జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో జరుగనున్న సమైక్య శంఖారావం సభ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక సభగా నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం) రూపొందించిన సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను గురువారం ఉదయభాను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ వేర్పాటు వాదాన్ని నిరసిస్తున్న కోట్లాదిమంది సమైక్యవాదుల సమైక్యవాణిని ఢిల్లీ పెద్దలకు వినిపించే చివరి అవకాశంగా ఈ సభ దోహదపడుతుందని అన్నారు. ఈ సభకు తెలంగాణా ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు హాజరు కానున్నారని చెప్పారు. తెలుగుజాతి సమైక్య నినాదాల హోరుతో ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా జరిగే ఈ సభకు జిల్లా నుంచి అనూహ్యరీతిలో పార్టీల కతీతంగా సమైక్యవాదులు తరలి రానున్నారన్నారు.
రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే ఈ సభ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక మైలురాయిలా నిలిచిపోయి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. చల్లా బ్రహ్మం మాట్లాడుతూ ఈ సభకు పార్టీలకతీతంగా సమైక్యాన్ని కోరుకునే వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు, మహిళలు, మైనార్టీ వర్గాలు, వ్యాపారవర్గాల ప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అడహక్ కమిటీ సభ్యులు ఉప్పల సత్యనారాయణప్రసాద్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు, న్యాయవాది కామనేని ఉదయకుమార్, నందిగామ మాజీ ఎంపీటీసీ సూరె రామారావు, పేట యూత్ నాయకులు గుంటుపల్లి సీతారామయ్య, జి. కృష్ణప్రసాద్, యర్రమాసు రామకృష్ణ, ఎస్‌కె.బాబు, తదితరులు పాల్గొన్నారు.
బీసీలు తరలిరండి...
పెడన రూరల్ : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరుగనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బీసీలంతా తరలిరావాలని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ సభ్యులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రెండు సార్లు ఆమరణ దీక్ష చేపట్టారని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సీమాంధ్ర ప్రాంతంలోని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చరిత్రాత్మక సభ శంఖారావం :భాను
Published Fri, Oct 25 2013 1:34 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement