
సాక్షి, అమరావతి: టీఆర్‌ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కానున్న విషయం తెలిసిందే. కేటీఆర్, వైఎస్ జగన్‌ల భేటీపై వైఎస్సార్‌సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీతో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.
ఇదే విషయాన్ని కేటీఆర్ కుడా తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తమ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్‌తో భేటీ అవుతున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలిపారు. కాగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెరడల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. (వైఎస్ జగన్‌తో భేటీకానున్న కేటీఆర్ బృందం)
On the directive of our leader KCR Garu, will be calling on YSRCP president @ysjagan Garu today at 12:30PM to discuss modalities on working together to strengthen a federal alternative to NDA and UPA
— KTR (@KTRTRS) January 16, 2019
Comments
Please login to add a commentAdd a comment