
చాపాడు కాలువకు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు, నాయకులు
సాక్షి, రాజుపాళెం : కేసీ కాలువకు సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నీటిని విడుదల చేశారు. జిల్లా సరిహద్దులోని రాజోలి గ్రామం వద్ద ఉన్న చాపాడు కేసీ కెనాల్ స్లూయిస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే, నాయకులు గేటు ఎత్తి దిగువకు వంద క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. చాపా డు కేసీ కాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎస్‌ఏ నారాయణరెడ్డి, పార్టీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జీరెడ్డి గోవర్ధనరెడ్డి, పోలా వెంకటరెడ్డి, కానాల బలరామిరెడ్డి, గుద్ధేటి రాజారాంరెడ్డి, కశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నల్లదిమ్ము జంగంరెడ్డి, బూతూరు తులసీశ్వరరెడ్డి, నంద్యాల ప్రతాపరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, ఎంబీ శివశంకరరెడ్డి, కేసీ కెనాల్ డిస్టిబ్యూటరీ చైర్మన్ విశ్వనాధరెడ్డి, డీఈ బ్రహ్మరెడ్డి, ఏఈ జా న్సన్, లస్కర్ నన్నేసాబ్, వర్క్‌ఇన్ప్‌క్టర్లు హుసేన్‌వల్లీ, రవీంద్రనాథ్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment