
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్సార్‌సీపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్ చేసింది.
సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్సార్‌సీపీ(YSRCP) సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్(YS Jagan) నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు.
సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందే. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం అని వైఎస్సార్‌సీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం అని బొత్స అన్నారు.
అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వానికి తాలిబన్లకు పెద్ద తేడా లేదు. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు.

ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా?: MLC వరుదుకల్యాణి
- ఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?
- నిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు
- 15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారు
- నిత్యావసర ధరలు 60% పెంచారు
- ప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
- తొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు
- చంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలి
- పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు
- వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే
- హోదా ఇచ్చే వరకూ పోరాడుతాం
- కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోంది
- ప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారు
- నోటీసులు కూడా ఇవ్వకుండా ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?
: ఎమ్నెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
అసెంబ్లీ సమావేశాల కవరేజ్‌కు సాక్షి(Sakhi TV) సహా పలు ఛానెల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని YSRCP సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment