకే వర్గాలు వెల్లడించాయి. -
కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్ కిరికిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్‌లోనే అంత్యక్రియలకు అనుమతించాలని డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్(ఎంజీఆర్ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్‌లో అనుమతించలేదు. ప్రోట్‌కాల్(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది. కామరాజ్, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ లాంటి వాళ్లకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్లో గందరగోళం చెలరేగగా.. సైలెంట్‌గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్ కోసమే బెంచ్ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం. -
కరుణానిధి అస్తమయం
-
కరుణానిధి దేవుడిని నమ్ముతారా?
చెన్నై : తమిళుల మదిలో ఎన్నటికీ చెరగని ముద్ర.. కలైజ్ఞర్, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న సాయంత్రం 6.10 గంటలకు స్వర్గస్తులయ్యారు. దీంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కరుణానిధి ఆస్పత్రిలో ఉన్నంత కాలం, ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి ఇంటికి రావాలని ప్రార్థన చేయని అభిమాని అంటూ లేరు. ప్రతి ఒక్కరూ కరుణానిధి కోలుకునేలా దేవుడు కరుణించాలని ప్రార్థించారు. కానీ అభిమానుల ప్రార్థనలు దేవుడికి వినిపించలేదో ఏమో.. కరుణను తన వద్దకే తీసుకెళ్లిపోయాడు. అసలు కరుణానిధి దేవుడిని నమ్ముతారా? మత సిద్ధాంతాల పట్ల ఆయనకున్న అభిప్రాయమేమిటి? అంటే పలు ఆసక్తికర విషయాలే వెలుగులోకి వచ్చాయి. సాంఘిక సమస్యలు తెరముందుకు వచ్చినప్పుడు కరుణానిధి అసలు మతపరమైన సిద్ధాంతాలను నమ్మరని, వాటిని తిరస్కరించే భావనను ఆయన కలిగి ఉండేవారని ద్రవిడ ఉద్యమంలో కీలక నాయకుడు పెరియార్ ఇ.వి. రామసామి చెప్పారు. అయితే పలు రిపోర్టుల ప్రకారం కరుణానిధి ఆలయ పోషకుడిగా ఉన్నారని తెలిసింది. తమిళనాడులో ఆలయాలను నిర్మించడం, ఉన్న వాటిని పునర్ నిర్మాణం చేయడం వంటి వాటిని కరుణా చేపట్టేవారట. ఆలయాల పునర్నిర్మాణం కోసమే ఈ నేత దాదాపు రూ.420 కోట్లను వెచ్చించారని తెలిసింది. మరోవైపు ద్రవిడియన్ పార్టీల్లో నాస్తిక రాజకీయ నాయకుడిగా కేవలం కరుణా నిధే నిలిచారట. నాస్తిక నాయకుడిగా కరుణానిధిగా పేరుందని తెలిసింది. కరుణానిధి నాస్తికుడైనప్పటికీ, ఆశ్చర్యకరంగా ఆయన నివాసం ఉండే ఇళ్లు కృష్ణుడి ఆలయం పక్కనేనట. కొన్ని దశాబ్దాలుగా కృష్ణుడి ఆలయం పక్కనే ఆయన నివసించేవారు. ఈ డీఎంకే అధినేత ఇంటికి పూజారులు వస్తూ ఉండటం, వెళ్తూ ఉండటం, అన్నీ పూజా కార్యక్రమాలు జరపడం వంటివి చేసేవారట. ఓ సారి పూజారులు డీఎంకే అధినేత ఇంట్లో చేసిన పూజల వీడియో వైరల్ కూడా మారింది. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అవడంతో, కరుణానిధిపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఆయన కలిగి ఉన్న మత వ్యతిరేక వైఖరిపై పలువురు పలు విమర్శలకు పాల్పడ్డారు. ‘నేను ఒక నాస్తికుడు అయినప్పటికీ, నా చుట్టూ ఉండే కొంతమంది, డిఎంకే పూర్తిగా ఆ భావజాలానికి కట్టుబడి లేదని నాకు బాగా తెలుసు. ప్రత్యేకించి దైవత్వం విషయంలో నా పార్టీ ఆలోచనలు, ఇతరులపై ఎలాంటి ఆంక్షలు విధించదు. నా కుటుంబం సభ్యులపై కూడా అలాంటి విధింపు ఉండదు’ అని ఒకానొక సమయంలో కరుణానిధి చెప్పారు. దీని ప్రకారం కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవుడుని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది. కరుణా నిధి, ఆయన పార్టీ నేతలు కూడా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలు దేవాలయాలను సందర్శించేవారట. -
లైన్ క్లియర్!.. తీర్పు ఆలస్యం?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు వీడింది. ఈ వ్యవహారంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి(84) ప్రకటించారు. దీంతో రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు గతంలో దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను(ఐదింటిని) మద్రాస్ హైకోర్టు బెంచ్ డిస్మిస్ చేసింది. అయితే కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన పిటీషన్‌పై మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అత్యవసర తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడటంతో.. తీర్పును కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (కరుణానిధి అరుదైన ఫోటోలు.. క్లిక్ చేయండి) గతంలో మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణ అంత్యక్రియలకు ఆ పిటిషన్ ఆటంకంగా మారింది. కోర్టు కేసుల నేపథ్యంలో అంత్యక్రియలకు స్థలం కేటాయించలేమని పళని ప్రభుత్వం పేర్కొంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. గత రాత్రి నుంచి ఈ వ్యవహారంపై వాదనలు జరిగాయి. చివరకు తదుపరి వాదనలు ఈ ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఉత్కంఠ నెలకోగా, రామస్వామితో చీఫ్ జస్టిస్ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ రాతపూర్వకంగా ఆయన బెంచ్‌కు ఓ మెమొరాండం సమర్పించారు. అంతేకాదు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కోర్టులో ప్రభుత్వం, డీఎంకే తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ప్రకటించాల్సిన అవసరం లేదన్న చీఫ్ జస్టిస్.. ఈ రోజే తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. (నిండు సభలో దుశ్శాసన పర్వం) ‘తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని’ జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు కూడా. కానీ, రామస్వామి పిటిషన్ మూలంగానే న్యాయపరమైన చిక్కుల నెలకొన్నాయన్న విషయం తర్వాతే తేలింది. (అమ్మకు ఘన నివాళి) (కరుణ వల్లే ఇదంతా...) -
కరుణానిధి అంత్యక్రియలపై ఉత్కంఠ
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అంత్యక్రియలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరిపాలని డీఎంకే పట్టుపడుతుండా, మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళవి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసింది. దీనిపై డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి డీఎంకే పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి వివాదాన్ని ఏటూ తేల్చకుండా ఉదయం ఎనిమిది గంటలకు వాయిదా వేశారు. హైకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచుస్తున్నారు. కరుణానిధి ప్రస్తుత సీఎం కానందునే అంత్యక్రియలకు నిరాకరిస్తున్నారని, ఆయన చేసిన సేవలను మర్చిపోయారా అని డీఎంకే మండిపడుతోంది. కరుణానిధి అంత్యక్రియలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం ఉత్కంఠ నెలకొంది. -
కలైజ్ఞర్ మృతి పట్ల వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
-
సాహిత్య రంగంలోనూ కరుణ కృషి అమోఘం
-
కరుణానిధి మృతిపై ప్రముఖుల సంతాపం
-
రాజకీయ చరిత్రలో కరుణ ఘనత
-
కరుణ మృతి.. దేశ వ్యాప్తంగా సంతాపదినం
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించింది. కరుణానిధి మరణానికి సంతాప సూచికగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో బుధవారం జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరుణానిధికి నివాళిగా సంతాప దినాలను ప్రకటించాయి. కాగా నేడు తమిళనాడు రాష్ట్రా వ్యాప్తంగా న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. ఆయన అంత్యక్రియల స్థల వివాదానికి సంబంధించిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు నేడు విచారించనుంది. కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసిన చేసింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. కాగా కరుణానిధి మృతికి సంతాపంగా తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైజ్ఞర్
-
డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరు
-
కలైజ్ఞర్ ఇక లేరు
సాక్షి, చెన్నై: ఓ దిగ్గజం నేలకొరిగింది.. తమిళ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. ఏడున్నర దశాబ్దాలుగా తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కలైజ్ఞర్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ.. రక్తపోటు తగ్గడంతో పదిరోజుల క్రితం ఆళ్వార్‌పేట్‌లోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూసినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కరుణకు ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం. ఓవైపు ఆయన అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతుంటే.. మరోవైపు అంత్యక్రియల విషయంలో వివాదం రాజుకుంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై సమాధి పక్కనే కరుణ అంత్యక్రియలు జరగాలని, స్మారకచిహ్నం నిర్మించాలని డీఎంకే పట్టుబడుతుండగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. మెరీనా బీచ్ విషయంలో న్యాయపరమైన చిక్కులొస్తాయని, అందుకే గాంధీ మండపంలో రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొంది. దీనిపై డీఎంకే కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అన్ని అధికారిక కార్యక్రమా లను రద్దు చేశారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల్ని అవనతం చేశారు. బుధవారం అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తీవ్రంగా ప్రయత్నించాం.. కానీ! ‘మన ప్రియతమ నేత, కలైజ్ఞర్ ఎం.కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వెల్లడించడం చాలా బాధగా ఉంది. మా వైద్యులు, నర్సుల బృందం ఆయన్ను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన వైద్యానికి సహకరించలేదు. దేశ రాజకీయాల్లో చాలా గొప్ప నేతగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్న మహానేత మరణానికి మేం దుఃఖిస్తున్నాం. కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఇది విషాదకర సమయం’ అని కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రత్యర్థి తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయిన 20 నెలల తర్వాత కరుణానిధి కన్నుమూశారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా 2007 నుంచి వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఆటోమేటిక్ వీల్‌చైర్‌లోనే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. గంటన్నరలోనే.. కరుణానిధి మృతికి గంటన్నర ముందు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ‘మహానేత పరిస్థితి అత్యంత విషమంగా ఉంద’ని పేర్కొన్నారు. దీంతో వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి ముందుకు చేరుకుని రోదించారు. తమ నేత తిరిగి రావాలంటూ నినాదాలు చేశారు. అయితే తర్వాత కాసేపటికే కరుణ ఇక లేరనే వార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నేత ఇక లేరన్న ఆవేదనతో డీఎంకే శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కరుణ ఫోటోలు చేతబూని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అటు, చెన్నైలోని ప్రముఖ కూడళ్లలోనూ డీఎంకే కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం ఆరున్నరగంటలకే దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసేశారు. చెన్నైతోపాటు తమిళనాడు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చెన్నై నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు సరిహద్దుల్లోని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు. సంయమనం పాటించండి: స్టాలిన్ విజ్ఞప్తి ఆసుపత్రి వద్ద, చెన్నై రోడ్లపైకి భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి చేజారకుండా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రంగంలోకి దిగారు. ఇలాంటి విషాదకరమైన సమయంలో కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని ఎలాంటి ఘర్షణకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నిరసనలు, ఆందోళనల ద్వారా కరుణానిధికి చెడ్డపేరు తెచ్చే పనులేవీ చేయవద్దని సూచించారు. డాక్టర్లు రెండేళ్లుగా కరుణానిధికి ఆరోగ్యం విషయంలో తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారన్నారు. కార్యకర్తలు ప్రశాంతంగా ఉండేలా చూడాలని పార్టీ పదాధికారులకు సూచించారు. సంఘ వ్యతిరేక శక్తులు ఇలాంటి సమయాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు సిద్ధపడతాయని అందుకే కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. నివాసానికి కరుణ పార్థివదేహం కరుణానిధి పార్థివదేహం ఆళ్వార్ పేట ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో తొమ్మిది గంటల సమయంలో గోపాలపురం ఇంటికి తరలించే సమయంలో జనం పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో అంబులెన్స్ మెల్లగా కదిలింది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరుణ నివాసం చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భౌతికకాయాన్ని గోపాలపురం ఇంట్లో ఉంచిన అనంతరం సీఐటీ నగర్‌లోని మరో భార్య రాజాత్తి అమ్మాల్ ఇంటికి తరలించనున్నారు. బుధవారం ఉదయం నాలుగు గంటలకు చెన్నై ఓమందూరు ఎస్టేట్‌లోని రాజాజీ హాల్ వద్ద ప్రజలు, వీఐపీల సందర్శనార్థం కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లుచేశారు. ప్రముఖుల సంతాపం కరుణానిధి అస్తమయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు జాతీయస్థాయి రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కరుణను కడసారి చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ బుధవారం ఉదయం చెన్నై వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత మంగళవారం అర్ధరాత్రే చెన్నై చేరుకున్నారు. మిగిలిన నేతలు బుధవారం ఉదయం రానున్నారు. కాగా, కలైజ్ఞర్ మృతికి సంతాపసూచకంగా ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
‘మురసొలి’తో పాత్రికేయుడిగా..
సాక్షి, చెన్నై: దక్షిణామూర్తి అలియాస్ ముత్తువేలర్ కరుణానిధి అన్ని రంగాల్లోనూ ఆరితేరిన వారే. మీడియా రంగంలో ఆయన అరంగేట్రం మురసొలితో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో 18 ఏళ్ల వయసులో ఆయన కలం చేబట్టారు. స్వస్థలం తిరువారూర్ వేదికగా 1942 ఆగస్టు 10 నుంచి ‘మురసొలి’పేరుతో కరపత్రాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇందులో వ్యాసాలు, సమాచారాన్ని ‘చేరన్’బై లైన్‌తో రాసేవారు. కరపత్ర పత్రికగా ప్రజల్లోకి వచ్చిన మురసొలికి 1940 నుంచి కొంత కాలం బ్రేక్ పడింది. 1944 జనవరి 14 నుంచి వారపత్రికగా ఆవిర్భవించింది. తిరువారూర్ నుంచి చెన్నై కోడంబాక్కం వేదికగా 1954 నుంచి మురసొలి పత్రిక వచ్చింది. 1960 సెప్టెంబర్ 17 నుంచి దినపత్రికగా మారింది. కలైజ్ఞర్ పేరుతో చానళ్లు మురసొలి దినపత్రికగా మారినా రోజూ కరుణానిధి పేరిట ఓ కాలం ఉండేది. 2016లో అనారో గ్యం బారిన పడిన తర్వాత కరుణ పేరిట కాలం ఆగింది. డీఎంకే అధినేతగా, సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పత్రిక వ్యవహారాలను ఆయన మేనళ్లుడు మురసొలి మారన్ చేపట్టారు. ఆ తదు పరి మురసొలి మారన్ తనయులు, దయానిధి మారన్, కళానిధి మారన్ నేతృత్వంలో సన్ గ్రూప్ ఆవిర్భావం, దినకరన్ దినప్రతిక చిక్కడం వెరసి కరుణకు కలసి వచ్చాయి. 2007లో కలైజ్ఞర్ పేరుతో టీవీ చానళ్లు పుట్టుకు రావడంతో మీడి యాలో కరుణ కుటుంబం కీలకంగా మారింది. తెలుగువారి భాషా స్ఫూర్తి భేష్ సాక్షి ప్రతినిధి, చెన్నై: కరుణానిధి తండ్రి తమిళుడైనా తల్లి మాతృభాష తెలుగు కావడంతో తెలుగువారిపై మక్కువ కనబరిచేవారు. అంతేగాక ఒక సభలో తెలుగువారికి మంచి కితాబు ఇచ్చారు. చెన్నైలో ప్రముఖుడైన డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షునిగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) స్థాపించిన తరువాత తొలి ఉగాది వేడుకలను 1990లో యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకలకు గంట సమయం మాత్రమే కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి 3 గంటలపాటు కూర్చుండిపోయారు. ‘చెన్నైలో జరిగిన ఉగాది వేడుకలకు ఇంతమంది తెలుగువారా. కొన్నేళ్ల క్రితం తెలుగువారు లేనిదే తమిళనాడు లేదు కదా. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఒకే వేదికపై చూస్తుంటే ముచ్చటేస్తోంది. తెలుగుభాషపై ఉన్న మమకారమే వారందరినీ కలిపింది. ఇలాంటి భాషా స్ఫూర్తితోపాటూ తెలుగువారి నుంచి తమిళులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది..’అంటూ కరుణానిధి తెలుగువారిని కొనియాడారు. -
కరుణానిధి కళ్లజోడు కథ ఇదీ!
సాక్షి, చెన్నై: కంటికి తగిలిన గాయంతో 66 ఏళ్లపాటు కరుణానిధి కళ్లజోడును ధరించాల్సి వచ్చింది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో 1952లో తిరుప్పత్తూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, గాయాన్ని లెక్కచేయకుండా దాల్మియాపురం పేరును కళ్లకుడిగా మార్చాలని నినదిస్తూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆరు నెలలు కారాగార జీవితాన్ని అనుభవించారు. ఈ పరిణామాలతో కంటికి తగిలిన గాయం మరింత తీవ్రమైంది. వైద్యులు చికిత్స చేయగా.. అప్పటి నుంచి కళ్లజోడు ధరిస్తూ వచ్చారు. 66 ఏళ్లపాటు కరుణానిధి నల్ల కళ్లజోడు ధరించారు. తొలినాళ్లలో సాధారణ కళ్లజోడు ఉపయోగించినా, తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసిన కళ్లజోడు ఉపయోగించారు. 2010 నుంచి కుర్చీకే పరిమితం 2010లో కరుణకు ఆరోగ్య సమస్యలు తలెత్తి కొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. తర్వాత నడక కష్టతరంగా మారింది. దీంతో అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. విదేశాల నుంచి కరుణ కోసం ప్రత్యేక సదుపాయంతో కూడిన వీల్‌చైర్‌ను దిగుమతి చేశారు. ఈ వీల్‌చైర్‌లోనే ఆయన ప్రజల్లోకి వచ్చేవారు. -
కరుణ మాటే వేదవాక్కు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ముగ్గురు భార్యలు. తొలి భార్య పద్మావతి అమ్మాళ్, రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాత్తి అమ్మాళ్. వీరిలో పద్మావతి అమ్మాల్ జీవించి లేరు. పద్మావతి అమ్మాల్, కరుణకు ఓ కుమారుడు.. ముక్కా ముత్తు. ఈయనే కుటుంబానికి పెద్ద కుమారుడు. అయితే, ఈయన కరుణానిధికి పూర్తి వ్యతిరేకం. గాయకుడిగా, డ్యాన్సర్‌గా పేరు సంపాదించిన ముత్తు కరుణ సహా ఇతర కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అన్నాడీఎంకేలో చేరి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. దయాళు అమ్మాల్‌కు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, తమిళరసన్.. ముగ్గురు కుమారులు, సెల్వి కుమార్తె. వీరిలో అళగిరి, స్టాలిన్ రాజకీయంగా అందరికీ సుపరిచితులే. రాజాత్తి అమ్మాల్‌కు ఒకే కుమార్తె కనిమొళి. గారాల పట్టిగా కనిమొళికి కరుణ హృదయంలో ప్రత్యేక స్థానముంది. డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఇక, కరుణానిధికి అరివునిధి, దురై దయానిధి, ఉదయనిధిలు మనవళ్లు. వీరిలో అరివునిధి ముత్తు తనయుడు. దయానిధి అళగిరి కుమారుడు. ఇక, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడే ఉదయనిధి. ఈయన సినీ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక, అళగిరి కుమార్తె కయల్ వెలి, స్టాలిన్ కుమార్తె సెంతామరైలు కరుణానిధికి మనవరాళ్లు. అలాగే, మేనల్లుడు దివంగత మురసోలి మారన్‌పై కరుణానిధికి ప్రేమ ఎక్కువే. అందుకే ఆయన కుమారులు దయానిధి మారన్, కళానిధి మారన్‌ను తన కుటుంబీకులతో సమానంగానే చూసుకుంటూ వచ్చారు. మనవళ్లు, మనవరాళ్లనే కాదు, మునిమనవళ్లతో ఆడుకున్న కరుణ, ఇటీవల మనోరంజిత్ అనే మునిమనవడి వివాహానికి పెద్దగా వ్యవహరించారు. రాజకీయంగా స్టాలిన్, అళగిరి మధ్య విభేదాలున్నా, కుటుంబ విషయానికి వచ్చేసరికి అందరికీ కరుణ మాటే వేదవాక్కు. -
డీఎంకే పగ్గాలు స్టాలిన్‌కే
సాక్షి, చెన్నై: కరుణానిధి రాజకీయ వారసుడిగా ఆయన చిన్న కుమారుడు ఎం.కె. స్టాలిన్ డీఎంకే పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ డీఎంకేపై ఇప్పటికే పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. పార్టీలో మరోసారి చీలిక ఏర్పడకుండా తన సోదరుడు, కరుణ పెద్ద కుమారుడు అళగిరి వర్గాన్ని తనవైపు తిప్పుకున్నారు. స్టాలిన్‌ను ఢీకొనే నాయకులెవరూ పార్టీలో లేకపోవడంతో ఆయన పగ్గాలు అందుకునేందుకు ఎవరి నుంచీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం దాదాపు లేనట్లే. చక్రం తిప్పిన కరుణ... డీఎంకేలో 50 ఏళ్లపాటు కరుణ చక్రం తిప్పారు. దివంగత ఎంజీఆర్ రూపంలో డీఎంకేలో చీలిక వచ్చినా ఆ తదుపరి పరిణామాలతో పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్నారు. తన ప్రాణ మిత్రుడు అన్బళగన్‌ను ప్రధాన కార్యదర్శిని చేశారు. అయితే చిన్న కుమారుడు స్టాలిన్‌ను రాజకీయ తెరపైకి తెచ్చిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో 1994లో డీఎంకే మరోసారి చీలింది. ఆ సమయంలో పార్టీలో సీనియర్‌గా ఉన్న వైగో ఎండీఎంకేను ఏర్పాటు చేశారు. డీఎంకే ఎన్నికల చిహ్నం ‘ఉదయించే సూర్యుడి’ కోసం ఇరు పార్టీల మధ్య పెద్ద సమరమే సాగినా చివరకు దాన్ని కరుణ సొంతం చేసుకున్నారు. తద్వారా డీఎంకే కోటను కైవశం చేసుకోవడం ఎవరితరం కాదని చాటారు. క్రమంగా స్టాలిన్‌కు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతూ వచ్చిన సమయంలో పెద్ద కుమారుడు అళగిరి రూపంలో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2006 అసెంబ్లీ ఎన్నికల తదుపరి వయోభారం కారణంగా స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్ట బెట్టారు. అదే సమయంలో పెద్ద కుమారుడికి న్యాయం చేసేందుకు ఆయన్ను దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. అయితే అన్నదమ్ముల మధ్య రాజకీయ సమరం ముదురుతూ రావడంతో తన బలాన్ని పెంచుకు నేందుకు స్టాలిన్ అడుగులు వేశారు. ఇందుకు తెర వెనుక నుంచి కరుణ సహకారం అందించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి మదురై ఎంపీగా గెలిచాక ఆయన్ను కేంద్ర మంత్రిని చేసి (యూపీఏ కూటమి ద్వారా) స్టాలిన్‌ను పార్టీలో అందలం ఎక్కించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ అళగిరిపై బహిష్కరణ వేటు వేయించారు. చివరకు వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను కరుణానిధి స్టాలిన్‌కు పూర్తిగా అప్పగించారు. -
ఆయన నిజమైన లెజెండ్
ఓ రాజకీయ చాణక్యుడు.. ఓ ద్రవిడ పోరాట యోధుడు.. ఓ సాహితీ దిగ్గజం.. కథకుడు.. కళాకారుడు.. పాత్రికేయుడు.. ఒక్కడిలో ఇన్ని కోణాలా? అవును.. ఆయనది చిన్నతనం నుంచే పోరాట పంథా.. ధిక్కార స్వభావం.. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచే తత్వం.. వెరసి తమిళ చరిత్ర పుటల్లో ఓ చెరగని అధ్యాయం! అందుకే ఆయన తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైజ్ఞర్ చిన్నతనం నుంచేధిక్కార స్వభావం అద్భుత వాగ్ధాటితో అందరి మన్ననలు పెరియార్ పరిచయంతోమలుపు తిరిగిన జీవితం.. పేరు దక్షిణామూర్తి.. అందరికీ తెలిసిన పేరు ఎం.కరుణానిధి. ఓ తెలుగు సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన కరుణానిధి తమిళుల గుండెల్లో కలైజ్ఞర్‌గా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళనాడు వంటి సంక్లిష్ట రాజకీయాల్లో పదమూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. మరెన్నో సంఘర్షణలు.. కలైజ్ఞర్‌గా... తన పేరు కంటే కలైజ్ఞర్(నటుడు)గానే అభిమానులకు, ప్రజలకు కరుణానిధి ప్రసిద్ధులు. కలైజ్ఞర్ కరుణానిధి అంటూ ఆయన ఇంటి పేరుగా మారిన ఈ పదం నిజానికి బిరుదు. ఉడన్ పెరప్పు కడిదం (నాతోబుట్టువులకు లేఖ) నినాదంతో కరుణ రాసిన ఓ రచన అప్పట్లో ప్రజల మదిని దోచుకుంది. దీని తర్వాత తూక్కుమేడై (ఉరి కంబం) నాటికను కరుణ రచించి.. నటించారు. ఈ నాటికను చూసి మంత్రముగ్ధుడైన నటుడు ఎంఆర్ రాధా (నటి రాధిక తండ్రి) ఆయనకు కలైజ్ఞర్ బిరుదును ప్రదానం చేశారు. ఆ బిరుదే నేడు కలైజ్ఞర్...కలైజ్ఞర్ అంటూ ప్రజల మదిలో నిలిచిపోయింది. హెడ్మాస్టర్తో కొట్లాట తిరుక్కువలై గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్న కరుణానిధి.. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్లారు. అయితే ఆరో తరగతిలో సీటు ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయుడు కస్తూరి అయ్యంగార్ నిరాకరించారట. దీంతో ఆయనను బెదిరించి మరీ సీటు దక్కించుకున్నారట కరుణానిధి. తన తొలి పోరాటాన్ని ఆనాడే ప్రారంభించారాయన. చచ్చిపోయాడని వదిలేశారు.. 1945లో పుదుక్కోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి.. కవి భారతి దాసన్, కంచి కల్యాణ సుందరంతో కలసి వస్తున్న కరుణానిధిని ఓ ముఠా చుట్టుముట్టింది. శివగురు నాటికలో తమ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కరుణ మీద దాడి చేసింది. స్పృహ కోల్పోయిన కరుణను చూసి మృతి చెందారనుకుంది ఆ ముఠా. ఆయనను తీసుకెళ్లి ఓ బురద కుంటలో పడేసి వెళ్లిపోయింది. మరుసటి రోజు కరుణ మారువేషంలో పెరియార్ వద్దకు వెళ్లి జరిగింది వివరించారు. తర్వాత పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ పోరాటల్లో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ పోరాటంలో ప్రభుత్వ చట్టానికి సంబంధించిన ప్రతులను తగల పెట్టడంతో కరుణ మీద తొలి కేసు నమోదైంది. సొంతూరంటే ప్రాణం నాగపట్నం జిల్లాలోని తిరుకువలైలో కరుణ జన్మించారు. ఒకప్పుడు కుగ్రామమైన ఆ ఊరు.. ఇప్పుడు తాలుకాగా మారింది. చూడటానికి నేటికీ చిన్న గ్రామంగానే కనిపిస్తున్నా అక్కడ అభివృద్ధి ఘనమే. సొంత ఊరిలో ఆస్పత్రులు, విద్యాలయాలు నెలకొల్పారు కరుణ. అన్ని రకాల వసతులే కాదు, తాను పుట్టిన ఇంటినీ గ్రంథాలయంగా మార్చేశారు. అందుకే 2011, 2016 ఎన్నికల్లో సొంత గడ్డ నుంచి పోటీ చేసి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆరోగ్యంగా ఉన్నపుడు స్వస్థలానికి ఏడాదిలో ఒకటి రెండు సార్లయినా వెళ్లేవారు. తిరుకువలై నుంచి ఎవరొచ్చినా కరుణ నివాసం గోపాలపురం ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చిన్నతనం నుంచే అద్భుత వాగ్ధాటి 1924 జూన్ 3న తిరువారూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగమ్మ, దంపతులకు జన్మించిన కరుణానిధి అదే ఊరిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో అడుగుపెట్టారు. ఇక్కడ్నుంచే ఆయన పోరాట పటిమను అలవర్చుకున్నారు. 1938లో సహచర విద్యార్థులను వెంటేసుకుని హిందీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఓ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సహచర విద్యార్థులకు వాక్ చాతుర్యంపై పట్టు సాధించేందుకు శిక్షణ అందించారు. 1942లో తమిళ విద్యార్థి సంఘం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం తన వద్ద ఉన్న బంగారం చైన్‌ను కుదవపెట్టి మరీ వేడుకల్ని దిగ్విజయం చేశారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగంతో యువత, జనం మంత్రముగ్ధులయ్యారు. అదే ఏడాదిలో ద్రవిడనాడు మూడో వార్షికోత్సవానికి కరుణ రాసిన ఓ కవిత అందరి మన్ననల్ని అందుకుంది. రాజకీయ అరంగేట్రానికి ఈ కవితే నాంది పలికిందని చెప్పవచ్చు. తిరువాయూర్లో జరిగిన ఓ వేడుకకు హాజరైన అన్నాదురై ఈ కవితను చూసి అబ్బురపడ్డారు. కరుణను పిలిపించి మరీ అభినందించారు. అదే ఏడాది మురసోలి అనే మాసపత్రికను స్థాపించిన కరుణానిధి ‘చేరన్’ పేరిట వ్యాసాలు రాయడం మొదలెట్టారు. పెరియార్‌తో పయనం.. 1944లో తిరువారూరులోని బేబి టాకీస్‌లో పళనియప్పన్ అనే నాటిక ప్రదర్శనతో కరుణానిధి నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఈ నాటకాన్ని తానే రచించి దర్శకత్వం వహించారు. ఈ సమయంలో ఆరూర్‌లో జరిగిన ‘స్వీయ మర్యాద’ సంఘం వార్షికోత్సవానికి హాజరైన పెరియార్ దృష్టిలో పడ్డారు. మురసోలి పత్రికల్లో వస్తున్న కథనాల్ని చూసిన పెరియార్.. కరుణలో ఉన్న ప్రతిభను గుర్తించారు. అప్పట్నుంచి పెరియార్‌తో కలిసి వేదికలపై కరుణ ప్రసంగాలు సాగాయి. ఇదే రాజకీయాల వైపు అడుగులు పడేందుకు దోహదం చేసింది. అదే ఏడాది ద్రవిడ నటుల సంఘాన్ని ఏర్పాటు చేíయడంతో పాటు విల్లుపురంలో పళనియప్పన్ అనే నాటకాన్ని ప్రదర్శించి, అందులో ముఖ్య పాత్రను కరుణ పోషించారు. అదే ఏడాది పద్మావతి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. డీకే పార్టీలో చురుగ్గా.. 1945లో పుదుకోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి వస్తుండగా ఓ ముఠా కరుణపై దాడి చేసింది. ఈ ఘటన తర్వాత పెరియార్ వద్దకు వెళ్లి కరుణ జరిగిన విషయాన్ని వివరించారు. అదే రోజు నుంచి కరుణ జీవితం పూర్తిగా రాజకీయాలకు అంకితమైంది. పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ ఉద్యమాల్లో దూసుకెళ్లడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ ఆందోళనలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఓ చట్టానికి సంబంధించిన ప్రతులను తగలబెట్టారు. ఇందుకు కరుణపై తొలి కేసు నమోదైంది. 1946లో ద్రవిడ కళగం(డీకే) పార్టీ పతకానికి చిహ్నం రూపొందించిన కరుణానిధి తొలిసారిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియా శీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ‘రాజకుమారి’ చిత్రానికి కథ, మాటలు రాసి సినీరంగంపై కూడా దృష్టి పెట్టారు. పద్మావతి అమ్మాళ్ మరణానంతరం 1948లో దయాళు అమ్మాల్‌ను కరుణ రెండో వివాహం చేసుకున్నారు. 1949లో సేలం మోడరన్ థియేటర్లో రికార్డింగ్ సందర్భంగా అప్పటి నటుడు ఎన్ఎస్ కృష్ణన్‌తో ఏర్పడ్డ పరిచయం స్నేహింగా మారి సినీ రంగంలో స్థిరపడేందుకు కరుణకు మార్గాన్ని చూపింది. అదే ఏడాది మైనర్ అయిన మునియమ్మను పెరియార్ పెళ్లి చేసుకోవడంతో ద్రవిడ కళగం పార్టీలో చిచ్చు రగిలింది. డీఎంకే ఆవిర్భావం ద్రవిడ కళగం పార్టీలో వివాదం డీఎంకే ఆవిర్భావానికి దారి తీసింది. పెరియార్‌కు శిష్యుడిగా ఉన్న కరుణానిధి అన్నాదురై వెంట నడిచారు. అన్నాకు తమ్ముడిగా డీఎంకే ఏర్పాటుతో కరుణ పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతల్ని భుజాన వేసుకుని తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధాని రాజాజీకి వ్యతిరేకంగా నల్ల జెండా ఎగురవేసి అందరి దృష్టిలో పడ్డారు. తంజావురులో అప్పట్లో తుపాన్ బాధితుల్ని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా నిధుల్ని సేకరించారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు.. 1957లో జరిగిన ఎన్నికల్లో తిరుచ్చి జిల్లా కులితలై నియోజకవర్గం నుంచి పోటి చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రామనాథపురంలో జరిగిన డీఎంకే మహానాడులో ‘ఉదయ సూర్యన్’ (ఉదయించే సూర్యుడు) నాటకాన్ని రచించిన కరుణ ఆ తర్వాత ఓటమి అన్నది లేకుండా ముందుకు సాగారు. 1962లో తంజావూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన కరుణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 1963లో కరుణ ఉద్యమ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ అన్నాదురై ‘వీర’ కత్తిని బహూకరించారు. 1965లో అప్పటి భారత రక్షణ చట్టం కేసులో అరెస్టు అయిన కరుణను పాళయం కోట్టై జైల్లో బంధించారు. అక్కడ్నుంచే ఆయన కాంగ్రెస్ అరాచకాల్ని ఎండగడుతూ ‘కాగిత పువ్వు’ నాటకాన్ని రచించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో చెన్నై సైదాపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన్ను మంత్రి పదవి వరించింది. తొలిసారి సీఎంగా.. అన్నాదురై మరణంతో 1969 మార్చిలో తొలిసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పార్టీ రాష్ట్ర మహానాడులో డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీకి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు) నాటి పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో డీఎంకే పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. చెన్నై మెరీనా తీరంలో అన్నాదురై సమాధిని సుందరంగా తీర్చిదిద్దారు. 1971లో బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, రోమ్, అమెరికాలో పర్యటించి అక్కడి సభల్లో ప్రసంగించారు. అదే ఏడాది సైదాపేట నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికై, రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఒకే గూటిలో రెండు సింహాలు కరుణ(vs)ఎంజీఆర్ సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేను రాజకీయంగా పరుగులు పెట్టించిన కరుణానిధి.. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నేతృత్వంలోని అన్నాడీఎంకే పుట్టుకకూ పరోక్షంగా కారణమయ్యారు. డీఎంకేలో అన్నాదురై తర్వాత కరుణానిధికి అంతటి ప్రాధాన్యం ఉండేది. అయితే సినిమా హీరోగా అప్పటికే విపరీతమైన క్రేజున్న ఎంజీఆర్ అన్నాదురై సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై.. 1953లో డీఎంకేలో చేరి కోశాధికారి పదవి నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓసారి తిరుచ్చిరాపల్లిలో డీఎంకే బహిరంగ సభ జరిగింది. వేదికపై అన్నాదురై, కరుణానిధి తదితర ప్రముఖులున్నారు. అంతవరకు స్తబ్ధుగా ఉన్న జనం.. ఎంజీఆర్ రాగానే ఉత్సాహం ప్రదర్శించారు. తర్వాత నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు ఎంజీఆర్‌ను ‘ముజీబ్ ఆఫ్ తమిళనాడు’అని కీర్తించడం మొదలైంది. కానీ ఎంజీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కరుణకు ఇబ్బందిగా మారింది. ఒకే బోనులో (పార్టీలో) రెండు సింహాల్లా ఆధిపత్య పోరు మొదలైంది. క్రమేపీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 1969లో అన్నాదురై మరణం తర్వాత పార్టీ పగ్గాలు కరుణ చేతుల్లోకి రావడంతో మనస్పర్థలు మరింత పెరిగాయి. కరుణపై అవినీతి ఆరోపణలు చేయడమే గాక, 1972లో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని పార్టీ శ్రేణులకు ఎంజీఆర్ పిలుపునివ్వడంతో ఆయనను జనరల్ కౌన్సిల్ నుంచి కరుణ సస్పెండ్ చేశారు. ఇదే అదనుగా డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్.. 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. డీఎంకే పుట్టుకతో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోగా.. అన్నాడీఎంకే ఆవిర్భావంతో డీఎంకేకు గట్టి పోటీ మొదలైంది. ఎంజీఆర్ ఉన్నంత కాలం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ సాధించలేకపోయింది. ఎమర్జెన్సీలో కుప్పకూలిన ప్రభుత్వం 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో కరుణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో కరుణ.. ఇందిర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిసూ పెద్ద ఉద్యమాన్నే నడిపి జైలు పాలయ్యారు. తర్వాత కొత్త ఫ్రంట్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పార్టీ ఓటమి పాలైంది. 1989లో జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించడంతో 3వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1996 ఎన్నికల్లో చెన్నై చేపాక్కం నుంచి గెలుపొంది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చివరి రోజుల్లో... కరుణానిధి 2006 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఐదోసారి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఉచిత పథకాలతో ప్రజల్ని ఆకర్షించారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం కరుణకు నిరాశ మిగిల్చాయి. 2011 ఎన్నికల్లో అయితే ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. వయోభారంతో బాధ పడుతున్నా, అధికారం చేతిలో లేకున్నా, పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండేలా నిత్యం రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాలయానికి కరుణ వచ్చేవారు. చివరిసారిగా అక్టోబర్‌లో పార్టీ ఆఫీసుకు వచ్చారు. కరుణ ప్రస్థానమిలా.. ►1924 జూన్ 3 తిరుక్కువలైలో జననం ►1938 జస్టిస్ పార్టీలో చేరిక. తర్వాత ద్రవిడ కజగం పార్టీలోకి. ►1949 అన్నాదురైతో కలసి డీఎంకే స్థాపన ►1957కులితలై నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నిక. ►1967అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు. ►1969అన్నాదురై మరణం అనంతరం సీఎంగా .. ►1977అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే. 13 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కరుణ ►1989ఎంజీఆర్ మరణం. తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి డీఎంకే ►2001అవినీతి ఆరోపణలతో కరుణ, స్టాలిన్, మారన్‌లను అరెస్టు చేసిన జయలలిత ప్రభుత్వం ►2006 ఐదోసారి సీఎంగా ఎన్నిక ►2013తన వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించిన కరుణ -
సినిమాకు కరుణా ‘నిధే’
తమిళ సినిమా: కరుణానిధి.. కేవలం రాజకీయాల్లోనే కాదు తనదైన సృజనాత్మక కథా కథనాలతో తమిళ చలనచిత్ర రంగంలో విప్లవం తీసుకొచ్చిన ఘనత ఆయనది. కరుణానిధి ఒక్క తమిళులకే కాదు.. మన తెలుగు వారికీ గర్వకారణమే. ఎందుకంటే ఆయన తెలు గు జాతికి చెందిన వారు కావడమే. ఈయన అసలు పేరు దక్షిణామూర్తి. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై మక్కవ కలిగిన కరుణానిధి 14 ఏళ్ల వయసులోనే పాటలు పాడుతూ ద్రవిడవాదాన్ని ప్రచారం చేశారు. ఒక పక్క విద్యార్థి నాయకుడిగా ఉద్యమాలు చేస్తూనే.. మరో పక్క తన సినీ అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేశారు. పరాశక్తితో విప్లవం రాజకుమారి సినిమా(1947)తో సినీజీవితాన్ని ప్రారంభించిన ఆయన..తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. ఇక 1952లో ఆయన కథ, సంభాషణలను అందించిన పరాశక్తి చిత్రం తమిళ చిత్ర సీమలో పెను విప్లవం. ఈ చిత్రంలోని ఒక్కో పదం చురకత్తిలా స్వార్థ రాజకీయ వ్యవస్థను చీల్చి చెండాడింది. అంతేకాదు బ్రాహ్మణ కుల జాడ్యాన్ని ప్రస్తావించడంతో అనేక వివాదాల్లో చిక్కుకోవటంతో పాటు నిషేధాన్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు 1952లో విడుదలైన పరాశక్తి ద్రవిడ ఉద్యమానికి మరింత ఊపునివ్వటమే కాకుండా అఖండ విజయం సాధించింది. నడిగర్ తిలగం శివాజీగణేశన్, ఎస్ఎస్. రాజేంద్రన్ వంటి ఎందరో నటులు ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు. అనంతరం కలంపణం, తంగరధం వంటి చిత్రాల్లో వితంతు వివాహాలు, అంటరానితనం తదితర అంశాల్లో కరుణ తనదైన శైలిలో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీరంగంలో ఆయనను, ఎంజీఆర్, జయలలితలను మోడరన్ ధియేటర్ అధినేత టీఆర్ సుందరం ఎంతగానో ప్రోత్సహించారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, జయలలిత లాంటి ఎందరో ప్రముఖ నటీనటుల ఉన్నతికి కరుణానిధి కథ, కథనాలు, సంభాషణలు దోహదపడ్డాయి. ఇక, మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయ జీవితానికి కరుణ అందించిన సంభాషణలే కారణమన్నది జగమెరిగిన చరిత్ర. ఇటు సినీ, అటు రాజకీయ రంగంలో వారి మైత్రి ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. అందుకే తమిళ చిత్ర సీమకు కరుణను గొప్ప నిధిగా విశ్లేషకులు పేర్కొంటారు. సినీ సేవకు పట్టం చిత్ర పరిశ్రమకు చేసిన విశేష కృషికి గానూ ఆయనకు పలు అవార్డులు, బిరుదులు వరించాయి. 1971లోనే అన్నామలై విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది. తెన్‌పాండి సింగం నవలకు గానూ తంజావూర్ తమిళ విశ్వవిద్యాలయం రాజరాజన్ అవార్డుతో సత్కరించింది. ఆయన సీఎం అయ్యాక సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2006లో సినిమాలకు తమిళ పేర్లు పెడితే పన్ను మినహాయింపు ఇచ్చి పరిశ్రమను ప్రొత్సహించారు. వెండితెర అజరామరాలు తొలిసారిగా జూపిటర్ పిక్చర్స్‌లో స్క్రీన్‌ప్లే రైటర్ గా చేరిన ఆయన రాజకుమారి చిత్రానికి కథనాన్ని అందించారు. ఈ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈయన కథలతో నిర్మించిన చిత్రాలు తెలుగు తదితర భాషల్లో అనువాదమై విజయం సాధించాయి. ఆయన చివరగా 2011లో పొన్నార్శంకర్ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. -
అస్తమించిన ‘సూర్యుడు’
నిరంతరం ఆటుపోట్లతో, అడుగడుగునా సవాళ్లతో, అంతుచిక్కని సుడిగుండాలతో నిండి ఉండే రాజకీయ రంగంలో ఎనభైయ్యేళ్ల సుదీర్ఘకాలం తలమునకలై ఉండటం... అందులో యాభైయ్యే ళ్లపాటు తిరుగులేని నాయకుడిగా ప్రజానీకంపై తనదైన ముద్ర వేయటం అసాధారణం. మంగళ వారం తన 94వ ఏట కన్నుమూసిన ముత్తువేల్ కరుణానిధి అటువంటి అరుదైన చరిత్రను సొంతం చేసుకున్న అసాధారణ నాయకుడు. పెరియార్ రామస్వామి సారథ్యంలో ప్రారంభమైన అట్టడుగు కులాల ద్రవిడ ఆత్మ గౌరవ ఉద్యమం మద్రాస్ ప్రెసిడెన్సీని దావానలంలా చుట్టుముట్టిన తరుణంలో కళ్లు తెరిచిన కరుణానిధి పద్నాలుగేళ్ల వయసొచ్చేసరికి అందులో భాగస్వామిగా మారడమే కాదు... అనంతరకాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 48 ఏళ్ల వయసుకే ముఖ్య మంత్రి కావడం, చివరి వరకూ ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం గొప్ప విషయం. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్, ఆయనతో విభేదించి డీంఎకేను స్థాపించి ముఖ్యమంత్రి పదవిని అధి ష్టించిన అన్నాదురైల కోవకు చెందిన కరుణానిధి... వారికంటే ఒకడుగు ముందుకు వేయగలిగారు. ఉద్యమ దిగ్గజంగానే కన్నుమూసిన పెరియార్కుగానీ, సీఎం పదవిలోకొచ్చిన రెండేళ్లకే తనువు చాలించిన అన్నాదురైకుగానీ దక్కని అరుదైన అవకాశం కరుణానిధికి లభించింది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి తోడ్పడే అనేక పథకాలను ఆచరణలో పెట్టి వారి అభ్యున్నతికి కృషి చేయడం, పాల నాదక్షుడిగా రాణించడం కరుణానిధికి సాధ్యమైంది. దేశ ప్రజలందరికీ కళ్లజోడు లేని కరుణానిధిని ఊహించుకోవటం అసాధ్యం. దీంతోపాటు ఏ వేదికెక్కినా తీయని తమిళంలో తన అభిమానుల్ని ఉద్దేశించి ‘నా జీవితం కన్నా నేను మహోన్నతంగా భావించే నా సహో దరులారా...’ అంటూ ఆయన నోటి వెంబడి వెలువడే తొలి పలుకులు తమిళనాడు ప్రజానీకం అంతరాంతరాల్లో శాశ్వ తంగా నిలిచిపోతాయి. ఉద్యమాలనుంచి ప్రభవించే నాయకులకు అరుదైన ఉపన్యాస కళ సహజాభరణంగా ఒదుగుతుంది. బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేసిన ప్రచండ ద్రవిడ ఉద్యమంలో ఎదిగివచ్చిన నాయకుల సంగతి చెప్పేదేముంది? అంతేకాదు... వ్యాసరచన, కథ, కవిత్వం, నవల, నాటకం వగైరాల్లో ద్రవిడ ఉద్యమంలోనివారు పదునుదేరారు. అనం తరకాలంలో బలమైన మాధ్యమంగా రూపొందిన సినీ రంగానికి సైతం ఆ సంప్రదాయం విస్తరించింది. వీటన్నిటా కరుణానిధి చెరగని ముద్ర వేయగలిగారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్ వంటివారు తెరపై ఓ వెలుగు వెలిగి ఉండొచ్చు. కానీ వారికొచ్చిన ఆ కీర్తిప్రతిష్టల్లో సింహ భాగం కవిగా, కథా రచ యితగా, సంభాషణల రచయితగా పనిచేసిన కరుణకు దక్కుతుంది. ద్రవిడ ఉద్యమ పటిష్టతకు, బ్రాహ్మణేతర కులాల అభ్యున్నతికి రాజకీయ సమీకరణ కీలకమని గుర్తించి... అందుకు సినీ మాధ్యమాన్ని మించిన ఉపకరణం లేదని డీఎంకే గ్రహించటంలో ఆయన పాత్ర ఎన్నదగినది. కరుణానిధి తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణామూర్తి. లోకానికి ఆది గురువుగా హిందువులు భావించే శివుడి ప్రతిరూపమది. తాను పుట్టిన ఇసై వెల్లార్ (నాయీ బ్రాహ్మణ) కులా నికి దైవ సాన్నిధ్యంలో నిత్యం ఎదురవుతున్న వివక్షను చిన్ననాటినుంచీ గమనిస్తూ వచ్చిన దక్షిణా మూర్తి అనంతరకాలంలో ద్రవిడ ఉద్యమ భాగస్వామి కరుణానిధిగా, హేతువాదిగా రూపాంతరం చెందటం యాదృచ్ఛికం కాదు. ఆయన చిన్నతనంలోనే ‘మానవర్ నేసన్’ పేరిట రాత పత్రిక వెలు వరించారు. ఇరవైయ్యేళ్లకే సినీ రచయిత అయ్యారు. 33 ఏళ్లకే తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశిం చారు. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. ప్రజాదరణ పొందటంలో పార్టీకి అవాంతరాలు ఎదురై ఉండొచ్చుగానీ వ్యక్తిగతంగా కరుణానిధి ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు. సంక్షోభ సమయాల్లో సైతం నాయకుడన్నవాడు ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో ప్రతి రాజకీయవేత్తా కరుణానిధిని చూసి తెలుసుకోవాలి. డీఎంకేలో తన సహ భాగస్వామిగా ప్రయాణిస్తూ పార్టీకి జనాదరణను సమీకరించడంలో కీలక భూమిక పోషించిన ఎంజీ రామచంద్రన్‌ను సరిగా అంచనా కట్టడంలో... ఆయన్ను తన శిబిరం దాటిపోకుండా చూడ టంలో కరుణానిధి విఫలమై ఉండొచ్చు. ఎంజీఆర్ కేంద్రాన్ని ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించిన తీరు ఆయనను కలవరపెట్టి ఉండొచ్చు. ఎంజీఆర్ జీవించి ఉన్నంతవరకూ తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేకపోయి ఉండొచ్చు. అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టినప్పుడు, జయలలిత కక్షగట్టి అరెస్టు చేయించినప్పుడు తన భవితవ్యం ఏమవుతుందన్న సంశయం వచ్చి ఉండొచ్చు. కానీ ఈ సన్నివేశాలన్నిటా ఆయన నిలకడగా, నిబ్బరంగా ఉన్నారు. ఓపిక పట్టారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శ్రేణులు చెదరకుండా చూసుకున్నారు. కింది స్థాయి నాయకులతో నిరంతరం సంబంధాలు కొనసాగించారు. ఇవే ఆయన్ను తిరిగి అందలం ఎక్కించాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండింటితో ఆయన భిన్న సందర్భాల్లో సన్నిహితంగా మెలిగారు. అలాగని తమిళుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. కేంద్ర పాలకుల ముందు మోకరిల్లలేదు. కీలక మంత్రిత్వ శాఖలు డిమాండు చేసి, వాటిని సాధించుకుని తన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దారు. ఐటీలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కేలా చేశారు. 20 నెలలక్రితం మరణించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అన్నాడీఎంకే, ఆ పార్టీ ఏలు బడిలోని ప్రభుత్వం ప్రహ సనప్రాయమయ్యాయి. కానీ కరుణానిధి తన వారసుడు స్టాలిన్‌ను తీర్చి దిద్దారు. నిరుడు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే కరుణానిధి స్థాయిలో స్టాలిన్ నాయకత్వ పటిమను ప్రద ర్శించగలరా అన్నది వేచి చూడాలి. ద్రవిడ ఉద్యమం సృజియించిన దిగ్గజాల పరంపరలో కరుణ ఆఖరివారని చెప్పాలి. ఆయన కనుమరుగైనా తమిళ రాజకీయాలపై ఆయన ముద్ర ఎన్నటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. -
ముగిసిన ఓ మహా శకం
కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. 94 ఏళ్ల కవి, రాజకీయనేత మరణవార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యా లతో నడిస్తే బావుండేదని అనిపిస్తుంది. మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అణ్ణాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగ నున్నాయి. తమిళనాడును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘ఇళందు వా తలైవా ఇళందు వా’ (నాయ కుడా లేవండి, బయటకు రండి!). గత పది రోజులుగా చెన్నై కావేరీ ఆస్పత్రి వెలుపల ఉద్వే గపూరితంగా పిలిచిన మాటలివి. తమ నాయకుడిని మరి కొన్నేళ్లు బతికేలా చూడాలంటూ జనం దేవుణ్ని ప్రార్థించారు. కర్పూరం వెలిగిం చారు. జగమెరిగిన నాస్తికుడైన ముత్తువేల్ కరుణానిధి కోసం ఇలా అభి మానులు చేయడం విశేషమే. మంగళవారం నాయంత్రం 6.10 గంట లకు కరుణానిధి కన్నుమూశారు. 94 ఏళ్ల కవి, రాజకీయ నేత మరణ వార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఇదేమీ ఊహించనిది కాదు. కరుణ ఆరోగ్యస్థితిపై ముందు రోజు ఆస్పత్రి విడుదల చేసిన ప్రక టనలో ఆయన ఏ క్షణంలోనైనా కన్నుమూయవచ్చనే విషయం వెల్లడిం చారు. జయలలిత 2016 డిసెంబర్లో మరణించడానికి కొన్ని రోజులు ముందు కరుణ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎం.జి.రామచంద్రన్‌తో స్నేహం శత్రుత్వంగా మారడం, తర్వాత జయలలితతో బద్ధవైరం ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చి నట్టు కనిపించే విషయాలు. ఏడాదిన్నరగా కరుణానిధి ఇంటికే పరిమిత య్యారు. రాజకీయాల్లో చురుకుగా లేరు. డీఎంకేను పూర్తిగా నడిపిస్తు న్నది ఆయన కొడుకు ఎంకే స్టాలినే. ఆయన గొప్ప సినీ రచయిత. కానీ, మలుపులు, మార్పులతో నిండిన తన కథను వాస్తవం కన్నా మెరుగ్గా రాయగలిగేవారు కాదేమో! ‘రాజకుమారి’ సినీ జీవితం ఆరంభం! ఓసారి ఆయన జీవితంలో వెనక్కి వెళ్లి 1947లో ఏం జరిగిందో చూద్దాం. ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం ‘రాజకుమారి’ కథ కరుణానిధి రాశారు. మూడేళ్ల తర్వాత ‘మంత్రి కుమారి’ కథా రచయితగా హీరో పాత్రకు ఎంజీఆర్ పేరును ఆయన సిఫార్సు చేశారు. ఈ రెండు సిని మాలూ సూపర్ హిట్టవడంతో సినీరంగంలో కరుణ, ఎంజీఆర్‌కు ఎదు రులేకుండా పోయింది. కరుణానిధి 75కు పైగా చిత్రాలకు రచయిత. అయితే, సినీరంగంలో తనతోపాటు ఎదిగిన ఎంజీఆర్ డీఎంకేకు ప్రధాన ప్రచారకునిగా తనను మించిపోతారని కరుణ అప్పట్లో ఊహించలేదు. దీంతో నిరాశకు గురైన కరుణ తమిళ చిత్రరంగంలో ఎంజీఆర్‌కు పోటీగా తన పెద్ద కొడుకు ముత్తును ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఎంజీ ఆర్‌ను అనుకరించేలా చేయడానికి కూడా వెనుకాడలేదు. కానీ, ఈ ప్రయత్నంలో ముత్తు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఎంజీఆర్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి కరుణ జీర్ణించుకోలేకపోయారు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి పోయాక ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించారు. తన కృషి ఫలితంగా ఏర్పడిన సినీ ఇమేజ్‌తో ఎంజీఆర్ రాజకీయంగా ముందుకు దూసుకుపోవడం కరుణానిధికి చికాకు పుట్టిం చింది. అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏడీఎంకే) అనే పేరుతో ఎంజీఆర్ పార్టీ పెట్టగానే, దాన్ని నడిగర్ కచ్చి అంటే నటుడి పార్టీ అని కరుణ పిలిచేవారు. ఎంజీఆర్ సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదని చెబుతూ నటులు రాజకీయాలకు మంచిది కాదని ప్రచారం చేయడానికి పాటలు కూడా ఆయన రాశారు. ‘సినిమా సోరు పోడుమా’ (సినిమా కూడు పెడు తుందా?) అనే పాటల పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. ఎంజీఆర్ అభియోగాలతో కరుణ బర్తరఫ్ కరుణానిధిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంజీఆర్ ఆయన ప్రభు త్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్రానికి మెమొరాండం సమర్పించారు. 1976 జనవరిలో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసి, ఆరోపణలపై దర్యాప్తునకు జస్టిస్ సర్కారియా కమిషన్ నియమిం చింది. 1976–89 మధ్యకాలం కరుణానిధికి నిజంగా కష్టకాలం. అధి కారం లేకుండా డీఎంకేపై తన పట్టు సడలకుండా, పార్టీ కార్యకర్తలు నిస్పృహకు లోనుకాకుండా ఆయన పట్టుదలతో కృషిచేశారు. అయితే, కరుణానిధిని ఊపిరి సలపనీయకుండా చేశారు ఎంజీఆర్. 1984లో కరుణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక, శాసనమండలి రద్దుకు ఎంజీఆర్ తమి ళనాడు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. పైకి ‘మండలి’ వల్ల అనవ సర ఖర్చని చెప్పినాగాని, కరుణకు మాట్లాడటానికి వేదిక లేకుండా చేయ డమే ఎంజీఆర్ ఉద్దేశమని డీఎంకే భావించింది. ఎన్నికల విజయాల విషయానికి వస్తే, దేశంలో కరుణే అగ్రస్థానంలో నిలబడతారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమేగాక 1957 నుంచి 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక్క 1984లోనే ఆయన పోటీచేయలేదు. అయితే, రాజకీయాల్లో తనకంటే జూనియర్లయిన ఇద్దరు తనను పదవి నుంచి తొలగించగలగడం కరుణానిధిని బాధించింది. 1976లో తనను బర్తరఫ్ చేశాక ఎంజీఆర్ బతికున్నంత వరకూ ఆయన మళ్లీ ముఖ్య మంత్రి కాలేకపోయారు. 1987లో ఎంజీఆర్ కన్నుమూశాకే కరుణకు మళ్లీ అధికారం దక్కింది. అలాగే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత రెండోసారి వరుస విజయం సాధించి కరుణానిధిని చివరిసారి సీఎం కాకుండా అడ్డుకున్నారు. జయలలితపై వ్యక్తిగత విమర్శలు జయలలిత రాజకీయాల్లోకి రాగానే డీఎంకే ఆమెపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడింది. 1982లో కడలూరులో జరిగిన ఏడీఎంకే మహాసభలో జయ తొలి రాజకీయ ప్రసంగం వినడానికి ఊరు ఊర ంతా తరలివచ్చిందని జయలలిత జీవిత చరిత్ర రాసిన వాసంతి పేర్కొన్నారు. ‘జనం అందమైన ముఖాన్ని చూడటానికి వచ్చారుగాని నిప్పులు చెరుగుతూ చేసిన జయ ఉపన్యాసం విన్నారు’ అని వాసంతి రాశారు. డీఎంకే పార్టీ దినపత్రికలో మాత్రం జయ రాజకీయప్రవేశాన్ని ‘కడలూర్ కేబరే’ అని ఎగతాళి చేసింది. 1989లో తమిళనాడు అసెంబ్లీ లోపల జరిగిన అవమా నకరమైన సంఘటన వారిద్దరి మధ్య సంబంధాలను శాశ్వతంగా క్షీణిం చేలా చేసింది. పాలకపక్షమైన డీఎంకే తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని జయ ఆరోపించారు. వెంటనే సీఎం పదవిలో ఉన్న కరుణానిధి ఆమె నుద్దేశించి చేసిన అసభ్య వ్యాఖ్య ఆమెకు ఆగ్రహం తెప్పించింది. తర్వాత కరుణ మాటలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం సభలో జరిగిన గందరగోళంలో డీఎంకే నేత దురైమురుగన్ జయ చీర లాగ డానికి ప్రయత్నించారు. మరుసటి ఎన్నికల్లో విజయం సాధించే వరకూ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని ఆగ్రహంతో జయలలిత శపథం చేశారు. పురుషాధిక్యాన్ని అణచివేస్తానని కూడా చెప్పారు. 1991లో డీఎంకేకు ఘోర పరాజయం! 1991లో కరుణానిధికి గడ్డుకాలం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో 225 సీట్లతో జయలలిత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుబెట్టారు. డీఎంకే నాయకత్వంలోని కూటమికి దక్కింది ఏడు సీట్లే. ఏడీఎంకే కూటమికి 59.8 శాతం ఓట్లు రాగా, డీఎంకే కూటమికి లభించినవి 30 శాతమే. దీంతో అసెంబ్లీకి హాజరయ్యేకంటే శాసనసభ్యత్వానికి రాజీ నామా చేయడం మేలని భావించి కరుణ ఆ పని చేశారు. 1989లో జయపై జరిగిన దాడికి ప్రతీకారంగా అసెంబ్లీలో తనపై ఏఐఏడీఎంకే దాడిచేయవచ్చనే అనుమానంతో కరుణ అసెంబ్లీకి రాజీనామా చేశారని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతారు. ఇద్దరు నేతల మధ్య వైరం అంతటితో ఆగలేదు. 1990ల చివర్లో అవినీతి ఆరోపణలపై జయ లలితను కరుణానిధి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. తర్వాత అధికా రంలోకి వచ్చిన జయలలిత 2001లో ఫ్లైఓవర్ కేసులో అర్ధరాత్రి కరు ణానిధిని అరెస్ట్ చేయించి పగ తీర్చుకున్నారు. ఇలా పగ, ప్రతీకారాలతో వారి రాజకీయాలు విద్వేషపూరితంగా మారాయి. వారిద్దరి మధ్య రాజ కీయ శత్రుత్వానికి ముగింపు లేకుండా పోయింది. పదిహేనేళ్ల తర్వాత కూడా కరుణానిధి కుటుంబంపై జయ కోపం తగ్గలేదు. 2016లో ముఖ్య మంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ కార్యక్రమా నికి డీఎంకే తరఫున హాజరైన కరుణానిధి కొడుకు ఎం.కె.స్టాలిన్‌కు ముందు వరుసలో కూర్చునే అవకాశం ఆమె ఇవ్వలేదు. వాస్తవానికి 89 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని డీఎంకే ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ జయ లలిత స్టాలిన్‌కు తగిన స్థానంలో కూర్చునే అవకాశం కల్పించలేదు. ఇది ‘ఉద్దేశపూరితంగా చేసిన అవమానం’ అంటూ కరుణ ఆగ్రహంతో, ‘‘జయలలిత మారలేదు. ఎప్పటికీ ఆమె మారదు,’’ అని దుయ్యబ ట్టారు. దీంతో స్టాలిన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని జయలలిత వివరణ ఇచ్చుకున్నారు. కరుణపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం! పైకి బద్ధ రాజకీయ శత్రువులుగా కనిపించినా కరుణానిధిపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని ఇద్దరితో సాన్నిహిత్యం ఉన్నవారు చెబు తారు. అందుకే కరుణానిధిని ఎవరైనా పేరు పెట్టి ప్రస్తావిస్తే వారిని ఎంజీఆర్ కోప్పడేవారని అంటారు. కరుణను ‘కళైంజ్ఞర్’ (కళాకారుడు) అని పిలవాలని ఎంజీఆర్ గట్టిగా చెప్పేవారు. ఎంజీఆర్ మరణించిన ప్పుడు ఆయన నివాసానికి మొదట వెళ్లింది కరుణానిధే కావడం విశేషం. కరుణ ఓదార్చలేని స్థాయిలో కన్నీరు కారుస్తూ విలపించారు. సముద్ర తీరంలోని మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అణ్ణాదురై, ఎంజీ ఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగు తాయని చెప్పారు. తమిళనాడు భవిష్యత్తును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యాలతో నడిస్తే బావుండేదని మాత్రం మనకు అనిపిస్తుంది. వ్యాసకర్త : టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు -
కరుణ అంత్యక్రియలు ఎక్కడ?
సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్‌లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. ప్రజాజీవితాన్ని మరిచారా?: స్టాలిన్ కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్ లేఖ రాశారు. సీఎం పళనిస్వామికి రాసిన ఈ లేఖలో.. కరుణానిధి రాజకీయ గురువైన అన్నాదురై స్మారకం పక్కన మౌజోలియం కాంప్లెక్స్ లోపల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలన్నారు. కరుణ మృతికి కొద్ది గంటల ముందు సీఎంను స్టాలిన్ కలిశారు. అటు, ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా మెరీనా బీచ్‌లో కరుణ స్మారకానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేవని న్యాయమూర్తికి డీఎంకే తరఫు లాయర్ వెల్లడించారు. సీఆర్‌జెడ్ (కోస్ట్ రెగ్యులేషన్ జోన్) పరిధిలోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదని న్యాయమూర్తికి ఆయన తెలిపారు. అన్నా సమాధి ఉన్న స్థలం కోస్టల్ జోన్ పరిధిలో లేదని, అది కూవం నదీ తీరంలో ఉన్నట్టు వివరించారు. అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా తీరంలోని అన్నా సమాధి పక్కనే కేటాయించాలని కోరారు. అయితే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలుచేసిన పిటిషన్‌తో చిక్కులున్న కారణంగా న్యాయమూర్తి ముందు వాదనలు జోరుగా సాగాయి. (మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు తమిళసర్కారు నో చెప్పడంతో బీభత్సం సృష్టిస్తున్న కార్యకర్తలు) చిక్కులు తొలగిపోలేదు: ప్రభుత్వం మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం కుదరదని.. మాజీ ముఖ్యమంత్రులైన చక్రవర్తి రాజగోపాలచారి, కే కామరాజ్‌ల స్మారకాలున్న గిండీ ప్రాంతంలోని గాంధీ మండపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుతవం వెల్లడించింది. కరుణానిధి సిట్టింగ్ సీఎం కానందునే మెరీనాబీచ్‌లో అంత్యక్రియలకు అనుమతిచ్చేందుకు పళనిస్వామి నిరాకరించారని తెలిసింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా ఉంటూ కన్నుమూసినందుకే వారికి సముద్రం ఒడ్డున స్మారకం నిర్మించారు. ఎంజీఆర్, జయలలితలు కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న కార్యకర్తలు ఆగ్రహంతో బారికేడ్లు తెంచుకుని రోడ్లపైకి పరిగెత్తారు. పరిస్థితి చేయిదాటుతుందని ఊహించిన పోలీసులు డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టారు. మెరీనాలోనే కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కార్యకర్తలు చెన్నై నగరంలో పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు. మమతా బెనర్జీ నివాళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి చేరుకుని కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. సినీనటుడు రజనీకాంత్ కూడా కరుణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కరుణ మృతికి సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం చెన్నైకి రానున్నారు. ప్రముఖుల సంతాపాలు ‘కరుణానిధి మరణం చాలా బాధించింది. ప్రజానేతగా, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వామిగా కీలకపాత్ర పోషించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయాభివృద్ధికి కరుణ తన జీవితాన్ని అంకితం చేశారు’ –రాష్ట్రపతి కోవింద్ ‘దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రముఖ నాయకుడు కరుణానిధి. ఆయన మరణం తీవ్ర విచారకరం. మొత్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 56 ఏళ్లపాటు ఆయన తమిళనాడు శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. ఐదుపర్యాయాలు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు’. –ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘కలైజ్ఞర్ కరుణానిధి ఇక లేరనే వార్త బాధాకరం. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఆయనొకరు. ఓ బలమైన మాస్‌లీడర్, గొప్ప ఆలోచనాపరుడు, మంచి రచయిత, పేదలు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను కోల్పోయాం’ –ప్రధాని మోదీ ‘తమిళ ప్రజలకు కరుణానిధి అంటే ఎంతో ప్రేమ. ఆరు దశాబ్దాలపాటు ఆయన తమిళ, దేశ రాజకీయాలకు విశేష సేవలందించారు. ఆయన మరణంతో దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయన మరణానికి చింతిస్తున్న కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ –కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కరుణానిధి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు, కలైజ్ఞర్ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆయన కళా రంగంలోనూ రాణిస్తూ, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు’ – తమిళనాడు సీఎం పళనిస్వామి ‘కలైజ్ఞర్ మృతి మరచిపోలేనిది. నా జీవితంలో ఇదో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’.–ప్రముఖ నటుడు రజనీకాంత్ గొప్ప మానవతావాది: గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గొప్ప పరిపాలనా దక్షుడిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి గొప్ప మానవతావాది అని నరసింహన్ పేర్కొన్నారు. భారత రాజకీయ రంగానికి తీరని లోటు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, క్రియాశీల నాయకుడిగా సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌కు కరుణానిధి మరణం వార్త తెలియగానే సంతాపం ప్రకటించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధిది ఒక విశిష్ట స్థానమని, సినిమా రచయితగానే కాకుండా ద్రవిడ రాజకీయాలను శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణ అని జగన్ కొనియాడారు. -
కరుణానిధి మృతికి సినీ ప్రముఖుల సంతాపం
మోహన్‌బాబు: కరుణానిధిగారి మరణం తీరని లోటు. ఆయన నిజమైన లెజెండ్. ఆయన తన పథకాలతో లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేశారు. ఎంతోమందికి జీవితంపై ఆశ పుట్టించారు. తన రచనతో లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సోదరులు స్టాలిన్, అళగిరి.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. రజనీకాంత్: ఇదొక బ్లాక్ డే. ఈ రోజును నేను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. కరుణానిధిగారి ఆత్మకు భగవంతుని సన్నిధిలో శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రమ్యకృష్ణ: ఈ భూమిపై నుంచి నింగికేగిన వారంతా మనల్ని వదిలి వెళ్లినట్లు కాదు. వాళ్లు మన హృదయాల్లో, ఆలోచనల్లో ఎప్పుడూ జీవిస్తుంటారు. కరుణానిధిగారి ఆత్మకు శాంతి చేకూరాలి. విశాల్: కరుణానిధి అయ్య మరణం తీరని లోటు. గొప్ప నాయకుడైన ఆయన ఇక లేరు అనే విషయం నన్ను ఎంతో బాధిస్తోంది. సినీ, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. విష్ణు: కరుణానిధిగారి మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, తమిళ సోదర, సోదరీమణులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. రాధిక: ఇది నిజంగా మాకు చీకటి రోజు. నా మనసంతా ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల కోసం ఎంతో పోరాడారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మనతో లేకున్నా ఆయన సంకల్పం ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది. ఖుష్బూ: నెల క్రితం నేను ఆయనతో కలిసి ఫొటో దిగాను. గొప్ప నాయకుడైన ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మేం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అప్పా (నాన్నా). రితేష్ దేశ్‌ముఖ్: ఈరోజు భారతదేశం ఓ గొప్ప నాయకుణ్ని కోల్పోయింది. కరుణానిధి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవ అపారమైనది. మాధవన్: రచయిత, డైనమిక్ నాయకుడు కరుణానిధిగారు కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ప్రసన్న: ద్రవిడ ఉద్యమ మూల స్తంభం కరుణానిధిగారు. డీఎంకే అధినేతగా 50 ఏళ్లు కొనసాగిన ఆయన మరణం తీరని లోటు. హన్సిక: దేశంలోనే గొప్ప నాయకుడైన కరుణానిధిగారు లేని లోటును జీర్ణించుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, తమిళులకు ఆ దేవుడు ప్రసాదించాలి.