
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలు అసంబద్దమని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నామన్నారు.
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించి వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య జరిగిన భేటీపై సీఎం చంద్రబాబునాయుడు వంది మాగధులు, టీడీపీ మంత్రులు– ఆయన ప్రయోజనాల పరిరక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్లో మీడియా రెండు రోజులుగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును, హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం ప్రయత్నించానని సాక్షాత్తూ చంద్రబాబే అటు అసెంబ్లీలోనూ, ఇటు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రకటించినా ఏ మాత్రమూ తప్పు బట్టని ఎల్లో మీడియా నేడు రాద్ధాంతం చేస్తున్నది. ఈ తరహా అసత్యప్రచారాలపై రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment