సాక్షి, విజయవాడ: విజయవాడలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని టీవీఎస్ షోరూంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో వందలాది కొత్త బైక్‌లు కాలి బూడిదవ్వడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
వివరాల ప్రకారం.. విజయవాడలో స్టెల్లి కాలేజీ సమీపంలోని టీవీఎస్ షోరూంలో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగింది. అన్‌లోడ్ చేస్తున్న సమయంలో పై ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో టీవీఎస్ షోరూంలో ఉన్న 500 బైక్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో కొత్త బైక్‌లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
కాగా ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే సర్వీస్ సెక్షన్‌లోని లూబ్రికెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ప్రమాదం జరిగినపుడు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చుట్టు పక్కల జనావాసాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపుచేసింది. సమాచారం అందుకున్న పడమట పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment