వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు | Vallabhaneni Vamsi Gets Bail By Nuziveedu Court | Sakshi
Sakshi News home page

వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు

Jul 1 2025 5:41 PM | Updated on Jul 1 2025 6:02 PM

Vallabhaneni Vamsi Gets Bail By Nuziveedu Court

విజయవాడ:   ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌  మంజూరైంది. ఈ మేరకు వల్లభనేనికి వంశీకి నూజివీడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది. రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. 

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీపై అనేక కేసులు బనాయించారు.  ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్‌ మంజూరు కాగా, తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్‌ మంజూరైంది.  మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్‌ లభించడంతో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement