samineni udaya bhanu
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. ఎఫ్ఐఆర్ల సంగతేంటి: సామినేని ఉదయభాను
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులను ఆపాలి. దాడులకు కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. అలాగే, చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని కామెంట్స్ చేశారు.కాగా, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదే ప్రభుత్వం. మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ రెండు నెలల్లో వైఎస్సార్సీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డుపై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారు. గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైఎస్సార్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. నాడు తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హతమార్చాలని చూశారు. వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ శ్రీనివాసరావును చంపాలని చూశారు. మేం దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు, శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే దాడులను నిలువరించాలి. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. వీరయ్య హత్య కేసులో సీబీసీఐడీ కేసు నుంచి సాక్షులను తొలగించారు. పోలీసులే ఛార్జిషీట్ వేసి కేసును దర్యాప్తు చేయాలి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దాడులను ఆపాలి. నిందితులను శిక్షించాలి. రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. పోలీసులను అడిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. చూస్తామంటున్నారు. గతరాత్రి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కేసు తేలేవరకూ విడిచిపెట్టొద్దు’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
సాక్షి,కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైస్సాఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్సాఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. -
కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే
-
పార్టీ మార్పుపై క్లారిటీ: సామినేని ఉదయభాను
-
చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని కలవడంపై ఉదయ్ భాను స్ట్రాంగ్ కౌంటర్.
-
మంత్రి పదవి రాలేదని కాస్త బాధపడ్డాను: సామినేని
-
ఇలాంటప్పుడు తప్ప ఎన్టీఆర్ గుర్తురారా?
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు నిండిన టీడీపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే వల్లెవేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావమో లేదంటే మçహానాడు కార్యక్రమమో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీ రామారావును చంద్రబాబు ఎందుకు గుర్తుపెట్టుకోరని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, బీసీ డిక్లరేషన్ తీసుకురావడంతోపాటు వారి అభివృద్ధికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం తప్ప ఆయనకు మంచి చేసింది ఏమీలేదని విమర్శించారు. -
ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్
జగ్గయ్యపేట/అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఆయన్ను తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దులోని బుగ్గమాధవరం వద్ద ఆదివారం అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన చేశారు. తర్వాత ముక్త్యాలలోని కృష్ణానది వద్దకు చేరుకుని నాటు పడవల ద్వారా గుంటూరు జిల్లా మాదిపాడులోని అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులు, విలేకరులతో కలిసి పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో జల విద్యుదుత్పత్తికి పూనుకోవటంతో నీరందక సాగు సాగని పరిస్థితి నెలకొందన్నారు. పులిచింతలతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ సర్కార్ అక్రమ విద్యుదుత్పత్తికి పాల్పడుతోందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవాలని, లేకుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నీటి వృధా శ్రేయస్కరం కాదు.. గత 10 రోజుల వ్యవధిలో ఏడున్నర టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలిపారని ఉదయభాను తెలిపారు. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీని వృధా చేశారని, ఒక టీఎంసీ అంటే 10 వేల ఎకరాల మాగాణి, 20 వేల ఎకరాల మెట్ట పంటలకు సరిపోతాయన్నారు. ఇది ఉభయ రాష్ట్రాల రైతాంగానికి శ్రేయస్కరం కాదన్నారు. కృష్ణా, డెల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఆయకట్టు భూములకు సమృద్ధిగా సాగునీటిని సరఫరా చేసేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరగక పోతే తెలంగాణ వాటాగా 120 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వచ్చేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది తెలంగాణ రైతులేనన్నారు. అలాంటి మహానేతపై తెలంగాణ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ వారితో స్నేహపూర్వకంగా మెలగాలని చెబుతున్నారని, అవసరం అనుకుంటేనే కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా పవర్ ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని వదిలే చర్యను విరమించుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి ఈఈ శ్యాంప్రసాద్‌తో మాట్లాడి నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు జగదీష్, రవి, జుబేర్, ఫిరోజ్‌ఖాన్, హరిబాబు, సత్యనారాయణ, మాదిపాడు సర్పంచ్ నాగేశ్వరరావు, తదితరులు ఆయన వెంట ఉన్నారు -
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
-
Telangana: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ
ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ కరోనా బాధితుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకుని సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణలో ఆలంపూర్ వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్స్ ని ఆపి.. రాష్ట్రంలోకి రావడానికి అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లమన్నారు. వారు ఎంత బతిమిలాడినా వినలేదు. ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. తెలంగాణ పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో బాధితుడు కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కర్ణాటక నుంచి ఆదివారం అర్ధరాత్రి కరోనా రోగితో వచ్చిన ఓ అంబులెన్స్ ను గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్దే పోలీసులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో బెడ్లు ఖాళీ లేవని వెనక్కి వెళ్లాలని సూచించారు. తమకు బెడ్ అలాట్‌మెంటు ఉందని చూపించినా వెనక్కి పంపించారు. సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను తెలంగాణలోకి అనుమతించడంలేదు. రాష్ట్రంలో కరోనా పడకలు, ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పాజిటివ్ రోగులను రాష్ట్రంలోకి రానివ్వడంలేదు. అలాంటివారిని తీసుకొస్తున్న అంబులెన్సు లను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడు ్డకుని వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ వాహనాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారిని అనుమతిస్తున్నా.. కరోనా బాధి తులను మాత్రం అడుగు పెట్టనివ్వడంలేదు. 40 శాతం పొరుగు రాష్ట్రాల వారే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో దాదాపు 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు వారికి ఎలాంటి షరతులూ లేకుండా చికిత్స అందించిన ప్రభుత్వం.. ఆదివారం రాత్రి నుంచి అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితులను రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ–ఆంధ్రా సరిహద్దులైన వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాలతోపాటు ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించే మాచర్ల మార్గంలో నాగార్జున సాగర్ వద్ద, దాచేపల్లి మార్గంలో వాడపల్లి వద్ద, మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద, హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం రామాపురం వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ.. కోవిడ్ రోగులున్న అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ ఉన్నట్టు పత్రాలు చూపించినవారిని మాత్రం రాష్ట్రంలోకి అనుమతించారు. ఈ విషయంపై ఏపీ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. వీరంతా ఆక్సిజన్ సిలిండర్లతో లైఫ్ సపోర్ట్ వచ్చిన వారే కావడం గమనార్హం. ఏపీ నుంచే బాధితులు అధికం.. తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ కంటే ఏపీ నుంచే రోగుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఏపీ నుంచి మాత్రం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లోనే ఆ అంబులెన్సులను ఆపడంతో చాలావరకు అక్కడే నిలిచిపోయాయి. రోగి కేస్‌షీట్ చూసి కరోనా పాజిటివ్ అయితే వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల బెడ్ అలాట్మెంట్ చూపిస్తే అనుమతించినా.. మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. ఎందుకు ఆపుతున్నారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లో బెడ్లు లేవని, ఆక్సిజన్ కొరత ఉందని అందుకే ఆపమంటూ తమకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని పలువురు కిందిస్థాయి పోలీసులు తెలిపారు. దీంతో చాలామంది తెల్లవారుజాము వరకు ఎదురుచూసి వెనక్కి వెళ్లిపోయారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో లాక్డౌన్ ఉండటంతో అక్కడ నుంచి వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదు. అందుకే, ఈ విషయంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పోలీసులు తామెవరినీ ఆపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని ఉమ్మడి ఆదిలాబాద్ పోలీసులు తెలిపారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించే వారు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం నోట్ చేసుకుని అనుమతిస్తున్నామని వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీ మీదుగా భద్రాచలం ద్వారా రావాలనుకున్న కరోనా పేషెంట్లకు ఎంట్రీ లేదనే చెబుతున్నారు. మానవత్వంతో చూడండి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలగాంణలోకి అనుమతించకపోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడారు. కోవిడ్ బాధితులపై మానవత్వం చూపాలని కోరారు. అంబులెన్సులను నిలిపివేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగా ణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. -
‘పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు’
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు..
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చారని కొనియాడారు. పేదల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. కొన్ని దృష్ట శక్తులు అదే పనిగా అడ్డుతగులుతున్నాయని ఆయన ఆరోపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని, సీఎం జగన్మోహన్రెడ్డి కేవలం పద్దెనిమిది నెలల్లోనే చేసి చూపించారని ఆయన ప్రశంశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు అండ్ కో మోకాలడ్డుతున్నా, సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేకపోయిన దేవినేని ఉమ.. ఇళ్ల పట్టాల పంపిణీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో రావడం అసాధ్యమని తెలుసుకున్న చంద్రబాబు.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సామినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు, రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తుంటే.. చంద్రబాబు ఎండ్ కో మత విద్వేశాలు రెచ్చగొట్టడంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది: మోపిదేవి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలై పాతిక రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. 31 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు ,అవసరాలు అవపోసన పట్టి ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించేందుకు కంకణం కట్టుకున్నారని ఆకాశానికెత్తారు . ఖజానా ఖాళీ అవుతున్నా పేదల అవసరాలు తీర్చే విషయంలో సీఎం జగన్ వెనకడుగు వేయడం లేదని ఆయన ప్రశంశించారు. అంబేడ్కర్ ఆశయాల సాధన, సామాజిక వర్గాల సమతుల్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర పతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి తన ఉనికిని కాపాడుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆరోపించారు. -
మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: భూములు అమ్మేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పత్రికలు గగ్గోలు పెడుతున్నారని, అది వృధా ప్రయాస అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు, నాడు-నేడు నిధుల కోసం భూములు వేలం వేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామన్నారు. గడిచిన మీ హయాంలో ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టాబెట్టారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే తాము సద్వివిమర్శను ఆహ్వానిస్తామని, మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుందని విమర్శించారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు సేకరించింది మీరు కాదా? అని వాటిని పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలోనే కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో స్ఫష్టమైన తీర్పు వచ్చిదన్నారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అచ్చెన్నాయుడు రాషష్ట్రంలో తిరుగుతా అంటున్నారని వెంటనే తిరగండని పేర్కొన్నారు. విశాఖలో భూ కుంభకోణం చూసి మీ హయాంలో మంత్రులే రోడ్డున పడ్డారని, త్వరలో సమగ్ర భూ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 100 ఏళ్లనాటి రికార్డులు ప్యూరిఫికేషన్ చేస్తామని, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని, త్వరలో అంత: రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నేరడి బ్యారేజ్ నిర్మించి తీరుతామని ధర్మాన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాతయాత్ర కృష్ణా జిల్లా: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెనుగ్రంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి మున్నేరు వంతెన మీదగా ముచ్చింతల వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నేరుగా తెలుసుకున్న నేత సిఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పరిపాలనలో 90 శాతానికి పైగా హామీలను ఆయన నెరవేర్చారన్నారు. ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలే కాకుండా 16 రకాలకు పైగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వం అభివృద్దిని, సంక్షేమాన్ని రెండింటినీ విస్మరించిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్య, వైద్యంలో విప్లకాత్మకమైన మార్పులకి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే... సీఎం వైఎస్ జగన్ వైద్య ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేర్చి పేదలకి అండగా నిలబడ్డారన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు కొనసాగుతారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. కాగా ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సామినేని
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ధనంబోర్డ్ కాలనీ, కాకాని నగర్, డాoగే నగర్, యానాది కాలనీలో వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సామినేని వెంకట కృష్ణప్రసాద్, తన్నీరు నాగేశ్వరావు, సహా వివిధ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. హైవేపై దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. (విరిగిపడ్డ కొండచరియలు, ఒకరు మృతి) -
చంద్రబాబుకు సామినేని సవాల్..
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాతీర్పుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ చంద్రబాబు పిలుపును కృష్ణా జిల్లా లో టీడీపీ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన 19 గ్రామాలకు నాయకుడిగా మారిపోయారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అందుబాటులో లేకుండా, పక్కరాష్ట్రానికి పారిపోయి జూమ్‌లో మాత్రమే దర్శనమిస్తున్నారంటూ’’ ఆయన ఎద్దేవా చేశారు. (చదవండి: ‘వారంతా చంద్రబాబు బినామీలే’) చంద్రబాబు ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రజలు నుంచి స్పందన లేదన్నారు. ‘‘కేంద్రం కూడా రాజధాని విషయంలో స్పష్టమైన విధానం చెప్పింది. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేసిందని’’ ఆయన పేర్కొన్నారు. 14 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం అని, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు ఆయన్ని గుర్తించడం లేదని సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.(చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు) -
అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి
సాక్షి, కృష్ణా: విజయవాడలోని స్వర్ణపాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన బేతెస్థా ప్రార్ధన మందిరం పాస్టర్ ఎస్.ఆర్.అబ్రహం ఆయన సతీమణి రాజకుమారి దుర్మరణం పాలయ్యారు. మృతుడు అబ్రహం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అత్యంత సన్నిహితుడి తెలిసింది. దాంతో సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హోటల్‌ను ఆస్పత్రిగా మార్చి 50 మంది కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రెండు కమిటీలను నియమించింది. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సంతాపం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు విచారం వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం) -
అర్హులైన మహిళలందరికీ ‘వైఎస్సార్ చేయూత’
సాక్షి, కృష్ణా జిల్లా: అర్హులైన మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18,750 అందిస్తామని, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఆగష్టు 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అర్హులైన పేద మహిళలను గుర్తించి వారికి ఆర్థికసాయం అందేలా చూడాలని వాలంటీర్లను సామినేని ఉదయభాను సూచించారు. (కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం: మంత్రి) -
విలువలు ప్రతిబింబించేలా ‘స్థానిక ఎన్నికలు’
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు గమనించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సాహసోపేత నిర్ణయాలతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారని తెలిపారు. డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ‘అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎన్నిక రద్దు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. (ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా) ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేస్తోంది: మొండితోక జగన్మోహన్రావు ప్రజాస్వామ్యం విలువలు ప్రతిబింబించేలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. ఏ విధమైన ప్రలోభాలు లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన..ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు గెలవాలన్నదే ఆయన సంకల్పమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో విజయ గంట మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు దేశానికే తలమానికంగా నిలవనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని జగన్మోహన్రావు పేర్కొన్నారు. -
విజయవాడను ఆదర్శ నగరంగా మార్చుతాం
సాక్షి, విజయవాడ: ఐదేళ్లలో విజయవాడను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బుధవారం విజయవాడలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రాణిగారి తోట వరకు ఆరున్నర కోట్లతో మంచినీటి పైప్‌లైన్ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వీరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్ హాజరయ్యారు. టీడీపీ నిజాలు మాట్లాడదని తెలిసిపోయింది ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రాన్నిసమగ్రాభివృద్దివైపు నడిపించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. జగన్ పాలనలో పేదల కష్టాలు కడతేరిపోతాయని పేర్కొన్నారు. ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన విజయవాడ అభివృద్ధికి ఆయన అవసరమైన నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ అభివృద్ధికి బంగారుబాటలు పడ్డాయన్నారు. టీడీపీ పాలనలో పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజధాని డ్రామా ఫెయిల్ కావడంతో ఇప్పుడు జనచైతన్య యాత్ర డ్రామా మొదలు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు స్పందించరని స్పష్టం చేశారు. టీడీపీ నిజాలు మాట్లాడదన్న సత్యాన్ని గ్రహించే జనం వారికి గుణపాఠం చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంచినీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఆర్భాటాలు టీడీపీ సొంతమైతే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా నైజమన్నారు. -
‘అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’
-
‘అలాంటి పథకాన్ని ఎవరూ తీసుకురాలేదు’
సాక్షి, జగ్గయ్యపేట : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చేసి చూపుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన జగ్గయ్యపేట పురపాలక సంస్థ పరిధిలోని 24,25,26,27 డివిజన్ల వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలకు సచివాలయాల వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు టీడీపీ సభ్యుల కోసం పనిచేశాయని ఆరోపించారు. కానీ మతం, కులం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికి అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సచివాలయంలో 72 గంటల్లోనే ఫిర్యాదుదారుడి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కృష్ణాజిల్లాలో 1280 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల అందుబాటులోకి రావడం శుభపరిణామన్నారు. ప్రతి రోజు స్పందన కార్యక్రమం సచివాలయాల్లో జరుగుతుందన్నారు. అమ్మఒడి లాంటి పథకం 70 ఏళ్ల భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎవ్వరూ తీసుకురాలేదని ప్రశంసించారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పథకం అమ్మఒడి పథకం అన్నారు. రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. హైదరాబాద్ రాజధానిని కోల్పోయినప్పుడు ప్రజలను కన్నీరు పెట్టుకున్నారని అటువంటి పరిస్థితి మరోసారి రాకూడదని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. ఒక లక్షా 10వేల కోట్లు అమరావతిలోనే పెట్టుబడి పెట్టడం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. -
‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోమవారం పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు నాయకులు వేల్పుల రవికుమార్, రవిశంకర్, తుమ్మల ప్రభాకర్ ఉన్నారు. -
చెప్పింది కొండంత.. చేసింది గోరంత..
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో చేపట్టిన గృహ నిర్మాణం పథకం సరిగా లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు కట్టించినట్లు గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం త్వరలోనే 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడామని తెలిపారు. గృహ నిర్మాణంలో అవినీతి జరగకుండా.. గ్రామ వాలంటీర్ల ద్వారా కేటాయింపులు పారదర్శకంగా జరుపుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని లబ్ధి దారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేకుండా.. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని ఉదయభాను సభలో తెలిపారు. పేదప్రజల పేరు చెప్పుకుని గత ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆయన విమర్శించారు. జన్మభూమి కమిటీ కేటాయింపుల్లో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. పేద ప్రజల అభివృద్ధికి కొండంత చెప్పి.. గోరంత చేశారని ఎద్దేవా చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రకటించినట్లు ఎమ్మెల్యే శిల్పారవి స్పష్టంచేశారు. సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు కులం, మతం చూడమని అన్నారు. ఐదేళ్ల కాలంలో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోపిడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. -
‘వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం’
సాక్షి, విజయవాడ : కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. గురువారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని తెలిసే చంద్రబాబు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని.. ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ‘చంద్రబాబు జూన్ 8 వరకు నేనే సీఎం అంటూ రివ్యూలు చేస్తున్నారు. అనేక మంది ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వాలి. ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. మీరేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద కూడా నిందలు వేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గవర్నర్ ని కలవడం కూడా తప్పే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు నువ్వు ఎవరిని నమ్ముతావు బాబు’ అని ఉదయభాను ప్రశ్నించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు రోజులు దగ్గర పడ్డాయని, అధికారంలోకి వచ్చాక నీపై అన్ని విధాలుగా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం.. చంద్రబాబు ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. ఐదేళ్లు చంద్రబాబు దుర్మార్గపు పాలన చేశారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు కలలో కూడా వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. అక్కా చెల్లెమ్మలు టీడీపీకి ఓటు వేస్తే మీకు ఎందుకు భయం బాబు. కోడెల రిగ్గింగ్ చేస్తుంటే ప్రజలు తిరగబడ్డారు. తిరువూరులో నాపై మంత్రిని పోటీ చేయించారు. అయినా గెలుపు నాదే. ప్రజా తీర్పు మాకే అనుకూలం. వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయం. రాజన్న రాజ్యం రావడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
తెలుగుదేశం పాలనలో దళితులకు రక్షణ కరువు
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట అర్బన్: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తంచేశారు. మండలంలోని అనుమంచిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ఉదయభాను ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులు తీవ్ర అవమానాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న చింతమనేని ప్రభాకర్ దళితులను కించపరిచేలా మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతమనేని దౌర్జన్యాలకు అంతం లేకుండా పోయిందని, కనీసం ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూడా సీఎం ప్రయత్నించకపోవడం ఆయన చేతగాని తనాన్ని, దళితులపై ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాటి పాలన రావాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అట్టడుగున ఉన్న దళితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. జగ్జీవన్‌రామ్ దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ యువ నాయకుడు సామినేని ప్రశాంత్‌బాబు, మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకులు పగిడిపల్లి సునిల్‌కుమార్, తుమ్మల ప్రభాకర్, బూడిద నరసింహారావు, మార్కపూడి గాంధీ, పాతకోటి ఉదయభాను, ఆకారపు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.