Federal Front
-
సొంత పార్టీ భవిష్యత్తుపైనే ఆందోళన..ఇంకా ఫెడరల్ ఫ్రంటా?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో సొంత పార్టీ భవిష్యత్తుపైనే సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో థర్డ్, ఫెడరల్ ఫ్రంట్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు’అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురవుతోందని, ఆ పార్టీలో త్వరలోనే అంతర్గత తిరుగుబాటు రావొచ్చని జోస్యం చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆలోచనల మేరకు ఫెడరల్ ఫ్రంట్‌ను కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. ఆ ఫ్రంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నదే కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ ప్రధాని మోదీ ఏజెంట్. సెక్యులర్ పార్టీలు గమనించాలి’అన్నారు. తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో కలిపేస్తున్న కేసీఆర్.. తమిళనాడుకు దేవాలయాల్లో పూజలు చేసేందుకు వెళ్లారా? ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో రాజకీయ చర్చలు జరిపేందుకు వెళ్లారా స్పష్టం చేయట్లేదని విమర్శించారు. నేరుగా స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్తే ఆయన బీజేపీ ఏజెంటని బట్టబయలు అవుతుందనే ఆలయాల సందర్శన పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తమిళనాడు పర్యటన రాజకీయ పరమైనదా? మతపరమైనదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పాపాలు కడిగేసుకోవాలనే.. దేవాలయాలను సందర్శించడం ద్వారా తన పాపాలను కడిగేసుకోవాలని సీఎం భావిస్తున్నారని.. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా రైతులను మోసం చేసి క్షమాపణలు చెప్పుకునేందుకు దేవాలయాలు తిరుగుతున్నారని రేవంత్ విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగేందుకు కేసీఆరే కారణమన్నారు. వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేక రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో 421లోని నిబంధనల ప్రకారం రూ. 6 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆశ కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతుల హక్కులు కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. -
కమలం కట్టడికి కలసికట్టుగా..
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ద్వారా సుదీర్ఘకాలం అధి కారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దీనిపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీని అడ్డుకోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడం అవసరం’’ అని తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసినట్టు తెలిసింది. తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. మంగళవారం సాయం త్రం చెన్నైలో స్టాలిన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జాతీయ, ప్రాం తీయ అంశాలపై వారు మాట్లాడుకున్నారు. దేశం లో బీజేపీ, కాంగ్రెస్ ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్న కేసీఆర్.. రాష్ట్రా ల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని స్టాలిన్‌తో పేర్కొన్నట్టు సమాచారం. అధికార బలాన్ని ఉపయోగిం చి బలమైన ప్రాంతీయపార్టీలను దెబ్బతీయడం ద్వారా సుదీర్ఘకాలం అధికారంలో ఉండా లని కుట్ర లు చేస్తోందని ఆరోపించినట్టు తెలిసింది. బీజేపీ ఓ పెద్ద ప్రాంతీయ పార్టీ అని, దక్షిణాదిలో బీజేపీకి బలమే లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బలపడకుండా ఏవిధంగా అడ్డుకోవాలనే అంశంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ చెక్ పెట్టడానికి ఏ విధమైన వ్యూహం అనుసరించాలన్న దానిపైనా ఇరువురు సీఎంలు చర్చించినట్టు సమాచారం. బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా.. రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలతో సంబంధం లేకుండా తన ఎజెండాను రుద్దేందుకు ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ మండిపడినట్టు తెలిసింది. బీజేపీని విమర్శించిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందన్న విషయాన్నీ లేవనెత్తినట్టు సమాచారం. సెక్యులరిజం, సోషలిజం స్ఫూర్తికి బీజేపీ తూట్లు పొడుస్తోందని.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే దేశం బీజేపీ వంటి శక్తుల చేతుల్లోకి వెళితే విచ్చిన్నమై ఉండేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు ఏకమై బీజేపీ విధానాలను అడ్డుకోవడం ద్వారా.. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్టు సమాచారం. జాతీయ అంశాలు.. సంస్థాగత నిర్మాణం దేశంలో అపార వనరులున్నా వాటిని సద్వినియో గం చేసుకుని, సంపద పెంచే దిశగా ప్రయత్నాలు జరగడం లేదని స్టాలిన్‌తో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా నదీజలాలు వృ«థాగా సముద్రంలో కలుస్తున్నాయని, నీటిని సరిగా వినియోగించుకోలేనిస్థితి నెలకొందని అన్నట్టు తెలిసింది. నదుల అనుసంధానం ద్వారా ఉత్తర, దక్షిణ భారత దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సుసంపన్నమయ్యే అవకాశం ఉందని.. ఆ దిశగా టీఆర్ఎస్, డీఎంకే తీసుకోవాల్సిన చొరవపై చర్చించినట్టు సమాచారం. ఇక దశాబ్దాల క్రితం ఆవిర్భవిం చిన డీఎంకే నేటికీ రాజకీయాల్లో క్రియాశీలశక్తిగా ఉండటం వెనుక జరిగిన కృషిని కేసీఆర్ ప్రశంసించారని.. సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణంపై ఆరా తీశారని తెలిసింది. డీఎంకే సంస్థాగత నిర్మాణాన్ని అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సారూప్యతలు, రాజకీయ పరిస్థితులు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. మీడియాతో మాట్లాడకుండానే.. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు స్టాలిన్, కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తొలుత సంకేతాలు వచ్చాయి. కానీ భేటీ తర్వాత కేసీఆర్ నేరుగా హోటల్‌కు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి చెన్నైలోనే బస చేసిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి రండి సాక్షి, చెన్నై: వచ్చే ఏడాది మార్చిలో జరిగే యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలను వివరించారు. పురాతన గుడులు, గోపురాలతో తమిళనాడు ఆధ్యాత్మిక పర్యాటకానికి చిరునామాగా ఉందని, అదే తరహాలో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఇరువురి కుటుంబాలు కలిసి..: మంగళవారం సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభ, తనయుడు, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, మనవడు, మనవరాలు, ఎంపీ సంతోష్‌కుమార్ కలిసి చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి స్టాలిన్, ఆయన భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధి సాదరంగా ఆహ్వానం పలికారు. కేటీఆర్‌కు ఉదయనిధి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు, స్టాలిన్ కుటుంబ సభ్యులు కొంతసేపు మాట్లాడుకున్నారు. -
స్టాలిన్‌తో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత
సాక్షి, చెన్నై/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో భేటీకానున్నారు. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం.. రైతులు, వ్యవసాయ అంశాలపై దేశవ్యాప్త పోరాటం చేస్తామని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే ఇతర బలమైన రాజకీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? అందులో భాగంగానే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారా? అన్న చర్చ మొదలైంది. ఇటు సీఎం పర్యటన.. అటు పల్లా వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని కేసీఆర్ ప్రకటించారు. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రంగనాథ స్వామిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ నెహ్రూ, అధికారులు కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాంశు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యా మ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని కేసీఆర్ ప్రకటించారు. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రంగనాథ స్వామిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ నెహ్రూ, అధికారులు కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం యాదాద్రి ఆలయ పునఃప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజు ల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. -
కేసీఆర్, స్టాలిన్ భేటీపై ఆందోళనలో చంద్రబాబు
-
స్టాలిన్, కేసీఆర్ భేటీ ; చంద్రబాబు ఆందోళన..!
సాక్షి, అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో సోమవారం భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై గంటపాటు సమగ్రంగా చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి కలుద్దామని కోరారు. స్టాలిన్ తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెప్పారు. ఇక స్టాలిన్, కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో డీఎంకే వైఖరేమిటో తెలుసుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే, కోశాధికారి దురై మురుగన్‌తో ఏపీ సీఎం మంగళవారం సమావేశమైనట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భేటీ అయినప్పుడు చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. అప్పట్లో బీజేడీ ఎంపీని రప్పించుకుని వివరాలు కనుగొన్నారు. (చదవండి : కేసీఆర్‌తో మంతనాలు.. స్టాలిన్ మరో ట్విస్ట్!) ఇదిలాఉండగా.. స్టాలిన్, కేసీఆర్ మధ్య భేటీ సక్సెస్ అయిందనీ ఫెడరల్ ఫ్రంట్ విషయమై డీఎంకే పార్టీ సానుకూలంగా స్పందించిందనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఫెడరల్ ఫ్రంట్‌కు స్టాలిన్ తలుపులు మూసేశాడని, బీజేపీతో దోస్తీ కడుతున్నాడని తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీజేపీతో దోస్తీ దిశగా స్టాలిన్ అడుగులు వేస్తున్నారన్న కథనాలు నేపథ్యంలో ఆయన బీజేపీతో చర్చలు జరిపిన విషయం వాస్తవమేనని ఆ పార్టీ తమిళనాడు చీఫ్ తమిళ సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. అయితే, బీజేపీతో డీఎంకే జట్టు కడుతుందనే వార్తలపై ఆ పార్టీ ఫైర్ అయింది. బీజేపీ-డీఎంకే కలవడం అనేది.. ఈ ఏడాది బెస్ట్ కామెడీ అని డీఎంకే ఎమ్మెల్యే ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : కేసీఆర్, స్టాలిన్ భేటీపై ఆందోళనలో చంద్రబాబు -
స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
-
స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం
సాక్షి, చెన్నై : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇవాళ సాయంత్రం చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. స్టాలిన్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సాదరంగా స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు, టీఆర్ఎస్ నేతలు సంతోష్, వినోద్ పాల్గొన్నారు. కాగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. గతంలోనూ కరుణానిధితో కేసీఆర్ భేటీ అయ్యారు కూడా. ఇప్పటికే కేరళ సీఎం విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ -
డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీకానున్న కేసీఆర్
-
రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్
సాక్షి, చెన్నై : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రస్తుతం రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో ప్రసిద్ధ గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. ప్రత్యేక పూజలో స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వాహకుల నుండి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈనెల 13న డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌ను కేసీఆర్ కలవనున్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ సాధ్యపడకపోవచ్చుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉప ఎన్నికల్లో బిజీ.. అందుకే!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ బిజీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకే మే 13న కేసీఆర్‌తో సమావేశానికి స్టాలిన్ అందుబాటులో ఉండడం లేదని తెలిపాయి. తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా పైచేయి సాధించడంపై దృష్టిపెట్టిన స్టాలిన్.. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానాల్లో డీఎంకే గెలిస్తే.. అధికార అన్నాడీఎంకే ప్రభుత్వానికి అసెంబ్లీలో అవసరమైనంత మెజారిటీ తగ్గనుంది. అందుకే స్టాలిన్ సీరియస్‌గా తీసుకుని ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ కారణంతోనే సీఎం కేసీఆర్‌ను కలవలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది సీఎం కేసీఆర్ చెన్నైకు వచ్చిన సమయంలో డీఎంకే దివంగత అధినేత ఎం.కరుణానిధితో గోపాలపురంలో భేటీ అయ్యారు. తర్వాత అళ్వార్‌పేటలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కొన్ని గంటల పాటు సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ రద్దు!
చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని తెలిపాయి. పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీఎంకే వర్గాలు నిరాకరించాయి. చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చిస్తారని పేర్కొంది. తాజాగా డీఎంకే పార్టీ వర్గాల ప్రకటనతో భేటీపై సందిగ్ధం నెలకొంది. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడం ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏప్రిల్ 18న తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే జట్టు కట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌తోనే ముందుకు సాగాలన్న భావనతో డీఎంకే ఉన్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన కేసీఆర్‌తో చర్చలు జరిపితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ సీఎంతో భేటీకి దూరంగా ఉండాలని స్టాలిన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే గుణాత్మక మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. -
‘సమాఖ్య’తోనే దేశాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాల హక్కులను కాపాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను విస్మరించాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల పాలనలో దేశం అభివృద్ధి చెందడం లేదని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్‌హౌస్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమై గంటన్నర పాటు చర్చలు జరిపారు. వేసవి విడిదిలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఆయన కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సందర్భంగా అక్కడి సీఎంను కలుసుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛమిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్. చిత్రంలో ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సరళి, ఎన్నికల తదనంతర పరిణామాలు, ఫెడరల్ కూటమి ఏర్పాటు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్రాలకు పన్నుల వాటా చెల్లించడంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాలు పోరాడాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై 15వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా గురించి కేరళ సీఎంకు కేసీఆర్ వివరించారు. ఈ భేటీలో సీఎంతో పాటు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసి వస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు అనంత పద్మనాభుడికి పూజలు కేరళ సీఎంతో భేటీకి ముందు కేసీఆర్.. అనంత పద్మనాభస్వామిని దర్శించు కున్నారు. సతీమణి శోభ, మనుమడు హిమాంశు, మనువరాలు అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వ దించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌కు తిరువనంతపురం విమానాశ్రయంలో తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 13న చెన్నైలో స్టాలిన్‌తో భేటీ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు కేరళలోనే గడపనున్నారు. అక్కడి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 13న తమిళనాడుకు బయలుదేరి వెళ్లనున్నారు. 13న సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతర పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా, కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ పర్యటనలో వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. -
16 సీట్లలోనూ మాదే గెలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని... కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై అందరితో మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తేనే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసినట్లుగా భావించవద్దన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోతుందని, మరికొన్ని చోట్ల మూడో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా లాభం ఉండదన్నారు. తెలంగాణ సమాజంలో బీజేపీకి స్థానం లేదని, రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌లో టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ వస్తుందని, ఆ తర్వాత రెండో స్థానంలో వరంగల్, మూడు లేదా నాలుగో స్థానంలో కరీంనగర్ ఉండొచ్చన్నారు. సెటిలర్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లకుండా ఉండి ఉంటే టీఆర్ఎస్కు ఇంకా మెజారిటీ పెరిగేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రగతికి ఆటంకం కాకూడదనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మే 23లోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ చెప్పారు. అన్ని ఎన్నికలు ముగిస్తే నాలుగున్నరేళ్లు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రెవెన్యూఉద్యోగుల్లో అత్యధికులు మంచివారే అవినీతిని పారద్రోలాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకొస్తోందని కేటీఆర్ తెలిపారు. పటిష్టమైన మున్సిపల్ చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అందువల్ల మున్సిపల్ ఎన్నికలు మే నెల తర్వాతే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల్లో సింహ భాగం మంచివాళ్లేనని, అయితే కొద్దిమంది ఉద్యోగులవల్ల ఉద్యోగులందరికీ చెడ్డపేరు రావడం మంచిది కాదన్నారు. పంచా యతీ ఎన్నికలు ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినట్లా? ‘తెలంగాణలో ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో దేశమంతా చూసింది. పక్క రాష్ట్రంలో (ఏపీ) ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా ఉందో అర్థమవుతోంది. టెక్నాలజీ నా వల్లే వచ్చిందని చెప్పే చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించడం హాస్యాస్పదం. చంద్రబాబువి సిల్లి కామెంట్స్. 2014లో ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పని చేసినట్లా? పెడబొబ్బలు పెట్టడం చంద్రబాబుకే మంచిది కాదు. ఆయన తీరుతో టీడీపీ కార్యకర్తలు సైతం తమకు ఓటమి తప్పదని అంగీకరిస్తున్నారు. మే 23న ఏం జరుగుతుందో తేలిపోతుంది. ఒకవేళ పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలపై ఇప్పుడు చేసిన ఆరోపణల సంగతి ఏమిటి? సమాచారం ఎస్సెమ్మెస్ ద్వారా పంపితే ఏమిటి? లేఖ ద్వారా పంపితే ఏమిటి? ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరిగితే ఏమిటి? ఈవీఎంల ద్వారా జరిగితే ఏమిటి? రెండు రోజుల్లో తెలంగాణ పోలింగ్ పర్సెంటేజీలు మారాయన్న ఆరోపణలు సరికాదు. పదేళ్ల నుంచి చూడండి. పోలింగ్ శాతం వివరాలు ప్రతిసారీ రెండో రోజు మారుతుంటాయి. మొదటి రోజు పోలింగ్ వివరాలు దాదాపుగా అంటారే తప్ప కచ్చితంగా అం దవు. ఏ ఒక్క పథకంతో పార్టీలు అధికారంలోకి రావు. బహుళ అంశాలు ప్రభావం చూపుతాయి (పసుపు కుంకుమ, మహిళలు టీడీపీకి ఓటేశారన్న అంశంపై). కేసీఆర్, జగన్‌లు మోదీ పెంపుడు కుక్కలని చంద్రబాబు అంటారా? నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేం అలా మాట్లాడం. జగన్, కేసీఆర్ హుందాగా వ్యవహరించారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం దాటలేదు. వై.ఎస్. పులివెందుల దాటలేదు. కేసీఆర్ రాష్ట్రంలోని చాలా చోట్ల పోటీ చేశారు. జనామోదం ఉంటే ఎక్కడైనా గెలుస్తారు. అది కేసీఆర్‌కు మాత్రమే ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓట్ల తొలగింపును ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఎన్నికల సంఘంలో సంస్కరణలు అవసరం. నిబంధనల విషయంలో చర్చ జరగాలి. ప్రజలు ఓటు వేయడానికి ఎందుకు రావడంలేదో రాజకీయ పార్టీలన్నీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీజేపీకి చెందిన రూ. 8 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి డ్రా చేస్తే ఈసీ దీనిపై కనీసం ప్రశ్నించలేదు సరికదా 24 గంటల్లోనే ఐటీశాఖ బీజేపీకి క్లీన్చిట్ ఇచ్చింది’అని కేటీఆర్ గుర్తుచేశారు. అంబేడ్కర్ తత్వంతోనే తెలంగాణ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిజమైన దార్శనికుడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలో కేటీఆర్ ప్రసంగించారు. ‘అందరికీ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేడ్కర్ ఒక కులానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. గాంధీ, నెహ్రులకు ఏ మాత్రం తీసిపోని దార్శనికుడు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం శాసనసభలో మెజారిటీ అవసరంపై రాజ్యాంగం రచించేటప్పుడు కేటీషా, అంబేడ్కర్ల మధ్య వాదనలు నడిచాయి. అసెంబ్లీలో మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు కావా లనే వాదనను తోసిపుచ్చి అల్ప సంఖ్యాకుల గొంతు కకు అంబేడ్కర్ బలమిచ్చారు. అంబేడ్కర్ తత్వంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణలో సంక్షే మం అమలవుతోంది. శనివారం పంజగుట్టలో అంబే డ్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వివేకానంద, బాల్క సుమన్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
కేంద్రంలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే
-
కారు ప్లస్ సారు.. కేంద్రంలో సర్కారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ కీలకం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లోని భావసారూప్యత ఉన్న పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రక్రియలో భాగంగా బుధవారమిక్కడ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీపై ప్రజలకు ఎన్నో భ్రమలు ఉండేవని.. అయితే, మోదీ పాలనలో దేశం బాగుపడదని ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 నుంచి 160 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 110 సీట్లు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ, యూపీఏ ఇలా రెండు కూటములు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి ఉండదన్నారు. లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అంటూ కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని.. కానీ ఆ పార్టీలు దొందూ దొందే అని తేలిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి గెలిచే 16 మంది ఎంపీలే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని, కేసీఆర్ నేతృత్వంలోని కొత్త కూటమి 100పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘కారు ప్లస్ సారు.. ఢిల్లీలో సర్కారు’అనే నినాదంతో ముందుకు సాగాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అది విడదీయరాని సంబంధం: కేసీఆర్‌కు కరీంనగర్‌తో ఉన్న సంబంధం మామూలుది కాదని, ఆయన ఏ పని ప్రారంభించినా కరీంనగర్ నుంచే మొదలుపెట్టి విజయాలు అందుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ‘కేసీఆర్ కరీంనగర్ అల్లుడు. ఆయనకు కరీంనగర్‌తో ఎంతో అనుబంధం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కరీంనగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2001 మే 17న ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సింహగర్జన సమయంలో నేను అమెరికాలో ఉన్నా. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చా. నేను ఇక్కడే మిషన్ హాస్పిటల్లో పుట్టిన. ఇక్కడి స్కూల్లోనే చదివిన. అప్పర్ మానేరులో నాయినమ్మ భూములు పోయినయి. మిడ్ మానేరులో అమ్మమ్మ భూములు కోల్పోయినం. ఇక్కడ బాలకృష్ణ, తీరందాస్, శ్రీనివాస సినిమా థియేటర్లు నాకు తెలుసు. కరీంనగర్ వస్తున్నానని రాత్రి కేసీఆర్‌ను కలిసిన. చాలా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ముస్తాబాద్ మండలం గూడూరు దగ్గరుండే మానేరు కాలువలో చిన్నప్పుడు స్నానాలు చేసిన విషయాలను గుర్తు చేశారు. కేసీఆర్ నా కుమారుడంత వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే లైన్ కోసం అక్కడ సర్వే చేసి కొయ్యలు గొట్టిన విషయాలు చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఆ రైల్వే లైన్ మంజూరైంది’అని వివరించారు. అందరూ మనోళ్లే.. కేసీఆర్ మనుషులే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్తలైనా అందరూ మనోళ్లే.. అందరూ కేసీఆర్ మనుషులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ‘సిరిసిల్లలో నాపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా రైతుబంధు పథకం కింద డబ్బులు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత వాళ్ల ఓటు అడగడానికి మనకు మొహమాటం అవసరం లేదు. మనోడు కాదనే ముద్ర వేయొద్దు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా అనుకూలంగా మలుచుకోవాలి. ఇక ఎంపీ అభ్యర్థి ఎవర న్నది ముఖ్యం కాదు. ఓటేసేది కేసీఆర్‌కి మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే మన హక్కులు సాధించుకోగలం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, సీహెచ్ రమేష్‌బాబు, సుంకు రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, చందర్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గులాబీలా.. గులాములా.. నిర్ణయించుకోవాలి ‘పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలి. తప్పిపోయి ఒకటో రెండో సీట్లు కాంగ్రెస్ గెలుస్తే ఏమవుద్ది? ఢిల్లీకి గులాములుగా మారిపోతారు. ఏ పనికైనా ఢిల్లీలో రాహుల్ అనుమతి తప్పనిసరి. టికెట్లు, బీ ఫారం సహా ఏది కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. అలాంటి ఢిల్లీ గులాములు రాష్ట్రానికి న్యాయం చేస్తారా ప్రజలు ఆలోచించాలి. తెలంగాణకు న్యాయం చేసే గులాబీలు కావాలా? ఢిల్లీ గులాములు కావాలో తేల్చుకోవాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కలిసిరాని ఆయన కేసీఆర్ దీక్ష తర్వాత తానే ఉద్యమకారుడిగా బిల్డప్ ఇచ్చుకున్నారని విమర్శించారు. -
16 సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతాం
-
ఆ అవకాశం లేదు : కేటీఆర్
సాక్షి, కరీంనగర్ : దేశంలో ఏ సర్వే చూసినా కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని, ఎన్డీఏకు 150 నుంచి 160, కాంగ్రెస్‌కు 100-110 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించుకోవాలని, ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయించేవాళ్లం కావాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానున్నదని తెలిపారు. తెలంగాణలో 16 ఎంపీలను టీఆర్ఎస్ సాధిస్తే భావసారుప్యతగల పార్టీలతో మరో 70 నుంచి 100 ఎంపీల మద్దతు తమకు ఉంటుందని చెప్పారు. అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా లభిస్తుందని, వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులను కేసీఆర్ నిర్ణయిస్తారని, అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
బీజేపీకి వ్యతిరేకమైతేనే ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పట్ల టీఆర్ఎస్ స్పష్టమైన వ్యతిరేక వైఖరి తీసుకుంటే, సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే విషయంపై ఆలోచించవచ్చని సీపీఐ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అయితే, టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం ఆ దిశలో లేవని భావిస్తోంది. పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటేనే ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జాతీయస్థాయిలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాఘట్ బంధన్’ ఏర్పాటులో సీపీఐ తన వంతు కృషి చేయాలని తీర్మానించింది. సోమవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై జరిగిన సమీక్షలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆయా అంశాలను వివరించినట్టు సమాచారం. రాజ్యాంగ సంస్థలు ధ్వంసం: సురవరం అన్ని రాజ్యాంగసంస్థలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే పాలనలో సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి రాజ్యాంగసంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పాలనలో మతోన్మాదం పడగ విప్పుతోందని, మైనారిటీలు, దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేలా ప్రజలు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలకుగాను రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లేదా మహబూబాబాద్, నల్లగొండ లేదా భువనగిరి స్థానాల్లో పోటీకి సన్నద్ధమవుతున్నట్టు చాడ తెలిపారు. భేటీలో పార్టీ నేతలు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేశ్, ఈర్ల నర్సింహ, పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, ఎ¯Œ..బాలమల్లేశ్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అఖిలపక్షం పిలవాలి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి దేశాన్ని అంతర్యుద్ధ పరిస్థితుల వైపు నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ఎంపీ సీట్లకు పోటీ... లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నాయకులు, కేడర్‌ను సంసిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం/మహబూబాబాద్, నల్లగొండ/ భువనగిరి స్థానాల్లో రెండింటికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో ప్రజాఫ్రంట్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత కొరవడిన నేపథ్యంలో సొంత ప్రయత్నాలు చేసుకోవాలనే అభిప్రాయానికి సీపీఐ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎంను కలుపుకొనిపోవాలని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) నుంచి బయటకు రావడానికి ఆ పార్టీ సిద్ధమైతే తదనుగుణంగా సీపీఐ కూడా వ్యవహరించాలని నిర్ణయించింది. శాసనసభ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు ప్రజాఫ్రంట్ కూటమిపరంగా సమీక్ష జరగనందున సీపీఐ చొరవ తీసుకుని కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీలతో సమావేశం కావాలని అభిప్రాయపడింది. లోక్‌సభ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించింది. -
మమతపై కేంద్ర వైఖరి పట్ల కేసీఆర్ స్పందనేది?
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీపై కేంద్ర వైఖరి పట్ల సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదనను సమర్థించిన మమతా బెనర్జీ 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మమతకు మద్దతుగా, కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ ఎందు కు మాట్లాడటం లేదు?’అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పరిధిలోకి ఈ అంశం రాదా? లేక కొన్ని విషయాలను చూసి, చూడనట్లు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో భాగమా? అని ఎద్దేవా చేశారు. -
జగన్, కేటీఆర్ భేటీపై ఎందుకీ రచ్చ?
ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసుకుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొని, అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, దాని అధినేత చంద్రబాబు కేటీఆర్ జగన్‌ను కలవడంతో ఆయనను అప్రతిష్టపాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు. పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయన కుమా రుడు, టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు కే.టీ. రామారావు మరికొంతమంది పార్టీ నాయకులతో కలిసి లోటస్ పాండ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసే మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రావు ఒక సంవత్సర కాలంగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ లేని ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేద్దాం కలిసి రండి అని దేశంలో పలువురు నాయకులను కలు స్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌ను, బీఎస్పీ నాయకురాలు మాయావతిని, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను స్వయంగా వెళ్లి కలిశారు. రాష్ట్రాల పరిధిలో ఉండాల్సిన అంశాలను కేంద్రం తన అధీనంలో ఉంచుకుని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది కాబట్టి ఆ అధి కారాలను సాధించుకోవడానికి కేంద్రం మీద పోరాటానికి అవసరమైన శక్తిని సమకూర్చుకుందాం రండి అని కేసీఆర్ ఈ నాయకులను కోరారు. ఆయనా, ఆయన కలిసిన నాయకులూ కూడా ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమే, ముందు ముందు మళ్ళీమళ్ళీ కలిసి చర్చించుకుంటాం, సమాఖ్య స్ఫూర్తికి ఉపయోగపడే విధంగా రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సాధించుకునే క్రమంలో ఈ చర్చలు తోడ్పడతాయి అని చెపుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలు ఈ లక్ష్యం సాధించుకోలేక పోతున్నాయి కాబట్టి ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరం అని చాలామంది నాయకులు భావిస్తున్నారు. అది నిజం కూడా. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీల నాయకత్వాల మీద ఒత్తిడి తెచ్చి తమ తమ రాష్ట్రాలకు కావలసిన మొత్తంలో నిధులు కానీ ఇతర సౌకర్యాలు కానీ రాబట్టుకోలేవు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొద్దిమంది సమర్థులయిన నాయకులు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వాలను ప్రభావితం చేసి కావలసిన పనులు చేయించుకోవడం చూశాం. కానీ అన్నివేళలా అది సాధ్యం కాదు. అందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం ఒకటి ఈ దేశానికి అవసరమే. అయితే ఆ దిశగా గతంలో జరిగిన ఒకటి రెండు ప్రయత్నాలు విఫలం అయిన మాట నిజం. అట్లాంటి ఒక ప్రయత్నం యునైటెడ్ ఫ్రంట్ (యుఎఫ్)ను నట్టేట ముంచి పోయిన నాయకుడు చంద్రబాబు. ఆ ఫ్రంట్ కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చెయ్యకుండానే బీజేపీతో జతకట్టిన నాయ కుడు ఆయన. ఒక ప్రయత్నం విఫలం అయిందని, ఒక నాయకుడు మోసం చేశాడని వదిలెయ్యకూడదు కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెపుతున్నారు. ఇంకా దానికి ఒక స్వరూపం అంటూ రాలేదు. అందులో భాగంగానే ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కి స్వయంగా ఫోన్ చేసి తన పార్టీ ప్రతినిధి బృందాన్ని పంపుతున్నానని చెప్పారు. జగన్, కేటీఆర్ బృందాల సమాలోచనలు జరుగుతున్న సమ యంలోనే మళ్ళీ ఒకసారి కేసీఆర్ జగన్‌కు ఫోన్ చేసి తాను స్వయంగా అమరావతికి వచ్చి మరొకసారి జగన్‌తో చర్చలు జరుపుతాననీ, ఇవి ప్రాథమిక సమాలోచనలు మాత్రమే అని చెప్పారు. ఇంటికి వస్తామన్న కేటీఆర్ బృందాన్ని జగన్ భోజనానికి ఆహ్వానించారు. అమరావతికి వస్తానన్న కేసీఆర్నీ జగన్ తన నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. భేటీలో ఏం మాట్లాడుకున్నారో జగన్, కేటీఆర్‌లు మీడియాకు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు, సమస్యలు పరిష్కారం కావని, దాన్ని సాధించుకోవడానికి ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు మరింత సంఖ్యాబలం తోడైతే బాగుంటుంది కాబట్టి, అందుకు తాము సిద్ధంగా ఉన్నాం అని టీఆర్ఎస్ కూడా చెపుతున్నది కాబట్టి వాళ్ళతో ఆ పరిమితుల్లో కలిసి పనిచేసే విషయం పరిశీలిస్తామని జగన్ చెప్పారు. రాజ్యసభలో తమ నాయకుడు కేశవరావు, లోక్‌సభలో తమ సభ్యురాలు కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారనీ, కేసీఆర్ కూడా ప్రధానికి లేఖ రాయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారనీ కేటీఆర్ చెప్పారు. ఇదీ జరిగింది. వేర్వేరు పార్టీల నాయకులు తమ తమ పార్టీల ప్రయోజనం కోసం, తమ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచెయ్యడం కొత్త విషయం ఏమీ కాదు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తొలి సమావేశాన్ని ఆ కోణంలో నుండే చూడాలి. రెండు రాష్ట్రాల ప్రజలూ అలాగే చూస్తారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణ కాకుండా సహజీవనం కోరుకుంటున్నారు కాబట్టి. ఈ సమావేశం ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున తెలుగు దేశం నాయకులు విరుచుకు పడ్డారు ఎందుకని? ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తు న్నారు? అధికారం శాశ్వతం చేసుకోవాలన్న దుగ్ధ. ప్రతిపక్ష నాయకుడు జగన్ 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసు కుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామనిపేర్కొని అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, బాబు ఈ భేటీని అడ్డు పెట్టుకుని అప్రతిష్ట పాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు. చంద్రబాబు, ఆయన మంత్రులూ, నాయకులూ, వాళ్ళ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్నట్టుగా జగన్ టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడటమే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పని అయితే ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఆ పని చేసింది చంద్రబాబు, ఆయన పార్టీ వారే. రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే కదలిక వచ్చింది. బాబు లేఖ, సోనియా గాంధీ దురాలోచనా కలిసి తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేశాయి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నవాడని గెలిపించి అధికారం కట్ట బెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం పని చెయ్యకపోగా... అధికారంలోకి వచ్చిన కొద్దిరోజు ల్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చెయ్యడం కోసం కుట్ర పన్ని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి వెళ్లి ఆంధ్ర ప్రజల ప్రతిష్ఠను దిగజార్చిన ఘనత చంద్రబాబుది. ఆ కేసు ముందుకు సాగకుండా సంధి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది బాబు. తెలంగాణ సీఎంని అమరావతి శంకు స్థాపనకు ఆహ్వానించి శిలాఫలకం మీద ఆయన పేరు చెక్కించినప్పుడు దెబ్బతినని ఆత్మాభిమానం జగన్ ఒక్కసారి కేటీఆర్‌ను కలిస్తే దెబ్బతిన్నదా? పదేళ్ళు హైదరాబాద్‌లో ఉండటం కోసం కోట్లాది రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు ఖర్చు చేసి విలాసవంతంగా మరమ్మతులు చేయించిన కార్యాలయాలూ, వసతి గృహాలు, సొంత ఇల్లూ అన్నీ వది లేసి పారిపోవడం ఏ ఆత్మాభిమానాన్ని రక్షించడం కోసం? కేసీఆర్ దుర్గ గుడి దర్శనానికి వస్తే, తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే అడుగులకు మడుగులొత్తిన మంత్రులు ఇప్పుడు జగన్‌ని ఏ ముఖం పెట్టుకుని నిందిస్తున్నారు? కేసీఆర్ నిర్వహించిన యజ్ఞ యాగాదులకు జగన్ కాదు వెళ్ళింది చంద్రబాబు ఆయన అనుచరులు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ పనిగట్టుకుని కేసీఆర్‌ను కానీ ఆయన ప్రభుత్వంలో మరేవరి నయినా కానీ కలవలేదే! బావమరిది మృతదేహం దగ్గర కూర్చుని తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారకుడయిన ఆయన మరణానికి చింతించకుండా టీఆర్ఎస్తో పొత్తు కోసం వెంపర లాడింది చంద్ర బాబు కానీ జగన్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానం చంద్రబాబు కారణంగానే కదా పదేపదే దెబ్బతింటున్నది. అధికారం చేజారిపోతుందని స్పష్టంగా తెలిసిపోయాక ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు సంపా దించుకోవాలన్న దురాలోచనతో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ కలిసి పోతాయని నమ్మించే విఫలయత్నం బాబుది. బీజేపీతో కలిసినా, టీఆర్ ఎస్తో కలిసినా, కాంగ్రెస్‌తో కలిసినా అధికారం కోసం నీతిబాహ్యమైన పొత్తులు కుదుర్చుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత అవసరం అయిన ప్రత్యేక హోదాను నాలుగేళ్ళకు పైగా బీజేపీకి తాకట్టుపెట్టి, తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆ నినాదాన్ని అందుకుని కొద్ది రోజుల్లోనే అది మరిచిపోయి దేశాన్ని, వ్యవస్థలనూ కాపాడటం పేరుతో కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి పదేపదే భంగం కలిగిందనే విషయం గుర్తించాలి. తెలంగాణలో ఇంకో అయిదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచకుండా సామరస్యం పెంచే పక్షం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఎన్నికల వైపు అడుగు వెయ్యాలి. - దేవులపల్లి అమర్ -
ఏల్లో మీడియా దుష్ప్రచారం
-
ఈ కలయిక విస్తృత ప్రయోజనాలకు నాంది
రెండు తెలుగు రాష్ట్రాలు వనరుల పంపకంలో పరస్పరం ప్రయోజనాలు పొందవలసిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా ఇరువైపులా ఇప్పుడున్న యువ నాయకత్వాల–కేటీఆర్, వైఎస్సార్– కలయిక, దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలకు మేలుచేసేది గానే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ప్రాంతాల మధ్య, కాలాతీతంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డానికి ఆస్కారం కలిగించింది. సోదర తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఇప్పటికే జరిపిన అపారమైన మేధోమధనం, ప్రాధమ్యాల ఎంపిక, వాటి ద్వారా టీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో పొందుతున్న ప్రతిఫలనాల విలువను, ఏపీ ప్రజానీకం ఇప్పటికైనా గ్రహించడం అవసరం. వీరిద్దరి కలయిక తెలుగు సమాజాలకు గెలుపు సందర్భం కావాలి. తెలుగు ప్రజలంతా సంక్రాంతి సంతోషాల్లో ఉండగా జరిగిన ఒక రాజకీయ సంఘటన, మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాల మధ్య, కాలాతీతంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డానికి ఆస్కారం కలి గించింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా, చిన్నగా మొదలయ్యేవి – చరిత్రలో కీలక మలుపులు కావడం మనకు కూడా కొత్తకాదు! తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, తన తండ్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరమని కోరడం–ఇప్పుడు అటువంటిదే కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు కొత్త ప్రాంతీయ పార్టీలు, ఇద్దరు యువనాయకుల ఈ కలయిక సన్నివేశం; ఇరువైపుల ఉన్న తెలుగు సమాజాలకు ‘విన్–విన్ సిచ్యుయేషన్’ కావాలి. తెలంగాణ ఉద్యమం అంచెలంచెలుగా అరవైల నుంచి పలు విరామాల మధ్య పొరలు పొరలుగా రాజకీయ ఉపరితలం మీదికి వస్తూ 2010 నాటికి విస్మరించడానికి వీలులేని స్థాయికి చేరింది. అయితే, ఏనాటికైనా, ఏ కారణంతోనైనా రాష్ట్రం రెండయితే కలిగే తదనంతర పరిణామాలను భరించవలసిన– ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు; దాన్నిఎదుర్కోవడానికి ఎటువంటి ముందస్తు కసరత్తూ చేయలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2010 తర్వాత ఇక్కడ ఏర్పడిన రాజకీయ బలహీన స్థితిని, అధిగమించలేకపోయింది. తెలంగాణ ఉద్యమ నాయకత్వం దాన్ని అనుకూలంగా మల్చుకోవడంతో 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. 2019 ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల్లో పరి స్థితి ఇలా ఉంది. విభజనను ఎదుర్కోవడానికి ‘సమైక్య ఆంధ్ర ఉద్యమం’ నడపడం ఒక్కటే పరి ష్కారం అని నమ్మిన ఆంధ్రప్రదేశ్ ఒక వైపు, ఉద్యమ విజయాన్ని, మరోసారి ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలచుకున్న తెలంగాణ మరొకవైపు ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ సంఘ నాయకులు కాలక్రమంలో విశ్వసనీయత కోల్పోగా, 2019కి గాను తెలంగాణలో, మరో ఐదేళ్ళు మీరే అధికారంలో ఉండమని టీఆర్ఎస్కు అనుకూలంగా అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు.అయితే సమైక్య ఆంధ్ర ఉద్యమ నాయకులు గడచిన నాలుగున్నర ఏళ్లలో – అప్పట్లో ఎందుకు తాము విభజనను వ్యతిరేకించామని ఒక డాక్యుమెంట్‌నూ విడుదల చేయలేకపోయారు. కనీసం ఇప్పుడైనా ఏపీ ప్రజలకోసం, తమ ప్రాంతం కోసం ప్రభుత్వం, రాజ కీయ పార్టీలు ఏమి చేయాలి అనే దిశలో పౌర సమాజాలను కలుపుకుని, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించలేక పోయారు. పోనీ దానివల్ల ప్రయోజనం లేదనుకుంటే, విభజన చట్టం అమలు మీద నిరంతర నిఘాతో దాన్ని సమీక్షిస్తూ రాజకీయాలకు ప్రభుత్వాలకు సమాంతరంగా ఒక ఒత్తిడి బృందాన్ని (‘ప్రెషర్ గ్రూప్’) నిర్మించలేకపోయారు. ఈ పరిస్థితికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ విభజన లక్ష్యంగా ఒక దశాబ్ద కాలంపైగా ప్రజలు, ప్రాంతం, ప్రభుత్వం.. అనే కోణం నుంచి విస్తృతమైన మేధోమధనం చేసి ఉంది. అలాంటిది ఇటు ఆంధ్రవైపు ఉద్యమకాలంలో జరగలేదు. రెండు ప్రాంతాల ప్రభుత్వాల మధ్య తేడా విభజన జరిగిన మొదటి ఏడాదే స్పష్టమైంది. తెలం గాణా వెంటనే మరో పది కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. విడిపోతే బాగుపడతాం అనే తమ పాత సూత్రాన్ని వాళ్ళు సూక్ష్మ స్థాయి వరకు తీసుకు వెళ్ళారు. నైసర్గిక ప్రదేశం అంటే కేవలం భూమి మాత్రమే కాదు, ‘భూమి’ కేంద్రంగా దాని చుట్టూ ‘పొలిటికల్ పవర్’ కూడా ఉంటుంది. అది తెలంగాణలో వారి నాయకుడికి తెలిసినట్టుగా బహుశ ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు. మొన్నటి ఎన్నికల విజ యంలో తాయిలాలు గెలిపించాయని అంటున్నవారు అంతర్లీనమైన ఈ అంశాన్ని గుర్తించలేదు! అసంఖ్యాకంగా ఉన్న తెలంగాణ ఉత్పత్తి కులాలు ఇప్పుడు ఈ కొత్త జిల్లాల కారణంగా స్థానిక సంస్థల రాజకీయ అధికార ఫలాలకు చేరువ అవుతారు. టీఆర్ఎస్ అక్కడితో ఆగకుండా ప్రజల సాంస్కృతిక మూలాల మూలుగుల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. విభజన కోసం ఇంత పని ఇప్పటికే పూర్తిచేసి, ఇక రాష్ట్రం కోసం ఇప్పుడు చేయవలసింది ఏమిటి అనే విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఉంది. కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పత్రికా సమావేశంలో రాజ్యాంగపరమైన అంశాలను ప్రస్తావిస్తూ–కేంద్ర రాష్ట్ర జాబి తాలు, ఉమ్మడి జాబితాల ప్రస్తావన లేవనెత్తారు. దాంతో ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయం లేదా ఫెడరల్ ఫ్రంట్ వంటి ప్రకటనలు చేస్తున్నచాలామంది సీనియర్ సీఎంలకంటే, కేసీఆర్ ఇందుకోసం ఎక్కువ ‘హోంవర్క్‘ చేసినట్టుగా స్పష్టమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు వనరుల పంపకంలో పరస్పరం ప్రయోజనాలు పొందవలసిన పరిస్థితుల్లో ఇరువైపులా ఇప్పుడున్న యువ నాయకత్వాల కలయిక, దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలకు మేలుచేసేది గానే ఉంటుంది. సోదర తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఇప్పటికే జరిపిన అపారమైన మేధోమధనం, ప్రాధమ్యాల ఎంపిక, వాటి ద్వారా టీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో పొందుతున్న ప్రతిఫలనాల విలువను, ఏపీ ప్రజానీకం ఇప్పటికైనా గ్రహించడం అవసరం. అయినా తాము ప్రతిపాదిస్తున్న ‘ఫెడరల్ ఫ్రంట్’తో కలిసివచ్చే వారిని కూడగట్టుకోవడంలో భాగంగా టీఆర్ఎస్ తనకు తానే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల సహకారం కోరితే, అందుకోసం వాళ్ళు వచ్చి ఇక్కడి ప్రతిపక్ష నాయకుణ్ణి కలిస్తే, దాన్ని ఇక్కడి పౌర సమాజం ఎలా చూడాలి? రాజకీయంగా మాత్రం చూడవలసిన పనిలేదు. రాజకీయ పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటిలో–ప్రజలు ప్రాంతం వాటి ప్రయోజనాలు ఏమిటి అనే దృష్టి కోణం నుంచి, పౌరసమాజం కొంచెం కూడా పక్కకు జరగాల్సిన పని లేదు. ఉద్యమ కాలంలో దాని నిర్మాత, నాయకుడు కేసీఆర్‌కు సలహా సంప్రదింపులకోసం విస్తృత శ్రేణిలో ఆలోచనాపరులు, నిపుణులతో ఒక ‘థింక్ ట్యాంక్’ ఇప్పటికే ఏర్పడి ఉంది. దాని సేవలు, అవసరం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇక్కడి ప్రజల మేలుకోసం వాటిని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటివరకు ఇక్కడ అంటే ఏపీలో అటువంటివి నామమాత్రంగా కూడా మనకు లేవు అన్నది గుర్తించి తీరాలి. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు -
బాబువి ఊసరవెల్లి రాజకీయాలు
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు తమని విమర్శించడం సిగ్గు చేటని వైఎస్పార్సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మండిపడ్డారు. శనివారం ఆయన తిరువూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతుగా తెలంగాణ కేసీఆర్ నిలబడుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా వారి ఫెడరల్ ప్రంట్ కూడా మన ప్రత్యేక హోదాకు డిమాండ్ కు మరింతగా మద్దతు చేకూరుతుందనే వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అభిప్రాయం అని అన్నారు. బాబు మీలాగా ప్రజలకు పూటకో మాట, గంటకో అబద్ధమాడటం ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మాకు చేతకాదని అన్నారు. ఏపీ ప్రయోజనాలు విషయంలో రాజీలేని పోరాటం చేయబట్టే జాతీయ పార్టీలకు ఏనాడు లొంగకుండా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 13 రాజకీయ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జాతీయ పార్టీలతో లాలూచీ పడబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కేసులు లేకుండా, ఉన్న కేసులు ముందుకు కదలకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే ఒంటరిగానే వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని రక్షణనిధి తెలిపారు. -
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: ఉదయభాను
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలు అసంబద్దమని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించి వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య జరిగిన భేటీపై సీఎం చంద్రబాబునాయుడు వంది మాగధులు, టీడీపీ మంత్రులు– ఆయన ప్రయోజనాల పరిరక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్లో మీడియా రెండు రోజులుగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును, హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్తో పొత్తుకోసం ప్రయత్నించానని సాక్షాత్తూ చంద్రబాబే అటు అసెంబ్లీలోనూ, ఇటు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రకటించినా ఏ మాత్రమూ తప్పు బట్టని ఎల్లో మీడియా నేడు రాద్ధాంతం చేస్తున్నది. ఈ తరహా అసత్యప్రచారాలపై రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘పరామర్శకు వెళ్లి పొత్తుల గురించి మట్లాడలేదా’
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టాల హక్కులను సాధించే క్రమంలో కేటీఆర్ వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగిందని అన్నారు. ఈ భేటీపై వక్రభాష్యాలు చెబుతూ.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. బాబు నలభయ్యేళ్ల రాజకీయ చరిత్ర అవినీతి మయం, దుర్గంధ భరితం, భరింపశక్యం కానటువంటిదని ఎద్దేవా చేశారు. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్‌తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కేసీఆర్ వస్తే ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసి దగ్గరుండి సపర్యలు చేస్తారు. మీ మంత్రివర్గ సహచరురాలు పరిటాల సునీత ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తారు. కేసీఆర్ తలపెట్టిన చంఢీయాగంలో పాల్గొంటారు. కానీ, మేం కేటీఆర్‌తో భేటీ అయితే బురద జల్లుతారు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అనేక రుగ్మతలతో భాదపడుతున్నారని, కొత్తగా ఆయనకు మానసిక రుగ్మత కూడా వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతూ.. బాబుకు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడటం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మొదటినుంచి పోరాటం చేస్తున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. -
కేటీఆర్,జగన్ చర్చలపై చంద్రబాబు గగ్గోలు
-
ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు : తలసాని
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై తలసాని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో తలసాని మాట్లాడుతూ.. ఏపీ హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. లోటు ఆదాయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వృథా చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు.. ‘ఈ బాబు మాకొద్దు’ నినాదంతో ఏపీ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తామని తలసాని పేర్కొన్నారు. శవరాజకీయాలు చేసే చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది బాబూ! ‘చంద్రబాబుకు బంధాలు, బంధుత్వాల విలువ తెలియదు. చేరదీసిన ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. ఫెడరల్ ఫ్రంట్ లేదన్న చంద్రబాబుకు దాని ప్రతాపమేంటో త్వరలోనే తెలుస్తుంది. ఆయనలా మాది మోసపూరిత జీవితం కాదు. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూసేదే ఆయన. కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. బీసీలకు, కాపులకు గొడవ పెట్టింది కూడా టీడీపీయే. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే... మా సమాధానాలు చాలా ధీటుగా ఉంటాయి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో కరెంట్, నీళ్ళు కూడా లేవు... మా సీఎం వచ్చాకే అన్నీ ఒక్కొక్కటిగా తీర్చాము. మీ అందమైన మొహాన్ని చూస్తేనే అందరికీ మీరంటే ఏంటో తెలుస్తుంది. నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది. నాలుగేళ్లైనా అమరావతిని ఎందుకు నిర్మించలేదు. టీడీపీ ఓడిపోతేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. ఆయన మంత్రులు ఫెడరల్ ఫ్రంట్‌పై అనవసర, అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రజలు మరో మూడు నెలల్లో చంద్రబాబును తరిమికొడతారు. త్వరలోనే కేసీఆర్ కూడా ఏపీకి వస్తారు’ అని తలసాని వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్తో పొత్తుకు టీడీపీ ఎందుకు ప్రయత్నించింది?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలో పొత్తుల ప్రస్తావనే రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని.. ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్-కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నటి (బుధవారం) భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే చర్చించారని, పొత్తుల గురించి కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ అన్యాయం చేసుంటే.. ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో టీఆర్ఎస్తో పొత్తు కోసం టీడీపీ ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు. ఒడిషా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలను ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ కలిశారని, ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో రాజధాని కొనసాగే అవకాశం ఉన్నా ఎందుకు ముందుగానే వచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ నేతల వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని, శాంతిభద్రతలపై నమ్మకం లేకుండా చేశారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతల మాటలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. -
'టీఆర్ఎస్తో పొత్తు అంటూ.. టీడీపీ విషప్రచారం'
సాక్షి, నల్గొండ : జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్-వైఎస్సార్సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్ఎస్తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని గుత్తా తెలిపారు. -
హోదానే మాకు ప్రధానం
హైదరాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా కోసం తెలుగు ఎంపీలంతా ఏకతాటిపైకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ముఖ్యమని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే మనకు మద్దతుగా పార్లమెంట్లో తెలుగు రాష్ట్రాల ఎంపీల సంఖ్యా బలం పెరగడమే మార్గమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తనయుడు కె.తారకరామారావు(కేటీఆర్) బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి చర్చించారు. అనంతరం వైఎస్ జగన్, కేటీఆర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, ఇందులో రెండో మాటకు తావులేదని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఫెడరల్ ఫ్రంట్ కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాల హక్కులను సాధించుకుందాం... ఈ చర్చలకు ఒక రోజు ముందు కేసీఆర్ మంగళవారం సంక్రాంతి నాడు వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిద్దామని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా జగన్ కోరారు. కేసీఆర్ సూచన మేరకు ఆయన తనయుడు కేటీఆర్, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు లోటస్‌పాండ్‌కు వచ్చి గంటకు పైగా చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్రాల హక్కులను సాధించుకోవడంపై ఇద్దరు నేతల సారథ్యంలోని ప్రతినిధుల బృందం ప్రాథమికంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించుకోవడం, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వైఎస్ జగన్‌ను స్వయంగా కలిసి సంప్రదింపులు జరపనున్నారు. 42 మంది ఎంపీలతో కలసి ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం: వైఎస్ జగన్ ‘తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో ఫోన్లో మాట్లాడిన తరువాత కేటీఆర్ వచ్చి ఫెడరల్ ఫ్రంట్ గురించి మాతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలు, దీనిపై గట్టిగా నిలబడాల్సిన అవసరం గురించి చర్చించారు. అన్యాయాలు జరగకూడదంటే రాష్ట్రాలన్నీ కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు పంచుకున్నాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఉంది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కూ దివాణం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రం పరిధిలో వారికి ఉన్న ఎంపీలను సంఖ్యాపరంగా చూస్తే దీన్ని అధిగమించే పరిస్థితులు ఉండవు. మన రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ ఎంపీలతో మనం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఏపీకి చెందిన ఎంపీల బలం మాత్రమే సరిపోదు. మన 25 మందికి మరో 17 మంది తెలంగాణ ఎంపీలు తోడయితే... మొత్తం 42 మంది ఒక్క తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై స్పందించగలిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే బాగుంటుంది. ఈ 42 మంది ఎంపీలు ఒకేసారి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని చెప్పగలిగితే రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు నిలబడాలి, పరిరక్షించుకోవాలి అంటే సంఖ్యాపరంగా పెరగాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు జంకుతుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితో కూడిన, కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ వేదిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎంపీల పరంగా ఏకమై తమకు జరుగుతున్న అన్యాయాలపై ఎలుగెత్తి చాటే పరిస్థితి రావాలి. రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. కేటీఆర్ కూడా మా వద్దకు వచ్చి ఆ విషయాలే చెప్పారు. తరువాత కేసీఆర్ నాతో ఫోన్లో మాట్లాడారు. తదుపరి చర్చల కోసం తానే స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో మా పార్టీ నేతలతో కలసి చర్చించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాం. ఇదే అంశంపై ఇంకా నాలుగడుగులు ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తాం’ మన ఎంపీల సంఖ్యా బలం పెరగాలి... ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలేనని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదాను కూడా ఇచ్చే పరిస్థితులు లేవని, అందుకే పక్క రాష్ట్రమైన తెలంగాణ మనకు మద్దతునిస్తామన్నందుకు స్వాగతిస్తున్నామని జగన్ చెప్పారు. ‘క్రమంగా పరిణామాలు రూపుదిద్దుకునే కొద్దీ మేం మరిన్ని అంశాలపై చర్చిస్తాం. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. పార్లమెంట్లో మన ఎంపీల సంఖ్యాబలం పెరగాలి. రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితులు రావాలి. రాష్ట్రాల తరపున మాట్లాడగలిగే వారి సంఖ్యా బలం పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ 25 మందితో అనుకున్నది సాధించలేని పరిస్థితి ఉన్నపుడు దాన్ని 42కు పెంచి మరింత ఎక్కువగా ఒత్తిడి చేసే పరిస్థితులు తేవాలి’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతులో భాగంగానే: కేటీఆర్ ‘టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాదిన్నరగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకుంటున్నారు. కేంద్రం అన్ని రకాల అధికారాలను తన వద్దే పెట్టుకుని రాష్ట్రాల పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోంది. ఈ విధానం మారాలనే ఆలోచనతో, సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్లను కలిశారు. అజిత్ జోగి సహా పలువురితో సంప్రదింపులు జరిపి తన ప్రయత్నానికి మద్దతునివ్వాలని కోరారు. ఆ పరంపరలో భాగంగానే మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసి కలసి మాట్లాడదామని కోరాం. మా బృందంతో ఇక్కడకు వచ్చి అన్ని విషయాలూ వారితో పంచుకున్నాం. గతంలో కేసీఆర్ ఎలా అయితే అన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపారో అదేవిధంగా త్వరలోనే ఏపీకి కూడా వెళతారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై మిగతా అన్ని విషయాలు మాట్లాడి ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళతారు.’ ఏపీకి హోదాపై మా వైఖరి స్పష్టం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ వైఖరిని తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని కేసీఆర్ తెలిపారు. ‘రాజ్యసభలో మా పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో మా ఎంపీ కవిత, ఇంకా పలు వేదికల మీద మేమంతా చాలా స్పష్టంగా చెప్పాం. ఏపీ ప్రజలకు అప్పటి ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టాలని చెప్పాం. కనుక ఆ విషయంలో రెండో అభిప్రాయంగానీ, ఆలోచనగానీ మాకు లేదు. కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో సమావేశమై మిగతా అంశాలపై మాట్లాడతారు. అన్ని విషయాలపై ఆయన స్వయంగా స్పందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఎలా పోరాడాలి అనే విషయంపై కూడా కూలంకషంగా చెబుతారు.’(ఈ సందర్భంగా విలేకరులు మరిన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా.. ‘ఈరోజే ఇప్పుడే అన్నీ చెప్పేస్తే ... తరువాత మీరు అడగడానికి ఏమీ ఉండదు. మాకు కూడా చెప్పడానికి ఏమీ ఉండదు’అని కేటీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఇక ఇక్కడితో వదిలేద్దామని మీడియాను కోరారు. చర్చల్లో పాల్గొన్న నేతలు... వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి, పార్టీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, లోక్‌సభ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు లోటస్ పాండ్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. -
‘ఫెడరల్ ఫ్రంట్ కోసమే భేటీ.. ఏ పార్టీతో పొత్తులుండవు’
సాక్షి, విజయవాడ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేవలం ఫెడరల్ ఫ్రంట్ గురించే మాత్రమే చర్చించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ నేతలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది నీచమైన మనస్తత్వమని ఆరోపించారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా అందరి నేతలతోనూ చర్చల్లో భాగంగానే వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ నేతలు కలిశారని స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అంబటి ధ్వజమెత్తారు. సీట్ల కోసం పాకులాడే రకం కాదు.. ‘చంద్రబాబులా మేము ఎవరికి కొమ్ము కాయం, లాలూచీలు ఉండవు, ఏ పార్టీతో పొత్తులుండవు. చంద్రబాబు కేసీఆర్‌ను అమరావతికి ఎందుకు పిలిచారు? కేసీఆర్ నిర్వహించిన యాగానికి చంద్రబాబు ఎందుకు వెళ్లారు?. మేము మీలా సీట్ల కోసం పాకులాడే రకం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేటీఆర్ మాతో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపితే టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్తో చంద్రబాబు చర్చలు జరిపింది నిజమా? కాదా?. టీఆర్ఎస్ ఛీ అన్న తర్వాత కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు. షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు టీడీపీ కుట్ర దివంగత నేత వైఎస్సార్ కుమార్తె షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఇలాంటి దుష్ప్రచారాలు రావటం బాధ కలిగిస్తోంది. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుది నీచమైన స్వభావం.’అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. -
ఇది తొలి సమావేశమే : విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ప్రారంభం మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్, కేటీఆర్‌లు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్ ఫ్రంట్ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్ఎస్, వైఎస్సార్సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. -
రాష్ట్రాల హక్కుల కోసం ఎంపీల సంఖ్య పెరగాలి : జగన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎక్కువసంఖ్యలో ఎంపీలు గళమెత్తాల్సిన అవసరముందని, ఈ క్రమంలో ఏపీకి చెందిన 25మంది ఎంపీలకు తోడుగా తెలంగాణ ఎంపీలు 17మంది కలిసివస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎక్కువ ఎంపీల మద్దతు అవసరమందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు కలిసివస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. గంటన్నరపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ సూచనల మేరకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై కేటీఆర్ వైఎస్ జగన్‌తో చర్చించారు. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. కేసీఆర్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నా: వైఎస్ జగన్ ‘కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత.. కేటీఆర్ వచ్చి నాతో ఫెడరల్ ఫ్రంట్ అవసరం, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రాన్ని ఎదుర్కోవాలంటే.. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం గురించి చర్చించారు. ప్రత్యేక హోదా విషయమే పరిశీలిస్తే.. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరఫున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తాం.’ అని వైఎస్ జగన్ తెలిపారు. ప్రత్యేక హోదాకు పూర్తి మద్దతు: కేటీఆర్ ‘దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు రావాలని, ఏడాదిన్నర కాలం నుంచి తమ అధినేత కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్లతో పాటు మరికొంత మందిని కేసీఆర్ కలిసారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు కేసీఆర్ ఫోన్ చేసి ఫెడరల్ ఫ్రంట్‌పై మాట్లాడాలని కోరారు. ఇందులో భాగంగానే నేను వైఎస్ జగన్‌తో సమావేశమయ్యాను. తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పోరాడే విషయంపై చర్చించాం. ఇవి ప్రాథమిక చర్చలే. త్వరలోనే కేసీఆర్ స్వయంగా వైఎస్ జగన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై కూలంకశంగా చర్చిస్తారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. హోదాకు సంబంధించిన విషయంలో ఏపీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రజాకాంక్షకు అనుగుణంగా వైఎస్ జగన్ మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో జరిగిన ఈ భేటీలో కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. అంతకుముందు లోటస్‌పాండ్‌కు వచ్చిన టీఆర్ఎస్ నేతల బృందానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు. -
జగన్, కేటీఆర్ భేటీ
-
వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న టీఆర్ఎస్ నేతలకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్ బృందం వైఎస్ జగన్‌తో చర్చించనుంది. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుపై వైఎస్ జగన్ ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్ఎస్ నాయకులతో పాటు.. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘కేసీఆర్ ఆదేశాల మేరకే వైఎస్ జగన్‌తో చర్చలు’
సాక్షి, అమరావతి: టీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్న విషయం తెలిసిందే. కేటీఆర్, వైఎస్ జగన్‌ల భేటీపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వైఎస్సార్సీపీతో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారని ఆయన ట్విటర్లో వెల్లడించారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కుడా తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తమ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్‌తో భేటీ అవుతున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలిపారు. కాగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెరడల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. (వైఎస్ జగన్‌తో భేటీకానున్న కేటీఆర్ బృందం) On the directive of our leader KCR Garu, will be calling on YSRCP president @ysjagan Garu today at 12:30PM to discuss modalities on working together to strengthen a federal alternative to NDA and UPA — KTR (@KTRTRS) January 16, 2019 -
వైఎస్ జగన్‌తో భేటీకానున్న కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు వస్తామని వైఎస్ జగన్‌ను టీఆర్ఎస్ బృందం కోరింది. టీఆర్ఎస్ విజ్ఞప్తిపై స్పందించిన వైఎస్ జగన్ నేడు(బుధవారం) లంచ్‌కు రావాలని కేటీఆర్ బృందాన్ని ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం చర్చలు జరుపుతుంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు. -
ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది?
సాక్షి, అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 10వ శ్వేతపత్రం విడుదల సంద ర్భంగా రాజకీయాలపైనా చంద్రబాబు మాట్లాడారు. నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ ఆ ఫ్రంట్‌ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్నట్లు చెప్పకపోయినా వారు అందులో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. మహాకూటమి విఫలం కాలేదని, విఫలమైంది జైట్లీ, మోదీ అని వ్యాఖ్యానించారు. దేశానికి ఏం మేలు చేశారనే అంశంపై ప్రధాని మోదీ చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అన్నిసార్లు తిరిగినా తెలంగాణాలో ఆ పార్టీ గెలిచింది ఒక్క సీటేనని, అయినా కేసీఆర్ గెలిచినందుకు వారు సంతోషపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఏపీ మీడియాలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చి తమను రెచ్చగొట్టాలని, అవమానించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వృద్ధి రేటులో దేశాన్ని మించిపోయాం.. రెవెన్యూ పెంచుకోవడానికే అప్పులు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేటుకే అప్పులు తీసుకున్నామన్నారు. లోటు లేని ఆర్థిక వ్యవస్థ ఎక్కడా ఉండదన్నారు. నాలుగేళ్లుగా 10.52 శాతం వృద్ధి రేటు సాధించామని, దేశ వృద్ధిరేటు 7.3 శాతం కాగా తెలంగాణ వృద్ధిరేటు 9.7 శాతం మాత్రమేనన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ వేగవంతమైన వృద్ధి రేటు సాధించామన్నారు. 2013–14లో రూ.4.64 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం 2017–18 నాటికి రూ.8.04 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల వల్ల పెరిగిన ఆదాయం రూ.1.25 లక్షల కోట్లని (96 శాతం) చెప్పారు. నాలుగేళ్లలో తలసరి ఆదాయం సగటున రూ.59,154 (71 శాతం) పెరిగిందని తెలిపారు. పన్నుల ద్వారా ఆదాయం 2014–15లో రూ.38,038 కోట్లు రాగా 2017–18 నాటికి రూ.53,300 కోట్లకు పెరిగిందన్నారు. శ్వేత పత్రాలపై జన్మభూమిలో చర్చిస్తాం.. హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయాల తరలింపు, ఉద్యోగుల వేతన స్కేళ్ల రివిజన్, 2015–16 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు, సంక్షేమ పథకాలవల్ల రెవెన్యూ వ్యయం పెరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద గరిష్ట పరిమితిని రూ.5 లక్షలకు పెంచామన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తామని, విజ్ఞానాన్ని మొబైల్ ద్వారా అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుందన్నారు. జన్మభూమి తర్వాత ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని, పండుగ తర్వాత రాష్ట్ర స్థాయిలో 2019–24 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని తెలిపారు. శ్వేతపత్రాలపై జన్మభూమిలో చర్చకు పెడతామన్నారు. ‘బీటీఏ’ డైరీని ఆవిష్కరించిన సీఎం సాక్షి, అమరావతి బ్యూరో: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) రూపొందించిన 2019 డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్చంద్ర, ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి బట్టు వెంకయ్య, ఉపాధ్యాక్షుడు మీర్జా అబుతురాబ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ
న్యూఢిల్లీ : జాతీయ స్ధాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ల ఏర్పాటు ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం విఫలమైందని అన్నారు. తెలంగాణలో కూటమికి చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, అక్కడే కూటమికి తొలిదెబ్బ తగిలిందన్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారన్న విషయం తనకు తెలియదని మోదీ వ్యాఖ్యానించారు. -
త్వరలోనే కూటమి సాకారం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ– బహుజన్ సమాజ్ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న వార్తలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. పొత్తుపై చర్చలు ప్రారంభమవుతాయని త్వరలోనే కూటమి ప్రజల ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ –బీఎస్పీలు కలసి పనిచేయడంతో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి త్వరలోనే చర్చలుంటాయని అఖిలేశ్ తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అఖిలేశ్ మెచ్చుకున్నారు. అందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలు ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు బదిలీలు తప్పించుకునేందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలను అనుసరిస్తున్నారని అఖిలేశ్ అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు రెట్టింపయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా లేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రోత్సాహంతోనే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల అంశంలో లబ్ది పొందుతున్నారన్నారు. వచ్చే ఏడాది దేశం మరో కొత్త ప్రధానిని చూస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీకాదని, ఆరెస్సెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అఖిలేశ్ విమర్శించారు. -
మోదీ ప్రయోగించిన బుల్లెటే కేసీఆర్: పొన్నం
మానకొండూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోగించిన బుల్లెట్ కేసీఆర్ అని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న ఆయన్ను నమ్మవద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిం చకుండా, మంత్రివర్గ విస్తరణ చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలి ఫెడరల్ ఫ్రంట్ పేరు తో రాష్ట్రాలు తిరుగుతున్నారన్నారు. 2006లోనే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకూ అధికారంలో ఉండి ఎందుకు తిరుగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాం తీయ పార్టీలను కలుపుకొని ఎందుకు ముందుకు వెళ్లలేకపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మోదీని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిం చారు. బీజేపీ నియంతృత్వ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ కూటమి ఏర్పడటంతోనే ఫెడరల్ ఫ్రంట్ పేరిట బీజేపీ బీ–టీంను ముందుకు తెచ్చిం దని ఆరోపించారు. -
కేసీఆర్ కేబినెట్ : అమాత్య యోగం ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. కొత్త కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో ఒకటికి రెండుసార్లు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. సామాజిక లెక్కలు, ఉమ్మడి జిల్లాల వారీగా సమీకరణలను బేరీజు వేస్తున్నారు. మరోవైపు ఫెడరల్ ఫ్రం ట్‌తో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పాల నా పరంగా ఇబ్బంది లేకుండా ఆయన తన కొత్త బృందంలోని సభ్యులను ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం తన ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనలను ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్రవారం నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన ఒకరోజు పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత కేబినెట్ విస్తరణ చేయాలా.. అసెంబ్లీని సమావేశపరచి స్పీకర్ ఎన్నిక జరపాలా అనే విషయంలో ఆయన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తవుతాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ లో సమీకరణలు మరింత సులభం కానుందని సీఎం భావిస్తున్నారు. జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్న దృష్ట్యా ఆలోపే మంత్రివర్గ విస్తరణతోపాటు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉంది. మినీ కేబినెట్.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో 18 మందితోనే మంత్రివర్గం ఉండాలి. సీఎంగా కేసీఆర్, తొలి మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. ఇక మరో 16 మందికి అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల వరకు తక్కువ మందితోనే మంత్రివర్గాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మరో 8 లేదా 10 మందికి అవకాశం దక్కవచ్చని సమాచారం. ఇలా చేస్తే ఓసీలలో నలుగురు, బీసీలలో ఇద్దరు... ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరు వంతున కేబినెట్లో ఉండనున్నారు. శాసనసభ సిద్ధం... కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి అనుగుణంగా శాసనసభ సిద్ధమైంది.అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే కార్యక్రమం నిర్వహించేలా అసెంబ్లీ అధికార యంత్రాంగం సిద్ధమైంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో అసెంబ్లీ మొత్తం కొత్త శోభను సంతరించుకుంది. రంగులు వేయడంతోపాటు విద్యుద్దీకరణ మరమ్మతులను పూర్తి చేశారు. సాంకేతికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్పీకర్గాఎవరు? కొత్త ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరిని వరించనుందనేది టీఆర్ఎస్లో ఆసక్తికరంగా మారింది. ఈ పదవి చేపట్టిన వారు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనల నేపథ్యంలో దీనిపై ఎవరూ ఆసక్తి చూపడంలేదు.అంతర్గతంగా ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని టీఆర్ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీలో బీసీ వర్గానికి స్పీకర్ పదవికి కేటాయించినందున ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.అలాగే సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, డి.ఎస్.రెడ్యానాయక్ పేర్లను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
నిదానమే ఫెడరల్ ఫ్రంట్‌కి ప్రధానం
కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకోవడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఘోరంగా ఓడిపోవడం ఆయన పరపతిని మంటగలిపింది. దీంతో జాతీయస్థాయి నాయకులంతా కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంపై తనకేమీ కాంక్షలేదని కేసీఆర్ హుందాగా ప్రకటిస్తే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయిక్, మాయావతి చాలా సంతృప్తి చెందుతారు. కేసీఆర్ నేరుగా ఏపీలో ప్రచారానికి వెళితే దుష్పరిణామాలు తప్పవు. కేసీఆర్‌ని వ్యతిరేకించాలంటూ టీడీపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. సెటిలర్లతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కేసీఆర్ ఏపీ ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చు. ‘విజయానికి చాలామంది తండ్రులుంటారు, కానీ ఓటమి మాత్రం అనాథ’ అని నెపోలియన్ అన్నట్టు కేసీఆర్ కనుక ఓడిపోయి వుంటే ఆయన గురించీ, ఆయన కుటుంబం గురించీ అందరూ జోకులేసుకుని ఉండేవారు. ఎన్నోరకాల ఆరోపణలు వెల్లువెత్తేవి. శత్రుత్వం ఉందని భావిస్తున్న రాహుల్ గాంధీ కుటుంబం కూడా కేసీఆర్ ఓటమికి సంతోషపడి ఉండేది. తెలంగాణను ఇవ్వడంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా కోల్పోయింది. కానీ, కేసీఆర్ గెలవడంతో అందరూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. డిసెంబర్ 11, 2018న విజయోత్సవ ప్రసంగం చేస్తూ కేసీఆర్ రెండు రాజకీయ ప్రణాళికలను ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ లేని జాతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తా మని కేసీఆర్ మొదట ప్రకటించారు. బీజేపీకి కేవలం తాను మాత్రమే ప్రతిపక్షంగా ఉండాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఇది చేదు వార్తే. ఇక రెండోది తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వడానికి ఆంధ్రా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాననడం. కేసీఆర్ అన్నట్టుగానే ఈ రెండు పనులూ చేయగలరు. అయితే, ఆయన ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విజయం ఆయనకు జాతీయ స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టి ఉండ వచ్చు. కానీ, విఫలమైతే తెలంగాణలో ఆయన ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. వీటిని సాధించాలంటే తన కుటుంబ సభ్యులపైనా, పార్టీ సభ్యులపైనా కాకుండా బయటి శక్తులపై ఆధారపడటం మంచిది. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా కేసీఆర్‌ను ఓడించా లని చంద్రబాబు అనుకున్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి తమకు 2014లో వచ్చిన ఓట్లు సరిపోతాయని కాంగ్రెస్, టీడీపీ చెప్పుకున్నాయి. ఆ నమ్మకంతోనే తెలంగాణ పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ తనను తాను ‘తెలంగాణ తల్లి’గా అభివర్ణించుకున్నారు. ఆ విధంగా లభించబోయే కాంగ్రెస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. కానీ, రెండు, రెండు కలిపితే నాలుగు అవుతుందనే తరహా ఈశాన్య భారతపు రాజకీయ నాయకుల జిమ్మిక్కులు తెలుగు ప్రజలపై పనిచేయక చాలాకాలమైంది. చంద్రబాబు రాహుల్ గాంధీని కలవగానే, వారిద్దరూ చాలా తెలివైనవారనీ; మహాకూటమి కేసీఆర్‌ను ఓడించితీరుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ, దిమ్మతిరిగే ఓటమి ఎదురయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును నిందిస్తోంది. ఆయన నుంచి వెంటనే విడాకులు తీసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఓటమితో చంద్రబాబు అనాథగా మారడంతోపాటు ‘ఆంధ్రా ఐరన్ లెగ్’గా పేరుపడ్డారు. 2018 ఎన్నికల్లో 80 శాతం మంది సెటిలర్లు చంద్రబాబును ఓడించాలనే కేసీఆర్‌కు ఓటు వేయడం అత్యంత ముఖ్యమైన అంశం. చంద్రబాబుకు పోటీగా... ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు అది ప్రత్యామ్నాయంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దీంతో ఇది చంద్రబాబును సూటిగా తాకుతోంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలతో చక్రం తిప్పడంలో తనకు విస్తృతమైన అనుభవం ఉందని చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కేసీఆర్ పోటీదారుగా నిలిచాడు. కేసీఆర్ కూడా చక్రం తిప్పాలనుకోవడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. సీఎంగా ప్రస్తుతం కేసీఆర్ వెలిగిపోతుండగా, బాబు భవిష్యత్ సందేహంలో ఉంది. అందువల్ల జాతీయ నాయకులంతా కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. తెలంగాణలో ఘోరంగా ఓడిపోవడం చంద్రబాబు పరపతిని మంటగలిపింది. తెలంగాణ ఓటమి తర్వాత జాతీయ నాయకులు చంద్రబాబుకు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ, పలువురు నేతలను కలుసుకుంటుండటంతో చంద్రబాబు ప్రాధాన్యత మరింత మసకబారింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు. ఆయనను చంద్రబాబు ఓడిస్తారని రాహుల్ నమ్మారు. కేసీఆర్ ఓడిపోతే ఆయనపై తీవ్రంగా దాడిచేయాలని కూడా రాహుల్ భావించారు. చంద్రబాబు గొప్పలను నమ్మి, విజయం ఖాయమని విశ్వసించి మోసపోయారు. కేసీఆర్‌ను మరింత పెద్ద శత్రు వును చేసుకోకుండా రాహుల్ జాగ్రత్త వహించాలి. జాతీయవేదికపై రాహుల్‌కు కేసీఆర్‌తోనే ఎక్కువ ప్రమాదం. రాహుల్‌ను తీవ్రంగా దుయ్యబట్టి ‘రిటర్న్‌గిఫ్ట్’ ఇవ్వగలిగిన స్థితిలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల్లో స్పష్టమైన విభజన కనిపిస్తున్నందున మోదీకంటే కేసీఆరే రాహుల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలువనున్నారు. మాటలు జాగ్రత్త విజయపు కీర్తిని విజేతలే చేజేతులా తుడిచేసుకున్న ఉదాహరణలు చరిత్రనిండా కొల్లలుగా ఉన్నాయి. పెద్దపెద్ద కోరికలు ఉన్నట్టు ప్రకటించకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాగానీ, నాయకత్వంపై తనకేమీ కాంక్షలేదని హుందాగా కేసీఆర్ ప్రకటిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. దీని అర్థం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతిలాంటి వారినెవరినైనా ప్రధానిగా అంగీకరించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టే. కేసీఆర్ ఇటువంటి ప్రకటన గనుక చేసినట్లయితే, వాళ్లు చాలా సంతృప్తి చెందుతారు. మరోవైపు చంద్రబాబును రాహుల్ రహస్య ఏజెంట్‌గా భావిస్తున్నందున జాతీయ రాజకీయాలపై ఆసక్తి వున్న నేతలంతా కేసీఆర్‌తో మరింత స్నేహంగా మెలుగుతారు. కేసీఆర్ సరిగ్గానే వ్యవహరిస్తున్నప్పటికీ చాలా ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరకపోవచ్చు. కానీ, ఆ పార్టీలకు ఆయనపట్ల అభిమానం ఏర్పడుతుంది. అదే కేసీఆర్ సాధించగలిగే గొప్ప విజయం. దాంతో రాహుల్, చంద్రబాబుల స్థాయిని కేసీఆర్ తగ్గించగలుగుతారు. అంతేకాదు, సోనియా, రాహుల్, చంద్రబాబు ఎప్పటికీ తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటారు. సెటిలర్స్‌తో జాగ్రత్త ఏపీలో చంద్రబాబును ఓడించడం కేసీఆర్ రెండో లక్ష్యం. కేసీఆర్ లక్ష్యం సులువుగానే నెరవేరుతుంది. కాకపోతే అందుకు కేసీఆర్ ప్రత్యేకమైన ఎత్తుగడలు అనుసరించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి చాలా వ్యతిరేకత ఉంది. చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వచ్చినట్టే కేసీఆర్ కూడా అక్కడకు వెళితే దుష్పరిణామాలు తప్పవు. ఆంధ్ర రాజకీయాల్లో కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే, ఉమ్మడి ఏపీలో కేసీఆర్ ఎప్పుడూ సీఎంగా లేరు. సామాన్య ప్రజానీకానికి ఆయన గురించి పూర్తిగా తెలియదు. దాంతో కేసీఆర్‌ను వ్యతిరేకించాలంటూ టీడీపీ ప్రచారం ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబును ఓడించడానికి కేసీఆర్‌కు ఇతర మార్గాలు చాలానే ఉన్నాయి. తెలంగాణలో లక్షలాదిమంది ఆంధ్ర సెటిలర్లు ఉన్నారు. వారికి ఏపీతో బలమైన సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. సెటిలర్లతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కేసీఆర్ ఏపీ ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చు. తెలంగాణలో మైనారిటీలపట్ల చూపుతున్నట్టే సెటిలర్లపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలి. ఆంధ్ర సెటిలర్స్‌తో కేసీఆర్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నట్లయితే, అది ఆంధ్ర రాజకీయాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ను శత్రువుగా చూపించవచ్చు. అందుకని, కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేయకుండా, ఆంధ్రలో నేరుగా పర్యటించకుండా జాగ్రత్త వహించాలి. ఆంధ్ర లోని ఏదైనా రాజకీయ పార్టీగా కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే అది ఆయనకే ఎదురుతగలడంతోపాటు చంద్రబాబుకు లబ్ధి చేకూరుతుంది. కేసీఆర్ ఈ చిల్లర రాజకీయాల్లో కూరుకుపోకూడదు. వీటికి దూరంగా ఉండటం ద్వారా కేసీఆర్ తన స్థాయిని పెంచుకోవచ్చు. మిగలని చక్రం కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో అంటకాగాల్సిన అవసరంలేని ప్రాంతీయ పార్టీ నేతలకు ఫెడరల్ ఫ్రంట్ ఓ గొప్ప అవకాశం. మమతా బెనర్జీ, మాయావతి, నవీన్ పట్నాయక్ వంటి నేతలు, తమిళనాడులోని ఏడీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు అటు బీజేపీతోనో, ఇటు కాంగ్రెస్‌తోనో జతకట్టే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరకపోయినప్పటికీ వాటి మద్దతు మాత్రం తప్పకుండా ఉంటుంది. మమతా బెనర్జీ వంటి నేతలు నేరుగా కాంగ్రెస్‌కు ఎదురు నిలువక పోయినా, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తామనే సందేశాన్నిస్తారు. దీంతో జాతీయ నాయకులుగా ఎదగడానికి కాంగ్రెస్ ఆసరా అవసరం లేదని, తమకు చాలా ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని వారు చాటుకోవడానికి వీలవుతుంది. చంద్రబాబు అత్యుత్సాహం చూపితే ఇతర పార్టీలు దూరం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే మమతా, మాయావతి స్పష్టం చేశారు. దీంతో జాతీయ వేదికపై చంద్రబాబు స్థాయిని తగ్గించడం ద్వారా కేసీఆర్ ఇప్పటికే చిన్నపాటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. పాపం, ఇప్పుడు ఢిల్లీలో తిప్పడానికి చంద్రబాబుకు ఏ చక్రం మిగలలేదు. కేసీఆర్ హడావుడి పడకుండా, సందర్భానుసారం ఆచితూచి అడుగులు వేస్తే జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు పొందడం ఖాయం. వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
కొత్త కూటమి.. అదే కేసీఆర్ మిషన్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అదే కేసీఆర్ మిషన్ అని ఆయన వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక వెల్లడిస్తామని సీఎం స్పష్టం చేశారు. ‘ఫెడరల్ ఫ్రంట్’రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాల పర్యటన ప్రారంభించిన సీఎం కేసీఆర్ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం మమతతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జాతీయ రాజకీయాలపై, ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించాం. సమావేశం ఫలప్రదంగా జరిగింది. ఇకపైనా చర్చలు ఇలాగే కొనసాగిస్తాం. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నదే మా లక్ష్యం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సినv అవసరం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నిన్నటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యాను. ఇప్పుడు మమతా బెనర్జీని కలిశాను. తెలంగాణ ఎన్నికల్లో గెలిచాక మమత నాకు శుభాకాంక్షలు తెలిపారు. నేను కృతజ్ఞతలు తెలిపాను. ఇప్పుడు ఇద్దరం కలిసి పరస్పర ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలపై చర్చించాం. ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దాని బలోపేతం కోసం కృషి చేస్తాం. కేసీఆర్ మిషన్ ఏంటని మీరు అడుగుతున్నారుగా.. బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయంలేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే మా మిషన్. ఫెడరల్ ఫ్రంట్ అంటే ఆదరాబాదరాగా చేయాల్సింది కాదు. ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయి. అన్ని విషయాలు ఆచరణలోకి వస్తాయి. త్వరలో పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తాం. మంచి వార్త చెబుతాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పూరీలో పూజలు... ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నివాసంలో బస చేసిన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు.. సోమవారం ఉదయం భువనేశ్వర్ నుంచి పూరీ చేరుకున్నారు. పూరీ ఆలయ అధికారుల సీఎం కేసీఆర్కుు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్నాథస్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తిరిగి భువనేశ్వర్‌కు చేరుకున్న కేసీఆర్.. విమానంలో కోల్‌కతాకు చేరుకున్నారు. పశ్చిమబెంగాల్ సచివాలయంలో మమతతో సమావేశం అనంతరం.. కుటుంబ సభ్యులతో కలిసి కోల్‌కతాలోని కాళీమత ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హస్తినలో కేసీఆర్ బిజీ బిజీ మూడ్రోజుల పర్యటనలో భాగంగా కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలువురు ప్రాంతీయ పార్టీల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌తో వేర్వేరుగా భేటీ అవుతారు. 26వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలుస్తారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి కేసీఆర్ చర్చిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తోనూ సమావేశమవుతారు. ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితిని బట్టి సీఎం ఢిల్లీ పర్యటనలో మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే! మహాకూటమి ఏర్పాటును అడ్డుకునేందుకు కేసీఆర్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తద్వారా.. బీజేపీకి లబ్ధి జరిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడింది. వివిధ పక్షాలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే కేసీఆర్ లక్ష్యమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రాంతీయ పార్టీల సహకారంతో 2019లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు. కేసీఆర్ ఉచ్చులో ప్రాంతీయ పార్టీలు పడే అవకాశం లేదని సింఘ్వీ అన్నారు. -
కోల్‌కతా చేరుకున్న సీఎం కేసీఆర్
-
కోల్‌కతా చేరుకున్న సీఎం కేసీఆర్
కోల్‌కతా : కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకువస్తానన్న తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన కేసీఆర్.. ఈరోజు(సోమవారం) కోల్‌కతా చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు చేరుకున్న కేసీఆర్‌ను దీదీ సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ భేటీ అనంతరం కేసీఆర్ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయల్దేరి వెళతారు. అక్కడే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ అధినేతలు, మాజీ ముఖ్యమంత్రులు మాయావతి(బీఎస్పీ), అఖిలేష్ యాదవ్(ఎస్పీ)లను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రానున్ను సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల సీఎంల(కాంగ్రెస్) ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె హాజరుకాకపోవడంతో ప్రస్తుతం కేసీఆర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని...
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నంలోని శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వానికి శారదాంబ అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలోని శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు బహూకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం స్వామీజీతో కలసి సతీసమేతంగా పీఠంలోని శార దాంబ, రాజశ్యామల, వల్లీదేవి సమేత సుబ్రçహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వారి ఆలయాలతోపాటు స్వర్ణ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలో నిత్యం జరిగే యజ్ఞ, యాగాలు, హోమాలు, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే శమీ వృక్షం చుట్టూ కేసీఆర్ దంపతులు ప్రదక్షిణలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం చక్కటి ఫలితాలు ఇవ్వడంతో ఆ రోజే స్వామీజీకీ కేసీఆర్ మాటిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే పీఠాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఆశ్రమంలో గడిపిన కేసీఆర్... అందులో గంటా 20 నిమిషాలపాటు స్వామీజీతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య పలు ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా తాను ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్వామీజీ సలహాలను కేసీఆర్ తీసుకున్నారని సమాచారం. తెలంగాణ ప్రజల అభిమానం, దేవుని ఆశీస్సులతో తాను రెండోసారి అధికార పగ్గాలు చేపట్టానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారని పీఠం సిబ్బంది తెలిపారు. ఉద్యమ సమయంలోనూ.. ఆ తర్వాత రెండుసార్లు సీఎం కావడంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు ఎంతో ఉన్నాయని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు. గతంలో ప్రధాని కాకముందు పీవీ నర్సింహారావు కూడా పీఠా న్ని సందర్శించి స్వామిజీ ఆశీస్సులు పొందేవారని సిబ్బంది పేర్కొన్నారు. హోరెత్తిన కేసీఆర్ నినాదాలు... ముఖ్యమంత్రి రాకతో విశాఖ ఎయిర్‌పోర్టు, శారదాపీఠం పరిసరాలు కేసీఆర్ నినాదాలతో హోరె త్తాయి. ఎయిర్‌పోర్టు నుంచి పీఠం వరకు దారిపొడవునా రోడ్లకు ఇరువైపులా కేసీఆర్‌కు స్వాగతం పలు కుతూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు వద్ద, పీఠం వద్ద జనం ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టు వద్ద బోనాలతో సినీ నటి రమ్యశ్రీ సహా పెద్ద ఎత్తున మహిళలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఏపీ టీఆర్ఎస్ నేతలమంటూ విజయవాడ నుంచి కొణిజేటి ఆదినారాయణ అనుచరులతో కలసి పార్టీ కండువా లు, జెండాలతో రాగా, కాకినాడ నుంచి వచ్చిన దూసర్లపూడి రమణరాజు అన్నవరంలో కేసీఆర్ కోసం పూజలు చేశానంటూ కేసీఆర్ ఫొటో ఫ్రేమ్, సత్యదేవుని ప్రసాదంతో పీఠం వద్దకు వచ్చారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కేసీఆర్ సామాజిక వర్గీయులు పీఠం వద్దకు చేరుకుని కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పీఠంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కేసీఆర్ తన కారు దిగి అభిమానులకు అభివాదం చేయడంతో పీఠం పరిసరాలు నినాదాలతో హోరె త్తాయి. కేసీఆర్ వెంట ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి ఉన్నారు. వారికి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు స్వాగతం పలికారు. -
మరో ఉద్యమం మొదలైంది
సాక్షి, హైదరాబాద్/భువనేశ్వర్: దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పుంజుకుంటోందని, ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్ని ఒక తాటిపైకి తెచ్చే ఉద్యమం ప్రారంభమైందని సీఎం కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అద్భుత శక్తిగా వెలుగొందుతున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు ప్రారంభించడంతో జాతీయ స్థాయిలో గుణాత్మక రాజకీయ శక్తి ఆవిష్కరణ ప్రక్రియకు బీజం పడిందని వ్యాఖ్యానించారు. సమాన ఆశ యాలు, కార్యాచరణతో విజయ పంథాలో కొనసాగుతున్న నవీన్.. తనతో ఏకీభవిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమ ప్రయత్నాలతో దేశానికి ప్రయోజనం కలగనుందని, సమీప భవిష్యత్తులో సత్ఫలిలొస్తాయని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు ఆదివారం సీఎం కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’సంప్రదింపుల ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన రాజకీయ పార్టీల తరహాలో ప్రాంతీయ పార్టీల్లో వర్గ విబేధాలు లేవని ఇరువురు సీఎంలు ప్రకటించారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రజాహిత పథకాలు, కార్యాచరణ పట్ల ఇరువురు నాయకులు ఒకర్ని ఒకరు ప్రశంసించుకున్నారు. పూజలతో తొలి అడుగు... టీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం నెల రోజుల పాటు అద్దెకు తీసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ శారదా పీఠాన్ని సందర్శించి రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుని ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లారు. సాయంత్రం 6.15 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఒడిశా సీఎం అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేశారు. మళ్లీ కలుస్తాం: కేసీఆర్ నవీన్ పట్నాయక్‌తో జరిపిన చర్చల్లో రహస్యం ఏమీ లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. గుణాత్మక మార్పు కోసం చర్చలు జరిపామని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే నిర్దిష్టమైన ఫలితం రాదని, సమీప భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్నామన్నారు. త్వరలో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు. దేశంలోని మరింత మందితో చర్చించాల్సిన అవసరముందన్నారు. బీజేపీకి టీఆర్ఎస్.. బీ టీం అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేసీఆర్ తోసిపుచ్చారు. ఈ విషయంలో నవీన్ కూడా ఏకీభవించారని తెలిపారు. ఒడిశా ప్రజల కోసం, అక్కడి రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న నవీన్ పట్నాయక్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. నవీన్ ఆదర్శనీయుడని, దేశంలో స్వప్రయోజనాలు ఎరగని రాజకీయ నేత అని కొనియాడారు. అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో ఆయన చేసిన పోరాటం తనకు తెలుసన్నారు. ఇటీవల ఒడిశాలో తీసుకొచ్చిన వ్యవసాయ పాలసీని కేసీఆర్ మెచ్చుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా పట్ల నవీన్ పట్నాయక్ చూపుతున్న చొరవకు అభినందనలు తెలిపారు. ఇంకా ఆ స్థాయికి రాలేదు: నవీన్ పట్నాయక్ జాతీయ, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కూటమిలో భాగస్వామ్యం, పురోగమనం వంటి అంశాలపై తాము చర్చించామని నవీన్ పట్నాయక్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయ విధానం బాగుందని, అందులోని కొన్ని ప్రగతిశీల అంశాలను తాము అమలు చేసే వ్యవసాయ విధానంలో చేర్చినట్లు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై వైఖరి తెలపాలని విలేకరులు అడగ్గా.. చర్చలు ఇంకా అంతవరకు పురోగమించలేదని నవీన్ బదులిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సాధారణ చర్చ జరిపామని, చర్చలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఒకే ఆలోచన విధానం కలిగిన పక్షాల మధ్య స్నేహం కొనసాగింపుతో సహా చాలా అంశాలను చర్చించినట్టు వెల్లడించారు. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు జగన్నాథస్వామికి కృతజ్ఞతలు తెలపడానికి కేసీఆర్ ఒడిశా వచ్చారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. నేడు మమతతో భేటీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. తొలుత ఆయన కటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయానికి వెళతారు. తర్వాత జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు. 25వ తేదీ నుంచి రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తోనూ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. -
‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’
-
‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’
భువనేశ్వర్: దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలో నవీన్ పట్నాయక్‌ను మళ్లీ కలుస్తానని తెలిపారు. నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. తామిద్దరం రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్టు తెలిపారు. భావ సారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించిననట్టు పేర్కొన్నారు. అంతకుముందు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ నేరుగా నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లారు. అక్కడ నవీన్ పట్నాయక్ కేసీఆర్‌కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. -
భువనేశ్వర్ చేరుకున్న కేసీఆర్
భువనేశ్వర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నాయకులు చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి కేసీఆర్ నవీన్ పట్నాయక్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం ఒడిశాలోని కోణార్క్, పూరీ దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం కేసీఆర్ కోల్‌కతా వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు.. నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతితో అర్ధగంట పాటు భేటీ అయిన కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. -
విశాఖలో హల్చల్ చేస్తున్న కేసీఆర్ కటౌట్లు
-
విశాఖ విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీ సంతోష్, తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి.. సాదరంగా వీడ్కోలు పలికారు. విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు. విశాఖలో భారీ కేసీఆర్ కటౌట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ పర్యటన నేపథ్యంలో శారదాపీఠం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో భారీగా పోలీసులను మొహరించారు. తెలంగాణా పోలీసులు కూడా శారదాపీఠం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆశ్రమంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ విశాఖకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ.. విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే మార్గంలో భారీ కటౌట్లు వెలిశాయి. ఈ మార్గంలో వెలిసిన కేసీఆర్ కటౌట్లు పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
నేటి నుంచి కేసీఆర్ ‘ఫెడరల్’ పర్యటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పరిస్థితినిబట్టి షెడ్యూల్ ఒకటి, రెండు రోజులు అటుఇటుగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖ చేరుకున్నాక శారదా పీఠాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు. -
తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తామని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందిచార’ని కవిత వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్‌లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ తథ్యం కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు. -
కేసీఆర్ జైత్రయాత్ర!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ బలోపేతంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి తమతో కలసి వచ్చే పార్టీలను సమీకరించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే రాష్ట్రాల వారీగా పార్టీలతో కలసి పని చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారంలో ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణ ప్రారంభించనున్నారు. మొదట ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. అనంతరం వరుసగా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉండే ప్రాంతీయ పార్టీలతో కలసి సమాఖ్య వ్యవస్థ బలోపేతం నినాదంతో ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించి పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోరారు. అనంతరం మరిన్ని రాష్ట్రాల్లోని పార్టీలతో సమన్వయం చేసే ఆలోచన చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరదని భావించారు. ముందుగా తెలంగాణలో విజయం సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని యోచిం చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. ప్రజలు టీఆర్ఎస్ను మరోసారి గెలిపించడం జరిగిపోయాయి. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరిగింది. సీఎం హోదాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ సమీకరణ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండే బిజూ జనతాదళ్ వంటి పార్టీ లను ముందుగా కలుపుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకుబాధ్యతలు ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఫెడరల్ ఫ్రంట్ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్యెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలతో కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు బాధ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు అక్కడి ప్రాం తీయ పార్టీలతో సమన్వయం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా వ్యూహం రచిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రణాళికలను ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని చూస్తున్నారు. ఢిల్లీ పర్యటన సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలయ్యేలా కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తమతో కలసి వచ్చే పార్టీల సమన్వయం కోసం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా ఫెడరల్ ఫ్రంట్ కీలక కార్యాచరణపై ఢిల్లీ వేదికగా కేసీఆర్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
హెచ్డీ దేవేగౌడతో కేసీఆర్ కీలక భేటీ
-
మాజీ ప్రధానితో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు విచ్చేసిన దేవేగౌడ ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త కూటమి ఏర్పాటులో సహకారం అందించాల్సిందిగా మాజీ ప్రధాని దేవేగౌడను కేసీఆర్ కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా దేవేగౌడకు సీఎం కేసీఆర్ కాకతీయ కళాతోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ సంతోష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే తన ఎజెండాగా ఇటీవల బెంగళూరుకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, కర్ణాటక ప్రస్తుత సీఎం హెచ్డీ కుమారస్వామితో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలతో వేదికను పంచుకోవడం ఇష్టం లేని కారణంగా సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఒకరోజు ముందుగానే వెళ్లి ఆయనకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై అంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. -
నేడు హైదరాబాద్ రానున్న దేవెగౌడ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భనవ్‌కు వెళ్లి దేవెగౌడ సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. -
కాళేశ్వరం కోసం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
-
ఏడు నెలల విరామం తరువాత ఢిల్లీకి కేసీఆర్
-
కేసీఆర్ మోదీతో కుమ్మక్కయ్యారు..
సాక్షి, ఢిల్లీ : ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కేసీఆర్‌ను పొగుడుతున్నారని గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌తో అందర్నీ చీల్చు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లున్నారు. కేసీఆర్ మోదీతో కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద కేసీఆర్ ...మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ని ప్రజల నమ్మరని నారాయణ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మొదటి దశగా నిరుద్యోగులకు 25 వేలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు 50 వేలు ఉద్యోగాలు ప్రకటించాము అంటున్నారు. మరీ ఇచ్చిన హామీలలో ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఏమైంది? కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేయాలని’ నారాయణ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ. 4000 రైతులకు ఉపయోగపడిందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రూ. 4000 రైతులకు ఇచ్చి, పరమానందయ్య శిష్యులు మొద్దుకి సూది పొడిచినట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజల సొమ్ము వాడుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజల్‌లను జీఎస్టీలలో కలపాలన్నారు. జీఎస్టీలో కలపడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 4 లక్షల కోట్ల భారం తగ్గుతుందని నారాయణ సూచించారు. -
మోదీ, మమతపై నిప్పులు చెరిగిన ఏచూరి
కోల్‌కతా: 2019 లోక్‌సభ ఎన్నికల తరువాతే కూటమిపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఏచూరి పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఆ ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో.. రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని సీపీఎం జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని ఏచూరి తెలిపారు. ఎన్నికల తర్వాతనే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మేం కుడా ఎన్నికల అనంతరమే ఫెడరల్ ఫ్రెంట్‌పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలకు యూపీలోని ఎస్పీ-బీఎస్పీ కూటమి మంచి ఉదాహరణగా గుర్తుచేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏచూరి విమర్శలు గుప్పించారు. బెంగాల్లో మమత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం మమతకు, ప్రధాని నరేంద్ర మోదీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయని, వారిద్దరూ మతతత్వ ఘర్షణలను ప్రోత్సహించేవారేనన్నారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో, మమత హటావో.. బెంగాల్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన మమత, ఏచూరి ఒకే వేదికను పంచుకున్న మరునాడే ఏచూరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఫెడరల్ ఫ్రంటే గేమ్ చేంజర్: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ విమెన్స్ ప్రెస్ కార్ప్‌లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు. తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంటూ అంటూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్: ఎంపీ కవిత
ఢిల్లీ : రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినా మళ్లీ అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకే రైతుబంధు పథకం తెచ్చామని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రైతు బంధు పథకం ఉపయోగపడుతుందని అన్నారు. దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలు అనే భేదాలు వద్దని, మనమందరం భారతీయులమని అన్నారు. ఫలితాలిచ్చే రాష్ట్రాలను, ఫలితాలు చూపని రాష్ట్రాలను ఒక గాటన కట్టొద్దని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ అని అన్నారు. అందుకే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంట్ అని ఇతర పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాల మార్పిడి కాదు, వ్యవస్థలో మార్పు కావాలని పేర్కొన్నారు. ‘ఫెడరల్ ఫ్రంట్ గేమ్ చేంజర్’ అని వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పక్రియ కొనసాగుతుందని, తమ జెండా నచ్చి వచ్చే వారందరికీ స్వాగతం చెబుతామని తెలిపారు. బీజేపీకి తాము సన్నిహితంగా లేమని, మోదీ ప్రభుత్వంతో వర్కింగ్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశాన్ని మార్చే అవకాశాన్ని మోదీ జారవిడుచుకున్నారని, ఈ ఏడాదిలోనైనా రైతులకు మేలు చేస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను పరిగణలోనికి తీసుకోకుండా పాలసీలు రూపొందించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. -
‘మనది ఫెడరేషన్ కాదు యూనియన్’
తెలుగు రాష్ట్రాల సీఎంలు భారత యూనియన్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తనవంతుగా కేంద్రం మిథ్య రాష్ట్రాలే నిజం అంటూ ఎన్టీరామారావు భావనను మళ్లీ తలకెత్తుకుంటున్నారు. ఇది పూర్తిగా తప్పు భావన. భారతదేశం ఫెడరేషన్ కానేకాదు. అది రాష్ట్రాల యూనియన్ మాత్రమే. 1947కి ముందు దేశంలో రాష్ట్రాలు అనేవే లేవు. బ్రిటిష్ పాలన కింది ప్రాదేశిక ప్రాంతాలు మాత్రమే ఉండేవి. 500 స్థానిక సంస్థానాలు నవాబులు, రాజాలు, మహారాజుల పాలనలో ఉండేవి. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం హైదరాబాద్, కశ్మీర్ తప్ప తక్కిన 500 సంస్థానాలు ఇండియన్ యూనియన్ లేక పాకిస్తాన్లో విలీనమయ్యాయి. ఈ విలీనం కూడా ఇండియన్ యూనియన్తోనే కానీ ఫెడరల్ స్టేట్ ఆఫ్ ఇండియాతో కాదన్నది వాస్తవం. భారత రాజ్యాంగం కూడా ఇండియన్ యూనియన్ అనే పదాన్నే ఉపయోగించింది తప్పితే ఇండియన్ ఫెడరేషన్‌ని కాదు. భారత యూనియన్, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఇండియన్ యూనియన్‌తో లేని రాష్ట్రాలు 18వ శతాబ్ది నాటి అస్థిరత్వ కేంద్రాలైన సంస్థానాలనే గుర్తుకు తెస్తాయి. ప్రాంతీయవాదం, భాషా వాదం, కులతత్వం, మతతత్వం వంటి ఆలోచనలను నాయకులు, రాజకీయ పార్టీలు ప్రేరేపించినట్లయితే దేశం మళ్లీ స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఖాయమంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేం ద్రప్రసాద్ రాజ్యాంగ సభ ముగింపు సమావేశంలో చేసిన హెచ్చరికలను మర్చిపోకూడదు. -త్రిపురనేని హనుమాన్ చౌదరి,ప్రజ్ఞాభారతి చైర్మన్, హైదరాబాద్ -
ఫ్రంట్ టూర్లకు విరామమిచ్చిన కేసీఆర్
-
ఫ్రంట్ లేదు.. ఏమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంటూ లేదు. టీఆర్ఎస్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్గతంగా సమస్యలేవో ఉన్నట్టున్నాయి. ఇదంతా స్థానిక సమ స్యలు చర్చకు రాకుండా దృష్టి మళ్లించే ఎత్తుగడ’’ అని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఫ్రంటు గురిం చి నాతో ఎవరూ మాట్లాడలేదు. ఇలాంటి ఎత్తుగడలను మీరు పట్టించుకోవాల్సిన పని లేదు’’అని తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలకు సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో జరిగిన సమావేశంలో బాబు మాట్లాడారు. ఫ్రంట్ లు, పొత్తుల గురించి పట్టించుకోకుండా తెలం గాణలో పార్టీ బలం పెంచుకోవడానికి పని చేయాలని వారికి సూచించారు. ‘‘తెలంగాణ లో త్రిముఖ పోటీ ఉంటుంది. తద్వారా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి అవకాశాలుంటాయి’’ అని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మెతక వైఖరితో ఉండకుండా సమస్యలపై పోరాడాలని ఆదేశించారు. ‘‘రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు పక్షపాతం లేకుండా విశాల దృక్పథంతో వ్యవహరించాలి. గ్రూప్ రాజకీయాలొద్దు’’అంటూ మందలించారు. టికెట్లను చాలా ముందుగానే ప్రకటిస్తానని చెప్పారు. ‘‘పార్టీ కార్యక్రమాలు సరిగా నడవడం లేదు. పార్టీపరంగా బలోపేతం కావడంపై దృష్టి పెడితే ఎవరైనా పొత్తుల కోసం వస్తారు. బలహీనంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు?’’ అని అన్నారు. ‘‘కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు చాలా ఉంటాయి. అప్పటిదాకా రాజకీయ ముఖచిత్రంపై అంచనా రాదు. పొత్తు విషయంలో బీజేపీ తొందరపడి నష్టపోయింది. టీడీపీని అంటరాని పార్టీ అన్నట్టుగా మాట్లాడినందుకు చాలా నష్టపోతుంది’’ అన్నారు. బీజేపీతో తెగదెంపులే: రావుల భేటీ వివరాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ మహానాడు ఉంటుందన్నారు. 24న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ మహానాడు నిర్వహిస్తామన్నారు. దీనికి బాబు హాజరవుతారని చెప్పారు. బీజేపీతో తెగదెంపులైందని భేటీలో బాబు ప్రకటించారని వెల్లడించారు. భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నేతలు పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, అన్నపూర్ణమ్మ, అమర్‌నాథ్‌బాబు, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరవలేదు. -
ఫెడరల్ ఫ్రంట్‌పై విరుచుకుపడ్డ దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బ్రాంతి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అసమర్థతకు కేసీఆర్ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతుంటే.. కేసీఆర్ అణచివేత పాలన కొనసాగిస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నాటకం అడుతున్నారని అన్నారు. బీజేపీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ ఫ్రంట్‌లో భాగంగా ఆయన్ని కలిసిన నేతలందరికీ లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రజల దృష్టి మళ్లీంచడానికే ఫెడరల్ ఫ్రంట్ నాటకమాడుతున్నారని లేఖలో వారికి వివరించినట్టు చెప్పారు. ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ ఇకముందు ఎవరిని కలిసిన వారికి ఇలాగే లేఖలు రాస్తామని పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు ఆ దమ్ము, ధైర్యం ఉందా?
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో భేటీ సందర్భంగా లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ తోక పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీరహితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటైతే స్వాగతిస్తామని తెలిపారు. కానీ, కేసీఆర్ చేసే పర్యటనలన్నీ కాంగ్రెస్‌తో సంబంధాలున్న పార్టీల నేతలతో సాగుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ పర్యటనలు కాంగ్రెస్‌కు లాభం చేసేలా ఉన్నాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అనుమతి లేనిదే అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారా? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యముంటే కాంగ్రెస్‌తో అంటకాగే పార్టీలతో కాకుండా.. కేవలం ప్రాంతీయ పార్టీల మద్ధతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ముందుగా రాష్ట్రంలో తన అధికారాన్ని కోల్పోకుండా కేసీఆర్ జాగ్రత్త పడితే మంచిదని సూచించారు. గతంలో ఎన్టీఆర్ ఇలాంటి హాడావిడే చేసి సొంత రాష్ట్రంలో ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. -
ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేష్ మద్దతు
-
ఫెడరల్ ఫ్రంట్‌పై రాహుల్ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరా తీసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, కుమారస్వామిలతో భేటీ అవ్వడం, త్వరలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో భేటీ అయ్యేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం తెలిసిందే. కేసీఆర్‌తో ఇప్పటికే సమావేశమైన నేతలు ఫ్రంట్‌పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న విషయంపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. మంగళవారం ఢిల్లీలో రాహుల్‌ను ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫ్రంట్‌పై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబం, పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడకుండా చేయడానికి కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ముందుకొచ్చారని రాహుల్‌కు వివరించినట్టు వీహెచ్ మీడియాకు తెలిపారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని భార్య, కోడలు నుంచి కేసీఆర్‌కు ఒత్తిడి అధికమైందన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే అనంతర పరిణామాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడకుండా చూసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌తో చెప్పానన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘జన్ ఆక్రోశ్’ పేరుతో నిర్వహించిన మొదటి ర్యాలీ విజయవంతమైందని, రాహుల్ ఉపన్యాసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని వీహెచ్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణ కాంగ్రెస్ తన వంతు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. -
నేడు అఖిలేశ్ హైదరాబాద్ రాక
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ జరుపుతున్న సంప్రదింపుల్లో బాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానం లో అఖిలేశ్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి అఖిలేశ్ ప్రగతి భవన్‌కు చేరుకొని కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపనున్నారు. సీఎం నివాసంలోనే అఖిలేశ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత కూడా కేసీఆర్, అఖిలేశ్ భేటీ కొనసాగుతుంది. అనంతరం ఆయన మారేడ్‌పల్లిలో మంత్రి తలసాని ఇంట్లో తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం లక్నోకు తిరుగు పయనమవుతారు. -
‘కేసీఆర్, నువ్వొస్తావా.. నీ కొడుకును పంపుతావా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. ఒకటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులన్నీ ఖర్చు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమన్న భట్టి.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజల సొమ్మును ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపిణీ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ తీరును వ్యతిరేకించారు. 'కేసీఆర్ తన మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చానని చెప్పడం హాస్యాస్పదం. హామీల అమలుపై మేం సిద్ధం. పోలీసులు లేకుండా గ్రామసభలు పెట్టి ప్రజలను అడుగుదాం. కేసీఆర్ నువ్వు వస్తావా.. లేకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పంపినా చర్చకు మేము సిద్ధం. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి. పాలకులు మంచి జరగాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్‌లాగ భూకంపాలు రావాలని కోరుకోరు. కేసీఆర్ భూకంప ప్రకటనతోనే ఆయన మనస్తత్వం ఏమిటో అర్థమవుతోంది. దేవెగౌడకు వంద కోట్లు! కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. కర్ణాటకలో దేవెగౌడకు వంద కోట్లు ఇస్తానని చర్చలు జరిపారు. కేసీఆర్ బీజేపీకి ఏజెంట్‌గా మారాడు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి బి-టీమ్ మాత్రమే. కేసీఆర్‌వి ఊసరవెల్లి రాజకీయాలు. హరీష్ రావు మాటలు దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉన్నాయి. ప్రాణహిత, ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ ఆపింది. రీడిజైన్ పేరుతో వేలకోట్లు అంచనాలు పెంచింది మీరు కాదా? పాత ప్రాజెక్టులకు పేరు మార్చి కొత్త ప్రాజెక్టులని చెప్పి అంచనాలను పెంచి టీఆర్ఎస్ సర్కార్ దోపిడీ చేస్తున్నదని' భట్టి విక్రమార్క ఆరోపించారు. -
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కానరాని ఏకాభిప్రాయం
-
కేసీఆర్‌తో భేటీ అయిన డీఎంకే ఎంపీ కనిమొళి
-
సీఎం కేసీఆర్‌తో కనిమొళి భేటీ
సాక్షి, చెన్నై: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెన్నైలో పర్యటిస్తున్నారు. ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయిన ఆయన.. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో రెండో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్‌తో డీఎంకే ఎంపీ కనిమొళి బేటీ అయ్యారు. స్థానిక ఐటీసీ చోళ హోటల్లో కేసీఆర్‌తో సమావేశమైన ఆమె ఫెడరల్ ప్రంట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వారితో పాటు మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశంలో ఉన్నారు. -
రాజకీయాలు, పాలనలో మార్పు రావాలి
-
ఫెడరల్.. టూర్!
సాక్షి, చెన్నై/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆది కాదు.. అంతం కాదు.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం వివిధ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులు, అన్ని పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయి..’’అని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండొద్దని వ్యాఖ్యానించారు. తమది థర్డ్ ఫ్రంట్.. నాలుగో ఫ్రంట్.. ఐదో ఫ్రంట్ కాదని, ప్రజాఫ్రంట్ అని స్పష్టంచేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడలతో చర్చలు జరిపిన కేసీఆర్.. కరుణానిధిని కలిసేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లారు. నేరుగా గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి పది నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అక్కడ్నుంచి కేసీఆర్, స్టాలిన్, ఎంపీ కె.కేశవరావు ఒకే కారులో ఆళ్వార్‌పేటకు బయలుదేరి వెళ్లారు. స్టాలిన్ నివాసానికి చేరుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, బాలులతో రెండు గంటల పాటు చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం వారికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాలకు దక్కాల్సిన అధికారాలు, హక్కులపై చర్చించారు. డీఎంకే నాయకులతో జరిగిన చర్చలో ఎంపీ కేకేతోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. చర్చల అనంతరం కేసీఆర్ చెన్నైలోని కపాలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. చెన్నై పర్యటనలో సీఎం వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. దక్షిణాదికి అన్యాయమే.. చర్చల అనంతరం కేసీఆర్, స్టాలిన్ కలిసి మీడియాతో మాట్లాడారు. డీఎంకేతో కలిసి యూపీఏ–1లో పనిచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రాల ప్రయోజనం, దేశ శ్రేయస్సు, ప్రగతిని కాంక్షించేలా చర్చ సాగిందన్నారు. ‘‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. ఏకాభిప్రాయం వచ్చేదాకా అందరితో చర్చలు జరుపుతాం. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలి. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. విద్య, వైద్య, తాగు, సాగునీరు వంటి అంశాలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది’’అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేసేలా లేవని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండకూడదన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అందులో అనుమానం ఏముంది?’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్టాలిన్‌తో అనేక అంశాలపై చర్చించామని, మున్ముందు మరిన్ని చర్చలు జరుగుతాయని వివరించారు. తెలంగాణలో మే 10 నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నామని, ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు తెలిపారు. చాలాకాలం తర్వాత చెన్నైకి రావడం ఆనందంగా ఉందని, కరుణానిధి తనకు మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చారన్నారు. థర్డ్ ఫ్రంట్ అని ఎక్కడా చెప్పలేదు తాను ఎప్పుడూ, ఎక్కడా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పలేదని, ఇదంతా మీడియా సృష్టే అని కేసీఆర్ చెప్పారు. ‘మా ప్రయత్నం కేవలం రాజకీయ పార్టీల ఏకీకరణ కాదు.. దేశ ప్రజలు, యువత, నిరుద్యోగుల ఏకీకరణ’అని అన్నారు. తాము ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తారా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన్ను కూడా కలిసి చర్చలు జరుపుతా’’అని చెప్పారు. అన్ని అంశాలపై మాట్లాడాం: స్టాలిన్ రాజకీయంగా అనేక అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్టు స్టాలిన్ చెప్పారు. ‘‘మాతో ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు అనేకం ఉన్నాయి. వారితో ఈ అంశాలపై చర్చించాల్సి ఉంది’’అని తెలిపారు. డీఎంకే ఉన్నత స్థాయి, సర్వసభ్యం, కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయమే కీలకం అని పేర్కొన్నారు. నేడు మరికొందరు నేతలతో భేటీ స్టాలిన్‌తో భేటీ తర్వాత సాయంత్రం ఆళ్వార్ పేట నుంచి గిండిలోని స్టార్ హోటల్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మరికొన్ని పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. -
పరిపాలనలో మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్
-
చెన్నైలో సీఎం కేసీఆర్
-
చెన్నైలో కేసీఆర్.. కీలక నేతలతో భేటీలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు వెళ్లిన కేసీఆర్ 1.30 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, వినోద్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. డీఎంకే నేతలతో కీలక భేటీ అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు కేసీఆర్ బృందం చేరుకుంటుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30కు ప్రగతి భవన్ చేరుకుంటారు. త్వరలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో భేటీ కానున్న విషయం తెలిసిందే. -
చెన్నైలో పలువురు నేతలతో భేటీకానున్న కేసీఆర్
-
ఫెడరల్ ఫ్రంట్‌లో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. కొత్త కూటమికి నిశ్చయించుకున్న కేసీఆర్ ఇందులో భాగంగా ఆదివారం చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు డీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో భేటీ అవుతారు. అనంతరం రెండు గంటలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. డీఎంకే నేతలతో ఆదివారం మధ్యాహ్నం సమావేశం అవనున్న కేసీఆర్.. సాయంత్రం తమిళనాడుకు చెందిన మరికొందరు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. అదే విధంగా వచ్చే వారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ రానున్నారు. ఫ్రంట్‌పై అఖిలేశ్, కేసీఆర్ చర్చించనున్నారు. ఆ తర్వాత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో కొత్త ఫ్రంట్‌పై చర్చిస్తారు. -
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకంపనలు
-
ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు
-
గులాబీ ఆశలు
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తా
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, మా ఎమ్మెల్యేలంతా వజ్రాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కితాబిచ్చారు. బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లో ఉన్న వారందరూ తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు. కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఇప్పటికే దీనిపై పథకం రూపొందించామన్నారు. ఈ 29న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఈ దేశం మరికొన్ని నెలల్లో సరికొత్త పాలనను చూడబోతుందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావేరీ జలాల విషయమై కొత్త నాటకాలకు తెర తీశారంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనంలోనే నీటి సమస్యలు కొనసాగుతున్నాయని.. 'ప్రతి రైతుకు నీళ్లు.. ప్రతి ఎకరాకు నీళ్లు' అనేది ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. 'తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. దేశంలో రోజు మొత్తం కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. విద్యుత్ సరఫరాపై కొందరు కావాలనే విమర్శిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. హైదరాబాద్‌లో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు. భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో పాస్‌బుక్‌లు రైతులకు అందజేస్తాం. రిజిస్ట్రేషన్ల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. త్వరలో ధరణి పేరుతో కొత్త విధానం తీసుకొస్తాం. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు లేకుండా చేశాం. తెలంగాణ వ్యాప్తంగా సారాను నిర్మూలించాం. గొర్రెల పథకం విజయవంతం అయింది. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అభివృద్ధి నిధులు అందజేశామని' సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
‘హైదరాబాద్ కేంద్రంగా భూకంపం పుట్టిస్తా’
సాక్షి, హైదరాబాద్ : దేశానికి ఏదో చేయాలనే ఆలోచన నుంచి పుట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఓ ప్రకంపనలా జాతీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. కూనగా ప్రస్థానాన్ని ఆరంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ‘ప్రాణం బక్కపలుచనిదైనా దేశానికి ఏదో చేయాలనే తపన. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత కేసీఆర్ అంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌లకు భయం పట్టుకుంది. మొండివాడు కదా.. పట్టుకుంటే వదలడని వారి భయం. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలని, నేను నాయకత్వం వహించాలని నాయకులు కోరారు. నన్ను నాయకుడిగా తీర్మానించారు. గత ఏడాదిన్నర నుంచి కేంద్రం ప్రభుత్వ వైఖరిని చూసిన తర్వాత ఈ దేశంలో జరగవలసింది జరగడం లేదు అని అర్థమైంది. ఈ మాట నేను ఆషామాషీగా చెప్పడం లేదు. ఎన్నో కఠోరమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. నాకు 64 ఏళ్ల వయసు వచ్చింది. అందరం కలసి తెలంగాణ సాధించుకున్నాం. మా పని మేం చేసుకుంటూ వెళ్తున్నాం. లోటు లేకుండా ఉన్నాం. కానీ ఇక్కడ పుట్టాం కాబట్టి దేశం బాగు కోసం కూడా పోరాడాలి అనిపించింది. ఈ దేశానికి మంచి దారి చూపించడానికి ప్రయత్నిస్తాం. ఎవరికి భయపడం. కేసీఆర్ మోదీ ఏజెంట్ అని రాహుల్, మీ ఫ్రంట్‌కు టెంటే లేదు అని మోదీ అంటున్నారు. మాకు టెంటే లేనప్పుడు మీకు భయం దేనికి?. సిగ్గపడాలి స్వతంత్రం వచ్చి 71 ఏళ్లు గడిచాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 66 ఏళ్లు పాలించింది. 11 ఏళ్ల పాటు బీజేపీ, ఐదున్నర ఏళ్ల పాటు వేరే ప్రధానులు ఉన్నారు. వాళ్లను కూడా ఈ పార్టీలు బతకనివ్వలేదు. ఒకరితో విసుగొస్తే మరొకరికి పట్టం కడతారు ప్రజలు అనే విధంగా కాంగ్రెస్, బీజేపీల ఆలోచనా ధోరణి ఉంది. అదే వీళ్లకు బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్, బీజేపీల నిషా నుంచి దేశ ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం ఏంటో అందరూ తెలుసుకోవాలి. కర్ణాటకలో ఎన్నికల వల్ల కావేరి నీటిపై వివాదం నడుస్తోంది. కావేరి వివాద పరిష్కారంపై బీజేపీ అసలు ఆలోచించడం లేదు. ఏంటని ప్రశ్నిస్తే దేశంలో నీటి యుద్ధాలు ఎప్పటినుంచో ఉంటున్నాయని సమాధానం ఇస్తున్నారు. మన దేశంలో 65,500 టీఎంసీల నీరు నదుల్లో ఉంది. హిమనీ నదాల ద్వారా 3 వేల టీఎంసీలు, భూటాన్ ప్రాంతం నుంచి మరో 3 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నిజాయితీ ఉంటే నా ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పాలి. నన్ను విమర్శించే ముందు 70 వేల టీఎంసీల నీరు లభ్యత ఉంటే మీరేం చేస్తున్నారో చెప్పండి. కేవలం 40 కోట్ల ఎకరాల్లో దేశవ్యాప్తంగా పంటలు పండుతున్నాయి. దేశంలో లభ్యత ఉన్న నీటిని ధర్మం ప్రకారం పంచితే 30 వేల టీఎంసీల నీరు మిగులుతుంది. పారిశ్రామిక అవసరాలను 5 వేల టీఎంసీలు వాడినా.. మిగులు 25 వేల టీఎంసీలు ఉంటుంది. నీటి వివాదాలపై ఏర్పాటు చేస్తున్న ట్రైబ్యునల్స్ తీర్పులకు దశాబ్దాల పాటు సమయం పడుతోంది. ఈ లోగా జనరేషన్లు మారిపోతున్నాయి కానీ కష్టాలు తీరడం లేదు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు ముందు 6 నెలల్లో తీర్పు ఇవ్వాలని కేంద్రం ముందు చెప్పకూడదా?. చెప్పరు. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ‘హర్ ఎకర్ మే పానీ.. హర్ కిసాన్ కే పానీ’ అనే నినాదంతో దేశ ప్రజల్లోకి వెళ్తుంది. దేశంలో దీన్ని అమలు చేసి చూపిస్తాం. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నడుంబిగిస్తోంది కాచుకోండి. కాంగ్రెస్, బీజేపీ డైలాగ్స్ వింటే పెద్దగా ఉంటాయి. అంతర్జాతీయ సరుకులు రవాణా చేసే లారీ ఎక్స్‌ప్రెస్ హైవేలపై విదేశాల్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. మన తెలివికి 26-36 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. చైనాలో లక్ష 23 వేల కి.మీ దూరం పాటు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటే.. మనదేశంలో మాత్రం 2 వేల కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. ఎవరి అసమర్ధత ఇది?. ఎవరి చేతగానీ తనం ఇది?. గూడ్స్ రైళ్ల వేగం చైనాలో గంటకు 80 కిలోమీటర్లు. మనదేశంలో కేవలం 24 కిలోమీటర్లు. ఇది మనవాళ్ల ప్రతిభ. మనదేశంలో లక్షదీవులు ఉన్నా.. టూరిజం కోసం విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి. విదేశాలు ఇక్కడ ఎన్జీవోలకు డబ్బు ఇచ్చి పిల్స్ వేయిస్తే.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం మనకు చేత కావడం లేదు. హైదరాబాద్‌లో సగం ఉండే సింగపూర్‌లోని పోర్టులో 4 కోట్ల కంటైనర్లను హ్యాండిల్ చేస్తారు. మన పక్క దేశం చైనా 19 కోట్ల కంటైనర్లను పోర్టుల్లో హ్యాండిల్ చేస్తోంది. మనకు ప్రకృతి సిద్ధంగా అద్భుతమైన పోర్టులు ఉండి కూడ ఒక కోటి కంటైనర్లను కూడా హ్యాండిల్ చేయలేని దుస్థితి. కేవలం 87 లక్షల కంటైనర్లను హ్యాండిల్ చేస్తున్నాం. దుఃఖం కలిగేది ఎక్కడంటే ప్రజలకు స్టోరీలు చెబుతూ.. ‘గరీబీ హఠావో’ లాంటి పనికిమాలిన నినాదాలు ఇవ్వడం. చైనా వాళ్లు బంగారం ఏమైనా తింటున్నారా?. 1968లో భారత ఆర్థిక వ్యవస్థ 180 బిలియన్ డాలర్లు. 2016లో చైనా ఆర్థిక వ్యవస్థ 9,504 బిలియన్ డాలర్లు. మనం ఆర్థిక వ్యవస్థ కేవలం 2,405 బిలియన్ డాలర్లు. ఈ మూడు దశాబ్దాల్లో మనం ఏం చేస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య శాఖలు కేంద్ర ప్రభుత్వానికి దేనికి?. అవి మీ దగ్గర ఎందుకు ఉండాలో ఒక్క కారణం చెప్పండి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం ఉంది ఎక్కడో నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో ప్రధానమంత్రి వచ్చి పలుగు, పార చేతబట్టి రోడ్డు వేస్తారా?. మరి ఇక్కడి నాయకులు ఏం చేయాలి. వ్యవసాయం ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. కేంద్రానికి వ్యవసాయంతో పనేంటి. దేశ రక్షణపై, అంతర్జాతీయ దౌత్యంపై కేంద్రం దృష్టి పెట్టాలి. దాదాపు 5 లక్షలకు పైగా సైనికులు రోజు అట్టుడుకుతున్న కశ్మీర్లో దేవుడా అంటూ పని చేస్తున్నారు. మీ సత్తా అక్కడ చూపించండి. అన్ని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల పారదర్శకత లోపిస్తుంది. విదేశాల్లో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి. మన సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్తే కంపు కొడుతుంటుంది. మనకు ఇదే వైకుంఠం. ఇదే కైలాసం. దేశంలో ఏ ఎయిర్‌పోర్టుకు పోయినా రన్ వేలు లేవు. గంటల కొద్దీ విమానం గాలిలో తిరగాలి. అనవసరమైన అసమర్ధ విధానాలు ఈ దేశంలో కొలువుదీరి ఉన్నాయి. మన దేశం ఏ రంగంలో బావుంది చెప్పండి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చంద్రస్వాములు, స్వాములు, సన్నాసులు, ఆశారాంలు, డేరాలు, నీరవ్, లలిత్మోడీలను పెంచి పోషించాయి. ఇదంతా మన కర్మ. ఇంత చేసినా మళ్లీ ఆహా కాంగ్రెస్, ఓహో బీజేపీ అని డబ్బా కొట్టాలా?. ఇవి సాగవు. త్వరలో స్టాలిన్, అఖిలేఖ్లతో భేటీ.. అతి త్వరలో డీఎంకే నాయకుడు స్టాలిన్‌ను కలబోతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. దేశం మొత్తం పక్షిలాగా తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్‌తో గుణాత్మక మార్పులు తెస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ సాధన అనంతరం దేశం కోసం పోరాడటానికి డైమండ్స్ లాంటి నాయకులు రెడీగా ఉన్నారు. ‘మీరందరూ దేశం కోసం పోరాడండి. తెలంగాణను వదిలిపెట్టను. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని చెబుతున్నా. గులాబీ పరిమణాలను భారతదేశ నలుమూలలకు వ్యాపించజేస్తా. అద్భుతమైన నిర్మాణాలతో భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఏం లేవని మనం వెనకబడ్డాం. అన్ని ఉన్నాయి. పాలకులకు దమ్ము లేదు. దేశ ఎకానమీని అధ్యాయనం చేసే శక్తి వారికి లేదు. ఇప్పటికే అతి విలువైన 7 దశాబ్దాలు పోయాయి. దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైనటువంటి ప్రాతపోషిస్తా.’ అని కేసీఆర ప్లీనరీలో అన్నారు. -
ప్రతిష్టాత్మకంగా.. ప్లీనరీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 17 వసంతాలు పూర్తి చేసుకుని 18వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లోని కొంపెల్లి జీబీఆర్ గార్డెన్లో నిర్వహించనున్న ప్లీనరీకి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి నేతలను తరలించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్లీనరీకి పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నా.. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి మించకుండా ప్రతినిధులను మాత్రమే తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 1300 మందికి మాత్రమే ప్రతినిధులుగా ప్లీనరీలో పాల్గొనే అవకాశం లభించనుంది. ఆయా నియోజకవర్గాలకు చెందినప్రజాప్రతినిధులు, ముఖ్యులు 100 మందికి మా త్రమే అనుమతి ఉండడంతో మిగతావారు సహకరించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే కేడర్‌కు సూచించా రు. గతంలో జరిగిన ప్లీనరీల కన్నా భిన్నంగా ఈ దఫా జరిగే ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతోపాటు జాతీయ అంశాలపై చర్చించి దేశానికే దిక్సూచీలా తీర్మానాలు ఉండేలా కసరత్తు జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తెరపైకి వచ్చిన నేపథ్యంతోపాటు మరో యేడాదిలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. సక్సెస్ కోసం ప్రజాప్రతినిధుల కసరత్తు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయమై ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తున్నారు. మంగళవారం టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల ఇన్చార్జిలు గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, వై.సునీల్‌రావు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లీనరీకి డెలిగేట్స్ తరలింపు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్వేత ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నియోజకవర్గానికి 100మంది చొప్పున 1300 మంది ప్లీనరీకి హాజరయ్యేలా చూస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ప్లీనరీ నిర్వహణపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను కూడగట్టి మద్దతు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పేందుకు ప్లీనరీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రాష్ట్రానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు వస్తున్న సందర్భంగా ఇక్కడి అభివృద్ధిని కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లేలా ప్రతినిధులకు దిశానిర్దేశనం చేయనున్నారు. ప్లీనరీ సమావేశాలకు ప్రత్యేకత ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మాజీమంత్రి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ బస్వరాజు సారయ్య అన్నారు. ఈసారి నిర్వహించే 15వ పార్టీ ప్లీనరీకి ప్రత్యేకత ఉందని, దేశానికి దిశానిర్ధేశనం చేసేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని శ్వేత ఇంటర్నేషనల్ హోటల్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అలుపెరుగని నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించనున్నారన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మరింత కీలకపాత్ర వహించనున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ శ్రీకారం చుట్టిన తరుణంలో నిర్వహించే ప్లీనరీపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని బస్వారాజు సారయ్య పేర్కొన్నారు. ఈ ప్లీనరీకి ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ సారి కేవలం ప్రతినిధుల సభను మాత్రమే నిర్వహిస్తున్నందున తక్కువ మందికే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. -
ఏచూరి కాదంటే తెలంగాణ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిందా, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ మాత్రం ఆగుతుందా అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా శక్తి, మేధోపటిమకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అప్పటి వరకు సీతారాం ఏచూరి వంటి వాళ్లు ఏమి మాట్లా డినా, ఏమనుకున్నా పట్టించుకోబోమని, తమ ఆలోచనలు తమకున్నాయన్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 17వ ఆవిర్భావ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ, ఇదే ఏచూరి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారన్నారు. ఏచూరి అనుకున్నంత మాత్రాన జరిగేది ఆగదని స్పష్టం చేశారు. ప్లీనరీకి ఎవరినీ పిలవట్లేదు.. జాతీయ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యులెవరూ ప్లీనరీకి రావడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యులు ఎవరినీ ఆహ్వానించడం లేదని, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఇది సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న అతి ముఖ్యమైన ప్లీనరీ అని చెప్పారు. 2019లో ఎన్నికల సమయంలో ప్లీనరీ నిర్వహించుకోలేమని, ఈ సమావేశమే రాజకీయంగా విస్తృతమైనదని పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నమూనా దేశానికి మార్గదర్శ కంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే దిశగా ఈ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. ప్లీనరీ విజయవంతం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశామన్నా రు. పార్టీ వార్షికోత్సవంలో భవిష్యత్ కార్యాచ రణ, పార్టీ కార్య క్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుపై చర్చ, తీర్మానా లుంటాయని కేటీఆర్ వివరించారు. 13 వేల మంది ప్రతినిధులు ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 13 వేల మంది ప్రతినిధులు, 20 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతి నిధులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతినిధుల నమోదు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న తర్వాతనే ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. 8 భోజన శాలలు ఏర్పాటు చేశా మని తెలంగాణ వంటకాలు నోరూరిస్తాయ న్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీలో పాల్గొనే అందరికీ అంబలి, సల్ల (మజ్జిగ), నీరు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శుక్రవారం రోజునే ప్లీనరీ ఉన్నందున ముస్లింలు నమాజ్ చేసుకు నేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవల కోసం డాక్టర్ల బృందం, నాలుగు అంబులెన్స్‌లు, హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థి, యువజన విభాగం నుంచి 500 మంది సుశిక్షుతులైన వారిని ఎంపిక చేశామని, ఇబ్బందులు రాకుండా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ, మార్గనిర్దేశనం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మూసీ అందాలు చూస్తారు.. మూసీ సుందరీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని, సుందరీకరించిన తర్వాత సీతారాం ఏచూరిని కూర్చోబెట్టి మూసీ అందాలను చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూసీ నదిలోకి చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికల నాటికి చాలా ఫ్రంట్ లు వస్తాయంటూ ఏచూరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను, ఇక్కడ మూసీ అందాలను ఏచూరి చూస్తారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే మెచ్చుకుంటున్నారని చెప్పారు. దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల మంత్రులే రాష్ట్ర అభివృద్ధిని కీర్తిస్తున్నారన్నారు. బీజేపీ మంత్రులూ పొగుడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. -
రాహుల్‌కు చావో, రేవో
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీకి మే 12వ తేదీన జరగనున్న ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు ఎంత ముఖ్యమో, మూడవ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న నాయకులకు కూడా ఆ ఫలితాలు అంతే ముఖ్యం. 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. జాతీయ స్థాయిలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదన తీసుకొచ్చినదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు. ఆయన ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనుకూలంగా స్పందించారు. ఇరువురు ముఖ్యమంత్రులు ఈ విషయమై సమగ్ర చర్చలు కూడా జరిపారు. పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ మమతా బెనర్జీ కోరుకుంటున్నప్పటికీ ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫ్రంట్‌కు నాయకత్వం వహించడం ఇష్టం లేదు. అవసరమైతే, అవకాశం వస్తే తానే నాయకత్వం వహించాలన్నది ఆమె మనోవాంఛగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తు అవసరాల కోసం ఫ్రంట్‌కు ఇతరుల నాయకత్వాన్ని అంగీకరించవచ్చుగానీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరు. ఒక్కసారి రాహుల్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఆయన్ని ఆ స్థానం నుంచి తప్పించడం కష్టమని, ఇతరులైతే ఏదే విధంగా తప్పించవచ్చన్నది ఆమె మనోగతంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పొత్తు ద్వారా ఘన విజయం సాధించిన సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీలకు కూడా తృతీయ ఫ్రంట్‌లో కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం అంతగా ఇష్టం లేదు. తృతీయ ఫ్రంట్‌పై మొగ్గు చూపుతున్న శరద్ పవార్‌కు తానే ప్రధాని అభ్యర్థిని కావాలనే కాంక్ష ఎక్కువగా ఉన్నదనే విషయం తెల్సిందే. అయితే ఆయనకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. మమతా బెనర్జీ విషయాన్ని పక్కన పెడితే వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారు. ఆయనకు సీపీఎం పార్టీ నాయకుడు సీతారామ్ ఏచూరితో మంచి సంబంధాలు ఉన్నాయి. తన ప్రతిపాదిత మూడో ఫ్రంట్‌లోకి తీసుకురావడానికి కేసీఆర్ ఇటీవల కర్ణాటకలో జేడీఎస్ నాయకుడు దేవెగౌడతో చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలించినట్లు కనిపిస్తున్నాయి. రానున్న కర్ణాటక ఎన్నికల్లో ఆయన పార్టీకి 20, 30 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటులో ఆ పార్టీయే కీలకం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీకి చావో, రేవోలాగా పరిణమించాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలంటే సంపూర్ణ మెజారిటీ సాధించాల్సిందే. అతిపెద్ద పార్టీగా అవతరిస్తే సరిపోదు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో వచ్చినా సరే బీజేపీ దేవెగౌడతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం అవసరమైతే దేవెగౌడకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేస్తుంది. కర్ణాటకలో విజయం సాధిస్తేనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో రాహుల్ గాంధీకి చోటు లభిస్తుంది. అంతేకాకుండా సీట్ల బేరం కూడా పెరుగుతుంది. సీట్ల విషయంలోనే త్రిపురలో తృణమూల్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్సీపీతో ఇదే విషయమై పొత్తు కుదరలేదు. -
ఫ్రంట్: కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్ భేటీ అయి ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఒడిశాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఒడిశాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో నవీన్ పట్నాయక్‌తో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
కేసీఆర్ ఫ్రంట్‌లో ప్రకాశ్‌రాజ్!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలక భూమిక పోషించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని ఇటీవల బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. దేవెగౌడతో భేటీకి ఆయన్ను కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌లో ఆయన పాత్ర ఏంటన్న చర్చలు సాగుతున్నాయి. ఫ్రంట్‌పై ఇప్పటికే స్టాలిన్‌తో చర్చలు కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ప్రకాశ్‌రాజ్ సినిమా నటుడిగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రజలకు సుపరిచితుడు. మొదటి నుంచి సెక్యులరిజం భావజాలం పట్ల ఆసక్తి చూపిస్తున్న ఆయన.. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై అక్కడి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమించారు. బీజేపీని బాహటంగానే విమర్శించారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రకాశ్‌రాజ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గంటపాటు మాట్లాడారు. ఫ్రంట్ వెంట ఉంటానని, తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఆ సందర్భంగా మాటిచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన దేవెగౌడ, కేసీఆర్ భేటీలో ప్రకాశ్‌రాజ్ సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆయన సన్నిహితులు చెబున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీకి ప్రకాశ్‌రాజ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తమిళ ప్రేక్షకులకు చిరపరిచితుడు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్‌తోనూ ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి–కేసీఆర్ భేటీ ఏర్పాట్లలో ప్రకాశ్‌రాజ్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాలను స్టాలిన్‌కు వివరించి ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే వచ్చేనెలలో కేసీఆర్, కరుణ భేటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ చెబితే తెలంగాణ నుంచి పోటీ? కేసీఆర్ విధానాల పట్ల ఆకర్షితుడైన ప్రకాశ్‌రాజు ఫెడరల్ ఫ్రంట్‌కు శక్తి వంచన లేకుండా సహకారం అందించాలన్న నిర్ణయానికి వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 10 సినిమాల్లో నటిస్తున్నారు. నానా పటేకర్ నటించిన ‘నట సామ్రాట్’అనే మరాఠీ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ చేసే హక్కులు కొనుక్కున్నారు. కేసీఆర్ కోరితే ఒప్పుకున్న ఈ చిత్రాలను త్వరగా పూర్తి చేసుకొని, నటసామ్రాట్ చిత్ర రీమేక్‌ను వాయిదా వేసుకునేందకు ప్రకాశ్‌రాజ్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోపు కేసీఆర్‌తో కలిసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జాతీయ రాజకీయలపై ఆసక్తి చూపుతున్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరితే ఇక్కడ్నుంచి అందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
నేడు బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజ కీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై అంశాలపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరనున్నారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు వెళ్లనున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వేచి చూడాలనుకున్నా.. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కోల్‌కతాకు వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. తాజాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఫ్రంట్ కార్యాచరణపై కొంత వేచి చూడాలని తొలుత కేసీఆర్ భావించారు. కానీ ఈ వ్యూహాన్ని మార్చుకున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బలాన్ని చేకూర్చవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్(ఎస్) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్)కు మద్దతును ప్రకటించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక పర్యటన అనంతరం కేసీఆర్ ఒడిశా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ది దూరదృష్టి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ఆయనకు స్పష్టత ఉంది’’అని యోగగురు బాబా రాందేవ్ ప్రశంసించారు. ఆర్థికరంగంపై కూడా కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్ చేశారు. అంతకు ముందు గురువారం ప్రగతిభవన్‌లో సీఎంతో బాబారాందేవ్ భేటీ అయ్యా రు. ఆయనకు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. -
మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్న కేసీఆర్
-
రేపు బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై దేవెగౌడతో చర్చించిన అనంతరం రేపు సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
కర్ణాటక తీర్పు తేలాక..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. అయితే, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, జాతీయస్థాయిలోని పలు పరిణామాలతో ఫ్రంట్ కార్యకలాపాలను కొంతకాలం నెమ్మదిగా నడిపించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ట్రెండ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ‘‘కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంతో కొంత ఉంటుంది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జనతాదళ్(ఎస్) పోటీపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో పూర్తిగా రెండు జాతీయ పార్టీల ఆధిపత్యమే ఉంటుందా? ప్రాంతీయ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందా అనేది మాకు ఆసక్తి కలిగించే అంశమే. ప్రాంతీయ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కడతారా? జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతారా? అనేది గమనిస్తున్నాం. ఈ ఫలితాలు వచ్చే దాకా వేచి చూస్తాం. ఫలితాలు వచ్చేదాకా ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాల్లో వేగం తగ్గించాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు’’అని టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. ఒడిశా పర్యటన వాయిదా? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భువనేశ్వర్‌లో ఈ వారంలోనే భేటీ అయ్యేందుకు వెళ్తారని సీఎం కార్యాలయ వర్గాలు చెప్పాయి. అయితే కూటమి కార్యకలాపాలపై నెమ్మదిగా వెళ్లాలన్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్ పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఒడిశా పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పర్యటన ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటివారితోనూ సమావేశమవుతారని పార్టీ వర్గాలు గతంలో వెల్లడించినా.. ఇప్పుడా ప్రస్తావన తేవడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీల ముఖ్యులతోనూ ఇప్పట్లో సమావేశాలు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయస్థాయి నేతల్లేకుండానే ప్లీనరీ టీఆర్ఎస్ ప్లీనరీ ఈ నెల 27న కొంపల్లిలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సుమారు 15 వేల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి ఈ ప్లీనరీని వేదికగా చేసుకుంటారని పార్టీ వర్గాలు ముందుగా వెల్లడించాయి. అయితే ప్లీనరీని పార్టీ వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ నిర్వహించబోయే సభను రాజకీయ ప్రయోజనం లేకుండా నిర్వహించడానికి కేసీఆర్ విముఖత వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద సభ నిర్వహించినా, ఆ సభ ఊపును ఏడాదిపాటు కొనసాగించడం సాధ్యం కాదని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా ఎన్నికల సమరశంఖాన్ని పూరించినట్టుగా ఉంటుందనే అంచనాతో ఉన్నారు. దీంతో పార్టీ 17వ ప్లీనరీని పార్టీ ప్రతినిధులతో సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. -
స్పష్టత వస్తేనే ‘ఫెడరల్ ఫ్రంట్’కు మద్దతు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే దానికి మద్దతు ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ను కేసీఆర్ ఏ ప్రాతిపదికన పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని, దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో జరిగిన ఎడిటర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. ‘నిన్న కేసీఆర్‌ను నేను, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిశాం. రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరగలేదు. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రం చర్చించాం. కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారో స్పష్టత ఇస్తే.. మద్దతు ఇవ్వాలా, వద్దా అనేది ఆలోచిస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎలాంటి పొత్తులు పెట్టుకోదని, అవగాహన కూడా ఉండదని స్పష్టం చేశారు. వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మహాసభలు ఉపకరిస్తాయని అన్నారు. 25 ఏళ్లుగా పొత్తుల వల్ల బలహీనమయ్యామని, ప్రజలకు లబ్ధి జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని, కోదండరాం పార్టీ విధివిధానాలు చెబితే ఆయనతో కలసి పనిచేసే అంశంపై ఆలోచిస్తామన్నారు. రాజకీయాల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం మాత్రమేనని, సామాజిక న్యాయం కాదని చెప్పారు. -
ఫ్రంట్‌తోనే ఆధిపత్యానికి చెక్!
సందర్భం కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. రాజకీయాలు కూడా ఉపాంత ప్రయోజనం సూత్రానికి అతీతం కాదన్న విషయం గత నాలుగేళ్లుగా సాగుతున్న మోదీ పర్వం చూస్తే అర్థమవుతుంది. 2014లో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో అధికారానికి వచ్చిన బీజేపీ నేడు ప్రతిపక్ష ముక్త భారత్ నినాదమిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విధానపరంగా చూసినపుడు బీజేపీకి నికరమైన ప్రతిపక్షంగా ఉన్నది వామపక్షం మాత్రమే. సాధారణ ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి విధానపరమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి మధ్య తేడా ఉంటుంది. అందుకే బీజేపీ మోదీ నేతృత్వంలో ముప్పేట వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి వ్యూహం కాంగ్రెస్ తిరిగి కోలుకోకుండా చేసే ప్రయత్నం. రెండో వ్యూహం విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వామపక్షాల పాత్రను కుదించే యత్నం. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఆరెస్సెస్‌లు అనుసరించిన వ్యూహం ఈ కోవకే వస్తుంది. మూడోది అవసరమైన మిత్రులను కూడదీసుకుని, అవసరం లేని మిత్రులను సాగనంపే వ్యూహం. తాజాగా చర్చనీయాంశమవుతోంది ఈ మూడో వ్యూహమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సమకూరటంతో సంకీర్ణ రాజకీయాలకు తెరపడనున్నదా అన్న ప్రశ్నను ముందుకు తెచ్చారు. నాలుగేళ్లు గడిచాక తిరిగి దేశం ఆ ప్రశ్నను గుర్తు తెచ్చుకొంటోంది. పార్లమెంట్లో ఉన్న సంఖ్యాబలం పొందికను పరిశీలిస్తే గత పాతికేళ్లుగా ప్రాంతీయ పార్టీలు కనీసం సగం స్థానాలు గెల్చుకుంటూ వచ్చాయి. దేశవ్యాప్తంగా పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీలు ఉమ్మడిగా సగం స్థానాలకు మాత్రమే పరిమితమ వుతూ వచ్చాయి. బీజేపీ తన రాజకీయాధిపత్యాన్ని కొనసాగించుకోవాలంటే ప్రాతీయ పార్టీల కోటలకు గండి కొట్టకుండా సాధ్యంకాదు. ప్రతిపక్ష రహిత పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. గత మూడేళ్లుగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని (దుర్) వినియోగిస్తున్న తీరు గమనిస్తే రాజకీయ రంగంలో బీజేపీ అనుసరిస్తున్న పెత్తందారీ పోకడలు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అథారిటేరియనిజంకి వ్యతిరేకంగా నాటి ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. భారత రాజకీయాల్లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంగా గుర్తింపు పొందింది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సాగించే రాజకీయ పోరాటం రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న వ్యూహంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కుల కోసం వివిధ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి నడుం కడితే రాష్ట్రాల ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పరిరక్షణ నినాదం ముందుకొచ్చినపుడు గత మూడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయం వెతక్కుండా రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకోవటం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం నేపథ్యంలోనే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంఘటితం చేస్తూ సర్కారియా కమిషన్ తెరమీదకు వచ్చింది. అది కల్పించిన ప్రత్యేకతలన్నీ ఆర్థిక విధానాల నేపథ్యంలో కుదించుకుపోతూ వచ్చాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్థిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక ద్రవ్య సంబంధాలను ఉదారవాద విధానాల చట్రం పరిధి దాటిపోకుండా చూస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. ప్రాంతీయ పార్టీల కూటమి గానీ లేదా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ గానీ రాజ్యాంగ స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ పోకడలు, లౌకికతత్వ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక స్వావలంబన విధానాలు అమలు జరపగలిగే స్వేచ్ఛ, అంతిమంగా రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తి పరిరక్షణ లక్ష్యాలుగా పెట్టుకోవాలి. బీజేపీ పెత్తందారీ పోకడలను నిలువరించటమే నేటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం లక్ష్యంగా మారాలి. - కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం’ అని పేర్కొన్నారు. -
మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ
కోల్‌కతా : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు మమతా బెనర్జీ స్వాగతం పలికారు. మమతాతో కేసీఆర్ దాదాపు రెండు గంటలపాటు సమావేశమై కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చించనున్నారు. కాగా దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా కార్యాచరణలో భాగంగా ఆయన ఇవాళ మమతతో సమావేశం అయ్యారు. అంతకు ముందు కేసీఆర్‌కు నేతాజీ విమానాశ్రయంలో మంత్రి పూర్ణేంద్ర ఘన స్వాగతం పలికారు. మమతతో సమావేశం అనంతరం కేసీఆర్ కాళీ ఘాట్‌లోని కాళికామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 7.30కు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక కేసీఆర్ వెంట ఎంపీ వినోద్ కుమార్, కవిత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు పార్టీ ముఖ్యనేతలు కూడా కోల్‌కతా వెళ్లారు. -
నేడు కేసీఆర్, బెంగాల్ సీఎం మమతతో భేటీ
-
నేడు కోల్‌కతాకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఫెడరల్ ఫ్రంట్ దిశగా కార్యాచరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సోమవారం భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న సీఎం.. 11.30 గంటలకు అక్కణ్నుంచి బయల్దేరి ఉదయం 11.45కు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు పార్టీ ముఖ్య నేతలతో కలపి మొత్తం 12 మంది వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కణ్నుంచి తాజ్ బెంగాల్ హోటల్‌కు చేరుకుంటారు. సీఎం అక్కడే మధ్యాహ్న భోజనం చేసి ఆపై పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 3.15 నిమిషాలకు అక్కడి పశ్చిమ బెంగాల్ సచివాలయం చేరుకొని 3.30 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. మమతతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమై కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చిస్తారు. సాయంత్రం 5:30కు అక్కణ్నుంచి తాజ్ బెంగాల్ హోటల్‌కు వెళ్లి.. ఆ తర్వాత కాళీ ఘాట్‌లోని కాళికామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 7.30కు అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం పోరాడతానని ఇటీవల ప్రకటించిన సీఎం కేసీఆర్... తనకు మమత మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ అంశంపై ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యాచరణను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన మమతా బెనర్జీతో తొలిసారిగా భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా
సాక్షి, హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన తాను తెలంగాణను విడిచిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇక్కడ ఉండే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా విజన్ ఉన్న పార్టీలు, నేతల కోసం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘‘1976లో మావో చనిపోయే నాటికి చైనా ఆకలిచావులతో అల్లాడుతోంది. అయినా అక్కడి నాయకత్వం అకుంఠిత దీక్ష, ప్రజల కఠోర శ్రమతో ప్రపంచంలోనే ఎన్నో అద్భుతాలను సృష్టించింది. 25 ఏళ్లలోనే అనూహ్య ఆర్థిక ప్రగతి సాధించింది. మన దగ్గర చైనా కన్నా ఎక్కువ వనరులున్నాయి. కానీ విజన్ ఉన్న నేతలు, పార్టీలు లేవు. కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్ వస్తుంది. అవే విధానాలు. పథకాల పేర్లు మారతాయి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. దేశంలో 75 వేల టీఎంసీల నీళ్లు లభ్యమవుతుంటే 40–45 వేల టీఎంసీలు సముద్రంలోనే కలుస్తున్నాయి. ఆ నీళ్లను పట్టించుకునే వారే లేరు. వినియోగించుకోవాలని ఆలోచించే వారే లేరు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మనపై ఉంది. అందుకే రాజకీయాల్లో మార్పు, ప్రగతి కోసమే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మీరెవరూ ఆందోళన చెందవద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉండే దేశ రాజకీయాలను నడిపిస్తా’’అని వివరించారు. దగ్గరుండి గెలిపించుకుంటా రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ 106–107 స్థానాలు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని ఎమ్మెల్యేలకు వివరించారు. అక్కడక్కడా ఇబ్బంది ఉన్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను దగ్గరుండి ఆ అభ్యర్థులను గెలిపించుకుని వస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తవించారు. వారిరువురి పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరికీ సర్వేలో మంచి మార్కులు వచ్చినట్టు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎందుకు రాలేదంటూ ఆరా తీశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేలంతా కీలకంగా వ్యవహరించాలని, ప్రజల్లోకి ఎంత వెళ్తే అంత మంచి జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా పెట్టుబడి సాయం పథకం కింద చెక్కులు అందజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని, అవసరమనుకున్న చోట పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అందరూ అసెంబ్లీకి టైంకి రావాలని, చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రతిపక్షాల విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని, కాంగ్రెసోళ్ల దగ్గర సమాధానం లేదు.. సబ్జెక్టు అంతకంటే లేదని అన్నారు. ఏదో విధంగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వెళ్లిపోయే ఆలోచనలో కాంగ్రెస్ ఉంటుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, పార్లమెంటులో పార్టీ నేతలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ధర్నాతో శంఖారావం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. దేశవ్యాప్తంగా రాజకీయా లను ప్రభావితం చేసేలా భారీ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో తొలిపోరు చేపట్టాలని.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. జంతర్‌మంతర్ వద్ద చేసే ఈ ధర్నాకు రాష్ట్ర మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఈ నెలాఖరులోనే చలో ఢిల్లీ యాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. దానికి అనుగుణంగా జాతీయస్థాయిలో పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఢిల్లీ యాత్ర చేయాలన్నది ఆయన యోచన. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇటు రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీ ధర్నా తేదీని ఖరారు చేయనున్నారు. భావ సారూప్యత ఉన్న వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఈ ధర్నాకు ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రిజర్వేషన్లే ప్రధాన డిమాండ్‌గా.. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గత ఏడాదే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్రంలో ప్రతిపాదిత రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించటంతో కేంద్రం కొర్రీలు పెట్టింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సంతృప్తి వ్యక్తం చేసినా.. ముస్లిం (బీసీ–ఈ) రిజర్వేషన్ కోటా పెంచే విషయంలో కేంద్ర హోంశాఖ, డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర హోంశాఖ పేర్కొన్న అంశాలపై వివరణలు పంపాలని, అవసరమైనంత సమాచారాన్ని జత చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాస్తవానికి తమిళనాడులాంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46ను సవరించి తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. రాష్ట్రాలకే అప్పగించాలి విద్య, ఉపాధి రంగాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని.. వాటిలో రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్ర పరిధి నుంచి తప్పించి రాష్ట్రాలకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వాలని.. అవసరమైతే జంతర్‌మంతర్ వేదికగా మహాధర్నాకు సైతం దిగాలని యోచిస్తున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశం కూడా కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. గతంలో ఈ అంశంపై ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ప్రధాని నిరాకరించారు. ఈ నేపథ్యంలో చలో ఢిల్లీ మహా ధర్నాలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా లేవనెత్తి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నారు. వర్గీకరణపై కూడా ఢిల్లీ కేంద్రంగా ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో ఉన్నారు. దీంతో ఈ రెండు అంశాలూ కలిపి కార్యాచరణ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ యోచన, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి స్వయంగా రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటనల నేపథ్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. పనిలోపనిగా తనతో కలసి వచ్చే జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. -
లక్ష్య రహిత ప్రత్యామ్నాయం
సందర్భం అధికారాన్ని నిలుపుకోవడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ప్రజ లకిచ్చి, వాటిని నెరవేర్చమనే పార్టీల గొంతెమ్మ కోర్కెలను కాదంటే ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించనట్లేనా? మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు మూలం ఇదేనా? తెలంగాణ వచ్చేంతవరకు ఆంధ్రా వాళ్లను నోటికొచ్చి నట్లు, ఇష్టమున్న భాష, యాసలో తిట్టిన తెరాస నాయకులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత ఆ పదజాలాన్ని ప్రతిపక్షాలను తిట్టడానికి యథేచ్ఛగా వాడుతున్నారు. వాస్తవానికి కేసీఆర్ అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడు. ప్రపంచ తెలుగు మహా సభల లాంటి సందర్భాల్లో ఆయన పద్య, గద్య పాండిత్యాన్ని చూసిన/ విన్న వారెవరూ ‘వారెవ్వా’ అనకుండా ఉండలేరు. కానీ దురదృష్టవశాత్తూ సాధారణ జనంలో వారి ఆ పాండిత్యం కంటే ప్రత్యర్థులను ఉద్దేశించి తిట్లే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆ భాష మాట్లా డుతున్నప్పుడు మాకేం అడ్డు అన్నట్లు మిగతా మంత్రులు, నేతలు అదే పంథాను ఎంచుకున్నారు. అయితే, నాయకుల దూషణ, భూషణల మధ్య రాజకీయ సంరంభాన్ని వీక్షిస్తున్న ప్రజలు మాత్రం.. ఏలినవారు తెలంగాణలో ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ పోతున్నా కిమ్మనకుండా ఉంటున్నట్లున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. దళిత ముఖ్యమంత్రి అనే హామీని అవలీలగా అవతలికి నెట్టి గద్దెనెక్కినా, దళితులకు మూడెకరాల భూమి అని ఆడంబరంగా పలికి హామీలో పదోవంతు చేయకున్నా నాయకులు కేసీఆర్‌కి మంగళ హారతులు పట్టారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కనీసంగానైనా పూర్తి చేయకున్నా, ఉద్యోగాల హామీలు నీటి మూటలైనా పూర్తి చేయ కున్నా, ఉద్యోగాల హామీలు నీటి మూటలైనా, అప్పుడు డబులై ఆర్థిక భారం పెరిగినా, భూమిలో సగం, ఆకాశంలో సగం, జనంలో సగం, ఆఖరికి జీవితంలో సగమని చెప్పిన మహిళలకు మంత్రి వర్గంలో స్థానమివ్వకున్నా, కుటుంబ రాజకీయా లను బ్రహ్మాండంగా నడుపుతున్నా, చివరకు ప్రజలు తమకు ఇచ్చిన హామీలు ఏమయినాయి అని అడిగి, నిరసన తెలిపే అవకాశం ఉన్న ధర్నాచౌక్‌ను తొల గించినా, ఉలకని పలకని పరిస్థితి. బలమైన ఉద్య మాన్ని నిర్మించలేని అశక్తత. తెలంగాణలోని మేధావులేమయిపోయి నారు. స్వజాతికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కితే ప్రశ్నిం చాల్సిన దళిత మేధావులెక్కడ. దేశంలో ఎక్కడో ఏదో జరిగితే అవార్డులు వెనక్కిచ్చిన బహుజన కవు లెక్కడ? బహుశా ప్రజల్లోని నిస్తేజం, సమాజంలోని నిష్క్రియాపరత్వం కేసీఆర్‌ను, ప్రధానిని కూడా స్వాతంత్య్రానంతర భారతంలో ఏ ముఖ్యమంత్రీ మరే ప్రధానినీ సంబోధించని పద్ధతిలో మాట్లాడేలా పురిగొల్పినట్లు కన్పడుతోంది. తన వ్యాఖ్యలపై కనీ సంగా విచారం వ్యక్తం చేయలేదు సరికదా. బీజేపీ వాళ్ళే ఆయన అనని మాటలను కూడా అన్నట్లు సృష్టించినట్లు మాట్లాడి, పైగా నాపై కేసులు పెడ తారా? నన్ను ముట్టుకుంటే భస్మం అయిపోతారని హుంకరించారు. పనిలో పనిగా థర్డ్ ఫ్రంట్ పాట ఎత్తుకున్నారు. నాలుగు జిల్లాల నుంచి 400 మందిని ప్రగతి భవన్‌కు పిలిపించి పడికట్టు మాటలతో ఉపన్యాసాన్ని దంచితే, వచ్చిన వారంతా అప్పుడే కేసీఆర్‌కు దేశ ప్రజల ఆమోదం లభించేసినట్లు 3వ కూటమి అధికా రంలోకి వచ్చి కేసీఆర్ ప్రధాని అయి నట్లు నినాదా లిచ్చి, సాక్షాత్తూ మంత్రులు కూడా ఏదో అయిపో తుందని భ్రమింపజేసే యత్నం ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్లున్న’ సామెతను గుర్తుకు తెస్తుంది. అవసరానికి ఇతరులను మోసం చేసినవాళ్లను చూస్తున్నాం. కానీ ఏమీ జరక్కున్నా ఈ ఆత్మవంచనలు ఎందుకో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఇక మూడో ఫ్రంట్ ఎందుకనే అంశంపై కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలన ప్రజలకు నచ్చలేదని తీర్పిచ్చేశారు. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజలు ఒక పార్టీని, నాయకుడిని నమ్మి అధికారం కట్టబెడితే ఒక్క అవినీతి మరక కూడా లేకుండా సమర్థ పాలనతో, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులెట్టిస్తున్న మోదీ పాలనను కాంగ్రెస్ పాలనను పోల్చటం సబబేనా? కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, అధి కారాన్ని నిలుపుకోవడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ప్రజలకిచ్చి, వాటిని నెరవేర్చమనే పార్టీల గొంతెమ్మ కోర్కెలను కాదంటే ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించనట్లేనా? రిజర్వేషన్లను ఇష్టారీతిన ఇచ్చే అధికారం రాష్ట్రాలకివ్వాలనటం విచ్చలవిడితనాన్ని ఒప్పుకోవాలనటం కాదా? కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్లు, వాటి చరిత్ర తెలియంది కాదు. ఈ దేశం నేషనల్ ఫ్రంట్. యునై టెడ్ ఫ్రంట్లను చూసింది. అవి అభాసుపాలైన తీరూ చూసింది. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ లాంటి వారు విఫలమైన వ్యవహారాలన్నీ చూసింది. సిద్ధాంత సారూప్యత, దీర్ఘకాలిక లక్ష్యాల్లే కుండా అధికారమే పరమావధిగా నిర్మిత మయ్యే బంధాలు ఎక్కువకాలం కొనసాగలేవన్న సత్యం తెలిసి ప్రత్యామ్నాయ ఫ్రంట్, టెంటు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరగా చెప్పాలంటే ఎవరే ఫ్రంట్ కట్టినా, ప్రజల మద్ధతు బలంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రాల వారీగా విజయాలందుకుంటూ, ప్రజా మద్ద తును మరింత పెంచుకుంటున్న మోదీ ఇమేజ్ ముందు ఈ ప్రయత్నాలేవీ ఫలించవు. అధికారం కోసమే ఐక్యత రాగాలు పాడే వారిని ప్రజలు సమర్థించరు. రావుల శ్రీధర్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ -
గులాబీసేన వాట్సాప్!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రులు, ఇతర కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఏ క్షణమైనా రంగంలోకి దిగే అవకాశముందని, ఏ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడాలని సూచించినట్లు సమాచారం. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని స్పష్టం చేశారని... మంత్రులు, ఇతర ముఖ్యస్థానాల్లో ఉన్నవారెవరైనా కాపాడుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఆరేడు నెలల కింద ఇదే విషయంపై మంత్రులు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్నవారిని హెచ్చరించారని సమాచారం. అయినా ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిలో మార్పురాకపోవడంతో ఇటీవల మరోసారి హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేవలం రాజకీయాలు, పరిపాలనా వ్యవహారాల్లోనే కాకుండా.. వ్యక్తిగత వ్యవహారాలు, భూ తగాదాలు వంటి విషయాల్లోనూ టీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. వ్యక్తిగత, పరిపాలన, రాజకీయ వ్యవహారాల్లో అవినీతి, అవకతవకలు, నేరారోపణల కేసులు, ఐటీ సహా పన్నుల బకాయిలేవీ లేకుండా చూసుకుంటున్నట్టు తెలిసింది. చిన్న తప్పు జరిగినా కాపాడుకోలేను.. ‘‘కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగుతున్నాం. కేంద్ర ఆధీనంలో ఐటీ, ఈడీ వంటి కీలకమైన దర్యాప్తు సంస్థలున్నాయి. ఈ కీలకమైన సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అడ్డంగా దొరికిపోతాం. తప్పు చేసి దొరికిపోతే మన నాలుక కింద ముల్లున్నట్టు అవుతుంది. ఎవరు తప్పు చేసినా అందరికీ అంటుతుంది. గతంలో తెలిసో, తెలియకో ఏమైనా జరిగితే దిద్దుకోండి, భవిష్యత్తులో చేయకుండా ఒళ్లు దగ్గరపెట్టుకోండి. తరువాత ఏం జరిగినా నేను కూడా కాపాడుకునే పరిస్థితి ఉండదు..’’అని నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రధాని మోదీపై, బీజేపీపై గట్టిగా పోరాడుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి అదే స్థాయిలో రాజకీయ ప్రతిఘటన ఎదురవుతుందని అంచనా కేసీఆర్ వేస్తున్నారు. అందువల్ల టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అంతా వాట్సప్‌లోనే.. మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులంతా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి జంకుతున్నారు. ఎవరితో, ఏం మాట్లాడితే ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వ్యూహాలను, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఫోన్లను ట్యాప్ చేసే అవకాశముందని, అందుకు ఆస్కారమివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఫోన్‌కాల్స్ కాకుండా.. కేవలం వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా రహస్యంగా చెప్పాల్సిన విషయముంటే వాట్సాప్ కాల్ చేయాలని సూచిస్తున్నారు. వాట్సాప్ కాల్స్‌ను రికార్డు చేసే అవకాశం, ట్యాప్ చేసే అవకాశం లేదన్న ధీమాతోనే ఈ వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాష్ట్రంపై కేంద్రం నజర్! ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన వెలువడినప్పటి నుంచే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు టీఆర్ఎస్కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో ఫోన్ సంభాషణలు, నేతల భేటీలు, రాజకీయ సమాలోచనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. కీలకమైన విషయాల్లో గోప్యత పాటించాలని పార్టీ శ్రేణులకు గులాబీ అధినేత హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. పలువురు మంత్రులపై సీరియస్ ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. గతంలోనే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి చేస్తున్న సెటిల్మెంట్లు శ్రుతి మించుతున్నాయని హెచ్చరించినట్లు తెలిసింది. రాజధాని సమీప జిల్లాకు చెందిన మరో మంత్రి వ్యక్తిగత జీవనశైలిపైనా కేసీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. ఇక ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న కొందరి తీరును కూడా కేసీఆర్ తప్పుపట్టినట్టు తెలిసింది. -
మళ్లీ మూడో ఫ్రంట్ ముచ్చట
మూడో ఫ్రంట్ తన నాయకత్వంలోనే ఏర్పడుతుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 17 మంది లోక్‌సభ సభ్యులను మాత్రమే కలిగి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా? అంతకుమించి మమత గడచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక శిబిరంలో కొత్తగా ప్రవేశిస్తున్నవారు. ఇవన్నీ ఎలా ఉన్నా, ఒక అపనమ్మకం ఇక్కడ ప్రధానాంశమవుతోంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నం గురించి గడచిన ఆదివారం ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ మిత్రురాలి దగ్గర ప్రస్తావించాను. అందుకు ఆమె స్పందన ఏమిటంటే, అందులో పెద్ద విశేషం ఏముంది అనే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అధికార నిలయం ఢిల్లీ. అక్కడ ఉంటూ ఆ పార్టీ విజయ పరంపరను, వైభవాన్ని సమీపంగా చూస్తున్నవారికి 1,500 కిలోమీటర్లకు అవతల ఎక్కడో జరుగుతున్న ఒక ప్రయత్నం పెద్ద ప్రాధాన్యం కలిగినదిగా కనిపించదని నాకు అర్థమైంది. అంతకు మించి ఆ ముందురోజే, అంటే గడచిన శనివారమే ఈశాన్య భారతంలో బీజేపీ విజయఢంకా మోగిం చిన సంఘటన జరిగింది. ఆ వారాంతానికల్లా దేశంలో బీజేపీ అధికారంలో లేదా, సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల సంఖ్య 19 నుంచి 22కు చేరుకుంది. కానీ ఇదే పరిణామాన్ని దక్షిణ భారతదేశం కోణం నుంచి చూడండి. ఇక్కడ బీజేపీ కర్ణాటకలో తగినంత బలం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉప పాత్రను పోషిస్తోంది. కానీ ఢిల్లీ ఈ సువిశాల దేశాన్ని అన్ని విధాలుగా విజేతగా నిలిచిన ఒక పాలకుడి దృక్కోణం నుంచి చూస్తుంది. కానీ దక్షిణ భారతంలోనే కాకుండా, మిగిలిన భారతదేశంలోని చాలా రాష్ట్రాలు కూడా అసమ సంబంధాల సమీకరణలతోనే ఢిల్లీని చూస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి క్రోధ భావనలోనే ఉన్నారు. ఎక్కువ అధికారాలు కేంద్రం గుప్పిటలోనే ఉన్నాయని ఆయన ఆరోపణ. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇచ్చిన స్వేచ్ఛ పరిమితమంటారాయన. మండిపడుతున్న రాష్ట్రాలు కేటాయించవలసిన నిధుల కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని తొందరపెడుతున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం మేరకు ఇస్తామన్న నిధులు ఇవ్వమంటూ ఆ రాష్ట్రం ఢిల్లీ ముందు దేహీ అనవలసి రావడం గురించి ఆగ్రహంతో కూడా ఉంది. కావేరీ జలాల పంపిణీ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనందుకు తమిళనాడు కేంద్రం మీద మండిపడుతున్నది. తమ తమ రాష్ట్రాల జనాభాను బట్టి రిజర్వేషన్ కోటాను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టాలని తెలంగాణ కోరుతున్నది. కలకత్తా మెట్రోరైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు నిధులు సహా, పశ్చిమ బెంగాల్‌కు ఇవ్వవలసిన చాలా నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆ రాష్ట్ర నాయకత్వం ఆరోపణ. కేసీఆర్ యోచిస్తున్న సరికొత్త సహకార సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి పరిమిత అధికారాలు ఉండాలి. రాష్ట్రాలకు అత్యధికంగా అధికారాలు ఇవ్వాలి. అంటే కేసీఆర్ ఊహిస్తున్న నమూనాలో భారత్ అంటే, భారత సంయుక్త రాష్ట్రాలు అవుతుంది. కేసీఆర్ వ్యూహంలో ఆసక్తి కలిగించే విషయం ఒకటి ఉంది. 2014కు ముందు నరేంద్ర మోదీ వ్యక్త పరిచిన అభిప్రాయాల జాడలే అందులో కనిపిస్తాయి. అప్పుడు మోదీ కేంద్రాన్ని విమర్శించినట్టే ఇప్పుడు కేసీఆర్ కూడా కేంద్రం మీద ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం రాష్ట్రాల మీద స్వారీ చేస్తున్నదని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విమర్శించారు. కేసీఆర్ కూడా కేంద్రం రాష్ట్రాలను తోలుబొమ్మల మాదిరిగా ఆడించాలని చూస్తున్నదని ఆరోపించారు. నాడు యూపీఏ ప్రభుత్వం చట్టాలు చేయడం మినహా, వాటి అమలులో క్రియ శూన్యమని గుజరాత్ నుంచి మోదీ ఘోషించారు. విదేశ వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రత, జాతీయ రహదారులు మినహాయించి మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలను కేంద్రం వదులుకోవాలని కేసీఆర్ చెబుతున్నారు. దేశంలోని ఆరులక్షల గ్రామాలలో రోడ్ల నిర్మాణం గురించి ఢిల్లీలో ఉండే ప్రధానికి సంబంధం ఏమిటని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలోని హేతుబద్ధత ఏమిటని కూడా అడుగుతున్నారు. ఇలాంటి పాలనా పరమైన సంస్కరణల గురించి తేనెతుట్టను కదపడానికి కేసీఆర్ వెనుక అజ్ఞాతంగా ఉన్న కారణాలు ఏమిటి? ఇదే ఇప్పుడు ఆయనను మిగిలిన అసంతృప్త ముఖ్యమంత్రుల దృష్టిలో పడేటట్టు చేసి, కేంద్రం పట్ల ఒక ప్రెషర్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి కారణమవుతున్నది. అయితే ఇలాంటి కూడిక వెనుక అంచనాలకు అందని కొన్ని లెక్కలు ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ రెండువందల స్థానాలకు మించి సాధించలేకపోతే, కాంగ్రెస్ కూడా మూడంకెలలో స్థానాలను గెలుచుకోలేకుంటే మూడో ఫ్రంట్కే అనివార్యంగా అధికార యోగం పడుతుందన్నదే ఆ లెక్క. నిజం చెప్పాలంటే ఇది 1996–98 నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం వంటిదే. ప్రాంతీయ పార్టీల నేతలు తక్కువ తిన్నారా? కానీ అసమతౌల్యం అనే ఒక్క నినాదంతోనే కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఒక తాటి మీదకు తీసుకురాగలరా? ప్రాంతీయ పార్టీల అధినేతలు ఏకమై కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది, మరింత ప్రాతినిధ్యం కలిగిన ప్రభుత్వం ఏర్పడడమనేది వారు తమ తమ స్వాతిశయాలను వీడినప్పుడే సాధ్యపడుతుంది. ఒకే వ్యక్తికి ప్రయోజనం చేకూరడమనే ఫలశ్రుతి లేనపుడే అది వీలవుతుంది. వాస్తవం ఏమిటంటే చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు బంధుప్రీతితో పాటు తమ తమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చాలా పరిమితంగా అనుమతించేవారే. అలాగే అలాంటి కలయిక చాలా అస్థిరత్వంతో కూడి ఉంటుందని గత అనుభవాలు వెల్లడిస్తున్నాయి. దీనితో కార్పొరేట్ ఇండియాకు బొత్తిగా పొసగని సంగతి కూడా గత అనుభవమే. బాగా గుర్తుంచుకోవలసిన ఇంకొక అంశం ఏదంటే, ఈ మూడో ఫ్రంట్ ప్రభుత్వ ఆలోచన వాస్తవరూపం దాల్చాలన్నా కూడా అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీ మద్దతు అనివార్యం. ఈ వాస్తవాల మాటేమిటి? అప్పుడు మళ్లీ నాయకత్వ సమస్య తలెత్తుతుంది. రాబోయే మూడో ఫ్రంట్ తన నాయకత్వంలోనే ఏర్పడుతుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 17 మంది లోక్‌సభ సభ్యులను మాత్రమే కలిగి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా? అంతకుమించి మమత గడచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక శిబిరంలో కొత్తగా ప్రవేశిస్తున్నవారు. ఇవన్నీ ఎలా ఉన్నా, ఒక అపనమ్మకం ఇక్కడ ప్రధానాంశమవుతోంది. తాను బీజేపీ తయారుచేసి ఇచ్చిన స్క్రిప్ట్‌కు అనుగుణంగా నడవడం లేదన్న సంగతిని కేసీఆర్ నమ్మేటట్టు చేయగలగాలి. కాంగ్రెస్, మూడో ఫ్రంట్‌గా విపక్షం చీలిపోవడం కంటే మోదీ, అమిత్‌షాలను సంతోషపరిచే అంశం మరొకటి ఏదీ ఉండదు. కానీ వచ్చే సంవత్సరం వేసవిలో తగినన్ని స్థానాలు దక్కకపోతే, కేసీఆర్ వంటి స్వతంత్ర పార్టీ సేనానితో ఒప్పందం చేసుకోవడమే మోదీకి సులభమవుతుందని కాంగ్రెస్ నమ్మకం. మరొక వాస్తవం కూడా ఉంది. తెలంగాణలోని వాస్తవిక పరిస్థితులే కేసీఆర్ వేయబోయే అడుగును ప్రధానంగా శాసిస్తాయి. ఎన్నికలు జరగడానికి ఇంకొక సంవత్సరం సమ యం ఉండగా తాను మరొక స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్టు అంతా అనుకునేటట్టు కేసీఆర్ చేశారు. తెలంగాణలో ఉన్న రైతు సమస్య, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకుండా, ఆయన మొన్న శనివారం నుంచి జాతీయ స్థాయికి చేరడం గురించి చెబుతున్నారు. 2014లో ఉపయోగించిన తెలంగాణ సెంటిమెంట్ ఈ ప్రయాణంలో ఉపకరిస్తుందని ఆయన భావన. మోదీ ఇప్పుడు ఎందుకు చేదయ్యారు? ఇతర ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలు తెలుసుకోగోరే మరొక అంశం కూడా ఉంది. మోదీ గురించి అంత కటువుగా కేసీఆర్ మాట్లాడడానికి, తీవ్ర వ్యతిరేకిగా మారిపోవడానికి వెనుక ఉన్న ప్రబలమైన కారణం ఏమిటి? ఇది వారు తెలుసుకోవాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. 2016 నవం బర్ నుంచి కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన తొలి ఎన్డీయేతర ముఖ్యమంత్రి ఆయనే. వస్తుసేవల చట్టాన్ని కూడా కేసీఆర్ సమర్థించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఆఖరికి అప్పుడు ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌ను కేసీఆర్ కలుసుకోలేదు కూడా. ఇప్పుడు మాత్రం కేసీఆర్ కేంద్రం పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న తన ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించలేదు. హైకోర్టు విభజన జరగలేదు. కొత్త సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని బదలీ చేయలేదు. ప్రాజెక్టులకు నిధులు రావడం లేదు. అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలన్న ప్రతిపాదనకు అనుమతి రాలేదు. పైగా నియోజకవర్గాలు పెరుగుతాయన్న ఆశతో ఇతర పార్టీల నుంచి సభ్యులను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారికి స్థానాలు కేటాయించడం ఒక సమస్య. ఇవన్నీ ఆయన కేంద్రం పట్ల ఆగ్రహంగా ఉండడానికి వెనుక కారణాలు. వేచి చూడవలసిందే కేంద్రం ఢిల్లీ, ముంబై పరిధిని మించి ఆలోచించడం లేదని ఇటీవల కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.టి. రామారావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల విషయంలో దక్షిణ భారతానికి మొండి చేయి చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే సేద్యపు రంగంలో సంక్షోభానికి మోదీయే కారకుడని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కానీ అది తెలం గాణ సహా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్య. కాబట్టి రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే మూడో స్థానం పొందిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇలాంటి విమర్శ చేయడం గురించి ఆయన ప్రత్యర్థులు ఎదురుదాడులకు దిగుతారు. ఢిల్లీ వైపు చూపు అనే అంశం విషయంలో ఆయన అనుభవాన్ని కూడా నెమరు వేసుకోవాలి. ఆయన కంటే ముందు ఇద్దరు– ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబునాయుడు ఆ ప్రయత్నంలో నవ్వుల పాలయ్యారు. నేషనల్ ఫ్రంట్ రాజకీయాలలో ఎన్టిఆర్ ఉన్నారు. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏలతో చంద్రబాబు నడిచారు. ఇవన్నీ ఎలా ఉన్నా, కేసీఆర్ ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడడం మంచిది. 2001లో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు ఎద్దేవా చేసినవారు ఉన్నారు. కొన్ని ఎగుడు దిగుళ్లు ఉన్నా ఆయన విజయం సాధించారు. కాబట్టి పూర్తిగా నిరాశావాదంలోకి పోకుండా ఆయన ప్రయత్నం ఎంతవరకు సాగుతుందో పరిశీలించాలి. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఫ్రంట్‌కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు
భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని శాసన సభాపతి మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, లక్ష్మారెడ్డితో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. కడియం మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలన దేశాన్ని భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. 70 ఏళ్ల పాటు బీజేపీ, కాంగ్రెస్ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఇరుపార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి దేశ ప్రజలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ జెండా కింద దేశ నాయకత్వం పని చేయ బోతుందన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందన్నారు. త్వరలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు, ఏరియా ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రుల వరకు తెలంగాణ డయాగ్నోసిస్ పేరుతో మెరుగైన రక్త పరీక్షల సేవలు అందిస్తామని వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖలో 10 వేల కొత్త పోస్టులు మంజూరు చేశామని, 2, 3 నెలల్లో వాటిని భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఫార్మ్ డీ కోర్సును మంజూరు చేశారని, భవిష్యత్తులో వారికి ఏ విధంగా ఉద్యోగవకాశాలు కల్పించాలనే విషయాన్ని విస్మరించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 6 వేల మంది ఫార్మ్ డీ విద్యార్థులు ఉన్నారని, వారి సమస్యను పరిష్కరించేందుకు కమిటీ వేశామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. -
ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా.. బంగారు భారత్!
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌కు రాజకీయ ఎజెండా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా సమాన అభివృద్ధి లక్ష్యంగా, రైతులను, పేద వర్గాలను ఆదుకునే చర్యలతో ఎజెండాను రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన పథకాలను చూపి, గుజరాత్ మోడల్ నినాదంతో దేశ రాజకీయాల్లో సత్తా చాటారు. అదే తరహాలో ‘బంగారు తెలంగాణ’ఎజెండాను దేశవ్యాప్తంగా అమలు చేయడం లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామనే నినాదాన్ని ఎత్తుకోనున్నారు. ఈ ఎజెండాకు సంబంధించి సీఎం కేసీఆర్.. సీఎంవో అధికారులు, వివిధ రాష్ట్రాల్లోని సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా అవసరమైన, ప్రభావం చూపగలిగే పథకాలను గుర్తించాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు సమాచారం. మొత్తంగా బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను దేశవ్యాప్తంగా అమలు చేసే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను ప్రాథమికంగా ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రాథమిక ఎజెండాలోని అంశాలివీ.. ♦ రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తున్న పన్నుల వాటాను 42 శాతం నుంచి 50 శాతానికి పైగా పెంచాలి. ♦ స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా నిధులు పంపిణీ చేసే విధానాన్ని మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే స్థానిక సంస్థలకు నిధుల పంపిణీ జరగాలి. ♦ కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధులను నిర్దిష్టంగా అదే పథకానికి ఖర్చు చేయాలనే నిబంధనలు తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను తమ ప్రాంత, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకునేలా అవకాశం ఉండాలి. ♦ రక్షణ, విదేశాంగం, అంతర్గత భద్రత, కరెన్సీ నిర్వహణ వంటి కీలకమైన అం శాలు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలి. మిగ తా అంశాలన్నింటినీ రాష్ట్రాలకే కేటాయించాలి. ఉమ్మడి జాబితాలో ఉన్న దాదాపు అన్ని అంశాలను రాష్ట్రాలకే అప్పగించాలి. ♦ రిజర్వేషన్ల శాతం నిర్ణయించే అధికారం రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి. జనాభాలోని ఆయా వర్గాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ♦ తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాగా.. ప్రతి రాష్ట్రంలో ఒక భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలి. అక్కడి ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్ర నిధులతోనే నిర్మించాలి. ♦ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చిన్న నీటి వనరులను పునరుద్ధరించాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. ♦ రాష్ట్రంలో అమలు చేయనున్న ఎకరానికి రూ.8 వేల వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని దేశమంతటికి విస్తరించాలి. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించాలి. ♦ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా ఉండాలి. దీనికి అవసరమైన మౌలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ తెలంగాణలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అమలవుతున్న ‘కేసీఆర్ కిట్’తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రసూతి అనేది పేదలకు భారం కాకుండా, పేద మహిళలకు ఆరోగ్యపరంగానూ ఈ పథకం భరోసా ఇస్తుంది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. ♦ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా అభివృద్ధి చేయాలి. దేశ వ్యాప్తంగా ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభు త్వ విద్యారంగాన్ని తీర్చిదిద్దాలి. -
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ‘ఫెడరల్ ఫ్రంట్’!
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో మార్పు కోసం రూపుదిద్దుకోనున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనకు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభను వేదికగా చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇదే వేదికపై ఫెడరల్ ఫ్రంట్‌పై పూర్తిస్థాయి రాజకీయ ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం. కార్యాచరణపై కసరత్తు.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగడతానని ప్రకటించిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించి, ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై మథనం చేస్తున్నారు. దీనికోసం రాజకీయ, రాజకీయేతర మేధావులతో చర్చిస్తున్న ఆయన.. టీఆర్ఎస్ ఆవిర్భావ సభను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఉద్యమం నాటి తరహాలో.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలను నిర్వహించారు. వాటికి ఇతర రాష్ట్రాల్లోని పార్టీల అధినేతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్ తదితరులు టీఆర్ఎస్ సభల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అలా ఇతర పార్టీలు రాజకీయ వేదికలపై సంఘీభావం తెలపడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ అదే తరహాలో వ్యవహరించాలని.. కలసి వచ్చే రాజకీయ పార్టీల నేతలను, కూటమి పట్ల సానుకూలంగా ఉన్న నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగసభను ఫెడరల్ ఫ్రంట్‌కు పునాదిగా మలచాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. 10 లక్షల మందితో.. ఫెడరల్ ఫ్రంట్‌కు పునాది వేసే బహిరంగసభను తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మన రాష్ట్రంపై దృష్టి పడేలా చేయడం, టీఆర్ఎస్ కేడర్‌లో స్థైరం నింపడమనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లేదా నల్లగొండలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను, ప్రతినిధులను ఆహ్వానించనుండటంతో ఆ స్థాయిలోనే బహిరంగ సభ ఉండాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వస్తారని.. అనంతరం బహిరంగసభకు ఆహ్వానించే పార్టీల నాయకులు, ప్రతినిధుల జాబితా సిద్ధం కానుందని పేర్కొంటున్నారు. -
కేసీఆర్‌కు ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఝలక్ తగిలింది. ఫెడరల్ కూటమి ప్రతిపాదన మద్ధతు విషయంలో అప్పుడే ఓ పార్టీ వెనక్కి తగ్గింది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించాం. వచ్చే ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో పోరాడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశారు’ అని తెలిపారు. కాగా, థర్డ్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్‌తో తాను మాట్లాడానని.. రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులు కలిస్తే జాతీయ స్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చని హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌పై పొగడ్తలు గుప్పించిన సోరెన్.. 48 గంటలు గడవకముందే కూటమిపై వెనక్కి తగ్గటం విశేషం. Rahul Gandhi has given us his word that the upcoming Lok Sabha & Vidhan Sabha elections will be fought under the leadership of Jharkhand Mukti Morcha (JMM): Hemant Soren, Former Jharkhand CM. pic.twitter.com/hClR9cVSgD — ANI (@ANI) 6 March 2018 -
వడివడిగా.. ‘ఫ్రంట్’దిశగా!
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారులతో భేటీ కావాలని యోచిస్తున్నారు. జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేయడం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవం ఉన్న ఆలిండియా సర్వీసు అధికారులతో సమావేశమైతే.. దేశానికి కావల్సిన ఎజెండాను రూపొందించడానికి దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమైన తర్వాత రక్షణ శాఖ (సైనిక, వైమానిక, నౌకాదళ) మాజీ ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులతో... దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ భేటీ కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భేటీల కోసం సమన్వయకర్తలు.. ప్రముఖులు, సంఘాలతో నిర్వహించే సమావేశాలను హైదరాబాద్, ఢిల్లీలో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొత్తంగా వివిధ వర్గాల ప్రతినిధులతో వరుసగా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఆయా వర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించినట్లు సమాచారం. దేశం బాగుపడాలని, దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్క వర్గంతో మాట్లాడటం ద్వారా.. దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్‌కు అజిత్ జోగి ఫోన్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, ఆ రాష్ట్ర జనతా కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ ప్రమోద్‌కుమార్ జోగి కేసీఆర్‌తో చర్చించారు. సోమవారం సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న కేసీఆర్ ప్రకటనకు మద్దతు ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘గొప్ప నేతగా ఇప్పటికే నిరూపించుకున్నారు. మరోసారి గొప్ప నేతగా నిరూపించుకుంటారు’అని అజిత్ జోగి కేసీఆర్‌ను అభినందించినట్లు తెలిసింది. -
ఫెడరల్ ఫ్రంట్ కొత్త నాటకం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘నాలుగేళ్లుగా కేసీఆర్.. మోదీ అంటే గడగడ వణికాడు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బీజేపీ సర్కారుకు మద్దతిచ్చాడు.. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ నాటకమాడుతున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ లేదు.. మన్నూలేదు. రానున్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేడు..’’అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆదివారం బోధన్, నిజామాబాద్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉత్తమ్ మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించకుండా అమానవీయంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్ర బడ్జెట్లో రైతు ఉత్పత్తుల కొనుగోళ్లకు ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు. కందులకు కర్ణాటక ప్రభుత్వం క్వింటాలుకు రూ. 450 బోనస్ ఇస్తోందని, మరికొన్ని రాష్ట్రాలు వరి, గోధుమలకు బోనస్ ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రంలో 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అయితే, మూడేళ్లలో అది 49 వేల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని వివరించారు. మైనారిటీ సంక్షేమం కోసం రూ. 1,200 కోట్లు కేటాయించామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడినప్పుడు మద్దతు కోసం కేసీఆర్‌కు తాను ఫోన్ చేసినా లైన్లోకి రాలేదని విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి లబ్ధి... కేంద్రంలోని బీజేపీని గద్దె దించడం టీఆర్ఎస్, ఎంఐఎం వల్ల సాధ్యం కాదని, కాంగ్రెస్‌తోనే ఇది సాధ్యమవుతుందని ఉత్తమ్ తెలిపారు. దీన్ని ముస్లిం మత పెద్దలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓట్లేస్తే పరోక్షంగా బీజేపీ లబ్ధి పొందుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి కలిసొచ్చేలా ఎంఐఎం కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిందని, బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను టార్గెట్ చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు...ఇలా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన అన్ని వర్గాలు కేసీఆర్ పాలనలో మోసపోయామనే భావనకు వచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. డిసెంబర్లోనే కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. పెట్టుబడి సాయం ఎన్నికల జిమ్మిక్కే... రైతులకు మే నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామన్న కేసీఆర్ మాటలు ఎన్నికల జిమ్మిక్కేనని.. నాలుగేళ్లలో గుర్తుకురాని ఈ పథకం సీఎంకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని ఉత్తమ్ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారిలిస్తామని ఇచ్చిన సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. కబ్జాకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్‌వి కలలే : జానారెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. కేంద్ర రాజకీయాలకు వెళతానని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. సభల్లో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు ప్రసంగించారు. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభల్లో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, నేతలు మల్లు రవి, ప్రసాద్, దానం నాగేందర్, కె.లక్ష్మారెడ్డి, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యల్లోనే రాష్ట్రం నంబర్ వన్ ... తన పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందంటూ మీడియా, పేపర్లను వినియోగించుకుని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. మద్యం తాగించడంలో, అప్పులు చేయడంలో, రైతు ఆత్మహత్యల్లోనే రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు రూ. లక్ష చొప్పున రివాల్వింగ్ ఫండ్‌తోపాటు రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు రుణం అందజేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ రుణంపై వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని, దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 70 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అభయహస్తం పింఛను మొత్తాన్ని రూ. వెయ్యికి పెంచుతామని, సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి చెల్లిస్తామన్నారు. అలాగే బోధన్ నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. -
విపక్ష వ్యూహమేది?
త్రికాలమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ‘ఫెడరల్ ఫ్రంట్’ గురించి ఆలోచిస్తున్నారనీ, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాలని తలపోస్తున్నారనీ ‘సాక్షి’ పతాక శీర్షికగా ప్రచురించిన శనివారంనాడే ఆ వార్తను కేసీఆర్ స్వయంగా ధ్రువీకరించడం విశేషం. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనీ, అస్పష్టత రాజ్యమేలుతోందనీ, ప్రగతి మందగించిందనీ చెబుతూ, పరిస్థితులు మారాలనీ, పరివర్తన సాధించాలనీ, అవసరమైతే అందుకు తాను చొరవ తీసుకుంటాననీ ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ప్రాబల్యం అసాధారణ స్థాయికి పెరిగి, కాంగ్రెస్, వామపక్షాలు కోలుకోలేని దెబ్బతిన్నట్టు ఎన్నికల ఫలితాలు వెల్ల డించిన రోజే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దూకుడుగా మాట్లాడటం కాకతాళీయం కాకపోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదనీ, నూతన రాజకీయ వ్యవస్థ ఆవశ్యకత ఉన్నదనీ ఉద్ఘాటించారు. ఆత్యయిక పరిస్థితి అనంతరం జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించినట్టు, 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం స్థాపించిన తర్వాత తొమ్మిది మాసాలకే కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి అట్టహాసంగా వచ్చినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికలలో విజయఢంకా మోగించినట్టు ఏదో ఒక కొత్త పరి ణామం సంభవించి విప్లవాత్మకమైన పరివర్తన రావలసిన అగత్యం ఉన్నదని ఉద్ఘోషించారు. బీజేపీ విజయపరంపర కొనసాగిస్తూ దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలోనూ 21 రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్న దశలో కేసీఆర్ ఇటువంటి అసాధారణ ప్రకటన చేయడం ఆశ్చర్యకరం. ఇటీవల కరీంనగర్ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ నరేంద్రమోదీని అమర్యాదగా సంబోధించడంపట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు అభ్యంతరం చెప్పడం, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ తీవ్రంగా ఆక్షేపించడం, నోరు జారి (స్లిప్ ఆఫ్ ద టంగ్) ఉండవచ్చునంటూ కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కేంద్రమంత్రికి సంజాయిషీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ప్రధాని పట్ల కేసీఆర్‌కు అపారమైన గౌరవభావం ఉన్నదంటూ ముఖ్యమంత్రి కుమార్తె కవిత వ్యాఖ్యానించడం పత్రికలు చదివేవారికీ, టీవీ న్యూస్‌చానళ్ళు చూసినవారికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ప్రధాని పట్ల గౌరవాభిమానాలు ఉన్నాయనీ, ఆయనతో స్నేహం కూడా ఉన్నదనీ, వ్యక్తిగతంగా మోదీ పట్ల వీసమెత్తు వ్యతిరేకత లేదనీ చెప్పడం మాత్రమే ఉద్దేశమైతే కేసీఆర్ మీడియా గోష్ఠి అంతవరకే పరిమితమై ఉండేది. జాతీయ రాజకీయాల గురించి శషభిషలు లేకుండా మాట్లాడటం, 64 ఏళ్ళ వయసున్న తాను శేష జీవితాన్ని దేశప్రజల సేవకు అంకితం చేయడంలో తప్పు ఏమున్నదంటూ వాదించడం చర్చోపచర్చలకు తావు ఇస్తుంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో తాను జాతీయ స్థాయిలో పని చేస్తానంటూ ప్రకటించడం దేనికి సంకేతం? రాష్ట్రంలో పగ్గాలు కేటీఆర్‌కు అప్పజెప్పడానికి భూమిక సిద్ధం చేస్తున్నారనే అనుమానం కొంతమందికి రావచ్చు. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ప్రభావం తగ్గితే, కాంగ్రెస్ పుంజుకోకపోతే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అటువంటి కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఒక అడుగు ముందు ఉండటం ఉద్దేశం కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అయిదారు కంటే ఎక్కువ దక్కే అవకాశం లేదనీ, తెలంగాణలోని 17 స్థానాలలో అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుందనీ ఆయన అంచనా కావచ్చు. రెండు సర్వేలు జరిపించినట్టు చెబుతున్నారు కానీ వివరాలు వెల్లడించలేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. చారిత్రక సందర్భం తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలలో విజయాలు సాధించే అవకాశం ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, మహారాష్ట్ర నాయకుడు శరద్‌పవార్ కానీ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేయలేదు. ఒకానొక చారిత్రక సందర్భంలో జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర పోషించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ద్వారా కేసీఆర్ ప్రమాదపుటంచుల్లో విన్యాసాలు చేసే స్వభావాన్ని మరోసారి వెల్లడించారు. మోదీని ప్రత్యక్షంగా విమర్శించకుండా సంయమనం ప్రదర్శించారు. ఇదే వైఖరి కొనసాగిస్తే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడవలసి రావచ్చు. పరిస్థితులను బట్టి ఎవరిపైన దాడి చేయాలో నిర్ణయించుకుంటారు. కారు గేరు మార్చి వేగం పెంచినప్పుడు ఎవరు అడ్డు వస్తే వారిని ఢీ కొంటుంది. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూనే నేషనల్ ఫ్రంట్ నడక నచ్చని ప్రతిసారీ భారతదేశం పార్టీని జాతీయ స్థాయిలో నెలకొల్పుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించేవారు. అంత పని చేయలేదు. కేసీఆర్ కూడా తన ప్రతిపాదనకు ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో తెలుసుకునేందుకు ఈగ వదిలే ఉద్దేశంతో (కైట్ ఫ్లయింగ్) ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడి ఉండవచ్చు. ఆ ప్రస్తావన మళ్ళీ చేయకపోతే ఆయనను ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు నిజంగా ఉన్నాయా? రెండు జాతీయ పార్టీల వైఖరి గమనించినట్లయితే అటువంటి అవకాశాలు లేవని చెప్పడం కష్టం. ఇటీవల రాజస్థాన్ ఉప ఎన్నికలలో బీజేపీ పరాజయం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ. కాంగ్రెస్‌కి మంచి ఊపు ఇచ్చిన సందర్భం. కానీ కాంగ్రెస్, సీపీఎంలు వ్యవహార శైలిని మార్చుకోకుండా పాత పద్ధతులనే కొనసాగిస్తే బీజేపీకి ఓటమి భయం ఉండదు. ప్రస్తుతం మూడున్నర రాష్ట్రాలకు (కర్ణాటక, పంజాబ్, మిజోరం, పుదుచ్చేరి) పరిమితమైన కాంగ్రెస్ రేపు కర్ణాటకలో అధికారం నిలబెట్టుకుంటే, ఈ యేడాది జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించగలిగితే 2019లోజరిగే సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఏడేళ్ళ కిందట పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ వామపక్ష సంఘటనను ఓడించినప్పుడే ఆ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను గుర్తించి, వాటిని అధిగమించి, సృజనాత్మకంగా వ్యవహరించి ఉంటే త్రిపురలో పరాభవం తప్పేది. కాంగ్రెస్ పాత నాయకులతో, పాత పద్ధతులతోనే కొనసాగితే పర్యవసానం ఎట్లా ఉంటుందో త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలి తాలు స్పష్టం చేశాయి. ఓట్ల లెక్కింపునాడే కాంగ్రెస్ అధ్యక్షుడు దేశంలో లేకుండా ఇటలీ వెళ్ళడం ఒక ప్రహసనం. విదేశీ పర్యటనలూ, విరామ విహా రాలూ పూర్తిగా మానివేసి ఈ యేడాది పూర్తిగా పార్టీ పునర్నిర్మాణంపైన దృష్టి పెట్టకపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. అన్ని రాష్ట్రాలలో కీచులాడుకుంటున్న ముఠాలను ఏకం చేసి చావోరేవో తేల్చుకోవలసిందిగా కట్టడి చేయకపోతే కాంగ్రెస్‌కు నిష్కృతి లేదు. బీజేపీ రణతంత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులలో ఉన్న సంకల్ప బలం, దీక్షాదక్షతలు కాంగ్రెస్ నాయకులలో కనిపించవు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక వెంటనే బీజేపీ నాయకులకు మోదీ, అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. తూర్పు రాష్ట్రాలపైనా, ఈశాన్య రాష్ట్రాలపైనా దృష్టి కేంద్రీకరించాలంటూ ఆదేశించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అప్పటి నుంచి ఏకాగ్రచిత్తంతో ఈశాన్య రాష్ట్రాలలో పార్టీ విజయావకాశాలు పెంపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారణాసిలో మోదీ ఎన్నికలను పర్యవేక్షించిన సునీల్ దేవ్‌ధర్‌ను త్రిపుర వ్యవహారాల పర్యవేక్షకుడిగా పంపించారు. ఆయన త్రిపురలో 500 రోజులు మకాం ఉండి క్షేత్ర వాస్తవికతను అధ్యయనం చేసి, ఆదివాసీలనూ, ఇతరులనూ ఐకమత్యంగా పని చేసే విధంగా ప్రోత్సహించారు. పార్టీ నియమించిన అన్ని కమిటీలలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం కల్పించి తామూ పార్టీలో భాగస్వాములమనే విశ్వాసం కలిగించారు. మణిక్ సర్కార్ సచ్ఛీలుడు. నిరాడంబరుడు. ప్రతిప క్షాలు సైతం గౌరవించే మచ్చలేని వ్యక్తిత్వం ఆయనది. కానీ దిగువ స్థాయి సీపీఎం నాయకులలో, కార్యకర్తలలో అలసత్వం, నిరంకుశ ధోరణి ప్రబలి ప్రజ లను పార్టీకి కొంత దూరం చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌తో పోల్చితే సీపీఎంది అంత ఘోరమైన పరాజయం కాదు. పాతికేళ్ళ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి పేరుకుపోవడం సహజం. సీపీఎంకు గత ఎన్నికల కంటే ఈసారి ఆరు శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ నాయకులు కట్టకట్టుకొని బీజేపీలో చేరుతుంటే కాంగ్రెస్ అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషించిందే కానీ వలసలను అరికట్టే ప్రయత్నం చేయలేదు. అస్సాం నుంచి త్రిపుర వరకూ బీజేపీ ఒకే వ్యూహాన్ని జయప్రదంగా అమలు చేసింది. దాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన నేర్పు, సమయస్ఫూర్తి కాంగ్రెస్ నాయకత్వంలో లేదు. ఆ పార్టీలో ఒక రాంమాధవ్, ఒక దేవ్‌ధర్, ఒక విప్లవ్ కుమార్ దేవ్ వంటి నాయకులు మచ్చుకైనా లేరు. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూర్చున్నా ముఠా రాజకీయాలకు స్వస్తి చెప్పి పని చేయాలన్న సద్బుద్ధి సీని యర్ కాంగ్రెస్ నేతలకు లేదు. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తూ ప్రతి రాష్ట్రాన్నీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించి, అక్కడి కుల సమీకరణాలనూ, మతాల ప్రభావాలనూ, సామాజికాంశాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఇతర పార్టీలలో సమర్థులుగా పేరు తెచ్చుకున్న నాయకులను అరువు తెచ్చుకొని, కేంద్ర ప్రభుత్వానికి సహజంగా ఉండే అపారమైన ప్రాబల్యాన్నీ, వనరులనూ వినియోగించి విజయాలు సాధిస్తోంది బీజేపీ. యుద్ధంలోనూ, ప్రేమలోనూ ఏమి చేసినా చెల్లుతుందనే సూత్రాన్ని బీజేపీ ఎన్నికలకూ వర్తింపజేస్తున్నది. గతంలో మెజారిటీ లేకపోయినా గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు నెలకొల్పడం ఆ వైఖరి ఫలితమే. కాంగ్రెస్‌లో మంచి పేరున్న అస్సాం నేత హేమంత్ విశ్వాస్ శర్మను బీజేపీ ఆకర్షించింది. రాజకీయ కౌశలం దండిగా కలిగిన శర్మ ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ భరతం పడుతున్నారు. ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకుంటాయా? కాంగ్రెస్, సీపీఎంలు గుణపాఠాలు నేర్చుకొని పార్టీల పునర్నిర్మాణానికి సకాలంలో సరైన చర్యలు తీసుకుంటేనే బీజేపీ రథాన్ని నిలువరించే అవకాశం ఉంటుంది. వామపక్ష వ్యతిరేక శక్తులన్నింటినీ సమీకరించడం ద్వారా బీజేపీ త్రిపురలో విజయం సాధించిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అదే యుద్ధనీతిని ప్రతిపక్షాలు సైతం అనుసరించకపోతే బీజేపీకి తిరుగుండదు. కాంగ్రెస్‌తో పొత్తుపైన సీïపీఎంలో సాగుతున్న చర్చకు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక అర్థవంతమైన ముగింపు పలుకుతాయేమో చూడాలి. త్రిపురలో 2013లో ఒకే ఒక్క నియోజకవర్గంలో ధరావతు దక్కించుకున్న బీజేపీ ‘శూన్యం నుంచి శిఖరం’(మోదీ మాట) దాకా ఎదిగింది. బీజేపీని నిందించడం కంటే బీజేపీ రణనీతిని అర్థం చేసుకొని దానికి తగినట్టు ప్రతివ్యూహాలు రూపొందించుకొని ప్రజలతో మమేకమై అంకితభావంతో కృషి చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది. కాంగ్రెస్‌లో పరివర్తన రాకపోతే కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఫెడరల్ ఫ్రంట్’కు అవకాశం ఉంటుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తుపైన ఒక అవగాహన రావచ్చు. కె. రామచంద్రమూర్తి -
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారా.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారా.. ఆ దిశగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా..!? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు వస్తున్నాయి. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునే లక్ష్యంతో.. ‘ఫెడరల్ ఫ్రంట్’పేరిట మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ తగ్గుతోందని, అటు కాంగ్రెస్ బలం కూడా పెరగడం లేదని ఆయన అంచనాకు వచ్చినట్టు సమాచారం. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి, ఒక అంచనాకు రావడానికి.. కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, కొందరు సీనియర్ రాజకీయ నేతలతోనూ కేసీఆర్ ఢిల్లీలో చర్చించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు ఏకమై, బలోపేతమైతే జాతీయ స్థాయిలో పట్టుచిక్కుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్‌లపై చేసిన విమర్శలు అందులో భాగమేనని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో చర్చలు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో కేసీఆర్‌కు సంబంధాలున్నాయి. కొందరితో సన్నిహిత స్నేహం కూడా ఉంది. సంప్రదింపుల సందర్భంగా వారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. జేఏంఎం అధినేత శిబూసోరేన్, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (జేడీఎస్) వంటి వారితో ప్రాథమికంగా సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది. మరిన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యులతోనూ కేసీఆర్ ఫోన్లో సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం. వారంతా మూడో ఫ్రంట్‌పై స్పష్టమైన అభిప్రాయాలు చెప్పకున్నా.. వ్యతిరేకంగా ఎవరూ లేరని కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర పెత్తనమే ఉంటే.. ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ? రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తుంటే.. ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉంటుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల నుంచి వసూలవుతున్న పన్నుల్లో 42 శాతమే తిరిగి రాష్ట్రాలకు ఇవ్వడం, మిగతా 58 శాతం ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా కేటాయిస్తుండడంతో... కొన్ని రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాదిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు లేకుండా పోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలంటే జాతీయ పార్టీల గుత్తాధిపత్యానికి గండికొట్టడమే సరైన మార్గమనే అంచనాలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాలకు అధికారాలు సాధించుకోవడం, రైతాంగ సమస్యలు వంటి నినాదాలతో దేశవ్యాప్తంగా పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై ఇంకా స్పష్టత రాకున్నా.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో ఫ్రంట్ యోచనకు బీజం పడిందని కేసీఆర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల పదును జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినందువల్లే బీజేపీపై, కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శల దూకుడు పెంచినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని నేరుగా విమర్శించడం అందులో భాగమేనని.. జాతీయ పార్టీలపై తిరుగుబాటుతో తన వైఖరిని బహిర్గతం చేశారని అంటున్నారు. దేశంలో రైతు సమస్యల పరిష్కారంకోసం జరిగే పోరాటానికి, ఉద్యమానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందనే మాట కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిని తేటతెల్లం చేస్తోందని చెబుతున్నారు.