సాక్షి, కృష్ణా: విజయవాడలోని స్వర్ణపాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన బేతెస్థా ప్రార్ధన మందిరం పాస్టర్ ఎస్.ఆర్.అబ్రహం ఆయన సతీమణి రాజకుమారి దుర్మరణం పాలయ్యారు. మృతుడు అబ్రహం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అత్యంత సన్నిహితుడి తెలిసింది. దాంతో సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
హోటల్‌ను ఆస్పత్రిగా మార్చి 50 మంది కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రెండు కమిటీలను నియమించింది.
(విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)
ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సంతాపం
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు విచారం వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
(అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం)
Comments
Please login to add a commentAdd a comment