Siva Prasad Reddy
-
శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం: సజ్జల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్టుటూరులోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంక్షేమం అందించేందుకు ఆర్బీకే కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు స్వయంగా తమ కాళ్లపై నిలబడేలా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన’’ అని తెలిపారు. ‘‘ఎంత త్వరగా రైతులను ఆదుకుంటున్నాము అనేదే ఇక్కడ ముఖ్యం.. పంటల బీమా, పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వడం ద్వారా రైతులకు వడ్డీ భారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి ఐదేళ్లలో కూడా పూర్తిగా చెల్లించలేదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీని పూర్తి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయం. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొంటున్నాయి’’ అని సజ్జల తెలిపారు. (చదవండి: రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి) ‘‘స్వచ్ఛమైన ఆలోచన, అన్ని వర్గాలను తన కుటుంబాల లాగా భావించి కార్యక్రమాలు అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. గ్రామాల్లో ఆర్బీకేల్లో మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా స్థానిక నేతలు సహకారం కావాలి. సహకార రంగం మరింత బలోపేతం కావాలంటే గ్రామాల్లో నేతలు కలిసి పనిచేయాలి. జిల్లాకు నీరు వస్తుందా రాదా అన్న కల నుంచి ఇప్పుడు 60 టీఎంసీల నీరు నిల్వ చేసే స్థాయికి వెళ్లడం వైఎస్ కుటుంబం చలువ. వరద జలాలు కిందికి వృధాగా వెళ్లకుండా నీటిని ఒడిసిపట్టి నీటిని నిల్వ చేసుకుంటున్నాం’’ అన్నారు సజ్జల. చదవండి: పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే.. -
రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, మంత్రి కన్న బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో.. రైతాంగానికి అండగా నిలుస్తున్నామని నిరూపిస్తూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రూ.2 కోట్లతో నియోజకవర్గ రైతులకు 23 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వీటిని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వారి కోసం డ్రిప్ ఇరిగేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు. చదవండి: మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, రాజుపాళెం : కేసీ కాలువకు సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నీటిని విడుదల చేశారు. జిల్లా సరిహద్దులోని రాజోలి గ్రామం వద్ద ఉన్న చాపాడు కేసీ కెనాల్ స్లూయిస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే, నాయకులు గేటు ఎత్తి దిగువకు వంద క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. చాపా డు కేసీ కాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, పార్టీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జీరెడ్డి గోవర్ధనరెడ్డి, పోలా వెంకటరెడ్డి, కానాల బలరామిరెడ్డి, గుద్ధేటి రాజారాంరెడ్డి, కశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నల్లదిమ్ము జంగంరెడ్డి, బూతూరు తులసీశ్వరరెడ్డి, నంద్యాల ప్రతాపరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, ఎంబీ శివశంకరరెడ్డి, కేసీ కెనాల్ డిస్టిబ్యూటరీ చైర్మన్ విశ్వనాధరెడ్డి, డీఈ బ్రహ్మరెడ్డి, ఏఈ జా న్సన్, లస్కర్ నన్నేసాబ్, వర్క్‌ఇన్ప్‌క్టర్లు హుసేన్‌వల్లీ, రవీంద్రనాథ్, రైతులు పాల్గొన్నారు. -
దొంగోడిని పట్టించిన ‘భార్య’?
ఎన్ఆర్ఐ శివప్రసాద్ రెడ్డి ఫ్లాట్‌లో దొంగతనం చేసింది పక్కింటి కారుడ్రైవరే భార్య ఆ ఆభరణాలు ధరించడంతో కొలిక్కివచ్చిన కేసు మూడు కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం హైదరాబాద్ : తన భర్త కొట్టేసుకొని వచ్చిన ఆభరణాలను ఆ భార్య ధరించడంతో పోలీసులకు ఓ ప్రబుద్ధుడు చిక్కిన ఘటన కొండాపూర్‌లోని సైబర్ మెడోస్ విల్లాస్‌లో చోటుచేసుకుంది. దీంతో రెండేళ్ల క్రితం నాటి భారీ చోరీ కేసును కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు ఛేదిం చారు. దొంగ అయిన కారు డ్రైవర్ మహేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు మూడు కోట్ల విలువ చేసే డైమండ్, నెక్లెస్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కొండాపూర్‌లోని సైబర్ మెడోస్ విల్లాస్‌లో ఎన్ఆర్ఐ శివప్రసాద్ రెడ్డి ఉంటున్నాడు. అయితే అతని పక్కా విల్లాలోనే కారు డ్రైవర్‌గా మహేష్ పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో శివప్రసాద్ రెడ్డి వద్ద పని చేసే డ్రైవర్‌తో పాటు మహేష్ చనువుగా ఉండేవాడు. ఒకసారి మద్యం తాగిన మైకంలో మహేష్‌తో శివప్రసాద్‌రెడ్డి డ్రైవర్ అతని యజవూని ఇంట్లో ఉండే విలువైనసామగ్రి గురించి చెప్పాడు. ఇది తెలుసుకున్న మహేష్ దొంగతనం చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. 2014లో శివప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లిన సమయంలో అతని ఫ్లాట్‌లోకి వెళ్లి ఏకంగా డైమండ్, బంగారు నగలు ఉన్న లాకర్ని ఎత్తుకొని వెళ్లాడు. ఇందులో 60 లక్షల విలువ చేసే నాలుగు డైమండ్ నెక్లెస్‌లు, ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. వీటిలో నాలుగు బంగారు బిస్కెట్లు అమ్మిన మహేశ్వర్ రెడ్డి...భారీ విలువైన డైమండ్ నెక్లెస్‌లు ఎలా అమ్మాలో తెలియలేదు. అయితే ఇటీవల మహేష్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగిన సమయంలో అతడి భార్య ఆ నగలు ధరించడంతో అనుమానం వచ్చిన కొందరు బంధువులు, స్థానికులు కూకట్పల్లి సీసీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే శివప్రసాద్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన నగలని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. -
శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై రెండు రోజుల క్రితం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ సస్పెన్షన్ తొలగింపు విషయాన్ని స్పీకర్ దృష్టికి తెచ్చారు. సభ్యులు సభకు వచ్చి క్షమాపణ చెబితే ఎత్తివేయవచ్చని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల చెప్పడంతో సభ్యులు సిద్ధంగా ఉన్నారన్న నెహ్రూ వారిని సభలోకి తీసుకువచ్చారు. సభాసంప్రదాయాలకు ఆటంకం కలిగించారన్న ఆరోపణపై తనను, మణిగాంధీని గత మంగళవారం సస్పెండ్ చేశారని, అయితే తాము ఉద్దేశపూర్వకంగా సంప్రదాయాలను ఉల్లంఘించలేదని, సభలో తొలిసారి ఇలా మాట్లాడాల్సి వస్తోందని శివప్రసాదరెడ్డి అన్నారు. ఏదిఏమైనా జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. మణిగాంధీ మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని భావించి అలా వ్యవహరించామని, ఇందుకు సారీ చెబుతున్నానన్నారు. యనమల ప్రతిపాదించిన సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. -
ఇద్దరు సభ్యుల్ని సభకు అనుమతించండి
హైదరాబాద్ : అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తమ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీని తిరిగి సభకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. స్వల్ప విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విషయంలోనూ ఏ చర్య తీసుకోవద్దని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించాలని బిజెపి కూడా కోరింది. సంప్రదాయానికి అనుగుణంగా వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్ రివోక్ చేయవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దాం
తాళ్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు, కార్యకర్తలతో తాళ్లూరు సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి నివాసంలో ఆయన సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి సమైక్యవాణిని గట్టిగా వినిపించాలని బూచేపల్లి కోరారు. కార్యకర్తలు ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడి మాత్రమే సమైక్యాంధ్ర కోసం గట్టిగా కృషి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ సారధ్యంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశాలున్నాయని బూచేపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఇడమకంటి పెద్దిరెడ్డి మాట్లాడుతూ బూచేపల్లి నాయకత్వంలో సమైక్య శంఖారావానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మారం వెంకటరెడ్డి, నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోట హనుమారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వలి, వీరయ్య, ఏసు, ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, కోట మన్నేరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, జింకల శివారెడ్డి, ఇడమకంటి బ్రహ్మారెడ్డి, లక్క వెంకటేశ్వరరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమైక్య శంఖారావానికి తరలిరండి: మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి బల్లికురవ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 26న హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు ప్రతి గ్రామం నుంచి భారీగా తరలి రావాలని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బల్లికురవలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి పార్టీ మండల క న్వీనర్ మలినేని గోవిందరావు అధ్యక్షత వహించారు. గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి గ్రామం నుంచి సమైక్యవాదులు హైదరాబాద్ తరలి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జండ్రాజుపల్లి మాతయ్య, కొణిదెన మల్లాయపాలెం, నక్కబొక్కలపాడు, అండిపూడి, వల్లాపల్లి సర్పంచ్‌లు చెరుకూరి ఆంజనేయులు, అబ్బారెడ్డి బాలకృష్ణ, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, మందలపు సుధాకర్, షేక్ అల్దా ఉద్దీన్, కొప్పరపాడు, కొప్పరపాలెం మాజీ సర్పంచ్‌లు షేక్ అబ్దుల్ సాహెబ్, మేకల అంజిరెడ్డి, వల్లాపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సీమాంధ్ర విద్యుత్ జెఎసి నేత శివ ప్రసాద్‌రెడ్డితో సాక్షి వేదిక