రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం...
తాళ్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సీపీ మండల నాయకులు, కార్యకర్తలతో తాళ్లూరు సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి నివాసంలో ఆయన సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి సమైక్యవాణిని గట్టిగా వినిపించాలని బూచేపల్లి కోరారు.
కార్యకర్తలు ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడి మాత్రమే సమైక్యాంధ్ర కోసం గట్టిగా కృషి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ సారధ్యంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశాలున్నాయని బూచేపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి మాట్లాడుతూ బూచేపల్లి నాయకత్వంలో సమైక్య శంఖారావానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మారం వెంకటరెడ్డి, నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోట హనుమారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వలి, వీరయ్య, ఏసు, ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, కోట మన్నేరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, జింకల శివారెడ్డి, ఇడమకంటి బ్రహ్మారెడ్డి, లక్క వెంకటేశ్వరరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
సమైక్య శంఖారావానికి తరలిరండి: మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి
బల్లికురవ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 26న హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు ప్రతి గ్రామం నుంచి భారీగా తరలి రావాలని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బల్లికురవలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశానికి పార్టీ మండల క న్వీనర్ మలినేని గోవిందరావు అధ్యక్షత వహించారు. గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి గ్రామం నుంచి సమైక్యవాదులు హైదరాబాద్ తరలి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జండ్రాజుపల్లి మాతయ్య, కొణిదెన మల్లాయపాలెం, నక్కబొక్కలపాడు, అండిపూడి, వల్లాపల్లి సర్పంచ్‌లు చెరుకూరి ఆంజనేయులు, అబ్బారెడ్డి బాలకృష్ణ, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, మందలపు సుధాకర్, షేక్ అల్దా ఉద్దీన్, కొప్పరపాడు, కొప్పరపాలెం మాజీ సర్పంచ్‌లు షేక్ అబ్దుల్ సాహెబ్, మేకల అంజిరెడ్డి, వల్లాపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.