![Fire Accident At Vijayawada Sitara Grounds](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Fire-Accident-At-Vijayawada.jpg.webp?itok=je8iJgG5)
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/13_28.jpg)
వివరాల ప్రకారం.. విజయవాడలోని సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment