
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవైపు సమావేశాలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.
సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓటు షేరింగ్ ఉన్న వైఎస్సార్‌సీపీని లేఖ రాసినప్పటికీ స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైఎస్సార్‌సీపీ. ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించారు.

Comments
Please login to add a commentAdd a comment