Shakaravam
-
నేడు టీఆర్ఎస్ శంఖారావం
కరీంనగర్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచే పూరిస్తున్నారు. స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలో ఆదివారం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుని కలెక్టరేట్ హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడినుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణమైన ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ప్రధానంగా తెలంగాణ వికాసం గురించే ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని, రాష్ట్ర వికాసం సైతం తమతోనే సాధ్యమనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సహకరించిన పార్టీగా బీజేపీ ఎన్నికల గోదాలో ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో తలపడాలంటే తెలంగాణ రాష్ర్టం తీసుకురావడమే కాద ు, వచ్చిన తెలంగాణను తీర్చిదిద్దడం కూడా తమతోనే సాధ్యమనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇదితొలి బహిరంగ సభ కావడంతో సుమారు లక్ష మందిని సమీకరించి తెలంగాణ ప్రజలు తమవెంటే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలని గులాబీ బాస్ ఉబలాటపడుతున్నారు. ఇందుకోసం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జనమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుండటంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది. -
సమైక్య శంఖారావం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని తెలిపారు. మరోపక్క స్టేడియం లోపలకు ప్రవేశించి ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు ప్రత్యేక ప్రవేశాలు కేటాయించారు. మళ్లింపులు ఇలా... నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రి ఎస్బీహెచ్ నుంచి అబిడ్స్ వైపు పంపిస్తారు. సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు. రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ నుంచి మళ్లిస్తారు. బొగ్గులకుంట, తాజ్ మహల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని కింగ్ కోఠి క్రాస్‌రోడ్స్ నుంచి అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ కంట్రోల్‌రూమ్ మీదుగా బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. సాధారణ వాహనచోదకులు స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఏంజే మార్కెట్ మార్గాలను ఎంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు విధించిన ఆంక్షలకు నగరవాసులు, సభకు తరలి వచ్చే వారు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలను కచ్చితంగా పాటించి కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని సూచించారు. -
‘సమైక్య శంఖారావం’ పార్కింగ్స్, మార్గాలు
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. మార్గాలు, పార్కింగ్స్ ఇలా... కడప, చిత్తూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు, తేలికపాటి వాహనాలు జూ పార్క్, బహదూర్‌పుర, పేట్లబురుజు, సిటీ కాలేజ్, హైకోర్టు, నయాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, బేగంబజార్ మీదుగా ఎంజే మార్కెట్ వద్దకు చేరుకోవాలి. ఇక్కడ కార్యకర్తల, అభిమానుల్ని దింపాల్సి ఉంటుంది. వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పాతబస్తీలోని కులీకుతుబ్‌షా స్టేడియం, పేట్లబురుజులోని సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్, గోషామహల్ పోలీసుస్టేడియంల్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. గోషామహల్ స్టేడియం కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తారు. -
చరిత్రాత్మక సభ శంఖారావం :భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో జరుగనున్న సమైక్య శంఖారావం సభ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక సభగా నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం) రూపొందించిన సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను గురువారం ఉదయభాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వేర్పాటు వాదాన్ని నిరసిస్తున్న కోట్లాదిమంది సమైక్యవాదుల సమైక్యవాణిని ఢిల్లీ పెద్దలకు వినిపించే చివరి అవకాశంగా ఈ సభ దోహదపడుతుందని అన్నారు. ఈ సభకు తెలంగాణా ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు హాజరు కానున్నారని చెప్పారు. తెలుగుజాతి సమైక్య నినాదాల హోరుతో ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా జరిగే ఈ సభకు జిల్లా నుంచి అనూహ్యరీతిలో పార్టీల కతీతంగా సమైక్యవాదులు తరలి రానున్నారన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే ఈ సభ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక మైలురాయిలా నిలిచిపోయి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. చల్లా బ్రహ్మం మాట్లాడుతూ ఈ సభకు పార్టీలకతీతంగా సమైక్యాన్ని కోరుకునే వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు, మహిళలు, మైనార్టీ వర్గాలు, వ్యాపారవర్గాల ప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అడహక్ కమిటీ సభ్యులు ఉప్పల సత్యనారాయణప్రసాద్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు, న్యాయవాది కామనేని ఉదయకుమార్, నందిగామ మాజీ ఎంపీటీసీ సూరె రామారావు, పేట యూత్ నాయకులు గుంటుపల్లి సీతారామయ్య, జి. కృష్ణప్రసాద్, యర్రమాసు రామకృష్ణ, ఎస్కె.బాబు, తదితరులు పాల్గొన్నారు. బీసీలు తరలిరండి... పెడన రూరల్ : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరుగనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బీసీలంతా తరలిరావాలని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ సభ్యులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రెండు సార్లు ఆమరణ దీక్ష చేపట్టారని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సీమాంధ్ర ప్రాంతంలోని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
శంఖారావానికి దారిదీ
=రేపు భారీ బహిరంగ సభ =హైదరాబాద్‌కు తరలివచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. హైదరాబాద్, న్యూస్‌లైన్: స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. జిల్లా నుంచి వచ్చే వాహనాలకు మార్గం, పార్కింగ్స్ ఇలా... విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వ చ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, కా చిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆ ర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆ ర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. శంఖారావానికి సన్నద్ధం విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కేడర్ బయల్దేరుతున్నారు. నియోజక వర్గానికి 5 వేల మంది తరలి వెళ్లేలా పార్టీ వర్గాలు ఏర్పా ట్లు చేసినా తుపాను వల్ల రవాణా సదుపాయాల కల్పనలో కొంత ఆటంకం ఏర్పడుతోం ది. విశాఖ నుంచి రెండు ప్రత్యేక రైళ్ల కోసం పార్టీ నేతలు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులకు వినతి పత్రం పంపి డబ్బులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ రైల్వే అధికారులు 22 బోగీలు కలిగిన ఒక ప్రత్యేక రైలు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో నియోజక వర్గాల సమన్వయకర్తలు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లలో పడ్డారు. నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యవేక్షణలో నగర పార్టీ నేతలు, సమన్వయకర్తలు, రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పర్యవేక్షణలో నియోజక వర్గాల సమన్వయకర్తలు హైదరాబాద్ సభకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రత్యేక వాహనాలు రాజధానికి బయల్దేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగుతుందని, ఉద్యోగులు, ఇతర పార్టీల వారు, సమైక్యాంధ్ర కోరుకునే ప్రతి ఒక్కరు హాజరు కావాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో సమైక్య సభకు జిల్లా నుంచి కూడా ఎన్జీవోలు, అనేక కార్మిక, కర్షక సంఘాలు మద్దతు పలికాయి. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోరాదనే భావన ప్రజల్లో ఉండడంతో రాజకీయాలకు సంబంధం లేని జనం కూడా వాహనాలెక్కి సమైక్య సభకు తరలి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైలు సమైక్య శంఖారావం సభకు హాజరయ్యే వారి కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని విశాఖ పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించి సమైక్యాంధ్ర సభ సమన్వయకర్త సత్తి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనకాపల్లిలో సాయంత్రం 5.40 గంటలకు, తునిలో సాయంత్రం 6.20 గంటలకు ఆగుతుందని, ప్రజలు, పార్టీ కేడర్ ఆయా నియోజక వర్గాలకు కేటాయించిన బోగీల్లోకి చేరుకోవాలన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. సమైక్య సభ తర్వాత శనివారం రాత్రి 9 గంటలకు ఇదే రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని ఆయన చెప్పారు. -
సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దాం
తాళ్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు, కార్యకర్తలతో తాళ్లూరు సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి నివాసంలో ఆయన సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి సమైక్యవాణిని గట్టిగా వినిపించాలని బూచేపల్లి కోరారు. కార్యకర్తలు ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడి మాత్రమే సమైక్యాంధ్ర కోసం గట్టిగా కృషి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ సారధ్యంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశాలున్నాయని బూచేపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి మాట్లాడుతూ బూచేపల్లి నాయకత్వంలో సమైక్య శంఖారావానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మారం వెంకటరెడ్డి, నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోట హనుమారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వలి, వీరయ్య, ఏసు, ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, కోట మన్నేరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, జింకల శివారెడ్డి, ఇడమకంటి బ్రహ్మారెడ్డి, లక్క వెంకటేశ్వరరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమైక్య శంఖారావానికి తరలిరండి: మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి బల్లికురవ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 26న హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు ప్రతి గ్రామం నుంచి భారీగా తరలి రావాలని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బల్లికురవలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి పార్టీ మండల క న్వీనర్ మలినేని గోవిందరావు అధ్యక్షత వహించారు. గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి గ్రామం నుంచి సమైక్యవాదులు హైదరాబాద్ తరలి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జండ్రాజుపల్లి మాతయ్య, కొణిదెన మల్లాయపాలెం, నక్కబొక్కలపాడు, అండిపూడి, వల్లాపల్లి సర్పంచ్‌లు చెరుకూరి ఆంజనేయులు, అబ్బారెడ్డి బాలకృష్ణ, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, మందలపు సుధాకర్, షేక్ అల్దా ఉద్దీన్, కొప్పరపాడు, కొప్పరపాలెం మాజీ సర్పంచ్‌లు షేక్ అబ్దుల్ సాహెబ్, మేకల అంజిరెడ్డి, వల్లాపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సమైక్య విజయం
=శంఖారావం సభకు అనుమతిపై హర్షం =ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాదే =సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసేది మేమే =వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధానిలో వైఎస్సార్ సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హైకోర్టు అనుమతి ఇవ్వడం.. సమైక్యవాదులందరి విజయమని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన నగరంలో పార్టీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఎం. రాముతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలతో సమైక్య శంఖారావం సభ జరపాలని నిర్ణయిస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామిక విజయమని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ అరెస్టు నుంచి ఇప్పటివరకు తమ పార్టీ చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజా ఉద్యమాలు చేస్తోందని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ నిరంకుశ విధానంపై చట్టబద్ధంగానే పోరాడి సభ నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య శంఖారావం సభకు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు తరలిరావాలని నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే మొదటగా నష్టపోయేది వ్యవసాయరంగమేనన్నారు. రైతు సంక్షేమం కోసం ఎక్కువగా కృషిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త సురేష్‌బాబు మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పన్నినా హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. చట్టంపై తమకు గౌరవం ఉందని చెప్పారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.రాము మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి కూడా ఎక్కువమంది వస్తారని చెప్పారు.