
చెన్నై చేరుకున్న కేసీఆర్ బృందం..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు వెళ్లిన కేసీఆర్ 1.30 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, వినోద్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. డీఎంకే నేతలతో కీలక భేటీ అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు కేసీఆర్ బృందం చేరుకుంటుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30కు ప్రగతి భవన్ చేరుకుంటారు. త్వరలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో భేటీ కానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment